bhogapuram
-
భోగాపురం ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో పులి సంచారం
-
ఉత్తరాంధ్ర అభివృద్ధికి దిక్సూచి
అంతర్జాతీయ విమానాశ్రయం... ఏ రాష్ట్రానికైనా అభివృద్ధికి సూచిక. సంబంధిత రాష్ట్రానికి ఐకానిక్ సింబల్. దేశ యవనికపై అదొక ప్రత్యేక ముద్ర. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశలో వేసిన అడుగులు వడివడిగా ముందుకు సాగుతున్నాయి. 2025 నాటికి తొలి దశ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో భూసేకరణకు బీజం పడింది. కానీ అప్పటి ప్రభుత్వం అభూత కల్పనలు, భయాలు కలి్పంచి ఏకంగా 15 వేల ఎకరాలు అవసరమని ప్రచారం చేయించింది. రైతుల ఆందోళనలతో ఐదు వేల ఎకరాలకు దిగింది. ఎకరాకు రూ.12.50 లక్షల చొప్పున మాత్రమే పరిహారం ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ 2015 ఆగస్టులో రైతులు రోడ్డెక్కారు. మరోవైపు భూసేకరణ నిబంధనలేవీ పాటించకుండా నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. న్యాయస్థానంలో విచారణ పెండింగ్‌లో ఉండగానే 2019 సార్వత్రిక ఎన్నికలు వచ్చేశాయి. దీన్ని తానే నిర్మించానని చెప్పుకోవాలనే తహతహతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు రెండు నెలల ముందు ఫిబ్రవరి 14వ తేదీన హడావుడిగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి విజయనగరం జిల్లా టీడీపీ ముఖ్య నాయకుడు, కేంద్ర ప్రభుత్వ పౌరవిమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు డుమ్మా కొట్టడంతో ప్రభుత్వ చిత్తశుద్ధి తేటతెల్లమైంది. మంత్రిగా ఉండి కూడా భోగాపురం విమానాశ్రయానికి కావాల్సిన అనుమతులనూ తీసుకురాలేకపోయారన్నది చర్చనీయాంశమైంది. –సాక్షి ప్రతినిధి, విజయనగరంప్రభుత్వం మారింది.. దశ తిరిగింది2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచి్చంది. అవసరమైన అనుమతుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేశారు. మరోవైపు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు. పరిహారాన్ని భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకూ ప్రకటించారు. డి.పట్టా భూములకూ జిరాయితీ భూమితో సమానంగా పరిహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేశారు. దీంతో రైతులు చాలామంది పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. మిగతావాటినీ సర్వోన్నత న్యాయస్థానం పరిష్కరించింది. విమానాశ్రయ నిర్వహణకు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2,750.78 ఎకరాలు సరిపోతాయని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 422.69 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇక 1,413 మంది రైతులకు చెందిన 1,383.39 ఎకరాల జిరాయితీ భూమి, 572 మంది లబ్ధిదారుల స్వా«దీనంలోనున్న డీ పట్టా (అసైన్డ్) భూమి సేకరణ ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 2,203 ఎకరాలను కేటాయించింది. మిగతా భూమిని ఐటీ సిటీ కోసం కేటాయించే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం అక్కడక్కడా వదిలేసిన దాదాపు 117 ఎకరాల సేకరణ ప్రక్రియనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది. చెన్నై–హౌరా జాతీయ రహదారిపై నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లేందుకు వీలుగా అనుసంధాన రోడ్డు, ట్రంపెట్ ఆకారంలో ఫ్లైవోవర్ నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ రెండో దశలో పూర్తి అయ్యింది. రైతులకు చెందిన 1,383.39 ఎకరాల జిరాయితీ భూమి, 572 మంది లబ్ధిదారుల స్వా«దీనంలోనున్న డీ పట్టా (అసైన్డ్) భూమి సేకరణ ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 2,203 ఎకరాలను కేటాయించింది. మిగతా భూమిని ఐటీ సిటీ కోసం కేటాయించే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం అక్కడక్కడా వదిలేసిన దాదాపు 117 ఎకరాల సేకరణ ప్రక్రియనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది. చెన్నై–హౌరా జాతీయ రహదారిపై నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లేందుకు వీలుగా అనుసంధాన రోడ్డు, ట్రంపెట్ ఆకారంలో ఫ్లైవోవర్ నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ రెండో దశలో పూర్తి అయ్యింది. విమానాశ్రయ స్వరూపంస్థాయి : అంతర్జాతీయ విమానాశ్రయం మొత్తం స్థలం : 2,750.78 ఎకరాలు ప్రభుత్వ భూమి : 422.69 ఎకరాలు కొనుగోలు చేసిన భూమి : 1,383.39 ఎకరాలు విమానాశ్రయం నిర్మాణానికి కేటాయించింది : 2,203 ఎకరాలు రన్‌వే పొడవు : 3.8 కిలోమీటర్లు నిర్వాసిత కుటుంబాలు : 376 నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణ వ్యయం : రూ.80 కోట్లు కేటాయించిన స్థలం : 25 ఎకరాలు ప్రత్యేకంగా విద్యుత్తు సబ్‌స్టేషన్ కోసం : 5.47 ఎకరాలు మొత్తం ఖర్చు : రూ.5వేల కోట్లు (అంచనా)చంద్రబాబు హయాం∗ 15 వేల ఎకరాలు అవసరమన్న ప్రచారం. ∗ రైతుల ఆందోళనతో ఐదు వేల ఎకరాలకు ప్రభుత్వం దిగొచి్చంది. ∗ భూసేకరణ నిబంధనలేవీ పాటించకుండా నోటిఫికేషన్ విడుదల ∗ పరిహారం ఎకరాకు రూ.12.50 లక్షలేనని ప్రకటన. ∗ అయినా కొలిక్కిరాని భూసేకరణ. ∗ నిర్వాసితులకు ఏం చేయబోతోందో చెప్పనే లేదు. ∗ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో రైతుల పిటిషన్. ∗ దాని సంగతి ఎటూ తేలలేదు. ∗ ఎన్నికలు సమీపించడంతో అంతా తానే చేశానని చెప్పుకోడానికి 2019శ్రీ ఫిబ్రవరి 14న టెంకాయ కొట్టారు. జగన్ పాలనలో∗ ఉత్తరాంధ్ర అభివృద్ధికి దిక్సూచి కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి 2023 మే 3న జగన్మోహన్రెడ్డి భూమిపూజ చేశారు. అన్ని అనుమతులతో పనుల ప్రారంభానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ∗ విమానాశ్రయం నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ అధిగమించింది ∗ 2,751 ఎకరాల భూమి సేకరణ పక్కాగా పూర్తి చేసింది. ∗ కేసులు వేసిన రైతుల డిమాండ్లనుపరిష్కరించింది. ∗ రెట్టింపు పరిహారం ఇచి్చంది. ∗ నిర్వాసితులకు దాదాపు రూ.80 కోట్లతో టౌన్íÙప్ను తలదన్నే సౌకర్యాలతో కాలనీలను నిర్మించింది. ∗ దాదాపు రూ.5 వేల కోట్లతో జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ∗ 2025 నాటికి ఏటా 60 లక్షల మంది ప్రయాణించే సామర్థ్యంతో తొలి దశ పూర్తి చేయాలనేది లక్ష్యం.ఆర్థికాభివృద్ధికి ఊతం విమానాశ్రయ నిర్మాణం పూర్తయితే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతంగా నిలుస్తుంది. ఫుడ్, ఫార్మా, ఫిషరీ రంగాల ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులకు స్థావరంగా నిలుస్తుంది. ట్రావెల్, హాస్పిటాలిటీ, గోడౌన్, వేర్ హౌసింగ్ రంగాలు అభివృద్ధి చెందుతాయి. 6 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుంది. అంతర్జాతీయ ఎయిర్ పోర్టు సేవలు లేకపోవడం వల్లే విశాఖ పరిసర ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ రంగం పుంజుకోవడం లేదు. –కాపుగంటి ప్రకాశ్, పెసిడెంట్, చాంబర్ ఆఫ్ కామర్స్, విజయనగరంసీఎం జగన్‌కు రుణపడి ఉంటాం సీఎం జగన్ అధికారంలోకి వచి్చన తరువాత రైతులకు పూర్తి స్థాయి లో పరిహారం చెల్లించి, నిర్వాసితులకు గూడెపువలస, లింగాలవలస గ్రామాల్లో అన్ని రకాల మౌలిక వసతులతో ఆర్అండ్ఆర్ కాలనీలను ఏర్పాటు చేసింది. ఉద్యమ సమయంలో గత ప్రభుత్వం మాపై పెట్టిన కేసులను ఎత్తివేసింది. విమానాశ్రయ నిర్మాణంలో భూ ములు కోల్పోయిన రైతులు, గృహా లు కోల్పోయిన నిర్వాసితులందరం సీఎం జగన్‌కి రుణపడి ఉంటాం. – కొండపు ఎల్లయ్యమ్మ, నిర్వాసితురాలు, కవులవాడ సర్పంచ్శరవేగంగా నిర్మాణ పనులు... భారీ విమానాలు దిగడానికి వీలుగా 3.8 కిలోమీటర్ల పొడవున రన్‌వే పటిష్టంగా నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం సగటున 10 అడుగుల ఎత్తున మట్టితో భూమి చదును చేస్తున్నారు. విమానాశ్రయం చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇళ్లు కోల్పోయిన 376 కుటుంబాల కోసం రూ.80 కోట్ల వ్యయంతో టౌన్‌షిప్‌లను తలదన్నేలా రెండు కాలనీలను ప్రభుత్వం నిరి్మంచింది. ఒక్కో కుటుంబానికి పునరావాస పరిహారంగా ఐదు సెంట్ల స్థలం, రూ.8.70 లక్షల చొప్పున మంజూరు చేసింది. నిర్వాసిత గ్రామాల నుంచి గతంలో వలసపోయిన కుటుంబాలకూ మానవతా దృక్పథంతో ఇంటిస్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ రహదారిని ఆనుకొని 25 ఎకరాల భూసేకరణను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. సంబంధిత రైతులకు సుమారు రూ.18 కోట్ల వరకూ పరిహారాన్ని చెల్లించింది. విమానాశ్రయ అధికారులు, సిబ్బంది కోసం ప్రత్యేకంగా క్వార్టర్లను జీఎంఆర్ సంస్థ నిరి్మంచనుంది. ఇందుకోసం ప్రభుత్వం 25 ఎకరాల భూమి కేటాయించింది. ప్రత్యేకంగా విద్యుత్తు సబ్‌స్టేషన్ కోసం భోగాపురం మండలంలోని ముక్కాం రెవెన్యూ పంచాయతీ పరిధిలో 5.47 ఎకరాల భూమిని కేటాయించింది. -
భోగాపురం పరుగుల్ని పరిశీలించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
జెట్ వేగంతో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు పనులు
-
విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో తెరుచుకున్న అంగన్వాడీ కేంద్రాలు
-
నకిలీ రిజిస్ట్రేషన్లు.. టీడీపీ నేతల భూకబ్జా
-
అన్ని ప్రాంతాలు బాగుపడాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్
-
భోగాపురం ఎయిర్ పోర్ట్ శంకుస్థాపనకు సర్వం సిద్ధం
-
అంతర్జాతీయ విమానాశ్రయం.. ప్రయాణ ‘వైభోగ’పురం
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్ర అభివృద్ధే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రెండేళ్లలోనే అందుబాటులోకి తేవాలని లక్ష్యం నిర్దేశించుకుంది. ఏటా 1.80 కోట్ల మంది ప్రయాణించేలా దీన్ని నిర్మించనున్నారు. నిర్మాణ బాధ్యతలను పలు అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్మించిన రికార్డు ఉన్న జీఎంఆర్ గ్రూప్ చేపట్టింది. ఇప్పటికే నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులను ప్రభుత్వం సాధించింది. వాస్తవానికి అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ప్రారంభించాక అందుబాటులోకి తేవడానికి మూడేళ్ల సమయం పడుతుంది. అయితే ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో అన్ని కీలక అనుమతులు సాధించడంతో రెండేళ్లలోనే అందుబాటులోకి రానుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులకు మే 3న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమి పూజ చేసి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరవుతుండటంతోఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మూడు దశల్లో.. ఏటా 1.80 కోట్ల మంది ప్రయాణించేలా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూడు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా తొలి దశలో 60 లక్షల మంది ప్రయాణించేలా రూ.5,000 కోట్లతో పనులు చేపడతారు. ఇక రెండో దశలో 1.20 కోట్ల మంది, మూడో దశలో 1.80 కోట్ల మంది ప్రయాణించేలా అభివృద్ధి చేస్తారు. మూడు దశల్లో ఒకేసారి 22 విమానాలు ఆగేలా 22 ఎయిర్‌బ్రిడ్జిలను నిర్మిస్తారు. ఇందులో భాగంగా తొలిదశలో ఏడు ఎయిర్‌బ్రిడ్జిలను అభివృద్ధి చేస్తారు. తొలి దశలో ప్యాసింజర్ టెర్మినల్, కార్గో కాంప్లెక్స్, విమానాల నిర్వహణ, మరమ్మతులకు ఎంఆర్వో యూనిట్, ఏవియేషన్ అకాడమీ, ప్లాంట్ క్వారంటైన్, యానిమల్ క్వారంటైన్ వంటి పలు సదుపాయాలను కల్పించనున్నారు. అలాగే విశాఖ నగరం వైపు అభివృద్ధి చేయనున్నారు. భారీ విమానాలకు అనువుగా.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ విమానాలు సురక్షితంగా దిగేలా 3.8 కి.మీ పొడవైన భారీ రన్‌వేను నిర్మించనున్నారు. తూర్పు తీరంలో విశాఖ చాలా వ్యూహాత్మక స్థానం కావడంతో రక్షణ అవసరాల కోసం ఎయిర్‌పోర్టులో 10 ఎకరాలను ప్రత్యేకంగా ప్రభుత్వం కేటాయించింది. ఇవి కాకుండా అంతర్జాతీయ విమాన సర్వి సులకు అవసరమైన కస్టమ్స్, ఇమిగ్రేషన్‌లతోపాటు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) టవర్లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఎయిర్‌పోర్టుకు ఆనుకొని ఉన్న 500 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏరో సిటీని అభివృద్ధి చేయనుంది. అడ్డంకులన్నీ అధిగమించి.. కీలక అనుమతులు సాధించి.. గత ప్రభుత్వం భూసేకరణ కూడా పూర్తి చేయకుండానే ఎన్నికల ముందు హడావుడిగా శంకుస్థాపన చేసింది. దానికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం అన్ని అనుమతులు వచ్చాకే నిర్మాణ పనులను ప్రారంభిస్తోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై సుప్రీంకోర్టు, హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ల్లో నమోదైన కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించింది. అలాగే భూసేకరణకు సంబంధించిన అన్ని అడ్డంకులను అధిగమించింది. విమానాశ్రయం ప్రారంభించాక ప్రస్తుతం విశాఖలోని నేవీ విమానాశ్రయం నుంచి 30 ఏళ్లపాటు వాణిజ్య సేవలను నిలిపివేయడానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) పొందింది. అలాగే ఎయిర్‌పోర్టు భద్రతకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆమోదం, పలు సర్వి సు సేవలకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), విదేశీ సర్వి సుల నిర్వహణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖలతో పలు ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. నిర్వాసితులకు అండగా.. విమానాశ్రయ నిర్మాణం నేపథ్యంలో నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలను పునరావాస గ్రామాలకు తరలించారు. ఇందుకోసం పోలిపల్లి, గూడిపవలస వద్ద 50.3 ఎకరాల్లో సుమారు రూ.77 కోట్లతో రెండు గేటెడ్ కమ్యూనిటీ తరహాలో పునరావాస గ్రామాలను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ప్రైవేటు రియల్ ఎసేŠట్ట్ వెంచర్లకు దీటుగా కాలనీల్లో 30 అడుగుల సీసీ రోడ్లు, డ్రైనేజ్, ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి, కమ్యూనిటీ హాళ్లు, చిల్డ్రన్ పార్క్, పాఠశాల, పోస్టాఫీసు, షాపింగ్ కాంప్లెక్స్, దేవాలయాలు వంటి అనేక సదుపాయాలను కల్పించడంతో ప్రజలు సంతోషంగా గ్రామాలను వదిలి పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు. 2025 నాటికి తొలి విమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. 2025 నాటికి ఇక్కడి నుంచి తొలి విమానం ఎగరాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్‌పోర్టులతో పారిశ్రామికంగా ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారిపోతుంది. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం.. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నాం. సీఎం వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా అన్ని అనుమతులు సాధించాకే నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నాం. దీంతో రెండేళ్లలోనే వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం రానుంది. అలాగే స్థానిక కుటుంబాలకు సాధ్యమైనంత ఎక్కువ సాయం అందించడానికి సీఎం ఆదేశాలకు అనుగుణంగా అత్యాధునిక వసతులతో పునరావాస గ్రామాలను అభివృద్ధి చేశాం. - వీఎన్ భరత్ రెడ్డి, ఎండీ, ఏపీఏడీసీఎల్ -
భోగాపురం ఎయిర్‌పోర్టు .. శంకుస్థాపనకు సర్వం సిద్ధం
విజయనగరం అర్బన్: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకే కాకుండా రాష్ట్రానికే ఎంతో ప్రతిష్టాత్మకమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మే 3వ తేదీన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా జరిగే ఎయిర్‌ఫోర్టు శంకుస్థాపనా కార్యక్రమానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. విమానాశ్రయ శంకుస్థాపన, ముఖ్యమంత్రి బహిరంగ సభ నిర్వహణకు అధికార యంత్రాంగం చేయాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లో సోమవారం సమీక్షించారు. ముందుగా కలెక్టర్ నాగలక్ష్మి వివిధ శాఖల అధికారులకు అప్పగించిన బాధ్యతలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హెలీప్యాడ్, భూమిపూజ, పైలాన్ ఆవిష్కరణ, బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్లతో పాటు పటిష్ట బందోబస్తు నిర్వహించా లని సూచించారు. సభకు అధికసంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉందని, రాకపోకలకు ఇబ్బందు లు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన జిల్లాలో ఆరోజు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుందన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఎమ్మెల్యే శంబంగి వెంకటచినప్పలనాయుడు, ఎస్పీ దీపిక, జేసీ మయూర్ అశోక్, డీఆర్వో ఎం.గణపతిరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
Photo Feature: చెట్టుకు రాఖీ.. సేమ్యాలపై జాతీయ గీతం
చెట్లను కూడా కుటుంబ సభ్యుల్లా సాకాలనే సందేశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విశాఖ నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో వందేళ్ల వయసున్న మర్రి చెట్టుకు గ్రీన్ క్లైమేట్ టీమ్ ప్రతినిధులు బుధవారం రక్షాబంధన్ కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా విత్తన రాఖీ కట్టి చెట్లను కాపాడతామని ప్రతినబూనారు. – సాక్షి, విశాఖపట్నం సేమ్యాలపై జాతీయ గీతం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భం పాస్తా(సేమ్యా)లపై జాతీయ గీతాన్ని రాసి అబ్బురపరుస్తోంది బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన అన్నం మహిత. కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఈ గీతాన్ని రాయగలిగినట్టు ఆమె తెలిపింది. – కారంచేడు ముందుకొచ్చిన సముద్రం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ముక్కాం, కొండ్రాజుపాలెం, చేపలకంచేరు తీరంలో ‘అల’జడి నెలకొంది. ముక్కాం, చేపలకంచేరు మధ్య బుధవారం 50 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. కెరటాల తాకిడికి ముక్కాం గ్రామ తీరంలోని రోడ్డు, మత్స్యకారుల ఇళ్లు కోతకు గురయ్యాయి. రెవెన్యూ, సచివాలయ సిబ్బంది తీర ప్రాంతాల్లో పర్యటించి మత్స్యకారులను అప్రమత్తం చేశారు. ప్రతికూల వాతావరణం దృష్ట్యా వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించారు. (క్లిక్: ఉగ్ర కృష్ణ.. మహోగ్ర గోదావరి) – భోగాపురం మనోహర దృశ్యం శ్రీశైలం డామ్ పదిగేట్లు ఎత్తివేయడంతో వరద నీరు దిగువకు పరవళ్లు తొక్కుతోంది. ఈ మనోహర దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు సందర్శకులు శ్రీశైలం ప్రాజెక్ట్ వద్దకు తరలివస్తున్నారు. పాల నురుగులా పొంగుతున్న నీటి ప్రవాహాన్ని చూస్తూ పర్యాటకులు పరశించిపోతున్నారు. (క్లిక్: ఆ కుటుంబాలకు వజ్రాల రూపంలో లక్షలు..) -
ఎమ్మెల్యే బడ్డుకొండ ఇంట పెళ్లి సందడి... హాజరైన మంత్రులు
భోగాపురం (విజయనగరం): నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఇంట పెళ్లిసందడి నెలకొంది. ఆయన పెద్ద కూమారుడు మణిదీప్‌నాయుడు వివాహ నిశ్చితార్థ వేడుక బుధవారం స్థానిక సన్‌రే రిసార్ట్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పీడిక రాజన్నదొర, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు, ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, ఏంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, కంబాల జోగులు, గొర్లె కిరణ్‌కూమార్, నంబూరు శంకర్రావు, బొత్స అప్పలనరసయ్య, కడుబండి శ్రీనివాసరావు, శంబంగి వెంకటచినఅప్పలనాయుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు పెనుమత్స సురేష్‌బాబు, పాకలపాటి రఘువర్మ, ఇందుకూరి రఘురాజు, పాలవలస విక్రాంత్, వైఎస్సార్సీపీ నాయకులు కందుల రఘుబాబు, కాకర్లపూడి శ్రీనివాసరాజు, ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. వారంతా నూతన వ«ధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. చదవండి: (నూతన దంపతులను ఆశీర్వదించిన వైఎస్ విజయమ్మ) -
భర్త రెండో పెళ్లికి ప్లాన్.. ప్రాణాలు తీసుకున్న భార్య
వివాహమై నాలుగేళ్లకే వేసిన మూడుముళ్లు భారంగా మారాయి. ఆ దాంపత్య జీవితానికి ప్రతిరూపాలుగా మూడేళ్లు బాబుతోపాటు తొమ్మిది నెలల బాబు ఉన్నారు. బోసినవ్వుల ఆ చిన్నారుల బుడిబుడి అడుగులు చూసి మురిసిపోవాల్సిన ఆ కుటుంబంలో ‘విడాకుల’ అలజడి రేగింది. సర్దిచెప్పాల్సిన అత్త,మామలు ఆది నుంచీ అదే పాట పాడడం, వారి మాటలకు భర్తకూడా చివరిలో తందానా అనడంతో మనస్తాపానికి గురై రెండు పదుల వయసులోనే తనువు చాలించేసింది. భోగాపురం: కట్టుకున్న భర్త, అత్తమామల వేధింపులు తాళలేక వెంపాడ రమాదేవి (21) ఫ్యానుకు ఉరి వేసుకొని మృతి చెందిన సంఘటన మండలంలోని రావివలస గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి...మండలంలోని రావివలస గ్రామానికి చెందిన వెంపాడ రాములబంగారికి (అలియాస్ శ్యామ్) దల్లిపేట గ్రామానికి చెందిన రమాదేవికి నాలుగేళ్ల కిందట వివాహమైంది. వీరి కాపురం కొన్నేళ్లే అన్యోన్యంగా సాగింది. వీరికి కౌశిక (3), వాయిత్ (9 నెలలు) ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లి అయిన రెండేళ్ల తరువాత వీరి కుటుంబంలో చిన్నచిన్న గొడవలు వస్తుండేవి. భర్తతోపాటు అత్త,మామలు తరచూ రమాదేవిని వేధించడం మొదలుపెట్టారు. 15 రోజుల కిందట తన కుమారుడికి రెండో వివాహం చేసేందుకు అత్త అప్పలనరసమ్మ, మామ రమణ కలిసి తన కుమారుడు రాములబంగారికి విడాకులు ఇవ్వాలంటూ కాగితంపై సంతకం పెట్టమని రమాదేవిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడింది. ఈ విషయం తెలుసుకున్న రమాదేవి తల్లిదండ్రులు వారి బంధువులు కలిసి గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో వారిద్దరికీ సర్దిచెప్పి పంపిచారు. ఈక్రమంలో మళ్లీ సోమవారం అత్తమామలతో పాటు భర్త కూడా విడాకులు ఇవ్వాలని రమాదేవిని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన రమాదేవి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అందరితో కలుపుగోలుగా ఉండే ఈమె చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ యు.మహేశ్, తహసీల్దారు డి.రాజేశ్వరరావు, గ్రామ సర్పంచి ఉప్పాడ, శివారెడ్డి సంఘటన స్థలానికి చెరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సుందరపేట సీహెచ్‌సీకి తరలించి మృతురాలు తండ్రి దల్లి రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
భీమిలి భోగాపురం మధ్య.. పారిశ్రామిక కారిడార్
సాక్షి, అమరావతి: భీమిలి నుంచి విజయనగరం జిల్లా భోగాపురం వరకు సుమారు 20 కి.మీ పారిశ్రామిక కారిడార్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను తయారు చేసే సంస్థ ఎంపిక కూడా పూర్తయింది. డీపీఆర్ కాంట్రాక్టును నాగపూర్‌కు చెందిన కేఅండ్‌జే ప్రాజెక్ట్స్ దక్కించుకుంది. ఈ డీపీఆర్ తయారీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఇన్‌క్యాప్) రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) బిడ్లను ఆహ్వానించగా మొత్తం నాలుగు సంస్థలు పోటీపడ్డాయి. ఇందులో అతి తక్కువ ధర కోట్ చేసి ఎల్1గా నిలిచిన కేఅండ్‌జే ప్రాజెక్ట్స్ సంస్థను ఎంపిక చేసినట్లు ఇన్‌క్యాప్ వైస్ చైర్మన్, ఎండీ ఆర్.పవనమూర్తి తెలిపారు. సాంకేతిక అంశాల పరిశీలన అనంతరం పోటీపడ్డ నాలుగు సంస్థల్లో మూడు సంస్థలు.. ఎల్అండ్టీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్, కేఅండ్‌జే ప్రాజెక్ట్స్, ట్రాన్స్‌లింక్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ తుది బిడ్‌కు ఎంపికయ్యాయి. వీటిలో రూ. 41 లక్షల కోట్ చేసిన కేఅండ్‌జే సంస్థ ఎల్1గా నిలిచింది. డీపీఆర్ తయారీలో ప్రధాన అంశాలు.. ► భీమిలి నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రధాన గేటు వరకు ఉన్న 20 కి.మీ రహదారి అభివృద్ధితో పాటు వ్యాపార అవకాశాలను పరిశీలించాలి. ► మొత్తం 8 లేన్ల రహదారిలో తొలుత ఆరు లేన్లు, రెండు వైపుల సర్వీసు రోడ్డు నిర్మాణానికి ఎంత వ్యయం అవుతుందో అంచనా వేయాలి. ► ప్రస్తుతం ప్రభుత్వ భూమి ఎంత ఉంది, ప్రైవేటు భూమి ఎంత సేకరించాల్సి ఉంటుందన్న అంశాన్ని పరిశీలించాలి. ► రహదారికి ఇరువైపుల తయారీ రంగానికి సంబంధించి పారిశ్రామిక పార్కులు, పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటు అంశాలను పరిశీలించాలి. ► టూరిజం, హెల్త్, విద్య వంటి సేవా రంగాల పెట్టుబడులు, లాజిస్టిక్ హబ్స్ వ్యాపార అవకాశాలపై నివేదిక రూపొందించాలి. ప్రస్తుత ట్రాఫిక్, ఎయిర్‌పోర్టు అభివృద్ధి అయిన తర్వాత ఎంతమేర ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉందన్న అంశాన్ని అంచనా వేయాలి. ► వాతావరణ పరిస్థితులు, వాటిని తట్టుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించాలి. ► ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎంత మొత్తం అవసరమవుతుంది, దీనికి నిధులు ఎలా సేకరించాలి, లాభదాయకత వంటి అంశాలు పరిశీలించాలి. -
చంద్రబాబు తీరుపై మహిళా రైతు ఆగ్రహం
పెదవాల్తేరు (విశాఖతూర్పు): రైతుల విషయంలో చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతానికి చెందిన రైతు దాట్ల శ్రీదేవి ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. రాజధాని తరలింపు విషయమై అమరావతిలో రైతులచే ఆందోళన చేయిస్తున్నారని.. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్టుకు భూసేకరణ సమయంలో ఆ ప్రాంత రైతులు చేసిన ఆందోళనలను పట్టించుకోకుండా.. వారిని అష్టకష్టాల పాల్జేశారని మండిపడ్డారు. అప్పట్లో ఎంతోమందిపై క్రిమినల్ కేసులు పెట్టారని, తనపై నాలుగు కేసులు పెట్టి.. పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి.. రైతులపై దౌర్జన్యం చేయించారని తెలిపారు. మహిళలు, వృద్ధులు, పిల్లలని కూడా చూడకుండా పోలీసు, రెవెన్యూ అధికారులు దమనకాండ సాగించారని పేర్కొన్నారు. ఊర్లకు ఊర్లు ఖాళీ చేయించి స్టేషన్లకు తరలించి భూ సేకరణకు సర్వే చేశారని తెలిపారు. భూములపై హక్కులను కాపాడుకునేందుకే నాడు ఆందోళన చేశామని.. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి తమకు సంఘీభావం ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. అమరావతి రైతులు రూ.4 లక్షల విలువైన ఎకరం భూమిని రూ.కోట్లకు అమ్ముకున్నారని, కానీ భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేకరణ విషయంలో మాత్రం నాటి టీడీపీ ప్రభుత్వం ఎకరానికి కేవలం రూ.18 లక్షల నుంచి 33 లక్షల చొప్పున రేటు నిర్ణయించిందని.. కానీ ఇక్కడ ఎకరం రూ.3 కోట్లు ఉందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో భూసేకరణ కారణంగా ఎన్నో కుటుంబాల్లో వివాహాలు ఆగిపోయాయని.. అప్పుడు ఒక మంత్రిగానీ, ఎమ్మెల్యేగానీ తమను పరామర్శించిన పాపాన పోలేదని పేర్కొన్నారు. -
సన్రేలో షూటింగ్ సందడి
భోగాపురం: స్థానిక సన్‌రే విలేజ్ రిసార్ట్స్‌లో మంగళవారం ఒక ప్రయివేట్ ఆల్బమ్‌లో పాటకు షూటింగ్ జరిగింది. ముంబయికి చెందిన శివన్నారంగ్, దీపిక్లల్వానీలు హీరో హీరోయిన్లుగా ఆల్బమ్‌ని తెరకెక్కిస్తున్నారు. గాయకుడు రహత్ఫతే ఆలీఖాన్ పాడిన ఒక ఆల్బమ్‌ని విశాఖపట్నానికి చెందిన బషీర్, ఎం.వి.సత్యనారాయణలు నిర్మాతలుగా తెరకెక్కిస్తున్నారు. జూలై 15న ఆల్బమ్ విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. -
టూరిస్టు బస్సు బోల్తా
స్థానిక అక్కివరం కూడలి వద్ద శనివారం ఉదయం ప్రమాదవశాత్తు టూరిస్టు బస్సు బోల్తా పడింది. బస్సులో 45మంది పెద్దలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. వివరాల్లోకి వెళ్తే...వైఎస్సార్ జిల్లా (కడప), ప్రొద్దుటూరు నుంచి ఏపీ04 టీడబ్ల్యూ 3413 టూరిస్టు బస్సు కాశీయాత్రకు భక్తుల్ని తీసుకు వెళ్లింది. యాత్రను పూర్తి చేసుకుని తిరిగి బయలుదేరింది. శనివారం ఉదయం పూసపాటిరేగ వద్ద యాత్రికులు టీ తాగి బయలుదేరారు. అక్కివరం కూడలి వద్దకు వచ్చేసరికి అండర్ పాస్ పనులు జరుగుతున్న చోట ఎదురుగా మతిస్థిమితం లేని వ్యక్తి ఆకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చేశాడు. అతన్ని తప్పించబోయిన డ్రైవరు బ్రహ్మయ్య బస్సును రోడ్డు పక్కన ఉన్న సిమెంటు దిమ్మలతో ఏర్పాటు చేసిన స్టాపర్లను ఢీకొట్టింది. రోడ్డు పక్కకు బస్ నిలపడంతో, వంతెన నిర్మాణానికి రోడ్డు తవ్వేసి ఉండడంతో గోతులోకి రోడ్డు పెళ్ళలు విరిగి పడ్డాయి. దీంతో బస్సు గోతిలోకి ఒరిగి పోయింది. బస్సు పూర్తిగా కింద పడకుండా సిమ్మెంటు దిమ్మలు అడ్డు పడడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న వారు పిల్లలతో సహా సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ తారకేశ్వరరావు సిబ్బందితో సంఘటనా స్థలం వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఉన్న వారిని ఎ.రావివలస పంచాయతీ కార్యాలయానికి తరలించారు. -
గల్లంతైన మత్స్యకారుడి మృతదేహం లభ్యం
విజయనగరం జిల్లా : భోగాపురం మండలం కుండ్రాజుపాలెం వద్ద సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడు చిన్న అమ్మోరు మృతదేహం లభ్యం గురువారం లభ్యమైంది. గ్రామ సమీపంలోనే సముద్ర తీరానికి గురువారం ఉదయం మృతదేహం కొట్టుకువచ్చింది. మూడు రోజుల క్రితం కుండ్రాజుపాలెం వద్ద పడవలను ఒడ్డుకు చేర్చుతుండగా చిన్న అమ్మోరు ఈదురుగాలులకు సుడిగుండంలో చిక్కుకుని గల్లంతయ్యాడు. చిన్న అమ్మోరు కోసం గ్రామస్తులు అప్పుడు వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. తాజాగా ఆయన మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. -
విజయనగరం జిల్లాలో పిడుగుల బీభత్సం
భోగాపురం : విజయనగరం జిల్లాలో మంగళవారం పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఒకే రోజు పిడుగులు పడి వేర్వేరు చోట్ల నలుగురు మృతిచెందారు. మరొకరికి గాయాలు అయ్యాయి. భోగాపురం మండలం రాజుపులోవలో పిడుగు పడి దుక్క రాములమ్మ, ఆమె మనవరాలు శ్రావణి మృతిచెందారు. పూసపాటిరేగ మండలం రెళ్లివలసలో పొలాల్లో పశువులు కాస్తోన్న రౌతు గౌరునాయుడనే యువకుడు పిడుగుపాటుకు మృతిచెందాడు. తెర్లాం మండలం సుందరాడలో పొలంలో పనిచేస్తోన్న ఆదినారాయణ అనే యువకుడు కూడా పిడుగుపాటుకు బలయ్యాడు. నందబలగలో మరో వ్యక్తి పిడుగుపాటుకు తీవ్రగాయాలపాలయ్యాడు. -
ముందుకు వచ్చిన సముద్రం
విజయనగరం : భోగాపురం మండలం ముక్కాం గ్రామంలో సముద్రం ముందుకు వచ్చింది. సముద్ర తీరంలో నీరు ముందుకు రావడంతో రోడ్డు కోతకు గురైంది. ఎన్నడూ లేనిది సముద్రం ముందుకు వచ్చి రోడ్డు కోతకు గురికావడంతో పాటు సముద్ర తీరం వెంబడి ఏర్పాటు చేసుకున్న నివాసాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో స్థానికులు, మత్స్యకారులు భయాందోళనలకు గురవుతున్నారు. సునామీలాంటి ఉపద్రవం ఏమైనా ముంచుకొస్తుందేమోనని అనుమానంతో బిక్కుబిక్కుమంటూ ఆందోళనకు గురవుతున్నారు. స్థానికులు ఈ సమాచారాన్ని అధికారులకు తెలియజేశారు. -
ఎగిరిపోతే ఏం బాగుంటుంది?
‘‘విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎయిర్‌కార్గో అంతర్జాతీయ కేంద్రంగా రూపొందిస్తాం. ఇపుడున్న స్థాయి చాలదు. ఇంకా 105 టన్నుల సామర్థ్యాన్ని మోసే విమానాలు వస్తే ఇపుడున్న సదుపాయాలు చాలవు. అందుకే విశాఖ విమానాశ్రయాన్ని భోగాపురానికి తరలించనున్నాం. ఇక్కడ కోస్తాంధ్ర వ్యాపార, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా చేస్తాం. విశాఖలో ఉండాల్సిన విమానాశ్రయం భోగాపురానికి తరలిస్తే ప్రయాణికులకు వచ్చే నష్టం ఏముంది?‘‘ ఇవీ.. ఇటీవల కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు పత్రికల ముందు చేసిన వ్యాఖ్యలు. దీన్నిబట్టి విశాఖ విమానాశ్రయం బిచాణా ఎత్తివేత దాదాపు ఖరారైనట్లుగా భావించవచ్చు! గోపాలపట్నం: అదిగదిగో.. అక్కడే.. ఎన్ఏడీ జంక్షన్‌కు సమీపంలోనే విశాఖ విమానాశ్రయం ఉండేది. ఇప్పుడు భోగాపురానికి తరలిపోయింది... విశాఖ విమానాశ్రయం గురించి ఇలా చెప్పుకునే రోజులు సమీపిస్తున్నాయి. అంటే ఆర్థిక రాజధాని అయిన విశాఖలో అసలు విమానాశ్రయమే లేదా? పొరుగున ఉన్న విజయనగరానికి తరలిపోయిందా అని ఆశ్చర్యపోయే పరిస్థితి దాపురించనుంది. ఇలా ఎందుకు జరగకూడదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు ప్రశ్నిస్తుండడంతో కోస్తాంధ్ర ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విశాఖ విమానాశ్రయం చివరికి ఓ జ్ఞాపకంగా మిగిలిపోనుందా అన్న ఆవేదన వ్యక్తమవుతోంది. విశాఖ విమానాశ్రయం ఇక కార్గో కాంప్లెక్స్‌కే.. ఇక్కడ పాత టెర్మినల్ భవనంలో దేశీయ కార్గో సర్వీసులు రెండేళ్ల క్రితం ప్రారంభం కాగా, తాజాగా అంతర్జాతీయ కార్గో సర్వీసులూ ప్రారంభమయ్యాయి. శ్రీలంక, దుబాయ్, సింగపూర్, కౌలాలంపూర్‌లకు అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో రోజుకు మూడు టన్నుల నుంచి నాలుగు టన్నుల కార్గో ఉత్పత్తులు దేశీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో విశాఖ విమానాశ్రయాన్ని మొత్తంగా భోగాపురానికి తరలించి ఇక్కడ కేవలం ఎయిర్కార్గోని మాత్రమే అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర పౌర విమాన యానశాఖమంత్రి అశోక్‌గజపతిరాజు కొద్ది రోజుల క్రితం స్పష్టం చేశారు. వదులుకోవడం దేనికి? విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విశాఖ నుంచి వెళ్లిపోవడాన్ని ఎలా వదులుకుంటామని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. విశాఖ అంతర్జాతీయ ఎయిర్‌కార్గో ద్వారా ప్రస్తుతం మూడు నుంచి నాలుగు టన్నుల ఎగుమతి దిగుమతులు దేశీయ, అంతర్జాతీయంగా జరుగుతున్నాయి.ఇపుడు విశాఖకు వస్తున్న అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణికుల పరిమితి కాక మూడు టన్నుల సరకులు రవాణా చేసే వీలుంది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద బోయింగ్ 747లో ప్రయాణికులు లేకుండా ఒకేమారు 43టన్నుల సరకు తీసుకెళ్లే వీలుంది. ఎయిర్‌బస్ 300లో ప్రయాణికులు లేకుండా 43టన్నులు తీసుకెళ్లవచ్చు. బోయింగ్ 727లో 27 టన్నుల సరకు రవాణాకు వీలుంది. అంత మహాపట్టణంగా ఉన్న ఢిల్లీలోనే అశోక్ గజపతిరాజు చెప్పినట్లు 105 టన్నుల సామర్థ్యం మోసే విమానాలు తిరగడం లేదు. ఇలాంటి తరుణంలో బలవంతంగా విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భోగాపురానికి ఎందుకు తరలించాలని పలువురు ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఇదీ ప్రస్థానం... రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నేవీ అవసరాల కోసం ఏర్పాటైన విశాఖ విమానాశ్రయం 1960 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో 4 వేల అడుగుల పొడవున రన్‌వేతో చిన్న టెర్మినల్ ఉండేది. పదుల సంఖ్యలో ప్రయాణికులుండేవారు. హైదరాబాదు నుంచి విశాఖకు ఒక్క విమానమే నడిచేది. 1970లో మరో టెర్మినల్ బిల్డింగ్, 6500 అడుగుల పొడవైన రన్‌వే విస్తరించుకుంది. 2009లో అంతర్జాతీయస్థాయిలో 10030 అడుగుల రన్‌వేతో రూపుదిద్దుకుంది. ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి కేంద్రం రూ.315కోట్ల నిధులు వెచ్చించగా, నేవీ రూ.100 కోట్ల ఖర్చు చేసింది. నేవీకి, పౌరవిమానాయానశాఖకు సఖ్యత ఉండడంతో 24గంటల విమానాశ్రయ నిర్వహణకు అనుమతులొచ్చాయి. తర్వాత ఇక్కడ అంతర్జాతీయ టెర్మినల్ భవనాన్ని నిర్మించారు. కావాల్సిన అన్ని సదుపాయాలూ ఏర్పాటయ్యాయి. ఏటా మొత్తంమ్మీద 23.50లక్షల వరకూ ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో విమానాలు, దేశీయవిమానాలు పెరగడంతో ఇక్కడ మరో ఆరు పార్కింగ్ బేలు కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించారు. రేపోమాపో ప్రారంభించనున్నారు. దేశీయ విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయం వేర్వేరుగా ఏర్పాటవుతున్నట్లు చెబుతుంటే ప్రయాణికులు ఆనందిస్తున్నారు. అయితే ఇంత అభివృద్ధి జరిగాక, ఈ విమానాశ్రయాన్ని ఇక్కడి నుంచి విజయనగరం జిల్లా భోగాపురానికి తరలించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతుండడం ఎవరికీ మింగుడుపడని విషయం. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని అనుమతులూ వచ్చినట్లు తెలుస్తోంది. 98శాతం ప్రయాణికుల వ్యతిరేకత విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురానికి తరలిపోతుందన్న నిజాన్ని ప్రయాణికులు జీర్ణించుకోలేకపోతున్నారు. మా సంఘం చేపట్టిన సర్వేలో 98 శాతం ప్రయాణికులు విశాఖ విమానాశ్రయాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి ఇంకా స్థలం ఉంది. అంతర్జాతీయ కార్గోకు సరిపడా సదుపాయం ఉంది. ఇలాంటపుడు మార్పు అవసరం లేదు. కావలిస్తే భోగాపురాన్ని ఉడాన్ టైప్ టూ విమానాశ్రయంగా రూపొందించుకోవచ్చు. – డి.వరదారెడ్డి, భారత విమానప్రయాణికుల సంఘ అధ్యక్షుడు -
మూడు నాటు పడవలు బోల్తా
భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురం మండలం చేపలకంచేరులో ఈదురుగాలులకు సముద్రంలో లంగరువేసివున్న మూడు నాటుపడవలు బోల్తా పడ్డాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విజయనగరం జిల్లాలో సముద్ర తీరప్రాంత కల్లోలంగా మారింది. భోగాపురం, పూసపాటిరేగ మండలాలకు చెందిన మత్స్యకార గ్రామాల్లో బలమైన ఈదురు గాలులు వస్తున్నాయి. మరోవైపు సముద్రంలో గాలులు బలంగా వస్తుండటంతో మంగళవారం అర్ధరాత్రి వేటకు వెళ్లిన మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు. వేట నిలిపివేసి లంగరువేసివున్న మూడు నాటుపడవలు చేపలకంచేరుకు సమీపంలో గాలుల తాకిడికి బోల్తా పడ్డాయి. దీంతో మిగిలిన మత్స్యకారులు వెనక్కి తిరిగొస్తున్నారు. మరోవైపు తీరం వెంబడి బలంగా ఈదురు గాలులు వీస్తున్నాయి . పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా.. రెవెన్యూ అధికారులు ఎవరూ కనీస సమాచారం ఇవ్వలేదని గంగపుత్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రూపాయికే ఎకరం
తొలుత రూ.8 లక్షలకు కేటాయిస్తూ జీవో ఎకరం రూ.లక్ష చొప్పున ఇవ్వాలని కోరిన బీఐఏసీఎల్ తీవ్రంగా స్పందించి రూపాయికే కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం సర్కారు తీరుపై రెవెన్యూ అధికారుల విస్మయం సాక్షి, అమరావతి: భలే చౌక భేరం. రూపాయికే ఎకరా భూమి. రూ.638కే 638 ఎకరాల భూమి కేటాయింపు. భూమి కోరిన సంస్థ ఎకరా రూ.లక్షకు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం అంత మొత్తం ఎందుకు? రూపాయికే ఇస్తామంది. చెప్పడమే కాదు రూ.638.83కు 638.83 ఎకరాలు కేటాయిస్తూ రెవెన్యూ శాఖ సోమవారం ఏకంగా జీవో జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కర్నూలు జిల్లాల్లో 638.83 ఎకరాలు కేటాయించాలని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కార్పొరేషన్ లిమిటెడ్ (బీఐఏసీఎల్) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీనిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలంలోని ఓర్వకల్, కన్నమడకల, పుదిచెర్ల ప్రాంతాల్లో ఎకరా రూ.8 లక్షల మార్కెట్ ధరతో 638.83 ఎకరాలు కేటాయించవచ్చంటూ గత ఏడాది నవంబరు 12వ తేదీన ప్రతిపాదన పంపించారు. రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య సంస్థ (ఏపీఎల్‌ఎంఏ) గత ఏడాది నవంబరు 17వ తేదీన సమావేశమై కర్నూలు జిల్లా కలెక్టరు ప్రతిపాదనను యథాతథంగా ఆమోదించింది. ఎకరా రూ. 8 లక్షల మార్కెట్ ధరతో బీఐఏసీఎల్‌కు 638.83 ఎకరాలు కేటాయించాలని ఏపీఎల్‌ఎంఏ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనిని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. ఈ మేరకు ఎకరా రూ.8 లక్షల ధరతో 638.83 ఎకరాలను బీఐఏసీఎల్‌కు కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలంలోని ఓర్వకల్, కన్నమడకల, పుదిచెర్ల ప్రాంతాల్లో కేటాయిస్తూ రెవెన్యూ శాఖ గత నెల మూడో తేదీన జీవో నంబరు 46 జారీ చేసింది. ఈ మేరకు ఈ సంస్థకు మార్కెట్ విలువకు భూమిని కేటాయించినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆగమేఘాలపై ధర తగ్గింపు ఉత్తర్వులు ప్రజాప్రయోజనాల కోసమే విమానాశ్రయం నిర్మాణానికి ముందుకు వచ్చామని, ఇంత ధరతో భూమి కేటాయిస్తే గిట్టుబాటు కాదని బీఐఏసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ లేఖ రాయడంతో ప్రభుత్వం ఆగమేఘాలపై స్పందించింది. అంత ధరతో భూమి కేటాయిస్తే భారమవుతుందని, ఎకరా రూ. లక్ష నామమాత్రపు ధరతో కేటాయించాలని ఆయన గత నెల 6న ప్రభుత్వానికి రాసిన లేఖలో కోరారు. ఈ లేఖ అందడమే తరువాయి ప్రభుత్వం తీవ్రంగా స్పందించి ఎకరా రూపాయికే కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఎకరా రూపాయికే కేటాయిస్తున్నట్లు తాజాగా సోమవారం జీవో 107 జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేసీ శర్మ ఆదివారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ వ్యవహారం పట్ల రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులే విస్తుపోతున్నారు. ఇదెక్కడి ద్వంద్వ విధానం? భూ కేటాయింపుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పట్ల అధికార వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఒక్కో సంస్థ విషయంలో ఒక్కో విధంగా వ్యవహరించడం సరికాదని వ్యాఖ్యానిస్తున్నారు. విశాఖపట్నం భీమునిపట్నం మండలంలోని కాపులుప్పాడలో ఇండియన్ నేవీకి వంద ఎకరాలు ఎకరా రూ.5 లక్షల చొప్పున కేటాయిస్తూ 2003 డిసెంబరు 3వ తేదీన టీడీపీ ప్రభుత్వం జీవో నంబరు 1241 జారీ చేసింది. ఈ మేరకు రూ.5 కోట్లు ఇండియన్ నేవీ ప్రభుత్వానికి చెల్లించింది. ఈ భూమిని తమకు అప్పగించాలని నేవీ అధికారులు కోరగా, అంత భూమి ఇవ్వలేమని, తగ్గించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సర్కారు ఒత్తిడి తేవడంతో చర్చల్లో 80 ఎకరాలతో సరిపెట్టుకుంటామని ఇండియన్ నేవీ అధికారులు చెప్పారు. చివరకు అంత కూడా కేటాయించకుండా 65 ఎకరాలతోనే సరిపెట్టుకోవాలని సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. వంద ఎకరాలకు సొమ్ము చెల్లించినందున తమకు ఇస్తున్న 65 ఎకరాలకు పోనూ మిగిలిన 35 ఎకరాలకు సంబంధించిన డబ్బు వెనక్కు ఇవ్వాలని ఇండియన్ నేవీ కోరినా ప్రభుత్వం అంగీకరించలేదు. వంద ఎకరాలకు తీసుకున్న మొత్తాన్ని 65 ఎకరాలకే సరిపెట్టుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు గత నెల 21వ తేదీన జీవో 80 జారీ చేసింది. ఇది సర్కారు ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అధికారులు అంటున్నారు. -
ప్రజాభిప్రాయ వేదికా ? పార్టీ కార్యక్రమమా ?
భోగాపురం : మరడపాలెంలో ఎయిర్‌పోర్టు నిర్మాణంపై బుధవారం నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ వేదిక పార్టీ కార్యక్రమాన్ని తలపించిందని రైతులు దాట్ల క్రాంతి, ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద వారు విలేకరులతో మాట్లాడుతూ సమావేశానికి అందరినీ ఆహ్వానించినట్లుగా ఆహ్వానించి మార్గమధ్యలోనే పోలీసులు అరెస్టు చేసి జామి పోలీస్ స్టేషన్‌కు తరలించడం అన్యాయం అని అన్నారు. లాండ్ అక్విజేషన్ పూర్తి స్థాయిలో అవ్వకముందే ప్రజాభిప్రాయ సేకరణ ఏవిధంగా చేశారని ప్రశ్నించారు. అధికారులు అందించిన నివేదిక ప్రకారం దానిలో పొందుపరచిన అంశాలపై శాంతియుతంగా అడిగేందుకు మాత్రమే వచ్చామని, కానీ తమను అడ్డుకున్నారని చెప్పారు. రైతులు, ప్రజలతో సంబంధం లేకుండా వారికి నచ్చిన కొద్దిమందితో నిర్వహించిన సమావేశం చెల్లదని, దీనిపై కోర్టుకు వెళతామని చెప్పారు. పోలీసులు రైతులను బెదిరిస్తూ అతిగా ప్రవర్తిస్తున్నారని పేర్కన్నారు. డి పట్టా భూములకు పరిహారం విషయంలో అధికార పార్టీ నాయకులు బ్రోకర్లుగా వ్యవహరించి రైతులను భయభ్రాంతులకు గురిచేసి దందా చేస్తున్నారని విమర్శించారు. సంబంధంలేని ఎంఎల్ఏ, ఎంపీపీ, జెడ్పీటీసీలను సమావేశంలో కూర్చోబెట్టడంలో అధికారుల్లో స్వామి భక్తి ఏవిధంగా ఉందో స్పష్టమైందని చెప్పారు. కార్యక్రమంలో భైరెడ్డి ప్రభాకరరెడ్డి, ఉప్పాడ శివారెడ్డి, దాట్ల శ్రీనివాసరాజు, కొల్లి గురుమూర్తి, పట్న తాతయ్యలు, మైలపల్లి అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు. -
భోగాపురంలో అప్రకటిత కర్ఫ్యూ
-
భోగాపురంలో అప్రకటిత కర్ఫ్యూ
భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో బుధవారం అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఎయిర్‌పోర్టు నిర్మాణంపై బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయా గ్రామాల ప్రజలకు, సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు కూడా రెవెన్యూ సిబ్బంది ఆహ్వానం పంపారు. తీరా ప్రజాభిప్రాయ సేకరణ సమయానికి వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. ప్రశ్నలు సంధిస్తారని అనుమానం వచ్చిన వారిని హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలను బయటికి రాకుండా నిర్బంధిస్తున్నారు. కేవలం టీడీపీ అనుకూలమైన నాయకులను మాత్రం ప్రజాభిప్రాయసేకరణ సమావేశానికి అనుమతిస్తున్నారు. దీనిపై ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. -
48 కిలోల గంజాయి స్వాధీనం
రోలుగుంట (విశాఖపట్టణం జిల్లా) : చోడవరం మండలం భోగాపురం వద్ద మంగళవారం సాయంత్రం 48 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు భోగాపురం శివారులో కాపుకాసిన పోలీసులు గంజాయి తీసుకెళుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 48 కిలోల గంజాయితో పాటు రెండు సెల్ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. -
రూ.30 లక్షలతో వ్యక్తి అదృశ్యం
భోగాపురం(పెదవేగి రూరల్): సుమారు రూ.30 లక్షలతో సెక్షన్ ఏజెంట్ అదృశ్యమైనట్టు ఎస్కే లూబ్రికేట్స్ యాజమాన్య ప్రతినిధి యర్లగడ్డ కోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం పెదవేగి మండలం భోగాపురం గ్రామంలో నిర్వహిస్తున్న ఎస్కే లూబ్రికేట్స్ కంపెనీలో పనిచేసే సెక్షన్ ఏజెంట్ వేజు సత్యనారాయణ ఈనెల 12న డీలర్ల దగ్గర నుంచి సుమారు రూ.30 లక్షల నగదు వసూలు చేసి, ఖాతాలో వేస్తానని చెప్పి, 13వ తేదీ నుంచి కనిపించడం లేదని కోటేశ్వరరావు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ చిరంజీవి చెప్పారు. -
విద్యార్థి అదశ్యం
భోగాపురం : స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బమ్మిడి ఈశ్వరరావు మంగళవారం నుంచి కనిపించడం లేదు. పాఠశాలకని చెప్పి వెళ్లిన తన కుమారుడు ఇంత వరకూ తిరిగి ఇంటికి చేరలేదని తల్లి స్వరాజ్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అన్నిచోట్లా వెతికినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. -
గ్రీన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టుతో జిల్లా అభివృద్ధి
భోగాపురం : రాష్ట్రంలో విజయనగరం జిల్లా వెనుకబడిన ప్రాంతమని ముఖ్యమంత్రి గుర్తించి భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును ప్రతిపాదించారని గృహనిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని అన్నారు. మండలంలో మంగళవారం పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ముందుగా తోటపల్లిలో రూ.1.28కోట్లతో నిర్మించిన బహుళ ప్రయోజన తుఫాను షెల్టరును, ముంజేరులో రూ.19.50లక్షలతో నిర్మించిన ప్రాధమిక పాఠశాల అదనపు తరగతి గదులను, భోగాపురంలో రూ.1.44కోట్లతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ గిడ్డంగిని, రావాడ పంచాయతీ కార్యాలయం ఆవరణలో రూ.3.75లక్షలతో నిర్మించిన ఆర్ఓ ప్లాంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా ముంజేరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ భోగాపురం మండలంలో ఎయిర్‌పోర్టు నిర్మాణంతో ఇక్కడివారి ఆర్థిక పరిస్థితి మెరుగు పడనుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 3800కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించుకుంటే మన జిల్లాలోనే 380కిలోమీటర్లు వేశామని చెప్పారు. గ్రామాల్లో భూగర్భజలాలు పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు తమ ఇంటివద్ద ఇంకుడు గుంతలు తవ్వాలని, గ్రామ పరిశుభ్రత కోసం గ్రామాల్లో ఇంటికో మరుగుదొడ్డి ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. పచ్చదనం పెంచేందుకు జిల్లాలో 1.25కోట్లు మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టిందని, మొక్కలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంఎల్ఏ పతివాడ నారాయణస్వామి నాయుడు, మాజీ ఎంఎల్ఏ కిమిడి గణపతిరావు, భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ మండలాల ఎంపీపీలు కర్రోతు బంగార్రాజు, మహంతి చిన్నంనాయుడు, కంది చంద్రశేఖర్, జెడ్పీటీసీలు పడాల రాజేశ్వరి, ఆకిరి ప్రసాద్, పతివాడ అప్పలనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో..?
భోగాపురం: ఎయిర్‌పోర్టు సర్వేపై ఏ క్షణానికి ఏమవుతుందో? ఏమోనని భోగాపురం మండల ప్రజల్లో సందిగ్థం మొదలైంది. మంగళవారం కవులవాడ రెవెన్యూలో సమ్మతి తెలపని జిరాయితీ భూముల్లో చేస్తున్న సర్వేను గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో తహసీల్దారు లక్ష్మారెడ్డి, ఎస్ఐ దీనబంధులు గ్రామానికి చేరుకుని వారికి నయానో, భయాన్నో సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అయినా వారు వినిపించుకోలేదు. కోర్టులో ఉన్న భూమికి ఏవిధంగా సర్వే నిర్వహిస్తారని అడ్డుకోవడంతో వారికి అధికారులు ఒక రోజు సమయం ఇచ్చారు. బుధవారం అంతా కలిసి మాట్లాడుకుని సర్వేకి సహకరిస్తారో లేదో చెప్పండి, సర్వేకి సహకరిస్తే అందరికీ మంచిది. లేదని అడ్డుకుంటే అడ్డుకున్నవారిపై కేసులు నమోదు చేసైనా పని చేసుకుపోతామని అధికారులు హెచ్చరించారు. అయితే మంగళవారం మధ్యాహ్నం సీఐ వైకుంఠరావు, ఎస్ఐ దీనబంధులతో తహసీల్దారు కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాసమూర్తి, తహసీల్దారు లక్ష్మారెడ్డిలు సమావేశమయ్యారు. ఏం మాట్లాడారో తెలియదు కానీ బుధవారం ఉదయమే మండల కేంద్రానికి అదనపు బలగాలు(సీఆర్పీ, పోలీసు సిబ్బంది) వ్యాను ద్వారా చేరుకున్నాయి. అయితే ఉదయం నుంచి భారీ వర్షం కురవడంతో సర్వే సాగకపోవడంతో వారంతా మండల కేంద్రంలోనే ఉండి వెనుకముఖం పట్టారు. అధికారులు ఇచ్చిన ఒక్కరోజు గడువు గురువారంతో ముగియనుండడంతో కవులవాడ రెవెన్యూపరిధిలో గురువారం ఏవిధమైన పరిస్థితి నెలకొంటుందోనని ప్రజల్లో అనుమానంతో ఉన్నారు. -
అనుమతి లేకుండా సర్వే ఎలా చేశారు?
ఓ పట్టాదారు ఆవేదన ఏకమైన గ్రామ నాయకులు సర్వే నిలిపివేసిన అధికారులు భోగాపురం: తన సమ్మతి లేకుండా తన భూమిని ఏవిధంగా సర్వే చేస్తారని పట్టాదారు కొండపు లక్ష్మమ్మ సర్వే బృందాన్ని అడ్డుకుంది. వివరాలిలా ఉన్నాయి. విజయ నగరం జిల్లా భోగాపురం మండలంలోని కవులవాడ పంచాయతీ మరడపాలెంలో గురువారం ప్రత్యేక డిప్యూటీ కలెక్టరు ఆధ్వర్యంలో సర్వే బృందం సర్వే చేపట్టారు. లక్ష్మమ్మా నీ భూమిలో అధికారులు ఎయిర్‌పోర్టు సర్వే చేస్తున్నారు అంటూ పక్క రైతులు ఆమెకు సమాచారం అందించారు. అంతే ఆమె లబోదిబో మంటూ గ్రామంలో పెద్దలైన కొండపు రమణ, కొండపు నర్సింగరావు, కొత్తయ్య రెడ్డి, కొండపు రామలక్ష్మణ రెడ్డిల వద్దకు పరుగుపెట్టింది. దీంతో వారంతా సర్వే జరుగుతున్న చోటుకి వెళ్లి సమ్మతి ఇవ్వని భూముల్లో సర్వే ఏవిధంగా చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. దీనికి సర్వే బృందం అధికారులు మాట్లాడుతూ సదరు సర్వే నంబరుపై సమ్మతి పత్రం అందినందునే సర్వే చేపట్టినట్లు తెలిపారు. కొండపు లక్ష్మమ్మకు భర్త చనిపోయాడు. అమెకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కాగా ఒక కుమారుడు చనిపోయాడు. ఆమె పేరు (కొండపు లక్ష్మమ్మ భర్త లేటు అప్పలరాముడు) మీద కవులవాడ రెవెన్యూలో సర్వే నం. 102/13పి ఎ.0.70 సెంట్లు, 103/29పి ఎ. 0.36 సెంట్లు, 103/28పి ఎ. 0.26 సెంట్లు, 104/38 ఎ. 0.28 సెంట్లు వెరసి 1.60ఎకరాల భూమి ఉంది. ఇంకా వాటాలు వేసుకోలేదు అంతా ఉమ్మడి ఆస్తి. చనిపోయిన కుమారుడి భార్య కొండపు రమణమ్మ తన అత్త, ఆడపడుచులు, మరిదికి కూడా చెప్పకుండా..ఆమె సోదరుడు నీలాపు లక్ష్మణతో కలిసి ఉమ్మడి ఆస్తి అయిన భూమిని ఎయిర్‌పోర్టుకి ఇచ్చేందుకు సర్వే బృందానికి సమ్మతి తెలిపింది. అయితే భూమి ఎవరికీ వాటాలు వేయలేదు కొండపు లక్ష్మమ్మ పేరుమీద ఉండగానే సర్వే ఎలా చేస్తారని గ్రామపెద్దలు అడ్డుకోవడంతో సిబ్బంది సర్వే నిలుపుదల చేశారు. ఎవరైనా సమ్మతి తెలిపినప్పుడు వారి రికార్డులు పూర్తిగా పరిశీలించకుండా సర్వేకి ఏ విధంగా వస్తున్నారని గ్రామస్తులు అధికారులను నిలదీయడంతో వారంతా ఆ స్థలంలో సర్వేను నిలిపివేసి వెళ్లిపోయారు. -
గోప్యంగా డీజీపీల సమావేశం
- ఉదయం 11నుంచి సాయంత్రం 4 వరకు సమావేశం - విలేకరులను అనుమతించని పోలీసులు భోగాపురం (విజయనగరం జిల్లా) : భోగాపురం మండలం ఎ.రావివలస సమీపంలోని సన్‌రే విలేజ్ రిసార్ట్స్‌లో నాలుగు రాష్ట్రాల డీజీపీలు సమావేశమయ్యారు. ఉదయం పదిగంటలకు వారంతా విశాఖ నుంచి జాతీయ రహదారి మీదుగా కాన్వాయ్‌గా రిసార్ట్స్‌కు చేరుకున్నారు. వారి రాకను పురస్కరించుకుని రహదారి పొడవునా భారీ బందోబస్తు, వాహనాల తనిఖీ చేపట్టారు. సాయుధ దళాలు రోడ్డుపైనున్న వంతెనల వద్ద జాతీయరహదారికి అనుసంధానమైన రహదారులు వద్ద పహారా కాశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, చత్తీస్ఘడ్ డీజీపీలతో పాటు బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, గ్రేహౌండ్స్ దళాల ఉన్నత అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. శనివారం కూడా ఈ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సమావేశ ప్రాంతానికి విలేకరులను సైతం అనుమతించలేదు. సమావేశంలో చర్చించిన అంశాలను అధికారులు బహిర్గతం చేయలేదు. -
బలవంతపు భూ సేకరణ చేయలేరు...
భోగాపురం: భోగాపురం వాసులకు అన్ని వేళలా అండగా నిలుస్తానని వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన మంగళవారం ఉదయం విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్తూ భోగాపురానికి వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వా గతం పలికారు. ముఖ్యంగా ఎయిర్‌పోర్టు బాధిత గ్రామాల ప్రజలు ఆయన రాక కోసం ఎ.రావివలస కూడలి వద్ద ఎదురు చూశారు. పార్టీ నాయకులు పెనుమత్స సాంబశివరాజు, కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, బెల్లాన చంద్రశేఖర్, పులిరాజు, కందుల రఘుబాబు, చనుమల్లు వెంకటరమణ, నెక్కల నాయుడుబాబు, అంబళ్ల శ్రీరాములునాయుడు తదితరులు కూడా ముందుగా కూడలి వద్దకు చేరుకున్నారు. జగన్‌కు స్వాగతం పలికేందుకు సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, మం డల కన్వీనరు దారపు లక్ష్మణరెడ్డి తదితరులు భారీ ఏర్పాట్లు చేశారు. సుమారు 10 గంటల ప్రాంతంలో అక్కడకు చేరుకున్న జగన్‌ను చూసేందుకు అంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఎస్ఐ దీనబంధు సిబ్బందితో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం కారు వద్దకు పార్టీ జిల్లా ఇన్చార్జ్ కోలగట్ల వీరభద్రస్వామి, కందుల రఘుబాబులు వెళ్లి అధినేతకు కండువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి అతి కష్టమ్మీద జనాల మధ్య నుంచి వేదిక వద్దకు తీసుకువచ్చారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు పెనుమత్స సాంబశివరాజు, కాకర్లపూడి శ్రీనివాసరాజు ఎయిర్‌పోర్టు బాధిత రైతుల తరఫున జగన్‌కు నాగలిని బహుకరించారు. అభిమానులు పూ లవర్షం కురిపించారు. అలాగే ఏఎంసీ మాజీ చైర్మన్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి మెమొంటోను బహూకరించారు. మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కండువా కప్పి అభినందనలు తెలిపారు. అనంతరం జగన్ మాట్లాడారు. బాధిత గ్రామ ప్రజలు ఎవరూ అధైర్యపడవద్దని సూచిం చారు. ఐక్యంగా ఉండి న్యాయపోరాటం చేసినందునే స్టే లభించిందని తెలిపారు. ఇలాగే పోరాడితే విజయం తథ్యమని చెప్పారు. అనంతరం దూరంగా ఉన్న మహిళలను దగ్గరకు పిలిచి ఆప్యాయంగా మాట్లాడారు.కార్యక్రమంలో పార్టీ డెంకాడ మండల కన్వీనరు బంటుపల్లి వాసుదేవరావు, మండల నాయకులు రావాడ బాబు, వరుపుల సుధాకర్, దాట్ల శ్రీనివారాజు, భెరైడ్డి ప్రభాకరరెడ్డి, ఎర్ర అప్పలనారాయణ రెడ్డి, పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్, పతివాడ అప్పలనాయుడు, జైహింద్‌కుమార్, మారం బాలబ్రహ్మారెడ్డి, రెడ్డి బంగారునాయుడు, ఉప్పాడ సూర్యనారాయణ, బీఎల్ రెడ్డి, ఎస్ఈవీ రాజేష్, ఆశపు వేణు, నడిపేన శ్రీనివాసరావు, జీవీ రంగారావు, అల్లు చాణక్య, శీరపు గురునాధరెడ్డి, ఉప్పాడ శివారెడ్డి, సవరవిల్లి శ్రీనివాసరావు, దల్లి శ్రీను, కొల్లి రామ్మూర్తి, పట్న తాతయ్య, తదితరులు పాల్గొన్నారు. -
బోగాపురం భూ సేకరణపై హైకోర్టు స్టే
-
బోగాపురం భూ సేకరణపై హైకోర్టు స్టే
భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణపై హైకోర్టు స్టే విధించింది. భూ సేకరణకు వ్యతిరేకంగా 12 గ్రామాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు భూ సేకరణపై స్టే విధిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. దీంతో విజయనగరం జిల్లా కలెక్టర్ ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ నిలిచిపోనుంది. కాగా.. భోగాపురంలో ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం రెండేళ్ల క్రితం 5,315 ఎకరాల భూమి కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ నోటిఫికేషన్ విడుదల చేసింది.దీనికి వ్యతిరేకంగా.. అప్పటి నుంచి ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం భూ సేకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీసిందంటూ ఆరోపించారు. భోగాపురానికి కేవలం45 కిలో మీటర్ల దూరంలో విశాఖ ఎయిర్ పోర్టు ఉండగా.. భోగాపురం ఎయిర్ పోర్టు దేనికని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్టు లండన్ హిత్రూ కేవలం 3వేల ఎకరాలు కాగా.. భోగాపురం ఎయిర్ పోర్టుకు 5వేలకు పైగా ఎకరాలు ఏం చేసుకుంటారని అన్నారు. -
భోగాపురంలో ఉద్రిక్తత
భోగాపురం (విజయనగరం) : ఎయిర్‌పోర్టు గ్రామాలను సందర్శించడానికి వెళ్లిన సీపీఎం నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో నూతనంగా నిర్మించనున్న ఎయిర్‌పోర్టును స్థానికులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో సోమవారం ఆ గ్రామాలను సందర్శించేందుకు వెళ్లిన సీపీఎం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు నాయకులకు మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. -
భోగాపురంలో విమానాశ్రయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన
విజయనగరం : అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రజాసంఘాలు ఆదివారం ఆందోళన చేపట్టాయి. అందులోభాగంగా నేటి నుంచి రెండు రోజులపాటు బాధిత గ్రామాల్లో ప్రజా సంఘాల నాయకులు పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. అయితే ముందస్తుగా ఎస్ కోటలో సీపీఐ నేత కామేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. అందుకు నిరసనగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వామపక్షాల నేతలు ఈ రోజు ధర్నా నిర్వహించారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. -
సారూ.. మా ఊరిని వదిలేయండి
కానిస్టేబుల్ కాలు పట్టుకున్న ‘భోగాపురం’ వృద్ధురాలు భోగాపురం: ‘సారూ.. నీ తల్లిలాంటి దాన్ని.. ఊహ తెలిసినప్పటి నుంచి ఈ ఊళ్లోనే ఉన్నాం.. ఇక్కడే చస్తాం... దయచేసి మా నుంచి మా ఊరిని, భూముల్ని వేరు చేయొద్దు’ అంటూ బమ్మిడిపేటకు చెందిన ఓ వృద్ధురాలు సర్వే సిబ్బందికి రక్షణగా వచ్చిన రామ్నివాస్ అనే కానిస్టేబుల్ కాలు పట్టుకుని వేడుకుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో నిర్మించనున్న ఎయిర్‌పోర్టు కోసం బుధవారం ైబెరైడ్డిపాలెం పంచాయతీ బమ్మిడి పేట వద్ద సర్వే నిర్వహించారు. ఆ సమయంలో అప్పయ్యమ్మ అనే వృద్ధురాలు ఇలా ఆవేదన చెందింది. -
భోగాపురంలో ఉద్రిక్తత
-
భోగాపురంలో ఉద్రిక్తత
భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురం మండలం పెదకవులవాడ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం భూములను సర్వే చేయడానికి వచ్చిన అధికారులను స్థానికి ప్రజలు అడ్డుకున్నారు. భూ సేకరణకు సంబంధించిన విషయంపై కోర్టులో స్టే ఉండగా సర్వే ఎలా చేస్తారని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
నెల రోజుల్లో భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేకరణ
మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం : భోగాపురం వద్ద నిర్మించనున్న ఎయిర్‌పోర్టు కోసం నెల రోజుల్లో భూసేకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాష్ర్ట మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. సేకరించనున్న భూములు వివిధ రకాలుగా ఉన్నందున వాటి కి ఏ రీతిలో పరిహారం చెల్లించాలనే విషయమై కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. వీటిపై సోమవారం నగర పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చిస్తామన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేకరణ పురోగతిపై గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కిమిడి మృణాళినితో కలిసి ఆదివారం సర్క్యూట్ హౌస్‌లో విజయనగరం, విశాఖ జిల్లాల కలెక్టర్లు, భోగాపురం ప్రాంత ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన 5,300 ఎకరాల్లో 300 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు, వుడా ఆమోదం పొందిన లేవుట్లు ఉన్నాయని తెలిపారు. లే అవుట్ భూములను రెండు రకాలుగా వర్గీకరించామని, లే అవుట్లో అమ్మకాలు జరిపినవి, భూమి వినియోగ మార్పిడి చేసి విక్రయించకుండా ఉన్నవిగా గుర్తించి వాటికి పరహారం నిర్ణయిస్తామన్నారు. భూసేకరణలో ఎవరికి నష్టం లేకుండా బాధ కలగకుండా ప్యాకేజీలు రూపొందిస్తామన్నారు. -
ఎయిర్‌పోర్టు బాధితులకు అండగా ఉంటా
-
భోగాపురంలో సర్కార్ దందా
-
భోగాపురం నిర్వాసిత గ్రామాల్లో ఉద్రిక్తత
-
5న భోగాపురానికి వైఎస్ జగన్
-
ఆది నుంచి తుది వరకు
గుండెలు పిండే విషాదం.. ముద్దులొలికే చిన్నారి అదితి మురుగు నీటిలో మునిగిపోయిందన్న వార్త ఈనెల 24వ తేదీ సాయంత్రం దావానలంలా వ్యాపించింది. నగరమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రభుత్వ యంత్రాంగం కదిలివచ్చింది. ఎలాగైనా అదితిని కాపాడాలని తపన పండింది. జీవీఎంసీ, నేవీ సిబ్బంది, పోలీసులు డ్రైనేజీ కాల్వలు, గెడ్డల్లో, సముద్రంలో ఏడు రోజులపాటు తీవ్రంగా గాలించారు. రకరకాల వార్తలతో ఈ వారమంతా ఉత్కంఠతో గడిచింది. చివరకు కన్నీరే మిగిలింది. - విశాఖపట్నం/పెదవాల్తేరు సెప్టెంబర్ 24 సాయంత్రం 4 గంటలకు సీతమ్మధారలోని ఇంటి నుంచి అదితి డాక్టర్ వీఎస్ కృష్ణ కళాశాల రోడ్డు భానునగర్‌లోని ఐవోఎస్ ట్యూషన్ సెంటర్‌కు వెళ్లింది. నగరమంతా కుంభవృష్టి కురవడంతో వర్షం నీటితో మురుగు కాల్వలు పొంగిపొరలుతున్నాయి. సాయంత్రం 7 గంటల ప్రాంతం లో ట్యూషన్ ముగిశాక కారెక్కబోతూ వర్షం నీటితో నిండిన డ్రైనేజీలో పడిపోయింది. జీవీఎంసీ సిబ్బంది వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు భానునగర్ నుంచి ఎంవీపీకాలనీ సెక్టార్ వరకు గెడ్డలో గాలించారు. పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్, డీసీపీ త్రివిక్రమ్‌వర్మ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సెప్టెంబర్ 25 వేకువజాము 5 గంటల నుంచి అదితి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భానునగర్ నుంచి ఇసుకతోట, ఎంవీపీకాలనీ మీదుగా లాసన్స్ బేకాలనీ వద్ద సముద్రంలో కలిసే గెడ్డ వరకు నాలుగు పొక్లయిన్లతో పూడికలు, చెత్తను తొలిగించారు. 250 మంది పారిశుధ్య, పోలీస్, అగ్నిమాపక సిబ్బంది గెడ్డలో చిన్నారి ఆచూకీ కోసం వెదికారు. నేవీ సిబ్బంది ఒక హెలికాప్టర్లో రుషికొండ నుంచి ఆర్కే బీచ్ వరకు సముద్రంలో గాలించారు. 15మంది గజ ఈతగాళ్లు గెడ్డ, సముద్రంలో వెదికారు. అదితి తాత ఫిర్యాదు మేరకు ఎంవీపీకాలనీ పోలీసులు అదితి అదృశ్యమైందని కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 26 ఉదయం నుంచి జీవీఎంసీ పారిశుధ్య సిబ్బంది గెడ్డలో వెతకడం ప్రారంభించారు. వందమంది వరకు భానునగర్ నుంచి లాసన్స్‌బేకాలనీ సముద్రం వరకు గాలించారు. నేవీ గజ ఈతగాళ్లు సైతం ఇందులో పాల్గొన్నారు. నేవీ డైవర్లు సముద్ర గర్భం లోపలికి వెళ్లి అదితి కోసం గాలించారు. హెలికాప్టర్ పైనుంచి సముద్రంలో గాలించారు. 10 బోట్లలో మత్స్యకారులు సముద్రంలో గాలించారు. పొక్లయిన్లతో మరోసారి గెడ్డలోని రాళ్లు తీసి క్షుణ్ణంగా వెదికారు. పోలీసులు కిడ్నాప్ అనుమానంతో అదితిని తీసుకురావడానికి వెళ్లిన కారు డైవర్ గురునాథాన్ని ప్రశ్నించారు. సెప్టెంబర్ 27 అదితి అదృశ్యం మిస్టరీగా మారింది. గెడ్డ, సముద్రంలో ఆచూకీ లభ్యం కాకపోవడంతో అనుమానాలు బలపడ్డాయి. అదితి సహవిద్యార్ధిని తాన్వీని పోలీసులు సమాచారం అడిగారు. అదితి డ్రైనేజీలో పడిపోవడం కళ్లారా చూశానని ఆమె స్పష్టం చేసింది. ఈ రోజు కూడా యధావిధిగా గెడ్డ సముద్రంలో మత్స్యకారులు, నేవీ సిబ్బంది గాలించారు. అదితి తండ్రి శ్రీనివాస్, తాత రమణమూర్తి కిడ్నాప్ చేసుంటారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేయాలని భావించారు. ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వారిని విచారించారు. సెప్టెంబర్ 28 అదితి ఆచూకీ కోసం గెడ్డలో నీటిని నిలిపి అన్వేషించారు. 50మంది మత్స్యకారులు పది పడవల్లో రుషికొండ నుంచి ఆర్కే బీచ్ వరకు సముద్రంలో 50 కిలోమీటర్ల మేర గాలించారు. అదితి ట్యూషన్ సెంటర్ పక్కనే ఉన్న మెడికల్ షాప్‌లోని సీసీ కెమెరాల పుటేజ్‌లను పోలీసులు పరిశీలించారు. ట్యూషన్‌కు వెళ్తున్న దృశ్యం అందులో రికార్డయింది. మున్సిపల్ పరిపాలన పట్టాణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి కరికాల్ వరినన్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. కమిషనర్ అమిత్‌గార్గ్ డీసీపీ త్రివిక్రమ్ వర్మ నేతృత్వంలో ప్రత్యేక ఇన్విస్టిగేషన్ టీమ్‌ను నియమించారు. సెప్టెంబర్ 29 అదితి ఆచూకీ కోసం జీవీఎంసీ, అగ్నిమాపక సిబ్బంది, మత్స్యకారులు గెడ్డ, సముద్రంలో గాలించారు. భీమిలి నుంచి ఫిషింగ్ హార్బర్ వరకు వలలతో వెదికారు. పోలీసులు మాత్రం కిడ్నాప్ కోణంలో విచారణ ప్రారంభించారు. కారు డైవర్ కాల్ డేటా, ఇతర వివరాలపై ప్రత్యేక బృందం దృష్టి సారించారు. నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అదితి అదృశ్యంపై ఆరా తీశారు. అదితి తండ్రి శ్రీనివాసరావు, తాత రమణమూర్తి సీఎంను కలిశారు. సెప్టెంబర్ 30 భీమిలి నుంచి గంగ వరం పోర్టు వరకు వంద కిలోమీటర్లమేర వెదికారు. రాత్రి 10 గంటల వరకు అదితి ఆచూకీ లభ్యం కాకపోవడంతో గాలింపును నిలిపివేస్తున్నట్టు జీవీఎంసీ ప్రకటించింది. సాయంత్రం అదితి తండ్రి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తమకు శత్రువులెవరూ లేరని, తమ పాప ఎక్కడో క్షేమంగా వుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదితి ఆచూకీ తెలిపిన వారికి రూ.5 లక్షలు బహుమతి ప్రకటించారు. అక్టోబర్ 1 అదితి మృతదేహం గురువారం సాయంత్రం భోగాపురం తీరంలో బయటపడింది. -
5న భోగాపురానికి వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, విజయనగరం: గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం విషయంలో ప్రభుత్వం దిగొచ్చేంత వరకు వైఎస్సార్సీపీ పోరాడుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు చెప్పారు. ఈ ఎయిర్‌పోర్టు కింద భూములను కోల్పోతున్న బాధితులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 5న భోగాపురం వస్తున్నారని తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పలు గ్రామాల్లో జగన్ పర్యటిస్తారన్నారు. ఆయా గ్రామాల్లో సుజయ్‌కృష్ణ రంగారావు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు తదితరులు గురువారం పర్యటించారు. సుజయ్‌కృష్ణ రంగారావు, కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ... 5వ తేదీన జగన్ రాజాపులోవ జంక్షన్ నుంచి ప్రారంభమై కవులవాడ, ఎ.రాయివలస, గూడపువలస గ్రామాల్లో పర్యటిస్తారని చెప్పారు. గూడపువలసలో బహిరంగసభలో మాట్లాడుతారన్నారు. -
ఆరేళ్లకే నూరేళ్లా..!
►భోగాపురంలో ► తేలిన విశాఖ చిన్నారి ► ఏడు రోజుల అనంతరం ► సముద్రం ఒడ్డుకు వచ్చిన చిన్నారి నిర్జీవదేహం ► కన్నీరు పెట్టుకున్న స్థానికులు పూసపాటిరేగ/విజయనగరం కంటోన్మెంట్: అయ్యో..! చిట్టితల్లీ ఇంత చిన్న వయసు లోనే కాలువలో పడి కొట్టుకు వచ్చావా తల్లీ..? నీకోసం నీ తల్లిదండ్రులు, అధికారులు వారం రోజులుగా పడుతున్న కష్టాలు పత్రికల్లో, టీవీల్లో చూస్తున్నాం ఇక్కడ మృ తదేహమై తేలావా తల్లీ అంటూ భోగాపురం మండలలోని దిబ్బగుడ్డివలస వాసులు కన్నీరుమున్నీరయ్యారు. సెప్టెంబర్ 24వ తేదీన కారు ఎక్కబోతూ డ్రైనేజీలో పడి గల్లంతయిన విశాఖ పట్నానికి చెందిన ఆరేళ్ల చిన్నారి సాయి లావణ్య అదితి భోగాపురం మం డలం దిబ్బల పాలెం వద్ద ఉన్న సముద్రపు ఒడ్డున గురువారం కనిపిం చింది. అక్కడి సన్‌రే లే ఔట్ వద్ద చిన్నారి అదితి మృతదేహం కనిపిం చడంతో అక్కడి ఉ ద్యోగి బయటకు వెళ్తూ చూసి అందరికీ సమాచారమందిం చాడు. దీంతో స్థాని కులు ఇతరులు అక్కడికి పరుగుపరుగున వచ్చి చిన్నారి మృతదేహాన్ని చూశారు. చూసిన వాళ్లంతా కంటనీరు పెట్టుకున్నారు. పోలీసులు, జీవీఎంసీ అధికారులు, తల్లిదండ్రులు వారం రోజులుగా గాలిస్తున్న సమాచారాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న వారంతా అక్కడికి చేరుకుని మృతదేహాన్ని చూసేందుకు చెమర్చిన కళ్లతో వచ్చారు. సమీప గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు అదితి మృతదేహాన్ని చూసి ఆవేదన చెందారు. వందలాది మంది ఉద్యోగులు నగరమంతా గాలించి వడపోసినా ఆచూకీ కానరాకపోవడంతో వారు చేతులెత్తేశారు. చివరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయినా ఆశ చావని తల్లి దండ్రులు ఆచూకీ చెబితే రూ5లక్షల నజరానా ఇస్తామని బుధవారం ప్రకటించారు. కానీ ఆ చిన్నారి సముద్రంలో రెండు జిల్లాల పరిధిలో తిరిగి తిరిగి చివరకు ఇక్కడ బయట పడటం చూసి స్థానికులు కళ్లలోంచి నీళ్లు బయటకు వచ్చాయి. వారి గుండెలు బరువెక్కాయి. ఇక్కడ అదితి మృతదేహం తేలిందని సమాచారం అందడంతో చేరుకున్న బాలిక తండ్రి శ్రీనివాసరావు అక్కడికక్కడే కుప్పకూలిపోవడం చూసిన స్థానికుల గుండె చె రువయింది. అయ్యో ఎక్కడున్నా బతికే ఉంటుందని అనుకున్నానని ఆదితి తండ్రి గుండెలవిసేలా రోదించారు. దిబ్బలపాలెంలో అదితి మృ తదేహం తేలిందని తెలుసుకున్న నేవీ అధికారులు, విశాఖ పోలీసులు, విశాఖకు చెందిన ప్రసార మాధ్యమాలన్నీ అక్కడికి చేరుకున్నాయి. అక్కడకు పెద్ద ఎత్తున వచ్చిన మీడియానుద్దేశించి అదితి తండ్రి శ్రీనివాసరావు తన కుమార్తె మృతదేహానికి ఫొటో తీయొద్దని రోదిస్తూ ప్రాధేయ పడడం చూసిన స్థానికులు కన్నీంటి పర్యం తమ య్యారు. -
మాకు మేమే బలం..
బలవంతపు భూసేకరణకు వ్యతిరేకం స్పష్టం చేసిన ఎయిర్‌పోర్టు బాధిత ప్రజలు భోగాపురం : మీ అధికారులందరికీ పోలీసులు బలమైతే... ఎయిర్‌పోర్టు బాధిత రైతులమైన మాకు మేమే బలం... మా అందరిదీ ఒకే గ్రామం.. ఎయిర్‌పోర్టు బాధిత గ్రామం.. మాదంతా ఒకేమాట... ఎయిర్‌పోర్టుకి మా భూములు ఇవ్వం... కాదని అధికారులు గ్రామాల్లోకొస్తే ఆత్మహత్యలు చేసుకుంటాం అని ఎయిర్‌పోర్టు బాధిత రైతులు గ్రామస్తులు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఎయిర్‌పోర్టు బాధిత గ్రామాల ప్రజలు, రైతులు అభిప్రాయాన్ని సేకరించేందుకు ఆర్డీఓ శ్రీనివాసమూర్తి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అధికారులు మోసపూరితంగా ప్రవర్తిస్తున్న తీరును రైతులంతా ఎండగట్టారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సిబ్బంది తెల్లమొహం వేశారు. ముందుగా రైతులు చెప్తున్న అభ్యంతరాలని ఆర్డీఓ నోట్ చేసుకున్నారు. దీనిపై కలెక్టరుతో చర్చిస్తామన్నారు. మీ అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయాలే తప్ప గ్రామాల్లోకి వచ్చిన అధికారులను అడ్డుకోవడం తగదని ఆర్డీఓ సూచించారు. ఈనెల1న నోటిఫికేషన్ ఇచ్చారు. మేమ అభ్యంతరాలు చెప్పడానికి 60 రోజుల వ్యవధి ఉంది. ఇంతలో మీరు ఎందుకు పోలీసుల బలగాలతో గ్రామాల్లోకి వస్తున్నారు. మీరెందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని కాకర్లపూడి శ్రీనివాసరాజు ప్రశ్నించారు. అలాగే గూడెపువలసకి చెందిన డి.బి.వి.ఎల్.ఎన్ రాజు అనే రైతు సమాచార హక్కుచట్టం కింద ఎయిర్‌పోర్టు వివరాల కోసం దరఖాస్తు చేస్తే ఎయిర్‌పోర్టు సర్వే వివరాలు గాని, రైట్స్ సంస్థ సాంకేతిక నివేదిక గాని ఇవ్వలేదని, అలాంటప్పుడు ఒకటో తేదీన నోటిఫికేషన్ ఎలా ఇచ్చారన్నారు. అధికారులకు రక్షణ కల్పిస్తున్న పోలీసులు ప్రజలకి ఎందుకు రక్షణ కల్పించడంలేదని దాట్ల శ్రీదేవి వర్మ ప్రశ్నించారు. మమ్మల్ని చర్చలకి రమ్మని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూర్చోబెట్టి ముగ్గురు ఉప కలెక్టర్లను గ్రామాల్లోకి ఎందుకు పంపించారని ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి ప్రశ్నించారు. అది అనుకోకుండా జరిగిపోయిందని చెప్పిన ఆర్డీఓ ఈ సందర్భంగా సారీ చెప్పారు. రైతులు ఇష్టపడితేనే ఎయిర్‌పోర్టు నిర్మాణం జరుగుతుందని కేంద్రమంత్రి అశోక్ గతంలో పలుమార్లు చెప్పారని, అలాంటిది ఇప్పుడు రైతులు వ్యతిరేకిస్తున్నా ఎందుకు పనులు చేపడుతున్నారని ఉప్పాడ శివారెడ్డి, తదితరులు ప్రశ్నించారు. దీనికి ఆర్డీఓ స్పందిస్తూ డిమాండ్లను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ లక్ష్మారెడ్డి, ఎస్ఐ దీనబంధు, ఉప కలెక్టర్లు శ్రీలత, బాలాత్రిపురసుందరి, తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ సర్కారుపై మండిపడ్డ వడ్డే శోభనాద్రీశ్వరరావు
విజయనగరం జిల్లా భోగాపురంలో తలపెట్టిన విమానాశ్రయానికి వేలాది ఎకరాలు అవసరం లేదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. సోమవారం వైజాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ సర్కారు రైతాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు గతంలో టీడీపీ సర్కారులో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. -
నిప్పుకణికిలా...
భోగాపురం, విజయనగరం కంటోన్మెంట్:మనుషులతోనే కాదు మట్టితో కూడా వారు అనుబంధం పెంచుకున్నారు. ఊరు, చెట్టుచేమ, ఇళ్లు,పశువులు,పొలాలు, చెరువులు ఇలా అన్నింటితోనూ వారిది విడదీయరాని బంధం. అయితే ఇప్పుడా బంధాన్ని తెంపేస్తున్నారు. ఎయిర్‌పోర్టు కోసం ప్రభుత్వం గ్రామాలను చెరబడుతోంది. దీంతో ఎంతో ప్రశాంతంగా ఉండే భోగాపురం ఇప్పుడు రగిలిపోతోంది. బాధిత తొమ్మిది గ్రామాల్లోని ప్రజలు వినూత్న తరహాలో ఆందోళనలు చేస్తున్నారు. మరో పక్క అధికారుల ప్రకటనలు, ప్రభుత్వ చర్యలు వారి గుండెలను పిండేస్తున్నాయి. ఇంతవరకూ నేలతల్లిని నమ్ముకుని గుట్టుగా సాగుతున్న తమ బతుకులను వీధిన పడేస్తున్నారన్న బాధ వారి హృదయాలను మెలిపెట్టేస్తోంది. బతుకులు బజారుపాలవుతాయన్న ఆవేదనతో శనివారం తెల్లవారు జామున వెంపడా సూరి(53) అనే రైతు గుండె ఆగిపోయింది. ఎయిర్‌పోర్టుకు బలైన రెండో గుండె ఇది. ఈ విషయం తెలిసిన ప్రజలు మరింత రగిలిపోయారు. తమ సమాధులమీద ఎయిర్‌పోర్టు నిర్మించడానికి సిద్ధమవుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం మరింత ఉద్ధృతం చేయనున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో నిరసనలు మిన్నంటాయి. మొట్టమొదటగా దల్లిపేట పంచాయతీలో రిలేనిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. తరువాత గూడెపువలస, రెడ్డికంచేరు, భెరైడ్డిపాలెం, దల్లిపేట, ఏ.రావివలస, జమ్మయ్యపేట, కవులవాడ, మరడపాలెం గ్రామాల్లో రిలేనిరాహార దీక్షలు ప్రారంభించారు. ఆడామగా, ముసిలీముతక అన్న తేడా లేకుండా అందరూ రోడ్లపైకి వస్తున్నారు. యువకులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ప్రభుత్వాన్ని పెద్ద పీడగా భావిస్తూ... పి భెరైడ్డిపాలెం గ్రామంలో మహిళలు రోడ్డుకు అడ్డంగా వేపరెమ్మలు కట్టి నిరసన తెలిపారు. ఎయిర్‌పోర్టు వ్యతిరేక పోరాటానికి అన్ని వర్గాల నుంచి మద్దుతు లభిస్తోంది. వైఎస్ఆర్ సీపీ నేతలు మొదటి నుంచి పోరాటంలో మమేకమయ్యారు. ఐద్వా నేతలు కూడా మద్దతు పలికారు. శనివారం ఐద్వా నాయకులు వి.ఇందిర, లక్ష్మిలు దల్లిపేటలోని రిలేనిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించారు. -
అర ఎకరం కూడా మిగలదని...
భోగాపురం: ఎయిర్‌పోర్టు వ్యవహారం మరో ప్రాణాన్ని బలిగొంది. తన కుటుంబానికి జీవ నాధారమైన అర ఎరం కూ డా మిగలదన్న భయంతో మరో గుండె ఆగిపో యింది. గూడెపువలస పంచాయతీ వెంపాడపేటకు చెందిన వెంపాడ సూరి (52) అనే రైతుకు ఎకరా 60 సెంట్ల భూమి ఉండేది. పిల్లల పెళ్లిల కోసం కొంత భూమి అమ్మేశారు. ఎయిర్‌పోర్టు నోటిఫికేషన్ వెలువడడంతో ఆ ఉన్న కాస్త భూమికూడా పోతుందన్న బెంగతో సూరి తల్లడిల్లిపోయారు. తనభూమినికాపాడుకోవడం కోసం తానూ పోరాటంలో పాల్గొన్నారు. గూడెపువలసలో నిర్వహిస్తున్న రిలేనిరాహార దీక్ష శిబిరంలో కూడా పాల్గొంటున్నారు . అయితే శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలో రెవెన్యూ అధికారులు సమావేశమయ్యారని, శనివారం నుంచి భూముల యజమానులకు నోటీసులు జారీచేస్తారని తెలియడంతో తీవ్ర మనస్థాపానికి గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో శుక్రవారం రాత్రి సరిగా నిద్రపోలేదని, శనివారం ఉదయం 3గంటల సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వచ్చిన సూరి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సూరికి భార్య బంగారమ్మతోపాటు కొడుకు, కూతురు ఉన్నారు. నాయకుల పరామర్శ: విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ సీపీ నాయకులు, ఎయిర్‌పోర్టు వ్యతిరేక కమిటీ సభ్యులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, భెరైడ్డి ప్రభాకరరెడ్డి, మండల కన్వీనరు దారపు లక్ష్మణరెడ్డి, కొల్లి రామ్మూర్తి, కొండపు లక్ష్మణరెడ్డి, కొండపు శ్రీనివాసుల రెడ్డి, కేశవరావు రమణారెడ్డి, మట్ట వెంకటరమణారెడ్డి తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఎయిర్‌పోర్టు విషయంలో ఎవరూ బెదిరిపోనక్కరలేదనీ, అందరూ ధైర్యంగా ఉండాలనీ వారు కోరారు. -
ప్రభుత్వం తీరుతో రైతు గుండె ఆగింది
-
ప్రభుత్వం తీరుతో రైతు గుండె ఆగింది
విజయనగరం : అంతర్జాతీయ విమానాశ్రయం కోసం తన భూమిని తీసుకోవాలని టీడీపీ ప్రభుత్వం యత్నిస్తుండటంతో మనస్తాపానికి గురైన ఓవ రైతు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలం వెంపాడుపేటలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భోగాపురంలో నిర్మించ తలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయం కోసం అధికారులు నేడు నోటీసులు జారీ చేయనున్నారు. తన భూమిని కోల్పోతానన్న భయాందోళనతో సూరి అనే రైతు మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే సూరి అనే రైతుకు పొలం చేజారుతుందేమోనన్న దిగులుతోనే గుండెపోటు వచ్చిఅతను మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఎయిర్ పోర్టు నిర్మాణానికి తమ భూములు ఇచ్చేందుకు సిద్ధంగాలేనట్లు రైతులు గతంలోనే తేల్చిచెప్పారు. కానీ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలతో రైతన్నలు బలైపోతున్నా మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోవడంలేనట్లు కనిపిస్తోంది. -
పంచాయితీరాజ్ డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు
అనకాపల్లి : విజయనగరం జిల్లా భోగాపురంలో పంచాయతీరాజ్ డీఈ మల్లా వెంకట్రావు ఇళ్లలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. మంగళవారం ఉదయం నుంచి జిల్లా ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి ఆధ్వర్యంలో విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఉన్న ఆయన బంధువుల ఇళ్లలో తనిఖీలు సాగిస్తున్నారు. ఇటీవల వెంకటకృష్ణాజీ అనే డీఈ ఇంటిపై ఏసీబీ దాడుల జరిపిన సందర్భంగా లభించిన డాక్యుమెంట్లలో వెంకట్రావు పేరు కూడా ఉండటంతో ఆ మేరకు సోదాలు చేస్తున్నట్లు సమాచారం. సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
దండుకునేందుకు ప్లాన్!
ఎయిర్‌పోర్టు ప్లాన్ కోసం భోగాపురంలో ఓ కీలక నేత తెగ ప్రయత్నిస్తున్నారు. సీఎం ఆమోదించిన ప్లాన్‌ను తనకిచ్చేయాలని అధికారులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఆ ప్లాన్‌ను పట్టుకుని దండుకునేందుకు ఆరాటపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: భోగాపురం ఎయిర్‌పోర్టు వ్యవ హారాన్ని తనకు అనుకూలంగా మలచుకొని పెద్ద ఎత్తున వెనకేసుకునేందుకు ఆ మండ లా నికి చెందిన ఓ నేత పరితపిస్తున్నారు. ప్రభుత్వ పెద్ద అం డతో భోగాపురంలో ఆ నేత చక్రం తిప్పుతున్నారు. ఎయిర్‌పోర్టు అలైన్‌మెంట్‌లోకి భూములు కలపాలా, కలపొద్దా అన్నది తన చేతు ల్లో ఉందని ప్రచారం చేసుకుంటున్నారు. తన ప్రమేయంతోనే కొందరి రియల్టర్లు, డెవలపర్ల( సన్‌రే, మిరాకిల్)భూముల్ని మినహాయించారని చెప్పుకుంటున్నారు. ఎయిర్‌పోర్టు బూచి చూపించి మిగతా రియలర్టర్ల వద్ద నుంచి సొమ్ము దండుకునేందుకు తీవ్రంగా య త్నిస్తున్నారు. దానికోసం సీఎం ఆమోదించిన ప్లాన్‌ను తన చేతుల్లోకి తెచ్చుకునేం దుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్లాన్ తనకివ్వాలని సంబంధిత అధికారులపై తీవ్రం గా ఒత్తిడి చేస్తున్నారు. ప్లాన్ చేతికొచ్చాక ఎవరి భూములు మినహాయింపునకు గురవుతాయో తెలుసుకుని వారి వద్దకెళ్లి డబ్బులు గుంజేందుకు యోచిస్తున్నారు. దారికి రాకపోతే భయపెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో పెద్ద వాళ్ల తో ఒత్తిళ్లు కూడా చేయిస్తున్నారు. ప్రభుత్వంలో కీలక హోదాలో ఉన్న అధికారి సైతం ప్లాన్‌ను ఆ వ్యక్తికి ఇవ్వమని ఆదేశించేలా చేశారు. ఆ పెద్దలకు కూడా వాటాలందనుండమే దీనికి కారణమని తెలుస్తోంది. కానీ, ఆ నాయకుని గురించి తెలిసిన అధికారులు ప్లాన్ ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఇప్పటికే కొందరి వద్ద నుంచి వసూళ్లు చేశాడని, ఇప్పుడా ప్లాన్ ఇస్తే మరింతగా దండుకుంటాడని భావిస్తున్నారు. నిఘావర్గాల ఆరా: ఎయిర్‌పోర్టు ప్లాన్ నుంచి భూముల్ని మినహాయిస్తానని నమ్మబలికి రూ.లక్షలు వెనకేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఇప్పటికే అధికారులు పసిగట్టారు. దీంతో అతగాడి ఆటలు సాగనివ్వరాదని అధికారులు సైతం నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అయితే, దండుకోవడం మరిగిన ఆ ఘనుడు ప్లాన్ ఇవ్వకపోతే హైదరాబాద్ వెళ్తానని, అక్కడ నుంచి గట్టిగా చెప్పిస్తానని బెదిరింపులకు కూడా దిగుతున్నారు. ఎలా ఇవ్వరో చూస్తానని సవాల్ కూడా చేస్తున్నట్టు తెలిసింది. కాగా, భూములు మినహాయింపు ముసుగులో వసూళ్లకు తెగబడ్డ వైనంపై నిఘా వర్గాలు ఆరాతీస్తున్నట్టు తెలిసింది. ఆ నేతపై ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. -
గుండెల్లో ‘విమానాలు’
నష్టపరిహారం దక్కదని పురోణీలకు రిజిస్ట్రేషన్ భూ రిజిస్ట్రేషన్లపై ‘విమానాశ్రయం’ ప్రభావం భోగాపురం మినహా చుట్టూ క్రయ, విక్రయాలు సాక్షి ప్రతినిధి, విజయనగరం: విమానాశ్రయం ఏర్పాటు నిర్ణయం భూ యజమానుల గుండెల్లో గుబులు రేపుతోంది. భూముల కొనుగోలు, అమ్మకాలపై ప్రభావం చూపుతోంది. విమానాశ్రయం ఏర్పా టైతే ప్రభుత్వ నష్టపరిహారం దక్కదనే భయంతో పురోణీలను అత్యవసరంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో జూలై నెలలో భారీగా జరిగిన రిజిస్ట్రేషన్లే దీనికి నిదర్శనం. విమానాశ్రయానికి వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతం కావడంతో భోగాపురం తప్ప మిగిలిన మండలాల్లో ఒక్క నెలలో 1218 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రూ.4.38 కోట్ల ఆదాయంతో, రిజిస్ట్రేషన్లతో భోగాపురం రెండో స్థానంలో నిలిచింది. విజయనగరం ఆర్వో కార్యాలయం రూ.4.5 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది. విశాఖ నగరానికి సమీపంలో ఉన్న భోగాపురం జాతీయ రహదారిని ఆనుకుని ఉండటంతో సాధారణంగా భూ క్రయ, విక్రయాలు ఇక్కడ ఎక్కువగా జరుగుతాయి. ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో భోగాపురానికి చెందిన భూ రిజిస్ట్రేషన్లతోనే రెండింతల ఆదాయం వచ్చేది. కానీ ఈ మండలంలో విమానాశ్రయం ఏర్పాటు నిర్ణయంతో పరిస్థితి మారింది. విమానాశ్రయాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టత లేక, ఎప్పుడే అలైన్మెంట్తో ముందుకొస్తారో తెలియక భోగాపురం మండలంలో క్రయ, విక్రయాలు పెద్దగా జరగలేదు. దీంతో గతంలో పురోణీలు (అగ్రిమెంట్) రాసుకుని క్రయ, విక్రయాలు చేసుకున్న వారు మాత్రం రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఒకవేళ విమానాశ్రయం పరిధిలోకి ఆ భూములొస్తే ప్రభుత్వమిచ్చే నష్టపరిహారం అసలు యజమానికి పోతుందని, పురోణీ రాసుకుని చేసిన కొనుగోలుకు చట్టబద్దత ఉండదనే అభిప్రాయంతో హుటాహుటిన వాటిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంతే తప్ప కొత్తగా క్రయ, విక్రయాలు జరగలేదు. భోగాపురం మండలంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తే పక్కనే ఉన్న డెంకాడ, పూసపాటిరేగ ప్రాంత భూములకు డిమాండ్ పెరుగుతుందని కొనుగోలుదారులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు. విశాఖకు చెందిన బడా వ్యక్తులతో కలిసి విజయనగరం జిల్లా రియల్టర్లు దాదాపు అక్కడే సొమ్ము వెచ్చించి భారీగా భూముల్ని కొనుగోలు చేసారు. అత్యధికంగా డెంకాడ మండలంలో క్రయ, విక్రయాలు భారీగా జరిగాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో జరిగిన 1218 రిజిస్ట్రేషన్లలో రెండింతలు డెంకాడ మండలానికి చెందినవేనని తెలుస్తోంది. మిగతావి జాతీయ రహదారికి పది కిలోమీటర్ల దూరంలోని పూసపాటిరేగ మండలంలో జరిగినవి. దీన్నిబట్టీ భూమ్ అంతా భోగాపురం మండలం చుట్టుపక్కలే ఉందని తెలుస్తోంది. విశాఖను ఆనుకున్న కొత్తవలసలో 1222 రిజిస్ట్రేషన్లు జరిగి ప్రథమ స్థానంలో నిలిచింది. -
ఎయిర్‌పోర్టు సర్వే అధికారులను అడ్డుకున్న భోగాపురంవాసులు
విజయనగరం (భోగాపురం) : సోమవారం తొలి ఏకాదశి కావడంతో మంచి రోజన్న కారణంతో ఎయిర్‌పోర్టు భూముల సర్వేకు వెళ్లిన అధికారులను ముక్కాం గ్రామ సమీపంలో భోగాపురం మండల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. వారు వెంట తీసుకువచ్చిన మ్యాపులను చించి వేసి అధికారులను అడ్డుకున్నారు. మేము ఎలాంటి భూమలు ఇవ్వబోమని, మరోసారి ఎయిర్‌పోర్టు భూమల సర్వే కోసం వస్తే పరిస్థితి వేరుగా ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
ప్రజాపక్షాన ఉంటేనే రాజకీయ జీవితం
భోగాపురం: ప్రజాప్రతినిధులు ప్రజల పక్షాన ఉంటేనే రాజకీయ జీవితం ఉంటుందని లేదంటే అధోగతి తప్పదని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎంఎల్సీ ఎంవీఎస్ శర్మ అన్నారు. మండలంలోని ఎయిర్‌పోర్టు బాధిత గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ముందుగా ఎ.రావివలస పంచాయతీ దల్లిపేట గ్రామం లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు పదవిలో ఉన్న ఎంఎల్ఏ పతివాడ, మంత్రి మృణాళిని తదితరులు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తేనే పదవుల్లో ఉన్నారన్న విషయం మర్చిపోకూడదని హితవు పలికారు. ప్రజల భిక్షతో పదవులు అలకంరించి ఇప్పుడు ప్రజల భూములను, గ్రామాలను తీసుకుని వారిని అధోగతి పాలు చేస్తే వారికి రాజకీయ జీవితం ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎయిర్‌పోర్టు బాధితులకు అండగా వారి ఉద్యమంలో ఎంఎల్ఏ బాగస్వాములు కావాల్సి ఉందని సూచించారు. తన నియోజకవర్గ ప్రజల ఇబ్బందిని సీఎం దృష్టికి ఎంఎల్ఏ తీసుకువెళ్లలేకపోవడం శోచనీయమన్నారు. ఎయిర్‌పోర్టు పేరుతో అభివృద్ది చేస్తామనడం సరైంది కాదన్నారు. ఇక్కడ ఏ ఏయిర్పోర్టూ రాదు. భూములను తీసుకుని దళారి వ్యాపారం చేసేందుకు చంద్రబాబు అతని వెనుక ఉన్న విద్యా, వైద్య వ్యాపారవేత్తలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భోగాపురం మండలంలో ఎయిర్‌పోర్టు అంశంపై ప్రజలు తెలుపుతున్న నిరసనలను, వారి ఇబ్బందులను వానాకాలం శాసన మండలి సమావేశంలో చర్చించేందుకు ముందుగా గ్రామంలో పర్యటించాలని ప్రొగ్రెసివ్ డెమోక్రసీ ఫ్రంట్ ఎంఎల్‌సి బృందం తనను పంపించిందని చెప్పారు. ఆ విషయమై తాను బాధిత గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ... మండలంలో ఎయిర్‌పోర్టు బాధితుల ఆవేదనను శాసనమండలిలో మాట్లాడేందుకు వచ్చిన ఎంఎల్సీ శర్మను అభినందించారు. సమావేశంలో ఎ.రావివలస సర్పంచ్ ఉప్పాడ శివారెడ్డి, కవు ల వాడ సర్పంచ్ భర్త దాట్ల శ్రీనివాసరాజు మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు బి.సూర్యనారాయణ, జగన్మోహన్, దల్లిపేట మాజీ సర్పంచ్ దల్లి శ్రీనివాస్, కోరాడ అప్పన్న, ఎ. రావివలస ఉపసర్పంచ్ నడుపూరు సత్యనారాయణ నాయుడు పాల్గొన్నారు. -
బావిలో దూకి వివాహిత ఆత్మహత్య
భోగాపురం: మండలంలోని రామచంద్రపేట గ్రామంలో బావిలో దూకి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అప్పలనర్సమ్మ(23)కు, అదే గ్రామానికి చెందిన కొయ్య గోవిందతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. గోవింద రైతుకూలీ. అప్పలనర్సమ్మ కొద్దికాలంగా విజయనగరంలో కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటోంది. శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే విజయనగరం వెళ్లివస్తానని చెప్పి ఇంటి వద్ద నుంచి బయల్దేరింది. సాయంత్రం ఇంటికి చేరలేదు. అప్పటినుంచి అన్నిచోట్ల వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో గ్రామానికి సమీపాన బావిలో ఆమె విగతజీవై పడి ఉండడాన్ని స్థానిక మహిళ గుర్తించింది. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించింది. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా మారిపోయింది. ఆమె వేసుకున్న దుస్తులను బట్టి అప్పలనర్సమ్మగా గుర్తించారు. ఎస్సై దీనబంధు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఏ కష్టం వచ్చిందో.. వివాహిత ఆత్మహత్యపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య వివాదాలేవీ లేవని స్థానికులు చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకునేటంత ఏ కష్టం వచ్చిందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రైతుల మనోభావాల ప్రకారమే పోరాటం
విజయనగరం: బోగాపురం ఎయిర్ పోర్టు ఏర్పాటు చేస్తున్న మండలాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, సీజీసీ సభ్యులు పెన్మత్స సాంబశివరాజు, కాకర్లపూడి శ్రీనివాసరాజు, నియోజకవర్గం కన్వీనర్ పెన్మత్స సురేశ్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి రైతుల మంచి చెడులను అడిగి తెలుసుకున్నారు. ఎయిర్ పోర్టు నిర్మించే గ్రామాల్లో రైతుల మనోభావాలకు అనుగుణంగా పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. అన్ని వేళలా రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని వారు హామీ ఇచ్చారు. -
'భోగాపురంలో ఎయిర్పోర్ట్ వద్దంటే కుదరదు'
విశాఖపట్నం: విజయనగరం జిల్లా భోగాపురంలో ఎయిర్పోర్ట్ వద్దంటే కుదరదని మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం విశాఖపట్నంలో స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా భోగాపురంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు స్థానికులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో అఖిల పక్షం ఆధ్వర్యంలో పలువురు బాధితులు మంగళవారం విశాఖపట్టణంలోని సర్క్యిట్ గెస్ట్ హౌస్‌లో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును కలసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు స్పందించారు. అభివృద్ధి దృష్ట్యా ఎయిర్పోర్ట్ అవసరం అని ఆయన అఖిల పక్ష నేతలకు తేల్చి చెప్పారు. ఏం కావాలో తేల్చుకోండి అంటూ అభిప్రాయం వారికే వదిలేశారు. ఎయిర్‌పోర్ట్‌కు 5551 ఎకరాల భూమి అవసరమని గంటా ఈ సందర్భంగా గుర్తు చేశారు.అందుకోసం 7 గ్రామాల నుంచి భూమిని సేకరిస్తున్నట్లు చెప్పారు. అయితే రైతుల నుంచి బలవంతంగా భూమిని సేకరించడం లేదని... రైతులే స్వచ్చంధంగా ముందుకు వచ్చి భూములు ఇస్తున్నారని గంటా చెప్పారు. భోగాపురంలోని 5వేల ఎకరాల సాగు భూమిలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
సర్వేబృందాన్ని అడ్డుకున్న గ్రామస్తులు
-
నిరుపేద గుండెకు ఎయిర్ పోటు
పచ్చని కొబ్బరితోటలతో జాతీయ రహదారికి అనుకుని ఎంతో ప్రశాంతంగా ఉండే భోగాపురం ఇప్పుడు తీవ్ర ఆందోళన, ఆవేదన, గుండెలను మెలిపెట్టే బాధతో అల్లాడిపోతోంది. మండలంలో ఎక్కువ మంది సన్నకారు రైతులే. ఎవరికీ 5 ఎకరాలకు మించి లేవు. వీరితో పాటు వృత్తి పనివారు, వ్యవసాయ రంగంపై పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న నిరుపేదలే అధికంగా ఉన్నారు. ఇంతవరకూ సాఫీగా సాగుతున్న వారి బతుకుల్లో ఎయిర్ పోర్టు పెను తుపాను సృష్టించింది. తమ బతుకులు ఏమవుతాయోనన్న ఆలోచనతో వారంతా భీతి చెందుతున్నారు. బడాబాబులు ఎగిరే ఎయిర్‌పోర్టు కోసం తమ భూములు, ఇళ్లువాకిళ్లు కోల్పోవలసి వస్తోందన్న బాధ వారి గుండెలను బద్దలు చేస్తోంది. ఇదే బాధతో రామచంద్రపేట గ్రామానికి చెందిన ఓ నిరుపేద గుండె ఆగిపోయింది. భోగాపురం: కులవృత్తే ఆధారంగా ఆ కుటుంబం జీవిస్తోంది. గ్రామంలో రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలతో పాటు అడపా దడపా గృహోపకరణాలు తయారు చేస్తూ వచ్చిన కొద్దిపాటి సొమ్ముతో బతుకుబండి సాగిస్తోంది. అయితే ఎయిర్‌పోర్టు రూపంలో విధి ఆ కుటుంబంతో ఆడుకుంది. తీరని విషాదాన్ని నింపింది. మండలంలోని రామచంద్రపేట గ్రామంలో ముక్కాల త్రినాథ్(43) కులవృత్తి అయిన వడ్రంగి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనిపై ఆధారపడి తండ్రి సాంబశివరావు, తల్లి ఈశ్వరమ్మ, భార్య రోహిణి, కుమార్తెలు భారతి, పావనిలతో పాటు మూగవాడైన తమ్ముడు అప్పలరాజు, అతని భార్య ఇద్దరు పిల్లలు జీవనం సాగిస్తున్నారు. ఇంటిల్లిపాదికోసం కొడుకు కష్టపడడాన్ని చూడలేక తల్లి స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకురాలిగా పనిచేస్తూ చేదోడు వాదోడుగా ఉంటుంది. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం మండలంలో ఎంపిక చేసిన పంచాయతీల్లో రామచంద్ర పేట పంచాయతీ కూడా ఉంది. ఈ గ్రామాన్ని కూడా ఖాళీ చేయాల్సి ఉంటుందని అధికారులు ప్రకటించడంతో త్రినాథ్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దీనికి తోడు అడపా దడపా సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటించడం, సెక్షన్30 అమలు పేరుతో పోలీసులు తమ వాహనాల్లో మైక్‌లతో ప్రచారం చేస్తూ తిరుగుతుండడంతో అతను ఆందోళనకు గురయ్యాడు. ఉన్న ఒక్క ఇల్లు పోతే తన పరిస్థితి ఏంటని ఆవేదనకు గురయ్యాడు. ప్రభుత్వం ఎక్కడో దగ్గర ఇంటి స్థలం అయితే ఇస్తుందని కాని, తనకు కులవృత్తి తప్ప మరో పనిచేతకాదు. ఎక్కడో ఇంటి స్థలం ఇస్తే తనకి అక్కడ పనిదొరుకుతుందా...? తన కుటుంబం పరిస్థితి ఏంటి? అని వేదన పడ్డాడు. తన భార్య వద్ద పలుమార్లు ఆవేదన వ్యక్తం చేయడంతో నలుగురికీ ఎలా జరిగితే మనకీ అలాగే జరుగుతుంది... దిగులు చెంది లాభం లేదు అని సముదాయించేది. అయినా అతని మనసు కుదుట పడలేదు. ఎప్పటిలా శుక్రవారం రాత్రి గ్రామంలో ఉన్న పాన్‌షాపు సమీపంలో గ్రామస్తులంతా సమావేశం అయ్యారు. ఎయిర్ పోర్టు వస్తే మన పరిస్థితి ఏంటని వారంతా రాత్రి 11గంటల వరకు చర్చించుకున్నారు. అనంతరం త్రినాథ్ ఇంటికి చేరుకున్నాడు. ఆందోళనతోనే ఇంటికి వచ్చిన భర్తను చూసి భార్య సముదాయించింది. అయినా అతని మనసు కుదుటపడలేదు. ఆందోళనతో బరువెక్కిన గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. కూర్చున్న చోటే కుప్పకూలిపోయాడు. హఠాత్పరిణామానికి ఏం చెయ్యాలో భార్య రోహిణికి పాలుపోలేదు. కొద్దిసేపటికి తేరుకుని అతన్ని గట్టిగా తట్టి లేపింది, అయినా లేవలేదు. శరీరం చల్లబడిపోయింది. దీంతో పెద్దపెట్టున కేకలు వేసేసరికి చుట్టు పక్కల వారు పరుగున అక్కడకి చేరుకుని అచేతనంగా ఉన్న అతనిని బయటికి తీసుకువచ్చారు. ఇంకేముంది అప్పటికే అతను మరణించినట్లు నిర్ధారించుకున్నారు. కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఘొల్లుమన్నారు. తనకి తలకొరివి పెట్టాల్సిన కొడుకు, ఇంటికి ఆధారమైన కొడుకు కళ్లముందే నిర్జీవంగా పడి ఉండడం చూసిన తండ్రి తట్టుకోలేకపోయాడు. నాన్నా లే నాన్నా అంటూ కుమార్తెలు రోదిస్తున్న తీరు స్థానికులను కంట తడి పెట్టించింది. మాయదారి ఎయిర్‌పోర్టు మా కుటుంబాన్ని ముంచేసింది అంటూ భార్య రోహిణి రోదిస్తోంది. మా జీవితాల్ని ఛిన్నాభిన్నం చేసిన ప్రభుత్వం మట్టి కొట్టుకుపోతుంది అంటూ ఆమె శాపనార్ధాలు పెట్టింది. ఉన్నా, లేకపోయినా హాయిగా బతుకుతున్న కుటుంబం ఎయిర్‌పోర్టు ప్రతిపాదన కారణంగా రోడ్డున పడిందని గ్రామానికి చెందిన సగ్గు పోలిరెడ్డి, సగ్గు గురువులతో పాటు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చాలా జీవితాలు రోడ్డున పడనున్నాయని, మా సమాధుల మీద ఎయిర్‌పోర్టు కట్టుకుని అభివృద్ధి చేసుకోండి... మా ఉసురు తగిలిన అధికారులు, ప్రభుత్వాలు పతనమవ్వడం ఖాయమంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'ఎయిర్పోర్ట్ ఏర్పాటు విరమించుకోవాలి'
భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుపై స్థానికుల ఆందోళనలు ఆగటం లేదు. గురువారం ఉదయం భోగాపురం గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్దకు తరలివచ్చారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్లకార్డులతో ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. -
కొడిగట్టిన కోటి ఆశలు
కాళ్లపారాణి ఆరకముందే... అనంతలోకాలకు రోడ్డు ప్రమాదంలో అక్కాతమ్ముళ్ల మృతి విషాదంలో సబ్బన్నపేట ఆ నవవధువు కాళ్ల పారాణి ఇంకా ఆరలేదు. పెళ్లింటి గుమ్మాలకు కట్టిన తోరణాలు ఇంకా వాడిపోలేదు. కోటి ఆశలతో దాంపత్యజీవితంలోకి అడుగుపెట్టిన నవవధువును రోడ్డుప్రమాదం రూపంలో మృత్యువు తీసుకెళ్లిపోయింది. తిరుపతి వెంకన్నను దర్శించుకునేందుకు భర్త, తమ్ముడు, అత్తవారి కుటుంబసభ్యులతో వెళ్తున్న నవవధువు తన తమ్ముడితో సహా మృత్యువాత పడి కన్నవారికి, కట్టుకున్న వాడికి తీరని శోకాన్ని మిగిల్చింది. తన కుమార్తె, కుమారుడు మృత్యువాత పడ్డారన్న వార్త తెలుసుకున్న కన్నతండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండెలవిసేలా రోదిస్తున్న అతనిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. భోగాపురం: భోగాపురం మండలం గరినందిగాం పంచాయతీ సబ్బన్నపేట గ్రామానికి చెందిన ఉత్తాడ అప్పలరాములు, లక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం. అప్పలరాములు ఆటోనడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కుమార్తె స్వాతి (22) డిగ్రీ చదువుకుంది. కొడుకు కల్యాణ్ (19)బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కుమార్తెకు వివాహ వయస్సు రావడంతో ఈనెల 2వ తేదీన విశాఖపట్నానికి చెందిన యువకుడికిచ్చి ఘనంగా వివాహం చేసి, చీర.సారెతో ఆనందంగా సాగనంపాడు. అయితే వియ్యాలవారు వధూవరులను తీసుకుని కుటుంబసభ్యులతో సహా తిరుపతి వెళ్తున్నాం, మీరూ రావాలని అప్పలరాములును కోరడంతో పనిఒత్తిడి కారణంగా తాను వెళ్లలేక భార్యలక్ష్మి, కొడుకు కల్యాణ్‌లను పంపించాడు. నవ వధువు అయిన కుమార్తె స్వాతితో కుమారుడైన కల్యాణ్‌ను పంపించి తల్లి లక్ష్మి తాను ఇంటివద్దే ఉండిపోయింది. శనివారం రాత్రి కుటుంబసభ్యులు 14మంది వింగర్ వ్యాన్‌లో తిరుపతికి ప్రయాణమయ్యారు. ప్రకాశం జిల్లా కొరిశపాడు- మేదరమెట్ల జాతీయ రహదారిపై వద్దకు వచ్చేసరికి జాతీయ రహదారిపై ఆగి ఉన్న పాలట్యాంకర్‌ను వింగర్ వ్యాన్ వెనుక నుంచి ఢీకొంది. ఈ సంఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందగా మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరణించిన వారిలో నవవధువు స్వాతి, ఆమె తమ్ముడు కల్యాణ్‌తోపాటు కుటుంబ సభ్యులు సింహాద్రి, గోవిందమ్మ, ప్రసన్నకుమార్‌లు ఉన్నారు. సబ్బన్నపేట గ్రామంలో ఉన్న తండ్రి అప్పలరాములుకి ప్రమాద వార్త తెలియగానే ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. తన రెండుకళ్లు అయిన కన్న పిల్లలు తనను వదిలి వెళ్లిపోయారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు కాలికి దెబ్బతగిలి కట్టుకట్టించుకుని మంచంమీద ఉన్న అతను ఏడుస్తున్న తీరు చూపరుల మనసును కలిచివేసింది. తన అన్న పిల్లలను తన చేతులమీద పెంచానని వారికి అప్పుడే నూరేళ్లు నిండిపోయాయా అని మృతుల చిన్నాన్న నేలపై పడి పొర్లిపొర్లి ఏడుస్తుంటే చూపరుల కళ్లు చెమర్చాయి. వైఎస్ఆర్సీపీ సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు అందుబాటులో లేకపోవడంతో బాధితకుటుంబాన్ని ఫోన్లో పరామర్శించి వారికి అండగా ఉండమని పార్టీ కార్యకర్తలైన పోతిన రాంబాబు తదితరులకు సూచనలు అందజేశారు. -
జీఓ 63ను వ్యతిరేకిస్తున్నాం
భోగాపురం: భోగాపురం మండలంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం ప్రభుత్వం విడుదల చేసిన జిఓ నెం.63ని వ్యతిరేకిస్తున్నాం అని సిపిఎం జిల్లా కన్వీనరు టి. సూర్యనారాయణ అన్నారు. స్థానిక మండలపరిషత్ కార్యాలయం ఆవరణలో గురువారం ఉదయం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎయిర్ పోర్టు నిర్మాణానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుచేసి మొత్తం అధికారులను నియమించి ప్యూజ్బులిటీ, ఎన్విరాన్మెంట్,చట్టపరమైన సమస్యలు పరిష్కరించి పనులు ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసిందని దీనిని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. అలాగే ప్రభుత్వం, కలెక్టరు చేస్తున్న ప్రకటనలు రైతులను, గ్రామస్తులను ఆందోళనకు గురిచేసేలా ఉన్నాయన్నారు. ఎయిర్‌పోర్టుకు ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చేందుకు ప్రజలు, రైతులు సిద్ధంగా లేరన్న విషయం తెలుసుకున్నామన్నారు. కావున వారి అభీష్టానికి మద్దతుగా సీపీఎం నిలుస్తుందని, ప్రజల తరఫున ఉద్యమించడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బి. సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఎందుకో అత్యుత్సాహం?
సాక్షి ప్రతినిధి, విజయనగరం :భోగాపురంలో విమానాశ్రయం నిర్మాణంపై ఎయిర్‌పోర్టు అథారటీ అధికారులు తొలుత ఇచ్చిన నివేదికపై సాంకేతిక సహాయ సంస్థ(కన్సల్టెన్సీ ఏజెన్సీ)అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతిపాదిత ప్రాం తంలో కొండలు ఉండటం వల్ల సాంకేతిక సమస్యలొస్తాయని, అలైన్మెంట్లో మార్పు చేయాలని కన్సల్టెన్సీ ఏజెన్సీ ప్రభుత్వానికి నివేదించింది. ఈ నేపథ్యంలో మరోసారి సాంకేతిక కోణంలో అధ్యయనం చేయాలని ఎయిర్‌పోర్టు అథారిటీకి సర్కార్ చూసింది. దానిపై ఇంకా తుది నివేదిక రాలేదు. అయినా భూసమీకరణ పేరుతో రైతుల్ని భయబ్రాంతులకు గురి చేసింది. 15,200 ఎకరాలు అవసరమని అధికారుల్ని రంగంలోకి దించింది. ల్యాండ్ పూలింగ్ కింద భూములిస్తే సరే..లేదంటే భూసేకరణతోనైనా లాక్కుంటామని హెచ్చరించింది. ఇంత చేసినా సర్కార్... సాంకేతికంగా నేటికీ స్పష్టత సాధించలేకపోయింది. తుది నివేదిక వచ్చాక ఈ ప్రాంతం అనుకూలం కాదని చెబితే యూటర్న్ తీసుకోవల్సిందే. కానీ రెండు నెలలుగా గాలిలో మేడలు కట్టినట్టు వేర్వేరు ప్రకటనలు చేసి రైతుల్ని గందరగోళానికి గురి చేస్తోంది. ప్రభుత్వం నడిపిన హైడ్రామాలో చోటు చేసుకున్న పరిణామాలివి. ఏప్రిల్ 26వ తేదీన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి కిమిడి మృణాళిని ఆధ్వర్యంలో విజయనగరం డీఆర్డీఏ సమావేశం మందిరంలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ఎయిర్‌పోర్ట్‌కు 15వేల ఎకరాలు సేకరిస్తున్నట్టు వెల్లడించారు. రాజధాని తరహా ప్యాకేజీని అమలుచేస్తామని, భూములిచ్చిన రైతులకు 16రకాల ప్రయోజలను కల్పిస్తామని ప్రకటించారు. ఈనెల 3 న ఎయిర్‌పోర్టును కేవలం ఆరు వేల ఎకరాల్లోనే ఏర్పాటు చేస్తామని కలెక్టర్ ఎం.ఎం.నాయక్ స్వయంగా ప్రకటన విడుదల చేశారు. ఆ మరుసటి రోజున విశాఖపట్నంలో విజయనగరం, విశాఖ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా అదే ప్రకటన చేశారు. ఈనెల 13న జిల్లాకొచ్చిన పురపాలక మంత్రి పి.నారాయణ ఎయిర్‌పోర్టుపై చేసిన సమీక్షలో ఐదువేల ఎకరాలైతే సరిపోతాయని, ఆమేరకు భూ సమీకరణ చేయాలని సీఎం చంద్రబాబునాయుడు తమకు సూచించారని చెప్పారు. అంతటితో ఆగకుండా ఐదు వేల ఎకరాలు కావొచ్చు...నాలుగు వేలు అవ్వొచ్చు..మూడు వేలు సరిపోవచ్చు... 1000,1500ఎకరాల్లోనైనా నిర్మించొచ్చు అంటూ స్పష్టత లేని ప్రకటన చేశారు. గతంలో 15వేలు ఎకరాలని ఎందుకు ప్రకటించారని అడిగితే మిస్ ఫైర్ అయ్యిందని చెప్పారు. తాజాగా 15న కలెక్టర్ ఎం.ఎం.నాయక్ మీడియాతో మాట్లాడుతూ మూడు వేల ఎకరాల్లోనే భోగాపురం ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విధంగా భిన్నమైన ప్రకటనలు చేసి రైతులతో మైండ్ గేమ్ ఆడుతోంది.. రైతుల నుంచి రియాక్షన్ తెలుసుకునేందుకు నాటకమాడుతోంది. రైతులు ఒప్పుకుంటే పెద్ద ఎత్తున భూసమీకరణ చేసి, వ్యాపారం చేసుకుందామని భావించింది. కానీ, రైతులు సమష్టిగా వ్యతిరేకించడంతో సర్కార్ ప్లాన్ వర్క్ అవుట్ కాలేదు. దీంతో సమీకరించే ఎకరాల మొత్తాన్ని దశల వారీగా తగ్గిస్తూ వచ్చింది. కానీ, దేనికీ రైతుల నుంచి సానుకూలత రాలేదు. అంత భూమి ఎందుకుని ప్రపంచంలో ఉన్న ఎయిర్‌పోర్టుల విస్తీర్ణాన్ని చెబుతూ రైతులు తిప్పికొట్టారు. చివరికీ, 3వేల ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు సర్కార్ చెప్పుకొస్తోంది. -
ఆలయంలో చోరీ
విజయనగరం : విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరవిల్లి గ్రామంలో ఉన్న బంగారమ్మతల్లి అమ్మవారి ఆలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. నిందితులు మంగళవారం తెల్లవారుజామున ఆలయంలో చొరబడి రెండు హుండీలను కొల్లగొట్టారు. సుమారు రూ. 50 వేల నగదు చోరీకి గురైనట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాల కోసం పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. (భోగాపురం) -
భోగాపురంలో విమానాశ్రయం అనుకూలం కాదా?
భోగాపురం (విజయనగరం): భోగాపురంలో నిర్మించనున్న విమానాశ్రయానికి సాంకేతికపరంగా ప్రతికూల వాతావరణం ఉన్నట్టు తెలిసింది. విమాన రాకపోకలకు గాలి దిశ బాగోలేదని సాంకేతిక సిబ్బంది గుర్తించినట్టు సమాచారం. ఈ మేరకు వారు ప్రభుత్వానికి నివేదిక అందించారు. విమానాశ్రయం ఏర్పాటు విషయమై ఈనెల 15న విశాఖలో మంత్రులు విజయనగరం, విశాఖ కలెక్టర్లతో సమావేశం కానున్నారు. అయితే నివేదికను పరిగణలోకి తీసుకుని విమానాశ్రయం నిర్మాణంపై ప్రభుత్వం వెనుక్కు తగ్గుతుందా...లేక ముందుకే వెళుతుందా అన్నది తేలాల్సి ఉంది. -
ఎయిర్పోర్ట్ రగడ
-
పోర్టు పోరు
-
'భోగాపురం ఎయిర్‌పోర్టుకు మేం వ్యతిరేకం'
జిల్లాలోని భోగాపురంలో ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని మాజీ మంత్రి, పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ చెప్పారు. ఎయిర్ పోర్టు నిర్మాణం పేరుతో 15 వేల ఎకరాలు సేకరించడం దారుణమని, నిర్మాణంపై స్థానిక ప్రజలకు, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. విజయనగరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని తరహాలో భూసేకరణ చేస్తామంటే కుదరదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇదే విషయమై రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళిని మాట్లాడుతూ భోగాపురంలో ఎయిర్‌పోర్టు నిర్మాణంపై తర్వలోనే రైతులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడతామన్నారు. భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకొస్తేనే విమానాశ్రయాన్ని ఏర్పాటుచేస్తామని స్పష్టం చేశారు. -
గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి స్థల పరిశీలన
భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటుకు అధికారులు సోమవారం స్థల పరిశీలన చేశారు. మండలంలోని దిబ్బలపాలెం గ్రామంలో విమానాశ్రయ నిర్మాణానికి ప్రతిపాదించిన భూములను విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ప్రాంతీయ డెరైక్టర్ శ్రీవాస్తవ, విశాఖపట్నం విమానాశ్రయం డెరైక్టర్ పట్టాభి, విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ రామారావు, ఆర్డీవో వెంకట్రావ్, తహసీల్దారు లక్ష్మారెడ్డి తదితరులు పరిశీలించారు. సముద్ర తీరానికి ఎంత దూరంలో ప్రతిపాదిత భూములు ఉన్నాయి, విమానాశ్రయానికి అనుకూలమా..కాదా తదితర అంశాలకు సంబంధించి భౌగోళిక అధ్యయనం జరిపారు. తమ భూములు పోతాయేమోనన్న ఆందోళన రైతుల్లో ఉందని, ఎన్ని ఎకరాలు సేకరించనున్నారని విలేకరులు అడగ్గా... తాము కేవలం స్థలం అనుకూలమా? కాదా? అన్న అంశానికే పరిమితమైనట్టు అధికారులు వెల్లడించారు. -
విద్యార్థుల కిడ్నాప్ కు విఫలయత్నం
విజయనగరం : విజయనగరం జిల్లాలోని భోగాపురంలో ఇద్దరు విద్యార్థులను కిడ్నాప్ చేసేందుకు ఆగంతకులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. స్తానికంగా ఉండే గంటాన జగదీష్‌కుమార్(13), కనకరాజు(6) శనివారం ఉదయం స్కూల్ బస్ కోసం రోడ్డు పక్కన వేచి ఉన్నారు. ఇంతలో మాస్కులు ధరించి నల్లటి మారుతి కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారులో ఎక్కాలంటూ పిల్లలను బలవంతం చేశారు. ఎక్కకపోతే చంపుతామని కత్తులతో బెదిరించారు. అయినా విద్యార్థులు కారు ఎక్కకపోయే సరికి, వారిని బలవంతంగా కారులోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. దీంతో భయంతో విద్యార్థులు పెద్దగా కేకలు వేశారు. ఇంతలో స్థానికులు అటుగా రావడంతో దుండగలు విద్యార్థులను వదిలి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సమీప పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. (భోగాపురం) -
పాఠశాలలో రికార్డుల మాయంపై విచారణ
భోగాపురం: విజయనగరం జిల్లాలోని భోగాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్షల రికార్డులు మాయమైన వ్యవహారంపై విచారణ చేపట్టారు. ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ పి.సాయిబాబు శుక్రవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు గుప్తాను విచారించారు. ఇదే పాఠశాలలో చదివిన ఓ విద్యార్థినికి అంగన్వాడీ కేంద్రంలో ఉద్యోగం కోసం ఏడవ తరగతి పాసైనట్లు ప్రధానోపాధ్యాయుడు గతేడాది సర్టిఫికెట్ జారీ చేశారు. అయితే అది తప్పుడు సర్టిఫికెట్ అంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. ఆ తర్వాత పాఠశాలలో 1995 సంవత్సరానికి చెందిన ఏడవ తరగతి పరీక్షల రికార్డులు మాయం అయ్యాయి. ఈ నేపథ్యంలో అసిస్టెంట్ కమిషనర్ సాయిబాబు శుక్రవారం పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందించనున్నట్టు తెలిపారు. -
చీరాల టు కాశీ బై సైకిల్
భోగాపురం: ప్రకాశం జిల్లా కారంచే డు మండలం చీరాలకు చెందిన ఎంఈసీ విద్యాసాగర్ అనే వ్యక్తి సైకిల్‌పై కాశీయాత్రకు ఈనెల 6న బయల్దేరారు. ఆయన యాత్రలో భాగంగా జాతీయ రహదారిపై వెళ్తూ భోగాపురంలో విలేకరులకు బుధవారం కనిపించారు. ఈ సందర్భంగా ఆయనను వివరాలు అడగ్గా ఆధ్యాత్మిక చింతనతో ఈ యాత్ర చేపట్టానని తెలిపారు. ముందుగా కాశీకి వెళ్లి అనంతరం అక్కడినుంచి శబరిమలై చేరుకుని అక్కడినుంచి చీరాల చేరుకుంటానని తెలిపారు. తాను వెళ్తున్న దారిలో ఉన్న గ్రామాల్లో రాత్రి పూట బసచేసి గ్రామస్తులు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండేలా వారికి అవగాహన కల్పిస్తున్నానన్నారు. హింసను విడనాడి ఎదుటి వారికి సహాయ పడేలా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలనేదే తన ముఖ్య ఉద్దేశమని తెలిపారు. -
మాకే సాయమూ అందలేదు
రాకాసి గాలులకు పడిపోయిన చెట్లకు చిన్న చిన్న చిగుళ్లు వచ్చాయి. కూలిపోయిన ఇళ్ల స్థానంలో కొత్తవి రూపుదిద్దుకుంటున్నాయి. చిందరవందరగా మారిన తీరం ఇప్పుడు సర్దుకుంటోంది. ఇదిగో ఇప్పుడు వచ్చారు అధికారులు ‘మీ నష్టమెంత’ అని అడగడానికి. తుపాను వెళ్లిన నలభై రోజుల తర్వాత కేంద్ర బృందం జిల్లాలోని పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించింది. ఈ సందర్భం గా స్థానికులతో అధికారులు మాట్లాడారు. అయితే అధికారుల ప్రశ్నలకు మెజారిటీ ప్రజలు ఇచ్చిన జవాబు మాత్రం ‘మాకే సాయమూ అందలేదు’ అనే... భోగాపురం: తుపాను వెలిసిన నలభై రోజుల త ర్వాత వచ్చిన కేంద్ర బృందం వద్ద బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మండలంలోని హుద్‌హుద్ ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం బుధవారం ఆయా ప్రాంతాల్లో పర్యటించింది. ముందుగా కవులవాడలో పడిపోయిన ఇళ్లను, కొబ్బరి తోటలను పరిశీలించింది. అనంతరం తూడెం గ్రామంలో కూలిన కొబ్బరి తోటలను అధికారులు పరిశీలించారు. దీనిపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. అక్కడ స్థానికులతో అధికారులు నష్టంపై మాట్లాడారు. అనంతరం దిబ్బలపాలెం గ్రామానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి తమకు బియ్యం తప్పించి ఎలాంటి సాయం అందలేదని బాధితులు తెలిపారు. ఇల్లు కూలిపోయినా నమోదు చేయలేదన్నారు. అనంతరం అధికారులు బమ్మిడి పేట వద్ద తుపానుకు కొట్టుకుపోయిన ఆర్అండ్బీ రోడ్డును పరిశీలించారు. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో 20వంతెనలు పాడయ్యాయని దానికి రూ.65లక్షలు అవసరం అవుతుందని సంబంధిత శాఖ అధికారులు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో తారు రోడ్లకు కిలోమీటరుకి రూ.10లక్షల చొప్పున మెయింటనెన్స్‌కి నిధులు అవసరమని తెలిపారు. అనంతరం ముక్కాం గ్రామంలో పర్యటించారు. ఇక్కడ మత్స్యశాఖ ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా మత్స్యకారులకు అందాల్సిన సాయంపై మ త్స్యశాఖ ఏడి ఫణిప్రకాష్ వివరించారు. ఇక్కడి మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని ఆయన కేంద్ర బృందం దృష్టికి తీసుకు వెళ్లారు. అనంతరం భోగాపురం గ్రామానికి చేరుకుని పశుసంవర్ధక శాఖ అధికారులతో మాట్లాడారు. తుపాను కారణంగా చనిపోయిన పశువులు, కోళ్ల పారాల్లో కోళ్లు, గొర్రెలు తదితర ఫొటోలను పరిశీలించారు. కార్యక్రమంలో బృంద సభ్యులు కృష్ణ, గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ ఎస్ఈ ఎం. రమేష్‌బాబు, ఫైనాన్స్ కమిషన్ సీనియర్ డెరైక్టరు రాజీబ్ కుమార్, కేంద్ర పశుసంవర్ధక శాఖ విభాగం డిప్యూటీ సెక్రటరీ పి.ఎస్. చక్రబర్తీ, గ్రామీణాభివృద్ది మంత్రిత్వశాఖ అండర్ సెక్రటరీ రామవర్మ తోపాటు జెడ్పీ చైర్మన్ శోభా స్వాతి రాణి, ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడు, ఎంపీపీ కర్రోతు బంగార్రాజు, మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ దంతులూరి సూర్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. ‘తీరని శోకమిది’ పూసపాటిరేగ: మండలంలోని తిప్పలవలస గ్రామంలో హుద్‌హుద్ కారణంగా మత్స్యకారులకు జరిగిన నష్టాన్ని కేంద్రబృందం సభ్యులు బుధవారం పరిశీలించారు. తీర ప్రాంతంలో జరిగిన నష్టాన్ని మత్స్యశాఖ ఏడీ ఫణిప్రకాష్ కేంద్ర బృంద సభ్యులకు వివరించారు. తుపాను ప్రభావంతో 22 మత్స్యకార గ్రామాల్లో రూ.కోట్లలో నష్టం జరిగిందని, వలలు, పడవలతో పాటు ఇళ్లకు కూడా నష్టం జరిగిందని బృంద సభ్యులకు వివరించారు. స్థానిక సర్పంచ్ భర్త వాసుపల్లి అప్పన్న గ్రామంలో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి తెలియజేశారు. అలాగే కలెక్టర్ ఎం.ఎం నాయక్ తీరప్రాంతంలో జరిగిన నష్టం,తుపాను సమయంలో అప్రమత్తమైన విధానాన్ని తెలిపారు. బృంద సభ్యులతో పాటు జేసీ రామారావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, ప్రత్యేక అధికారి వి.ఆదినారాయణ, తహశీల్దార్ జి.జయదేవి, ఎంపీడీఓ డి.లక్ష్మి, ఎంపీపీ మహం తి చిన్నంనాయుడు, జెడ్పీటీసీ ఆకిరి ప్రసాదరావు, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. పంటనష్టంపై ఫొటో ఎగ్జిబిషన్ మండలంలోని కుమిలి గ్రామం పరిధిలో దెబ్బతిన్న పంటలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర బృందం సభ్యులు బుధవారం రాత్రి తిలకించారు. తుపాను కారణంగా నష్టపోయిన పంటలు విషయమై కుమిలి సర్పంచ్ దల్లి ముత్యాలురెడ్డి కేంద్రబృందం సభ్యులకు వివరించారు. రామతీర్థసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తరఫున నిదులు మంజూరు చేయాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడు కోరారు. దీంతో బృందం సభ్యులు రామతీర్థసాగర్ రిజర్వాయర్ ట్యాంకును పరిశీలించారు. దీనిపై ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. -
విషాద జాతర
పండగవేళ అక్కడ విషాదం వికృత నృత్యం చేసింది... వారి సంతోషాన్ని చంపావతి నది చంపేసింది. గ్రామ దేవత జాతర కోసం వచ్చిన నలుగురిని పొట్టనపెట్టకుని కన్నవారికి కడుపు మంట మిగిల్చింది. నిమిషం ముందువరకూ ఆడు తూపాడుతూ కేరింతలు కొట్టిన ఆ యువకులు విగత జీవులుగా పడి ఉండడంతో ఊరు గొల్లుమంది. అమ్మా, పాదాలమ్మ తల్లీ నీ పండుగ కోసం... నీకు పసుపు కుంకుమలు సమర్పించేందుకు వచ్చాం తల్లీ.. నీకు కనికారం కలగలేదా..మా బిడ్డలను రక్షిం చలేకపోయావా...ఇదేనా నీవు మామీద చూపించే దయ అంటూ మృతుల తల్లిదండ్రులు, తోబుట్టువులు కటుంబ సభ్యులు నదీ తీరంలో గుండెపగిలేలా రోదిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టింది. భోగాపురం : మండలంలోని గరే నందిగాం గ్రామానికి చెందిన కొంతమంది బతుకు తెరువుకోసం కొన్నేళ్ల కిందట విశాఖ వెళ్లారు. వారిలో కొంతమంది ప్రైవేటు కంపెనీల్లో, మరికొంతమంది తాపీమేస్త్రీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరంతా విశాఖపట్నం సమీపంలోని పోతినమల్లయ్యపాలెం వద్ద లక్ష్మివానిపాలెంలో నివాసముంటునన్నారు. అయితే వారు ప్రతీ ఏటా గ్రామంలో ఉన్న పాదాలమ్మ అమ్మవారి జాతర కోసం గరే నందిగాం వచ్చి పసుపు కుంకుమలు అందిచండం ఆనవాయితీ. అమ్మవారికి ప్రధమ పూజారులుగా వారు ఉంటూ వస్తున్నారు. గ్రామస్తులు పండగ జరిపే సమయంలో అమ్మవారికి ముందుగా సమర్పించిన బలిని వారికి అందజేసి అనంతరం పండగ నిర్వహిస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. ఈ నేపథ్యంలో సోమవారం గ్రామానికి చేరుకున్న వారంతా మంగళవారం అమ్మవారికి పసుపు కుంకులు సమర్పించి మొక్కులు చెల్లించి జాతర నిర్వహించారు. అలాగే బుధవారం అమ్మవారికి బలులు సమర్పించి, మధ్యాహ్నం భోజనాలు అనంతరం తిరిగి విశాఖ వెళ్లిపోవాల్సి ఉంది. ఇంటివద్ద పెద్దలు ఆపనిలో నిమగ్నమై ఉండగా సుమారు ఉదయం 7.30 గంటల ప్రాంతంలో పోతిన వెంకట అప్పారావు, బెర్జి మహేష్ (23), గరే శివ (24), పోతిన రాము (25) కొత్తపల్లి రాజేష్ (15)లు గ్రామానికి ఆనుకుని ఉన్న చంపావతి నదిలోకి స్నానానికి వెళ్లారు. మహేష్, శివ, రాము, రాజేష్ ఒకరి తరువాత ఒకరు నదిలో స్నానానికి దిగారు. వారు దిగిన చోట బాగాలోతు ఉన్న విషయం వారికి తెలియదు. దీంతో ఒకరి వెనుక ఒకరు ఆ గుమ్మిలోకి జారిపోయారు. చివరగా ఉన్న వెంకట అప్పారావు వారిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో అతను గ్రామంలోకి పరుగెత్తి విషయాన్ని గ్రామస్తులకు తెలిపాడు. వెంటనే వారంతా నది ఒడ్డుకు చేరుకుని మృతదేహాల కోసం గాలించారు. నదీ ప్రవాహ వేగం ఎక్కువగా లేకపోవడంతో దగ్గరలోనే మృతదేహాలన్నీ లభ్యమయ్యాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున నది ఒడ్డుకు చేరుకున్నారు. మృతదేహాలను చూసిన వారి దుఃఖం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా నదీ తీరం వారి రోదనలతో నిండిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐలు దీనబంధు, లోవరాజులు సంఘటనాస్థలం వద్దకు చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. వైఎస్ఆర్ సీపీ సిఇసి మెంబరు కాకర్లపూడి శ్రీనివాసరాజు ఫోనులో బాధిత కుటుంబాలకి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎంపీపీ కర్రోతు బంగార్రాజు, ఏఎంసీ మాజీ చైర్మన ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, మాజీ జెడ్పిటిసి భెరైడ్డి ప్రభాకరరెడ్డి, సుందర గోవిందరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు మజ్జి శ్రీనివాస్, పిళ్లా విజయకుమార్, యడ్ల ఆదిరాజు, పడాల శ్రీనువాసరావు, కందుల రఘుబాబు, గరే కాళిదాసు తదితరులు బాధితులను పరామర్శించి, అవసరమైన సహాయ సహకారాలు అందించారు. ఒకే ఇంట్లో ఇద్దరు గరే శివ, పోతిన రాము బావమరుదులు. ఏడాదిన్నర క్రితం శివ చెల్లిన పెళ్లాడిన రాముకి ఆరు నెలల పాప ఉంది. దగ్గరి బంధువులైన వీరిద్దరూ ప్లంబింగ్ పనులు చేస్తున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరిద్దరిని నది రూపంలో మత్యువు కబళించింది. వీరి మృతితో శివ తండ్రి రామచంద్రరావు, రాము తండ్రి తాత కన్నీరుమున్నీరుగా విలపించారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. వద్దంటే వెళ్లాడు.. కాటపల్లి రాజేష్ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అతడి తండ్రి ఇటీవల మరణించాడు. అతనికి అక్క, అన్నయ్య ఉన్నారు. తల్లి కుట్టు మెషీన్ ఆధారంగా కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. వద్దన్నా వినకుండా మంగళవారం సాయంత్రం గరే నందిగాంలో గ్రామ దేవత పండక్కి వెళ్లాడు. ఇంతలోనే ప్రమాదంలో మృతి చెందడంతో తల్లి గుండెలవిసేలా రోదించింది. వ ద్దంటే వెళ్లాడు అందనిలోకాలకు చేరుకున్నాడంటూ విలపిస్తోంది. ఒక్కగానొక్క కొడుకు దూరం విజ్జి కనకరావుకు ఒక్కగానొక్క కొడుకు మహేష్. అతడికి ఒక చెల్లి ఉంది. ఓ కాంట్రాక్టర్ వద్ద పనులు చేస్తున్నాడు. కుటుంబానికి ఆధారంగా ఉన్న అతడ్ని మత్యువు కబళించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు విలపిస్తున్నారు. తమ కుమారుడు ఇకలేడనే వార్త వారిని తీవ్ర మనోవేదనకు గురిచేసింది. చుట్టుపక్కలవారితో కలుపుగోరుగా ఉండే మహేష్ మతితో స్థానికులు విచారంలో మునిగిపోయారు.