5న భోగాపురానికి వైఎస్ జగన్ | On 5th YS Jagan to bhogapuram | Sakshi
Sakshi News home page

5న భోగాపురానికి వైఎస్ జగన్

Published Fri, Oct 2 2015 3:05 AM | Last Updated on Tue, Oct 30 2018 5:23 PM

5న భోగాపురానికి వైఎస్ జగన్ - Sakshi

5న భోగాపురానికి వైఎస్ జగన్

సాక్షి ప్రతినిధి, విజయనగరం: గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం విషయంలో ప్రభుత్వం దిగొచ్చేంత వరకు వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు చెప్పారు. ఈ ఎయిర్‌పోర్టు కింద భూములను కోల్పోతున్న బాధితులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 5న భోగాపురం వస్తున్నారని తెలిపారు.

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పలు గ్రామాల్లో జగన్ పర్యటిస్తారన్నారు. ఆయా గ్రామాల్లో సుజయ్‌కృష్ణ రంగారావు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు తదితరులు గురువారం పర్యటించారు. సుజయ్‌కృష్ణ రంగారావు, కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ... 5వ తేదీన  జగన్ రాజాపులోవ జంక్షన్ నుంచి ప్రారంభమై కవులవాడ, ఎ.రాయివలస, గూడపువలస గ్రామాల్లో పర్యటిస్తారని చెప్పారు. గూడపువలసలో బహిరంగసభలో మాట్లాడుతారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement