Greenfield Airport
-
విశాఖ.. వైభోగం
సాక్షి, విశాఖపట్నం: గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన, డేటా సెంటర్‌కు భూమి పూజ చేసి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ నగరాన్ని అభివృద్ధిలో మరో మెట్టు ఎక్కించారు. ఆర్థిక రాజధానిగా భాసిల్లుతున్నా.. ప్రధాన నగరాలతో అన్ని రంగాల్లో పోటీ పడుతున్నా.. ద్వితీయ శ్రేణి నగరంగానే మిగిలిపోయిన విశాఖను.. టైర్–1 సిటీల సరసన నిలబెట్టేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రగతి పరుగును ప్రారంభించారు. ముఖ్యమంత్రి పర్యటనతో మురిసిన ఉత్తరాంధ్ర.. ఇకపై తమ ప్రాంతాన్ని వలసల ప్రాంతమని కాకుండా, విప్లవాత్మక అభివృద్ధి కేంద్రంగా పిలవాలంటూ నినదించింది. సెపె్టంబర్ నుంచి ఇక్కడే పరిపాలన ప్రారంభిస్తానంటూ సీఎం పునరుద్ఘాటించడంతో ఇక్కడి ప్రజల్లో ఉత్సాహం మరింత జోరందుకుంది. ప్రపంచంలో ఏ నగరం చూసుకున్నా కనెక్టివిటీతోనే అభివృద్ధి చెందింది. విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా భారత నౌకాదళంతో అనుసంధానమై ఉంది. దీంతో విదేశాలకు విమానాలు ఎగిరే అవకాశాలు తక్కువగా ఉండటంతో అభివృద్ధిలో అంతంతమాత్రంగానే మిగిలిపోయింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాకతో ఇకపై ప్రపంచ దేశాలకు కనెక్టివిటీ పెరగనుంది. తద్వారా ఉత్తరాంధ్ర, సరిహద్దు జిల్లాలు అభివృద్ధి పథంలో పరుగులు పెట్టనున్నాయి. ఎయిర్‌పోర్టు రాకతో ఈ ప్రాంత ఎకానమీ మారనుంది. భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి 2026 నాటికి తొలి విమానం ఎగరనుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో.. ఉత్తరాంధ్రకు మంచిరోజులొచ్చాయని ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ ఎయిర్‌పోర్టును రూ.4,592 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. విశాఖ–భోగాపురం.. ఆరు లైన్ల రాదారి పేరుకే భోగాపురం విమానాశ్రయం అయినప్పటికీ.. వైజాగ్ ఎయిర్‌పోర్టుగానే వ్యవహరించనున్నారు. ఎందుకంటే విశాఖపట్నం నుంచే ఎక్కువగా రాకపోకలు సాగనున్నాయి. అందుకే మహా నగరాన్ని భోగాపురంతో అనుసంధానించేందుకు ఆరులైన్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణం కూడా జరగనుంది. మరో నాలుగు నెలల్లో దీనికి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఆరులైన్ల ఎక్స్‌ప్రెస్ హైవేను రెండు భాగాలుగా నిర్మించనున్నారు. హైవే రాకతో బీచ్‌రోడ్డుతో పాటు భీమిలి నుంచి భోగాపురం వరకు ఆయా ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందనున్నాయి. ఆసియా డేటా సెంటర్ రాజధానిగా విశాఖ మధురవాడలోని ఐటీ హిల్–4లో డిజిటల్ విప్లవం మొదలుకానుంది. ఇది కేవలం విశాఖకే పరిమితం కాదు. యావత్ ఆసియా దేశాలకు పెద్దన్నగా మారనుంది. డేటా సెంటర్, టెక్నాలజీ బిజినెస్ సెంటర్లను 190 ఎకరాల్లో రూ.21,844 కోట్లతో అదానీ సంస్థ నిర్మిస్తోంది. ఏడేళ్లలోపు పూర్తికానున్న ఈ ప్రాజెక్టు ద్వారా 20 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 20 వేల మందికి పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు రానున్నాయి. సాంకేతికత రాజ్యమేలుతున్న నేపథ్యంలో.. విశాఖ నగరం డిజిటల్ రంగంలో ఆసియాకు రాజధానిగా భాసిల్లనుందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. 2030 నాటికి 1 గిగావాట్ డేటా సెంటర్‌గా ఇది దశలవారీగా అభివృద్ధి చెందనుంది. డేటా స్టోరేజ్ పెంచడంతో పాటు కృత్రిమ మేధ ఆవశ్యకత తెలిపేలా డిజిటలైజేషన్ విస్తరించడం, డేటా వేగం పెరగడం.. ఇలా విభిన్నమైన ప్రయోజనాలు అందించే ఈ ప్రాజెక్టు ద్వారా ఐటీ పరిశ్రమలు విశాఖకు క్యూ కట్టనున్నాయి. ఫలితంగా మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉత్తరాంధ్ర యువతకు రానున్నాయి. సింగపూర్ నుంచి సబ్ మెరైన్ కేబుల్‌ను తీసుకొస్తూ.. డేటాసెంటర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్ మరింత పెరగనుంది. దీని ద్వారా పరిశ్రమలకే కాకుండా.. ప్రజలకు కూడా ఈ ప్రాజెక్టు వరంలా మారనుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధిని ఓ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయడం తమ అభిమతం కాదనీ.. ఒక ప్రాజెక్ట్ ఏర్పాటైతే.. ఆ ప్రాంతంతో పాటు దాని పరిసరాలు కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోవాలన్న కాన్సెప్‌్టతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కంకణం కట్టుకున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. త్వరలోనే ప్రథమ శ్రేణి నగరంగా.. దక్షిణ భారత దేశంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ సిటీగా, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా.. ఫిన్‌టెక్ హబ్‌గా.. ఇలా విభిన్న రంగాల్లో దూసుకుపోతున్న విశాఖ.. ఇంకా ద్వితీయ శ్రేణి నగరంగానే ముద్రపడిపోయింది. అందుకే వైజాగ్‌ను ప్రథమ శ్రేణి నగరాల సరసన చేర్చేందుకు కృషి చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ డేటా సెంటర్ శంకుస్థాపన సందర్భంగా ప్రకటించారు. అలాగే సెపె్టంబర్ నుంచి విశాఖ కేంద్రంగానే పరిపాలన సాగిస్తామంటూ ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు. -
జిల్లా ప్రజలకు కానుకగా అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం
సింహపురి ప్రజల చిరకాల వాంఛ విమానయానం యోగం త్వరలో నెరవేరనుంది. ఐటీ, పరిశ్రమలకు కేంద్రాలుగా ఉన్న చెన్నై, బెంగళూరుకు కూడలిగా నెల్లూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది. నెల్లూరుకు అతి సమీపంలో కృష్ణపట్నం పోర్టు, పవర్ ప్రాజెక్ట్‌లతో పాటు విభిన్న జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమల ఇంటిగ్రేటెడ్ సెజ్‌లు ఉన్నాయి. ప్రతిపాదిత విమానాశ్రయానికి సమీపంలో భారీ ఓడరేవు, నౌకా నిర్మాణ కేంద్రం, ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే.. ఇక్కడ నుంచి దేశ విదేశాలకు ప్రయాణ సౌకర్యం, కార్గో రవాణా వ్యవస్థ అభివృద్ధి సాధించనుంది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ ప్రతిపాదన గత ప్రభుత్వ హయాంలో కేవలం రన్ వేగా మారింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జిల్లా ప్రజల కల సాకారం అవుతోంది. సాక్షి, కావలి: కావలి నియోజక వర్గంలోని దగదర్తి మండలం దామవరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పురుడు పోసుకున్న అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా ప్రజలకు కానుకగా ఇవ్వనున్నారు. గత టీడీపీ పాలనలో విమానాశ్రయ నిర్మాణ ప్రక్రియ క్రమక్రమంగా శల్యమై ఒక దశలో నిర్మాణ ప్రతిపాదనలు రద్దు ప్రకటనలు కూడా వచ్చాయి. అప్పటి ప్రతిపక్షంతో పాటు ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆఖరుకు కేవలం రన్‌వే నిర్మాణానికి అధికారం అంతిమ దశలో శంకుస్థాపన చేసి టీడీపీ చేతులు దులుపుకుంది. ప్రభుత్వం మార్పు జరగడంతో అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంను అవసరమైన పనులు వేగంగా జరుగుతున్నాయి. కేంద్ర విమానాయానశాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ విభాగం దామవరం విమానాశ్రయం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండం గమనార్హం. దేశంలో విమానాశ్రయాలను పర్యవేక్షించడం, విమానాల రాకపోకల సమయాలను నిర్ధారించడం, విమానాశ్రయాలకు విమానాలు ల్యాండింగ్ వసతి కల్పించడం వంటి కార్యకలాలన్నీ కూడా ‘ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ అధికారికంగా పన్యవేక్షిస్తోంది. దీని వల్ల దామవరం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణాన్ని అదే సంస్థ చేపడితే అటు విమాన రాకపోకల సంఖ్యను మరిన్ని ఖరారు చేయడానికి, తద్వారా ప్రయాణికులకు సౌలభ్యత పెంచడం ద్వారా విమానాశ్రయం ప్రాధాన్యత పెరగడానికి దోహదపడుతుంది. కార్గో హ్యాండ్లింగ్ అంటే సరుకు రవాణా ద్వారా పెద్ద ఎత్తున జరగడానికి మార్గం సుగమం అవడం ద్వారా విమానాశ్రయం ఆర్థికంగా లాభాల బాట పట్టడానికి అవకాశం ఉంది. దామవరం వద్ద నిర్మించే అంతర్జాతీయ విమానాశ్రయం నమూనా ఎయిర్ పోర్టు స్వరూపం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతానికి ప్లాన్ ప్రతిపాదనలను ‘ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ రూప కల్పన చేసింది. ఈ విమానాశ్రయం కోసం మొత్తం 1379.71 ఎకరాలను భూసేకరణ చేయాల్సి ఉండగా, వాటిలో 1,061.095 ఎకరాల భూమిని భూసేకరణ ప్రక్రియ ముగిసింది. మిగిలిన 318.615 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ భూమిపై కొన్ని వివాదాల నెలకొని ఉండటంతో ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు నిర్ణయాలు తీసుకొని అమలు చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. ► ఈ విమానాశ్రయం నెల్లూరుకు 30 కిలో మీటర్లు దూరంలో ఉత్తరం వైపున చెన్నై–విజయవాడ జాతీయ రహదారిపై పక్కనే దామవరం వద్ద నిర్మిస్తున్నారు. కావలికి 32 కిలో మీటర్లు, గూడూరుకు 52 కిలో మీటర్లు, 65 కిలో మీటర్లలో కందుకూరు (ప్రకాశం జిల్లా) పట్టణాలు ఉన్నాయి. ► విమానాశ్రయం నిర్మించే ప్రాంతంలో ఉత్తర–పడమర నడుమ 6 మీటర్ల ఎత్తులో తిప్పలు ఉన్నాయి. అందుకే రన్ వే ను పడమర వైపు క్లోజ్ అయ్యేటట్లుగా, విమానాలు తూర్పు వైపు నుంచి ల్యాండింగ్ అయ్యేటట్లుగా రన్ వే ను నిర్మించనున్నారు. ► 30 మీటర్లు వెడల్పు, 3,150 మీటర్లు పొడవు ఉండే రన్ వే ను నిర్మిస్తారు. ► 2030 నాటికి ఏడాదికి 5 లక్షల మంది ఈ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగిస్తారని అంచనా. ► 2045 నాటికి ఏడాదికి 19 లక్షల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకొంటారని అంచనా వేశారు. ► ప్రధానంగా కార్గో అంటే సరుకులు ఎగుమతి, దిగుమతులు పెద్ద ఎత్తున జరిగే విమానాశ్రయంగా దామవరం విమానాశ్రయం రూపుదిద్దుకోవడానికి అవకాశం ఉందని నిపుణులు పేర్కొటున్నారు. ► విమానాశ్రయ పరిపాలన ప్రధాన భవనమైన ‘టెర్మినల్’ బిల్డింగ్‌ను 4,000 చదరపు మీటర్లు విస్తీర్ణంలో నిర్మిస్తారు. రెండు ప్రధాన గేట్లు ఉండే ఈ విమానాశ్రయంలో చెక్ ఇన్ కౌంటర్లు–8, బ్యాగ్ చెక్ కౌంటర్లు– 2 ఏర్పాటు చేయనున్నారు. ► టెర్మినల్ బిల్డింగ్‌లో 1,400 మందికి వసతి ఉండేలా 10,000 చదరపు మీటర్లు ఉండే ఈ భవనాన్ని నిర్మించనున్నారు. ► విమానాశ్రయం చుట్టూ 10,762 మీటర్లు ప్రహరీ 3 మీటర్లు ఎత్తులో నిర్మించనున్నారు. ప్రత్యేకతలు.. ప్రయోజనాలు దామవరం వద్ద రూ.5,600 కోట్లతో నిర్మించనున్న భారీ విమానాశ్రయానికి ఎన్నో ప్రత్యేకతలు.. ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాపార రీత్యా లాభసాటిగా ఉంటుందనే విమానయాన రంగ నిపుణుల సూచనలను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. జిల్లా కేంద్రమైన నెల్లూరుకు, ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుకు సమీపంలో ఉంది. దేశంలో విశిష్టత ఉన్న కోల్కత్తా– చెన్నై జాతీయ రహదారికి పక్కనే ఈ ఎయిర్‌పోర్టు ఉంది. విశాఖపట్నం–చెన్నై కోస్టల్, పరిశ్రమల కారిడార్ పరిధిలో ప్రాధాన్యత ఉన్న ప్రదేశంలో ఉంది. నిత్యం దేశ విదేశాల నౌకలు రాకపోకలతో ప్రైవేట్ నౌకాశ్రయాలకు వ్యాపార సవాల్ విసురుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్న కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో ఉంది. జాతీయ, అంతర్జాతీయ విభిన్న పరిశ్రమలతో ఇంటిగ్రేటెడ్ సెజ్‌గా ప్రఖ్యాతగాంచిన ‘శ్రీసిటీ’ సెజ్‌కు ఉపయోగపడనుంది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో కావలికి సమీపంలోని రామాయపట్నం సముద్రతీరంలో ‘పోర్టు కమ్ షిప్ యార్డ్ (భారీ ఓడరేవు, నౌకా నిర్మాణ కేంద్రం) నిర్మాణ జరగడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అతి సమీపంలో కేవలం 25 కిలో మీటర్ల దూరంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కూడా త్వరలో అందుబాటులోకి రానుంది. -
అధ్యయనం తర్వాతే ఎయిర్ పోర్టు !
సాక్షి, జక్రాన్‌పల్లి (నిజామాబాద్): జక్రాన్‌పల్లి మండలంలో ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత స్థలాన్ని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. ఇక్కడ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు ప్రతిపాదన ఉంది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా కన్సల్టెన్సీ డీజీఎం అమిత్ కుమార్‌తో పాటు ఏజీఎంలు నీరవ్ గుప్తా, కుమార్ వైభవ్‌లు స్థల పరిశీలనకు వచ్చారు. ల్యాండ్ ఓరియంటేషన్, విండ్ డైరెక్షన్, ల్యాండ్ ఫిజిబులిటీ వివరాలు సేకరించారు. వీటన్నింటిని అధ్యయనం చేసిన అనంతరం డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిన డీపీఆర్ ప్రకారం ఎయిర్‌పోర్టుకు ఈ స్థలం అనుకూలమా.. కాదా అనేది తేలుతుంది. కాగా ఎయిర్ పోర్టు ప్రతినిధుల బృందం సభ్యులు జక్రాన్‌పల్లి, మనోహరాబాద్, తొర్లికొండ, కొలిప్యాక్, అర్గుల్ గ్రామాల పరిధిలో గల 850 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం డీజీఎం అమిత్ మిష్రా మాట్లాడుతూ జక్రాన్‌పల్లిలో ఎయిర్‌పోర్టు అభివృద్ధి కోసం అవసరమైన స్థలాన్ని పరిశీలించామన్నారు. ఫ్యూచర్లో జాతీయ రహదారిపై ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడడం, ఎయిర్‌పోర్టు మొత్తం విస్తీర్ణం, రన్ వే ఓరియంటేషన్ తదితర విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తామన్నారు. అనంతరం డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ప్రతినిధుల బృం దంతో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ రవీందర్ రావు, «ఆర్డీవో శ్రీని వాస్, తహసీల్దార్ కిషన్, ధర్పల్లి జెడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్, ఎంపీపీ దీకొండ హరిత, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన గ్రీన్‌పీల్డ్ విమానాశ్రయ భూ నిర్వాసితులు
-
రూపాయికే ఎకరం
తొలుత రూ.8 లక్షలకు కేటాయిస్తూ జీవో ఎకరం రూ.లక్ష చొప్పున ఇవ్వాలని కోరిన బీఐఏసీఎల్ తీవ్రంగా స్పందించి రూపాయికే కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం సర్కారు తీరుపై రెవెన్యూ అధికారుల విస్మయం సాక్షి, అమరావతి: భలే చౌక భేరం. రూపాయికే ఎకరా భూమి. రూ.638కే 638 ఎకరాల భూమి కేటాయింపు. భూమి కోరిన సంస్థ ఎకరా రూ.లక్షకు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం అంత మొత్తం ఎందుకు? రూపాయికే ఇస్తామంది. చెప్పడమే కాదు రూ.638.83కు 638.83 ఎకరాలు కేటాయిస్తూ రెవెన్యూ శాఖ సోమవారం ఏకంగా జీవో జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కర్నూలు జిల్లాల్లో 638.83 ఎకరాలు కేటాయించాలని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కార్పొరేషన్ లిమిటెడ్ (బీఐఏసీఎల్) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీనిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలంలోని ఓర్వకల్, కన్నమడకల, పుదిచెర్ల ప్రాంతాల్లో ఎకరా రూ.8 లక్షల మార్కెట్ ధరతో 638.83 ఎకరాలు కేటాయించవచ్చంటూ గత ఏడాది నవంబరు 12వ తేదీన ప్రతిపాదన పంపించారు. రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య సంస్థ (ఏపీఎల్‌ఎంఏ) గత ఏడాది నవంబరు 17వ తేదీన సమావేశమై కర్నూలు జిల్లా కలెక్టరు ప్రతిపాదనను యథాతథంగా ఆమోదించింది. ఎకరా రూ. 8 లక్షల మార్కెట్ ధరతో బీఐఏసీఎల్‌కు 638.83 ఎకరాలు కేటాయించాలని ఏపీఎల్‌ఎంఏ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనిని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. ఈ మేరకు ఎకరా రూ.8 లక్షల ధరతో 638.83 ఎకరాలను బీఐఏసీఎల్‌కు కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలంలోని ఓర్వకల్, కన్నమడకల, పుదిచెర్ల ప్రాంతాల్లో కేటాయిస్తూ రెవెన్యూ శాఖ గత నెల మూడో తేదీన జీవో నంబరు 46 జారీ చేసింది. ఈ మేరకు ఈ సంస్థకు మార్కెట్ విలువకు భూమిని కేటాయించినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆగమేఘాలపై ధర తగ్గింపు ఉత్తర్వులు ప్రజాప్రయోజనాల కోసమే విమానాశ్రయం నిర్మాణానికి ముందుకు వచ్చామని, ఇంత ధరతో భూమి కేటాయిస్తే గిట్టుబాటు కాదని బీఐఏసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ లేఖ రాయడంతో ప్రభుత్వం ఆగమేఘాలపై స్పందించింది. అంత ధరతో భూమి కేటాయిస్తే భారమవుతుందని, ఎకరా రూ. లక్ష నామమాత్రపు ధరతో కేటాయించాలని ఆయన గత నెల 6న ప్రభుత్వానికి రాసిన లేఖలో కోరారు. ఈ లేఖ అందడమే తరువాయి ప్రభుత్వం తీవ్రంగా స్పందించి ఎకరా రూపాయికే కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఎకరా రూపాయికే కేటాయిస్తున్నట్లు తాజాగా సోమవారం జీవో 107 జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేసీ శర్మ ఆదివారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ వ్యవహారం పట్ల రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులే విస్తుపోతున్నారు. ఇదెక్కడి ద్వంద్వ విధానం? భూ కేటాయింపుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పట్ల అధికార వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఒక్కో సంస్థ విషయంలో ఒక్కో విధంగా వ్యవహరించడం సరికాదని వ్యాఖ్యానిస్తున్నారు. విశాఖపట్నం భీమునిపట్నం మండలంలోని కాపులుప్పాడలో ఇండియన్ నేవీకి వంద ఎకరాలు ఎకరా రూ.5 లక్షల చొప్పున కేటాయిస్తూ 2003 డిసెంబరు 3వ తేదీన టీడీపీ ప్రభుత్వం జీవో నంబరు 1241 జారీ చేసింది. ఈ మేరకు రూ.5 కోట్లు ఇండియన్ నేవీ ప్రభుత్వానికి చెల్లించింది. ఈ భూమిని తమకు అప్పగించాలని నేవీ అధికారులు కోరగా, అంత భూమి ఇవ్వలేమని, తగ్గించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సర్కారు ఒత్తిడి తేవడంతో చర్చల్లో 80 ఎకరాలతో సరిపెట్టుకుంటామని ఇండియన్ నేవీ అధికారులు చెప్పారు. చివరకు అంత కూడా కేటాయించకుండా 65 ఎకరాలతోనే సరిపెట్టుకోవాలని సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. వంద ఎకరాలకు సొమ్ము చెల్లించినందున తమకు ఇస్తున్న 65 ఎకరాలకు పోనూ మిగిలిన 35 ఎకరాలకు సంబంధించిన డబ్బు వెనక్కు ఇవ్వాలని ఇండియన్ నేవీ కోరినా ప్రభుత్వం అంగీకరించలేదు. వంద ఎకరాలకు తీసుకున్న మొత్తాన్ని 65 ఎకరాలకే సరిపెట్టుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు గత నెల 21వ తేదీన జీవో 80 జారీ చేసింది. ఇది సర్కారు ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అధికారులు అంటున్నారు. -
వైఎస్సార్సీపీ నాయకుల గృహ నిర్బంధం
విజయనగరం మున్సిపాలిటీ: భోగాపురం మండలంలో నిర్మించతలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ విధానాలను అవలంబించడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. బుధవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో భోగాపురంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించగా..అల్లర్లు సృష్టిస్తారన్న నెపంతో పోలీసు యంత్రాంగంతో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులు మజ్జి.శ్రీనివాసరావు, భోగాపురం మండల నాయకుడు ఉప్పాడ.సూర్యనారాయణలను మజ్జి శ్రీనివాసరావు ఇంట్లో గృహనిర్బంధం చేశారు. ప్రతిపక్ష నాయకులు ఉదయం నుంచి బయటకు వెళ్లకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కాకుండా ప్రజా కంటక పాలన సాగుతోందన్నారు.భోగాపురం ప్రాంత ప్రజలు, రైతులు తమకు విమానాశ్రయం అవసరం లేదని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నా ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు, జిల్లాకు చెందిన కేంద్రమంత్రి అశోక్గజపతిరాజులు మొండిగా వ్యవహరిస్తూ ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేశారన్నారు. అక్కడి ప్రజల మనోభావాలను తెలుసుకోవడంలో చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన ప్రభుత్వం బాధిత ప్రజల మనోభావాలకు అనుగుణంగా పోరాటం చేస్తున్నవారిపై గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసు బలగాలతో ప్రజా ఉద్యమాలను అణిచివేయలేరని, అక్కడి ప్రజల మనోభావాల మేరకు వారి పక్షాన నిలబడి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. -
వారిని ఖాళీ చేయించవద్దు
ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: విజయనగరం జిల్లా భోగాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం కోసం చేపట్టిన భూ సేకరణపై హైకోర్టును ఆశ్రయించిన రైతులు, ఇతర వ్యక్తులను వారి వారి భూముల నుంచి ఖాళీ చేయించవద్దని ఉమ్మడి హైకోర్టు గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాక భూ సేకరణపై రైతులు రాతపూర్వక అభ్యంతరాల సమర్పించేందుకు వెసులుబాటు కల్పించింది.ఈ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని.. అధికారులు ఏవైనా ఉత్తర్వులు జారీ చేస్తే, ఆ ఉత్తర్వులు ఈ వ్యాజ్యాల్లో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
మళ్ళీ కలకలం...!
భోగాపురం : గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధిస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై బాధిత గ్రామాల్లో ప్రజలు మంగళవారం పండుగ చేసుకున్నారు. ఇంకా అదే సంతోషంలో రైతులున్న తరుణంలో కోర్టు ఉత్తర్వులతో మాకేంటి అన్నట్టు డి పట్టా భూముల సర్వేకు సర్వేయర్లు బుధవారం బయలుదేరారు. ముందుగా దల్లిపేట గ్రామంలో సర్వేకు వెళ్ళగా వాళ్ళు సహకరించకపోవడంతో వారంతా గూడెపువలస గ్రామం చేరుకుని సర్వే నంబర్ 35లో ఉన్న ప్రభుత్వ భూమిని సర్వే చేసేందుకు సిద్ధమయ్యారు. 35/4 సర్వే నంబర్లో భూమి కలిగిన బోనెల అసిరమ్మ కుమార్తె బోనెల గౌరి సర్వే జరుగుతున్న సంగతి తెలుసుకుని స్థలంవద్దకు చేరుకుంది. తమకు చెప్పకుండా తమ భూముల్లో సర్వే ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించింది. అంతేగాకుండా తమకూ ఆ సర్వేనంబర్‌లో భూమి ఉందని తెలిపింది. అయితే పెద్దవాళ్లుంటే తీసుకురావాలనీ, ఇందులో వారి భూమిలేదనీ ఎయిర్‌పోర్టు సర్వే కోసం ప్రభుత్వం నియమించిన సర్వేయరు సుబ్బారావు అనడంతో వెంటనే ఆమె పరుగున ఇంటికి వెళ్ళి తమ వద్దనున్న రికార్డులను తీసుకువచ్చి చూపించింది. రికార్డులు పరిశీలించిన ఆయన మారుమాటాడలేదు. అలాగే 35/9 సర్వే నంబరులో భూమి ఉన్న బోనెల రమణకూడా తన రికార్డులను పట్టుకుని అక్కడకు చేరుకున్నాడు. తమకు చెప్పకుండా తమ భూముల్లో సర్వే ఏవిధంగా చేస్తున్నారని మరొక సర్వేయరు అయిన శ్రీనివాసరావు, వీఆర్ఓ రామచంద్రరావులను నిలదీశాడు. విషయం తెలుసుకున్న సాక్షి అక్కడకు చేరుకుని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చాక సర్వే ఎలా చేస్తారని వీఆర్ఓ రామచంద్రరావును ప్రశ్నించగా ఎయిర్‌పోర్టు ప్లానులో లేని సర్వే నం. 69కు చెందిన రైతు బుద్దాన అప్పన్న సర్వే కోరగా తామంతా వచ్చామని తెలిపారు. మరో వీఆర్ఓ సుబ్బారావు మాట్లాడుతూ దల్లిపేట మాజీ సర్పంచ్ దల్లి శ్రీనివాసు ఎయిర్‌పోర్టు ప్లానులో ఉన్న ప్రభుత్వ భూముల సర్వేకు డిప్యూటీ కలెక్టరు శ్రీలతను కోరగా ఆమె ఆదేశాల మేరకు తొలుత దల్లిపేట వెళ్ళామని, అక్కడ ఎవరూ లేకపోవడంతో తిరిగి గూడెపువలస వచ్చామని ఎక్కడా సర్వే చేయలేదని సమాధానమిచ్చారు. ఏదో మామూలుగా వచ్చాం, తప్పయిపోయింది అని తిరుగుముఖం పట్టారు. -
అమరావతిలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు
♦ సీఆర్డీఏకు సర్వే బాధ్యతలు ♦ 5వేల ఎకరాల భూ సేకరణ లక్ష్యం సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయిలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. సింగపూర్ అందించిన మాస్టర్ ప్లాన్‌లోనూ రాజధానిలో ఎయిర్‌పోర్టు నిర్మాణంపై స్పష్టత ఇచ్చారు. ఎయిర్‌పోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తుళ్లూరు, మంగళగిరి, అమరావతిలలో ఎక్కడ ఎయిర్‌పోర్టు నిర్మించాలనే అంశంపైనే తర్జనభర్జనలు పడుతోంది. ఈ సర్వే బాధ్యతల్ని ప్రభుత్వం సీఆర్డీఏకు అప్పగించింది. ఆ సర్వే ప్రస్తుతం కొనసాగుతోంది. మంగళగిరి ప్రాంతంలో కొండలు ఉండటంతో ఎయిర్ సిగ్నల్స్‌కు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. పక్కనే జాతీయ రహదారి ఉండటంతో ల్యాండ్ ఇన్స్ట్రుమెంట్ సిస్టం (ఎల్ఈఎస్)కు అంతరాయాలు ఏర్పడి రాత్రి వేళల్లో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అవకాశాలు తక్కువ,దీంతో తుళ్లూరు, అమరావతి ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. లక్ష్యం ఐదు వేల ఎకరాలు.. : అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు నిర్మించాలంటే కనీసం ఐదు వేల ఎకరాల భూములు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి చుట్టూ 180 కిలోమీటర్ల మేర ఔటర్ రింగు రోడ్డు ప్రతిపాదన ఉంది. హైదరాబాద్‌లో ఔటర్ రింగురోడ్డు పక్కనే శంషాబాద్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేశారు. ఏపీ రాజధానిలో కూడా ఔటర్ రింగురోడ్డు పక్కన భూములు ఉన్నచోట అక్కడ ఏర్పాటు చేయాలని సర్కారు ఆలోచన చేస్తోంది. భూముల లభ్యత ఎక్కడ? అన్నింటికి అనువైన ప్రాంతం ఏది? అనే అంశాలతో సర్వే నిర్వహించి సమగ్ర నివేదిక అందించాలని సీఆర్డీఏకు ఆదేశాలు జారీ చేశారు. గన్నవరం విస్తరణ వెనక్కి... రాజధాని ప్రాంతానికి గన్నవరం ఎయిర్‌పోర్టు సుమారు 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. గన్నవరం ఎయిర్‌పోర్టును విస్తరించేందుకు భూ సేకరణ నోటిఫికేషన్‌ను గతేడాది జారీ చేశారు. అయితే విస్తరించేందుకు అవకాశాలు లేవు. ఇక్కడకు సమీపంలోని భూములు టీడీపీకి చెందిన నేతలవి ఉండడమే కారణం. రాజధాని ప్రాంతంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసి గన్నవరంలో ఎయిర్‌పోర్టును వ్యాపారం కోసం అంటే కార్గో ఎయిర్‌పోర్టుగా వినియోగిస్తారనే ప్రచారం జరుగుతోంది. -
5న భోగాపురానికి వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, విజయనగరం: గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం విషయంలో ప్రభుత్వం దిగొచ్చేంత వరకు వైఎస్సార్సీపీ పోరాడుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు చెప్పారు. ఈ ఎయిర్‌పోర్టు కింద భూములను కోల్పోతున్న బాధితులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 5న భోగాపురం వస్తున్నారని తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పలు గ్రామాల్లో జగన్ పర్యటిస్తారన్నారు. ఆయా గ్రామాల్లో సుజయ్‌కృష్ణ రంగారావు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు తదితరులు గురువారం పర్యటించారు. సుజయ్‌కృష్ణ రంగారావు, కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ... 5వ తేదీన జగన్ రాజాపులోవ జంక్షన్ నుంచి ప్రారంభమై కవులవాడ, ఎ.రాయివలస, గూడపువలస గ్రామాల్లో పర్యటిస్తారని చెప్పారు. గూడపువలసలో బహిరంగసభలో మాట్లాడుతారన్నారు. -
డి - పట్టా భూములపై దృష్టి
భూ సేకరణ కార్యాలయంలో ఎసైన్డ్ ల్యాండ్ నిర్వాసితులతో చర్చలు భూ సేకరణ కార్యాలయంలో కంచేరు గ్రామస్తులతో కలెక్టర్ సమావేశం త భూములివ్వాలని ఒత్తిడి విజయనగరం కంటోన్మెంట్: ప్రాణాలు పోతున్నా....ఆందోళనలు తీవ్రతరమవుతున్నా వాటిని లెక్కచేయకుండా గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు భూ సేకరణ కోసం జిల్లా అధికారులు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు. భోగాపురంలో అయితే గొడవలు వస్తున్నాయని జిల్లా కేంద్రంలోని విమానాశ్రయ భూ సేకరణ కార్యాలయంలో డిపట్టా భూములున్న రైతులతో సమావేశాలను ఏర్పాటు చేసి వారిని నయానోభయానో ఒప్పించి అంగీకార పత్రాలు రాయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా కణపాకలో గల యూత్‌హాస్టల్‌లో ఉన్నభోగాపురం విమానాశ్రయ భూ సేకరణ కార్యాలయంలో కంచేరు గ్రామానికి చెందిన అసైన్డు ల్యాండు భూముల యజమానులతో శనివారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కంచేరు గ్రామానికి చెందిన ఎస్సీ, ఎస్టీలకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన, వారు సాగుచేసుకుంటున్న భూములను తిరిగి వెనక్కు తీసుకుని పరిహారం చెల్లించేందుకు వారితో చర్చించారు. ప్రభుత్వం ఇచ్చిన భూమే కనుక ఎట్టి పరిస్థితులలోనూ భూములు తీసుకోవడం ఖాయమనీ, ముందుగా అంగీకరిస్తే మీకు పరిహారమిస్తామని వారిపై ఒత్తిడి తెచ్చారు. అయితే ఆర్డీఓ ఎస్ శ్రీనివాసమూర్తి, భోగాపురం తహశీల్దార్ లకా్ష్మరెడ్డి,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనిత, ఇతర డిప్యూటీ తహశీల్దార్లు ముందుగా వారితో సమావేశమయ్యారు. తరువాత కలెక్టర్ కూడా సమావేశానికి హాజరయ్యారు. జిరాయితీ భూముల కన్నా తక్కువ పరిహారం వస్తుందని, పరి హారంపై చర్చించే అవకాశం ఉండదనివారికి చెప్పారు. దీంతో కొంతమంది భూములు ఇచ్చేందుకు అంగీకరించారు. రోజుకో గ్రామం చొప్పున విమానాశ్రయానికి అవసరమైన భూ సేకరణకు గుర్తించిన తొమ్మిది గ్రామాల్లో రోజుకో గ్రామానికి చెందిన డీ పట్టా భూముల యజమానాలతో సమావేశాలు జరిపేందుకు నిర్ణయించారని సమాచారం. వారిని నయానో భయానో ఒప్పించి, వారితో అంగీకార పత్రాలు రాయించుకునేందుకు చర్యలు ముమ్మరం చేశారు.