వారిని ఖాళీ చేయించవద్దు | AP High Court interim order directed the governmen | Sakshi
Sakshi News home page

వారిని ఖాళీ చేయించవద్దు

Published Fri, May 27 2016 2:13 AM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM

వారిని ఖాళీ చేయించవద్దు - Sakshi

వారిని ఖాళీ చేయించవద్దు

ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: విజయనగరం జిల్లా భోగాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం కోసం చేపట్టిన భూ సేకరణపై హైకోర్టును ఆశ్రయించిన రైతులు, ఇతర వ్యక్తులను వారి వారి భూముల నుంచి ఖాళీ చేయించవద్దని ఉమ్మడి హైకోర్టు గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాక భూ సేకరణపై రైతులు రాతపూర్వక అభ్యంతరాల సమర్పించేందుకు వెసులుబాటు కల్పించింది.ఈ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని.. అధికారులు ఏవైనా ఉత్తర్వులు జారీ చేస్తే, ఆ ఉత్తర్వులు ఈ వ్యాజ్యాల్లో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement