రెండు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
Published Fri, Sep 13 2013 5:34 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
బైక్‌ను ఢీకొన్నలారీ: మహిళ దుర్మరణం మహరాజుపేట (భోగాపురం), న్యూస్‌లైన్: భోగాపురం మండలం మహరాజుపేట కూడలి వద్ద బైక్‌ను లారీ ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందింది. విశాఖపట్నంలో ఓప్రైవేటు సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్న గంగిరెడ్డి నాయుడికి నెల క్రితం వివాహం జరిగింది. విజయనరం జిల్లా గంట్యాడ మండలం కిర్తుబర్తి గ్రామానికి అత్తవారింటికి భార్య సత్యవతితో ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మహరాజుపేట కూడలివద్దకు వచ్చేసరికి వెనుకనుంచి వస్తున్న ట్యాంకరు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.
దీంతో బైక్ వెనుక కూర్చున్న సత్యవతి (20) రోడ్డుపై పడిపోయింది. ఆమెపైనుంచి లారీ వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. వాహనాన్ని నడుపుతున్న నాయుడికి బలమైన గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న భోగాపురం ఎస్‌ఐ షేక్ సర్దార్‌ఘని నాతవలస దగ్గర బైక్‌ని ఢీకొట్టిన లారీని పట్టుకున్నారు. అనంతరం సంఘటనా స్థలం వద్దకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం, నాయుడిని వైద్యం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. జరిగిన ప్రమాదంపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైలు ఢీ కొని ఒకరి మృతి
బెలగాం: పార్వతీపురంలోని బెలగాంలో రైలు ఢీ కొని ఒకరు మృతిచెందారు. పట్టణంలోని 17వార్డు బంగారమ్మకాలనీకి చెందిన రెడ్డి శంకరరావు(30), తండ్రి సాంబయ్యలు కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్ వైపు పశువులను మేతకు తోలుకుని వెళ్లారు. రైల్వేట్రాక్ పక్కన శంకరరావు నిలబడి ఉన్నాడు. ఇంతలో విశాఖపట్నం నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న సమతా ఎక్స్‌ప్రెస్‌ను శంకరరావు గమనించకపోవడంతో ఢీ కొంది. దీంతో శంకరరావు అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మతిస్థిమితం లేకపోవడమే
పుట్టినప్పటినుంచి శంకరరావుకు మూగ, చెవుడుతో పాటు మతిస్థిమితం లేకపోవడంతో చదువుకోలేదు. దీంతో కుటుంబీకులకు చిన్న చిన్న పనులు చేస్తుండేవాడు. శంకరరావుకు ఇద్దరు అన్నదమ్ములు, అక్క ఉన్నారు. కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండే శంకర్రావు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు.
Advertisement