రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
Published Thu, Sep 12 2013 4:25 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
భోగాపురం, న్యూస్‌లైన్ : స్థానిక జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. విజయనగరానికి చెందిన మాచర్ల సురేంద్ర(35) భోగాపురంలో రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్లు రాయించే పని మీద బుధవారం వచ్చాడు. ఇతను గతంలో భోగాపురం రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసి బదిలీపై పార్వతీపురం వెళ్లాడు.
పని ముగించుకుని ద్విచక్రవాహనంపై తిరిగి వెళ్తున్న అతను అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నాడు. తలకు తీవ్ర గాయం కావడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్సై షేక్‌సర్దార్‌ఘని, హెచ్‌సీ కృష్ణ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.
హెల్మెటు లేనందువల్లే మృతి...
సురేంద్ర హెల్మెటు ధరించలేనందువల్లే తలకు బలమైన గాయమై మృతి చెందినట్లు ఎస్సై షేక్ సర్దార్‌ఘని తెలిపారు. వాహనం కొత్తదని, ఇంకా రిజిష్ట్రేషను కూడా కాలేదని తెలిపారు. వేగంగా వెళ్లడం వల్ల ప్రమాదం జరిగినా.. హెల్మెటు ఉన్నట్లయితే అతను బతికేవాడని చెప్పారు.
Advertisement
Advertisement