భోగాపురం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మహానేత తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాక కోసం పార్టీ శ్రేణులు, ఆభిమానులు ఎదురుచూస్తున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత తమ నేతను కళ్లారా చూడవచ్చన్న ఆత్రుతతో వారున్నారు. అభిమాన నేతకు అండగా నిలవడానికి ప్రజలంతా ఉత్సుకత చూపిస్తున్నారు. ఆదివారం జిల్లాలో అడుగు పెట్టబోతున్న అభిమాననేతకు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. ప్లీనరీలో ప్రకటించిన అమ్మఒడి పథకం, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ తదితర హామీలతో మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. పెద్ద ఎత్తున తరలివెళ్లి జగనన్నకు మద్దతుగా నిలవాలని మహిళలు ఉవ్విళ్లూరుతున్నారు.
భోగాపురానికి నాలుగో సారి
వైఎస్సార్ సీపీ ఆవిర్భావం తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి నాలుగోసారి భోగాపురం వస్తున్నారు. గతంలో శ్రీకాకుళం జిల్లా కాకరా పల్లి పవర్‌ప్లాంటు బాధితులను పరామర్శించేందుకు వెళ్లేటప్పుడు భోగాపురంలో మొదటిసారిగా ఆగి జిల్లా వాసులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం 2011 మే 24న భోగాపురం మండలంలో నిర్వహించిన ఓదార్పు యాత్రలో భాగంగా రెండవసారి వచ్చారు. తదుపరి నరసన్నపేటలో ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తూ జాతీయ రహదారిపై ఆయనకు స్వాగతం పలికిన జిల్లా వాసులను పల కరించారు. ప్రజల కోరికైన సమైక్య రాష్ట్ర కోసం చైతన్య పరిచే సమైక్య శంఖారావం సభకు హాజరుకానున్నారు.
సభ ఏర్పాట్లు
భోగాపురం పంచాయతీ కార్యాలయం వద్ద జరిగే సమైక్యా శంఖారావం బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నా యి. ఈ క్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టరు సురేష్‌బాబు, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాస రాజు శుక్రవారం సభా స్థలిని పరిశీలించారు. వేదిక ఏర్పాట్లపై నాయకులతో సమీక్షించారు. వేలాది మంది హాజరయ్యే బహిరంగ స భకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు గాను ఎస్‌ఐ షేక్ సర్దార్ ఘనితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ అధ్యక్షుడు వరుపుల సుధాకర్, డెంకాడ, పూసపాటిరేగ , భోగాపురం మండల కన్వీనర్లు సబ్బవరపు వెంకటరమణ, మహంతి లక్ష్మణ రావు, దారపు లక్ష్మణరెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఇమ్మిడిశెట్టి రమేష్, శిరుగుడు గోవిందరావు, అడపా ప్రసాదరావు పాల్గొన్నారు.
స్వాగత ఏర్పాట్లు
వైఎస్ జగన్ రాక కోసం పార్టీ శ్రేణులు, అభిమానులు ఇప్పటికే గంటలు లెక్కపెడుతున్నారు. ఎదురెళ్లి స్వాగతం పలికేందుకు నా యకులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర కార్యనిర్వాహక సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో రాజాపులోవ కూడలి నుంచి స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ రహదారి పొడుగునా భారీ హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు. స్వాగత కార్యక్రమంలో భా గంగా తీన్‌మార్, తప్పిటగుల్లు, పులివేషాలు, భారీ బాణసంచా, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నారు.
జగనన్న కోసం ఎదురు చూపు
Published Sat, Feb 8 2014 2:27 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement
Advertisement