భోగాపురం (విజయనగరం): భోగాపురంలో నిర్మించనున్న విమానాశ్రయానికి సాంకేతికపరంగా ప్రతికూల వాతావరణం ఉన్నట్టు తెలిసింది. విమాన రాకపోకలకు గాలి దిశ బాగోలేదని సాంకేతిక సిబ్బంది గుర్తించినట్టు సమాచారం. ఈ మేరకు వారు ప్రభుత్వానికి నివేదిక అందించారు. విమానాశ్రయం ఏర్పాటు విషయమై ఈనెల 15న విశాఖలో మంత్రులు విజయనగరం, విశాఖ కలెక్టర్లతో సమావేశం కానున్నారు. అయితే నివేదికను పరిగణలోకి తీసుకుని విమానాశ్రయం నిర్మాణంపై ప్రభుత్వం వెనుక్కు తగ్గుతుందా...లేక ముందుకే వెళుతుందా అన్నది తేలాల్సి ఉంది.