
ఆలయంలో చోరీ
విజయనగరం : విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరవిల్లి గ్రామంలో ఉన్న బంగారమ్మతల్లి అమ్మవారి ఆలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. నిందితులు మంగళవారం తెల్లవారుజామున ఆలయంలో చొరబడి రెండు హుండీలను కొల్లగొట్టారు. సుమారు రూ. 50 వేల నగదు చోరీకి గురైనట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాల కోసం పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
(భోగాపురం)