బంగ్లాదేశ్‌లోని అమ్మవారి ఆలయంలో కాళీదేవి కిరీటం చోరికి గురవ్వడం కలకలం రేపుతోంది. సత్‌కిరాలోని జెషోరేశ్వరి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా చోరికి గురైన ఆ కాళేదేవి కిరీటాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బహుమతిగా ఇచ్చారు. 2021 మార్చిలో బంగ్లాదేశ్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. కాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో ఆలయంలోని కాళీమాతకు బంగారు కిరీటాన్ని గిఫ్ట్‌గా అందించారు.
ఈ కిరీటాన్ని వెండితో తయారు చేయగా.. బంగారు పూత పూశారు. అయితే ఇప్పుడు ఆ కిరీటం దుర్గాపూజ నవరాత్రోత్సవాల సందర్భంలో దొంగతనం చేయడం ప్రస్తుతం దుమారం రేపుతోంది.
గురువారం రాత్రి ఆలయ పూజారి పూజలు ముగించుకుని వెళ్లిన తర్వాత ఈ చోరీ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది క్లీనింగ్ చేస్తున్న సమయంలో కిరీటం పోయినట్లుగా గుర్తించారు.
ఈ ఘటన ఆలయంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అందులో ఓ యువకుడు బంగారు కిరీటం తీసుకెళ్తున్న దృశ్యాలు కనిస్తున్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
స్పందించిన భారత్
ఈ పరిణామంపై భారత్ స్పందించింది. ఆలయంలో కాళీమాత కిరీటం దొంగతనంపై ఆందోళనను వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసి, దొంగిలించిన కిరీటాన్ని తిరిగి పొందాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఢాకాలోని భారత హైకమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment