Goddess Kali
-
Bangladesh: ప్రధాని మోదీ గిఫ్ట్‌గా ఇచ్చిన కాళీమాత కిరీటం చోరీ
బంగ్లాదేశ్‌లోని అమ్మవారి ఆలయంలో కాళీదేవి కిరీటం చోరికి గురవ్వడం కలకలం రేపుతోంది. సత్కిరాలోని జెషోరేశ్వరి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా చోరికి గురైన ఆ కాళేదేవి కిరీటాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బహుమతిగా ఇచ్చారు. 2021 మార్చిలో బంగ్లాదేశ్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. కాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో ఆలయంలోని కాళీమాతకు బంగారు కిరీటాన్ని గిఫ్ట్‌గా అందించారు. ఈ కిరీటాన్ని వెండితో తయారు చేయగా.. బంగారు పూత పూశారు. అయితే ఇప్పుడు ఆ కిరీటం దుర్గాపూజ నవరాత్రోత్సవాల సందర్భంలో దొంగతనం చేయడం ప్రస్తుతం దుమారం రేపుతోంది.గురువారం రాత్రి ఆలయ పూజారి పూజలు ముగించుకుని వెళ్లిన తర్వాత ఈ చోరీ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది క్లీనింగ్ చేస్తున్న సమయంలో కిరీటం పోయినట్లుగా గుర్తించారు.ఈ ఘటన ఆలయంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అందులో ఓ యువకుడు బంగారు కిరీటం తీసుకెళ్తున్న దృశ్యాలు కనిస్తున్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.స్పందించిన భారత్ఈ పరిణామంపై భారత్ స్పందించింది. ఆలయంలో కాళీమాత కిరీటం దొంగతనంపై ఆందోళనను వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసి, దొంగిలించిన కిరీటాన్ని తిరిగి పొందాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఢాకాలోని భారత హైకమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. -
కాళిమాతవా?.. చిత్రవధ చేసి చంపారు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణం చోటు చేసుకుంది. కాళి మాత వేషం వేసుకున్న ఓ వ్యక్తిని అతికిరాతకంగా చంపేశారు. గత వారం ఈ ఘటన చోటు చేసుకోగా, దర్యాప్తు అనంతరం సోమవారం నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... మే 23న ఉదయం ఎన్ఎస్ఐసీ అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఛాతీ, తల, ముఖంపై కత్తి పోట్లతో గుర్తు పట్టలేని స్థితిలో ఆ దేహం ఉంది. దొరికిన ఆధారాలతో చివరకు ధర్మశాలకు చెందిన కలూ అనే వ్యక్తి మృతదేహంగా పోలీసులు నిర్ధారించారు. అయితే అనాథ అయిన అతన్ని అంత క్రూరంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అన్నది పోలీసులకు సవాల్‌గా మారింది. పిల్లలు ఇచ్చిన సమాచారంతో... కల్కజీ మందిర్ సమీపంలోని ధర్మశాలలో కలూ పెరిగాడు. ఒంటరి అయిన కలూ తరచూ హిజ్రాలతో కలిసి కాళి మాతను పూజించేవాడు. ఈ క్రమంలో అతను తనను తాను దేవతగా భావించుకునేవాడని వారు చెప్పారు. గత మంగళవారం పూజ పూర్తయ్యాక కాళి మాత వేషాధారణతో ఆశ్రమం విడిచివెళ్లాడని, ఆ తర్వాత తిరిగి రాలేదని వారు చెప్పారు. ఆపై చుట్టుపక్కల వారిని ప్రశ్నించే క్రమంలో అక్కడే ఆడుకుంటున్న కొందరు పిల్లలు పోలీసులతో ఆరోజు జరిగింది వివరించారు. కాళిమాత వేషం వేసుకున్న కలూను కొందరు వ్యక్తులు అడ్డగించి వేధించారని, చిన్నపాటి గొడవ కూడా జరిగిందని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ సమయంలో ఆ ప్రాంతంలో సంచరించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కిరాతకంగా చంపారు... కాళిమాత వేషాధారణలో ఉన్న కలూను నిందితుల కంటపడ్డాడు. మద్యం మత్తులో ఉన్న వాళ్లంతా కలూ చున్నీ లాగుతూ వేధించారు. కోపంతో కలూ.. తాను దైవాంశాన్ని అని, ఎగతాళి చేస్తే చచ్చిపోతారని వాళ్లతో చెప్పాడు. దీంతో వాళ్లకు చిర్రెత్తుకొచ్చింది. బలవంతంగా కలూను అటవీలోకి లాక్కెల్లారు. ఆపై పిడిగుద్దులతో దాడి చేసి అనంతరం, రాళ్లు, తమ వెంట ఉన్న కత్తులతో అతన్ని చిత్రవధ చేసి మరీ చంపారు. మిగతా నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, జుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. నిందితులంతా పాతికేళ్లలోపు వాళ్లే కాగా.. వారిలో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. -
కాళీ అడిగిందని కన్నతల్లినే నరికేశాడు
పురూలియా: పశ్చిమబెంగాల్లోని ఓ యువకుడు కాళీమాత విగ్రహం ముందే తల్లి తలను నరికేశాడు. పురూలియాకు చెందిన ఫులీ మహతో(55) శుక్రవారం కాళీ ఆలయాన్ని శుద్ధి చేస్తోంది. ఈ సమయంలో ఆమె కుమారుడు నారాయణ్ మహతో (35) అనే ఖర్గో (దేవుడికి జంతువులను బలిచ్చే కత్తి)తో కాళీమాత విగ్రహం ముందే తల్లిని తలను నరికేశాడు. అనంతరం సోదరుడి వద్దకు వెళ్లి.. ‘అమ్మ తనను తానే నరికేసుకుంద’ని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు నారాయణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తల్లిని తానే నరికేశానని ఒప్పుకున్న నారాయణ.. ‘కాళీమాత కలలో కనిపించి అమ్మను బలిస్తే.. మా కుంటుంబానికి మంచి జరుగుతుందని చెప్పింది’ అని చెప్పాడు.