కాళీ అడిగిందని కన్నతల్లినే నరికేశాడు | Young man smashed her mother's head infront of Goddess Kali Statue | Sakshi
Sakshi News home page

కాళీ అడిగిందని కన్నతల్లినే నరికేశాడు

Published Mon, Apr 10 2017 1:15 AM | Last Updated on Tue, Sep 5 2017 8:22 AM

కాళీ అడిగిందని కన్నతల్లినే నరికేశాడు

కాళీ అడిగిందని కన్నతల్లినే నరికేశాడు

పురూలియా: పశ్చిమబెంగాల్‌లోని ఓ యువకుడు కాళీమాత విగ్రహం ముందే తల్లి తలను నరికేశాడు. పురూలియాకు చెందిన ఫులీ మహతో(55) శుక్రవారం  కాళీ ఆలయాన్ని శుద్ధి చేస్తోంది. ఈ సమయంలో ఆమె కుమారుడు నారాయణ్‌ మహతో (35) అనే ఖర్గో (దేవుడికి జంతువులను బలిచ్చే కత్తి)తో కాళీమాత విగ్రహం ముందే తల్లిని తలను నరికేశాడు.

అనంతరం సోదరుడి వద్దకు వెళ్లి.. ‘అమ్మ తనను తానే నరికేసుకుంద’ని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు నారాయణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తల్లిని తానే నరికేశానని ఒప్పుకున్న నారాయణ.. ‘కాళీమాత కలలో కనిపించి అమ్మను బలిస్తే.. మా కుంటుంబానికి మంచి జరుగుతుందని చెప్పింది’ అని చెప్పాడు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement