
ఆరేళ్లకే నూరేళ్లా..!
►భోగాపురంలో
► తేలిన విశాఖ చిన్నారి
► ఏడు రోజుల అనంతరం
► సముద్రం ఒడ్డుకు వచ్చిన చిన్నారి నిర్జీవదేహం
► కన్నీరు పెట్టుకున్న స్థానికులు
పూసపాటిరేగ/విజయనగరం కంటోన్మెంట్: అయ్యో..! చిట్టితల్లీ ఇంత చిన్న వయసు లోనే కాలువలో పడి కొట్టుకు వచ్చావా తల్లీ..? నీకోసం నీ తల్లిదండ్రులు, అధికారులు వారం రోజులుగా పడుతున్న కష్టాలు పత్రికల్లో, టీవీల్లో చూస్తున్నాం ఇక్కడ మృ తదేహమై తేలావా తల్లీ అంటూ భోగాపురం మండలలోని దిబ్బగుడ్డివలస వాసులు కన్నీరుమున్నీరయ్యారు. సెప్టెంబర్ 24వ తేదీన కారు ఎక్కబోతూ డ్రైనేజీలో పడి గల్లంతయిన విశాఖ పట్నానికి చెందిన ఆరేళ్ల చిన్నారి సాయి లావణ్య అదితి భోగాపురం మం డలం దిబ్బల పాలెం వద్ద ఉన్న సముద్రపు ఒడ్డున గురువారం కనిపిం చింది. అక్కడి సన్‌రే లే ఔట్ వద్ద చిన్నారి అదితి మృతదేహం కనిపిం చడంతో అక్కడి ఉ ద్యోగి బయటకు వెళ్తూ చూసి అందరికీ సమాచారమందిం చాడు.
దీంతో స్థాని కులు ఇతరులు అక్కడికి పరుగుపరుగున వచ్చి చిన్నారి మృతదేహాన్ని చూశారు. చూసిన వాళ్లంతా కంటనీరు పెట్టుకున్నారు. పోలీసులు, జీవీఎంసీ అధికారులు, తల్లిదండ్రులు వారం రోజులుగా గాలిస్తున్న సమాచారాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న వారంతా అక్కడికి చేరుకుని మృతదేహాన్ని చూసేందుకు చెమర్చిన కళ్లతో వచ్చారు. సమీప గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు అదితి మృతదేహాన్ని చూసి ఆవేదన చెందారు. వందలాది మంది ఉద్యోగులు నగరమంతా గాలించి వడపోసినా ఆచూకీ కానరాకపోవడంతో వారు చేతులెత్తేశారు. చివరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
అయినా ఆశ చావని తల్లి దండ్రులు ఆచూకీ చెబితే రూ5లక్షల నజరానా ఇస్తామని బుధవారం ప్రకటించారు. కానీ ఆ చిన్నారి సముద్రంలో రెండు జిల్లాల పరిధిలో తిరిగి తిరిగి చివరకు ఇక్కడ బయట పడటం చూసి స్థానికులు కళ్లలోంచి నీళ్లు బయటకు వచ్చాయి. వారి గుండెలు బరువెక్కాయి. ఇక్కడ అదితి మృతదేహం తేలిందని సమాచారం అందడంతో చేరుకున్న బాలిక తండ్రి శ్రీనివాసరావు అక్కడికక్కడే కుప్పకూలిపోవడం చూసిన స్థానికుల గుండె చె రువయింది. అయ్యో ఎక్కడున్నా బతికే ఉంటుందని అనుకున్నానని ఆదితి తండ్రి గుండెలవిసేలా రోదించారు.
దిబ్బలపాలెంలో అదితి మృ తదేహం తేలిందని తెలుసుకున్న నేవీ అధికారులు, విశాఖ పోలీసులు, విశాఖకు చెందిన ప్రసార మాధ్యమాలన్నీ అక్కడికి చేరుకున్నాయి. అక్కడకు పెద్ద ఎత్తున వచ్చిన మీడియానుద్దేశించి అదితి తండ్రి శ్రీనివాసరావు తన కుమార్తె మృతదేహానికి ఫొటో తీయొద్దని రోదిస్తూ ప్రాధేయ పడడం చూసిన స్థానికులు కన్నీంటి పర్యం తమ య్యారు.