భోగాపురం మండలం ఎ.రావివలస సమీపంలోని సన్‌రే విలేజ్ రిసార్ట్స్‌లో నాలుగు రాష్ట్రాల డీజీపీలు సమావేశమయ్యారు.
- ఉదయం 11నుంచి సాయంత్రం 4 వరకు సమావేశం
- విలేకరులను అనుమతించని పోలీసులు
భోగాపురం (విజయనగరం జిల్లా) : భోగాపురం మండలం ఎ.రావివలస సమీపంలోని సన్‌రే విలేజ్ రిసార్ట్స్‌లో నాలుగు రాష్ట్రాల డీజీపీలు సమావేశమయ్యారు. ఉదయం పదిగంటలకు వారంతా విశాఖ నుంచి జాతీయ రహదారి మీదుగా కాన్వాయ్‌గా రిసార్ట్స్‌కు చేరుకున్నారు. వారి రాకను పురస్కరించుకుని రహదారి పొడవునా భారీ బందోబస్తు, వాహనాల తనిఖీ చేపట్టారు.
సాయుధ దళాలు రోడ్డుపైనున్న వంతెనల వద్ద జాతీయరహదారికి అనుసంధానమైన రహదారులు వద్ద పహారా కాశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌ఘడ్ డీజీపీలతో పాటు బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, గ్రేహౌండ్స్ దళాల ఉన్నత అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. శనివారం కూడా ఈ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సమావేశ ప్రాంతానికి విలేకరులను సైతం అనుమతించలేదు. సమావేశంలో చర్చించిన అంశాలను అధికారులు బహిర్గతం చేయలేదు.