DGP conference
-
హైపవర్ పోలీసు టెక్నాలజీ మిషన్
లక్నో: పోలీసు శాఖకు క్షేత్రస్థాయిలోని అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. భవిష్యత్తుల్లో రాబోయే పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అన్నారు. ఇందుకోసం కేంద్ర హోంశాఖ మంత్రి నేతృత్వంలో హైపవర్ పోలీసు టెక్నాలజీ మిషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఆదివారం డీజీపీలు, ఐజీపీల 56వ సదస్సులో ముగింపు కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. పోలీసు సంబంధిత సంఘటనలు విశ్లేషించి, కేసు స్టడీలను అభివృద్ధి చేయాలని, వీటిని పోలీసులకు పాఠ్యాంశాలుగా మార్చాలని పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో సాంకేతికత ప్రాముఖ్యత నానాటికీ పెరిగిపోతోందని ఉద్ఘాటించారు. కోవిడ్–19 వ్యాక్సినేషన్ కోసం ‘కోవిన్’ పోర్టల్, గవర్నమెంట్ ఈ–మార్కెట్(జీఈఎం), ఆన్లైన్లో చెల్లింపుల కోసం యూపీఐ వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు. డీజీపీలు, ఐజీపీల సదస్సును హైబ్రిడ్(ఆన్లైన్, ఆఫ్‌లైన్) విధానంలో నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల వివిధ స్థాయిల్లోని అధికారుల మధ్య సమాచార మార్పిడి సులభతరం అవుతుందన్నారు. ‘స్మార్ట్’ పోలీసింగ్ విధానాన్ని సమీక్షించాలి దేశవ్యాప్తంగా పోలీసు దళాలకు ఉపయోగపడే విధంగా ఇంటర్–ఆపరేబుల్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలని నరేంద్ర మోదీ కోరారు. సామాన్య ప్రజల పట్ల పోలీసుల దృక్పథంలో సానుకూల మార్పు రావడం అభినందనీయమని అన్నారు. కోవిడ్–19 తర్వాత ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ప్రజల అవసరాల కోసం డ్రోన్ టెక్నాలజీ వాడుకోవాలని వెల్లడించారు. 2014లో ప్రవేశపెట్టిన ‘స్మార్ట్’ పోలీసింగ్ విధానాన్ని సమీక్షించాలని అభిప్రాయపడ్డారు. పోలీసులను సాధారణంగా ఎదురయ్యే సవాళ్లకు ‘హ్యాకథాన్ల’ ద్వారా సాంకేతిక పరిష్కారాలు కనిపెట్టడానికి నిపుణులైన యువతను భాగస్వాములను చేయాలన్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) సిబ్బందికి ప్రధాని మోదీ ‘ప్రెసిడెంట్ పోలీసు మెడల్’ ప్రదానం చేశారు. డీజీపీలు, ఐజీపీల సదస్సులో ఆయన విలువైన సూచనలు అందించారు. -
డీజీపీల సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీల, కేంద్ర పోలీసు దళాల డీజీల సదస్సులో రెండో రోజు శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. మావోయిస్టుల హింస, వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదుల ఏరివేత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలను అరికట్టడం వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ డీజీపీల అభిప్రాయాలను తెలుసుకున్నారని వెల్లడించాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ సదస్సు ఆదివారం ముగియనుంది. ప్రధాని మోదీ 2014 నుంచి డీజీపీల సదస్సుపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ప్రతిఏటా సదస్సులో స్వయంగా పాల్గొంటున్నారు. -
నవంబర్‌లో డీజీపీల సదస్సు
సాక్షి, హైదరాబాద్: నవంబర్ చివరి వారంలో జరిగే ఆలిండియా డీజీపీల సదస్సుకు మధ్యప్రదేశ్ వేదిక కానుంది.ఈసారి ఎజెండాలో దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్ సమస్యలు, అంతర్గత భద్ర త, ఉగ్రవాదం, మావోయిస్టు కార్యకలాపాలు, కేంద్ర ప్రభుత్వం అందించే ఆధునీకరణ నిధులు తదితర అంశాలను రూపొందించిన ట్టు తెలిసింది. ఈ సదస్సు ప్రధాని మోదీ నేతృత్వంలో జరగనుంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), కేంద్ర హోంశాఖ ఉన్నతాధి కారులు, అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్‌లు ఈ సదస్సులో పాల్గొంటారు. సదస్సుకు సంబంధించి రెండ్రోజుల కిందట ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కీలక సమావేశాలు జరిగాయి. ఈ భేటీకి రాష్ట్ర డీజీపీతో పాటు అన్ని రాష్ట్రాల ఉన్నతాధికారు లు హాజరయ్యారు. డీజీపీ అనురాగ్ శర్మ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల పరిస్థితి, మావోయిస్టు కార్యకలాపాలు, ఐసిస్ కార్యకలాపా లు, ఉగ్రవాద నియంత్రణ చర్యలు, ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలు, గిరిజన యువతకు కల్పిస్తున్న శిక్షణ తదితర అంశాలన్నింటిపై నివేదిక సమర్పిం చారు. పోలీస్ ఆధునీకరణకు సం బంధించి వచ్చే ఐదేళ్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సదస్సులో చర్చించ నున్నట్టు సమాచారం. -
గోప్యంగా డీజీపీల సమావేశం
- ఉదయం 11నుంచి సాయంత్రం 4 వరకు సమావేశం - విలేకరులను అనుమతించని పోలీసులు భోగాపురం (విజయనగరం జిల్లా) : భోగాపురం మండలం ఎ.రావివలస సమీపంలోని సన్‌రే విలేజ్ రిసార్ట్స్‌లో నాలుగు రాష్ట్రాల డీజీపీలు సమావేశమయ్యారు. ఉదయం పదిగంటలకు వారంతా విశాఖ నుంచి జాతీయ రహదారి మీదుగా కాన్వాయ్‌గా రిసార్ట్స్‌కు చేరుకున్నారు. వారి రాకను పురస్కరించుకుని రహదారి పొడవునా భారీ బందోబస్తు, వాహనాల తనిఖీ చేపట్టారు. సాయుధ దళాలు రోడ్డుపైనున్న వంతెనల వద్ద జాతీయరహదారికి అనుసంధానమైన రహదారులు వద్ద పహారా కాశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, చత్తీస్ఘడ్ డీజీపీలతో పాటు బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, గ్రేహౌండ్స్ దళాల ఉన్నత అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. శనివారం కూడా ఈ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సమావేశ ప్రాంతానికి విలేకరులను సైతం అనుమతించలేదు. సమావేశంలో చర్చించిన అంశాలను అధికారులు బహిర్గతం చేయలేదు.