లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీల, కేంద్ర పోలీసు దళాల డీజీల సదస్సులో రెండో రోజు శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. మావోయిస్టుల హింస, వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదుల ఏరివేత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలను అరికట్టడం వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ డీజీపీల అభిప్రాయాలను తెలుసుకున్నారని వెల్లడించాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ సదస్సు ఆదివారం ముగియనుంది. ప్రధాని మోదీ 2014 నుంచి డీజీపీల సదస్సుపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ప్రతిఏటా సదస్సులో స్వయంగా పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment