విజయనగరం జిల్లాలో భారీ వర్షాల కారణంగా భోగాపురం మండలం రావాడ సమీపంలోని కాల్వపై నిర్మించిన వంతెన బుధవారం ఉదయం కుప్పకూలింది. దాంతో 20 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తవలస మండలం జోగయ్యపాలెంలో 200 ఎకరాల్లో పంట నీట మునిగింది.
అయితే జిల్లాలో భారీ వర్షాల కారణంగా అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భారీ వర్షాల కారణంగా జిల్లా వాసులకు ఎవరికి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైన వెంటనే ట్రోల్ ఫ్రీ నెంబర్ 08922 276 888, 1077కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.