
దక్షిణ కొరియాలో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి కుప్పకూలిపోగా.. ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న మరో ముగ్గురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంటున్నారు.
సౌత్ కొరియా(South Korea) నగరం చెయోనాన్‌లో ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం 10గం. ప్రాంతలో క్రేన్ సాయంతో బ్రిడ్జికి సపోర్ట్‌గా ఉండే ఇనుప నిర్మాణాలను కార్మికులు తరలిస్తున్నారు. ఆ టైంలో అప్పటికే అమర్చిన ఐదు ఇనుప నిర్మాణాలు ఒక్కసారిగా ఒరిగిపోవడంతో.. బ్రిడ్జి కుప్పకూలిపోయింది(Bridge Accident).
BIG BREAKING NEWS
At least 3 construction workers killed, 5 injured after portion of highway overpass collapsed near Anseong, South Korea
🇰🇷🇰🇷‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️ pic.twitter.com/qk6LSajfLe— WW3 Monitor (@WW3_Monitor) February 25, 2025
తొలుత ముగ్గురు మరణించార స్థానిక మీడియా కథనాలు ఇచ్చాయి. అయితే ఇద్దరే ఘటనా స్థలంలో మరణించారని అధికారులు స్పష్టత ఇచ్చారు. ఘటనపై ఆరా తీసిన తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సంగ్ మోక్(Choi Sang Mok).. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే.. దక్షిణ కొరియా కార్మిక శాఖ గణాంకాల ప్రకారం.. పని ప్రాంతంలో మరణాలు ఆ దేశంలో గణనీయంగా నమోదు అవుతున్నాయి. 2020-23 మధ్యకాలంలో ఏకంగా 8 వేల మంది కార్మికులు మరణించారక్కడ.
Comments
Please login to add a commentAdd a comment