న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ సిగ్నేచర్ బ్రిడ్జ్ కూలిపోయింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ప్రాణ నష్టం ఏం జరగలేదని అధకారులు తెలిపారు. ఉత్తరఖండ్ రుద్రప్రయాగ్‌లోని నార్కొట గ్రామ సమీపంలో భద్రినాథ్‌పై నిర్మిస్తున్న సిగ్నేచర్ వంతెన కూలిపోయింది. ఇటువంటి సిగ్నేచర్ వంతెన రాష్ట్రంలో నిర్మించటం తొలిసారి కావటం గమనార్హం. ఈ వంతెనను ఆర్‌సీసీ డెవలపర్స్ కంపెనీ సుమారు రూ. 76 కోట్ల వ్యయంతో నిర్మిస్తోంది.
Under-construction Signature Bridge in Uttarakhand's Rudraprayag has collapsed. The same bridge had collapsed on July 20, last year, after heavy rain.#Uttarakhand #Rudraprayag #SignatureBridge pic.twitter.com/I3Sf0lpvfE
— Vani Mehrotra (@vani_mehrotra) July 18, 2024
‘ఈ వంతెన ఇవాళ సాయంత్రం 4.15 గంటలకు కూలిపోయింది. అయితే పునాది గట్టినాగే ఉన్నప్పటికీ వంతెన టవర్ కుప్పకూలింది. ఈ ఘటనపై టెక్నికల్ కమిటి దర్యాప్తు చేస్తోంది. కూలిపోవడానికి గల కారణాలను కనుగొంటున్నారు’ అని అధికారులు తెలిపారు. సాధారణంగా రోజు 40 మంది కార్మికులు వంతెన నిర్మాణంలో పనిచేస్తున్నారు. ఈ రోజు ఎవ్వరు లేకపోవటంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధకారులు తెలిపారు.
ఈ ఘటనపై స్థానికులు మీడియాతో మాట్లాడారు. ‘ఈ వంతెన నిర్మాణ పనులు చాలా నిర్లక్ష్యంగా జరుగుతున్నాయి. ఈ వంతెన నిర్మాణాన్ని హైవే అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఈ ప్రాజెక్టును మరో కంపెనీ ఎందుకు ఇవ్వకుడదు?’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment