under construction
-
గుజరాత్ బుల్లెట్ ప్రాజెక్టులో అపశృతి
అహ్మాదాబాద్: గుజరాత్‌లోని బుల్లెట్ రైల్ ప్రాజెక్టులో ప్రమాదం చోటు చేసుకుంది. ఆనంద్ జిల్లా వసాద్ దగ్గర పిల్లర్లు కూలిపోయాయి. ఆకస్మికంగా పిల్లర్లు కూలడంతో ఈ ప్రమాదంలో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఐరన్ బీమ్ కూలిపోవడంతో 3-4 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను రక్షించారు. వారిని ఆసుపత్రికి తరలించామని ఆనంద్ ఎస్పీ గౌరవ్ జసాని చెప్పారు.VIDEO | Gujarat: "According to the primary information, 3-4 workers were trapped under the debris after an iron beam collapsed. The rescue operation started immediately. Two people have already been rescued and were taken to the hospital," says Anand SP Gaurav Jasani on collapse… pic.twitter.com/0N5ze6JR1S— Press Trust of India (@PTI_News) November 5, 2024 -
తొమ్మిదేళ్లుగా నిర్మాణంలోనే.. మూడోసారి కుప్పకూలిన వంతెన
పాట్నా: బిహార్‌లో మరో వంతెన కూలిపోయింది. ఖగారియా జిల్లాలో గంగా నదిపై నిర్మాణంలో ఉన్న సుల్తాన్‌గంజ్-అగువానీ ఘాట్ వంతనెలోని ఓ భాగం కూలి ఒక్కసారిగా నదిలో పడిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.ఇదిలా ఉండగా గత తొమ్మిదేళ్లుగా నిర్మాణంలోనే ఉన్న ఈ వంతెన కూలడం ఇప్పటికి ఇది మూడోసారి కావడం గమనార్హం. వంతెన కూలుతున్న సమయంలో అక్కడే ఉన్న స్థానికులు ఆ దృశ్యాలను రికార్డు చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే నిర్మాణంలో ఉండగానే ఈ వంతెన పదేపదే కూలిపోతుండటంతో నిర్మాణ నాణ్యత, ప్రాజెక్టుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.2014, ఫిబ్రవరి 23న లో భాగల్పూర్ జిల్లాలోని సుల్తాన్‌గంజ్ - ఖగారియా జిల్లాలోని అగువానీ ప్రాంతాల మధ్య గంగా నదిపై ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2015 మార్చి 9న నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం బిహార్ ప్రభుత్వం రూ.1,710 కోట్లు కేటాయించింది. ఇది భాగల్పూర్ నుంచి ఖగారియా మీదుగా జార్ఖండ్‌కు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది.2020 నాటికి ఈ వంతెన నిర్మాణం పూర్తికావాల్సి ఉండగా ఇప్పటికీ పూర్తికాలేదు. ముందుగా గతేడాది జూన్‌లో తుఫాను కారణంగా వంతెన పిల్లర్లు కొంతభాగం కుప్పకూలిపోగా తిరిగి నిర్మాణం చేపట్టారు. మళ్లీ జూన్ 4న మరోసారి కూలింది. నిర్మాణంలో ఉన్న వంతెన మూడుసార్లు కూలిపోవడంతో ప్రతిపక్షాలు నీతీశ్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.अगुवानी सुल्तानगंज में गंगा पे निर्माणाधीन पुल फिर तीसरी बार गिरा ।पूरा system भ्रष्टाचार में लिप्त हैं ।मैं लगातार बोल रहा था कि फिर गिरेगा लेकिन आज तक किसी पे कोई कार्यवाही नहीं हुईं।ना अधिकारी पे ,ना एस.पी सिंघला कंपनी पे ,ना रोडिक कन्सल्टेंसी पे। @narendramodi @nitin_gadkari pic.twitter.com/HLnA3EkaXB— Dr.Sanjeev Kumar MLA Parbatta,Bihar (@DrSanjeev0121) August 17, 2024 దీనిపై స్పందించిన ప్రభుత్వం నిర్మాణం చేపడుతున్న ఎస్ కే సింగ్లా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు జరిమానా విధించింది. వంతెనను సొంత ఖర్చుతో పునర్నిర్మించాలని ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు ఈ కంపెనీ ఈ ఘటనపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. -
ఉత్తరాఖండ్‌లో కూలిన సిగ్నేచర్ బ్రిడ్జ్
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ సిగ్నేచర్ బ్రిడ్జ్ కూలిపోయింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ప్రాణ నష్టం ఏం జరగలేదని అధకారులు తెలిపారు. ఉత్తరఖండ్ రుద్రప్రయాగ్‌లోని నార్కొట గ్రామ సమీపంలో భద్రినాథ్‌పై నిర్మిస్తున్న సిగ్నేచర్ వంతెన కూలిపోయింది. ఇటువంటి సిగ్నేచర్ వంతెన రాష్ట్రంలో నిర్మించటం తొలిసారి కావటం గమనార్హం. ఈ వంతెనను ఆర్సీసీ డెవలపర్స్ కంపెనీ సుమారు రూ. 76 కోట్ల వ్యయంతో నిర్మిస్తోంది.Under-construction Signature Bridge in Uttarakhand's Rudraprayag has collapsed. The same bridge had collapsed on July 20, last year, after heavy rain.#Uttarakhand #Rudraprayag #SignatureBridge pic.twitter.com/I3Sf0lpvfE— Vani Mehrotra (@vani_mehrotra) July 18, 2024 ‘ఈ వంతెన ఇవాళ సాయంత్రం 4.15 గంటలకు కూలిపోయింది. అయితే పునాది గట్టినాగే ఉన్నప్పటికీ వంతెన టవర్ కుప్పకూలింది. ఈ ఘటనపై టెక్నికల్ కమిటి దర్యాప్తు చేస్తోంది. కూలిపోవడానికి గల కారణాలను కనుగొంటున్నారు’ అని అధికారులు తెలిపారు. సాధారణంగా రోజు 40 మంది కార్మికులు వంతెన నిర్మాణంలో పనిచేస్తున్నారు. ఈ రోజు ఎవ్వరు లేకపోవటంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధకారులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు మీడియాతో మాట్లాడారు. ‘ఈ వంతెన నిర్మాణ పనులు చాలా నిర్లక్ష్యంగా జరుగుతున్నాయి. ఈ వంతెన నిర్మాణాన్ని హైవే అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఈ ప్రాజెక్టును మరో కంపెనీ ఎందుకు ఇవ్వకుడదు?’ అని అన్నారు. -
పెద్దపల్లి జిల్లా ఓడేడులో కూలిన మానేరు వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి
-
నాలుగేళ్లుగా నిర్మాణంలోనే.. కూలిన బ్రిడ్జి.. 9 రోజుల్లో ఐదో ఘటన
పాట్నా: బిహార్‌లో వరుసగా బ్రిడ్జిలు కూలుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో బ్రిడ్జి కూలింది. శుక్రవారం మధుబని జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది.దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో 75 మీటర్ల పొడవైన ఈ వంతెనను భేజా పోలీస్ స్టేషన్‌లోని మాధేపూర్ బ్లాక్‌లో బీహార్ గ్రామీణ పనుల విభాగం 2021 నుంచి నిర్మిస్తోంది. ఇది మధుబని – సుపాల్ జిల్లాల మధ్య భూతాహి నదిపై ఉంది.అయితే, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భూతాహి నదిలో నీటి మట్టం పెరిగింది. నీటి ఉద్ధృతికి నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. 25 మీటర్ల పొడవు గల సపోర్టింగ్ పిల్లర్ దిగువన ఉన్న నదిలో కూలిపోయింది.𝟗 दिन के अंदर बिहार में यह 𝟓वाँ पुल गिरा है।मधुबनी-सुपौल के बीच भूतही नदी पर वर्षों से निर्माणाधीन पुल गिरा। क्या आपको पता लगा? नहीं तो, क्यों? बूझो तो जाने? #Bihar #Bridge pic.twitter.com/IirnmOzRSo— Tejashwi Yadav (@yadavtejashwi) June 28, 2024 రాష్ట్రంలో బ్రిడ్జి ప్రమాదాల ఘటనపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు. కాగా, రాష్ట్రంలో గత తొమ్మిది రోజుల వ్యవధిలోనే ఇది ఐదో ఘటన కావడం గమనార్హం.ఇప్పటికే వరుసగా నాలుగు బ్రిడ్జిలు కూలిపోయిన విషయం తెలిసిందే. గురువారం కిషన్‌గంజ్ జిల్లాలో, జూన్ 23న తూర్పు చంపారన్ జిల్లాలో, 22న సివాన్‌లో, 19న అరారియాలో ఇలాగే వంతెనలు కూలిపోయాయి. దీంతో నిర్మాణ పనుల నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
బిహార్‌లో కూలిన తీగల వంతెన
పట్నా: రూ.1,700 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న భారీ తీగల వంతెన కూలిపోయింది. బిహార్ రాష్ట్రం భాగల్పూర్ జిల్లాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. నిర్మాణంలో ఈ వారధి తొలుత రెండు ముక్కలుగా విడిపోయింది. ఒకదాని తర్వాత ఒకటి నేలకూలాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. బ్రిడ్జి కూలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. గంగా నదిపై ఖగారియా.. అగువానీ, సుల్తాన్‌గంజ్ మధ్య ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించారు. రెండేళ్ల క్రితం కొంత భాగం కూలిపోవడంతో పునర్నిర్మించారు. రెండు నెలల క్రితం బలమైన ఈదురు గాలుల ధాటికి పగుళ్లు వచ్చాయి. ఆదివారం నేలకూలింది. దాదాపు ఐదు స్తంభాలు కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణంలో ఉన్న వంతెన కూలిన ఘటనపై ప్రతిపక్ష బీజేపీ నేత విజయ్‌కుమార్ సిన్హా స్పందించారు. రాష్ట్రంలో ప్రతి పనిలోనూ కమిషన్లు తీసుకోవడం ఒక సంప్రదాయంగా మారిపోయిందని నితీశ్ కుమార్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో పరిపాలన ఆగిపోయిందని, ఆరాచకం, అవినీతి పెచ్చరిల్లిపోతున్నాయని ఆరోపించారు. ఇక్కడ వ్యవస్థలు భ్రష్టుపట్టిపోతుంటే సీఎం నితీశ్ విపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. -
Ayodhya: అయోధ్య గర్భగుడి ఫస్ట్ ఫొటో వైరల్
లక్నో: నిర్మాణ దశలో ఉన్న అయోధ్య రామమందిరం ఫొటోలు ఈ మధ్య తరచూ ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆలయ గర్భగుడి తాలుకా ఫోటోను రిలీజ్ చేశారు రామ మందిర ట్రస్ట్ కీలక సభ్యుడు ఒకరు. అయోధ్య గర్భగుడి ఇదేనంటూ ఫొటోను శుక్రవారం ట్వీట్ చేశారాయన. గర్భగుడి పైభాగ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. అయినప్పటికీ రాములోరి విగ్రహం ఇక్కడే కొలువుదీరబోతోందని పేర్కొంటూ జై శ్రీరామ్ అంటూ క్యాప్షన్ ఉంచారాయన. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రకు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్. ఆయనే నిర్మాణంలో ఉన్న గర్బగుడి ఫొటో ఉంచారు. ఇక గర్భగుడిలో కొలువు దీరబోయే ప్రధాన విగ్రహాలను చెక్కేందుకు నేపాల్ నుంచి పవిత్రమైన రాళ్లను తెప్పించిన సంగతి తెలిసే ఉంటుంది. ఇదీ చదవండి: సాలిగ్రామ శిలల పవిత్రత గురించి తెలుసా? రామ మందిరం 2024 మొదట్లోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే.. ఆలయం కింది అంతస్తు పనులు సగం భాగం దాటాయి. ఆగస్టు నాటికి గర్భగుడి నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది. గర్భగుడి కింది అంతస్తులో 170 స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. जय श्री राम। ‘गृभगृह’ की तस्वीर, जहाँ प्रभु श्री रामलला विराजमान होंगे। pic.twitter.com/HtxSAayZi0 — Champat Rai (@ChampatRaiVHP) March 17, 2023 सीता लखन समेत प्रभु, सोहत तुलसीदास। हरषत सुर बरषत सुमन, सगुन सुमंगल बास॥ pic.twitter.com/45TyCYbtbH — Champat Rai (@ChampatRaiVHP) March 16, 2023 होइहि सोइ जो राम रचि राखा। श्री रामजन्मभूमि मंदिर निर्माण कार्य प्रगति के कुछ दृश्य। pic.twitter.com/buvuuW4Ta3 — Champat Rai (@ChampatRaiVHP) March 15, 2023 जय जय श्री राम। pic.twitter.com/nxbWSmSS6a — Champat Rai (@ChampatRaiVHP) March 13, 2023 श्री रामलला के भव्य मंदिर निर्माण कार्य प्रगति की कुछ झलकियाँ। pic.twitter.com/b6BJvsTyTx — Champat Rai (@ChampatRaiVHP) March 6, 2023 -
కుప్పకూలిన ఫ్లై ఓవర్: ఒకరు మృతి
చెన్నై: తమిళనాడులోని మధురైలో ఫ్లై ఓవర్ కూలిన ఘటన విషాదాన్ని నింపింది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌లోని ఫ్లైఓవర్ ఒక భాగం కూలిపోయింది శనివారం అకస్మాత్తుగా కూప్పకూలింది ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయపడినట్టు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్నరక్షణ సిబ్బంది సహాయక చర్యల్ని చేపట్టాయి. శిథిలాల కింద ప్రజలు చిక్కుకున్నారో తెలుసుకునేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. Tamil Nadu: A portion of an under-construction flyover collapses in Madurai; fire and rescue personnel on the spot pic.twitter.com/QNzXXgDNhb — ANI (@ANI) August 28, 2021 -
వారణాసిలో ఘోర ప్రమాదం
-
కుప్పకూలిన ఫ్లైఓవర్.. ఘోర ప్రమాదం
వారణాసి: ఉత్తర ప్రదేశ్‌లో మంగళవారం సాయంత్రం ఘోర ప్రమాదం సంభవించింది. వారణాసిలోని కాంట్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. చాలా మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది కూలీలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరికొందరు కూలీలు శకలాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, మంత్రి నీల్కాంత్ తివారీలను ఘటనాస్థలానికి వెళ్లాల్సిందిగా సీఎం యోగి ఆదేశించారు. ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. Extremely saddened by the loss of lives due to the collapse of an under-construction flyover in Varanasi. I pray that the injured recover soon. Spoke to officials and asked them to ensure all possible support to those affected. — Narendra Modi (@narendramodi) 15 May 2018 I spoke to UP CM Yogi Adityanath Ji regarding the situation due to the collapse of an under-construction flyover in Varanasi. The UP Government is monitoring the situation very closely and is working on the ground to assist the affected. — Narendra Modi (@narendramodi) 15 May 2018 -
నిర్లక్ష్యం నీడలో ‘ఆదర్శం’
నత్తనడకన పాఠశాల భవన నిర్మాణం నాలుగేళ్లుగా కొనసాగుతున్న పనులు అధికారుల పర్యవేక్షణ లోపం కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం షిప్టింగ్ పద్ధతిలో నష్టపోతున్న విద్యార్థులు హత్నూర: ఆదర్శ పాఠశాల భవన నిర్మాణం నాలుగేళ్లుగా నత్తనడకన కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు మండలానికో ఆదర్శ పాఠశాల నిర్మించి మౌలికసదుపాయాలతో విద్యను అందించాలన్న లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వం మూలంగా పనులు ముందుకు సాగడం లేదు. హత్నూర మండలం గుండ్లమాచునూర్ గ్రామ శివారులో 3 కోట్ల పైచిలుకు నిధులను 2012-13 విద్యా సంవత్సరంలో ఆదర్శ పాఠశాల భవన నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో అప్పటి మంత్రి సునీతారెడ్డి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రారంభంలో సదరు కాంట్రాక్టర్, అధికారులు, హడావిడి చేసి పిల్లర్ల స్థాయి వరకు పనులు చేసి వదిలేశారు. రెండేళ్ళు గడిచిన ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయింది. అనంతరం అధికారుల్లో కదలిక వచ్చి తిరిగి పనులు ప్రారంభించినా నాలుగేళ్ళు గడుస్తున్నా ఇప్పటికి స్లాబ్‌లెవల్ మాత్రమే పనులు పూర్తయ్యాయి. మూడు సంవత్సరాలుగా ఆదర్శ పాఠశాల ప్రారంభమైనా భవనం అసంపూర్తిగా ఉండడంతో హత్నూరలోని కస్తుర్బాగాంధీ పాఠశాలలో తరగతులు ప్రారంభించారు. మూడేళ్ళుగా విద్యార్థులు షిప్టింగ్ పద్ధతిలోఒకే పూట మోడల్‌స్కూల్ విద్యార్థులకు పాఠాలు బోధిస్తు వస్తున్నారు. సౌకర్యాలు సరిపోను లేకపోవడంతో విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం మూడో సంవత్సరం ఆదర్శపాఠశాలలో 415మంది విద్యార్థులు, 5నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదువును కొనసాగిస్తున్నారు. పాఠశాల భవన నిర్మాణ పనులు పూర్తి చేయించాలని పాఠశాల విద్యార్థులు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి దృష్టికి , అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు , ప్రజాప్రతినిధులు స్పందించాలని వారు కోరుతున్నారు. షిప్టింగ్ పద్ధతితో నష్టపోతున్నాం పాఠశాల భవనం పూర్తికాకపోవడంతో హత్నూరలోని కస్తుర్భాగాంధీ పాఠశాలల్లో షిప్టింగ్ పద్ధతిలో మధ్యాహ్నం వరకు తరగతులు బోధించడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. - మహేష్, విద్యార్థి త్వరగా నిర్మించాలి ఆదర్శ పాఠశాల భవనం త్వరగా నిర్మాణం పూర్తిచేసి మా విద్యార్థులను అక్కడికి తరలించాలి. నత్తనడకన కొనసాగుతుండటం వల్ల విద్యార్థులందరం నష్టపోతున్నాం. పాఠశాల నిర్మాణం చేయాలని రాస్తారోకో సైతం చేశాం. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. - బిందు, విద్యార్థిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం పాఠశాల భవనం లేక విద్యార్థులు నష్టపోతున్న విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. త్వరగా సొంత భవనాన్ని నిర్మించి ఇస్తే విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుంది. ఇక్కడ సౌకర్యాలు సరిపోవడం లేదు. - మహమ్మద్‌రఫీ, ప్రిన్సిపాల్