పాట్నా: బిహార్‌లో మరో వంతెన కూలిపోయింది. ఖగారియా జిల్లాలో గంగా నదిపై నిర్మాణంలో ఉన్న సుల్తాన్‌గంజ్-అగువానీ ఘాట్ వంతనెలోని ఓ భాగం కూలి ఒక్కసారిగా నదిలో పడిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఇదిలా ఉండగా గత తొమ్మిదేళ్లుగా నిర్మాణంలోనే ఉన్న ఈ వంతెన కూలడం ఇప్పటికి ఇది మూడోసారి కావడం గమనార్హం. వంతెన కూలుతున్న సమయంలో అక్కడే ఉన్న స్థానికులు ఆ దృశ్యాలను రికార్డు చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే నిర్మాణంలో ఉండగానే ఈ వంతెన పదేపదే కూలిపోతుండటంతో నిర్మాణ నాణ్యత, ప్రాజెక్టుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
2014, ఫిబ్రవరి 23న లో భాగల్పూర్ జిల్లాలోని సుల్తాన్‌గంజ్ - ఖగారియా జిల్లాలోని అగువానీ ప్రాంతాల మధ్య గంగా నదిపై ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2015 మార్చి 9న నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం బిహార్ ప్రభుత్వం రూ.1,710 కోట్లు కేటాయించింది. ఇది భాగల్‌పూర్ నుంచి ఖగారియా మీదుగా జార్ఖండ్‌కు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది.
2020 నాటికి ఈ వంతెన నిర్మాణం పూర్తికావాల్సి ఉండగా ఇప్పటికీ పూర్తికాలేదు. ముందుగా గతేడాది జూన్‌లో తుఫాను కారణంగా వంతెన పిల్లర్లు కొంతభాగం కుప్పకూలిపోగా తిరిగి నిర్మాణం చేపట్టారు. మళ్లీ జూన్ 4న మరోసారి కూలింది. నిర్మాణంలో ఉన్న వంతెన మూడుసార్లు కూలిపోవడంతో ప్రతిపక్షాలు నీతీశ్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
अगुवानी सुल्तानगंज में गंगा पे निर्माणाधीन पुल फिर तीसरी बार गिरा ।पूरा system भ्रष्टाचार में लिप्त हैं ।मैं लगातार बोल रहा था कि फिर गिरेगा लेकिन आज तक किसी पे कोई कार्यवाही नहीं हुईं।ना अधिकारी पे ,ना एस.पी सिंघला कंपनी पे ,ना रोडिक कन्सल्टेंसी पे। @narendramodi @nitin_gadkari pic.twitter.com/HLnA3EkaXB
— Dr.Sanjeev Kumar MLA Parbatta,Bihar (@DrSanjeev0121) August 17, 2024
దీనిపై స్పందించిన ప్రభుత్వం నిర్మాణం చేపడుతున్న ఎస్ కే సింగ్లా కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు జరిమానా విధించింది. వంతెనను సొంత ఖర్చుతో పునర్నిర్మించాలని ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు ఈ కంపెనీ ఈ ఘటనపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment