bridge collapse
-
వీడియో: చూస్తుండగానే ఘోరం.. కుప్పకూలిన బ్రిడ్జి
దక్షిణ కొరియాలో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి కుప్పకూలిపోగా.. ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న మరో ముగ్గురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంటున్నారు.సౌత్ కొరియా(South Korea) నగరం చెయోనాన్లో ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం 10గం. ప్రాంతలో క్రేన్ సాయంతో బ్రిడ్జికి సపోర్ట్‌గా ఉండే ఇనుప నిర్మాణాలను కార్మికులు తరలిస్తున్నారు. ఆ టైంలో అప్పటికే అమర్చిన ఐదు ఇనుప నిర్మాణాలు ఒక్కసారిగా ఒరిగిపోవడంతో.. బ్రిడ్జి కుప్పకూలిపోయింది(Bridge Accident).BIG BREAKING NEWSAt least 3 construction workers killed, 5 injured after portion of highway overpass collapsed near Anseong, South Korea🇰🇷🇰🇷‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️ pic.twitter.com/qk6LSajfLe— WW3 Monitor (@WW3_Monitor) February 25, 2025తొలుత ముగ్గురు మరణించార స్థానిక మీడియా కథనాలు ఇచ్చాయి. అయితే ఇద్దరే ఘటనా స్థలంలో మరణించారని అధికారులు స్పష్టత ఇచ్చారు. ఘటనపై ఆరా తీసిన తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సంగ్ మోక్(Choi Sang Mok).. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. దక్షిణ కొరియా కార్మిక శాఖ గణాంకాల ప్రకారం.. పని ప్రాంతంలో మరణాలు ఆ దేశంలో గణనీయంగా నమోదు అవుతున్నాయి. 2020-23 మధ్యకాలంలో ఏకంగా 8 వేల మంది కార్మికులు మరణించారక్కడ. -
తొమ్మిదేళ్లుగా నిర్మాణంలోనే.. మూడోసారి కుప్పకూలిన వంతెన
పాట్నా: బిహార్‌లో మరో వంతెన కూలిపోయింది. ఖగారియా జిల్లాలో గంగా నదిపై నిర్మాణంలో ఉన్న సుల్తాన్‌గంజ్-అగువానీ ఘాట్ వంతనెలోని ఓ భాగం కూలి ఒక్కసారిగా నదిలో పడిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.ఇదిలా ఉండగా గత తొమ్మిదేళ్లుగా నిర్మాణంలోనే ఉన్న ఈ వంతెన కూలడం ఇప్పటికి ఇది మూడోసారి కావడం గమనార్హం. వంతెన కూలుతున్న సమయంలో అక్కడే ఉన్న స్థానికులు ఆ దృశ్యాలను రికార్డు చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే నిర్మాణంలో ఉండగానే ఈ వంతెన పదేపదే కూలిపోతుండటంతో నిర్మాణ నాణ్యత, ప్రాజెక్టుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.2014, ఫిబ్రవరి 23న లో భాగల్పూర్ జిల్లాలోని సుల్తాన్‌గంజ్ - ఖగారియా జిల్లాలోని అగువానీ ప్రాంతాల మధ్య గంగా నదిపై ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2015 మార్చి 9న నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం బిహార్ ప్రభుత్వం రూ.1,710 కోట్లు కేటాయించింది. ఇది భాగల్పూర్ నుంచి ఖగారియా మీదుగా జార్ఖండ్‌కు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది.2020 నాటికి ఈ వంతెన నిర్మాణం పూర్తికావాల్సి ఉండగా ఇప్పటికీ పూర్తికాలేదు. ముందుగా గతేడాది జూన్‌లో తుఫాను కారణంగా వంతెన పిల్లర్లు కొంతభాగం కుప్పకూలిపోగా తిరిగి నిర్మాణం చేపట్టారు. మళ్లీ జూన్ 4న మరోసారి కూలింది. నిర్మాణంలో ఉన్న వంతెన మూడుసార్లు కూలిపోవడంతో ప్రతిపక్షాలు నీతీశ్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.अगुवानी सुल्तानगंज में गंगा पे निर्माणाधीन पुल फिर तीसरी बार गिरा ।पूरा system भ्रष्टाचार में लिप्त हैं ।मैं लगातार बोल रहा था कि फिर गिरेगा लेकिन आज तक किसी पे कोई कार्यवाही नहीं हुईं।ना अधिकारी पे ,ना एस.पी सिंघला कंपनी पे ,ना रोडिक कन्सल्टेंसी पे। @narendramodi @nitin_gadkari pic.twitter.com/HLnA3EkaXB— Dr.Sanjeev Kumar MLA Parbatta,Bihar (@DrSanjeev0121) August 17, 2024 దీనిపై స్పందించిన ప్రభుత్వం నిర్మాణం చేపడుతున్న ఎస్ కే సింగ్లా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు జరిమానా విధించింది. వంతెనను సొంత ఖర్చుతో పునర్నిర్మించాలని ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు ఈ కంపెనీ ఈ ఘటనపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. -
ఉత్తరాఖండ్‌లో కూలిన సిగ్నేచర్ బ్రిడ్జ్
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ సిగ్నేచర్ బ్రిడ్జ్ కూలిపోయింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ప్రాణ నష్టం ఏం జరగలేదని అధకారులు తెలిపారు. ఉత్తరఖండ్ రుద్రప్రయాగ్‌లోని నార్కొట గ్రామ సమీపంలో భద్రినాథ్‌పై నిర్మిస్తున్న సిగ్నేచర్ వంతెన కూలిపోయింది. ఇటువంటి సిగ్నేచర్ వంతెన రాష్ట్రంలో నిర్మించటం తొలిసారి కావటం గమనార్హం. ఈ వంతెనను ఆర్సీసీ డెవలపర్స్ కంపెనీ సుమారు రూ. 76 కోట్ల వ్యయంతో నిర్మిస్తోంది.Under-construction Signature Bridge in Uttarakhand's Rudraprayag has collapsed. The same bridge had collapsed on July 20, last year, after heavy rain.#Uttarakhand #Rudraprayag #SignatureBridge pic.twitter.com/I3Sf0lpvfE— Vani Mehrotra (@vani_mehrotra) July 18, 2024 ‘ఈ వంతెన ఇవాళ సాయంత్రం 4.15 గంటలకు కూలిపోయింది. అయితే పునాది గట్టినాగే ఉన్నప్పటికీ వంతెన టవర్ కుప్పకూలింది. ఈ ఘటనపై టెక్నికల్ కమిటి దర్యాప్తు చేస్తోంది. కూలిపోవడానికి గల కారణాలను కనుగొంటున్నారు’ అని అధికారులు తెలిపారు. సాధారణంగా రోజు 40 మంది కార్మికులు వంతెన నిర్మాణంలో పనిచేస్తున్నారు. ఈ రోజు ఎవ్వరు లేకపోవటంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధకారులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు మీడియాతో మాట్లాడారు. ‘ఈ వంతెన నిర్మాణ పనులు చాలా నిర్లక్ష్యంగా జరుగుతున్నాయి. ఈ వంతెన నిర్మాణాన్ని హైవే అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఈ ప్రాజెక్టును మరో కంపెనీ ఎందుకు ఇవ్వకుడదు?’ అని అన్నారు. -
బిహార్‌లో కూలిన మరో వంతెన.. 17 రోజుల్లో 12వ ఘటన
పాట్నా: బిహార్‌లో వంతెనలు పేకమేడల్లా కూలుతున్నాయి. ఒకదాని వెనక ఒకటి పోటీపడి మరీ కుప్పకూలిపోతున్నాయి. గత 17 రోజుల్లో ఇలా రాష్ట్రవ్యాప్తంగా పన్నెండు వంతెనలు కుప్పకూలగా.. తాజాగా మరో బ్రిడ్జి కూలింది.గురువారం సరన్ జిల్లాలోనని గ్రామాలను- సివాన్ జిల్లాను కలుపుతూ గండకి నదిపై ఉన్న 15ఏళ్ల నాటి వంతెన కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.బ్రిడ్జి కూలడానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ ప్రాంతంలో ఇటీవల డీసిల్టింగ్ పని జరిగినట్లు అధికారులు తెలిపారు. కాగా సరన్ జిల్లాలో గత 24 గంటల్లో మూడు వంతెనలు కూలినట్లు జిల్లా మేజిస్ట్రేట్ అమన్ సమీర్ తెలిపారు. గత 17 రోజుల్లో మొత్తం 12 వంతెనలు కూలిపోయాయి,ఇదిలా ఉండగా రాష్ట్రంలోని అత్యవసరంగా మరమ్మతులు చేయాల్సిన అన్ని పాత వంతెనలను గుర్తించేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సర్వేకు ఆదేశించిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన వెలుగుచూసింది. వంతెన నిర్వహణ విధానాలను మెరుగుపరచాలని రహదారుల నిర్మాణం, గ్రామీణ పనుల శాఖలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.ఇటీవల సివాన్, మధుబని, అరారియా, తూర్పు చంపారన్, కిషన్‌గంజ్ జిల్లాల్లోనూ వంతెనలు కూలాపోయాయి. భారీ వర్షాలు, నదీ ప్రవాహం పెరిగిన ఈ తరుణంలో వంతెనలు కూలుతుండటంతో వాటి నాణ్యతపై అనుమానాలు పెరిగాయి. దీంతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసి వంతెనల సామర్థ్యం, స్థితిగతులపై సమీక్ష నిర్వహంచనున్నారు. -
నాలుగేళ్లుగా నిర్మాణంలోనే.. కూలిన బ్రిడ్జి.. 9 రోజుల్లో ఐదో ఘటన
పాట్నా: బిహార్‌లో వరుసగా బ్రిడ్జిలు కూలుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో బ్రిడ్జి కూలింది. శుక్రవారం మధుబని జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది.దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో 75 మీటర్ల పొడవైన ఈ వంతెనను భేజా పోలీస్ స్టేషన్‌లోని మాధేపూర్ బ్లాక్‌లో బీహార్ గ్రామీణ పనుల విభాగం 2021 నుంచి నిర్మిస్తోంది. ఇది మధుబని – సుపాల్ జిల్లాల మధ్య భూతాహి నదిపై ఉంది.అయితే, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భూతాహి నదిలో నీటి మట్టం పెరిగింది. నీటి ఉద్ధృతికి నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. 25 మీటర్ల పొడవు గల సపోర్టింగ్ పిల్లర్ దిగువన ఉన్న నదిలో కూలిపోయింది.𝟗 दिन के अंदर बिहार में यह 𝟓वाँ पुल गिरा है।मधुबनी-सुपौल के बीच भूतही नदी पर वर्षों से निर्माणाधीन पुल गिरा। क्या आपको पता लगा? नहीं तो, क्यों? बूझो तो जाने? #Bihar #Bridge pic.twitter.com/IirnmOzRSo— Tejashwi Yadav (@yadavtejashwi) June 28, 2024 రాష్ట్రంలో బ్రిడ్జి ప్రమాదాల ఘటనపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు. కాగా, రాష్ట్రంలో గత తొమ్మిది రోజుల వ్యవధిలోనే ఇది ఐదో ఘటన కావడం గమనార్హం.ఇప్పటికే వరుసగా నాలుగు బ్రిడ్జిలు కూలిపోయిన విషయం తెలిసిందే. గురువారం కిషన్‌గంజ్ జిల్లాలో, జూన్ 23న తూర్పు చంపారన్ జిల్లాలో, 22న సివాన్‌లో, 19న అరారియాలో ఇలాగే వంతెనలు కూలిపోయాయి. దీంతో నిర్మాణ పనుల నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
ఈదురుగాలుల ఎఫెక్ట్.. కూలిన వంతెన
టేకుమట్ల/మహాముత్తారం/ముత్తారం(మంథని): జయశంకర్ భూపాలపల్లి–పెద్దపల్లి జిల్లాను అనుసంధానం చేస్తూ ఓడేడ్ – గర్మిళ్లపల్లి మధ్య మానేరుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు కూప్పకులాయి. సోమవారం రాత్రి వీచిన బలమైన గాలుల ధాటికి పియర్లపై అమర్చిన మూడు గడ్డర్లు ఒక్కసారిగా కిందపడ్డాయి. 2016 ఆగస్టు 4న రూ.47.4కోట్ల అంచనా వ్యయంతో 40 మీటర్ల పొడవున 24 పియర్లతో వంతెన నిర్మాణం ప్రారంభించారు. నాటినుంచి ఈ అంతర్ జిల్లా వంతెన నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు సగం గడ్డర్లు కూడా పూర్తి కాలేదు. కాగా, సోమవారం రాత్రి బలమైన గాలులకు రెండు, మూడు పియర్లపై అమర్చిన మూడు గడ్డర్లు విరిగి నేలమట్టమయ్యాయి. సిమెంట్ దిమ్మెలకు బదులు కర్రలు పెట్టి గడ్డర్లు బిగించడంతో వర్షానికి తడిసి నానిపోయి మానేరులో నిర్మించిన తాత్కాలిక రోడ్డుపై అవి కూలిపోయాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ రోడ్డుపై పగలు వందలాదిమంది ప్రయాణాలు సాగిస్తుంటారనీ, వంతెన గడ్డర్లు పగలు కూలి ఉంటే ఊహించని ప్రాణనష్టం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మరో ఐదు గడ్డర్లు కూలేందుకు సిద్ధం నంబర్ 2, 3 పియర్ల మధ్య ఓ వైపు ఉన్న మూడు గడ్డర్లు కూలిపోగా, మరో పక్క రెండు ఒంగడంతో కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే 23, 24 పియర్లపైనున్న మరో మూడు గడ్డర్లు కూడా ఒక వైపునకు ఒంగి కూలే పరిస్థితిలో ఉన్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే: ఎస్ఈ ఆర్ అండ్ బీ జగిత్యాల ఎస్ఈ చందర్‌సింగ్, ఈఈ రాములు, గోదావరిఖని ఏసీపీ రమేశ్ మంగళవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్ఈ చందర్‌సింగ్ మాట్లాడుతూ, బలమైన గాలుల ధాటికి వంతెనలు కూలవని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే ఇది కూలిందన్నారు. విచారణ చేపడతాం: మంత్రి శ్రీధర్‌బాబు గత ప్రభుత్వంలో చేపట్టిన బ్రిడ్జిల నిర్మాణాల నాణ్యత ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, మొన్న కాళేశ్వరం నేడు ఓడేడ్ వంతెన కూలిపోవడమే నిదర్శనమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మహాముత్తారం ప్రచారానికి వచ్చిన ఆయన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి మీడియాతో మాట్లాడారు. కలకాలం ఉండాల్సిన బ్రిడ్జి కడుతుండగానే గాలికి కూలిపోవడం దారుణమన్నారు. ఇలాంటి నిర్మాణాలు నిర్మించిన ఘనత గత ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టి, సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకునే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. -
అమెరికా నౌక ప్రమాదం.. ఆరుగురు మృతి!
బాల్టిమోర్: అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రంలోని బాల్టీమోర్ నగరంలో చోటు చేసుకున్న బ్రిడ్జ్ కుప్పకూలిన ఘోర ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. నదిలో పడి గల్లంతు అయిన ఆరుగురు మరణించారని భావించిన అధికారులు సహాయక చర్యలు నిలిపివేశారు. మంగళవారం అమెరికాలో మేరీలాండ్ రాష్ట్రంలోని బాల్టీమోర్ నగరంలో ఘోర ప్రమాదం సంభవించింది. పటాప్స్కో నదిలో వాహన కంటైనర్లతో వెళ్తున్న ఓ భారీ నౌక పవర్ ఫెయిల్యూర్‌కు గురైంది. అదుపు తప్పి నదిపై ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జిని శరవేగంగా ఢీకొంది. దాంతో వంతెన కుప్పకూలింది. దానిపై ప్రయాణిస్తున్న వాహనాలు నీటిలో పడి మునిగిపోయాయి. వాటిలో ప్రయాణిస్తున్నవారు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై గుంతలు పూడుస్తున్న ఆరుగురు సిబ్బంది కూడా నదిలో పడిపోయారు. అధికారులు ఇద్దరిని రక్షించారు. కనీసం ఆరుగురి దాకా గల్లంతైనట్టు తెలుస్తోంది. ప్రమాద స్థలంలో నది 15 మీటర్ల లోతుంది. నీళ్లు కూడా బాగా చల్లగా ఉండటంతో వారంతా దుర్మరణం పాలై ఉంటారని భావిస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి 1.30 దాటాక ఈ దుర్ఘటన జరిగింది. నౌకలోని సిబ్బంది మొత్తం భారతీయులే. నౌక అదుపు తప్పిన వెంటనే వారు హుటాహుటిన ప్రమాద హెచ్చరికలు (మేడే) జారీ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు అప్రమత్తమై వాహనాలేవీ బ్రిడ్జిపైకి వెళ్లకుండా నియంత్రించారు. దానికి తోడు ప్రమాదం జరిగింది అర్ధరాత్రి వేళ కావడంతో బ్రిడ్జిపై ట్రాఫిక్ కూడా భారీగా లేదు. ఇలా జరిగింది... ప్రమాద సమయంలో నౌక గంటకు 15 కి.మీ. వేగంతో వెళ్తోంది. పవర్ ఫెయిల్యూర్‌తో అదుపు తప్పి శరవేగంగా బ్రిడ్జికేసి దూసుకొచ్చి దాని తాలూకు పిల్లర్‌ను ఢీకొట్టింది. పిల్లర్ విరగడంతో 2.6 కిలోమీటర్ల పొడవున్న వంతెన ఒక్కసారిగా కుంగిపోయింది. సెకండ్ల వ్యవధిలో పాక్షికంగా కుప్పకూలింది. ఆ వెంటనే నౌకలో మంటలు చెలరేగి దట్టమైన పొగ వెలువడింది. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కనీవినీ ఎరగని ప్రమాదమని మేరీలాండ్ గవర్నర్ వెస్ మూర్ అన్నారు. ప్రమాద హెచ్చరికకు అధికారులు శరవేగంగా స్పందించి ఎంతోమంది ప్రాణాలను కాపాడారంటూ కొనియాడారు. ప్రమాదం జరిగిన తీరు యాక్షన్ సినిమా సీన్‌ను తలపించిందని బాల్టీమోర్ మేయర్ బ్రాండన్ స్కాట్ అన్నారు. నగరంలో అత్యవసర పరిస్థితి విధించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పవర్ ఫెయిల్యూరే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేలినా మరింత లోతుగా దర్యాప్తు సాగుతోంది. భారత సిబ్బంది క్షేమం ప్రమాదానికి గురైన నౌక పేరు డాలీ. గ్రీస్ ఓషియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఈ నౌక ప్రస్తుతతం సినర్జీ మెరైన్ గ్రూప్ నిర్వహణలో ఉంది. ప్రఖ్యాత డెన్మార్క్ షిప్పింగ్ కంపెనీ ‘మెర్క్స్’కు చెందిన సరుకుతో బాల్టిమోర్ రేవు నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు వెళ్తుండగా దుర్ఘటన జరిగింది. 985 అడుగుల పొడవు, 157 అడుగుల వెడల్పున్న ఈ నౌకలో ఇద్దరు పైలట్లు సహా మొత్తం 22 మంది సిబ్బందీ భారతీయులేనని సినర్జీ మెరైన్ గ్రూప్ వెల్లడించింది. వారంతా క్షేమంగానే ఉన్నారని పేర్కొంది. ప్రమాదం నేపథ్యంలో అమెరికా తూర్పు తీరంలో అత్యంత బిజీ ఓడరేవుల్లో ఒకటైన బాల్టీమోర్కు నౌకల రాకపోకలు కనీసం కొద్ది నెలల పాటు స్తంభించనున్నాయి. గతేడాది బాల్టీమోర్ రేవు గుండా ఏకంగా 5.2 కోట్ల టన్నుల మేరకు సరుకు, దాదాపు 5 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు జరిగాయి! పోర్టుకు నౌకల రాకపోకలను వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. దుర్ఘటన ఉగ్రవాద చర్య కాదని స్పష్టం చేశారు. -
అమెరికాలో కూలిన బ్రిడ్జ్.. కంటైనర్ షిప్‌లోని 22 మంది సేఫ్
వాషింగ్టన్: అమెరికా మేరిల్యాండ్ నగరంలోని ఓ వంతెన కుప్పకూలింది. మంగళవారం తెల్లవారుజామున బాల్టిమోర్ పట్ణణంలోని పాలప్స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెనను సింగపూర్ జెండా ఉన్న ఓ కంటెయినర్ అర్థరాత్రి 1:30 గంటలకు షిప్ ఢీ కొట్టడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వంతెన కుప్పకూలడంతో సుమారు 22 మంది నదిలో పడిపోయారని బాల్టిమోర్ పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో బ్రిడ్జ్‌పై నుంచి పలు వాహనాలు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బాల్టిమోర్‌లోని ప్రధాన వంతెనను ఢీకొట్టిన కార్గో షిప్‌లోని మొత్తం 22 మంది సిబ్బంది భారతీయులేనని ఓడ నిర్వహణ సంస్థ తాజాగా వెల్లడించింది. వారంతా సురక్షితంగా ఉన్నారని పేర్కొంది. అయితే ఈ ప్రమాదంలో వంతెనపై ఉన్న కొన్ని కార్లు సైతం నదిలోకి దూసుకెళ్లాయి. ఇప్పటి వరకు అధికారులు ఇద్దరిని సురక్షింతగా బయటకు తీశారు. మరో ఏడుగురి ఆచూకీ తెలియాల్సి ఉన్నట్లు సమాచారం. Baltimore Bridge is 1.6 miles long, this is the moment it collapsed after a cargo ship struck it in the early hours of this morning pic.twitter.com/eA6womQlcI — Science girl (@gunsnrosesgirl3) March 26, 2024 2.6 కిలోమీటర్ల నాలుగు లేన్ల బ్రిడ్జ్ కుప్పకూలిన సమయంలో పలు వాహనాలు బ్రిడ్జ్‌పై నుంచి ప్రయాణించినట్లు వీడియోలో కనిపిస్తోంది. వంతెన కూలిపోయిన వెంటనే పలు వాహనాలు నదిలో పడిపోయినట్లు బాల్టిమోర్ అగ్నిమాపక విభాగానికి చెందిన కెవిన్ కార్ట్‌రైట్ బాల్టిమోర్ తెలిపారు. తాము ఘటనాస్థలికి చేరుకునేలోపే వంతెన మొత్తం నీటిలో కూలిపోయిందని తెలిపారు. వెంటనే నదిలో సహాయక చర్యలు చేపట్టాని తెలిపారు. సుమారు 20 మంది వరకు నదిలో ముగినిపోయినట్లు తెలుస్తోందని బాల్టిమోర్ పోలిసులు పేర్కొన్నారు. ఈ వంతెనను 1977లో ప్రారంభించారని పేర్కొన్నారు. The Francis Scott Key Bridge in Baltimore, Maryland which crosses the Patapsco River has reportedly Collapsed within the last few minutes after being Struck by a Large Container Ship; a Mass Casualty Incident has been Declared with over a Dozen Cars and many Individuals said to… pic.twitter.com/SsPMU8Mjph — OSINTdefender (@sentdefender) March 26, 2024 అమెరికాలో తెల్లవారుజామున, ఇంకా పొద్దుపొడవకముందే ఈ ప్రమాదం జరిగింది. ఇప్పుడిప్పుడే దీనికి సంబంధించిన తీవ్రత బయటపడుతోంది. ఓడను సూటిగా బ్రిడ్జివైపు ఎలా నడిపిస్తారు? కళ్ల ముందు అంత భారీ బ్రిడ్జ్ ఉంటే.. గుడ్డిగా ఎలా నడిపిస్తారు? నెటిజన్లు వ్యాఖ్యలు జోడించారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఉదయం 8 గంటల వరకు రాలేదు. Daylight reveals aftermath of Baltimore bridge collapse. Search and rescue underway. pic.twitter.com/2rHUN1T3u1 — BNO News (@BNONews) March 26, 2024 -
Khammam: గ్రీన్‌ఫీల్డ్ హైవే బ్రిడ్జిపై ప్రమాదం
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిలో భాగంగా వైరా-మధిర మధ్య భారీ వంతెన నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గురువారం మధ్యాహ్నం బ్రిడ్జిపై సిమెంట్ కాంక్రీట్ పోస్తుండగా స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. వైరా మండలం సోమవరం దగ్గర ఈ ఘటన జరిగింది. భారీ శబ్దం రావడంతో అటుగా వెళ్లే వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. వంతెన మీద ఉన్న కూలీలు ప్రాణాలు రక్షించుకునేందుకు బ్రిడ్జిపైనుంచి కిందకు దూకేశారు. దీంతో పలువురు కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం, నాసిరకంగా నిర్మించడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులను హెచ్డీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తుంది. -
మీరే నాకు కృతజ్ఞతలు చెప్పాలి! వంతెన పూర్తయివుంటే ఎంత ప్రాణనష్టం జరిగి ఉండేదో!
మీరే నాకు కృతజ్ఞతలు చెప్పాలి! వంతెన పూర్తయివుంటే ఎంత ప్రాణ నష్టం జరిగి ఉండేదో! -
150 కిలోల పేలుడు పదార్థాలు.. క్షణాల్లో నేలమట్టమైన బ్రిడ్జి.. వీడియో వైరల్
బెర్లిన్: జర్మనీలో ఓ వంతెన క్షణాల్లో నేలమట్టమైన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లుడెన్స్కీడ్లోని రమీడ్ వ్యాలీలో ఉన్న ఈ బ్రిడ్జిని 1965, 1968 మధ్య నిర్మించారు. అయితే దీనికి పగుళ్లు రావడంతో కొద్ది కాలంగా మూసివేశారు. ఎలాంటి వాహనాలను దీనిపైకి అనుమతించడం లేదు. ఈక్రమంలోనే ఇక్కడ కొత్త బ్రిడ్జిని నిర్మించేందుకు పాత బ్రిడ్జిని కూల్చివేశారు అధికారులు. చుట్టుపక్కల ఇళ్లు, భవనాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సరైన జాగ్రత్తలు తీసుకుని బ్రిడ్జిని కూల్చివేశారు. 450 మీటర్ల పొడవైన ఈ వంతెనను నేలమట్టం చేసేందుకు 150 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించారు అధికారులు. ఈ బ్రిడ్జి కూల్చివేతను ప్రత్యక్షంగా తిలకించేందుకు వేల మంది అక్కడకు తరలివెళ్లారు. కొద్ది దూరంలో నిల్చోని చూశారు. ఈ దృశ్యాలను తమ ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అవి వైరల్‌గా మారాయి. చదవండి: షాకింగ్.. భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్తాన్ విమానం..10 నిమిషాల పాటు 141 కి.మీ చక్కర్లు..! -
వర్షాలకు కూలిన బహుదా నది వంతెన
-
పండుగ వేళ విషాదం.. కుప్పకూలిన బ్రిడ్జి
పండుగ వేళ జమ్మూ కాశ్మీర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. బైశాఖి పర్వదినం సందర్బంగా బేని సంగమానకి భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో అక్కడ నిర్మించిన ఓ ఫుట్ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 40 మంది భక్తులు గాయపడ్డారు. వివరాల ప్రకారం.. జమ్మూ కాశ్మీర్లో బైశాఖి పర్వదినం సందర్భంగా ఉదమ్‌పూర్ జిల్లాలోని బేని సంగానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. దీంతో, అక్కడ కోలాహలం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అక్కడ నిర్మించిన ఫుట్ బ్రిడ్జ్‌పైకి అధిక సంఖ్యలో భక్తులు వెళ్లడంతో అది ఒక్కసారిగా కూలిపోయింది. ఇక, ఈ ప్రమాదంలో సుమారు 40 మందికిపైగా గాయపడినట్టు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు, రెస్క్యూ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. #JammuKashmir #Bridge During the Baisakhi fair in Vinisang village of Chenani of #Udhampur district, a big accident occurred due to the collapse of the iron bridge, many people were injured, rescue work is going on. pic.twitter.com/SpEKtAwbqJ — Kavita Raj Sanghaik (@KAVITARAJ5) April 14, 2023 -
రూ.13 కోట్ల వంతెన.. ప్రారంభానికి ముందే ఫసక్..
బెగుసరాయ్: రూ. 13 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి ఏడాది పాటు నిర్మించిన ఓ వంతెన ప్రారంభానికి కూడా నోచుకోకుండానే కూలిపోయింది. 2017లోనే దీన్ని నిర్మించినప్పటికీ అప్రోచ్ రోడ్డు లేకపోవడంతో నిరుపయోగంగా ఉంది. ఇటీవలే పగుళ్లు రావడంతో స్థానికులు అధికారులకు లేఖ రాశారు. వారు చర్యలు తీసుకునే లోపే వంతెన ఆదివారం కూలిపోయింది. బిహార్‌లో బెగుసరాయ్ జిల్లాలో బుధిగండక్ నదిపై 2017లో 206 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జిని నిర్మించారు. అప్రోచ్ రోడ్డు వేసేందుకు ప్రైవేటు భూమిని సేకరించలేదు. దీంతో అది ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. అప్పుడప్పుడు ట్రాక్టర్లు, భారీ వాహనాలు వంతెన మీదుగా వెళ్తున్నాయి. వంతెన 2, 3 పిల్లర్ల మధ్య భాగంలో పగుళ్లు బారి పోయింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ప్రారంభం కూడా కాకుండానే వంతెన కూలడంతో నిర్మాణ నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: మిసెస్ వరల్డ్‌గా సర్గమ్ కౌశల్.. 21 ఏళ్ల తర్వాత భారత్‌కు కిరీటం.. -
మోర్బీ దుర్ఘటన.. దైవ నిర్ణయం!
మోర్బీ: గుజరాత్‌లోని మోర్బీ ప్రాంతంలో కూలిన కేబుల్ బ్రిడ్జి కేసులో అరెస్టయిన తొమ్మిది మందిని మంగళవారం కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా మచ్చు నదిపై బ్రిడ్జి పునరుద్దరణ పనులు చేపట్టిన అజంతా ఒరేవా కంపెనీని ప్రాసిక్యూషన్ తప్పుబట్టారు. పునరుద్దరణ పనులకు ఒరివా కంపెనీకి అసలు అర్హత లేదని మోర్బీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కోర్టుకు నివేదించారు. అయినప్పటికీ ఇదే కంపెనీకి 2007, 2022లో బ్రిడ్జి రిపేర్ పనులకు కాంట్రాక్టు అప్పగించినట్లు తెలిపారు. వంతెన పునరుద్ధరణ సమయంలో ఫ్లోరింగ్ మార్చారు. కానీ అరిగిపోయిన తీగల స్థానంలో కొత్తవి అమర్చలేదని, పాత వాటిని అలాగే ఉంచారని ఆరోపించారు. దీనివల్ల కొత్తగా వేసిన నాలుగు లేయర్ల అల్యూమినియం ఫ్లోర్ బరువు ఎక్కువగా ఉండటంతో పాత తీగలు మోయలేక తెగిపోయాయని ఫోరెన్సిక్ నివేదిక ద్వారా తెలిసిందన్నారు. చదవండి: Hemant Soren: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు.. విచారణకు రావాలని ఆదేశం గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ఘటనకు సంబంధించి కోర్టులో హాజరు పరిచిన నిందితుల్లో ఒరేవా కంపెనీ మేనేజర్ దీపక్ పరేఖ్ కూడా ఒకరు. అయితే వంతెన ప్రమాదంలో తమ ప్రమేయం ఏం లేదని.. అది ‘గాడ్ విల్’(దైవ నిర్ణయం) అని దీపక్ కోర్టుకు తెలిపారు. ఇలాంటి దురదృష్ట ఘటన జరగకుండా ఉండాల్సిందని అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎంజే ఖాన్ ముందు దీపక్ విన్నపించారు. విచారణ అనంతరం నలుగురు నిందితులను కోర్టు నలుగురికి కోర్టు పోలీస్ కస్టడీకి అప్పగించింది. వీరిలో ఒరెవా సంస్థకు చెందిన ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు సబ్‌కాంట్రాక్టర్లు ఉన్నారు. మిగతా అయిదుగురికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మచ్చు నదిపై కూలిన తీగల వంతెన దుర్ఘటనపై ఇప్పటికే సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. దీనిపై నవంబర్ 14న సర్వన్నోత న్యాయస్థానం విచారణ జరపనుంది. కాగా కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో ఇప్పటి వరకు 135 మంది మృతిచెందగా.. 170 మందిని కాపాడినట్లు గుజరాత్ మంత్రి రాజేంద్ర త్రివేది వెల్లడించారు. మచ్చునదిలో ఇంకా ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఇతర సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు ఘటనలో కంపెనీకి చెందిన 9 మందిని అరెస్టు చేయగా.. కంపెనీ ఎగ్జిక్యూటివ్స్, ఇతర అధికారులు పత్తా లేకుండా పోయారు. చదవండి: కేబుల్ బ్రిడ్జిపైకి కారు..‘మోర్బీ’ విషాదం చూశాకైనా మారరా? -
బాధ్యత తీసుకోవడమూ ఆదర్శమే!
గుజరాత్‌లోని మోర్బీ వద్ద జరిగిన తీగల వంతెన ప్రమాదం నిర్లక్ష్యానికి నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తోంది. పదుల మంది ఉత్తి పుణ్యానికి ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ పాలనా సామర్థ్య లోపం ఫలితంగానే ప్రజల్ని సరాసరి మృత్యువు నోట్లోకి నెట్టేసినట్లయిందని నివేదికలు చెబుతున్నాయి. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? నెపం ఇంకెవరి మీదకో నెట్టేసి నాయకులు చేతులు దులిపేసుకుంటారా? ఒకప్పుడు లాల్‌బహదూర్ శాస్త్రి లాంటివారు రైలు ప్రమాదం జరిగినప్పుడు నైతిక బాధ్యత వహించి తమ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగతంగా వారి దోషం లేకపోయినా ఒక ఉన్నతమైన ఆదర్శాన్ని నెలకొల్పారు. అలాంటి స్పందనను గుజరాత్ నాయకుల నుంచి మనం ఇప్పుడు చూడగలమా? ‘‘గుజరాత్‌లోని ‘మోర్బీ’ వద్ద 143 ఏళ్ల నాడు నిర్మించిన సస్పెన్షన్ బ్రిడ్జి ప్రసిద్ధ టూరిస్టు కేంద్రంగా ఉన్న ఆ పట్టణం గుండా ప్రవహించే మచ్ఛు నదిలో అకస్మాత్తుగా కూలిపోయిన ఫలితంగా వందలాదిమంది సందర్శకులు పిల్లాజెల్లాతో ఘోరమైన విషాదానికి గురయ్యారు. పైగా ఇటీవలనే మరమ్మత్తులు పూర్తయి పునఃప్రారం భమైన వంతెన కాస్తా కూలిపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. వంతెనల నిర్మాణంలో సరైన అనుభవం, నైపుణ్యం లేని ఒక ప్రయివేట్ కంపెనీకి వంతెన నిర్మాణ కాంట్రాక్టు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా, ఒకే సమయంలో 150 మందికి మించి భరించగల బ్రిడ్జి కాదని మాత్రం నివేదికలు తెల్పుతున్నాయి. వివిధ స్థాయుల్లో ప్రభుత్వ పాలనా సామర్థ్య లోపం ఫలితంగానే సరాసరి ప్రజల్ని మృత్యువు నోట్లోకి నెట్టేసినట్లయిందని నివేదికలు తెల్పుతున్నాయి. ఈ విషయమై పూర్తి విచారణ జరిపి, బాధ్యత ఎవరిదో తేల్చాలి. ఇందుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి.’’ – ‘ది హిందూ’ సంపాదకీయం (1 నవంబర్ 2022) ప్రజలు విషాద ఘటనల బారిన పడినప్పుడు పాలకులు కనీస నైతిక బాధ్యత వహించవలసిన అవసరం ఉందని లాల్ బహదూర్ శాస్త్రి గుర్తించారు. జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలోని సీనియర్ సభ్యు నిగా లాల్ బహదూర్ శాస్త్రి నెలకొల్పిన ‘సువర్ణ ప్రమాణాల్ని’ మరో సారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది 1956 ఆగస్టు. మహబూబ్‌నగర్ వద్ద ఘోరమైన రైలు ప్రమాదం జరిగింది. ఆ దుర్ఘట నలో 112 మంది చనిపోయారు. లాల్ బహదూర్ ఆ ఘటనకు కలత చెంది, తన పదవికి రాజీనామా చేస్తూ, ఆ లేఖను నెహ్రూకు పంపారు. ‘వద్దు, వద్దు’ అని నెహ్రూ నివారించడంవల్ల, లాల్‌బహదూర్ తాత్కా లికంగా ఆగారే గానీ అరియలూర్ (తమిళనాడు)లో అదే సంవత్సరం మరో రైలు ప్రమాదం జరిగి 144 మంది మరణించారు. ఈ రెండు వరుస విషాదకర ఘటనలతో లాల్‌బహదూర్ ఆవేదన నిలుపుకోలేక వెంటనే నెహ్రూకు రాజీనామా లేఖ సమర్పిస్తూ... ‘ఇక నన్ను ఒత్తిడి చేయవద్దు, వెంటనే ఆమోదించవలసింది’ అని కోరారు. ఆ విషయమై నెహ్రూ లోక్‌సభలో ఒక ప్రకటన చేస్తూ లాల్ బహదూర్ నిర్ణయం పట్ల అత్యంత గౌరవాన్ని వ్యక్తం చేశారు. ‘‘విశాల మైన మనస్సుతో ఆలోచిస్తే, ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు మనం ఆదర్శంగా నిలబడటం రాజ్యాంగ విలువల దృష్ట్యా గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో ఏది ఏమైనా సరే మనం పట్టించుకోకుండా తలొంచుకుని పోదామనే ధోరణి సరై నది కాదు’’ అని నెహ్రూ చెబుతూ రాజ్యాంగ మర్యాదను పాటిం చడం ధర్మమని ప్రకటించాల్సి వచ్చింది. అయితే నెహ్రూ ప్రకటనను పత్రికలు తప్పుబట్టాయి. 30 మంది పార్లమెంట్ సభ్యులు కూడా లాల్‌బహదూర్ రాజీనామాను అంగీకరించ‘వద్దు్ద’ అని నెహ్రూకు విజ్ఞప్తి చేశారు. శాస్త్రి వ్యక్తిగతంగా రైలు ప్రమాదాలకు కారకుడు కారు గనుక రాజీనామాను ఆమోదించవద్దని విజ్ఞప్తి చేశారు. అయినా లాల్ బహదూర్ నిర్ణయాన్ని ఎవరూ ఆపలేకపోయారు. ‘లాల్ బహదూర్ శాస్త్రి – రాజకీయాలు ఆపైన’ (పాలిటిక్స్ అండ్ బియాండ్) అన్న గ్రంథంలో ప్రసిద్ధ వ్యాఖ్యాత సందీప్ శాస్త్రి ఈ విషయం గురించి చెబుతూ – ‘‘లాల్‌బహదూర్ నెలకొల్పిన ఉత్తమ సంప్రదాయం దేశ చరిత్రలో, నాయకుల చరిత్రలో ఒక ఉన్నత ప్రమా ణాన్ని నెలకొల్పింది. ఇతరులు ఆ ప్రమాణాన్ని పాటించక పోవచ్చు. కానీ, రాజకీయ ప్రమాణాలకు, వైశిష్ట్యానికి లాల్‌బహదూర్ నెల కొల్పిన ఆదర్శాలు ఉన్నతమైనవి’’ అన్నారు. రెండు రైలు ప్రమాద దుర్ఘటనల తర్వాత ఆరు దశాబ్దాలు గడిచిపోయాయి. అయినా ఇప్ప టికీ లాల్‌బహదూర్ శాస్త్రి ఆదర్శం, నెలకొల్పిన నైతిక విలువల వైశి ష్ట్యాన్ని గురించి అంచనాలు కొనసాగుతూనే ఉన్నాయి. గుజరాత్ ‘మోర్బీ’ బ్రిడ్జి కంటే ముందే, సుమారు 150 ఏళ్లనాడు గోదావరి నదిపై ఆనకట్ట తలపెట్టారు సర్ ఆర్థర్ కాటన్. కాలం ముగియకముందే జాగ్రత్తలు తీసుకుంటే వంతెన ఆయుష్షును పెంచు కోవచ్చునని చెప్పిన మహనీయుడు కూడా ఆయన. కరువు కాటకాల వాతబడి కోట్లాదిమంది గోదావరి జిల్లాల ప్రజలు అల్లల్లాడిపోతున్న సమయంలో ఆనకట్ట నిర్మాణం కోసం తన బ్రిటన్ సామ్రాజ్య పాల కులపైనే ఒత్తిడి తెచ్చిన ధీశాలి కాటన్. ‘మన (బ్రిటన్) డబ్బంతా తీసుకుపోయి అక్కడ పోస్తే, మనకేం లాభం?’ అని బ్రిటిష్ పాలకులు కాటన్‌కు పాఠం చెప్పబోతే, వారి బుర్రల్ని తెలివిగా ‘చిత్రిక పట్టి’ గోదావరి జిల్లాలను కరువు కాటకాల నుంచి రక్షించారు కాటన్. ‘నీకు ఆదాయం రావాలన్నా ముందుగా ప్రజలు బతికి బట్టకట్టాలి కదా. తద్వారా పన్నుల రూపంలో వచ్చే ఆదాయం మన బ్రిటన్‌కే వస్తుంది కదా’ అని పాఠం చెప్పారు. అలా ఉభయతారకంగా వ్యవహరించిన రాజనీతిజ్ఞుడు కాటన్. అందుకే ఈ రోజుకీ గోదావరి జిల్లాల ప్రజలు చిన్నాపెద్దా ఏ శుభముహూర్తాలు తమ ఇళ్లలో జరిగినా ‘కాటనాయ నమః’ అని కీర్తించుకుంటూ ఉంటారు. నదుల మధ్య అనుసంధానం నెలకొల్పి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో నాడు మగ్గుతున్న ఆంధ్ర ప్రాంతాలలో జలవనరుల అవసరం తీర్చడానికి శ్రద్ధతో స్కీములు వేసిన మహనీయుడు కాటన్. ఆంధ్ర రాజకీయ, సామాజిక, వివిధ నిర్మాణ రంగాలలో ఉద్దండులైన ముక్త్యాల రాజా, ఇంజనీర్ కె.ఎల్. రావు, మోటూరు సత్యనారాయణ, ఆచార్య రంగా ఇత్యాది ప్రభృతులు కాటన్ కృషిని మరింతగా ముందుకు తీసుకువెళ్లారు. నెహ్రూ ఆశీస్సులతో బహూళార్ధ సాధక నాగార్జున సాగర్ ప్రాజెక్టు లాంటి నిర్మాణాన్ని సుసాధ్యం చేసు కోగలిగారు. అంతేగాదు, కాటన్ మహాశయుడు దక్షిణాది రాష్ట్రాల సౌభాగ్య గరిమకు చేదోడువాదోడు కావడమేగాక, ఉత్తరాది సరిహద్దు లలో తిష్ఠ వేసిన బ్రహ్మపుత్రతో వియ్యమందుకుని, ఆంధ్ర మున్నగు దక్షిణ భారత రాష్ట్రాలకు జల విద్యుత్ సౌభాగ్యాన్ని అందించాలని కూడా పథకాలు వేశాడు. అసలు బ్రహ్మపుత్ర ఆధారంగా మధ్య భారతం దన్నుగా యావద్భారతం నలుమూలలకూ ఆరుగాలమూ జల, విద్యుత్ సంపద పంపిణీ అయ్యేందుకూ బృహత్ పథకం రచిం చాడు. ఆ స్ఫూర్తితోనే మన కె.ఎల్. రావు, శొంఠి రామ్మూర్తి ప్రభృతులు మరికొన్ని పథకాలు రూపొందిస్తూ వచ్చారని మరవరాదు. కానీ, ఎందుకని ఈ మహనీయుల కృషిని మరింత ముందుకు తీసుకుపోవడంలో దేశీయ పాలకులు విఫలమవుతున్నారు? ఎందుకు వారిలా శ్రద్ధ చూపడం లేదు? రాజ్యాంగం గుర్తించిన ఫెడరల్ వ్యవస్థ స్వరూప స్వభావాల్ని నాశనం చేస్తూ ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’... ఒకడే నాయకుడు, ఒకటే పార్టీ అని మాత్రం యాగీ చేస్తున్నారు. ప్రణాళికా వ్యవస్థ రద్దయింది. ప్రభుత్వ రంగాన్ని చాపచుట్టి, కార్పొరేట్ గుజరాత్ రాజ్యం యావద్భారతాన్ని చుట్టబెడుతోంది. ‘భారత ప్రజలమైన మేము మాకుగా భారత రాజ్యాంగాన్ని రూపొందించుకుని అంకిత మిచ్చుకుంటున్న మౌలిక పత్రం ఇది’ అని రాజ్యాంగం ముందు మాటలోనే స్పష్టం చేసినా – పాలకుల చేతుల్లో దాని ముఖ వర్చస్సు అంతా చెదిరిపోయింది. కనుకనే నేటి దుర్బుద్ధులూ, పెడబుద్ధులూ! రోజుకో తీరు చొప్పున చెదిరిపోతున్న మౌలిక రాజ్యాంగ స్ఫూర్తి. ఇది నిలవాంటే, పౌర బాధ్యతల అధ్యాయపు కనీస విలువను కాపాడు కోవడానికైనా ఉద్యమించవలసిన అవసరం ఉంది. 2024 వచ్చేలోగానే పౌర సమాజం తన గాఢ నిద్రను వదిలించుకోగలగాలి! అవును మరి – ‘‘ఏది పలికినా శాసనమైతే ఎందుకు వేరే జనవాక్యం ఏది ముట్టినా కాంచనమైతే ఏది శ్రమశక్తికి మూల్యం?’’ – సినారె ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
కూలిన తీగల వంతెన
కూలిన తీగల వంతెన -
మోర్బీ ఆసుపత్రికి ప్రధాని.. అర్థరాత్రి హంగామా.. ఆగమేఘాల మీద మరమ్మతులు
మోర్బీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు(మంగళవారం) మోర్బీకి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. తీగల వంతెన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. దుర్ఘటన నుంచి ప్రాణాలతో బయటపడి మోర్బీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలవనున్నారు. అయితే మోదీ సందర్శన నేపథ్యంలో అధికారులు ఆగమేఘాల మీద ఆసుపత్రిలో మరమ్మతులు చేపట్టారు. సోమవారం అర్థరాత్రి హడావిడీ సృష్టించి ఆసుపత్రికి మెరుగులు దిద్దారు. ఆసుపత్రి గోడలు, పైకప్పు భాగాలకు పెయింట్ వేశారు. టైల్స్ మార్చారు. కొత్త కూలర్లను తీసుకువచ్చారు. వంతెన దుర్ఘటనలో గాయపడిన 13 మందిని చేర్చుకున్న రెండు వార్డులలో బెడ్షీట్లు ఉన్నపళంగా మార్చేశారు. సిబ్బంది అంతా అర్థరాత్రి ప్రాంగణాన్ని ఊడ్చి క్లీన్‌గా చేశారు. మొత్తంగా ఆసుపత్రిని తళతళ మెరిసేలా చేశారు. కాగా ఆసుపత్రికి మెరుగులు దిద్దుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాడైన గోడలు, పెచ్చులూడిన పైకప్పుకు పెయింటింగ్ వేయడం వంటి ఫోటోలు చూస్తుంటే ఆసుపత్రిలో అంతకుముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పేందుకు అద్దం పడుతుంది. చదవండి: మోర్బీ బ్రిడ్జి దుర్ఘటన.. స్పందించిన జో బైడెన్, కమలా హారిస్ મોરબીમાં કાલે કમા ની મુલાકાત હોવાથી અત્યારે રાત્રે સિવિલ હોસ્પિટલ માં કલર કામ કરી રંગ રોગાન કરવામાં આવી રહ્યું છે. #Morbi #મોરબી #morbihospital pic.twitter.com/OS6EFlHyxf — Baraiya Nikunj (@NIKKUGAMING11) October 31, 2022 అయితే కేవలం మోదీ సందర్శన ముందు ఆసుపత్రి పునర్నిర్మాణ పనులు చేపట్టడం విమర్శలకు తావిస్తోంది. ఆసుపత్రి దృశ్యాలను షేర్ చేస్తూ.. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు కాషాయ పార్టీపై విరుచుకుపడ్డాయి. ప్రధానమంత్రికి ఫోటోషూట్ కోసం బీజేపీ ఈవెంట్ మేనేజ్మెంట్లో బిజీగా ఉందని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ట్విటర్ వేదికగా వ్యంగ్యసత్రాలు ఎక్కుపెట్టాయి. त्रासदी का इवेंट कल PM मोदी मोरबी के सिविल अस्पताल जाएंगे। उससे पहले वहां रंगाई-पुताई का काम चल रहा है। चमचमाती टाइल्स लगाई जा रही हैं। PM मोदी की तस्वीर में कोई कमी न रहे, इसका सारा प्रबंध हो रहा है। इन्हें शर्म नहीं आती! इतने लोग मर गए और ये इवेंटबाजी में लगे हैं। pic.twitter.com/MHYAUsfaoC — Congress (@INCIndia) October 31, 2022 ఓ పక్క బ్రిడ్జి కూలిన విషాద ఘటనలో వందలాది మంది చనిపోతే మరో పక్క మోదీ ఫోటోషూట్‌లో ఎలాంటి లోపం లేదని నిర్ధారించడానికి మరమ్మతు పనులు జరుగుతున్నాయని మండిపడ్డాయి. మోదీ కోసం పెయింటింగ్ వేస్తూ, టైల్స్‌ను మెరిపిస్తూ బిజీగా ఉన్న వారికి సిగ్గు లేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. గత 27 ఏళ్లగా బీజేపీ సరిగా పని చేసి ఉంటే, అర్ధరాత్రి ఆసుపత్రిని అలంకరించాల్సిన అవసరం లేదని సెటైర్లు వేశాయి. Morbi Civil Hospital का दृश्य... कल प्रधानमंत्री के Photoshoot में कोई कमी ना रह जाए इसलिए अस्पताल की मरम्मत की जा रही है। अगर भाजपा ने 27 वर्षों में काम किया होता तो आधी रात को अस्पताल को चमकाने की जरूरत न पड़ती।#BJPCheatsGujarat pic.twitter.com/h83iUmPzKA — AAP (@AamAadmiParty) October 31, 2022 గుజరాత్లో మోర్బీ కేబుల్ బ్రిడ్జి కూలిన పెను విషాద ఘటన దేశ ప్రజలను విస్మయానికి గురిచేసిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 140 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉండటం మరింత బాధకర విషయం.మరో 100 మంది గాయాలపాలయ్యారు. నదిలో గల్లంతైన వారికోసం సంఘటనా ప్రాంతంలో ఇంకా గాలింపు చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. ఇప్పటి వరకు దీనితో సంబంధం ఉన్న 9 మందిని అరెస్ట్ చేశారు. బ్రిడ్జి నిర్వహణ కాంట్రాక్టు పొందిన ఒరివా కంపెనీపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. -
మోర్బీ బ్రిడ్జి దుర్ఘటన.. స్పందించిన జో బైడెన్, కమలా హారిస్
గుజరాత్లో మోర్బీ వంతెన కూలిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ కష్ట సమయలో తాము భారతీయులకు అండగా నిలుస్తామని తెలిపారు. వంతెన కూలిన సమయంలో ప్రియమైన వారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు గుజరాత్ ప్రజలతో కలిసి సంతాపం తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు బైడెన్ ట్వీట్ చేశారు. Jill and I send our deepest condolences to the families who lost loved ones during the bridge collapse in India, and join the people of Gujarat in mourning the loss of too many lives cut short. In this difficult hour, we will continue to stand with and support the Indian people. — President Biden (@POTUS) October 31, 2022 అదే విధంగా గుజరాత్ దుర్ఘటనపై అమెరికా వైఎస్ ప్రెసిడెంట్ కూడా స్పందించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. తమ హృదయాలు భారత్‌లో ఉన్నాయని, క్లిష్ట పరిస్థితుల్లో భారతీయులకు మద్దతుగా ఉంటామని తెలిపారు. We stand with the people of India who are mourning the victims of the devastating bridge collapse in Gujarat. Our hearts are with those who lost loved ones and all those impacted. — Vice President Kamala Harris (@VP) October 31, 2022 అంతులేని విషాదం మోర్బి ప్రాంతంలో కూలిన బ్రిటిష్ కాలపు తీగల వంతెన విషాదం 140 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. గుజరాత్ రాష్ట్రం మోర్బీ పట్టణంలో మచ్చూ నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి కూలిపోయిన విషయం తెలిసిందే. నదిపై కట్టిన తీగల వంతెన సెకన్ల వ్యవధిలో కూలిపోతుంటే, ఒకరి మీద మరొకరుగా వందల సంఖ్యలో జనం నదీ జలాల్లో పడిపోయిన తీరు కలిచివేస్తోంది. చదవండి: శాపమా? పాలకుల పాపమా? మొత్తం 140 మందికి పైగా సందర్శకులు ప్రమాదం బారినపడి అన్యాయంగా అసువులు బాసారు. ఆరంభించిన అయిదు రోజులకే రోప్ బ్రిడ్జి కూలిపోవడం మరమ్మత్తుల పనిలో నాణ్యతా లోపంతో, ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఘటనా ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, భారత నేవీ సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. ముమ్మాటికీ మానవ తప్పిదమే! మోర్బీ వంతెన ప్రమాదానికి ముమ్మాటికీ మానవ తప్పిదమే కారణమని స్పష్టమవుతోంది. బ్రిడ్జికి ఫిట్‌నెట్ సర్టిఫికెట్ జారీ చేయలేదని, మున్సిపాలిటీ అనుమతి లేకుండానే దాన్ని పునఃప్రారంభించారని అధికారులు తెలిపారు. అంతేగాక ప్రమాద సమయంలో 500 మందికిపైగా జనం వంతెనపై ఉన్నారని స్థానికులు పేర్కొన్నారు. బరువు ఎక్కువై కూలిపోయిందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. తీగల సాయంతో వేలాడే ఈ వంతెన సామర్థ్యం కేవలం 150 మంది కాగా అంతకంటే ఎక్కువ మంది వెళితే ఆ బరువును తట్టుకోలేదు. అయినా ఈ విషయం తెలిసినప్పటికీ కాంట్రాక్ట్ సంస్థ ‘అజంతా ఒరెవా’ నిర్లక్ష్యంగా వ్యహరించి.. ఏకంగా 675 మంది సందర్శకులకు టిక్కెట్లు విక్రయించినట్లు తెలిసింది. చదవండి: మోర్బీ వారధి విషాదం: మృతుల్లో 47 మంది పిల్లలు.. మరో వంద మందికిపైగా జలసమాధి! కేసు నమోదు, అరెస్టులు ఇప్పటివరకు 141 మృతదేహాలను వెలికి తీయగా అందులో రెండేళ్ల చిన్నారి సహా 47 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు.వంతెన కూలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే కొంతమంది మంది కుర్రాళ్లు.. బ్రిడ్జిని ఒక్కసారిగా ఊపేశారని అందుకే ప్రమాదం జరిగిందంటూ ఓ బాధితుడు మీడియాకు తెలిపాడు.ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, త్రివిధ దళాల సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. సీఎం భూపేంద్ర పటేల్, హోంమంత్రి హర్ష సంఘ్వీ ఆదివారం రాత్రి నుంచి అక్కడే మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి ఇప్పటిదాకా 9 మందిని అరెస్టు చేసినట్లు గుజరాత్ పోలీసులు తెలియజేశారు. బ్రిడ్జి నిర్వహణ కాంట్రాక్టును పొందిన అజంతా ఒరెవా కంపెనీపై కేసు నమోదు చేశామని తెలిపారు.దర్యాప్తు సిట్ ఏర్పాటుచేశారు. -
మంగళవారం మోర్బీలో ప్రధాని మోదీ పర్యటన
-
మోర్బీ విషాదంపై మోదీ ఉన్నత స్థాయి సమీక్ష
గాంధీనగర్: గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో కేబుల్ బ్రిడ్జి కుప్పకూలి 140 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికిపైగా ఆచూకీ గల్లంతైన క్రమంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మోర్బీ ప్రమాదంపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లోని రాజ్‌భవన్ వేదికగా ఈ రీవ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేబుల్ బ్రిడ్జి కూలిపోయినప్పటి నుంచి తీసుకుంటున్న సహాయక చర్యలు, రెస్క్యూ ఆపరేషన్లను ప్రధానికి వివరించారు అధికారులు. ఈ విషాదానికి కారణమైన అన్ని అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రమాదంలోని బాధితులకు అన్ని విధాల సాయం చేస్తామని ప్రధాని మోదీ చెప్పారని అధికారవర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్, హోంశాఖ సహాయ మంత్రి హర్ష సంఘవి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇదీ చదవండి: మోర్బీ ఘటన.. మరో వంద మందికిపైగా జలసమాధి! -
గుజరాత్ కేబుల్ బ్రిడ్జి విషాదం.. వంతెన కూలడానికి కారణాలివేనా?
గుజరాత్లో మచ్చు నదిపై నిర్మించిన మోర్బీ తీగల వంతెన కూలిపోయిన ఘటన దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకునే గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి కుప్పకూలడంతో దాని మీదున్న వందలాది మంది సందర్శకులు నదిలో పడిపోయారు. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 500 మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 130 మందికి పైగా మృత్యువాత పడ్డారు. దాదాపు 170 మందిని రక్షించారు. మరో వందమంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి మరమ్మతుల కోసం ఆరు నెలల క్రితం మూసేసిన ఈ కేబుల్ బ్రిడ్జిని ఐదు రోజుల క్రితమే పునఃప్రారంభించారు. వారం కూడా గడవక ముందే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సంఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. కూలిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనితో సంబంధం ఉన్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హోం మంత్రి షర్ష్ సంఘ్వీ తెలిపారు. ఇప్పటికే ఈ ఘటనపై సెక్షన్లు 304, 308, 114 ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఏర్పాటు చేశారు. చదవండి: Morbi Bridge Collapse: కేబుల్ బ్రిడ్జి విషాదం. 12 మంది ఎంపీ కుటుంబ సభ్యులు మృతి ప్రస్తుతం బ్రిడ్జి కూలడానికి గల కారణాలు ఏంటనే ప్రశ్న అందరి బుర్రల్లో మెదులుతోంది. రద్దీ ఎక్కువగా ఉండటం, పాతకాలపు వంతెన, నిర్వహణ లోపం వంటి పలు కారణాలు తెర మీదకు వస్తున్నాయి. చదవండి: 140 ఏళ్ల నాటి బ్రిడ్జి.. ఇటీవలే మరమత్తులు.. 4 రోజులకే పెను విషాదం #Watch the CCTV footage of the bridge collapse in Gujarat's Morbi. Over 200 people have been rescued from the site of the incident, MoS Harsh Sanghvi said Monday. #MorbiBridgeCollapse Follow live updates: https://t.co/yxhdG5Hw3P pic.twitter.com/d1cKoTSDQw — The Indian Express (@IndianExpress) October 31, 2022 ► మచ్చు నదిపై నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జిపై ఆదివారం సాయంత్రం రద్దీ ఎక్కువగా కనిపించింది. దుర్ఘటన జరిగిన సమయంలో వంతెనపై స్థానికులతో పాటు సందర్శకులు మొత్తం కలిపి 500మంది వరకు ఉన్నట్లుగా కనిపిస్తోంది. వీరిలో ఛట్ పూజా వేడుకల కోసం, సెలవు దినం కావడంతో కుటుంబంతో వచ్చినవారు అధికంగా ఉన్నారు. ఒకేసారి వంతెనపై పరిమితికి మించి ఎక్కువ మంది నడవటం, జన సాంద్రత తట్టుకోలేకే కూలినట్లుగా భావిస్తున్నారు. Over 100 killed and 170 injured in the tragic #Morbi bridge collapse in Gujarat. Several people still remain missing. Rescue efforts underway by Indian Army, Indian Navy, Indian Air Force, NDRF, SDRF, Fire Brigade and local police. Chief Minister and Home Minister at spot. pic.twitter.com/mocM8UuajY — Aditya Raj Kaul (@AdityaRajKaul) October 30, 2022 ► ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో బ్రిడ్జిపై నడుస్తున్న కొందరు యువకులు ఉద్ధేశ పూర్వకంగా వంతెనను విపరీతంగా ఊపుతుండటం, ఒకరినొకరు తోసుకోవడం కనిపిస్తుంది. యువకుల పిచ్చి చేష్టల వల్లే బ్రిడ్జి కూలిందని నెటిజనన్లు మండిపడుతున్నారు. అయితే ఈ వీడియో పాతదా.. ప్రమాదానికి ముందు తీసిందా అనేది తెలియాల్సి ఉంది. ► మోర్బీ వంతెన 140 ఏళ్ల నాటిది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన బ్రిడ్జి కావడం, బలమైన పునాది లేకపోవడం కూడా ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. దీనికితోడు మరమత్తుల కోసం వంతెనను మూసేశారు. ఏడు నెలలపాటు మరమత్తులు నిర్వహించి గుజరాత్ న్యూయర్ డే వేడుకల కోసం అక్టోబర్ 26నే తిరిగి సందర్శకుల నిమిత్తం తెరిచారు. అయితే అధికారుల నిర్లక్ష్యం, ఛట్ పూజ నేపథ్యంలో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో వందలాది మంది ఒకేసారి వంతెనపైకి వచ్చారని పలువురు ఆరోపిస్తున్నారు. ►మరమత్తుల అనంతరం వంతెనను తెరవడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోలేదని తెలుస్తోంది. అంతేగాక వంతెన పటిష్టతను తనిఖీ చేయలేదని, బ్రిడ్జికి మున్సిపల్ అధికారుల నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోకుండానే రీఓపెన్ చేశారని విమర్శలు గుప్పుముంటున్నాయి. అయితే బ్రిడ్జి కూలిన ఘటనపై పోలీసుల దర్యాప్తు పూర్తయితే గానీ అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. -
మోర్బీ బ్రిడ్జి విషాదం.. 12 మంది బీజేపీ ఎంపీ కుటుంబ సభ్యులు మృతి
గుజరాత్‌లోని మోర్బీ నగరంలో మచ్చు నదీపై తీగల వంతెన కూలిన ఘోర దుర్భటన యావత్ భారత్‌ను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సెలవు దినం.. ఆపై ఛట్ పూజ సంబరాలతో వందలాది మంది ఆహ్లాదంగా నదిపై జరిపిన సరదా విహారం ప్రాణాంతకంగా మారింది. అందరూ హడావిడిగా ఉండగా ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలడంతో ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే చాలా మంది నదిలో పడిపోయారు. చేతికి అందిన తీగలు పట్టుకొని కొందరు నదిలో పడకుండా ఆపుకోగలిగారు. వంతెన పునరుద్దరించిన నాలుగు రోజుల్లోనే కూలిపోవడంతో 130 మందికి పైగా జల సమాధి అవ్వడం తీరని విషాదంగా మారింది. మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నారులే ఉండటం మరింత ఆవేదన కలిగిస్తోంది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనలో బీజేపీ ఎంపీ కుటుంబానికి చెందిన పలువురు మృతి చెందారు. రాజ్‌కోట్‌కు చెందిన బీజేపీ ఎంపీ మోహన్‌భాయ్ కళ్యాణ్‌జీ కుందారియా సోదరికి చెందిన 12 మంది కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ‘‘వంతెన కూలిన దుర్ఘటనలో ఐదుగురు పిల్లలతో సహా నా సోదరి కుటుంబంలోని 12 మంది సభ్యులను కోల్పోయాను. ఘటనా స్థలంలో ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, స్థానిక యంత్రాంగం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ప్రమాదం నుంచి బయటపడిన వారికి చికిత్స అందుతోంది. నదిలో ఉన్నవారి మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెస్క్యూ బోట్లు కూడా సంఘటనా స్థలంలో ఉన్నాయి. వంతెన కూలిన ఘటనలో పిల్లలు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. 60 మృతదేహాలను వెలికితీశాం’ అని ఎంపీ పేర్కొన్నారు. చదవండి: 140 ఏళ్ల నాటి బ్రిడ్జి.. ఇటీవలే మరమత్తులు.. 4 రోజులకే పెను విషాదం 132కు చేరిన మృతుల సంఖ్య మోర్భీ కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 132కు చేరింది. ఇప్పటివరకు 177 మందిని రక్షించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు పేర్కొన్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యల్లో పలుపంచుకుంటున్నారని చెప్పారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనితో సంబంధం ఉన్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హోం మంత్రి షర్ష్ సంఘ్వీ తెలిపారు. బ్రిడ్జి కూలిన ఘటనపై సెక్షన్లు 304, 308, 114 ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఏర్పాటు చేశారు. 140 ఏళ్లనాటి వంతెన కాగా ఈ వంతెనను 140 ఏళ్ల నాటిది. 1879 ఫిబ్రవరి 20న అప్పటి ముంబై గవర్నర్ రిచర్డ్ టెంపుల్ దీనిని నిర్మాణాన్ని ప్రారంభించారు. 1880లో నిర్మాణం పూర్తయ్యింది. బ్రిటిష్ కాలం నాటి ఈవంతెనకు రూ. 2 కోట్లతో 7 నెలల పాటు మమరమత్తులు నిర్వహించి ఆధునీకరించారు. అయితే రిపేర్ తర్వాత వంతెనకు సేఫ్టి సర్టిఫికెట్ తీసుకోకుండానే తిరిగి తెరిచినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. -
140 ఏళ్ల నాటి బ్రిడ్జి.. ఇటీవలే మరమత్తులు.. 4 రోజులకే పెను విషాదం
మోర్బీ: గుజరాత్లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మోర్బీ జిల్లాలోని ప్రాంతంలో మచ్చు నదిపైనున్న కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కుప్పకూలింది. ఉన్నట్టుండి బ్రిడ్జి తెగిపోవడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు నదిలో పడిపోయారు. బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 132కు చేరింది. ఇప్పటివరకు 177 మందిని రక్షించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 500 మందికిపైగా ఉన్నట్లు తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యల్లో పలుపంచుకుంటున్నారని చెప్పారు. Early morning visuals from the accident site in #Morbi where over 130 people have died after a cable bridge collapsed. Gujarat Minister Harsh Sanghavi present at the spot. pic.twitter.com/mOtsYcINt2 — NDTV (@ndtv) October 31, 2022 మోర్బీలోని మచ్చు నదిపై కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి చెందారు. వెంటనే గుజరాత్ సీఎం గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఫోన్లో మాట్లాడారు మోదీ. ఘటన వివరాలను తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.ఈ ఘటనలో మరణించిన వారికి గుజరాత్ ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించగా, కేంద్రం రూ.2 లక్షలు ప్రకటించింది. గాయపడిన వారికి రూ.50 వేల సాయం ప్రకటించింది. ఇక మోదీ అహ్మదాబాద్‌లో తలపెట్టిన రోడ్ షోను ప్రమాదం నేపథ్యంలో రద్దు చేసుకున్నారు. కట్టింది 1880లో...! తీగల సాయంతో వేలాడే మోర్బీ సస్పెన్షన్ బ్రిడ్జిపై నడవడం సందర్శకులకు మధురానుభూతి కలిగిస్తుంది. నిత్యం వందలాది మంది దీన్ని సందర్శిస్తుంటారు. ఇది 140 ఏళ్ల నాటిది! 1879 ఫిబ్రవరి 20న అప్పటి ముంబై గవర్నర్ రిచర్డ్ టెంపుల్ దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. 1880లో నిర్మాణం పూర్తయ్యింది. ఇందుకు అప్పట్లోనే రూ.3.5 లక్షలు ఖర్చయ్యాయి. వంతెన పొడవు 765 అడుగులు (233 మీటర్లు). వెడల్పు 1.25 మీటర్లు. దీని నిర్మాణానికి అవసరమైన సామగ్రిని ఇంగ్లండ్ నుంచి తెప్పించారు. నాటి మోర్బీ పాలకుడు సర్ వాగ్జీ ఠాకూర్ అప్పట్లో యూరప్‌లో ఉన్న అత్యాధునిక పరిజ్ఞానాలను రంగరించి దీన్ని కట్టించాడు. ఇది మోర్బీ పట్టణంలోని దర్బార్గఢ్, నజార్బాగ్ ప్రాంతాలను అనుసంధానిస్తుంది. దీన్ని చారిత్రక వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చారు. 7 నెలల పాటు రిపేర్లు.. 26వ తేదీనే రీ ఓపెన్ బ్రిటిష్ హయాంలో కట్టిన ఈ పాదచారుల వంతెనను ఇంజనీరింగ్ అద్భుతంగా చెబుతుంటారు. దీనికి ఇటీవలే మరమ్మతులు చేయడంతో పాటు ఆధునీకరించారు. రూ.2 కోట్లతో 7 నెలలకు పైగా పనులు జరిగాయి. ఈ సందర్భంగా వంతెన ఏ మేరకు సురక్షితమన్న అంశం గుజరాత్ అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చింది. దీని పటిష్టతపై పలువురు ఎమ్మెల్యేలు అనుమానం వ్యక్తం చేయగా అంతా బాగానే ఉందని ప్రభుత్వం బదులిచ్చింది. గుజరాతీ నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల 26వ తేదీన రీ ఓపెన్ చేసి సందర్శకులను అనుమతిస్తున్నారు. నాలుగు రోజులకే ఘోరం జరిగిపోయింది. మరమ్మతుల తర్వాత వంతెనకు మున్సిపాలిటీ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇంకా అందలేదని అధికారులు తెలిపారు. 1979లో బద్దలైన మచ్చూ డ్యాం... వేలాదిమంది జలసమాధి మోర్బీ పట్టణంలో తీగల వంతెన ప్రమాదం 1979లో ఇదే మచ్చూ నదిపై జరిగిన ఘోర దుర్ఘటనను మరోసారి గుర్తుకు తెచి్చంది. 1979 ఆగస్టు 11న మోర్బీ సమీపంలోని మచ్చూ–2 డ్యామ్ తెగిపోయింది. దాంతో పట్టణాన్ని భారీ వరద ముంచెత్తింది. ఈ విషాదంలో 2,000 మందికిపైగా చనిపోయారు. సౌరాష్ట్రలో కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు అందించడానికి ఈ డ్యామ్‌ను 1972లో నిర్మించారు. -
ఒక్కసారిగా కుప్పకూలిన బ్రిడ్జి.. 52 గ్రామాలకు రాకపోకలు బంద్
సాక్షి, ఆసిఫాబాద్: జిల్లాలోని అందవెల్లి వద్ద పెద్దవాగుపై ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. మంగళవారం అర్ధరాత్రి బ్రిడ్జి కూలిపోవడంతో కాగజ్‌నగర్, దహేగం మండలాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. దీంతో, 52 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, గత కొన్ని రోజులుగా జిల్లాలో ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో, బ్రిడ్జి ప్రమాదకరమైన స్థితికి చేరడంతో అధికారులు ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయింది. కాగా, వాహనల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు.. కూలిన బ్రిడ్జిని తొందరగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. -
గోవాలో టూరిస్టులకు తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్
Dudhsagar Water Falls.. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, వర్షాల నేపథ్యంలో వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాల వేళ గోవాలోని దూద్‌సాగర్ వాటర్‌ఫాల్స్ వద్ద పెను ప్రమాదం తప్పింది. 40 మంది పర్యాటకులను సిబ్బంది కాపాడారు. ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. వివరాల ప్రకారం.. కొద్దిరోజులుగా గోవాలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. కాగా, శుక్రవారం సాయంత్రం కూడా భారీ వర్షాలు కురవడంతో దూద్‌సాగర్ జలపాతం నీటి మట్టం గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వాటర్‌ఫాల్స్ చూసేందుకు వచ్చిన 40 మందికి పైగా పర్యాటకులు నీటిలో చిక్కుకున్నారు. నీటిమట్టం పెరగడం వల్ల క్రాసింగ్ కోసం ఉపయోగించిన వంతెన కూలిపోయింది. దీంతో, వెంటనే అప్రమత్తమైన దృష్టి లైఫ్‌సేవర్స్ పర్యాటకులను కాపాడారు. అనంతరం, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. The River Lifesaver rescued around 40 guests stuck at Dudhsagar Waterfall due to turning of crossing bridge where water level increased due heavy rainfall. I thank and congratulate the River Lifesavers for rescuing the tourists. pic.twitter.com/prw6yK69qi — Dr. Pramod Sawant (@DrPramodPSawant) October 14, 2022 ఈ సందర్భంగా లైఫ్‌సేవర్స్.. పర్యాటకులను కాపాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, ఆ ప్రాంతంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక, గోవాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంతో కొద్దిరోజుల పాటు దూద్‌సాగర్ జలపాతంలోకి ఎవరూ వెళ్లకూడదని దృష్టి లైఫ్‌సేవర్స్ హెచ్చరించింది. ఈ ఘటనపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ స్పందించారు. ఈ సందర్భంగా పర్యాటకులను కాపాడిన లైఫ్ సేవర్స్ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. Today evening due to heavy rain at Karnataka water level at Dudhsagar waterfall increase due to this crossing bridge got turn. around 40 Guest stuck and unable to cross River Lifesaver went on bridge and help one by one to cross bridge pic.twitter.com/TutWgQFci8 — Dev walavalkar (@walavalkar) October 14, 2022 -
బాంబులతో దద్ధరిల్లిన ఉక్రెయిన్ ...ఘోరంగా విరుచుకుపడ్డ రష్యా
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై ఘోరంగా వరుస బాంబులతో విరుచుకుపడింది రష్యా. అందుకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రష్యా కురిపించిన బాంబు వర్షంలో కీవ్ నగరం నడిబొడ్డున ఉన్న ప్రసిద్ధ బ్రిడ్జ్ ఆఫ్ గ్లాస్ పై దారుణంగా బాంబు దాడి జరిగింది. దీంతో వంతెన బూడిదతో కప్పబడినట్లుగా నిర్మానుష్యంగా మారింది. అలాగే ఎప్పుడూ జనాలతో అత్యంత రద్దీగా ఉండే షెవ్చెంకో పార్కుపై కూడా దాడులు జరిగాయి. అక్కడ మొత్తం దట్టమైన పొగ వ్యాపించి విధ్యంసకరంగా మారింది. మరోక వీడియోలో ఈ బాంబు దాడుల సమయంలో వీధుల గుండా వెళ్తున్న అమ్మాయి కనపిస్తుంది. ఆమె భయం భయంగా వెళ్తుంటే ఆమెకు సమీపంలోనే క్షిపణి దాడి జరిగింది. దీంతో ఆమె భయంతో వేగంగా పరిగెడుతూ వెళ్తున్నట్లు కూడా ఆ వీడియోలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఉక్రెయిన్ మిసైల్ దాడిలో చిక్కుకుని అల్లకల్లోలంగా మారింది. The Bridge of Glass in the very heart of Kyiv pic.twitter.com/CvsRfTEAoJ — Illia Ponomarenko 🇺🇦 (@IAPonomarenko) October 10, 2022 Shevchenko Park in central Kyiv now. Probably the city’s busiest park, usually packed with people and street musicians pic.twitter.com/9kIS4rBiKq — Matthew Luxmoore (@mjluxmoore) October 10, 2022 A girl was recording herself as she walked through what looks like Shevchenko Park in Kyiv this morning. She was almost killed by a Russian rocket pic.twitter.com/1Fa40ypcyg — Matthew Luxmoore (@mjluxmoore) October 10, 2022 (చదవండి: ‘కెర్చ్ వంతెన’కు ప్రతీకారం.. ఉక్రెయిన్‌పై మిసైల్స్‌తో భీకర దాడులు) -
గాలొచ్చి బ్రిడ్జి కూలిందట
న్యూఢిల్లీ: ‘గాలి మరీ గట్టిగా వచ్చింది. అందుకే బ్రిడ్జి కడుతుండగానే కూలిపోయింది’ – కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రి నితిన్ గడ్కరీకి ఓ ఐఏఎస్ అధికారి ఇచ్చిన వివరణ ఇది. దాంతో విస్తుపోవడం ఆయన వంతైంది. ఈ విషయాన్ని సోమవారం ఓ సమావేశంలో మంత్రే స్వయంగా చెప్పుకొచ్చారు. బిహార్‌లోని సుల్తాన్‌గంజ్‌లో గంగా నదిపై కడుతున్న ఓ బ్రిడ్జిలో కొంత భాగం ఏప్రిల్ 29న కూలిపోయింది. దీనిపై సంబంధిత ఐఏఎస్ అధికారిని వివరణ కోరితే పెనుగాలే కారణమని తేలిగ్గా చెప్పేశారన్నారు మంత్రి. ‘‘ఎంత గట్టిగా వీచినా గాలికి బ్రిడ్జి ఎలా కూలుతుందో నాకింత వరకూ అర్థం కాలేదు. ఏకంగా రూ.1,710 కోట్లతో కడుతున్న బ్రిడ్జి కూలిందంటే నిర్మాణంలోనే లోపముందన్నమాటే’’ అని అభిప్రాయపడ్డారు. 3.12 కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే దేశంలోనే అతి పొడవైందిగా నిలవనుంది. -
అతని సమాధానం విని ఆశ్చర్యపోయా: నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: మీడియాకు ఆసక్తికరమైన అనుభూతుల్ని పంచుకోవడంలో ముందుంటారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. వంతెనల నిర్మాణం విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గడ్కరీ.. ఈ సందర్భంగా ఆయనకు ఎదురైన ఓ అనుభవం గురించి తెలిపారు. ‘‘బీహార్ సుల్తాన్‌గంజ్ వద్ద నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జిలో కొంత భాగం ఈ మధ్య కూలిపోయింది. ఏప్రిల్ 29న ఈ ఘటన జరిగింది. కారణం ఏంటని నా సెక్రెటరీని అడిగా.. అతను ‘బలమైన గాలుల వీయడం వల్లే కూలింది సార్’ అన్నాడు. ఐఏఎస్ అధికారి స్థాయిలో ఉండి.. ఆయన అలాంటి వివరణ ఇచ్చేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. వెంటనే నేను.. ‘గాలులకు బ్రిడ్జి కూలిపోవడం ఏంటయ్యా. మరేదైనా కారణం అయ్యి ఉండొచ్చేమో’ అంటూ ఖుల్లాగా నా అభిప్రాయం చెప్పేశా. దేశంలో వంతెనల నిర్మాణంలో ఖర్చు తగ్గించాల్సిన అవసరం ఉందని, అదే సమయంలో ఇలాంటి ఘటనలను పరిగణనలోకి తీసుకుని నాణ్యత విషయంలో కాంప్రమైజ్ కాకూడదంటూ ఢిల్లీలో ఓ ఈవెంట్‌కు హాజరైన గడ్కరీ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. సుల్తాన్‌గంజ్‌లో జరిగిన ఘటనపై సీఎం నితీశ్ కుమార్ ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. సుమారు 1,700 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న భారీ బ్రిడ్జి ఇది. 2014లోనే మొదలైన పనులు.. ఇంకా పూర్తి కొనసాగుతున్నాయి. అలాంటిది గాలులకు కూలిపోవడం ఏంటన్న ఆశ్చర్యమూ వ్యక్తం అవుతోంది అంతటా. -
జూరాల కాల్వపై కూలిన వంతెన
ధరూరు (గద్వాల): వాహనం బరువును తట్టుకోలేక ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన కుడికాల్వపై నిర్మించిన వంతెన కూలింది. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం భీంపురం సమీపంలో జూరాల–ఆత్మకూరు, మక్తల్ ప్రధాన రోడ్డు మార్గం నుంచి భీంపురం, పెద్దచింతరేవులకు రాకపోకలు సాగించేందుకు సుమారు 30 ఏళ్ల క్రితం రోడ్–కం–బ్రిడ్జిని నిర్మించారు. అప్పటినుంచి ఇదే మార్గం గుండా ఈ రెండు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం భీంపురానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి నిర్మాణంకోసం స్లాబ్ వేసేందుకు కాంక్రీటు మిశ్రమంతో కూడిన భారీ వాహనం (30 టన్నుల ట్రాంక్ మిక్చర్) వచ్చింది. వంతెన మధ్యలోకి రాగానే బ్రిడ్జి కూలింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని అలాగే ఆపి కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. -
ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో వైరల్
-
వైరల్: మెక్సికోలో కూలిన మెట్రో ఫ్లైఓవర్, 23 మంది మృతి
మెక్సికో సిటీ: మెక్సికో సిటీలో మెట్రోలైన్పై రైలు వెళుతుండగా ఎలివేటెడ్ కారిడార్ (పిల్లర్లపై నిర్మించిన మెట్రో మార్గం) కుప్పకూలిన దుర్ఘట నలో 23 మంది మరణించగా, మరో 70 మంది గాయపడ్డారు. మెట్రో మార్గం కుప్పకూలే సమయంలోనే ఓ కారు అక్కడ ఉండటంతో ఫ్లైఓవర్ దానిపై పడింది. కారులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.మొత్తం 49 మందిని ఆస్పత్రిలో చేర్చామని నగర మేయర్ క్లౌడియా షీన్బౌమ్ తెలిపారు. మరణించిన వారిలో పిల్లలు సైతం ఉన్నారని, ఇది చాలా దురదృష్టకర ఘటన అని పేర్కొన్నారు. కొనసాగుతున్న సహాయకచర్యలు.. ప్రమాదం గురించి తెలియగానే వందలాది మంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మెక్సికోలో కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ఆంక్షలు ఉన్నప్పటికీ, ప్రజలు భారీగా ప్రమాద స్థలానిక చేరుకున్నారు. ప్రమాదం జరగడానికి కారణమైన బాధ్యులను గుర్తించి శిక్ష విధించాలంటూ మెక్సికో విదేశాంగ కార్యదర్శి మార్సెలో ఎబ్రార్డ్ డిమాండ్ చేశారు. అయితే ఆయన 2006 నుంచి 2012 వరకు మెక్సికో సిటీ మేయర్‌గా పని చేశారు. ఆ సమయంలోనే ఈ మెట్రో రైల్ లైన్ నిర్మాణం జరిగింది. 2024లో దేశాధ్యక్ష పదవికి మెర్సెలో పోటీపడనున్న నేపథ్యంలో ఈ ఘటన ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. నిర్మాణంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే 2017లో రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో ఓ భూకంపం సంభవించింది. అది ఈ మెట్రోమార్గాన్ని దెబ్బతీసిందనే అభిప్రాయాలు కూడా వెల్లడవుతున్నాయి. From moments ago, the collapse of the elevated #Linea12 #MetroCDMX railway that crashed the subway. Many are blaming current Foreign Affairs Secretary, Marcelo Ebrard, who was Mayor of Mexico City when this line was built, with allegations of poor construction and money issues. pic.twitter.com/LkCl6gfKG6 — David Wolf (@DavidWolf777) May 4, 2021 A tragedy occurred, the metro on line 12 with the bridge in Mexico City fell, there are many injured and people trapped in the wagons, I hope their relatisituation.ot in that situation #MetroCDMX #Linea12 pic.twitter.com/zxVZ05iVp6 — Yessi 🇲🇽 (@HamiltonYessica) May 4, 2021 చదవండి: వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్న మిలిందా- బిల్ గేట్స్ -
కుప్పకూలిన వంతెన
సాక్షి, సామర్లకోట: పిఠాపురం రోడ్డులో ఏలేరు కాలువపై ఉన్న ఇరుకు వంతెన శుక్రవారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సామర్లకోట నుంచి పిఠాపురం వైపు గ్రావెల్ లోడుతో టిప్పర్ వెళ్తుండగా.. ఆ బరువుకు వంతెన కూలిపోయింది. దీంతో టిప్పర్ ఏలేరు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ ప్రాణాలతో బయట పడ్డారు. బ్రిడ్జి కూలిపోవడంతో పిఠాపురం రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిటిష్ కాలంలో ఈ వంతెనను నిర్మించారు. ఇది శిథిలావస్థకు చేరిన విషయమై గతంలో నిమ్మకాయల చినరాజప్ప ఉపముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘సాక్షి’ దినపత్రిక వివిధ కథనాలు ప్రచురించింది. ఈ వంతెన దుస్థితిపై హెచ్చరించింది. అప్పట్లో ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాజప్ప ఈ వంతెనను ఒక్కసారి కూడా పరిశీలించలేదు. అధికారులు కూడా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కురిసిన అధిక వర్షాలు, ఏలేరు ప్రాజెక్టు నుంచి అదనపు జలాల విడుదల కారణంగా ఏలేరు కాలువ ఉద్ధృతంగా ప్రవహించింది. ప్రవాహ ఉద్ధృతికి వంతెన మరింత దెబ్బతింది. దీని దుస్థితిని గమనించిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు కొత్త వంతెన నిర్మించాలని ఆర్అండ్బీ మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. దీని నిర్మాణానికి నిధులు విడుదలైనట్లు ప్రకటించారు. ఇంతలోనే వంతెన కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై సుమంత్, తహసీల్దార్ వజ్రపు జితేంద్ర తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. వంతెన పైనుంచి పడిన టిప్పర్‌లో ఉన్న డ్రైవర్ అశోక్‌ను, క్లీనర్ కుమార్‌ను సురక్షితంగా బయటకు తీశారు. వారిద్దరూ క్షేమంగా ఉన్నారని చెప్పారు. వారిద్దరూ ఏలేశ్వరానికి చెందిన వారని తెలిపారు. వంతెన కూలిపోవడంతో బ్రౌన్‌పేట వద్ద, పిఠాపురం నుంచి వచ్చే వాహనాలు రాకుండా జల్లూరు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, వాహనాల రాకపోకలను నిషేధించారు. ఈ మేరకు పిఠాపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పిఠాపురం వెళ్లే వాహనాలను మరో మార్గంలో మళ్లించారు. -
వరద తాకిడికి కొట్టుకుపోయిన వంతెన
సాక్షి, హైదరాబాద్ : గురువారం రాత్రి హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 17 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో వాగులు వంకలు పెంగిపొర్లాయి. భారీ వర్షం కారణంగా వరద పోటెత్తడంతో కాగ్నా నది తీవ్ర రూపం దాల్చింది. వరద తాకిడికి కొండగల్-తాండూర్ మార్గం మధ్యలో తాత్కాలికంగా నిర్మించిన వంతెన కొట్టుకుని పోయింది. దీంతో రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ధారూర్, కుల్కచర్ల, పెద్దేముల్ మండలాల్లో భారీగా వర్షం కురవడం వరద ఎక్కువగా వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షం వికారాబాద్ జిల్లా పెద్దేముల్లో 17.2 సెం.మీ వర్షపాతం మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడలో 17 సెం.మీ వర్షపాతం మహబూబ్‌నగర్‌లో 13.9 సెం.మీ వర్షపాతం మహబూబాబాద్‌లో 13.6 సెం.మీ వర్షపాతం సంగారెడ్డి జిల్లా మొగ్దంపల్లెలో 11 సెం.మీ వర్షపాతం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో 10.2 సెం.మీ వర్షపాతం వికారాబాద్ జిల్లా ధారూర్‌లో 9.2 సెం.మీ వర్షపాతం -
కుప్పకూలిన అజీడ్యామ్ గోడ..
-
కుప్పకూలిన అజీడ్యామ్ గోడ.. ఇద్దరు మృతి
రాజ్‌కోట్ : గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గల అజీడ్యామ్ గోడ సోమవారం కుప్పకూలింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు క్రేన్ల సాయంతో శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అజీడ్యామ్ గోడ బ్రిడ్జి కుప్పకూలిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ప్రమాదం నుంచి ఓ ట్రాలీ తృటిలో బయటపడింది. నాలుగు రోజుల క్రితం వచ్చిన నిసర్గ తుపాను ప్రభావంతో గుజరాత్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల వల్లే అజీ డ్యామ్ గోడ పడిపోయినట్లుగా తెలుస్తోంది. -
వేములవాడలో కుప్పకూలిన బ్రిడ్జి
సాక్షి, సిరిసిల్ల : వేములవాడలో కురుస్తున్న వర్షాలకు మూలవాగు ఉధృతంగా ప్రవహించడంతో శుక్రవారం నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పకూలింది. మూలవాగుపై 2 బ్రిడ్జిల నిర్మాణం చేపట్టేందుకు సాయి కన్ర్స్టక్షన్స్ 28 కోట్లకు టెండర్లు దక్కిందచుకుంది. ఒక బ్రిడ్జి నిర్మాణం పూర్తై వినియోగంలోకి రాకముందే మరో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. కాగా, ముడు నెలల క్రితం ప్రభుత్వం నుంచి రావావల్సిన బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేసి వెళ్లిపోయారు. 190 మీటర్ల పొడవు గల బ్రిడ్జిలో ఇప్పటికి 150 మీటర్ల వరకు సెంట్రింగ్ పనిపూర్తయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద ఉధృతి పెరగడంతో ఒక్క పిల్లర్ ఒరిగిపోగా, బ్రిడ్జిలోని 16 భీములకు పగుళ్లు ఏర్పాడ్డాయి. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ నాణ్యత లోపంతో పని చేయడంవల్లే బ్రిడ్జి కూలిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
అయ్యో! బ్రిడ్జి కొట్టుకుపోయింది..
సాక్షి, విశాఖపట్నం: జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో భీభత్సాన్ని సృష్టించాయి. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో మాడుగుల మండలంలోని బోయితేలి రహదారిపై గల సూరిమేట్ట బ్రిడ్జి శుక్రవారం కొట్టుకుపోయింది. దీంతో వంద గ్రామాలకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇక చింతపల్లి, పాడేరు పరిసరాల్లోనూ మూడు రోజులుగా వానలు దండిగా పడటంతో మాడుగుల మండలం మద్ది గురువు, హుకుంపేట మండలం పెద గురువు వద్ద వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. వరదల ధాటికి ముంచుంగ్ ఫుట్ మండలంలో లక్ష్మీపురం వద్ద గెడ్డ కొట్టుకుపోయింది. అటు బొడ కొండమ్మ ఆలయం వద్ద రహదారికి అడ్డంగా బండరాళ్లు పడి రాకపోకలకు అంతరాయం ఏర్పడగా స్థానికులే వాటిని తొలగించి, తిరిగి రహదారిని పునరిద్ధరించుకున్నారు. -
ఆ ప్రమాదం బాధ్యత మమత సర్కార్‌దే!
సాక్షి, న్యూఢిల్లీ : కోల్‌కతా నగరానికి మరో విషాదం తప్పలేదు. 2016లో వివేకానంద రోడ్డులోని ఫ్లైఒవర్ కూలిపోయి 27 మంది మరణించి, దాదాపు 60 మంది గాయపడినా పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం మేల్కొనలేదు. పర్యవసానంగా విమానాశ్రయానికి వెళ్లేదారిలోని మేజర్‌హట్ వంతెన మంగళవారం కూలిపోయి ఒకరు మరణించగా 21 మంది గాయపడ్డారు. గత ప్రభుత్వం అంటే సీపీఎం ప్రభుత్వం తప్పుడు డిజైన్‌ను ఆమోదించడం వల్ల వివేకానంద రోడ్డులోని వంతెన కూలిపోయిందంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాడు నెపాన్ని నెట్టేశారు. ఆ వంతెన కూలిపోయిన సందర్భంగానే ఢిల్లీ నుంచి పిలిపించిన ఓ ఏజెన్సీ వచ్చి మేజర్హట్తో పాటు నగరంలోని పలు వంతెనల పరిస్థితిని ఆడిట్ చేసింది. పదే పదే రోడ్డు లేయర్లు వేస్తూ రావడం వల్ల మేజర్‌హట్ వంతెన బరువు పెరిగిందని, అంత బరువును తట్టుకునే పరిస్థితుల్లో పిల్లర్లు లేవని, అధిక బరువును సమాంతరంగా పంపిణీ చేసేలా అదనపు పిల్లర్లను నిర్మించకపోతే వంతెన కూలిపోతుందని ఆ ఏజెన్సీ హెచ్చరించింది. అయినప్పటికీ మమత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇప్పుడు ఆ వంతెన కూలింది. 2016లో కూలిపోయిన వివేకానంద వంతెన తాలూకా శిథిలాలు ఇంకా ప్రమాదకరంగానే వేలాడుతున్నాయని, వాటిని తొలగించాలంటూ స్థానిక పత్రికల్లో పలుసార్లు వార్తలు వచ్చినా ఆమె ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. శిథిలాలను తొలగించేందుకు కూడా ఎంతో ఖర్చు అవుతుందని, ప్రస్తుతం ప్రభుత్వం వద్ద అంత నిధులు లేవని ఆమె చెబుతూ వస్తున్నారు. ఏడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన మమతా ప్రభుత్వం ఏ తప్పు జరిగినా నెపాన్ని గత ప్రభుత్వంపైకి నెట్టేసి తప్పించుకోవాలని చూస్తోంది. ఈ ఆరేళ్ల కాలంలోనే కోల్‌కతాలో మూడు వంతెనలు కూలిపోయాయి. వంతెనలు ఎప్పుడు నిర్మించినా వాటి నిర్వహణ బాధ్యతలు మాత్రం అధికారంలో ఉన్న ప్రభుత్వానివే అవుతుంది. ఇలాంటి ప్రమాదాలు ఒక్క కోల్‌కతాలో, ఒక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే జరగడం లేదు. ముంబైలోని అంధేరి రైల్వే బ్రిడ్జిలో కొంత భాగం గత జూలై నెలలో కూలిపోగా ఒకరు మరణించి, పలువురు గాయపడ్డారు. బ్రిడ్జి ఆడిటింగ్ జరిగిన ఆరు నెలలకే ప్రమాదం జరగడం గమనార్హం. హిమాచల్ ప్రదేశ్‌లోని ఛాంబ పట్టణాన్ని, పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ను కలుపుతూ నిర్మించిన కాంక్రీట్ వంతెన గతేడాది కూలిపోగా ఆరుగురు మరణించారు. మన ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరిగాయి. -
కోల్‌కతాలో కుప్పకూలిన వంతెన
-
కూలిన ఫ్లై ఓవర్.. ఒకరి మృతి
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ కోల్‌కతాలోని మాజెర్హత్ ఏరియాలో ఉన్న ఫ్లై ఓవర్ కుప్ప కూలింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా... ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అకస్మాత్తుగా సంభవించిన ఈ ఘటనతో కొన్ని వాహనాలు ఫ్లై ఓవర్ కింద ఇరుక్కుపోయాయి. వీరిని రక్షించేందుకు 10 రక్షణ బృందాలు రంగంలోకి దిగాయి. ఫ్లై ఓవర్ పూర్తిగా కూలిపోయే అవకాశం ఉన్నందున సమీపంలోని ఇళ్లను కూడా ఖాళీ చేయిస్తున్నారు. బాధాకరమైన విషయం : మమతా బెనర్జీ రైల్వే స్టేషన్ సమీపంలోని ఫ్లై ఓవర్ కూలిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం డార్జిలింగ్ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈరోజు(మంగళవారం) డార్జిలింగ్ నుంచి కోల్‌కతాకు విమానాలు లేనందున ఘటనా స్థలానికి వెళ్లలేకపోతున్నాని విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్షతగాత్రులను కాపాడటమే తమ కర్తవ్యమని పేర్కొన్నారు. సహాయక బృందాలు రంగంలోకి దిగాయని తెలిపారు. కాగా రెండు సంవత్సరాల క్రితం కోల్‌కతాలోని వివేకానంద ఫ్లై ఓవర్ కూలిపోవడంతో 20 మంది మృతి చెందగా.. మరో 60 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. -
కుప్ప కూలిన కోల్‌కతాలోని మాజెర్హత్ ఫ్లై ఓవర్
-
బైనేరు బ్రిడ్జి ఆత్మఘోష
పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం : ఓపిక ఉన్నంత వరకు నిలబడ్డాను. మీ సేవలో తరించాను. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్లేందుకు మీకు అడ్డుగా ఉన్న బైనేరు వాగుపై నేను వారధినై నిలిచా. వయసు మీద పడుతున్నా మీ సేవే నా భాగ్యం అనుకుంటూ ఇన్నేళ్ళు తరించా. వయసుడిగి పోయింది. ఆటుపోట్లకు తట్టుకోలేక మొన్ననే నేలకొరిగిపోయాను. ఇంతకీ నేనెవరని అనుకుంటున్నారా. మీ అందరికీ తెలిసిన దానినే. అదే మీ బైనేరు బ్రిడ్జినండీ.. ఆత్మఘోష చెప్పుకుంటే నా మనసు కుదుటపడుతుంది. అందుకే చెబుతున్నా. 1913లో నా జీవన ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటి బ్రిటీష్ కాలంలో నన్ను (బ్రిడ్జి) నిర్మించారు. బ్రిటన్‌కు చెందిన రాయల్ నేవీ ఇంజినీర్లు ఈబీ ఎల్విన్ ఇష్క్, వీటీ జాన్‌లు కొవ్వూరు నుంచి పోలవరం వరకు గోదావరి గట్టు నిర్మించేందుకు వచ్చారు. ఆ సమయంలో కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం గ్రామాలను కలిపేందుకు జంగారెడ్డిగూడెం రెవెన్యూ సర్వే నెంబర్ 250లో నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. గ్రేట్ బ్రిటన్ (స్కాట్లాండ్)లోని ఐనార్క్ స్టీల్ కంపెనీ తయారుచేసిన స్టీల్ గడ్డర్లను ఇక్కడకు తీసుకువచ్చి బైనేరు వాగుపై ఎటువంటి స్తంభాలు లేకుండా స్టీల్ గడ్డర్ బ్రిడ్జిగానే నన్ను నిర్మించారు. నా పొడవు 39 మీటర్లు, వెడల్పు 12 అడుగులండి. 105 ఏళ్ల పాటు కోట్లాది వాహనాలకు, ప్రయాణికులకు ఎన్నో సేవలందించాను. మొదట్లో నేను చాలా పటిష్టంగా ఉండేదానిని. రాను రాను వయసు మీద పడటంతో కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నాను. అనారోగ్యానికి (మరమ్మతులు) గురైనప్పటి నుంచి వైద్యం చేయించాలని ఎన్నోసార్లు అధికారులను కోరాను. అధికారులు కూడా నాకు వైద్యం (రిపేర్లు) చేయించడం కోసం ప్రతిపాదనలు పంపారు. పనులు చేపడుతామని చెప్పడమే తప్పండి, కనీసం నన్ను పట్టించుకోలేదు. భారీ వాహనాలు, ఎత్తయిన వాహనాలు తగిలి నా తల(స్టీల్ గడ్డర్లు) పై భాగంలో గాయాలు(విరిగినా) తగిలినా చూసీచూడనట్లు వదిలేశారు. నా కాళ్ల కింది నేల బైనేరు వాగు వరద తాకిడికి కోతకు గురైనా.. నా ఉనికికి ప్రమాదం వస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఏం చేయను ఎంతకాలం నిలబడి సేవలందించగలను. మొన్నొచ్చిన బైనేరు వరదను నా శక్తి మేరకు తట్టుకున్నా. కొద్ది కొద్దిగా నా బలాన్ని పిండేస్తుంటే ఓపిక లేక ఓడిపోయి ఒరిగిపోయాను. ఇక సెలవు.. -
కుప్పకూలిన బ్రిడ్జి.. 22 మంది మృతి
రోమ్ : ఇటలీలోని జెనోవా సిటీలో విషాదం చోటుచేసుకుంది. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా పురాతన బ్రిడ్జి కుప్ప కూలిపోయింది. దీంతో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న వాహనాలు బ్రిడ్జి పక్కనే ఉన్న ఇళ్లపై పడిపోయాయి. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో 22 మంది మృతి చెందగా మరికొంత మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న వాహనాల సంఖ్య తక్కువగా ఉండటంతో ప్రాణ నష్టం కాస్త అయినా తగ్గిందని రవాణా శాఖ మంత్రి ఆనిలో టోనినెల్లి ట్వీట్ చేశారు. జెనోవా ఇండస్ట్రియల్ కారిడార్‌లో సుమారు 650 అడుగుల ఎత్తులో ఉన్న మోరాండి బ్రిడ్జిని 1960లో నిర్మించారు. గతంలో కొన్ని రోజులు మూసివేసిన అనంతరం 2016లో మరమ్మతులు చేపట్టి మళ్లీ బ్రడ్జిని ఓపెన్ చేశారు. అప్పటినుంచి వేలాది వాహనాదారులు ఈ బ్రిడ్జి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఇటీవల భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆ బ్రిడ్జి కుప్పకూలింది. అయితే సుమారు ఐదు దశాబ్దాల పాటు చెక్కు చెదరకుండా ఉన్న ఈ పురాతన బ్రిడ్జి అకస్మాత్తుగా కూలిపోవడాన్ని ప్రకృతి విపత్తుగా పరిగణించాలా లేదా దీని వెనుక వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ జరుపుతున్నట్లు ఇటలీ ప్రభుత్వం తెలిపింది. -
మన ఫ్లైఓవర్లు పదిలమేనా?
సాక్షి,సిటీబ్యూరో: ముంబై అంధేరి స్టేషన్‌లోని బ్రిడ్జి కూలిన ఘటనతో నగరంలోని ఫ్లై ఓవర్లు, బ్రిడ్జిల పటిష్టత, భద్రత అంశం నగరంలో చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీలో 30కి పైగా ఫ్లై ఓవర్లున్నాయి. వీటిని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు నిర్మించాయి. ఆ తర్వాత మాత్రం నిర్వహణను మరచిపోవడంతో వీటిల్లో నాలుగైందింటి పరిస్థితి దారుణంగా ఉందని, తక్షణ మరమ్మతులవసరమని ఇంజినీర్లు భావిస్తున్నారు. వీటికి మరమ్మతులవసరమని దాదాపు ఐదేళ్ల క్రితమే గుర్తించినప్పటికీ ఇప్పటి వరకు పనులు చేపట్టలేదు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. వర్షాకాలానికి ముందు, తర్వాత కూడా ఫ్లై ఓవర్ల స్థితిగతులను పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేయాల్సి ఉండగా, నగరంలో ఆ పని జరగడం లేదు. నగరంలో నిర్మించిన ఫ్లై ఓవర్లలో ఇప్పటివరకు ఒక్క డబీర్‌పురా ఫ్లై ఓవర్‌కు మాత్రం పూర్తిస్థాయి మరమ్మతులు చేశారు. ప్రస్తుతం లాలాపేట్ ఫ్లై ఓవర్ మరమ్మతులు జరుగుతున్నాయి. దాదాపు రూ.5.8 కోట్లతో నెలన్నర క్రితం చేపట్టిన పనులు పూర్తయ్యేందుకు మరో నాలుగైదునెలల సమయం పట్టనుంది. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌కు నాలుగేళ్ల క్రితం స్వల్ప మరమ్మతులు మాత్రం చేశారు. పూర్తి మర్మతులు చేయకపోవడంతో ప్రస్తుతం దాంతోపాటు తెలుగుతల్లి, హఫీజ్‌పేట, మాసాబ్‌ట్యాంక్ ఫ్లై ఓవర్లకు కూడా మరమ్మతులు అవసరమని ఇంజినీర్లు భావిస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ మళ్లింపు, తదితర కారణాలతో ఎప్పటికప్పుడు ఈ మరమ్మతు పనుల్ని వాయిదా వేస్తున్నారు. సాధారణంగా ఫ్లై ఓవర్లలోని గర్డర్స్ ప్రాంతాల్లో కాంక్రీట్ దెబ్బతింటుంది. బేరింగులు అరిగిపోతాయి. ఎక్స్పాన్షన్ జాయింట్స్ వదులై బలహీనంగా మారుతుంది. స్తంభాల పైభాగాలు(పయర్ క్యాప్స్) తుప్పుపడుతాయి. బాక్స్‌గర్డర్స్ ఏటవాలు గోడల్లో పగుళ్లు ఏర్పడుతాయి. నిర్ణీత వ్యవధుల్లో వీటికి మరమ్మతులు చేయాల్సి ఉన్నప్పటికీ ఆపని జరగడం లేదు. ఒక్కో ఫ్లై ఓవర్‌కు దాదాపు 15–20 స్పాన్‌లుంటాయి. వాటిల్లో ఉండే బేరింగ్లను జాకీలు ఏర్పాటుచేసి మార్చాల్సి ఉంటుంది. వాస్తవానికి వీటి నిర్వహణ బాధ్యతలు చూడటంతోపాటు నిర్ణీత వ్యవధుల్లో తగిన మరమ్మతులు చేపట్టేందుకు స్పెషల్ డివిజన్ ఉండాలి. కానీ నగరంలో అది లేదు. జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ విభాగానికి ఉన్నబోలెడు పనులతో వీటిపై దృష్టి సారించే పరిస్థితి లేదు. ఏ సంస్థ నిర్మించిన ఫ్లై ఓవర్ల మరమ్మతుల్ని ఆ సంస్థే చేయాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. దాదాపు 15 సంవత్సరాల వరకు మరమ్మతులు చేసే అవసరం రాకున్నా..15 ఏళ్ల తర్వాత మాత్రం తప్పనిసరిగా పరిశీలించి పనులు చేయాలని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. నగరంలోని ఫ్లై ఓవర్లలో దాదాపు పది ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చి దాదాపు ఇరవయ్యేళ్లు అవుతోంది. అలాంటి వాటిల్లో బేగంపేట, బషీర్‌బాగ్, తార్నాక, హరిహరకళాభవన్, సీటీఓ, మాసాబ్‌ట్యాంక్ తదతరమైనవి ఉన్నాయి. వీటన్నింటిని కూడా పరిశీలించి మరమ్మతులు చేయాల్సి ఉంది. ఫ్లై ఓవర్లపై పడే గుంతల్ని పూడ్చేందుకు పైపొరలుగా కోటింగ్స్ వేస్తూ పోతుండటంతో కొన్ని ఫ్లై ఓవర్ల మందం ఎంతో ఎత్తు పెరిగిపోయింది. దీని వల్ల కూడా ఫ్లై ఓవర్లు ప్రమాదకరంగా మారే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. నగరంలోని ఫ్లై ఓవర్లకు మరమ్మతులు చేపట్టే యోచనలో ఉన్నామని, పెరిగిన మందాన్ని పూర్తిగా తొలగించే ఆలోచన కూడా ఉందని అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రమాదాలు జరగక ముందే మరమ్మతులు చేయాల్సిన అవసరముంది. -
భారీ వర్షాలకు కుప్పకూలిన బ్రిడ్జ్
-
భారీ వర్షాలకు కుప్పకూలిన బ్రిడ్జ్
సాక్షి, ముంబై : భారీ వర్షాలు ముంబైని ముంచెత్తాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో మహానగరం తడిసిముద్దైంది. వీధులన్నీ జలమయమవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంథేరి బ్రిడ్జి కొంతభాగం కుప్పకూలి రైల్వే ట్రాక్‌పై పడిపోవడంతో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. అంథేరి బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నట్టు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. అంథేరి బ్రిడ్జి మీదుగా రోజూ దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల మంది ప్రయాణీకులు వివిధ రూట్లలో ప్రయాణిస్తుంటారు. కాగా నగరంలోని పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లు నీటమునగడంతో రైళ్ల రాకపోకల్లో తీవ్ర జాప్యం నెలకొంది. వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలో దించారు. మరోవైపు రానున్న 24 గంటల్లో ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ కేంద్రం అంచనాతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. -
వారధి.. వర్ష విధ్వంసం
కొద్దిరోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు సోమవారం సాయంత్రం మంగళూరు తాలూకా– బంట్వాళ మధ్య ఫాల్గుని నదిపై కూలిపోయిన మాలూరుపట్న పాతవంతెన. అదృష్టవశాత్తు ప్రాణాపాయం జరగలేదని అధికారులు చెబుతున్నారు. సాక్షి, బెంగళూరు: దక్షిణ కన్నడ జిల్లాలోని మాలూరుపట్న వద్ద ఫాల్గుని నదిపై ఉన్న పాత వంతెన వర్షాలకు సోమవారం సాయంత్రం కూలిపోయింది. దీంతో మంగళూరు తాలూకా– బంట్వాళ మధ్య రాకపోకలు స్తంభించాయి. కొన్ని దశాబ్దాల క్రితం ఈ వంతెన నిర్మించారు. గత కొన్ని వారాలుగా దక్షిణ కన్నడ జిల్లాతో పాటు కరావళి ప్రాంతాన్ని వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వర్షాల ధాటికి తడిసి ముద్దయిన వంతెనలో కొంతభాగం ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ జిల్లా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భద్రతా చర్యలను పర్యవేక్షించేందుకు వంతెనకు ఇరువైపులా పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఆ వంతెనను మూసివేశారు. ఇసుక తవ్వకాలతో నష్టం మాలూరుపట్న ప్రాంతంలో కొన్నేళ్లుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇసుక తవ్వకాల ఫలితంగా వంతెన పిల్లర్లు దెబ్బతిన్నాయి. కాగా ఇటీవల ఇసుక తవ్వకాలను నిషేధించారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వంతెన కూలడంతో కుప్పెడవు, కైకాంబ, ఇరువేల్, ఇడపడవు, గంజిమట్, సురత్‌కాల్ తదితర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
శిథిలావస్థలో వారధి
దామరచర్ల(మిర్యాలగూడ) : అధికారుల నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల అలసత్వం ప్రయాణికుల పాలిట శాపంగా మారుతోంది. నల్లగొండ– సూర్యాపేట జిల్లాల మధ్య గల మూసీ నదిపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. దామరచర్ల మండల కేంద్రం సమీపంలో మూసీ నదిపై 2001లో రూ.2కోట్లతో నిర్మించిన వంతెన కూలే దశకు చేరింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల కలుపుతూ ఉన్న ఈ వంతెన ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడింది. దామరచర్ల నుంచి పారిశ్రామిక ప్రాంతాలైన మేళ్లచెర్వు, దక్కన్ సిమెంట్స్ కర్మాగారం,హుజూర్నగర్, ప్రముఖ పుణ్యక్షేత్రాలు మట్టపల్లి, జాన్‌పహాడ్ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఈ వంతెన గుండానే రాకపోకలు సాగిస్తున్నారు.పారిశ్రామికీకరణ ప్రాంతం కావడంతో ఈ వంతెనపై నిత్యం వందలాది వాహనాలు సిమెంట్, ఇతర లోడ్లతో వెళ్తుంటాయి. పిల్లర్లు కూలి..చువ్వలు తేలి.. మూసీ నదిపై ఉన్న వంతెనపై పలుచోట్ల సైడ్ పిల్లర్లు కూలిపోవడంతో వాహనాలు నదిలో పడే ప్రమాదం నెలకొంది. దీంతో పాటు వంతెనపై పలు చోట్ల పగుళ్లు ఏర్పడి చువ్వలు తేలాయి. దీంతో ఎప్పుడు ఏప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల తరబడి ఈ పరిస్థితి ఉన్నా అధికారులు ఎవరూ పట్టించు కోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
వారణాసి దుర్ఘటనపై రాజకీయ దుమారం
వారణాసి: ప్రఖ్యాత ఆథ్యాత్మిక నగరం వారణాసిలో ఫ్లైఓవర్ కూలిన ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదుచేశారు. అధికారులు, ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. సదరు ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నది ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘‘యూపీ స్టేట్ బ్రిడ్జ్ కార్పొరేషన్ లిమిటెడ్’’ సంస్థ కావడంతో ఇటు రాజకీయంగానూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారణాసిలోని కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ వద్ద మంగళవారం సాయంత్రం ఫ్లైఓవర్ పిల్లర్ విరిగిపడి.. కింది నుంచి వెళ్తున్న నాలుగు కార్లు, ఒక ఆటో, ఒక మినీ బస్సుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సహాయకచర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆలయాల ధ్వంసం వల్లే: యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ బుధవారం మధ్యాహ్నం ఫ్లైఓవర్ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన విచిత్ర వ్యాఖ్యలు చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణం కోసం మూడు వినాయకుడి ఆలయాలను ధ్వంసం చేశారని, దేవుడి శాపం వల్లే ఫ్లైఓవర్ కూలిపోయిందని స్థానికులు అనుకుంటున్నట్లు తెలిపారు. ‘‘మొన్నటి ఉప ఎన్నికలకు ముందే ఫ్లైఓవర్‌ను నిర్మించాలన్న తొందరలో పనులను అడ్డదిడ్డంగా, నాసిరకంగా చేశారు. పైగా, ఇక్కడ మూడు వినాయకుడి గుడులు ఉండేవని స్థానికులు చెబుతున్నారు. బ్రిడ్జి కోసం వాటని ధ్వంసం చేశారని, ఆ శాపం వల్ల ఇంతటి విపత్తు సంభవించిందని వారు భావిస్తున్నారు’’ అని రాజ్ బబ్బర్ అన్నారు. కాగా, 2016నాటి కోల్‌కతా ఫ్లైఓవర్ దుర్ఘటన ‘‘తృణమూల్ కాంగ్రెస్‌కు దేవుడి హెచ్చరిక’’ అని మోదీ వ్యాఖ్యానించిన పాత వీడియోలు మళ్లీ వైరల్ అయ్యాయి. నాటి దుర్ఘటన ‘యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు యాక్ట్ ఆఫ్ ఫ్రాడ్’ అని మోదీ వ్యాఖ్యానించడం తెలిసిందే. సూపర్ వైజర్‌పై కేసు: ఫ్లైఓవర్ కూలిన ఘటనపై విచారణ కొనసాగుతుండగానే నిర్మాణ సంస్థకు చెందిన పలువురు అధికారులు, ఇంజనీర్లపై ప్రభుత్వం వేటు వేసింది. ప్రజల ప్రాణాలను హరించారంటూ స్టేట్ బ్రిడ్జ్ కార్పొరేషన్ లిమిటెడ్‌పై సిగ్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలైంది. ఐపీసీ సెక్షన్ 304 కింద సంస్థ సూపర్ వైజర్‌పై కేసు నమోదుచేశామని సిగ్రా ఎస్ఐ ధనానంద్ త్రిపాఠి తెలిపారు. రూ. 200 లంచం తీసుకున్న చిరుద్యోగి అరెస్ట్: కాగా, వారణాసి ఫ్లైఓవర్ కూలిన ఘటనలో క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్పించారు. ఒకానొక బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లిన సమయంలో వార్డుబాయ్ రెండు వందల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. బాధితుల ఫిర్యాదుమేరకు దర్యాప్తు చేసిన పోలీసులు.. సదరు చిరుద్యోగిని అరెస్టు చేశారు. -
యూపీలో కూలిన ఫ్లైఓవర్
వారణాసి: వారణాసిలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలి 18 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో జనం శిథిలాల కింద చిక్కుకుని ఉన్నట్లు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వారణాసిలోని కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ రెండు పిల్లర్లు మంగళవారం ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో ఫ్లైఓవర్ స్లాబ్ కింది నుంచి వెళ్తున్న నాలుగు కార్లు, ఒక ఆటో, ఒక మినీ బస్సుపై పడిపోయింది. సహాయ చర్యలు చేపట్టేందుకు పోలీసులతోపాటు జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు అక్కడికి తరలివచ్చాయి. భారీ క్రేన్లను వినియోగించి కాంక్రీటు శిథిలాలను తొలగిస్తున్నారు. బాధితుల్లో ఫ్లై ఓవర్ పనుల్లో పాల్గొన్న సిబ్బందే ఎక్కువమంది ఉన్నారు. క్షతగాత్రుల్లో 18 మంది చనిపోగా మరికొందరు చికిత్స పొందుతున్నారు. శిథిలాల్లో మరికొంతమంది చిక్కుకుని ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కిలోమీటర్ పొడవైన ఈ ఫ్లైఓవర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ ఘటనపై 48 గంటల్లోగా విచారణ నివేదికను అందజేయాలని అధికారులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఈ ఘటనపై సీఎం యోగితో మాట్లాడి, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కోరినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. -
నిడదవోలులో కుప్పకూలిన బ్రిడ్జి
సాక్షి, ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో గడ్డర్ బ్రిడ్జి అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. నిడదవోలు నుంచి కాశి రేవుకు వెళ్లే ఈ బ్రిడ్జిని సుమారు తొంభై ఏళ్ల క్రితం బ్రిటిష్ వారు తమ రాకపోకల నిమిత్తం నిర్మించారు. కాగా 2014లో ఈ బ్రిడ్జి పునర్నిర్మాణం చేపట్టినప్పటికీ పర్యవేక్షణ లోపంతో పనులు నత్తనడకన సాగాయి. బ్రిడ్జి కూలికపోవడంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే స్థానిక టింబర్ డిపో నిత్యం అధిక లోడుతో రాకపోకలు సాగించడంతోనే ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఒక్కసారిగా కుప్పకూలిన బ్రిడ్జి
కొల్లాం : కేరళలోని కొల్లాంలో ఓ పురాతన ఐరన్ బ్రిడ్జి ఒక్కసారిగా కూప్పకూలిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, సుమారు 57మంది గాయపడ్డారు. కొల్లాంలోని చవారా సమీపంలో సోమవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఈ బ్రిడ్జిపై సుమారు 80మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బ్రిడ్జిపై స్థానికులు రోజూ వాకింగ్ చేస్తుంటారు. ఈ రోజు ఉదయం కూడా స్థానికులు వాకింగ్ చేస్తుండగా, ఒక్కసారిగా బ్రిడ్జి కూలిపోయింది. దీంతో పలువురు నదిలో పడిపోగా, మరికొంతమంది ఇనుపరాడ్ల మధ్య చిక్కుకుపోయారు. ఈత వచ్చినవారు నదిలో నుంచి ఈదుకుంటూ బయటకు వచ్చారు. మరోవైపు స్థానికులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బ్రిడ్జి తుప్పు పట్టిందని, మరమ్మత్తులు చేయించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతురాలు కేఎంఎంఎల్ ఉద్యోగిని శ్యామల (55)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. -
బ్రిడ్జి కూలి.. పిల్లలకు తీవ్రగాయాలు
ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్‌లో పాదాచారుల వంతెన తెగిపడి ఘటనలో 22 మంది స్కూల్ పిల్లలకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయాలైన 11 మందిలో ఒకరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, మిగతా వాళ్లు కోలుకున్నారని వైద్యులు వెల్లడించారు. మరోపక్క ఎవరో కావాలనే ఈ పని చేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేయటంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. లోవర్ దిబంగ్ వ్యాలీ జిల్లాలోని దెసలి అనే గ్రామంలో జముపనీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు బుధవారం పంద్రాగష్టు వేడుకల్లో పాల్గొన్నారు. తిరిగి వారు ఇంటికి వెళ్తున్న సమయంలో సమీపంలోని పాదాచారుల వంతెన దాటుతున్నారు. అంతలో ఓవైపు తాడు మొత్తంగా తెగిపడటంతో పిల్లలంతా కింద పడిపోయారు. కాలువలో నీళ్లు తక్కువగా చాలా మందికి రాళ్ల దెబ్బలు తగిలాయి. ఘటన మారుమూల పల్లెలో చోటుచేసుకోవటం, పైగా ప్రతికూల వాతావరణ ప్రభావంతో అధికారులు అక్కడికి చేరుకునేందుకు చాలా సమయమే పట్టింది. చివరకు నావికా దళాన్ని రంగంలోకి దించి ఓ విమానం సాయంతో తీవ్రంగా గాయపడిన 11 మంది పిల్లలను జిల్లా కేంద్రంలోని ఆదిత్యా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక ఘటన గురించి తెలియగానే ముఖ్యమంత్రి పెమ ఖండు తక్షణమే వారికి సాయం అందించాలని, ఘటనపై విచారణ చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. -
అట్లాంటాలో భారీ అగ్ని ప్రమాదం
-
అట్లాంటాలో భారీ అగ్ని ప్రమాదం
అట్లాంటా: అమెరికాలోని అట్లాంటాలో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓవర్ పాస్ బ్రిడ్జ్ పూర్తిగా ధ్వంసమవ్వగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఒక గంటకు పైగా మంటలు ఎగిసిపడ్డాయని అట్లాంటా జర్నర్ కానిస్టుట్యూషన్ పేర్కొంది. ఈ ప్రమాదం పీడ్మొంట్ రోడ్ సమీపంలోని నార్త్బౌండ్అండర్ ఐ-85 బ్రిడ్జిపై చోటు చేసుకుంది. ఆ ప్రాంతమంతా దట్టమై నల్లని పొగలతో కమ్ముకుంది. పక్క బ్రిడ్జిలకు మంటలు వ్యాపించలేదని, మంటలను అదుపులోకి తీసుకొచ్చామని ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి 7 గంటల సమయంలో బ్రిడ్జి పడిపోయిందని అధికారులు వెల్లడించారు. తీవ్రవాదులు చేసిన పనిగా అనుకోవడంలేదని జార్జీయా పోలీసు అధికారి మార్క్పెర్రీ మీడియాకు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదని విచారిస్తున్నామన్నారు. బ్రిడ్జి కూలిపోవడంతో వాహనాదారులకు ప్రత్యామ్నయ మార్గాలను సూచించామన్నారు.. ఘటన స్ధలిలో కొన్నిపీవీస్ వస్తువులు లభించాయని పూర్తి వివారలు శనివారం ఉదయంలోపు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. -
భారీ ప్రవాహంతో కుప్పకూలిన బ్రిడ్జి
-
భారీ ప్రవాహంతో కుప్పకూలిన బ్రిడ్జి
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఆ ప్రవాహ వేగానికి బెయిలీ బ్రిడ్జి ఒకటి మధ్యలో కూలిపోయింది. సమీపంలోని రోహ్టంగ్ టన్నెల్ ప్రాజెక్టుకు నిర్మాణ సామగ్రి తరలించడం కోసం ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జి మీద లారీ వెళ్తుండగా కూలిపోయింది. డ్రైవర్‌ను వెంటనే రక్షించారు. బెయిలీ బ్రిడ్జి ఉన్నట్టుండి కూలిపోయింది గానీ, ఇందులో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని రోహ్తంగ్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ బ్రిగెడియర్ డీఎన్ భట్ తెలిపారు. రాబోయే నాలుగైదు రోజుల్లో బ్రిడ్జిని పునరుద్ధరిస్తామని, కొట్టుకుపోయిన లారీని కూడా బయటకు తీస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలో భారీ వర్షాలు, వరదలు రావడంతో పాటు కొండ చరియలు విరిగిపడ్డాయి. దాంతో ఈ ప్రాంతంలో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. లెహ-మనాలి మార్గంలో ఉన్న రోహ్తంగ్ పాస్ వద్ద తలపెట్టిన 8.8 కిలోమీటర్ల రోహ్తంగ్ సొరంగం దేశంలోనే అతి పొడవైన సొరంగం అవుతుంది. మంచు కారణంగా ఆరు నెలల పాటు రోహ్తంగ్ పాస్‌ను మూసేస్తారు. సొరంగం నిర్మాణం పూర్తయితే ఏడాది పొడవునా రోహ్తంగ్ పాస్ మార్గాన్ని తెరిచే ఉంచేందుకు అవకాశం ఏర్పడుతుంది. -
నిలువునా కూలిపోయిన వంతెన!
హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో భారీ వర్షాలకు ఓ వంతెన కూలిపోయింది. భారీగా వరదనీరు ప్రవహిస్తుండటంతో 44 ఏళ్ల క్రితం కట్టిన ఈ వంతెన మధ్యలో భాగం మొత్తం కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియోను ఎవరో సెల్‌ఫోనులో చిత్రించారు. వంతెన మొత్తం పొడవు 160 మీటర్లు ఉంటుంది. అందులో క ఒంత భాగం సహా దాని పిల్లర్లు కూడా మొత్తం పడిపోయి వరదల్లో కొట్టుకుపోయాయి. మొత్తం 76 మీటర్ల మేర వంతెన, పది పిల్లర్లు వరదలో కొట్టుకుపోయినట్లు అధికారులు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లోని నూర్పూర్ తాలూకాకు, పొరుగునే ఉన్న పంజాబ్ రాష్ట్రానికి మధ్య రాకపోకలు సాగించడానికి ఈ వంతెనే ప్రధానమైన ఆధారం. అదృష్టవశాత్తు వంతెన కూలిన సమయంలో దాని మీద ఎవరూ రాకపోకలు సాగించకపోవడంతో ఎవరూ గాయపడలేదు. పిల్లర్లకు బీటలు వారినట్లు గుర్తించిన అధికారులు బుధవారం నుంచే దానిమీద రాకపోకలను నిలిపివేశారు. పది రోజుల క్రితం ముంబై-గోవా జాతీయ రహదారిపై బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఓ వంతెన కూలిపోయి రెండు బస్సులు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. -
నిలువునా కూలిపోయిన వంతెన!
-
మృత్యు వంతెనలు...!
-
వంతెన కూలి.. 20 మంది గల్లంతు
ఎప్పుడో బ్రిటిష్ వాళ్ల హయాంలో నిర్మించిన వంతెన కుప్పకూలింది. దీంతో దాదాపు 20 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. ఈ దారుణం మహారాష్ట్రలో ముంబై-గోవా జాతీయ రహదారిలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సంభవించింది. భారీ వర్షాల కారణంగా ఈ వంతెన కుప్పకూలడంతో రెండు బస్సులతో పాటు పలు వాహనాలు నదిలోకి పడిపోయాయి. బస్సులలో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వారి ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. గల్లంతైనవారిని గుర్తించేందుకు వీలుగా సీకింగ్ 42బి హెలికాప్టర్‌ను రంగంలోకి దించారు. ఇది ఎలాంటి వాతావరణంలోనైనా ప్రయాణించగలదు. మహద్ పట్టణంలో దాదాపు ఏడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ వంతెన అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కూలిపోయింది. సావిత్రీ నదిలోకి వరదనీరు వచ్చి చేరడంతో వంతెన పడిపోయింది. బస్సులు, ప్రైవేటు కార్లు కూడా నీళ్లలోకి పడిపోయాయని అంటున్నారు. ముంబై నుంచి బయల్దేరిన రెండు బస్సులు గమ్యస్థానాలకు చేరుకోలేదు. ఇవి కూడా ఈ నదిలో పడిపోయాయనే స్థానికులు చెబుతున్నారు. జాతీయ విపత్తు నివారణ బృందాలు రంగంలోకి దిగాయి. 80 మంది రెస్క్యూ సిబ్బందితోపాటు డైవర్లను కూడా అక్కడకు పంపారు. ప్రధాని నరేంద్రమోదీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఫోన్ చేసి, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఆ ప్రాంతంలో పక్కపక్కనే రెండు వంతెనలున్నాయని, వాటిలో పాతది కూలిపోయిందని ఫడ్నవిస్ తెలిపారు. మహారాష్ట్రలోని కొంకణ్, ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో గత ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. -
ఆ భయానక దృశ్యాల వీడియో..
కోల్‌కతా: కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలిపోయిన సమయంలోని భయానక దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పశ్చిమబెంగాల్లోని టీవీ చానెళ్లు ఈ సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలను ప్రసారం చేశాయి. ఈ వీడియోను యూ ట్యూబ్‌లో పోస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీలోని దృశ్యాల ప్రకారం.. కోల్‌కతాలో నిత్యంరద్దీగా ఉండే వివేకానంద రోడ్డులో గురువారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కార్లు, ఆటో రిక్షాలు, ఇతర వాహనాలు వెళ్తున్నాయి. ఆ రోడ్డుపై పాదచారులు నడుచుకుంటూ వెళ్తున్నారు. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండటంతో జన సంచారం కాస్త తక్కువగా ఉంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక పరిస్థితి ఏర్పడింది. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ అకస్మాత్తుగా కూలిపోవడంతో రోడ్డుపై వెళ్తున్న పాదచారులు, వాహనదారులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ప్రమాద ఘటనలో 21 మంది మరణించగా, మరో 150 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
ఆ ఘటన చాలా బాధాకరం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలిపోయిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సహా జాతీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటన దిగ్భ్రాంతికరం, చాలా బాధాకరమని మోదీ పేర్కొన్నారు. పరిస్థితిని సమీక్షించి, సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మోదీ.. కోల్‌కతా ఫ్లై ఓవర్ మృతులకు సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. ఈ రోజు జరిగిన ఈ ప్రమాదంలో 14 మంది మరణించగా, మరో 150 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ఎవరేమన్నారంటే.. ఈ ఘటన జరగడం దురదృష్టకరం. జాతీయ విపత్తు నివారణ బృందం సహాయక చర్యలు చేపడుతోంది- కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోల్‌కతా ఫ్లై ఓవర్ కూలిన ఘటన బాధాకరం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. శిథిలాల చిక్కుకున్న వారు, గాయపడ్డవారు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా- గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలిపోవడం హృదయవిదారకం. చనిపోయినవారికి సంతాపం తెలియజేస్తున్నా. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నా - కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఘటన చాలా బాధాకరం. సహాయక చర్యల్లో పాల్గొనాలని పశ్చిమబెంగాల్ బీజేపీ శాఖకు సూచించా - బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా -
'భయంతో వెన్నులో వణుకు పుట్టింది'
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఫ్లై ఓవర్ కూలిపోయిన ఘటన స్థానికుల్ని భయభ్రాంతులకు గురిచేసింది. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రెప్పపాటులో తమ కళ్ల ముందే వందలాదిమంది శిథిలాల కింద చిక్కుకోవడంతో స్థానికులను కలచివేసింది. భయంతో పిల్లలు, మహిళలు ఏడుస్తూ విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన గురించి ఓ ప్రత్యక్ష సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. ఫ్లై ఓవర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ హఠాత్పరిణామానికి వెన్నులో వణుకు పుట్టిందని చెప్పాడు. ప్రమాద ఘటనపై మరికొందరు ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే.. స్థానిక ప్రజలు భయపడిపోయారు. భయంతో పిల్లలు, మహిళలు ఏడుస్తున్నారు శిథిలాల కింద 150 మంది చిక్కుకున్నారని భావిస్తున్నా నిన్న కాంక్రీట్, సిమెంట్ వేశారు. ఈ రోజు అకస్మాత్తుగా కూలిపోయింది ఫ్లై ఓవర్ కూలిన ఘటనలో పదిమంది మరణించగా, మరో 150 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం. వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. కోల్‌కతాలోని గణేశ్ థియేటర్ సమీపంలోని ప్రమాద స్థలలో సహాయక చర్యలు చేపడుతున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. -
విజయనగరంలో కూలిన వంతెన
విజయనగరం జిల్లాలో భారీ వర్షాల కారణంగా భోగాపురం మండలం రావాడ సమీపంలోని కాల్వపై నిర్మించిన వంతెన బుధవారం ఉదయం కుప్పకూలింది. దాంతో 20 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తవలస మండలం జోగయ్యపాలెంలో 200 ఎకరాల్లో పంట నీట మునిగింది. అయితే జిల్లాలో భారీ వర్షాల కారణంగా అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భారీ వర్షాల కారణంగా జిల్లా వాసులకు ఎవరికి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైన వెంటనే ట్రోల్ ఫ్రీ నెంబర్ 08922 276 888, 1077కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.