ఆ భయానక దృశ్యాల వీడియో.. | Caught On Camera: The Kolkata Flyover Comes Crashing Down in you tube | Sakshi
Sakshi News home page

ఆ భయానక దృశ్యాల వీడియో..

Published Thu, Mar 31 2016 6:22 PM | Last Updated on Sun, Sep 3 2017 8:57 PM

ఆ భయానక దృశ్యాల వీడియో..

ఆ భయానక దృశ్యాల వీడియో..

కోల్కతా: కోల్కతాలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలిపోయిన సమయంలోని భయానక దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పశ్చిమబెంగాల్లోని టీవీ చానెళ్లు ఈ సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలను ప్రసారం చేశాయి. ఈ వీడియోను యూ ట్యూబ్లో పోస్ట్ చేశారు.

సీసీటీవీ ఫుటేజీలోని దృశ్యాల ప్రకారం.. కోల్కతాలో నిత్యంరద్దీగా ఉండే వివేకానంద రోడ్డులో గురువారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కార్లు, ఆటో రిక్షాలు, ఇతర వాహనాలు వెళ్తున్నాయి. ఆ రోడ్డుపై పాదచారులు నడుచుకుంటూ వెళ్తున్నారు. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండటంతో జన సంచారం కాస్త తక్కువగా ఉంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక పరిస్థితి ఏర్పడింది. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ అకస్మాత్తుగా కూలిపోవడంతో రోడ్డుపై వెళ్తున్న పాదచారులు, వాహనదారులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ప్రమాద ఘటనలో 21 మంది మరణించగా, మరో 150 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement