ఆ ఘటన చాలా బాధాకరం: ప్రధాని మోదీ | Shocked by collapse of under construction flyover in Kolkata, PM narendramodi tweets | Sakshi
Sakshi News home page

ఆ ఘటన చాలా బాధాకరం: ప్రధాని మోదీ

Published Thu, Mar 31 2016 4:40 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

ఆ ఘటన చాలా బాధాకరం: ప్రధాని మోదీ - Sakshi

ఆ ఘటన చాలా బాధాకరం: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: కోల్కతాలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలిపోయిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సహా జాతీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటన దిగ్భ్రాంతికరం, చాలా బాధాకరమని మోదీ పేర్కొన్నారు. పరిస్థితిని సమీక్షించి, సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మోదీ.. కోల్కతా ఫ్లై ఓవర్ మృతులకు సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. ఈ రోజు జరిగిన ఈ ప్రమాదంలో 14 మంది మరణించగా, మరో 150 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ఎవరేమన్నారంటే..
 

  • ఈ ఘటన జరగడం దురదృష్టకరం. జాతీయ విపత్తు నివారణ బృందం సహాయక చర్యలు చేపడుతోంది- కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్
  • కోల్కతా ఫ్లై ఓవర్ కూలిన ఘటన బాధాకరం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. శిథిలాల చిక్కుకున్న వారు, గాయపడ్డవారు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా- గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్
  • నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలిపోవడం హృదయవిదారకం. చనిపోయినవారికి సంతాపం తెలియజేస్తున్నా. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నా - కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
  • ఈ ఘటన చాలా బాధాకరం. సహాయక చర్యల్లో పాల్గొనాలని పశ్చిమబెంగాల్ బీజేపీ శాఖకు సూచించా - బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement