పండుగ వేళ జమ్మూ కాశ్మీర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. బైశాఖి పర్వదినం సందర్బంగా బేని సంగమానకి భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో అక్కడ నిర్మించిన ఓ ఫుట్ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 40 మంది భక్తులు గాయపడ్డారు.
వివరాల ప్రకారం.. జమ్మూ కాశ్మీర్‌లో బైశాఖి పర్వదినం సందర్భంగా ఉదమ్‌పూర్ జిల్లాలోని బేని సంగానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. దీంతో, అక్కడ కోలాహలం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అక్కడ నిర్మించిన ఫుట్ బ్రిడ్జ్‌పైకి అధిక సంఖ్యలో భక్తులు వెళ్లడంతో అది ఒక్కసారిగా కూలిపోయింది. ఇక, ఈ ప్రమాదంలో సుమారు 40 మందికిపైగా గాయపడినట్టు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు, రెస్క్యూ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
#JammuKashmir #Bridge
— Kavita Raj Sanghaik (@KAVITARAJ5) April 14, 2023
During the Baisakhi fair in Vinisang village of Chenani of #Udhampur district, a big accident occurred due to the collapse of the iron bridge, many people were injured, rescue work is going on. pic.twitter.com/SpEKtAwbqJ
Comments
Please login to add a commentAdd a comment