శ్రీనగర్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ కశ్మీర్ అంశాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆర్టికల్ 370ను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కశ్మీర్‌లో శాంతి నెలకొల్పడమే తమ లక్ష్యమని మోదీ సర్కార్ స్పష్టం చేస్తూ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక, ఆర్టికల్ రద్దు అనంతరం, జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
ఇక, కశ్మీర్‌లో ఆర్టికల్ 370, 35A రద్దు తర్వాత శ్రీనగర్‌లో తమకు ఎంతటి ఆహ్లాదకర పరిస్థితులు ఉన్నాయో ఓ యువతి ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చింది. దీంతో, ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల ప్రకారం.. శ్రీనగర్‌లో ఓ యువతి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ నడుపుతూ రోడ్లపై ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె ‘ఈరోజు నేను గర్వంగా చెప్పాలనుకుంటున్నాను.. నా కశ్మీర్ అబ్బాయిలకే కాదు.. మనలో కూడా చాలా మారిపోయింది. 370, 35A రద్దుకు ముందు ఇది సాధ్యం కాలేదు. భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అంటూ కామెంట్స్ చేసింది. ఇక, ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
Today I proudly wanna to say that my #Kashmir has changed a lot not only for the boys but also for Us. It was not possible before abrogation of 370 & 35A. Thank you GOI. pic.twitter.com/5zU9vgUAoL
— Nusrat Fatima (@knusrata) August 4, 2023
మరోవైపు.. ఈ వీడియోపై కశ్మీర్ యువకులు స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వీడియోను పోలీసులకు షేర్ చేస్తూ అబ్బాయిలకే ట్రాఫిక్ రూల్స్ వర్తిస్తాయా? అమ్మాయిలకు వర్తించవా? అని ప్రశ్నించారు. దీంతో, పోలీసులు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించనందుకు జరిమానా విధించినట్టు స్పష్టం చేశారు.
Action taken under relevant sections of MV Act. Violator also counseled not to repeat such acts. pic.twitter.com/To30U8FaiB
— Traffic City Srinagar. (@SSPTFCSGR) August 4, 2023
ఇది కూడా చదవండి: నోర్మూయ్, ఎక్కువ మాట్లాడితే మర్యాదగా ఉండదు.. మెట్రోలో లేడీస్ లొళ్లి
Comments
Please login to add a commentAdd a comment