యువతిపై యాసిడ్‌ దాడి.. ట్రెండింగ్‌లో యాసిడ్‌ అటాక్‌ | Woman Attacked With Acid In Srinagar Social Media Trending | Sakshi
Sakshi News home page

యువతిపై యాసిడ్‌ దాడి.. తెరపైకి మగ బాధితుల ప్రస్తావన!! ట్విటర్‌ ట్రెండింగ్‌లో యాసిడ్‌ అటాక్‌

Published Wed, Feb 2 2022 3:02 PM | Last Updated on Wed, Feb 2 2022 3:07 PM

Woman Attacked With Acid In Srinagar Social Media Trending - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

Acidattack Trending In Twitter: యువతులపై యాసిడ్‌ దాడి ఘటనలు పలు సందర్భాల్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అన్ని వర్గాల వారు పెద్దఎత్తున నిరసనలు తెలుపుతూ.. సోషల్‌ మీడియాలో విసృతంగా చర్చ జరిపిన వార్తలను కూడా చూశాం. ప్రస్తుతం ఓ యాసిడ్‌ దాడిపై దేశవ్యాప్తంగా సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. అదీ అబ్బాయిలపై జరిగిన దాడుల గురించి కావడం విశేషం.!! 

జమ్మూ కశ్మీర్‌ లోని శ్రీనగర్‌లో మంగళవారం 24 ఏళ్ల యువతి యాసిడ్‌ దాడి జరిగింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయాల పాలైంది. శ్రీనగర్‌లోని హవాల్ ప్రాంతం వాంట్‌పోరాలోని ఉస్మానియా కాలనీలో యువతిపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్‌ దాడి చేశాడని పోలీసులు వెల్లడించారు. ఆమెను వెంటనే స్థానిక ఎస్‌ఎంహెచ్‌ఎస్‌ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఆమె ముఖానికి గాయాలైనట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కన్వల్జీత్ సింగ్ తెలిపారని పోలీసులు వెల్లడించారు. ఆమె కళ్లు దెబ్బతిన్నాయా లేదా అని నిర్ధారించడానికి శస్త్రచికిత్స చేస్తామని డాక్టర్ సింగ్ తెలిపారు.

యాసిడ్‌ దాడికి తెగపడిన దుండగుడిని పట్టుకోవడానికి పోలీసులు బృందాలు మారి గాలిస్తున్నారని పేర్కొన్నారు. అయితే యాసిడ్‌ దాడిపై ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. యాసిడ్‌ దాడి బాధితులు అమ్మాయిలే కాదు. యువతులు చేసిన యాసిడ్‌ దాడుల్లో అబ్బాయిలు కూడా బాధితులుగా మారారని వాటికి సంబంధించిన పాత ఘటనలు, వార్తలను సోషల్‌ మీడియాలో నెటిజన్‌లు #acidattack హ్యాష్‌ట్యాగ్‌తో షేర్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement