
న్యూఢిల్లీ: పహల్గాం దాడికి పాల్పడింది ఉగ్రవాదులు. ఆ దాడికి మాకు ఏంసంబంధం అండి? ప్రాణాలు రక్షించుకునేందుకు చికిత్స కోసం వచ్చిన మేం. పాక్ వైపు తరలి పోతున్నాం. ఇంతకాలం మాకు స్థానికులు ఇచ్చే అతిథ్యం మా జీవితాల్లో మరిచిపోలేం. కానీ, గత రెండు రోజులుగా వాళ్లు మాతో సరిగ్గా వ్యవరించడంలేదు’’ అని కొందరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
‘‘ దాడికి పాల్పడింది ఉగ్రవాదులు. శిక్షించాల్సింది వాళ్లనే. కానీ, ఏం తప్పు చేయని మమ్మల్ని ఎందుకు శిక్షిచడం? అని పాక్ పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాక్‌లో పుట్టడమే మేం చేసిన నేరమా? అంటూ పలువురు భావోద్వేగంగా మాట్లాడుతున్నారు. దౌత్యపరమైన చర్చల ద్వారా శాంతి చర్చలకు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నారు.




పాక్ నుంచి ప్రతీ నెలా వందల మంది చికిత్స కోసం భారత్‌కు ప్రత్యేక వీసా మీద వస్తుంటారు. ఇందులో వివిధ రకాల జబ్బులు, అనారోగ్య కారణాలతో వచ్చేవాళ్లే ఎక్కువ. మరీ ముఖ్యంగా పసిపిల్లల చికిత్స కోసం భారత్ ఎక్కువ వీసాలు మంజూరు చేస్తుంటుంది.
ఇప్పటికే పాక్ పౌరులు భారత్‌ను విడిచిపెట్టిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల సీఎంకు ఫోన్‌లో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వీలైనంత త్వరగా వాళ్లను గుర్తించి వెనక్కి పంపించేయాలని ఆదేశించారు.
ఇదిలా ఉంటే.. పాక్ భారత్‌ల మధ్య ఉద్రికత్తలను తగ్గించడానికి.. దౌత్యానికి తాము సిద్ధమంటూ ఇరాన్ ప్రకటించింది. అదే సమయంలో.. ఐక్యరాజ్య సమితి కూడా సమయమనం పాటించాలని ఇరు దేశాలకు పిలుపు ఇచ్చింది.