Mediation
-
సంక్షోభం.. సినీ రంగానికా? రాజకీయానికా?
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప -2 విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన విషయం చిలికి,చిలికి గాలివానగా మార్చడానికి రాజకీయ నేతలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. సినీ పరిశ్రమపైనే తీవ్ర ప్రభావం చూపించేలా పరిస్థితులు ఏర్పడుతుండడం దురదృష్టకరం. వేలాది మందికి ఆధారంగా ఉన్న ఈ పరిశ్రమ ఇప్పుడు సంక్షోభంలో పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రత్యేకించి.. కొత్త సంవత్సరంలో సంక్రాంతి(Sankranti) సందర్భంగా విడుదల కావల్సి ఉన్న సినిమాలపై ఈ ఉదంతం.. పరిణామాల ప్రభావం పడుతుందని నిర్మాతలు భయపడుతున్నారు. దానికి కారణం వీరిలో కొందరు భారీ వ్యయంతో సినిమాలు తీయగా, ప్రభుత్వం ఇకపై బెనిఫిట్ షో లు, టిక్కెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతించం అని ప్రకటించడమే అని చెబుతున్నారు. వినోద మాద్యమ రంగంలో వచ్చిన అనేక మార్పుల ప్రభావం ఆ పరిశ్రమను అతలాకుతలం చేస్తోందని చెప్పవచ్చు. ఆ దశలో అల్లు అర్జున్ ఘటన వ్యవహారాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సీరియస్ గా తీసుకుంటున్నారు. ఒక రకంగా ఇది రేవంత్ ఈగో సమస్యగా మారినట్లుగా ఉంది. శాసనసభలో ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమ ప్రముఖులను తప్పుపట్టారు. అర్జున్ ఒక రాత్రి జైలులో ఉండి ఇంటికి వస్తే సినీ ప్రముఖులు, ఇతరులు క్యూ కట్టి పరామర్శిస్తారా అని ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. తొక్కిసాటలో తీవ్రంగా గాయపడ్డ బాలుడు ఆస్పత్రిలో ఉంటే ఎందుకు పరామర్శించ లేదని ఆయన అన్నారు. నిజమే!ఆ బాలుడిని పరామర్శించాలని చెప్పడం తప్పు లేదు.కాని ఆ కారణంగా అర్జున్ ఇంటి వద్దకు వెళ్లడం తప్పన్నట్లుగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం అంత సముచితంగా లేదు.పైగా కాలు పోయిందా?చేయి పోయిందా? కిడ్నీ పోయిందా?ఏమి జరిగిందని అర్జున్ వద్దకు వెళ్లారని ప్రశ్నించడం మరీ తప్పు అని చెప్పకతప్పదు. తమకు సంబంధించిన వ్యక్తి తప్పు చేసినా, చేయకపోయినా, ఏదైనా ఇబ్బందిలో ఉన్నాడని తెలిసినప్పుడు ఆయన సన్నిహితులు,అదే రంగానికి చెందినవారు వెళ్లి పలకరించి వస్తుంటారు.అంతెందుకు! ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్టు అయి బెయిల్ పై జైలు నుంచి విడుదల అయినప్పుడు జైలువద్దకు వచ్చినవారితో కలిసి ఆయన ర్యాలీనే తీశారు కదా అని కొందరు గుర్తు చేస్తున్నారు. అల్లు అర్జున్ పై పలువురు కాంగ్రెస్ నేతలు కూడా విమర్శలు చేసి పశ్చాత్తాప్తం ప్రకటించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నోరు పారేసుకోవడం తీవ్ర అభ్యంతరకరం. అల్లు అర్జున్ ఆంధ్రా వెళ్లిపోవాలట..! ఒళ్లు దగ్గరపెట్టుకుని వ్యాపారాలు చేయాలట!. ఇలాంటి వ్యాఖ్యలను రేవంత్ సమర్దిస్తారా? సమర్దించరు. ఎందుకంటే స్వయానా ఆయన అల్లుడు ఆంధ్రకు చెందినవారన్న సంగతి తెలిసిందే. ఈ మాత్రం సోయ లేకుండా భూపాల్ రెడ్డి వంటి వారు వ్యర్ద ప్రసంగాలు చేస్తే అది కాంగ్రెస్ కు మరింత చేటు తెస్తుంది. మంత్రి సీతక్క అయితే.. పుష్ప సినిమాకుగానూ అర్జున్ కు ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడం ఏమిటి? అని ప్రశ్నించారు. అది తప్పయితే.. రేవంత్ ప్రభుత్వం ఆ సినిమాకు బెనిఫిట్ షోలు, ధరల పెంపుదలకు ఎందుకు అనుమతి ఇచ్చింది?. ఆ మాటకు వస్తే నక్సల్స్ కు సానుభూతిగా కొన్ని సినిమాలు వచ్చాయి.వాటిలో కొన్నిటికి అవార్డులు కూడా లభించాయి. కాని నక్సల్స్ ను ఏ ప్రభుత్వం అయినా అంగీకరిస్తుందా?. సీతక్క(Seethakka) ఎందుకు ఆ భావజాలం నుంచి బయటకు వచ్చారు?. ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడితే సరిపోదని గుర్తించాలి. ఇదే టైంలో.. 👉బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు డీకే అరుణ, రఘునందన్ తదితరులు అల్లు అర్జున్ ను కాంగ్రెస్ టార్గెట్ చేసిందని ధ్వజమెత్తారు. సినీ పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం దెబ్బ తీస్తోందని,పగ పట్టినట్లు వ్యవహరిస్తోందని కూడా వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ కూడా ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నా.. బీజేపీ వాళ్లే దీనిని బాగా సీరియస్‌గా తీసుకున్నట్లు కస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బిజెపి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి యత్నిస్తోంది. భవిష్యత్తులో అల్లు కుటుంబాన్ని తమ పార్టీలోకి తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారా అనేది చూడాలి. ఇక.. అర్జున్ పై కాంగ్రెస్ కాక తగ్గించకపోతే.. ఆ దిశగా అడుగులు పడ్డా ఆశ్చర్యం ఉండదని కొందరు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన ప్రకటనకు అర్జున్ దానికి సమాధానం ఇవ్వడం ప్రభుత్వానికి మంటపుట్టించింది. అది అర్జున్ కు ఉన్న స్వేచ్చ అని ప్రభుత్వం భావించలేదు. పోలీసు ఉన్నతాధికారులంతా రంగంలో దిగి అర్జున్ ఏదో ఘోరమైన నేరం చేశారని చెప్పడానికి యత్నించారు. లేకుంటే ఈ కేసులో పదివేల వీడియోలు సేకరించవలసినంత అవసరం ఏముంది?. ఎక్కడో చోట అర్జున్ తప్పు దొరకకపోదా? అని వెతికారన్నమాట. దీనిని ప్రభుత్వ పెద్దలు వ్యక్తిగత ప్రతిష్టగా భావించారన్నమాట!. ఇదే సందర్భంలో.. 👉పోలీసులు సంధ్య థియేటర్ వద్ద అర్జున్ కు స్వాగతం చెప్పిన రీతిలో వ్యవహరించిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఒక సస్పెండెడ్ పోలీస్ అధికారి అయితే మరీ రెచ్చిపోయి ఆంధ్ర-తెలంగాణ అంశాన్ని తెరపైకి తేవడం, అర్జున్ నటన గురించి వ్యాఖ్యలు చేయడం, సినీ పరిశ్రమవారికి ఇచ్చిన భూముల ప్రస్తావన తేవడం, ఏకంగా తాటతీస్తాం,తోలు తీస్తాం అని హెచ్చరించడం శోచనీయంగా ఉంది. అర్జున్ కు పోలీసులు నోటీసు ఇచ్చి మూడున్నర గంటలు విచారించడం కూడా వేధింపులో భాగమే అనే అభిప్రాయం కలుగుతుంది. పైగా అర్జున్ ‘‘అలా జవాబిచ్చారు..ఇలా సమాధానం ఇచ్చారు..’’ అంటూ లీకులు ఇచ్చిన తీరు కూడా దీనిని ధృవపరుస్తుంది. ఏపీలో రెడ్ బుక్(Red Book) రాజ్యాంగం మాదిరి తెలంగాణలో కూడా పోలీసులు ప్రజల తోలు తీసే రాజ్యాంగం వచ్చిందేమో తెలియదు.మరో వైపు కొందరు ఓయూ జేఏసీ పేరుతో అర్జున్ ఇంటిపై దాడి చేయడం మరింత దారుణం. పేరుకు జేఏసీ అయినా.. అక్కడకు వెళ్లినవారంతా కాంగ్రెస్ వారేనని సోషల్ మీడియాలో ఆధార సహితంగా వీడియోలు వచ్చాయి. దీనిని ఖండించి , ఏకోన్ముఖంగా నిరసన చెప్పవలసిన సినిమా పరిశ్రమ పెద్దలు జడిసిపోయి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రేవంత్ శాసనసభలో చేసిన విమర్శలతో వీరంతా భయపడ్డారని వేరే చెప్పనవసరం లేదు. అందుకే.. 👉అర్జున్ ఇంటిపై దాడి చేసినవారు అరాచకంగా రాళ్లు వేసి,పూలకుండీలు మొదలైనవాటిని ధ్వంసం చేసినా ఇంటిలో పనిచేసేవారిపై దౌర్జన్యానికి దిగినా సినీ ప్రముఖులు మాత్రం నోరు మెదపలేదు. అర్జున్ కు ,ఆయన తండ్రి అరవింద్ కు సంఘీబావం తెలపలేదు. ఇది పరిశ్రమ బలహీనతగా ఉంది. రేవంత్ కూడా అర్జున్ ఇంటిపై దాడిని నేరుగా ఖండించకుండా, సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తున్నానని ప్రకటన ఇవ్వడం ద్వారా ఆయనలో ఇంకా కోపం తగ్గలేదని చెప్పకనే చెప్పారనుకోవాలి.. ఇదే సందర్భంలో సడన్ గా బెనిఫిట్ షో లు రద్దు చేస్తామని సీఎం చెప్పడం సినీ పరిశ్రమ ప్రముఖులలో గుబులు రేపుతోంది. వచ్చే నెలలో మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మరో ప్రముఖ నటుడు వెంకటేష్ తదితరుల సినిమాలు విడుదల కావల్సి ఉంది. వీటిలో ఒక సినిమాకు ఐదువందల కోట్ల రూపాయలకు పైగా వ్యయం అయిందట!. అలాగే మరో సినిమాకు 150 కోట్లు ఖర్చు పెట్టారట!. ఈ భారీ బడ్జెట్ సినిమాలకు స్పెషల్ షో లు, ధరల పెంపు,బెనిఫిట్ షో లు వంటివి లేకపోతే.. సత్వరమే వారు పెట్టిన పెట్టుబడి రావడం కష్టం అయిపోతుంది. 👉ప్రముఖ నిర్మాత ,తెలంగాణ చలనచిత్రాభివృద్ది సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దిల్ రాజు తనకు ఉన్న సన్నిహిత సంబంధాలతో రేవంత్ ను ఒప్పించి మళ్లీ బెనిఫిట్ షో లు, ధరల పెంపుదలకు సానుకూలంగా నిర్ణయాలు తీసుకువస్తారన్న ఆశతో ఉన్నారట!. అందుకే ఇప్పుడు అర్జున్ తప్పుచేసినా, చేయకపోయినా.. ఆ ఘటన జోలికి వెళ్లకపోవడం బెటర్ అని భావిస్తున్నారట!. ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టిక్కెట్ ధరల గురించి చర్చించి, షూటింగ్ లు కూడా జరిపేలా షరతులు పెడితే.. ఇంకేముంది సినిమావారిపై దాడి చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ వంటివారు కాని, ఇటు ఎల్లో మీడియా కాని ఇప్పుడు నోరు మెదపడం లేదు. మెగాస్టార్ చిరంజీవి దంపతులను జగన్ సాదరంగా ఆహ్వానించి విందు ఇచ్చి పంపితే, ఆయనకు ఏదో అవమానం జరిగిందంటూ కూడా దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు స్వయానా చిరంజీవి మేనల్లుడు ఇంటిపైనే దాడి జరిగితే పవన్ కల్యాణ్‌తో సహా ఎవరూ నోరు విప్పడం లేదు. ఎందుకంటే.. పవన్ సినిమాలు కూడా భారీ బడ్జెట్ తోనే ఉంటాయి కాబట్టి.👉నిజంగానే రేవంత్ తననిర్ణయానికి కట్టుబడి ఉంటే ఒకరకంగా ప్రయోజనం, మరో రకంగా నష్టం వాటిల్లవచ్చు. నిర్మాతలు చిన్న బడ్జెట్ తో సినిమాలు తీయడానికి సిద్దం అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు సినిమా టిక్కెట్ల ధరలు కూడా పెంచాలని కోరవలసిన అవసరం ఉండదు. కానీ అగ్ర నిర్మాతలు ఇందుకు అంగీకరించకపోవచ్చు. ఒకవేళ ఇది ముదిరితే సినీ పెద్దలు రేవంత్ ప్రభుత్వంపై ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదులు చేయవచ్చు!. అంతేకాక తాము ఇక్కడ షూటింగ్ లు చేయలేమని,వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతున్నామని ప్రకటించినా, రేవంత్ ప్రభుత్వానికి తీవ్ర నష్టం ఏర్పడుతుంది. అందువల్ల పరిశ్రమకు ఇబ్బంది రాకుండా, అలాగే ప్రేక్షకులకు సౌలభ్యంగా రాజీ కుదుర్చుకోవడం మంచిదని చెప్పాలి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి మూలస్తంభం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ వంటి కొత్త కార్యక్రమాలతో సాంకేతికతలో హైదరాబాద్ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలోని కామన్వెల్త్ మీడియేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సాఫ్ట్వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్, బయో-టెక్నాలజీ పరిశ్రమలకు పవర్ హబ్‌గా హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు.న్యాయవ్యవస్థ మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. కానీ, భారీ సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉండడం న్యాయ వ్యవస్థకు సవాల్‌గా మారిందన్నారు. పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడానికి వేగంగా, సమర్థవంతంగా కేసుల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వ్యవస్థలు అవసరమన్నారు. మధ్యవర్తిత్వం, చర్చల ద్వారా వీలైనంత త్వరగా సమస్యలు, వివాదాలను పరిష్కరించుకోవాలి. దీనివల్ల వివాదంలో చిక్కుకున్న ఇరువర్గాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అందుకు కృషి చేస్తోన్న ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ నిర్వాహకులను రేవంత్‌రెడ్డి అభినందించారు. మీడియేషన్, ఆర్బిట్రేషన్‌ను సమన్వయం చేస్తే సమస్యలు, వివాదాలను వీలైనంత వేగంగా పరిష్కరించొచ్చన్నారు.ఐఏఎంసీ తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు.. దేశం మొత్తానికి ఈ సెంటర్ ఉపయోగపడుతుంది. ఐఏఎంసీని గ్లోబల్ ఇన్వెస్టర్స్‌కు, బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే పరిమితం చేయొద్దన్న రేవంత్.. కామన్ మ్యాన్‌కు, చిన్న సంస్థలకు కూడా ఐఏఎంసీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. లండన్, సింగపూర్ తర్వాత ఆర్బిట్రేషన్ మ్యాప్‌లో హైదరాబాద్ ఉండటం గర్వకారణం. ఆర్బిట్రేషన్ సేవలను పేదలకు అందుబాటులోకి తీసుకురావడంపై మరో సదస్సు నిర్వహించాలని కోరుతున్నానని రేవంత్‌రెడ్డి అన్నారు. -
అంతర్జాతీయ మధ్యవర్తిత్వంలో సారథ్యానికి సమయమిదే
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సంస్కృతిని పెంపొందించడంలో భారతదేశం ముందుండాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ‘చట్టాల పట్ల గౌరవం నిజాయతీని, స్థిరతను ప్రోత్సహిస్తుంది, ఆర్థిక వృద్ధికి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. హక్కులకు రక్షణ చేకూరి, ఒప్పందాలు అమలయి, వివాదాలు సమర్ధవంతంగా పరిష్కారమయ్యే ఇటువంటి వ్యవస్థలో పెట్టుబడి దారులు ముందుకొచ్చి వృద్ధికి అనుకూలమైన వాతా వరణం నెలకొంటుంది’అని ఆయన తెలిపారు. అంతర్జాతీయ మధ్యవర్తిత్వం, చట్టపాలనపై శుక్రవారం జరిగిన సదస్సులో జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడారు. చట్టబద్ధ పాలనతో విదేశీ పెట్టుబడులు, వాణిజ్యం పెరగడంతోపాటు అంతర్జాతీయంగా పోటీపడే వాతా వరణం దేశంలో నెలకొంటుందన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సంజీవ్ ఖన్నా, అటార్నీ జనరల్ వెంకటరమణి, సుప్రీం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్ సిబల్ తదితరులు మాట్లాడారు. -
మధ్యవర్తిత్వంతో వివాదాలు పరిష్కారమవ్వాలి
సాక్షి ప్రతినిధి, విజయనగరం: మధ్యవర్తిత్వంతో వివాదాల పరిష్కారానికి న్యాయవాదులు ప్రయత్నించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం నరసింహ సూచించారు. జిల్లా కోర్టు ఆవరణలో రూ.99.20 కోట్లతో నిర్మించనున్న జిల్లా కోర్టు భవనాల సముదాయానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్‌తో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. జస్టిస్ నరసింహమాట్లాడుతూ వివాదాల పరిష్కారం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించిన వారు ఏళ్ల తరబడి న్యాయం కోసం వేచి చూడకుండా న్యాయవాదులు కృషి చేయాలన్నారు. కొత్తగా న్యాయవాద వృత్తిలోకి ప్రవేశిస్తున్న యువతీ యువకులు జిల్లా కోర్టుల్లో తమ వృత్తిని ప్రారంభించేలా సీనియర్ న్యాయవాదులు ప్రోత్సహించాలని సూచించారు. విజయనగరంలో నూతన కోర్టు భవనాల ద్వారా మంచి వసతులు సమకూరనున్నాయని, వీటిని వినియోగించుకుని న్యాయవాదులు సమాజానికి సేవలు అందించాలని సూచించారు. జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ న్యాయవ్యవస్థపై ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా న్యాయమూర్తులు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా న్యాయ వ్యవస్థను నిలపాల్సి ఉందన్నారు. రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరాం, జిల్లా పోర్టుఫోలియో జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జిల్లా జడ్జి బి.సాయికళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. -
మధ్యవర్తిత్వమే ఉత్తమ మార్గం
సాక్షి, హైదరాబాద్: న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడంలో మధ్యవర్తిత్వం ఉత్తమ మార్గమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్ పేర్కొన్నారు. కోర్టులు, చట్టాల ద్వారా అందేది కక్షిదారులపై బయటి నుంచి రుద్దిన పరిష్కారమే అవుతుందని.. మనుషులంతా కూర్చుని సంప్రదింపులతో జరిపే మానవీయ పరిష్కారం కాదని చెప్పారు. విద్వేష భావనలు, విద్వేష ప్రసంగాలతో కలుషితం అవుతున్న సమాజంలో సోక్రటీస్ వంటి మహనీయులు ప్రవచించిన జీవన విధానం మంచిదని సూచించారు. శనివారం హైదరాబాద్ షామీర్పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో 20వ స్నాతకోత్సవం జరిగింది. ఇందులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ (నల్సా) కార్యనిర్వాహక అధ్యక్షుడు జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్ ముఖ్య అతిథిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, వర్సిటీ చాన్సలర్ అలోక్ అరాధే అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్ మాట్లాడుతూ.. ‘‘మనుషులం కనుకే ఆలోచిస్తాం.. ఒకరికొకరు భిన్నంగా ఆలోచిస్తాం. తర్క, వితర్కాలతో సంభాషించుకుంటూనే శాంతియుతంగా జీవించే సమాజం ఉండాలి. మన రాజ్యాంగ నైతికత కూడా దీన్నే తెలియజేస్తుంది. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే విధానంలో అందరి తర్కం, వాదన విని.. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుంది. నాలుగు మెదళ్ల సంఘర్షణ నుంచి వచ్చే పరిష్కారం మెరుగ్గానే ఉంటుందనడంలో అశ్చర్యం అవసరం లేదు..’’ అని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం అందేలా కృషి చేయాలని న్యాయ విద్యార్థులకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ సహకారం మరువలేనిది.. నల్సార్ వర్సిటీలో వసతులు కల్పించడంలో సీఎం కేసీఆర్ సహకారం మరువలేనిదని వర్సిటీ వీసీ శ్రీకృష్ణదేవరావు పేర్కొన్నారు. జ్యుడిషియల్ అకాడమీ కోసం 25 ఎకరాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. 25ఏళ్ల నల్సార్ వర్సిటీ ప్రస్థానంలో ఎన్నో కొత్త కోర్సులను తీసుకొచ్చామని, ఎందరో విద్యార్థులను సమాజానికి అందించామని చెప్పారు. లీగల్ ఎయిడ్‌తోపాటు అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌లను ప్రోత్సహించడంలో నల్సార్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్డీ, ఎల్ఎల్ఎం, ఎంబీఏ, బీఏ ఎల్ఎల్బీ ఆనర్స్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలతో పాటు 58 మందికి బంగారు పతకాలను అందజేశారు. ప్రొఫెసర్ బాలకృష్ణరెడ్డితోపాటు ఇతరులు రాసిన పుస్తకాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు సీజే ఆవిష్కరించారు. హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యకార్యదర్శి గోవర్థన్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పెండింగ్’కు ‘మధ్యవర్తిత్వం’ చక్కటి పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: భరించలేనంత భారం మోపితే ఏ వ్యవస్థ అయినా దెబ్బతింటుందని.. ఆ ఒత్తిడి తగ్గించేందుకు ప్రత్యామ్నాయం అవసరం అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో వివాద పరిష్కారంలో మధ్యవర్తిత్వం అమలు విధానంపై చర్చా కార్యక్రమాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర్రావు, రాష్ట్ర లీగల్ సర్విసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ నవీన్‌రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం మూడు రోజులు జరగనుంది. ఈ సందర్భంగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మాట్లాడుతూ.. ‘ ఏటికేడు పెరిగిపోతున్న పెండింగ్ కేసులతో న్యాయవ్యవస్థపై విపరీత భారం పడుతోంది. న్యాయమూర్తులపై కూడా తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. దీనికి చక్కని పరిష్కారమే ‘మధ్యవర్తిత్వం’ అని వెల్లడించారు. అవగాహన పెంచుకోవాలి..: ‘హైకోర్టు న్యాయమూర్తులు కూడా మధ్యవర్తిత్వ విధానంపై మరింత అవగాహన పెంచుకోవాలి. దేశంలో దాదాపు 5 కోట్లు, రాష్ట్రంలో 10 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రోజూ ఎన్ని కేసులు పరిష్కరిస్తున్నారో.. అంతకు రెట్టింపు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇక ప్రజలకు సత్వర న్యాయం ఎలా అందుతుంది? ఈ పరిస్థితులను అధిగమించేందుకు మధ్యవర్తిత్వం తోడ్పడుతుంది.’అని జస్టిస్ లావు నాగేశ్వర్రావు పేర్కొన్నారు. ‘జిల్లాస్థాయిల్లోనూ మీడియేషన్ సెంటర్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నాం. కుటుంబ వివాదాలు, భూ సమస్యలు, భార్యభర్తల గొడవలకు అక్కడే పరిష్కారం చూపిస్తే.. పెండింగ్ కేసుల భారం తగ్గే అవకాశం ఉంది’ అని జస్టిస్ నవీన్‌రావు అభిప్రాయపడ్డారు. సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్ చైర్మన్ జార్జి లిమ్ వర్చువల్‌గా మాట్లాడారు. అనంతరం జస్టిస్ చిల్లకూర్ సుమలత, జస్టిస్ అనుమప చక్రవర్తి, జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ వినోద్‌కుమార్‌లు అడిగిన ప్రశ్నలకు జస్టిస్ లావు నాగేశ్వర్రావు, జార్జి లిమ్ సమాధానం చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు, లీగల్ సరీ్వసెస్ అథారిటీ సభ్యకార్యదర్శి(జడ్జి) గోవర్ధన్‌రెడ్డి, జడ్జి రాధిక, ౖహె కోర్టు రిజిస్టార్, అసిస్టెంట్ రిజిస్టార్లు పాల్గొన్నారు. -
మధ్యవర్తిత్వమే ఉత్తమ మార్గం
బంజారాహిల్స్(హైదరాబాద్): కోర్టుల చుట్టూ తిరగడం కంటే కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వమే ఉత్తమ మార్గమని సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నాగేశ్వర్రావు అభిప్రాయపడ్డారు. కిందికోరుల్లో, హైకోర్టు మధ్యవర్తిత్వం కోసం ప్రత్యేక న్యాయస్థానం ఉండాలని సూచించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ అర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్లో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వివాద పరిష్కార ప్రత్యామ్నాయం(ఏడీఆర్)పై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నాగేశ్వర్రావు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పాల్గొన్నారు. ఏడీఆర్ ఆవశ్యకతపై జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మాట్లాడుతూ.. చాలా వరకు మధ్యవర్తిత్వ అంశాల్లో ముఖ్య వ్యాజ్యదారుడిగా ప్రభుత్వమే ఉంటోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం 2015, 2019, 2021లో చేసిన సవరణల ప్రయోజనాన్ని జస్టిస్ ఎల్.నాగేశ్వర్రావు వివరించారు. వివాద పరిష్కారానికి బదులు అసలు వివాదాలే రాకుండా దృష్టి సారించాలని సూచించారు. తద్వారా వ్యాపార సంబంధాలు సరిదిద్దుకోవడం, కొనసాగించడం వంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. అనంతరం ప్యానలిస్టులకు ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. దేశంలో ఏడీఆర్ యంత్రాంగం ఎలా మెరుగుపర్చాలనే అంశంపై సూచనలిచ్చారు. ఈ సదస్సులో తెలంగాణ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు ఏడీఆర్ రంగంలో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశంలో అతి సులభంగా వ్యాపారం నిర్వహించుకోవడానికి చట్టపరంగా ఉండాల్సిన సహకారం గురించి అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ చైర్పర్సన్ మురళీకృష్ణారెడ్డి, టెంపస్ లా ఫర్మ్ ఫౌండర్, భాగస్వామి సుందరీ ఆర్. పీసుపాటి తదితరులు పాల్గొన్నారు. -
రాజీకి రాచబాట
సాక్షి, హైదరాబాద్: రాజీ, మధ్యవర్తిత్వం ద్వారా వ్యాపారుల మధ్య వివాదాలను పరిష్కరించడంలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) కీలకపాత్ర పోషిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. దేశంలో ఆర్బిట్రేషన్, మీడియేషన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని వీకే టవర్స్‌లో ఏర్పాటు చేసిన దేశ తొలి ఐఏఎంసీని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుతో కలసి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల కేసుల్లో మధ్యవర్తిత్వం, ఆర్బిట్రేషన్‌ను ఏఐఎంసీ ప్రోత్సహిస్తుందని, తక్కువ ఖర్చు, స్వల్ప సమయంలో వివాదాల పరిష్కారానికి ఐఏఎంసీ వేదికగా నిలుస్తుందన్నారు. ఈ ఏడాది జూన్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు సూచించగా ఆరు నెలల్లోనే ఈ కేంద్రం ప్రారంభానికి అడుగులు పడ్డాయన్నారు. ఐఏఎంసీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, అన్ని రకాలుగా ఈ ప్రదేశం అనువైన వేదికన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో స్వల్ప వ్యవధిలోనే వసతి కల్పించిందని, శాశ్వత భవన నిర్మాణం కోసం భూమిని కూడా కేటాయించిందని సీజేఐ ప్రశంసించారు. దేశ, విదేశాలకు చెందిన అనేక వివాదాలు ఈ కేంద్రానికి రానున్నాయని తెలిపారు. ప్రారంభానికి ముందే పెద్ద కేసు: సీఎం కేసీఆర్ ఐఏఎంసీ ప్రారంభానికి ముందే లలిత్ మోదీ కుటుంబ వివాదానికి సంబంధించిన పెద్ద కేసు పరిష్కారం కోసం ఈ సంస్థకు వచ్చిందని, ఈ కేంద్రం విజయవంతం అవుతుందనడానికి ఇదే శుభసూచకమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్ అంతర్జాతీయంగా పురోగమిస్తోందని, అన్ని రంగాలకు చిరునామాగా మారనుందన్నారు. కోర్టుల్లో పరిష్కారానికి నోచుకోని కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ఐఏఎంసీ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని, రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరిగే ఒప్పందాల్లో వివాదాల పరిష్కారానికి ఈ కేంద్రాన్ని ఆశ్రయించేలా చట్టానికి సవరణలు తెస్తామని కేసీఆర్ తెలిపారు. ఐఏఎంసీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన భారత న్యాయ శిఖరం జస్టిస్ రమణకు రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఐఏఎంసీ వెబ్‌సైట్‌ను కేసీఆర్ ప్రారంభించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర్రావు, జస్టిస్ హిమాకోహ్లి, పూర్వ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, ఏపీ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, న్యాయమూర్తులు, మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ డాక్టర్ నాగార్జున, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్ అలీ, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కోర్టుకు రావడం అనేది ఆఖరి ప్రయత్నం కావాలి: సీజేఐ
సాక్షి, హైదరాబాద్: ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్లో వివాదాలకు పరిష్కారం లభిస్తుందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. హెచ్ఐసీసీలో మీడియేషన్, ఆర్బిట్రేషన్‌పై జరిగిన సదస్సులో జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ, వివిధ కారణాల వల్ల పరిశ్రమల్లో వివాదాలు తలెత్తుతున్నాయన్నారు. వివాదాల పరిష్కరానికి మధ్యవర్తిత్వాలు ముఖ్యమన్నారు. ఆర్బిట్రేషన్ సెంటర్‌కు హైదరాబాద్ అనుకూలమని తెలిపారు. పెండింగ్ కేసుల పరిష్కారం సత్వరమే జరగాలన్నారు. కోర్టుకు రావడం అనేది ఆఖరి ప్రయత్నం కావాలన్నారు. ఏళ్ల తరబడి కోర్టు కేసుల ద్వారా సమయం వృధా అవుతోందన్నారు. ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి సీజేఐ ధన్యవాదాలు తెలిపారు. చదవండి: Omicron: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో మళ్లీ ఆంక్షలు ‘లార్డ్ కృష్ణ కౌరవులకు, పాండవులకు మధ్యవర్తిత్వం చేశాడు. ఎవరికైనా వ్యక్తి గత జీవితంలో సమస్యలు వస్తే వారిని మనం దూరంగా పెడుతాం. ప్రతిరోజు సమస్యలు వస్తూనే ఉంటాయి. సమస్యలు లేకుండా మనిషి ఉండడు. బిజినెస్‌లో సమస్యలు వస్తే కోర్టులకు వస్తారు. 40 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా ఆర్బిట్రేషన్ చివరి దశలో జరగాలి. అంతర్జాతీయ పరిస్,సింగపూర్, లండన్, హంకాంగ్‌లో ఆర్బిట్రేషన్ సెంటర్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఈ సెంటర్‌ను పెట్టడం చాలా సంతోషం. హైదరాబాద్‌లో ఈ సెంటర్‌ను పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఫార్మా కంపెనీలు, ఐటి కంపెనీలు సహకారం కూడా ఎంతో అవసరం. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నంబర్‌వన్‌గా ఉంది. ఆర్బిట్రేషన్ సెంటర్‌ను నెలకొల్పడంలో జస్టిస్ హిమా కోహ్లీ సహకారం మర్చిపోలేనని’’ సీజేఐ అన్నారు. త్వరలో శాశ్వత భవనం: సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (IAMC) ఏర్పాటు చేయడం సంతోషకరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు(కేసీఆర్) అన్నారు. ఆర్బిట్రేషన్ కేంద్రానికి హైదరాబాద్ అన్నివిధాలా అనువైన ప్రాంతమని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రస్తుతం 25 వేల చదరపు అడుగుల స్థలం కేటాయించామని, శాశ్వత భవనం కోసం త్వరలో పుప్పాలగూడలో భూమి కేటాయిస్తామని సీఎం తెలిపారు. -
ఇది చరిత్రాత్మక ఘట్టం: చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
ఈ కేంద్రం ఏర్పాటు నా చిరకాల స్వప్నం.. ఇంత త్వరగా సాకారమవుతుందనుకోలేదు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఈ కేంద్రం ఏర్పాటు శుభపరిణామం ఇకపై వాణిజ్య వివాదాలు సత్వరం పరిష్కారం అవుతాయి హైదరాబాద్‌కు భారీగా పెట్టుబడులు వస్తాయి సాక్షి, హైదరాబాద్: ‘‘అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ ఓ చరిత్రాత్మక ఘట్టం. ఈ కేంద్రం దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం శుభపరిణామం’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి నివాసంలో శుక్రవారం జరిగిన అంత ర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ట్రస్ట్‌డీడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘‘అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం నా చిరకాల స్వప్నం. ఆ స్వప్నం ఇంత త్వరగా సాకారమవుతుందని అనుకోలేదు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జూన్‌లో హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నా ప్రతిపాదన తెలియజేశా. ఆయన వెంటనే స్పందించారు. మూడు నెలల్లోపే నా స్వప్నం సాకారం చేసేందుకు అడుగులు పడ్డాయి. ఇందుకు సీఎం కేసీఆర్, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ట్రస్ట్‌డీడ్‌పై జస్టిస్ రమణ, ట్రస్ట్ లైఫ్ మెంబర్లు జస్టిస్ లావు నాగేశ్వర్రావు, జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, హైకోర్టు సీజే జస్టిస్ హిమాకోహ్లి, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, హైకోరు రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సంతకాలు చేశారు. వివాదం లేని వాతావరణం... ‘‘పెట్టుబడిదారులు వివాదాలకు ఆస్కారం లేని వాతావరణాన్ని కోరుకుంటారు. ఏదైనా వివాదం వచ్చినా సత్వరం పరిష్కరించుకోవాలని అనుకుంటారు. ప్రస్తుతం దేశంలో అలాంటి వాతావరణం లేదు. వివాదాల పరిష్కారానికి ఎన్నేళ్ల సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి. 2015లో కేంద్ర ప్రభుత్వం ఓ ప్రతినిధి బృందాన్ని పెట్టుబడులు ఆహ్వానించేందుకు జపాన్, కొరియాకు పంపింది. ఆ బృందంలో నేనూ ఒకర్ని. ఆయా దేశాల్లో విస్తృతంగా పర్యటించి 8 ప్రదేశాల్లో పెట్టుబడిదారులతో చర్చలు జరిపాం. మీ దేశంలో వివాదాల పరిష్కారానికి ఎంత సమయం పడుతుందని వారు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇబ్బందిపడ్డాం. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుతో వాణిజ్య వివాదాలు సత్వరం పరిష్కారమవుతాయి. దీంతో అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారు. అంతర్జాతీయ ఆర్బిట్రేటర్లు ఇందులో భాగస్వాములుగా ఉంటారు. ఈ కేంద్రాన్ని ప్రోత్సహించండి. తద్వారా హైదరాబాద్‌కు భారీగా పెట్టుబడులు వస్తాయి’’ అని జస్టిస్ రమణ పేర్కొన్నారు. సంస్కరణలకు పీవీ బీజం వేశారు... ‘‘దేశంలో ఆర్థిక సంస్కరణలకు తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బీజం వేశారు. అంతర్జాతీయ పెట్టుబడులకు ఆయన ప్రయత్నించగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వివాదాల పరిష్కారానికి ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి ఉందని పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ చట్టానికి రూపకల్పన జరిగింది. 1996లో ఆర్టిట్రేషన్ కన్సీలియేషన్ చట్టం అమల్లోకి వచ్చింది. 1926లో పారిస్‌లో మొదటి ఆర్బిట్రేషన్ కేంద్రం ప్రారంభమైంది. ఇటీవల దుబాయ్‌లో కూడా ఓ కేంద్రం ప్రారంభమైంది. షామీర్పేటలోని నేషనల్ లా యూనివర్శిటీ (నల్సార్) సమీపంలో 2003లో 10 ఎకరాల భూమి, రూ. 25 కోట్లను ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు కోసం కేటాయించారు. అనివార్య కారణాల వల్ల ఆ ప్రతివాదన ముందుకు వెళ్లలేదు. ఆ భూమి ఇప్పటికీ హైకోర్టు అధీనంలో ఉంది. దాన్ని వెనక్కు తీసుకొని ఫైనాన్స్ డిస్ట్రిక్ సమీపంలో ఇవ్వాలని కోరుతున్నాం. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి భూమి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌కు సూచిస్తున్నా. త్వరలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే భవనంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. మరిన్ని పెట్టుబడులు వస్తాయి... ఈ కేంద్రం ఏర్పాటుతో వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర్రావు, జస్టిస్ ఆర్. సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కేంద్రంలో న్యాయవ్యవస్థ నుంచే కాకుండా వివిధ రంగాల్లోని నిపుణులైన ఆర్బిట్రేటర్స్ ఉంటారని, ఈ కేంద్రం రాష్ట్రానికే కాకుండా దేశానికే మంచిపేరు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ, పాలనా వ్యవస్థ సంయుక్తంగా ప్రయత్నించి ఈ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో తెలుగువారైన ముగ్గురు న్యాయమూర్తులు కొలుగుదీరిన వేళ దేశంలోనే ఈ కేంద్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం అదృష్టమని, రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా త్వరలోనే ఈ కేంద్రాన్ని ప్రారంభించుకుంటామని, ఈ సెంటర్ ఫలవంతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తులు జస్టిస్ జగన్నాథరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మధ్యవర్తిత్వంతోనే ఇరు పార్టీలు హ్యాపీ!
సాక్షి, హైదరాబాద్: ‘కోర్టుల్లో కేసు గెలిస్తే ఒక పార్టీ మాత్రమే ఆనందంగా ఉంటుంది. ఓడిన పార్టీ అప్పీల్‌కు వెళ్తుంది. అయితే మీడియేషన్‌తో వివాదం పరిష్కారమైతే ఇరు పార్టీల ముఖాల్లో చిరునవ్వు చూడొచ్చు’అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి వ్యాఖ్యానించారు. మీడియేషన్ ద్వారా కేసులను పరిష్కరించడంతో న్యాయస్థానాలపై కేసుల భారాన్ని తగ్గించడమే కాక అప్పీల్ రూపంలో కొత్త కేసులు నమోదు కావడం లేదని తెలిపారు. ఈ-మీడియేషన్ రైటింగ్స్ ఆధ్వర్యంలో ప్రచురించిన 10వ వార్షిక సంచికను జస్టిస్ హిమా కోహ్లి సోమవారం జూమ్ ఆన్లైన్ మీటింగ్ ద్వారా ప్రారంభించారు. అనంతరం ‘పీస్ బిగిన్స్ ఫ్రం హోం’అనే అంశంపై జస్టిస్ హిమా కోహ్లి ప్రసంగించారు. ఇంట్లో శాంతి లేకపోతే శరీరం ఒకచోట, మనసు ఇంకో చోట ఉంటుందని, ఇంట్లో శాంతి ఉన్నప్పుడే.. సమాజం ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు. వివాదాల పరిష్కారంలో మీడియేటర్లు కీలక భూమిక పోషిస్తున్నారని, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య, అన్నాతమ్ముళ్ల మధ్య ఇలాంటి కుటుంబ వివాదాలు పరిష్కరించడం ద్వారా ఆ కుటుంబీకుల ముఖాల్లో చిరునవ్వు చూడటానికి మించిన సంతృప్తి లేదని వెల్లడించారు. ఆ బాధ వర్ణించలేం.. ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఆ కుటుంబంలో అశాంతి నెలకొంటుందని, ఆ బాధ వర్ణించలేమని జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్ పేర్కొన్నారు. కుటుంబ వివాదాల పరిష్కారంలో మీడియేటర్లు క్రియాశీలంగా వ్యవహరించాలని సూచించారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియేటర్లు వివాదాలను పరిష్కరించడం అభినందనీయమని తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి అన్నారు. ఓ కుటుంబ వివాదంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా.. కుటుంబ వివాదాల్లో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే భార్యాభర్తలకు ముందుగా కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా 40 శాతం వివాదాలను పరిష్కరించగలు గుతున్నామని నగర జాయింట్ కమిషనర్ అవినాశ్ మొహంతి పేర్కొన్నారు. మరో 25 శాతం వివాదాలు ఇరు పక్షాల విజ్ఞప్తి మేరకు కేసుల దాకా వెళ్లకుండా పెండింగ్‌లో ఉంటున్నాయని, 35 శాతం వివాదాలు కేసుల వరకు వెళ్తున్నాయని తెలిపారు. -
‘థర్డ్ పార్టీ’ ప్రమేయం వద్దు
బీజింగ్/న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు భంగపాటు ఎదురైంది. భారత్–చైనా మధ్య ప్రస్తుతం తలెత్తిన సరిహద్దు వివాదాన్ని పరిష్కరించే విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ట్రంప్ ఇచ్చిన ఆఫర్‌ను చైనా తిరస్కరించింది. భారత్–చైనా నడుమ నెలకొన్న భేదాభిప్రాయాలను పరిష్కరించుకునేందుకు ‘థర్డ్ పార్టీ’ ప్రమేయం అక్కర్లేదని కుండబద్దలు కొట్టింది. ట్రంప్ ప్రతిపాదనపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జవో లిజియాన్ తొలిసారి స్పందించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తమ మధ్య ఉన్న వివాదాల విషయంలో మూడో వ్యక్తి ప్రమేయాన్ని భారత్–చైనా ఎంతమాత్రం కోరుకోవడం లేదని తేల్చి చెప్పారు. పరస్పరం చర్చించుకోవడానికి, అభిప్రాయ భేదాలను తొలగించుకోవడానికి రెండు దేశాల మధ్య సరిహద్దు సంబంధిత అధికార యంత్రాంగం, కమ్యూనికేషన్ చానళ్లు ఉన్నాయని స్పష్టం చేశారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా వివాదాలను పరిష్కరించుకోగల సామర్థ్యం రెండు దేశాలకు ఉందన్నారు. భారత్–చైనా మధ్య మధ్యవర్తిగా పనిచేస్తానంటూ గురువారం చెప్పిన డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం కూడా ఆదే విషయం పునరుద్ఘాటించారు. మిలటరీ ఉద్రిక్తతలపై ట్రంప్–మోదీ చర్చించుకోలేదు తూర్పు లడఖ్‌లో చైనాతో ప్రస్తుతం కొనసాగుతున్న మిలటరీ ఉద్రిక్తతలపై తాను, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే మాట్లాడుకున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను కేంద్ర ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు ఖండించాయి. ఈ విషయంలో ట్రంప్–మోదీ ఇటీవల చర్చించుకోలేదని స్పష్టం చేశాయి. ఏప్రిల్ 4న ట్రంప్–మోదీ మధ్య హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రల విషయంలో మాత్రమే సంభాషణ జరిగిందని, ఆ తర్వాత ఇరువురు నేతలు ఎప్పుడూ చర్చించుకోలేదని వెల్లడించాయి. తాను మోదీతో మాట్లాడానని, భారత్–చైనా మధ్య ఉద్రిక్తతల విషయంలో ఆయన మంచి మూడ్‌లో లేరని ట్రంప్ కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘చైనాతో సరిహద్దు వాణిజ్యంలో పాల్గొనం’ ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్ ద్వారా ఈ ఏడాది చైనాతో సరిహద్దు వాణిజ్యంలో పాల్గొనకూడదని స్థానికులు నిర్ణయించుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నానాటికీ పెరిగిపోతుండడం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి సైతం తెలియజేశారు. కరోనా వైరస్ పురుడు పోసుకున్న చైనాలో అడుగుపెట్టడం ప్రమాదకరమని గిరిజన వ్యాపారుల సంఘం నాయకుడు, భారత్–చైనా వ్యాపార్ సంఘటన్ ప్రతినిధి విశాల్ గార్బియాల్ చెప్పారు. భారత్–చైనా మధ్య సరిహద్దు వాణిజ్యం ప్రతియేటా జూన్ నుంచి అక్టోబర్ వరకు జరుగుతుంది. -
మధ్యవర్తిత్వంపై మోదీకి ఫోన్ చేశా : ట్రంప్
సాక్షి, న్యూఢిల్లీ/వాషింగ్టన్ : భారత్, చైనా సరిహద్దు వివాదంలో తాను మధ్యవర్తిత్వం వహిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. ఇండో-చైనా సరిహద్దులో తలెత్తిన ప్రతిష్ఠంభన తొలగించేందుకు తన ప్రమేయం ఉపయోగపడుతుందని రెండు దేశాలు భావిస్తే అందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దీనిపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తాను ఫోన్ లో సంప్రదించాననీ, అయితే ఆ సమయంలో ఆయన మంచి మూడ్ లో లేరని చెప్పారు. 140 కోట్ల జనాభా ఉన్న రెండు పెద్ద దేశాలు భారత్, చైనా మధ్య సరిహద్దు విషయంలో సమస్య నడుస్తోందన్నారు. అయితే, ప్రధాని మోదీతో ఎప్పుడు మాట్లాడారో ట్రంప్ స్పష్టం చేయలేదు. (మధ్యవర్తిత్వం చేస్తా) వైట్ హౌస్ లో గురువారం మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మధ్యవర్తిత్వంపై ప్రశ్నించినపుడు తాను అందుకు సిద్ధంగా ఉన్నానంటూ ట్రంప్ చెప్పారు. చైనా, భారత్ దేశాలకూ బలమైన మిలటరీ శక్తి ఉందని, ప్రస్తుత వివాదంతో ఇరుదేశాలు అసంతృప్తితో ఉన్నాయని అన్నారు. లదాఖ్ లోని ప్యాంగాంగ్ లేక్ ఏరియాలో వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాలు భారత్ భూభాగంలోకి దూసుకొచ్చే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తాను మధ్యవర్తిత్వం చేస్తానంటూ ట్రంప్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. (‘చైనాతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి’) కాగా చైనాతో తలెత్తిన ఈ సమస్యను సామరస్యపూర్వకంగా చర్చలతోనే పరిష్కరించుకుంటామని భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకుంటామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు. అంతకుముదు భారత్ చైనా సమస్యలు పరిష్కరించుకునేందుకు మంచి వాతావరణం ఉందంటూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియన్ కూడా ప్రకటించారు. #WATCH "We have a big conflict going on between India & China, 2 countries with 1.4 billion people & very powerful militaries. India is not happy & probably China is not happy, I did speak to PM Modi, he is not in a good mood about what's going on with China": US President Trump pic.twitter.com/1Juu3J2IQK — ANI (@ANI) May 28, 2020 -
6 నుంచి అయోధ్య విచారణ
న్యూఢిల్లీ: రాజకీయంగా సున్నితమైన అయోధ్యలోని రామజన్మభూమి–బాబ్రీ మసీదు భూ వివాదానికి మధ్యవర్తిత్వం పరిష్కారం చూపనందున ఇక ఈ కేసును తామే ప్రతి రోజూ విచారిస్తామని సుప్రీంకోర్టు శుక్రవారం వెల్లడించింది. ఆగస్టు 6 నుంచి ప్రారంభించి విచారణను రోజూ బహిరంగంగా చేపడతామంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్ఎంఐ ఖలీఫుల్లా నేతృత్వంలోని త్రిసభ్య మధ్యవర్తిత్వ కమిటీ దాదాపు నాలుగు నెలలపాటు అయోధ్య కేసులో మధ్యవర్తిత్వానికి ప్రయత్నించినా ఫలితం రాలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదికను తాము చదివామనీ, సమస్యకు ఈ కమిటీ తుది పరిష్కారం చూపలేకపోయిందని పేర్కొంది. కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఇక తామే ఈ కేసును విచారించాలని నిర్ణయించినట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తెలిపింది. జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్‌లు ఈ ధర్మాసనంలో ఇతర సభ్యులుగా ఉన్నారు. జూలై 31 నాటి వరకు మధ్యవర్తిత్వంలో ఎంత పురోగతి వచ్చిందో తెలిపే నివేదికను ఆగస్టు 1న తమకు సమర్పించాల్సిందిగా త్రిసభ్య మధ్యవర్తిత్వ కమిటీని కోర్టు జూలై 18నే ఆదేశించింది. కాగా, అయోధ్య కేసుపై ప్రతి రోజూ విచారణ జరుపుతామంటూ సుప్రీంకోర్టు చెప్పడాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) స్వాగతించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి న్యాయపరమైన చిక్కులు త్వరలోనే తొలగిపోతాయని తాము ఆశిస్తున్నామని ట్విట్టర్లో తెలిపింది. మధ్యవర్తిత్వంతో లాభం లేదు త్రిసభ్య కమిటీ నివేదికను పరిశీలించిన అనంతరం, మధ్యవర్తిత్వంతో లాభం లేదనీ, కేసును తామే విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ఎఫ్ఎంఐ ఖలీఫుల్లా ఈ త్రిసభ్య కమిటీకి నేతృత్వం వహిస్తుండగా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌తోపాటు సీనియర్ న్యాయవాది, మధ్యవర్తిత్వంలో పేరొందిన శ్రీరామ్ పంచు సభ్యులుగా ఉండటం తెలిసిందే. క్లిష్టమైన అయోధ్య సమస్యకు హిందూ, ముస్లిం వర్గాలకు అమోదయోగ్యమైన పరిష్కారం లభించడం లేదని త్రిసభ్య కమిటీ తన నివేదికలో పేర్కొంది. అయోధ్య కేసులో మధ్యవర్తిత్వానికి కోర్టు మార్చి 8న అనుమతినిచ్చింది. చర్చలను రహస్యంగా జరపాలనీ, 8 వారాల్లోగా పూర్తి చేయాలని అప్పట్లో గడువు విధించింది. అయితే సామరస్యక పరిష్కారం కనుగొనే దిశగా చర్చలు ఆశాజనకంగా సాగుతున్నాయనీ, మరికొంత సమయం కావాలని కమిటీ కోరడంతో, ఆగస్టు 15 వరకు కోర్టు గడువిచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో కమిటీ ఈ చర్చలు జరిపింది. 16వ శతాబ్దంలో మీర్ బఖీ నిర్మించిన బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6న కొందరు కూల్చేయడం తెలిసిందే. 20 రోజుల సమయం కావాలి... ఈ కేసులో ముస్లింల తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ శుక్రవారం కోర్టులో వాదిస్తూ పలు సాంకేతికాంశాలను ప్రస్తావించారు. కేసులోని వివిధ అంశాలను సంపూర్ణంగా వాదించాలంటే తనకు ముందుగా కనీసం 20 రోజుల సమయం కావాలని ఆయన కోరారు. కేసులోని వివిధ అంశాలు, అప్పీళ్లను ఎలా విచారించాలో రాజీవ్ కోర్టుకు చెబుతుండగా, న్యాయమూర్తులు కలగజేసుకుంటూ ‘మేము ఏం చేయాలో మీరు మాకు గుర్తుచేయాల్సిన అవసరం లేదు. కేసులో ఏయే అంశాలున్నాయో మాకు తెలుసు. వాటన్నింటిపై మేం విచారిస్తాం. ముందు విచారణ ప్రారంభం కానివ్వండి’ అని అన్నారు. మధ్యవర్తిత్వ కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలు రహస్యంగానే ఉంటాయని కూడా కోర్టు స్పష్టం చేసింది. -
ఆ జడ్జీలు మధ్యవర్తిత్వం చేశారు
వాషింగ్టన్: అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో పనిచేసిన 13 మంది మాజీ జడ్జీలు, ఏడుగురు ప్రస్తుత జడ్జీలు వారి పదవీకాలంలో వివిధ వ్యాజ్యాల్లో మధ్యవర్తులుగా పనిచేశారని ఓ నివేదిక ఆరోపించింది. వారిలో బ్రిటన్‌కు చెందిన క్రిస్టోఫర్ గ్రీన్వుడ్ ఉన్నారు. ఐసీజేలో జడ్జీగా భారత్ నుంచి ఎన్నికైన ధల్వీర్ భండారీ మధ్యవర్తిత్వం చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవని కెనడాకు చెందిన అంతర్జాతీయ సుస్థిర అభివృద్ధి సంస్థ (ఐఎస్ఎస్డీ) నివేదించింది. ఐరాస సాధారణ సభలో మూడింట రెండొంతుల మెజార్టీతో ధల్వీర్ భండారీ గెలుపొందగా, గ్రీన్వుడ్ మాత్రం వెనకే ఉండిపోయారు. బ్రిటన్‌కు చెందిన గ్రీన్వుడ్ తన పదవీ కాలంలో తొమ్మిది పెట్టుబడుల వివాదాల్లో మధ్యవర్తిగా పనిచేశారని నివేదిక పేర్కొం ది. రెండు కేసులకు ఆయన దాదాపు 4 లక్షల డాలర్లు తీసుకున్నట్లు తేలింది. అలాంటి 90 కేసుల్లో కేవలం 9 కేసులకు గాను జడ్జీలకు మొత్తం 10 లక్షల డాలర్లు ముట్టినట్లు ఐఎస్ఎస్డీ వెల్లడించింది. ప్రస్తుత ఐసీజే అధ్యక్షుడు రోనీ అబ్రహం, ఐదుగురు మాజీ అధ్యక్షులు కూడా ఆ జాబితాలో ఉండటం గమనార్హం. -
ఇతరుల సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం మీలో ఉందా?
‘ఎవరు ఏమైతే నాకేంటి? నేను బాగుంటే చాలు... లేనిపోని విషయాల గురించి నాకెందుకు?... నేను ఆపదల్లో ఉన్నప్పుడు సహాయం అందితే చాలు’... ఈవిధంగా తమ గురించే ఆలోచించుకొనేవారు తమకు లాభం చేకూర్చని విషయాల గురించి ఆలోచించటానికి ససేమిరా అంటారు. కొందరైతే ఎదురుగా జరుగుతున్న సమస్యలపై స్పందిస్తారు. సహాయం చేయటానికి ముందుంటారు. గొడవ పడుతున్న వారికి మధ్య పెద్దమనిషిలా హాజరై వారి సమస్యలను పరిష్కరించటానికి ట్రై చేస్తారు. మీలో మధ్యవర్తిత్వం చేసే సామర్థ్యం ఉందా? 1. శుభకార్యాలకు పెద్దగా మిమ్మల్ని పిలవటానికి చుట్టుపక్కల వారు ఉత్సాహాన్ని చూపుతారు. ఎ. అవును బి. కాదు 2. క్లిష్ట పరిస్థితుల్లో దిగాలు చెందటం అంటే మీకు నచ్చదు. అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయని నమ్ముతారు. ఎ. అవును బి. కాదు 3. అందరికీ ఇబ్బంది కలిగించే సంఘటనలు మీముందు జరుగుతుంటే నిమ్మళంగా ఉండరు, ప్రశ్నిస్తారు. ఎ. అవును బి. కాదు 4. చాలా జాగ్రత్తగా నడుచుకుంటారు. మీ గురించి కామెంట్ చేసే అవకాశం ఇతరులకు ఇవ్వరు. ఎ. అవును బి. కాదు 5. వెంటనే స్పందించే తత్వం మీకుంటుంది. ఏ పనిలోనూ అలసత్వాన్ని ప్రదర్శించరు. ఎ. అవును బి. కాదు 6. వాక్చాతుర్యం మీలో బాగుంటుంది. ఎలాంటి విషయాన్నైనా సులభంగా డీల్ చేయగలరు. ఎ. అవును బి. కాదు 7. మధ్యవర్తిత్వం నడిపేటప్పుడు ఇద్దరి వాదనలూ వింటారు. ఏకపక్షంగా ప్రవర్తించరు. ఎ. అవును బి. కాదు 8. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. పదిమంది కూడినచోట వివాదం తలెత్తితే, మీ మాటల ద్వారా వాతావరణాన్ని చక్కదిద్దగలరు. ఎ. అవును బి. కాదు 9. మీ మాటల్లో పరిణతి, గాంభీర్యం ఉంటుంది. అర్థంలేని మాటలు మాట్లాడరు. ఎ. అవును బి. కాదు 10. హెల్పింగ్నేచర్ మీలో ఉంటుంది. ఇబ్బందులుపడే వాళ్లను చూడలేరు. మీకు తోచిన సహాయం చేయకుండా ఉండరు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ సమాధానాలు ఏడు దాటితే మీలో సహాయంచేసే లక్షణం బాగా ఉంటుంది. దీనివల్లే ఇతరుల విషయాలను పరిష్కరించటానికి చొరవ తీసుకుంటారు. మీ స్వార్థం మీరు చూసుకోకుండా ఇబ్బందులుపడేవారి గురించి ఆలోచిస్తారు. ఇతరులకు సలహాలు ఇచ్చేముందు మీ ప్రవర్తన బాగుండేలా చూసుకుంటారు. ‘బి’ లు ‘ఎ’ ల కంటే ఎక్కువగా వస్తే మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తారు. నాయకత్వ లక్షణాలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల ఏదైనా విషయంలో మధ్యవర్తిత్వం ఎలా నడపాలో మీకు పెద్దగా తెలియదని అర్థం. -
మధ్యవర్తిత్వానికి మంచి భవిష్యత్తు
జస్టిస్ దిలీప్ బి.బొసాలే హైదరాబాద్: మధ్యవర్తిత్వానికి మంచి భవిష్యత్తు ఉందని, ప్రపంచం మొత్తం ఈ రంగంవైపు ఆసక్తిగా చూస్తోందని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే అన్నారు. ఈ రంగాన్ని వృత్తిగా ఎంచుకున్న వారికి మంచి గుర్తింపుతోపాటు న్యాయవాదులతో సమానంగా ఆర్జించే అవకాశం ఉంటుందన్నారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార(ఏడీఆర్), కుటుంబ వివాద పరి ష్కార(ఎఫ్డీఆర్) విభాగాల్లో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిసొల్యూషన్ (ఐసీఏడీఆర్), నల్సార్ నిర్వహిస్తున్న పీజీ డిప్లొమా ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం ఐసీఏడీఆర్ కార్యాలయంలో జరిగింది. ఇందులో జస్టిస్ బొసాలే మాట్లాడుతూ సీపీసీలోని సెక్షన్ 89 వివాదాలను పరిష్కరించుకునేందుకు నాలుగు ప్రత్యామ్నాయ విధానాలను సూచించిందన్నారు. న్యాయస్థానాలకు చేరే వివాదాల్లో ఏదో ఒక పార్టీ విజయం సాధిస్తుందని, అయితే మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొని ఇరువర్గాలూ విజయం సాధించవచ్చన్నారు. తాలూకా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం చేయాల్సి వస్తోందని, అయితే తీవ్ర జాప్యం, న్యాయవాదులకు ఇచ్చే ఫీజు తదితర అంశాలతో చివరికి విజయం సాధించామనే ఆనందం కూడా ఉండదన్నారు. ఏడీఆర్ విధానం ద్వారా పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరిస్తున్నారని, దీంతో పెండింగ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని నల్సార్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తఫా పేర్కొన్నారు. ఏడీఆర్ విధానం ద్వారా కేసులను పరిష్కరించడానికి 12 నెలల గడువు నిర్దేశించారని, దీంతో వివాదాలు వీలైనంత త్వరగా పరిష్కారమవుతాయన్నారు. కుటుంబ, కార్మిక, వాహన ప్రమాదాలు, కాంట్రాక్టు వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించవచ్చన్నారు. ఐసీఏడీఆర్ ద్వారా ఇప్పటి వరకు 1,700 మందికి మధ్యవర్తిత్వంపై శిక్షణ ఇచ్చామని ఐసీఏడీఆర్ ప్రాంతీయ విభాగం ఇన్చార్జి జేఎల్ఎన్ మూర్తి తెలిపారు. లీగల్ సర్వీస్ అథారిటీతో కలసి 18 జిల్లాల్లో ఏడీఆర్ విధానాలపై సదస్సులు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరచిన సి.సుబ్రమణ్యం అనే విద్యార్థికి బంగారు పతకాన్ని, మంజుశర్మ అనే విద్యార్థికి రజత పతకాన్ని జస్టిస్ బొసాలే అందజేశారు. అలాగే అధ్యాపక బృందంలోని వై.పద్మావతి, మోహన్‌కృష్ణ, సంధ్యారాణిలను కూడా జస్టిస్ బొసాలే సత్కరించారు. కార్యక్రమంలో నల్సార్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సూరి అప్పారావు పాల్గొన్నారు. -
రాజీకి లిపికా మిత్రా నో
సాక్షి, న్యూఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమ్‌నాథ్ భారతితో రాజీ కుదుర్చుకోవడానికి ఆయన భార్య లిపికా మిత్రా నిరాకరించారు. దీంతో సోమ్‌నాథ్ మరింత చిక్కుల్లో పడ్డారు. మధ్యవర్తిత్వానికి లిపికా నిరాకరించడంతో ఆయనపై దాఖలైన గృహహింస, హత్యాయత్నం క్రిమినల్ కేసులపై న్యాయస్థానంలో విచారణ కొనసాగనుంది. సుప్రీంకోర్టు ఎదుట హాజరైన లిపికా మిత్రా.. తన భర్తతో రాజీ కుదుర్చుకోవడానికి, మధ్యవర్తిత్వంలో పాల్గొనడానికి సముఖంగా లేనని ఆమె ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనానికి స్పష్టం చేశారు. మధ్యవర్తిత్వానికి లిపికా నిరాకరించడంతో సోమ్‌నాథ్ భారతి పెట్టుకున్న బెయిలు దరఖాస్తును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ట్రయల్ కోర్టు ద్వారా బెయిలు కోసం ప్రయత్నించాలని న్యాయస్థానం ఆయనకు సూచించింది. -
రేప్ కేసులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: అత్యాచార కేసుల్లోసుప్రీంకోర్టు బుధవారం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అత్యాచార బాధితులకు, నిందితులకు మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నించడాన్ని ఉన్నత ధర్మాసనం తీవ్రంగా ఖండించింది. రేప్ కేసులలో బాధితురాలితో నిందితుల ఒప్పందాలు చెల్లవని స్పష్టం చేసింది. ఈ చర్య మహిళల గౌరవానికి వ్యతిరేకమైనదని వ్యాఖ్యానించింది. ఇటీవల తమిళనాడు కోర్టు అత్యాచార కేసులో మధ్యవర్తిత్వానికి ఆదేశించడాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు పైవిధంగా స్పందించింది. దోషులకు కఠినమైన శిక్షలు అమలు చేయాలని, నిందితులు, బాధితులు రాజీ చేసుకున్నా దాన్ని తీవ్ర నేరంగా పరిగణించాలని ఆదేశించింది. లైంగిక దాడి చేసిన వ్యక్తులతో రాజీ కుదుర్చుకోమని కోరడమంటే నేరస్తుల పట్ల మెతకవైఖరి చూపించినట్లు అవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రాజీ చేయడమంటే మహిళా హక్కులను కాలరాయడమేనని పేర్కొంది. ఇది చాలా తీవ్రమైన తప్పిదమని పేర్కొంది. కాగా ఇటీవల మద్రాస్ హైకోర్టు ఒక రేప్ కేసులో జైల్లో ఉన్న నిందితుడుకి ..బాధితురాలితో మాట్లాడి రాజీ చేసుకోవడానికి వీలుగా బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా సదరు వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాల్సిందిగా బాధిత మహిళకు జడ్జి సూచించడం వివాదాన్ని రాజేసింది. -
ప్రభుత్వం కోరితే మధ్యవర్తిత్వానికి సిద్ధం: గద్దర్
గజ్వేల్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తలెత్తిన విద్యుత్ వివాదం విషయంలో.. ఇక్కడి ప్రభుత్వం కోరితే మధ్యవర్తిత్వం వహించి సమస్య పరిష్కారానికి తనవంతు ప్రయత్నం చే స్తానని ప్రజాగాయకుడు గద్దర్ ప్రకటించారు. మెదక్ జిల్లా గజ్వేల్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్నదమ్ముల్లా కలసి ఉండాల్సిన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ వ్యవహారం ఉద్రిక్తతలను సృష్టించడం బాధాకరమని వ్యాఖ్యానించారు. కరెంట్ కోతల కారణంగా తెలంగాణ రైతాంగం అల్లాడుతోందని, ఈ సమస్య నుంచి రైతులను గట్టెక్కించడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనవంతు తోడ్పాటు ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు సాగించాల్సిన ప్రస్తుత తరుణంలో రెండు రాష్ట్రాల మధ్య సోదరభావం ఎంతో అవసరమన్నారు. సాగునీటి వనరుల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం ముందుకు కదలడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. -
బీమాకు ‘అంబుడ్స్‌మన్’ భరోసా!
గత రెండు దశాబ్దాల కాలంలో దేశంలో వినియోగదారుల చైతన్య స్థాయి గణనీయంగా పెరిగింది. దీనితో పలు రంగాలతో పాటు బీమా రంగంలో కూడా వినియోగదారుల వివాదాలు పెరుగుతున్నాయి. అయితే ప్రతి సమస్య పరిష్కారానికీ కోర్టుల చుట్టూ దీర్ఘకాలం పాటు తిరగడం కష్టం. ఇలాంటి సందర్భాల్లో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యల పరిష్కారానికి ఒక పటిష్ట యంత్రాంగం అవసరం. ఇదే అంబుడ్స్‌మన్ వ్యవస్థ. బ్యాంకింగ్‌లో ఇప్పటికే ఇటువంటి వ్యవస్థ సమస్యల పరిష్కారంలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఇదే తరహాలో బీమా రంగంలో కూడా అంబుడ్స్‌మన్ క్రియాశీల పాత్ర విస్తృతమవుతోంది. 12 కార్యాలయాలు... దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల పరిధిలతో 12 కార్యాలయాలు పనిచేస్తున్నాయి. వీటిలో న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, భోపాల్, భువనేశ్వర్, కొచ్చిన్, గౌహతి, చండీగఢ్, అహ్మదాబాద్, లక్నో, ముంబైలు ఉన్నాయి. సత్వర న్యాయం ఇక్కడ ప్రధానాంశం. ఫిర్యాదు అందిన 3 నెలల్లో అంబుడ్స్‌మన్ అవార్డు (తీర్పు)ను ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన అవార్డులను కంపెనీలు తప్పనిసరిగా అమలు చేయాలి. పాలసీ హోల్డర్ ప్రయోజనాల పరిరక్షణ నిబంధనల ప్రకారం, ప్రతి బీమా కంపెనీ అధికారి సంబంధిత పాలసీ హోల్డర్‌కు తన కార్యాలయం ఏ ప్రాంత అంబుడ్స్‌మన్ పరిధిలోకి వస్తుందన్న అంశాన్ని తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. రెండు రకాల విధులు... వివాదానికి సంబంధించి రాజీ కుదర్చడం, ఇందుకు తగిన తీర్పును ఇవ్వడం ప్రధానాంశాలుగా బీమా అంబుడ్స్‌మన్ కార్యకలాపాలు ఉంటాయి. పాలసీ నిర్వహణకు సంబంధించి ప్రీమియం చెల్లింపులు నుంచి క్లెయిమ్ సెటిల్మెంట్ వరకూ తన ప్రయోజనాలకు విఘాతం కలిగిందని భావించిన ప్రతి వినియోగదారు నుంచి అంబుడ్స్‌మన్ ఫిర్యాదు స్వీకరిస్తారు. అయితే అంబుడ్స్‌మన్ వివాద పరిష్కార పరిధి మొత్తం రూ.20 లక్షల లోపే అన్న విషయం ముఖ్యాంశం. ఫిర్యాదు పద్దతి ఇదీ... పాలసీదారు తన సమస్యను తన న్యాయ పరిధికి సంబంధించిన అంబుడ్స్‌మన్‌కు లిఖితపూర్వకంగా తెలియజేయాలి. అయితే అంబుడ్స్‌మన్‌ను మొదటే నేరుగా సంప్రదించడానికి వీలులేదు. ఫిర్యాదు చేసే ముందు పాలసీదారు తన సమస్యను తొలుత తన బీమా కంపెనీ దృష్టికి లిఖితపూర్వకంగా తీసుకువెళ్లాలి. నెలలోపు దీనిపై సంస్థ స్పందించాలి. ఈ కాలంలో ఫిర్యాదును తిరస్కరించినా, అసలు సమాధానం ఇవ్వకపోయినా, ఇచ్చిన సమాధానం సంతృప్తి పరచకపోయినా అంబుడ్స్‌మన్‌కు ఆయా అంశాలతో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. అయితే ఇలాంటి ఫిర్యాదు చేయడానికి యేడాదికన్నా ఎక్కువ సమయం తీసుకోకూడదు. అదే విధంగా చేసిన ఫిర్యాదు అంశం ఏ కోర్టులో కానీ లేదా వినియోగదారుల ఫోరం లేదా ఆర్బిట్రేటర్ వద్ద పెండింగులో ఉండకూడదు. తీర్పు ఇలా: సమస్య పరిష్కారంపై అంబుడ్స్‌మన్ నిర్ణయం తీసుకున్న తర్వాత, ఈ నిర్ణయాన్ని (రికమండేషన్), అలాగే ఈ నిర్ణయానికి వచ్చిన పరిస్థితులనూ వివరాలతోసహా లిఖితపూర్వకంగా నెలలోపు వినియోగదారునికీ, బీమా కంపెనీకి తెలియజేస్తారు. సిఫారసు నచ్చితే ‘పరిష్కారాన్ని’ అంగీకరిస్తున్నట్లు సెటిల్ మెంట్ పత్రం అందిన 15 రోజుల లోపు లిఖితపూర్వకంగా అంబుడ్స్‌మన్‌కు తిరిగి తెలియజేయాలి. రికమండేషన్‌ను అంగీకరించకపోతే సమస్య పరిష్కారానికి వినియోగదారుల ఫోరం, కోర్టులు వంటి ఇతర తగిన న్యాయ వేదికలను ఆశ్రయించవచ్చు.