సీజేఐ డీవై చంద్రచూడ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సంస్కృతిని పెంపొందించడంలో భారతదేశం ముందుండాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ‘చట్టాల పట్ల గౌరవం నిజాయతీని, స్థిరతను ప్రోత్సహిస్తుంది, ఆర్థిక వృద్ధికి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.
హక్కులకు రక్షణ చేకూరి, ఒప్పందాలు అమలయి, వివాదాలు సమర్ధవంతంగా పరిష్కారమయ్యే ఇటువంటి వ్యవస్థలో పెట్టుబడి దారులు ముందుకొచ్చి వృద్ధికి అనుకూలమైన వాతా వరణం నెలకొంటుంది’అని ఆయన తెలిపారు. అంతర్జాతీయ మధ్యవర్తిత్వం, చట్టపాలనపై శుక్రవారం జరిగిన సదస్సులో జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడారు. చట్టబద్ధ పాలనతో విదేశీ పెట్టుబడులు, వాణిజ్యం పెరగడంతోపాటు అంతర్జాతీయంగా పోటీపడే వాతా వరణం దేశంలో నెలకొంటుందన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సంజీవ్ ఖన్నా, అటార్నీ జనరల్ వెంకటరమణి, సుప్రీం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్ సిబల్ తదితరులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment