ఇతరుల సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం మీలో ఉందా?
‘ఎవరు ఏమైతే నాకేంటి? నేను బాగుంటే చాలు... లేనిపోని విషయాల గురించి నాకెందుకు?... నేను ఆపదల్లో ఉన్నప్పుడు సహాయం అందితే చాలు’... ఈవిధంగా తమ గురించే ఆలోచించుకొనేవారు తమకు లాభం చేకూర్చని విషయాల గురించి ఆలోచించటానికి ససేమిరా అంటారు. కొందరైతే ఎదురుగా జరుగుతున్న సమస్యలపై స్పందిస్తారు. సహాయం చేయటానికి ముందుంటారు. గొడవ పడుతున్న వారికి మధ్య పెద్దమనిషిలా హాజరై వారి సమస్యలను పరిష్కరించటానికి ట్రై చేస్తారు. మీలో మధ్యవర్తిత్వం చేసే సామర్థ్యం ఉందా?
1. శుభకార్యాలకు పెద్దగా మిమ్మల్ని పిలవటానికి చుట్టుపక్కల వారు ఉత్సాహాన్ని చూపుతారు.
ఎ. అవును బి. కాదు
2. క్లిష్ట పరిస్థితుల్లో దిగాలు చెందటం అంటే మీకు నచ్చదు. అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయని నమ్ముతారు.
ఎ. అవును బి. కాదు
3. అందరికీ ఇబ్బంది కలిగించే సంఘటనలు మీముందు జరుగుతుంటే నిమ్మళంగా ఉండరు, ప్రశ్నిస్తారు.
ఎ. అవును బి. కాదు
4. చాలా జాగ్రత్తగా నడుచుకుంటారు. మీ గురించి కామెంట్ చేసే అవకాశం ఇతరులకు ఇవ్వరు.
ఎ. అవును బి. కాదు
5. వెంటనే స్పందించే తత్వం మీకుంటుంది. ఏ పనిలోనూ అలసత్వాన్ని ప్రదర్శించరు.
ఎ. అవును బి. కాదు
6. వాక్‌చాతుర్యం మీలో బాగుంటుంది. ఎలాంటి విషయాన్నైనా సులభంగా డీల్ చేయగలరు.
ఎ. అవును బి. కాదు
7. మధ్యవర్తిత్వం నడిపేటప్పుడు ఇద్దరి వాదనలూ వింటారు. ఏకపక్షంగా ప్రవర్తించరు.
ఎ. అవును బి. కాదు
8. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. పదిమంది కూడినచోట వివాదం తలెత్తితే, మీ మాటల ద్వారా వాతావరణాన్ని చక్కదిద్దగలరు.
ఎ. అవును బి. కాదు
9. మీ మాటల్లో పరిణతి, గాంభీర్యం ఉంటుంది. అర్థంలేని మాటలు మాట్లాడరు.
ఎ. అవును బి. కాదు
10. హెల్పింగ్‌నేచర్ మీలో ఉంటుంది. ఇబ్బందులుపడే వాళ్లను చూడలేరు. మీకు తోచిన సహాయం చేయకుండా ఉండరు.
ఎ. అవును బి. కాదు
‘ఎ’ సమాధానాలు ఏడు దాటితే మీలో సహాయంచేసే లక్షణం బాగా ఉంటుంది. దీనివల్లే ఇతరుల విషయాలను పరిష్కరించటానికి చొరవ తీసుకుంటారు. మీ స్వార్థం మీరు చూసుకోకుండా ఇబ్బందులుపడేవారి గురించి ఆలోచిస్తారు. ఇతరులకు సలహాలు ఇచ్చేముందు మీ ప్రవర్తన బాగుండేలా చూసుకుంటారు.
‘బి’ లు ‘ఎ’ ల కంటే ఎక్కువగా వస్తే మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తారు. నాయకత్వ లక్షణాలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల ఏదైనా విషయంలో మధ్యవర్తిత్వం ఎలా నడపాలో మీకు పెద్దగా తెలియదని అర్థం.