నిడదవోలులో కుప్పకూలిన బ్రిడ్జి | Bridge collapse in Nidadavolu | Sakshi
Sakshi News home page

నిడదవోలులో కూలిన గడ్డర్‌ బ్రిడ్జి

Published Wed, Mar 14 2018 9:18 AM | Last Updated on Wed, Mar 14 2018 1:06 PM

Bridge collapse in Nidadavolu - Sakshi

సాక్షి, ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో గడ్డర్‌ బ్రిడ్జి అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. నిడదవోలు నుంచి కాశి రేవుకు వెళ్లే ఈ బ్రిడ్జిని సుమారు తొంభై ఏళ్ల క్రితం బ్రిటిష్‌ వారు తమ రాకపోకల నిమిత్తం నిర్మించారు. కాగా 2014లో ఈ బ్రిడ్జి పునర్నిర్మాణం చేపట్టినప్పటికీ పర్యవేక్షణ లోపంతో పనులు నత్తనడకన సాగాయి. బ్రిడ్జి కూలికపోవడంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే స్థానిక టింబర్‌ డిపో నిత్యం అధిక లోడుతో రాకపోకలు సాగించడంతోనే ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement