nidadavolu
-
టీడీపీ, జనసేనలో వర్గ విభేదాలు.. మంత్రికి నిరసన సెగ
తూర్పుగోదావరి, సాక్షి: నిడదవోలు టీడీపీ, జనసేనలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. కంసాలిపాలెంలో మంత్రి కందుల దుర్గేష్‌కు నిరసన సెగ తగిలింది. తమను పట్టించుకోవటం లేదని మంత్రిని టీడీపీ నేతులు నిలదీశారు. మంత్రి దుర్గేష్ ఎదుటే టీడీపీ, జనసేన నేతలు ఘర్షణకు దిగారు. -
చిన్నారికి ప్రాణం పోస్తున్న సీఎం వైఎస్ జగన్ మానవత్వం
-
చిట్టితల్లికి ఆరోగ్య భరోసా.. చెల్లెమ్మ కళ్లలో ఆనందం
సాక్షి, రాజమహేంద్రవరం: చెప్పాడంటే.. చేస్తాడంతే. మాటిచ్చాడంటే నెరవేరుస్తాడంతే. అది సంక్షేమ పాలనలో అయినా.. కష్టంలో ఉన్నవాళ్లకి అందించే భరోసా విషయంలోనైనా. ఎనిమిది నెలల కిందట తన బిడ్డతో సాయం కోసం వచ్చిన ఓ చెల్లెమ్మ ముఖంలో ఇప్పుడు చిరునవ్వు పూయించారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆమెకు మానసికంగా ధైర్యం.. చిన్నారికి క్రమం తప్పకుండా చికిత్స అందుతుండడంలో సీఎం వైఎస్ జగన్ ఉదారత ఉంది. శనివారం నిడదవోలు పర్యటన సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌ని చిన్నారి శాంతి కుటుంబం కలిసింది. ఈ సందర్భంగా పాప ఆరోగ్యం కోసం వాకబు చేశారాయన. గత 8 నెలల(సీఎం జగన్ భరోసా ఇచ్చినప్పటి నుంచి) సమయంలో పాప డయానా శాంతికి అందిన వైద్యం వివరాలన్నింటి గురించి కలెక్టర్ మాధవీలత వివరించారు. వైద్య పరీక్షలన్నీ పూర్తయ్యాయని, ప్రాథమిక పరీక్ష, రక్త నమూనా కోసం శాంతిని ఆరుసార్లు ఢిల్లీకి పంపామని, జెనెటిక్స్ పరీక్ష కోసం రక్త నమూనాలను నొవార్టిస్ కంపెనీ సింగపూర్, అమెరికాకు పంపినట్లు కలెక్టర్ వివరించారు. ఇప్పటి వరకు జరిగిన పరీక్షలన్నింటిలో సానుకూల ఫలితాలు రావడంతో.. మూడు వారాల్లో పాప కోసం ఇంజెక్షన్(రూ 16 కోట్ల ఖరీదు చేసేది) వచ్చే అవకాశం ఉందని ఆమె వివరించారు. డయానా శాంతి ‘స్పైనల్ మస్కులర్ అట్రోఫీ టైప్-2’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ ఏడాది జనవరి 3వ తేదీన జిల్లా పర్యటన సంద్భంగా శాంతి తల్లి సూర్యకుమారి, సీఎం జగన్‌ను కలిసి తన గోడును వెల్లబోసుకుంది. ఆ సమయంలో తక్షణ ఆర్థిక సహాయం గా రూ. లక్ష అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. అంతేకాదు.. ప్రతి నెలా రూ.5 వేల వైఎస్ఆర్ నవశకం ఆరోగ్య పింఛను సైతం అందేలా చూడాలని అధికారులకు చెప్పారు. అదే సమయంలో.. ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న ఆ కుటుంబానికి ఆసరా అందించేందుకు సూర్య కుమారికి నిడదవోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగం ఇచ్చారు. చదవండి: కాపు నేస్తంతో 4 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్ది: సీఎం జగన్ -
స్కిల్ స్కాం దొంగలను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి
-
కాపునేస్తంతో 4 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్ది చేకూరింది
-
కాపు నేస్తంతో 4 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్ది: సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి: ‘కాపు నేస్తం’ పథకం ద్వారాం ఒంటరి మహిళలకు మేలు చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15,000 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయాన్ని అందచేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అందచేసే సాయంతో ఇప్పటివరకు (నాలుగేళ్లలో) ఈ పథకం ద్వారా మొత్తం రూ.2,029 కోట్లు ఆర్థిక సాయం అదించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. నిడదవోలులో ‘వైఎస్సార్ కాపు నేస్తం’ నాలుగో విడత ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మీ ప్రేమాభిమానాలకు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో మంచి కార్యక్రమం కొనసాగిస్తున్నామని తెలిపారు. ఒంటరి మహిళలకు ఆర్థిక స్వావలంబన అర్హులైన 3,57,844 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 536.77 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. పేద కాపు మహిళలకు, ముఖ్యంగా ఒంటరి మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చడమే లక్ష్యమని అన్నారు. నాలుగు లక్షల మంది కాపు నేస్తం పథకం ద్వారా లబ్ధిపొందినట్లు తెలిపారు. లంచాలకు అవినీతికి తావులేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తున్నామని చెప్పారు. కేబినెట్లో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత గతంలో ఏ ప్రభుత్వం ఈ కార్యక్రమం అమలు చేయలేదని సీఎం చెప్పారు. కులం, మతం రాజకీయాలు చూడకుండా పథకాలు అమలు చేస్తున్నామ్నారు. అర్హత ఉంటే చాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 2.30 లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించామని చెప్పారు. నాన్ డీబీటీ ద్వారా కాపు వర్గానికి రూ. 16,914 కోట్ల లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. కేబినెట్లో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చామన్న సీఎం జగన్.. ఇది ప్రజలందరీ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ కాపు సామాజిక వర్గానికి ప్రధాన్యత కల్పించామన్నారు. చదవండి: పొత్తులో సీటు ఫట్!.. జనసేన, టీడీపీ నేతల్లో ఆందోళన -
Live: నిడదవోలులో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ
-
స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే: సీఎం జగన్
Updates.. ములాఖత్‌లో మిలాకత్లా? చంద్రబాబు-పవన్‌లపై సీఎం జగన్ విమర్శలు - 45 ఏళ్ల నుంచి బాబు దోపిడీ నే రాజకీయంగా మార్చుకున్నారు - ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు - ఆడియో టేపుల్లో బ్లాక్ మనీ పంచుతూ అడ్డంగా దొరికారు - సాక్ష్యాదారాలతో సహా దొరికినా బుకాయిస్తున్నారు - బాబు దొంగతనాల్లో వీరంతా వాటాదారులే - ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు - ఎల్లో మీడియా నిజాలను చూపించరు - ఎల్లో మీడియా చంద్రబాబు అవినీతి పై మాట్లాడదు - నిస్సిగ్గుగా చంద్రబాబుకు వీరంతా సపోర్ట్ చేస్తున్నారు - లేని కంపెనీని ఉన్నట్టుగా ఫేక్ అగ్రిమెంట్ సృష్టించారు - స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే - ఫేక్ అగ్రిమెంట్ తో ప్రభుత్వ ఖజానా దోచేశారు - ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కారు - సీమెన్స్ కంపెనీ మాకు సంబంధం లేదని చెప్పింది - ఫేక్ అగ్రిమెంట్ దొంగలను ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసింది - ఒత్తిడి తీసుకొచ్చి సంతకాలు పెట్టి నిధులు దోచేశారు - డొల్ల సూట్ కేసు కంపెనీలకు మళ్లించినట్టు ఈడీ తేల్చింది - ఈడీ అరెస్ట్ చేసినా, ఐటీ నోటీసులిచ్చినా ఇంకా బుకాయిస్తున్నారు - కోర్టు రిమాండ్ కు పంపితే ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు - ఎల్లో మీడియా ఈ నిజాలు చూపించదు , వినిపించదు - చంద్రబాబు పీఏకు ఇన్ కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చింది - రూ. 371 కోట్ల ప్రజాధనం ఎక్కడికి పోయింది ? - ప్రజాధనం దోచుకున్న బాబును కాకుంటే ఎవరిని అరెస్ట్ చేయాలి ? - వాటాలు పంచుతాడు కాబట్టే వీరెవ్వరూ ప్రశ్నించరు - లంచాలు తీసుకుంటే తప్పేంటని చెత్తపలుకులు రాసేది ఒకడు - ములాఖత్ లో మిలాఖత్ చేసుకుని పొత్తు పెట్టుకునేది ఇంకొకడు - ప్రజలంతా ఆలోచన చేయాలి - మీ బిడ్డ హయాంలో మీకు మంచి జరిగిందా లేదా చూడండి - మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు అండగా నిలబడండి - మీ అందరి ఆశీస్సులతో రానున్న రోజుల్లోనూ మంచి పాలన అందిస్తాం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు లో నాలుగో విడత కాపు నేస్తం నిధులు విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగం - మీ అందరి ఆశీస్సులతో మంచి కార్యక్రమం కొనసాగిస్తున్నాం - మీ ప్రేమాభిమానాలకు చేతులు జోడించి కృతఙ్ఞతలు చెబుతున్నా - కాపు నేస్తంతో ఒంటరి మహిళలకు మేలు చేస్తున్నాం - వరుసగా ఐదేళ్ల పాటు రూ. 75 వేలు ఆర్ధిక సాయం అందిస్తున్నాం - 3,57,844 మందికి రూ. 536.77 కోట్లు జమ చేస్తున్నాం - లంచాలు, అవినీతికి తావులేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాం - కాపు నేస్తం తో 4 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్ది చేకూరింది - ఒంటరి మహిళలకు ఆర్ధిక స్వాలంబన చేకూర్చడమే లక్ష్యం - 45 నుంచి 60 ఏళ్ల అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచాం - నాలుగేళ్లలో రూ. 2,029 కోట్ల నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం - గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమం అమలు చేయలేదు - ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు - కాపు పేద మహిళలకు అండగా ఉండాలనే ఈ పథకం - కేబినెట్ లో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చాం - ఇది మీ అందరి ప్రభుత్వం - నామినేటెడ్ పోస్టుల్లోనూ కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చాం - కులం, మతం, రాజకీయాలు చూడకుండా పథకాలు అమలు చేస్తున్నాం - అర్హత ఉంటే చాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాం - రూ. 2.30 లక్షల కోట్ల రూపాయలను డీబీటీ ద్వారా అందించాం - నాన్ డీబీటీ ద్వారా కాపు వర్గానికి రూ. 16,914 కోట్ల లబ్ది చేకూరింది - గత ప్రభుత్వం ఈ కార్యక్రమాలు ఎందుకు చేయలేదు ? - చంద్రబాబు గతంలో 10 శాతం కూడా హామీలు నెరవేర్చలేదు - చంద్రబాబు కాపులను అడుగడుగునా మోసం చేశారు - రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసినా చంద్రబాబు మోసం చేశారు - 4 ఏళ్ల పాలనలో కాపుల సంక్షేమానికి రూ. 39,247 కోట్లు ఇచ్చాం - మేనిఫెస్టో లో చెప్పిన దాని కంటే మిన్నగా చేశాం - గత ప్రభుత్వం మంజునాథ కమిషన్ పేరుతో మోసం చేసింది - అవినీతి కేసులో ఆధారాలతో సహా చంద్రబాబు అరెస్ట్ అయ్యారు - అక్రమాలు చేసిన వ్యక్తిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు - చట్టం ఎవరికైనా ఒక్కటే : సీఎం జగన్ ►నాలుగో విడతలో వైఎస్సార్ కాపునేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్. ► సీఎం జగన్ మాట్లాడుతూ.. మీ అందరి ఆశీస్సులతో మంచి కార్యక్రమం కొనసాగిస్తున్నాం. మీ ప్రేమాభిమానాలకు చేతులు జోడించి కృతజ్ఞతలు చెబుతున్నా. కాపునేస్తంతో ఒంటిరి మహిళలకు మేలు చేస్తున్నాం. వరుసగా ఐదేళ్ల పాటు రూ.75వేలు ఆర్థిక సాయం అందిస్తున్నాం. 3,57,844 మందికి రూ.536.77 కోట్లు జమ చేస్తున్నాం. లంచాలు, అవినీతికి తావులేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. కాపు నేస్తంతో 4లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్దిచేకూరింది. 45 నుంచి 60 ఏళ్ల అక్క చెలమ్మలకు అండగా నిలిచాం. ► ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ.. సీఎం జగన్ సంక్షేమ సారథి. సీఎం జగన్‌కు నిడదవోలు ప్రజల తరఫున స్వాగతం. వైఎస్సార్ కాపునేస్తంతో ఒంటరి మహిళలకు ఎంతో లబ్ధి చేకూరింది. గత ప్రభుత్వం హామీల పేరుతో ప్రజలను మోసం చేసింది. ► ముఖ్యమంత్రి జగన్ నిడదవోలు చేరుకున్నారు. ► నిడదవోలు బయలుదేరిన సీఎం జగన్. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు నిడదవోలులో పర్యటించనున్నారు. ► ఈ సందర్బంగా ‘వైఎస్సార్ కాపు నేస్తం’ నాలుగో విడతలో భాగంగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ► అర్హులైన 3,57,844 మంది అక్కచెల్లెమ్మలకు రూ.536.77 కోట్ల మేర ఆర్థిక సాయాన్ని విడుదల చేయనున్నారు. ‘వైఎస్సార్ కాపు నేస్తం’ ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15,000 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయాన్ని అందచేస్తోంది. నేడు అందచేసే సాయంతో కలిపితే ఇప్పటివరకు పథకం ద్వారా మొత్తం రూ.2,029 కోట్లు ఆర్థిక సాయాన్ని అందించినట్లవుతోంది. ► 9:40 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎం జగన్ ► 10:10 నిడదవోలు టౌన్ సుబ్బరాజుపేటలోని హెలిపాడ్ ప్రాంగణానికి చేరుకోనున్నారు. ► 10:20 సభా వేదిక వరకూ రోడ్ షో ► 10:35 సెయింట్ ఆంబ్రోస్ ఉన్నత పాఠశాలలోనీ సభాస్థలి వద్దకు చేరుకుని నిధులు విడుదల చేస్తారు. ► 12:10 ఎలిఫెంట్ ప్రాంగణానికి చేరుకుని స్థానిక నాయకులతో మాట్లాడతారు. ► 12:45 హెలికాప్టర్లో తాడేపల్లికి బయలుదేరుతారు. -
చిన్నారి వైద్యం కోసం ఉదారంగా స్పందించిన సీఎం వైఎస్ జగన్
-
చిన్నారి వైద్యం కోసం ఉదారంగా స్పందించిన సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: చిన్నారి వైద్యం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదారంగా స్పందించారు.. మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. నిడదవోలు శెట్టిపేటకు చెందిన రెండేళ్ల డయానా శాంతి ‘స్పైనల్ మస్క్యులర్‘ వ్యాధితో బాధపడుతోంది. జనవరి 3న సీఎం జగన్ రాజమహేంద్రవరం వచ్చిన సందర్భంగా కలిసి తగిన సహాయం అందించాల్సినదిగా విజ్ఞప్తి చేశారు. డయానా శాంతి ఆరోగ్య పరిస్థితి విని స్పందించిన సీఎం.. ఎయిమ్స్‌లో తగిన వైద్య సేవలు అందచేసేందుకు చొరవ తీసుకున్నారు. పాప మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు రూ. లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని ఆదేశించినట్లు లెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. అంతేగాక నెలకూ రూ.10 వేల పెన్షన్, అవుట్ సోర్సింగ్ కింద డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇవ్వడం జరిగిందని కలెక్టర్ వివరించారు. కాగా, ముఖ్యమంత్రి బుధవారం నిడదవోలు వచ్చిన సందర్భంగా డయానా తల్లి సూర్యకుమారి వైఎస్ జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. అయితే తన కుమార్తె వైద్య సేవల కోసం న్యూ ఢిల్లీకి వెళ్లి రావడం చాలా ఖర్చుతో కూడుకున్నట్లు సీఎంకు తెలియజేశారు. దీనిపై స్పందించిన సీఎం.. ప్రభుత్వ పరంగా సహాయం అందజేస్తామని భరోసా ఇచ్చారు. వైద్య సేవల కోసం న్యూ ఢిల్లీకి వెళ్లి రావడానికి అవసరమైన చేయూతను అందచేయాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం రూ.2 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించడం జరిగిందని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. యూఎస్ఏ నుంచి పాప వైద్యానికి సంబంధించి రిస్డిప్లం (risdiplam) IT gene therapy) ఇంజెక్షన్ ఇవ్వవలసి ఉంటుందన్నారు. ఈ ఇంజెక్షన్ సుమారు రూ.14 కోట్ల రూపాయల ఖరీదు ఉన్న నేపథ్యంలో అందులో భాగంగా కొద్ది నెలల పాటు పాప వైద్య పరీక్షలు నిర్వహించవలసి ఉందన్నారు. తగిన వైద్య సేవలు పొందేందుకు వీలుగా న్యూఢిల్లీకి వెళ్లి రావడం కోసం విమాన ప్రయాణం ఖర్చులు, వసతి తదితర ఖర్చుల తగిన ఆర్థిక సాయానికి సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ మాధవీలత వెల్లడించారు. చదవండి: ప్రతిపక్షాల గొంతుకు మేమెందుకు నొక్కుతాం: ఏపీ డీజీపీ -
చుక్కల్లో చంద్రిక.. ఎన్నో రకాల బుక్స్ చదివాను.. కానీ, ఆ ఒక్కటీ..
అమ్మా! నక్షత్రాలు పగలంతా ఎక్కడికి వెళ్తాయి? నాన్నా! చందమామ రోజుకోరకంగా ఉంటాడెందుకు? తాతయ్యా! చందమామ దగ్గరకు ఏ విమానంలో వెళ్లాలి? రాకెట్లో వెళ్తే నిజంగా... చందమామను తాకవచ్చా! బాల్యానికి ఇలాంటి సందేహాలెన్నో! నేను రాకెట్లో చందమామ దగ్గరకు వెళ్తా. ఇలాంటి తీర్మానాలు మరెన్నో!! ఆ తీర్మానాన్ని నిజం చేస్తానంటోంది కైవల్య. ఆ బాటలో ఇప్పటికే కొన్ని అడుగులు వేసింది. ఇస్రో స్పేస్ క్విజ్‌లో విజేతగా నిలిచింది. అంతరిక్షాన్ని ఔపోశన పడుతోంది ఈ చుక్కల్లో చంద్రిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లాలో ఓ పట్టణం నిడదవోలు. ఆ పట్టణంలో పదో తరగతి విద్యార్థిని కైవల్య. వరల్డ్ స్పేస్ వీక్ సందర్భంగా ఇస్రో గత ఏడాది తణుకు పట్టణంలో నిర్వహించిన స్పేస్ క్విజ్, వృక్తృత్వం, సైన్స్ ఫేర్లలో పాల్గొన్నది. ఆశ్చర్యంగా మూడింటిలోనూ ప్రథమ స్థానమే. ఈ ఏడాది ఇస్రో –నాసాలకు అనుబంధంగా ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న స్పేస్ పోర్ట్ ఇండియా ఫౌండేషన్ ఆస్టరాయిడ్ డే (జూన్ 30) సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతినిధిగా హాజరైంది. అనేక విభాగాల పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచింది. వచ్చే ఏడాది జరిగే నాసా ఒలింపియాడ్ పరీక్షలకు అర్హత సాధించింది. ఆస్టరాయిడ్‌ను గుర్తించి ‘స్పేస్ పోర్ట్ ఇండియా ఫౌండేషన్’ అంబాసిడర్స్ బృందంలో సభ్యత్వాన్ని సాధించింది. తనకు అంతరిక్షం పట్ల ఆసక్తి రేకెత్తడం, అమ్మానాన్నలు తనకు అవసరమైన వనరులను సమకూర్చడం గురించిన అనుభవాలను సాక్షితో పంచుకుంది కైవల్య. ‘‘మా నాన్న శ్రీనివాసరెడ్డి, అమ్మ విజయలక్ష్మి. నాన్న పంచాయితీ ఈవో. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నడుపుతోంది. అమ్మకు సామాజిక దృక్పథం ఎక్కువ. దాంతో చిన్నప్పటి నుంచి చాలా ప్రత్యేకంగా పెంచిందనే చెప్పాలి. థర్డ్ క్లాస్‌లో ఉన్నప్పుడు నాకు తొలిసారిగా ఆస్ట్రానమీ గురించి ఆసక్తి కలిగింది. నా ప్రశ్నలకు సమాధానం చెప్తూనే ఉండేది అమ్మ. ఖగోళశాస్త్రం మీద నా ఆసక్తి గమనించిన అమ్మ నా కోసం ఎన్సైక్లోపీడియా బుక్స్ తెచ్చింది. ఫోర్త్ క్లాస్ హాలిడేస్‌లో వాటిని చదివాను. ఫిఫ్త్ క్లాస్ నుంచి ఈ రంగం మీద బాగా ఫోకస్ పెట్టాను. జనరల్ నాలెడ్జ్ బుక్స్ ఆరు పుస్తకాలు కంఠతా పట్టినట్లు స్టడీ చేశాను. ఆ బుక్స్‌లో చాలా రకాల టాపిక్స్ ఉంటాయి. కానీ ఆస్ట్రానమీ సబ్జెక్ట్ నన్ను కట్టిపడేసేది. చదివేకొద్దీ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటివరకు ఎంతోమంది ఖగోళాన్ని అధ్యయనం చేశారు. విశ్వంలో ఏమేమి ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేశారు. వాళ్లు తెలుసుకున్న విషయాలన్నింటినీ పుస్తకాల్లో రాశారు. వేలాది పేజీల్లో ఉన్న సమాచారం అంతా కూడా విశ్వంలో మనం తెలుసుకోవలసిన విషయాల్లో ఒక్క శాతం ఉంటుందేమో! పోటీలే పాఠాలు! మనకు మనంగా చదువుతూ ఉంటే మనకు అంతా తెలిసిపోయిందనుకుంటాం. పోటీల్లో పాల్గొంటే కొత్త విషయాలు తెలుస్తాయి. ఈ రంగంలో ఇంకా ఏయే పుస్తకాలున్నాయో తెలుస్తుంది. ఎన్ని వెబ్సైట్లలో ఈ సమాచారం లభిస్తుందో తెలుస్తుంది. ఇందుకోసమే రూపొందిన సాఫ్ట్వేర్లు తెలుస్తాయి. నేను ఇప్పటివరకు 30కి పైగా కాంపిటీషన్లలో పాల్గొన్నాను. నా కెరీర్ కూడా ఇందులోనే అని నిర్ణయించేసుకున్నాను కూడా. ఇంటర్లో ఎంపీసీ తీసుకుని ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ ఖగోళశాస్త్రంలోనే చేయాలనుకుంటున్నాను. ఐఐటీ ఖరగ్‌పూర్, ఎమ్ఐటీ చెన్నై, బెంగుళూరు– స్పేస్ సైన్స్ ఇన్స్టిట్యూట్ వంటి వాటిల్లో సీటు తెచ్చుకోవాలనేది నా లక్ష్యం. డాన్స్‌కు ఇక దూరమే! నాకు పెయింటింగ్, పియానో ప్లే చేయడంతోపాటు కరాటే, క్లాసికల్ డాన్స్ కూడా ఇష్టం. స్టడీస్‌కి ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి డాన్స్ ప్రాక్టీస్ చేయడం కుదరదు. మిగిలినవన్నీ కంటిన్యూ చేస్తాను. స్పేస్ పోర్ట్ ఫౌండేషన్ అంబాసిడర్ టీమ్‌లో మెంబర్‌గా స్కూళ్లకు వెళ్లి అవగాహన తరగతుల్లో స్పేస్ గురించి వివరిస్తున్నాను. అమ్మాయిలకు నేను చెప్పేది ఒక్కటే. ‘మనం అమ్మాయిలం కదా, ఈ ఫీల్డ్ ఎలా’ అనే సందేహాలు వద్దు. ఆసక్తి ముఖ్యం. సాధించాలనే కోరిక, చేయగలమనే నమ్మకం ఉంటే మనం చేసి తీరుతాం. అయితే ఇలాంటి రంగంలో ఎదగాలంటే పేరెంట్స్, టీచర్స్ సహకారం చాలా ఉండాలి. మా పేరెంట్స్‌కి, టీచర్స్‌కి ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని చెప్పింది కైవల్య. అంతరిక్ష అధ్యయనం: కుంచాల కైవల్యారెడ్డి, నిడదవోలు ఆస్టరాయిడ్ డిస్కవరీలో ఒక ఆస్టరాయిడ్ని గుర్తించాను. అంతరిక్షాన్ని పాన్స్టర్ టెలిస్కోప్‌తో పరిశీలిస్తూ, మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి ఫొటోలను పంపిస్తారు. ఇందుకోసం ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ ఫొటోలను స్టడీ చేసి కదలికలను గుర్తించడమే ఈ డిస్కవరీ. జర్మనీ– కెనడాల్లోని అంతరిక్ష పరిశోధక సంస్థలు నిర్వహించాయి. నేను ఒక ఆస్టరాయిడ్‌ను గుర్తించాను. గుర్తించిన వెంటనే ‘ఎస్ఐఎఫ్ జీరో వన్ వన్...’ ఇలా ఒక టెంపరరీ నేమ్ ఇస్తాం. ఇలాంటి డిస్కవరీలన్నింటినీ క్రోడీకరించేటప్పుడు సీనియర్ సైంటిస్టులు ఒక పేరును ఖరారు చేస్తారు. ఆ ఆస్టరాయిడ్‌ను గుర్తించిన వారిలో నా పేరు రికార్డ్స్‌లో ఎప్పటికీ ఉంటుంది. జూలై 25వ తేదీన వరŠుచ్యవల్ మీటింగ్‌లో సర్టిఫికేట్ ప్రదానం చేశారు. ఆ కాంపిటీషన్లో ఎనభైకి పైగా దేశాల నుంచి పార్టిసిపేషన్ ఉంది. వారిలో యూఎస్, యూకేలకు చెందిన కొందరు టీచర్స్‌తో టచ్‌లో ఉన్నాను. వారితో సంభాషణ నాలెడ్జ్ షేరింగ్‌కి బాగా ఉపయోగపడుతోంది. – గాడి శేఖర్‌బాబు, సాక్షి, నిడదవోలు -
ఆస్ట్రానమీలో అదరగొట్టింది
నిడదవోలు: జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ, ఆస్ట్రో ఫిజిక్స్ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆన్లైన్ ప్రతిభా పోటీల్లో ఏపీలలోని తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన పదో తరగతి విద్యార్థిని కుంచాల కైవల్యరెడ్డి సత్తా చాటింది. ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్రం అంశాల్లో ఆన్లైన్లో మూడు రౌండ్లలో జరిగిన ప్రతిభా పరీక్షల్లో 82 దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.ఈ పరీక్షల్లో 14 పాయింట్లతో కైవల్యరెడ్డి ద్వితీయ స్థానం సాధించి, సిల్వర్ ఆనర్ సర్టిఫికెట్ పొందింది. -
తొమ్మిదేళ్లుగా వారిద్దరూ డేటింగ్.. చివరకు శ్మశానంలో
నిడదవోలు: తొమ్మిదేళ్లుగా సహజీవనం చేస్తున్న వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. తనువు చాలించాలని నిర్ణయించుకుని వేర్వేరు ప్రదేశాల్లో ఆత్మహత్యకు యత్నించారు. పోలీసులు సరైన సమయంలో స్పందించి వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. నిడదవోలు పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో చోటుచేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. నిడదవోలు కూరగాయల మార్కెట్ సమీపంలో నివాసముంటున్న గూటం దుర్గ అనే యువతితో రాజానగరం సమీపంలోని కలవచర్ల గ్రామానికి చెందిన అంబులెన్స్ డ్రైవర్ దాసోహం రాము సహజీవనం చేస్తున్నాడు. అప్పటికే రాముకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. దుర్గ సొంతూరు ఉండ్రాజవరం మండలం వడ్డూరు కాగా తొమ్మిదేళ్ల కిత్రం ఇంటి నుంచి బయటకు వచ్చి నిడదవోలు చర్ల సుశీల వృద్ధాశ్రమంలో చేరింది. ఆ సమయంలో రాముతో పరిచయమై వివాహేతర సంబంధం బలపడింది. ఈ క్రమంలో వీరికి ఓ పాప పుట్టగా పంగిడిలో ఉంటున్న బంధువులకు ఇచ్చేశారు. అనంతరం దుర్గ ఉపాధి నిమిత్తం దుబాయి వెళ్లింది. అక్కడ కొంతకాలం పనిచేసి నిడదవోలు వచ్చి కూరగాయల మార్కెట్ సమీపంలో అద్దె ఇంట్లో ఉంటోంది. ఆమె దుబాయి నుంచి వచ్చిన తర్వాత కూడా వీరి మధ్య సంబంధం కొనసాగింది. దుర్గ సంపాదించిన సొమ్ముతో రాము అంబులెన్స్ కూడా కొన్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల వీరి మధ్య గొడవలు పెరగడంతో సోమవారం ఆత్మహత్య చేసుకుంటానని రాము ఆమెను బెదిరించాడు. పట్టణంలోని శ్మశానవాటికలో మద్యంలో పురుగు మందు కలిపి తాగాడు. అక్కడి నుంచి బైక్‌పై వచ్చి పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓవర్ బ్రిడ్జి వద్ద దుర్గకు విషయం చెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన దుర్గ అతడి బైక్‌లో ఉన్న పురుగు మందు సీసా తీసి తానూ తాగింది. సమీపంలో ఉన్న పోలీసులు సకాలంలో స్పందించి వారిద్దరినీ స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు వీరిద్దరినీ ఉన్నత వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ కేఏ స్వామి, పట్టణ ఎస్సై పి.నాగరాజు వారి నుంచి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటోవాలా.. నేడు నిడదవోలు వైస్ చైర్మన్‌గా
నిడదవోలు: ఆయన ఆటో డ్రైవర్.. ఇప్పుడు నిడదవోలు పురపాలక సంఘం రెండో వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆటోడ్రైవర్ యలగాడ బాలరాజును వైస్ చైర్మన్‌గా ఎంపికచేయడంపై అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పురపాలక సంఘాల్లో ఇద్దరు మున్సిపల్ వైస్ చైర్మన్లు ఉండాలనే నూతన ఒరవడికి సీఎం జగన్ శ్రీకారం చుట్టడంతో నిడదవోలు పట్టణంలో బాలరాజును పదవి వరించింది. యలగాడ వెంకన్న, రాములమ్మ ఆరుగురు సంతానంలో మూడో కుమారుడు బాలరాజు. చిన్నతనం కష్టాలు ఎదుర్కొంటూ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. చిన్నతనంలో సైకిల్ మెకానిక్‌గా పని చేసి కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ఆ తర్వాత సొంతంగా ఆటో కొనుక్కొని డ్రైవర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆపదలో తోటివారికి సాయం చేస్తూ అందరి మన్ననలు పొందేవారు. 2008 నుంచి 2014 వరకు హరిజన యువజన సేవా సంఘం అధ్యక్షుడిగా.. 2015లో మదర్ థెరిస్సా ఆటో యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. మొదట కాంగ్రెస్ పార్టీలో తిరిగిన అతను 2014లో వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌గా పోటీ చేసి 350 ఓట్లతో గెలుపొందారు. అప్పటి నుంచి వార్డులో ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి ముందుండేవారు. ఆటో నడుపుతూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటూనే మరోపక్క ప్రజాప్రతినిధినిగా తన బాధ్యతల్ని సమర్ధవంతంగా పోషించారు. బాలరాజు పార్టీకి చేస్తున్న సేవలు గుర్తించి రెండోసారి కౌన్సిలర్ సీటు ఇచ్చారు. తాజా మున్సిపల్ ఎన్నికల్లో 13 వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసి 385 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. -
నిడదవోలులో విజిలెన్స్ దాడులు
పశ్చిమగోదావరి, నిడదవోలు : నిడదవోలు పట్టణంలో పలు దుకాణాలపై శుక్రవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ వరదరాజు ఆదేశాల మేరకు పట్టణంలో గణేష్‌చౌక్ సెంటర్లోని దేవి విజయలక్ష్మీ ఫ్లోర్ అండ్ అయిల్ మిల్ దుకాణంలో తనిఖీలు చేపట్టారు. ఈ దుకాణానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవని నిర్ధారించారు. అనుమతులు లేకుండా లూజ్‌గా నూనె ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వేరుశనగ, పామాయిల్, నువ్వుల నూనె, కారం శాంపిల్స్ సేకరించారు. వీటిని హైదరాబాద్‌లో ల్యాబ్‌కు పంపించిన అనంతరం షాపు యజమాని బి.సత్యనారాయణపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఇదే సెంటర్లో విజయదుర్గ స్వీట్స్ అండ్ బేకరీ, కూల్‌డ్రింక్స్ షాపులో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ షాపునకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవని గుర్తించారు. షాపులో కమర్షియల్ గ్యాస్ సిలెండర్లకు బదులుగా డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్లు ఉన్నట్లు గుర్తించారు. కాలపరిమితి దాటిన క్రీమ్ బాటిల్స్ ఉన్నట్లు నిర్ధారించారు. షాపు యజమాని ఆకుల దుర్గా ఆంజనేయ ప్రసాద్‌పై 6(ఎ)కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై కె.ఏసుబాబు తెలిపారు. తనిఖీల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తహసీల్దారు పి.రవికుమార్, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
ఏటీఎం పగులకొట్టి..
సాక్షి, నిడదవోలు(పశ్చిమగోదావరి) : సమిశ్రగూడెం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) వద్ద ఉన్న ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగినట్లు ఎస్సై టీవీ సురేష్ శుక్రవారం తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం ఈనెల 5వ తేదీ సాయంత్రం ఐఓబీ ఏటీఎంలో రూ.5 లక్షల నగదును పెట్టగా అర్థరాత్రి రెండుగంటల సమయంలో ఒక వ్యక్తి చొరబడి ఏటీఎంను పగులకొట్టాడు. సీసీ కెమెరాలను గోడలవైపు తిప్పాడు. ఏటీఎంలోని నగదును దోచేయడానికి ప్రయత్నించగా లాకర్ తెరవకపోవడంతో దొంగ వెళ్లి పోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఏటీఎంలో ఇంకా రూ.4.47 లక్షల నగదు ఉన్నట్లు బ్యాంక్ మేనేజర్ యాలంగి రాజేష్ ఫోన్‌కు శుక్రవారం ఉదయం మెసేజ్ వచ్చింది. బ్యాంక్ వద్ద ఘట నాస్థలాన్ని, బ్యాంకులోని సీసీ కెమెరా పుటేజ్‌ను కొవ్వూరు డీఎస్పీ కె.రాజేశ్వరరెడ్డి, నిడదవోలు సీఐ కేఏ స్వామి పరిశీలించారు. ఏటీఎంలో నగదును చోరీ చేసేందుకు వచ్చిన దొంగ ముఖానికి నలుపు గుడ్డ కట్టుకుని, చేతులకు తొడుగులు వేసుకుని లోపలికి వచ్చి ఏటీఎం పగుల కొట్టినట్లు తెలుస్తోంది. కొవ్వూరు నుంచి క్లూస్‌టీం వచ్చి ఏటీఎంలోని వేలిముద్రలను సేకరించారు. బ్యాంక్ మేనేజర్ రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ చెప్పారు. -
కాలువలోకి దూసుకెళ్లిన కారు.. డ్రైవర్ మృతి
సాక్షి, నిడదవోలు(పశ్చిమగోదావరి) : పశ్చిమడెల్టా ప్రధాన కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో కొవ్వూరు ఇందిరమ్మకాలనీకి చెందిన చిర్రా శివరామకృష్ణ (27) మరణించాడు. సమిశ్రగూడెం ఇన్చార్జ్ ఎస్సై కె.ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్న శివరామకృష్ణ పెరుమళ్ల సుబ్రహ్మణ్యానికి చెందిన ఏపీ05డీడీ 2499 నంబర్‌గల కారు తీసుకుని గురువారం రాత్రి ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ భీమవరం బయలుదేరాడు. నిడదవోలు మండలం విజ్జేశ్వరం సమీపంలో కారు కాలువలోకి దూసుకెళ్లింది. అతను వెంటనే కారు కాలువలోకి వెళ్లిపోయిందని, తాను మునిగిపోతున్నానని తల్లి వరలక్ష్మి, స్నేహితుడు ముళ్లపూడి సురేష్‌లకు ఫోన్ చేసి చెప్పాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గురువారం అర్ధరాత్రి శివరామకృష్ణ బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొవ్వూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు చేరుకుని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం ఉదయం కొవ్వూరు సీఐలు ఎంవీవీఎస్ మూర్తి, ఎం.సురేష్ తహసీల్దార్ ఎల్.జోసెఫ్ ఘటనాస్థలాన్ని పరిశీలించి కాలువలో నుంచి కారును వెలికితీసేందుకు తీసుకోవాల్సిన చర్యలను చేపట్టారు. కాలువకు నీటిని తగ్గించి అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పడవ కూలీలు కారు ఆచూకీ కోసం శుక్రవారం ఉదయం నుంచి వెదకగా 11 గంటల సమయంలో కారుని గుర్తించారు. క్రేన్ సహాయంతో దానిని బయటకు తీశారు. కారులో ఉన్న శివరామకృష్ణ మృతదేహన్ని చూసి తల్లి వరలక్ష్మితో పాటు కుటుంబసభ్యులంతా గుండెలవిసేలా రోదించారు. మృతదేహన్ని నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. శివరామకృష్ణకు భార్య దుర్గాదేవితో పాటు ఒక కుమార్తె ఉంది. కారు వేగంగా నడుపుతుండటంతోపాటు సెల్‌ఫోన్ మాట్లాతుండటంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. తల్లి వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ప్రసాద్ చెప్పారు. -
టెన్త్ పాసైన ఆనందంలో రోడ్డుపై కొస్తే...
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. అయితే, టెన్త్ ఫలితాలు ఓ కుటుంబంలో తీరని దుఃఖం నింపాయి. పాస్ అయిన ఆనందంలో కూల్‌డ్రింక్ కొనుక్కుందామని రోడ్డుపైకి వచ్చిన తిరుగుపల్లి రుక్మిణి (15) అనే విద్యార్థిని ప్రమాదానికి గురైంది. టాటాఏస్-మ్యాజిక్ వాహనం ఢీకొట్టడంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. తోడుగా వచ్చిన ఆమె చెల్లెలికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన నిడదవోలు మండలం కలవచర్ల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గాయపడిన చిన్నారిని నిడదవోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (చదవండి :ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల) ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 94.88 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, బాలికలు (95.09), బాలుర(94.68)పై పైచేయి సాధించారు. తూర్పు గోదావరి జిల్లా (98.19) టాప్‌లో నిలువగా నెల్లూరు (83.19) జిల్లా చివరిస్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,690 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 5,464 పాఠశాలల విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. మూడు పాఠశాలల్లో సున్నాశాతం ఫలితాలు నమోదయ్యాయి. జీపీఏ 10 పాయింట్లతో 33,972 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జూన్ 17 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. -
గర్భిణి మృతి.. హత్యా? ఆత్మహత్యా?
నిడదవోలు(పశ్చిమగోదావరి): ఇద్దరూ ఉన్నత చదువులు చదివారు.. దూర ప్రాంతంలో మంచి ఉద్యోగాలు చేస్తున్న సమయంలో కొంత కాలంగా కుటుంబ కలహాలు ప్రారంభమయ్యాయి. చివరకు అత్తారింటి బాధలకు నిండు గర్భిణి బలైపోయింది. నిడదవోలుకు చెందిన రావి జయమాధవి (28) బెంగళూరు కేఆర్ పురంలో ఈనెల 13న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాలు ఇవి. నిడదవోలు 4 వార్డులో నివాసముంటున్న రావి ధనంజయరావు, ధనలక్ష్మీలకు కుమార్తె జయమాధవి, కుమారుడు శ్రీనివాసరావు సంతానం. శ్రీనివాసరావు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. తండ్రి ధనంజయరావు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించాడు. 2018 మార్చిలో కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన గాదిరెడ్డి శివ సుబ్రహ్మణ్యంతో జయమాధవి వివాహం చేశారు. వివాహ సమయంలో వరకట్నం రూ.30 లక్షలు, 300 గ్రామలు బంగారం, రూ.2 లక్షల ఆడపడుచు కట్నం ఇచ్చారు. బెంగళూరు కేఆర్ పురంలో జయమాధవి డెలెట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. భర్త శివ సుబ్రహ్మణ్యం అదే నగరంలోని ఐబీఎం కంపెనీలో డెలివరీ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. జయమాధవి ఇటీవల పర్సనల్ లోన్ తీసుకోవడంతో భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తీసుకున్న రుణానికి ప్రతినెలా ఈఎంఐలు కడుతోంది. రుణం ఎందుకు తీసుకోవలసి వచ్చిందో చెప్పమని భర్త వేధించడం ప్రారంభించాడు. ఆమె ఎనిమిది నెలల గర్భిణి. జయమాధవి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని అక్కడ నుంచి నిడదవోలులోని ఆమె పుట్టింటికి సమాచారం అందింది. తన కుమార్తె ఉరి వేసుకునేంత పిరికిది కాదని, ఆమెను భర్త, అత్తగారు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రికరించే ప్రయత్నం చేశారని ధనంజయరావు ఆరోపిస్తున్నాడు. ఎనిమిది నెలల గర్భిణిని పొట్టన పెట్టుకున్నారని కన్నీరు మున్నీరయ్యాడు. తన కుమార్తె గొంతు మీద గాయాలు ఉన్నాయని, దారుణంగా చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బెంగళూరు కేఆర్ పురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్నారు. పర్సనల్ లోన్ ఎందుకు తీసుకుంది... ఇటీవల జయమాధవి పర్సనల్ లోన్ తీసుకోవడంతో భర్త బాధిస్తున్నాడని బంధువులు చెబుతున్నారు. బెంగళూరు వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్యం ఎంతో ప్రేమగా తమ ముందు నటించేవాడని, అక్కడ నుంచి వచ్చాక మళ్ళీ ఇబ్బందులు పెట్టేవాడని ఆమె బంధువులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే పట్టణంలో పాటిమీద సెంటర్లో ఉన్న సిరి సెల్ షాపు యజమాని బ్రాహ్మణగూడెంకు చెందిన పుల్లేటికుర్తి చంద్రశేఖర్ తమ ఇంటికి వచ్చి జయమాధవి ఫోటోలు చూపించి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు గత ఏడాది డిసెంబర్లో నిడదవోలు పట్టణ పోలీస్ స్టేషన్ ఆమె తల్లిదండ్రులు ధనంజయరావు, ధనలక్ష్మి ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో జయమాధవి పర్సనల్ లోన్ ఎందుకు తీసుకోవలసి వచ్చిందనే అనుమానం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. -
కొడుక్కి జాబిచ్చేవాడు పోవాలి : వైఎస్ షర్మిల
సాక్షి, పశ్చిమ గోదావరి : గత ఎన్నికల్లో జాబు రావాలంటే బాబు రావాలని చెప్పిన చంద్రబాబు కేవలం తన కొడుక్కు మాత్రమే ఉద్యోగం ఇచ్చుకున్నాడని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల విమర్శించారు. అఆలు కూడా పుప్పు గారికి మూడు మంత్రి పదవులు అవసరమా అని ఆమె ప్రశ్నించారు. టీడీపీ మోసపూరిత హామీలను నమ్మొద్దని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గారడీ బాబుకు ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలి. అయిదేళ్లు అధికారంలో ఉండి అధ్వాన పాలన అందించిన చంద్రబాబును ‘నిను నమ్మం బాబు’ అని సాగనంపాలని పిలుపునిచ్చారు. ‘కేజీ నుంచి పీజీ విద్య, ఆడపిల్ల పుడితే రూ.25 వేలు, నిరుద్యోగులకు నెలకు రూ.2 వేలు ఇస్తామన్న బాబు సర్కారు మాట తప్పింది. టీడీపీకి ఓటు వేయాలని మీ ఇంటికొచ్చిన తెలుగుదేశం నాయకులను అడగండి. హామీలను అమలు చేయకుండా బాకీ పడిన సొమ్ము సంగతి తేల్చండని నిలదీయండి’ అని ప్రజలను కోరారు. బస్సు యాత్ర నిర్వహిస్తున్న షర్మిల గురువారం పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... బాబుకు ఒంటరిగా వచ్చే సీన్ లేదు.. ‘మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద ప్రతి మే మాసంలో రూ. 12500 రూపాయలు ఇస్తారు. గిట్టుబాటు ధరకై 3 వేల కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తారు. సున్నా వడ్డికే రుణాలు ఇస్తారు. కాలేజీ విద్యార్థులు ఏ కోర్సు అయినా చదవచ్చు. ఏ కోర్సు చదివిన ప్రభుత్వం ఉచితంగా చదివిస్తుంది. ఆరోగ్య శ్రీలో కార్పొరేట్ ఆస్పత్రులను చేరుస్తాం. పిల్లలను బడికి పంపించడానికి తల్లిదండ్రులకు రూ. 15వేలు ఇస్తాం. అవ్వలకు తాతలకు పెన్షన్లు రూ. రెండు వేల నుంచి క్రమంగా మూడు వేలకు పెంచుతాం. వికలాంగులకు పెన్షన్లు మూడు వేలు ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ మహిళలకు ఆర్థికసాయంగా రూ.75వేలు ఇస్తాం. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా జి.శ్రీనివాసనాయుడు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా మార్గాని భరత్‌ను గెలిపించండి. జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వండి. చంద్రబాబు అబద్దాలు ప్రచారం చేస్తూ కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుంటున్నామని ఆరోపిస్తున్నారు. మాకు ఎవరితో పొత్తు అవసరం లేదు. సింహం సింగిల్ గానే వస్తుంది. నక్కలే గుంపులుగా వస్తాయి. అందుకే చంద్రబాబు కాంగ్రెస్, జనసేనతో కలిసి వస్తున్నారు. ఏ పొత్తు లేకుండా చంద్రబాబు ఇంతవరకు ఎన్నికలకే రాలేదు. 11వతేది ఎన్నికలు ఉన్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలచుకోండి’ అని వైఎస్ షర్మిల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
కొడుక్కి జాబిచ్చేవాడు పోవాలి : వైఎస్ షర్మిల
-
నిడదవోలులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీనివాస నాయుడు ప్రచారం
-
నిడదవోలు.. టీడీపీలో విభేదాలు
సాక్షి, నిడదవోలు : నిడదవోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమన్నా యి. సీటు కోసం అన్నదమ్ముల మధ్య పోటీ నెలకొంది. దీంతో సీటు కేటాయింపును పార్టీ అధిష్టానం పెండింగ్‌లో పెట్టింది. 2014 ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్‌ను బూరుగుపల్లి శేషారావుకు ఇప్పించడంలో అతడి అన్న బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ వెన్నుదన్నుగా నిలిచారు. అయితే అనంతరం కుటుంబంలో చెలరేగిన తగాదాలు రోడ్డుకెక్కడంతో ఈసారి వేణుగోపాలకృష్ణ కూడా బరి లో నిలిచారు. నిడదవోలు సీటును తనకే టాయించాలని వేణుగోపాలకృష్ణ పట్టుబట్టడం, సిట్టింగ్ స్థానాన్ని మరలా తనకే ఇవ్వాలని శేషారావు భీష్మించడం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. నాలుగున్నరేళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న టీడీపీ అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. శశి విద్యాసంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ తొలిసారి టికెట్ కోసం రోడ్డెక్కడం కలకలం రేపింది. వీరితో పాటు కుందుల సత్యనారాయణ కూడా సీటు ఆశించడంతో నియోజకవర్గంలో టీడీపీ మూడు వర్గాలుగా మారింది. ఇటీవల అమరావతిలో జరిగిన నియోజకవర్గ సమీక్ష సమావేశంలోనూ శేషారావుకు సీటు కేటాయించవద్దని కుందుల వర్గం ప్లకార్డులు ప్రదర్శించడం వి వాదాస్పదమైంది. ఆయా వర్గాలు అమరావతిలో మకాం వేసి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. పలు విద్యాసంస్థల యాజమాన్యాలను అమరావతికి తీసుకువెళ్లి వేణుగోపాలకృష్ణ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా రు. టికెట్ ఎవరికి కేటాయిస్తే ఎలాంటి పరి ణామాలు ఎదురవుతాయోననే ఆలోచనలో నిడదవోలు పంచాయితీ అధిష్టానానికి పెను సవాల్‌గా మారింది. చివరిసారిగా జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే శేషారావు, వేణుగోపాలకృష్ణను సీటు ఎవరికి కావాలో తేల్చుకోమని అధిష్టానం చెప్పింది. అయితే వీరిద్దరి మధ్య ఎటువంటి చర్చలు జరగకపోవడంతో విభేదాలు కొలిక్కిరాలేదు. ఎన్నికల నామినేషన్ల గడువు సమీపిస్తున్నా సీటు వ్యవహారంలో సస్పెన్షన్ వీడలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే శేషారావు వైపే టీడీపీ అధిష్టానం మొగ్గుచూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. -
తల్లితండ్రుల గొడవ..విద్యార్థిని ఆత్మహత్య !
పశ్చిమగోదావరి, నిడదవోలు: నిడదవోలు పాటిమీద సెంటర్లోని పోస్టాఫీసు వీధిలో ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. వివరాలిలా ఉన్నాయి.. పోస్టాఫీసు వీధిలో దుర్రు నాగమణి అనే మహిళ భర్త నాగరాజు మృతిచెందడంతో ఈగల అప్పలరాజు అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. మొదటి భర్త నాగరాజు ద్వారా ఆమె ప్రియబాంధవి అనే అమ్మాయికి జన్మనిచ్చింది. నాగమణి అప్పలరాజు, ప్రియబాంధవితో కలిసి పోస్టాఫీసు వీధిలో నివాసముంటోంది. ప్రస్తుతం ప్రియభాందవి (20) తణుకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈనేపథ్యంలో ఇటీవల అప్పలరాజు, నాగమణి తరచూ గొడవలు పడుతున్నారు. సోమవారం ప్రియబాంధవికి నీరసంగా ఉండటంతో కళాశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంది. మళ్లీ భార్యభర్తలు గొడవపడటంతో పాటు అప్పలరాజు ప్రియబాంధవిని తిట్టాడు. దీంతో తల్లి నాగమణి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. మనస్తాపం చెందిన ప్రియబాంధవి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుంది. అరగంట తర్వాత ప్రియబాంధవి ఆత్మహత్య చేసుకుందని అప్పలరాజు భార్య నాగమణికి సమాచారం ఇచ్చాడు. లబోదిబోమంటూ ఇంటికి చేరుకున్న నాగమణి ఇంట్లోని గదిలోకి వెళ్లి చూడగా ప్రియబాంధవి ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని విగతజీవిగా వేలాడుతూ కనిపించింది. తన కుమార్తె పిరికి కాదని, భర్త అప్పలరాజు వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని నాగమణి రోదించింది. అప్పలరాజు గతంలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేశాడు. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. కు మార్తె చనిపోయినా సంఘటన స్థలానికి రాకపోవడంతో అతనిపై పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టణ ఎస్సై జి.సతీష్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తల్లి, బంధువుల నుంచి వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
జనసేన పార్టీ గుర్తును ప్రకటించిన పవన్
-
పార్టీ గుర్తును ప్రకటించిన పవన్
సాక్షి, నిడదవోలు : నిడదవోలులో జరిగిన బహిరంగ సభలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఆ పార్టీ గుర్తును ప్రకటించారు. ‘పిడికిలి’ జనసేన పార్టీ గుర్తుగా ఆయన పేర్కొన్నారు. సమాజంలో అందరి ఐక్యతకు చిహ్నంగా పిడికిలి ఉంటుందని ఆయన అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీడీపీపై నిప్పులు చెరిగారు. రాజకీయాల్లో తనను తాను ఎన్టీఆర్‌గా పోల్చుకుంటూ వెన్నుపోటు పొడిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేజీ బేసిన్ ప్రజలందరిదని, దానిలో వాటా ఏపీ ప్రజలందరి హక్కు అని పేర్కొన్నారు. కాకినాడ పోర్టు నుంచి టీడీపీకి చెందిన ఒక వ్యవస్థ ద్వారా టన్నులకొద్ది రేషన్ బియ్యం ఆఫ్రికాకు తరలిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి అనుభవజ్ఞులైనవారు కావాలనే 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబుకు సపోర్ట్ చేశానన్నారు. నిడదవోలులో ఆర్వోబీ బ్రిడ్జి నిర్మించలేకపోవడానికి ఇక్కడి పాలకులే కారణమని ఆరోపించారు. -
ముగిసిన 184వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర
-
185వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, నిడదవోలు: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 185వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. ఆదివారం ఉదయం ఆయన నిడదవోలు నైట్ క్యాంప్ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి ధారవరం, మర్కొండపాడు, చంద్రవరం, మల్లవరం, గౌరిపల్లి మీదగా ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు. ముగిసిన 184వ రోజు పాదయాత్ర వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 184వ రోజు పాదయాత్రను ముగించారు. ఇవాళ ఆయన 12.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. మునిపల్లి, పెండ్యాల క్రాస్, కలవచర్ల, డి.ముప్పవరం, సమిశ్రగూడెం మీదగా నిడదవోలు వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగింది. వైఎస్ జగన్ ఇప్పటివరకూ 2,283.8 కిలోమీటరు నడిచారు. -
నిడదవోలు శివారులో రోడ్డు ప్రమాదం
-
విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల హల్చల్
సాక్షి, పశ్చిమ గోదావరి : విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. నిడదవోలు సమీపంలోని కాల్దరి - సత్యవాడ స్టేషన్ల మధ్య రైలు చైన్ లాగిన దొంగలు మహిళల మెడలో బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఎస్ 6 నుంచి ఎస్ 13 వరకూ గల బోగీల్లో దుండగులు దోపిడికి పాల్పడినట్లు తెలిసింది. దోపిడి సమయంలో 28 నిమిషాల పాటు రైలు మార్గం మధ్యలో రైలు నిలిచిపోయిందని బాధితులు తెలిపారు. సుమారు 170 గ్రాముల బంగారాన్ని దుండగులు అపహరించుకెళ్లినట్లు సమాచారం. దాదాపు 10 మంది దుండగులు ఈ దోపిడిలో పాల్గొన్నట్లు తెలిసింది. నిడదవోలు రైల్వే స్టేషన్ పీఎస్‌లో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సిద్ధాంతి కిడ్నాప్ నిడదవోలులో కలకలం
నిడదవోలు : నిడదవోలు పట్టణం చిన కాశిరేవు సమీపంలో నివాసముంటున్న ప్రముఖ సిద్ధాంతి ప్రక్కి వీరభద్రరావు శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో కిడ్నాప్‌కు గురయ్యారు. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న సిద్ధాంతి ఇంటికి టాటా సుమోలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు సివిల్ దుస్తుల్లో వచ్చారు. ఇంటిలో స్నానానికి ఉపక్రమిస్తున్న వీరభద్రరావును అటకాయించారు. ఆయన సెల్‌ఫోన్ తీసుకుని స్విచ్ఆఫ్ చేశారు. విజయవాడ ఇంటిలిజెన్స్ పోలీసులమని పరిచయం చేసుకున్నారు. మీతో పనిఉందని, విజయవాడ ఇంటిలిజెన్స్ అధికారి రమ్మంటున్నారని చెప్పారు. ఉదయం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని బయటకు వెళ్లే అలవాటు ఉన్న ఆయనను తీసుకువెళ్ళడంతో భార్యకు అనుమానం వచ్చింది. స్నానం కూడా చేయనివ్వకుండా ఎందుకు తీసుకువెళుతున్నారని భార్య సూర్యకుమారి వారిని ప్రశ్నించగా సాయంత్రానికి తిరిగి పంపించేస్తామని చెప్పారు. మెయిన్ రోడ్డుకు 100 అడుగుల దూరంలో ఉన్న ఇంటి నుండి వీరభద్రరావును నడిపించుకుంటూ తీసుకెళ్ళారు. రోడ్డుపైకి రాగానే టాటా సుమోలో తీసుకువెళ్ళి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి నుండి సిద్ధాంతి బయటకు వెళ్ళిన పది నిమిషాలకు భార్య ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ చేసి ఉండటంతో ఏం జరిగింది... ఎక్కడకు తీసుకుని వెళ్ళారో తెలియక బంధువులు ఆందోళన చెందుతున్నారు. సిద్ధాంతికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు బెంగళూరు, హైద్రాబాద్‌లో ఉంటున్నారు. కిడ్నాప్ సమయంలో ఇంటిలో వీరభద్రరావుతో పాటు భార్య ఒక్కరే ఉన్నారు. నిడదవోలు రైల్వే చీఫ్ బుకింగ్ సూపర్వైజర్గా ఆరు నెలల క్రితం పదవీ విరమణ చేసిన వీరభద్రరావు జ్యోతిష్యం, జాతకాలు చెప్పడంలో మంచి పేరు సంపాదించారు. ఆయన చెప్పింది చాలా వరకు జరుగుతుందని కొందరి నమ్మకం. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉన్నత స్థాయి అధికారులు, న్యాయమూర్తులు ప్రతీ ఏటా ఆయన ఇంటికి వచ్చి జాతకాలు, జ్యోతిష్యం చెప్పించుకుంటారు. అసలు ఏం జరిగింది. ఎందుకు కిడ్నాప్ చేశారనే విషయం ఎవరికీ అంతుచిక్కడం లేదు. కొవ్వూరు డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు, నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణలు తమ సిబ్బందితో వీరభద్రరావు ఇంటికి చేరుకున్నారు. ఆయన భార్య సూర్యకుమారి నుంచి వివరాలు సేకరించారు. పట్టణంలో వివిధ సెంటర్ల ద్వారా తెల్లవారు జాము నుండి వాహనాల రాకపోకలను సీసీ పుటేజీల ద్వారా పరిశీలిస్తున్నారు. రెండు టాటా సుమో వాహనాలు తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. సిద్ధాంతి ఇంటి చుట్టు పక్కల ఉన్న షాపుల యజమానులను ఆరా తీస్తున్నారు. పట్టణంలో ఉన్న లాడ్జీలలో ఉన్న రికార్డులను పరిశీలిస్తున్నారు. భార్య సూర్యకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిడదవోలు పట్టణ పోలీసులు కిడ్నాప్ కేసుగా నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్‌పై భిన్న కథనాలు : నిడదవోలుకు చెందిన ప్రముఖ సిద్థాంతి వీరభద్రరావు కిడ్నాప్‌పై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కిడ్నాప్ సమాచారంతో పట్టణంలో కలకలం రేగింది. అసలు సిద్ధాంతిని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు, అసలు అంత అవసరం ఎవరికి ఉందనేది చర్చించుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం విజయవాడ టాస్క్ఫోర్సు పోలీసులు తీసుకువెళ్ళి ఉంటారని భావిస్తున్నారు. సిద్ధాంతి వీరభద్రరావు నిడదవోలు రైల్వే చీఫ్ బుకింగ్ సూపర్వైజర్గా ఆరు నెలల క్రితం పదవీ విరమణ చేశారు. పట్టణంలో పదవీ విరమణ కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా నిర్వహించారు. సిద్ధాంతిగా రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వీరభద్రరావు పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి ఎంపీలు, న్యాయమూర్తులు, ఎమ్మెల్యేలు, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. గతంలో డీజీపీ స్థాయి అధికారి కూడా యాగం చేయించుకున్నారు. ఎవరితో విరోధాలు కూడా లేని వీరభద్రరావును కీలకమైన అంశంలో టాస్క్ఫోర్సు పోలీసులు తీసుకువెళ్ళారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయనను హైదరాబాద్ పోలీసులు తీసుకెళ్లి ఉంటారని కొందరు అనుమానిస్తున్నారు. -
నిడదవోలులో కూలిన తొంభై ఏళ్ల నాటి బ్రిడ్జి
-
నిడదవోలులో కుప్పకూలిన బ్రిడ్జి
సాక్షి, ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో గడ్డర్ బ్రిడ్జి అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. నిడదవోలు నుంచి కాశి రేవుకు వెళ్లే ఈ బ్రిడ్జిని సుమారు తొంభై ఏళ్ల క్రితం బ్రిటిష్ వారు తమ రాకపోకల నిమిత్తం నిర్మించారు. కాగా 2014లో ఈ బ్రిడ్జి పునర్నిర్మాణం చేపట్టినప్పటికీ పర్యవేక్షణ లోపంతో పనులు నత్తనడకన సాగాయి. బ్రిడ్జి కూలికపోవడంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే స్థానిక టింబర్ డిపో నిత్యం అధిక లోడుతో రాకపోకలు సాగించడంతోనే ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వసతికి దూరం
వసతి కోసం కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తోన్న లక్షలాది రూపాయల లబ్ధి పేద విద్యార్థినులకు చేరడం లేదు. ప్రైవేట్ వ్యక్తులు ఆయా భవనాల్లో పాగా వేసి సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నారు. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చి కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థినులకు వసతి అందకపోవడంతో అవస్థలు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నెరవేరడం లేదు. జిల్లాలో యూజీసీ నిధులతో నాలుగు కళాశాలల్లో నిర్మించిన బాలికల వసతి గృహాలు అక్కరకురావడం లేదు. నిడదవోలు : జిల్లాలోని పలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిధులతో వసతి గృహాలను నిర్మించారు. వీటిలో కొన్ని నిర్మాణాలు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా ఉపయోగంలోకి రావడం లేదు. కొన్నిచోట్ల ఇతర అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. వీటిని వినియోగంలోకి తీసుకురావడంలో అధికారులు చొరవచూపడం లేదు. నిడదవోలు.. యోగా క్లబుల ఆక్రమణ : నిడదవోలు వెలగపూడి దుర్గాంబ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో రూ.60 లక్షల యూజీసీ నిధులతో వసతి గృహాన్ని నిర్మించారు. రెం డు అంతస్తుల భవనంలో కింద అంతస్తులో నాలుగు విశాలమైన గదులు, పైన అంతస్తులో రెండు విశాల గదులతో పాటు డైనింగ్ హాల్ నిర్మించారు. భవనాన్ని ప్రారంభించి రెం డేళ్లు గడస్తున్నా విద్యార్థినులకు వసతి కల్పించలేదు. హాస్టల్ నిరుపయోగంగా ఉండటంతో కొందరు సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరికొందరు ఉదయం వేళలో వ్యాయామం, యోగా శిక్షణ తరగతుల నిర్వహించుకుం టున్నారు. పట్టణంలోని రెండు యోగా క్లబ్‌ల సభ్యులు అనధికారంగా మూడు గదులను సొంత అవసరాలకు వాడుకుం టున్నాయి. వారి వస్తువులు, వ్యాయామ యంత్రాలను కూ డా ఇక్కడే ఉంచడంతో పాటు వసతి గృహ తలుపులకు తా ళాలు సైతం వేస్తున్నారు. మరుగుదొడ్లకు కూడా తాళాలు వేయడంతో కనీసం ఇవి కూడా విద్యార్థినులకు ఉపయోగపడటం లేదు. రాత్రిళ్లు కొందరు యువకులు చేరి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హాస్టల్ తలుపులు, కిటికీలు ధ్వంసమవుతున్నాయి. నిడదవోలు ఎస్వీఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని వసతి గృహాన్ని రూ.20 లక్షలతో నిర్మించారు. ఇక్కడా విద్యార్థులకు వసతి కల్పించలేదు. దీంతో వీటిని తరగతి గదులుగా ఉపయోగిస్తున్నారు. పాలకొల్లులో కుట్టు శిక్షణ కేంద్రం పాలకొల్లు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో యూజీసీ నిధులు రూ.70 లక్షలతో వసతి గృహం నిర్మించారు. ఇక్కడా ఒక్క విద్యార్థినికి కూడా వసతి కల్పించలేదు. ప్రస్తుతం కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో 80 మంది మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్నారు. తాడేపల్లిగూడెం.. నిరుపయోగం తాడేపల్లిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యూజీసీ నిధలు రూ.50 లక్షలతో ఎనిమిది గదుల భవనాన్ని నిర్మించారు. భ వనం నిరుపయోగంగా ఉండటంతో సాంఘిక సంక్షేమ శాఖకు అప్పగించాలనే ఆలోచనలో యాజమాన్యం ఉంది. తణుకు.. నిధుల కొరత తణుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యూజీసీ నిధులు రూ.11.28 లక్షలతో చేపట్టిన వసతి గృహం నిధులు సరిపోకపోవడంతో అసంపూర్తిగా మిగిలిపోయింది. యూజీసీ నిధుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నింటిపై ఉన్నతాధికారులు చొరవచూపి ఉపయోగంలోకి తీసుకురావాలని విద్యార్థినులు కోరుతున్నారు. ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి గోపాలపురం మండలం జగన్నాథపురం నుంచి వచ్చి ఇక్కడ బీజెడ్సీ చదువుతున్నా. రోజూ రాకపోకలకు ఇబ్బంది పడుతున్నా. సమయానికి తరగతులకు హాజరుకాలేకపోతున్నా. వసతి గృహాన్ని వినియోగంలో కి తీసుకువచ్చేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. – కేందేటి లక్ష్మి, బీఎస్సీ, ఎస్వీడీ డిగ్రీ కళాశాల, నిడదవోలు డైనింగ్ గదులు కేటాయించాలి ఇంటర్, డిగ్రీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. దేవరపల్లి మండలం త్యాజంపూడి నుంచి వస్తున్నా. హాస్టల్ ప్రారంభిస్తే ఇక్కడే ఉండి చదువుకుంటాను. అప్పటివరకు కనీసం డైనింగ్ హాల్, విశ్రాంతి గదులు అయినా కేటాయించాలి. – ఎస్.దీపిక, బీకాం, ఎస్వీడీ డిగ్రీ కళాశాల, నిడదవోలు యోగాకు అనుమతి ఇవ్వలేదు వసతిగృహంలో కొందరు వ్యాయామ, యోగా తరగతులు నిర్వహించడం వాస్తవమే. అయితే బయట వ్యక్తులకు ఎవరికీ ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. వెం టనే ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకుం టాం. హాస్టల్ వినియోగంలోకి వచ్చేలా చూస్తాం. – వి.శ్రీనివాసరావు, ప్రిన్సిపల్, ఎస్వీడీ మహిళా కళాశాల, నిడదవోలు -
నిడదవోలులో భారీ చోరీ
నిడదవోలు: పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో బుధవారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. స్థానిక కెనరా బ్యాంకు వీధిలో నివాసముంటున్న ఉద్దగిరి సత్యవతి ఇంట్లో దొంగలు పడి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఏడు తులాల బంగారు ఆభరణాలతో పాటు 6 కిలోల వెండి వస్తువులు అపహరించుకెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. -
విద్యుత్ తీగలు తెగిపడి ఇద్దరు మృతి
నిడదవోలు: పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని తాడిమళ్ల గ్రామ శివారులో 33 కేవీ విద్యుత్ తీగలు తెగిపడి ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. తాడిమళ్ల దగ్గర పొలం పనుల కోసం మహాలక్ష్మి,(38), వల్లంకి మంగ (23) అనే ఇద్దరు మహిళలు పొలంలో పనులు చేస్తుండగా పైనున్న 33 కేవీ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఈ సంఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మహిళల మృతిపై బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
4950 లీటర్ల కిరోసిన్ పట్టివేత
నిడదవోలు: పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం కాలువ ఒడ్డున అక్రమంగా నిల్వ ఉంచిన 4950 లీటర్ల కిరోసిన్‌ను అధికారులు స్వాదీనం చేసుకున్నారు. లారీ సర్వీసింగ్ సెంటర్లో అక్రమంగా కిరోసిన్ దందా నిర్వహిస్తుండగా విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. లారీ యజమాని వి.వి.దుర్గాప్రసాద్‌ను అరెస్టు చేసి ఈ కిరోసిన్ ఎక్కడినుంచి వచ్చింది ఎవరికి సరఫరా చేస్తున్నారు వంటి వివరాలు సేకరిస్తున్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న బైక్.. ఇద్దరి మృతి
పశ్చిమ గోదావరి: జిల్లాలోని నిడదవోలు మండలం గాంధీనగర్ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకులు అదుపు తప్పి విద్యుత్తు స్తంభాన్ని ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్ధానికుల సమాచారంతో ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించారని చెప్పారు. మృతులు కొయ్య శేఖర్, మేడపాటి అచ్యుత్ లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిడదవోలులో భారీ చోరీ
నిడదవోలు : పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. స్థానిక ఇందిరానగర్‌కు చెందిన మద్ది సూరిబాబు కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న 10 కాసుల బంగారు ఆభరణాలతోపాటు రూ.70వేల నగదు అపహరించుకుని పోయారు. శనివారం ఉదయం మద్ది సూరిబాబు ఇంటికి చేరుకోగా... చోరీ జరిగినట్లు గుర్తించాడు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిడదవోలులో భారీ చోరీ
నిడదవోలు: కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లివచ్చేసరికి ఇంటిలోని సొత్తు చోరీకి గురైంది. ఈఘటన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానిక ఇందిరానగర్‌కు చెందిన మద్ది సూరిబాబు కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న 10 కాసుల బంగారు ఆభరణాలతోపాటు రూ.70వేల నగదును ఎత్తుకుపోయారు. శనివారం ఉదయం బాధితులు ఇంటికి చేరుకోగా దొంగతనం జరిగినట్లు తేలింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. -
మగబిడ్డ లేకుండా చేయాలని..
నిడదవోలు : బాలుడ్ని దారుణంగా హత్య చేసి, మరొకనిపై హత్యాయత్నం చేసినన కేసుల్లో నిందితుడు అడపా కోటసత్యనారాయణ ను పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. నిడదవోలు సీఐ కార్యాలయంలో కొవ్వూ రు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు కేసు పూర్వాపరాలను విలేకరులకు వెల్లడించా రు. ఆస్తి లేనందున తనను చిన్నచూపు చూస్తున్నారని, అవహేళన చేస్తున్నారని నిందితుడు అడపా సత్యనారాయణ బంధువులపై కక్ష పెంచుకున్నాడని డీఎస్పీ చెప్పారు. బంధువులకు మగబిడ్డ లేకుండా చేయాలనే దుర్బుద్ధితోనే ప్రణాళిక ప్రకారం అతడు బందుల సాయికిరణ్ (12)ను హతమార్చాడని, మరో వ్యక్తిని చంపబోయాడని వెల్లడించారు. ఇలా జరిగింది అట్లపాడుకు చెందిన బందుల రామకృష్ణ, వెంకటలక్ష్మి దంపతులకుమారుడు సాయికిరణ్ శెట్టిపేట గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. అదే ఊళ్లో ఉన్న అడపా సత్యనారాయణ ఈ బాలుడికి బాబయ్య వరస. కానీ అతడు అప్పటికే కిరణ్ కుటుంబంపై కత్తికట్టి ఉన్నాడు. 2వ తేదీ ఉదయం అమ్మమ్మ ఇంటి వద్ద ఉన్న సాయి కిరణ్‌ను ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అతడు నిడదవోలు వెళ్లి ఎక్వేరియం తీసుకువద్దామని చెప్పి మోటార్‌సైకిల్ ఎక్కించుకున్నాడు. శెట్టిపేట శివారుల్లో సాయికిరణ్‌ను పీక నులిమి, కాలితో మెడను బలంగా అదిమి హత్యచేసి మృతదేహాన్ని వియార్ కాలువ పక్కన ఉన్న గోతిలో పారేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత శెట్టిపేట వచ్చిన అడపా సత్యనారాయణ తనకు వరసకు మేనల్లుడైన కానురు సత్యనారాయణను కూడా చంపాలనుకున్నాడు. తాటాకులు నరకడానికి రావాలని కోరి అతడిని తన బైక్‌పై పొలానికి తీసుకువెళ్లాడు. బైక్‌ను కానురు సత్యనారాయణకు ఇచ్చి వెనుక కూర్చున్న నిందితుడు వేలివెన్ను రోడ్డులో ఉండగా కొడవలితో దాడి చేసి తలపై నరికాడు. అతడు కింద పడిపోగా తల, చేతులపై పది సార్లు నరికాడు. ఈలోపు అక్కడి కూలీలు కేకలు వేయడంతో పరారయ్యాడు. కొనఊపిరితో ఉన్న కానురు సత్యనారాయణను ఆస్పత్రికి తరలించారు. అతడు ప్రస్తుతం రాజ మండ్రి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఈ కేసుల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి కత్తి, మోటార్ సైకిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు పరారై... వేలివెన్ను పుంత మార్గంలో పరారైన అడపా కోటసత్యనారాయణ డి. ముప్పవరం వద్ద కొడవలిని ఒక సంచిలో ఉంచి రోడ్డు పక్కన పారేశాడు. ఆపైన బైక్‌పై సమిశ్రగూడెం పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ వంతెన వద్దకు వెళ్లాడు. అక్కడినుంచి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా పోలీస్ కానిస్టేబుల్‌ను చూసి భయపడి వచ్చేశాడు. అక్కడినుంచి నిడదవోలు ఆస్పత్రి వద్దకు వచ్చాడు. అక్కడ గ్రామస్తులు కనిపించడంతో బస్టాండ్‌కు చేరుకుని అక్కడ బైక్ వదిలి బస్ ఎక్కి విజయవాడ వెళ్లాడు. ఆపై రైల్లో హైదరాబాద్‌కు పరారయ్యాడు. ఈలోపు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ప్రణాళిక ప్రకారం అతడ్ని మళ్లీ శెట్టిపేట రప్పించి ఇంటివద్దే అరెస్ట్ చేశారు. -
దేశంలోనే అతి పెద్ద బ్యాంకులో డబ్బుల్లేవంట..!
దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో అత్యధిక శాఖలు ఉన్న బ్యాంక్ ఇది. ఇటీవల ఎస్బీఐ ఏటీఎంలు జిల్లాలో తరచూ మూతపడుతున్నాయి. బ్యాంకు శాఖల్లోనూ నగదు విత్ డ్రాలకు సంబంధించి కార్యకలాపాలు ఆలస్యమవుతున్నాయి. ఎందుకంటే బ్యాంక్‌లో నగదు లేదంట. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. నిడదవోలు : జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలు తరచూ మూతపడుతున్నాయి. దీంతో ఖాతాదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని ఏలూరు సహా నిడదవోలు, తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, నరసాపురం ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. నిడదవోలులో వారం రోజులుగా ఏటీఎంలలో నగదు లేక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. అటు బ్యాంక్ శాఖలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విత్ డ్రా కోసం వెళితే వివిధ రకాల డిపాజిట్లు జమయ్యే వరకు వేచి ఉండాల్సి వస్తోంది. జమైన మొత్తాలను విత్ డ్రా దరఖాస్తుదారులకు ఇస్తున్నారు. దీంతో ఆర్థిక అవసరాలు తీరక ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ పరిస్థితి ఎందుకంటే.. దేశంలోని అన్ని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ నగదును సరఫరా చేస్తుంది. అయితే ఇటీవల అక్కడి నుంచి సరఫరా మందగించినట్టు బ్యాంక్ అధికారులు తెలుపుతున్నారు. దేశంలో అతిపెద్ద బ్యాంక్ కావడంతో ఖాతాదారుల సంఖ్య అత్యధికంగా ఉంటారు. అన్ని బ్యాంకులకు నగదు సరఫరా తగ్గినా స్టేట్ బ్యాంక్‌కు మాత్రం ఖాతాదారుల సంఖ్య ఎక్కువ కావడంతో అందరికీ సకాలంలో నగదు అందని పరిస్థితి ఏర్పడింది. మార్చి నెలాఖరుకు ఆర్థిక సంవత్సరం ముగియడంతో రిజర్వు బ్యాంక్‌లో ఆర్థిక లావాదేవీలు, ఇతర సమస్యలు కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో పాటు గతంలో ఏటీఎం కార్యాలయాలకు ఆయా శాఖల నుంచి నగదును పంపించేవారు. అయితే గతేడాది నుంచి ఈ బాధ్యతను కొన్ని ప్రధాన శాఖలకు మాత్రమే అప్పగించారు. ఉదాహరణకు మొగల్తూరులో స్టేట్ బ్యాంక్ కు గతంలో దగ్గరలోని నరసాపురం స్టేట్ బ్యాంక్ బ్రాంచి నుంచి నగదు వచ్చేది. ఇప్పుడు పాలకొల్లు నుంచి వస్తోంది. నరసాపురం, పాలకొల్లు ప్రాంతాల్లోని బ్యాంకులు, ఏటీఎంలకు పాలకొల్లు నుంచి నగదు రావాల్సి రావడంతో వారానికి ఒక్కరోజు మాత్రమే పంపిస్తున్నారు. దీంతో ఆ నగదునే మొగల్తూరు శాఖ అధికారులు పొదుపుగా వాడాల్సి వస్తోంది. దీంతో లక్ష రూపాయలు పైబడి నగదు చెల్లింపులు ఇవ్వడం లేదు. దీంతో వ్యాపారులు, ఖాతాదారులు ఘొల్లుమంటున్నారు. నిడదవోలులో వారం రోజులుగా నగదు నిల్ నిడదవోలు పట్టణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎంలలో వారం రోజులుగా నగదు లేకపోవడంతో ఖాతాదారులు నానాఅవస్థలు పడుతున్నారు. పండగ పూట కూడా ఆర్థిక అవసరాలు తీరక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో రెండు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలు ఉన్నాయి. ఏడు చోట్ల ఏటీఎం సెంటర్లు ఉన్నాయి. ఈ రెండు బ్యాంకుల్లో కలిపి దాదాపు 20 వేలకు పైగా ఖాతాదారులు ఉన్నారు. ఏడు రోజులుగా నగదు లేక ఏటీఎంలు మూతపడ్డాయి. బ్యాంకులో కూడా నగదు అరకొరగానే ఇస్తున్నారు. దీంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని అన్ని స్టేట్ బ్యాంక్ శాఖల్లోనూ ఇంచిమించు ఇదే పరిస్థితి ఉంది. ఇక మిగిలిన బ్యాంకుల విషయానికి వస్తే వాటిల్లో కూడా కొన్ని బ్యాంక్‌లలో నగదు లావాదేవీలు బాగా ఆలస్యమవుతున్నాయని ఖాతాదారులు తెలిపారు. బ్యాంకులో నగదు లేదు బ్యాంకులో నగదు లేకపోవడంతో ఖాతాదారులకు ఇవ్వలేకపోతున్నాం. రిజర్వు బ్యాంకులో నగదు కొరత ఏర్పడడంతో ఈ సమస్య తలెత్తింది. ఏటీఎంలలో నగదు పెట్టలేకపోతున్నాం. రిజర్వు బ్యాంకు నుంచి ఎప్పుడు నగదు వస్తుందో కూడా సమాచారం లేదు. ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా డిపాజిట్ చేసిన నగదును విత్డ్రాదారులకు అందజేస్తున్నాం. - వి.నరసింహరావు, స్టేట్ బ్యాంక్ చీఫ్ మేనేజర్, నిడదవోలు -
వైఎస్సార్ సీపీలో 20 మంది నాయకులకు పార్టీ పదవులు
ఏలూరు (మెట్రో) : జిల్లాకు చెందిన 20 మంది నాయకులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవుల్లో నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నిడదవోలు నియోజకవర్గంలోని పలువురు నేతలకు రాష్ట్ర, జిల్లా, మండల, మునిసిపల్‌స్థాయిలో పదవులు లభించాయి. రాష్ట్రస్థాయిలో.. నిడదవోలుకు చెందిన రాష్ట్ర కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ముళ్లపూడి శ్రీనివాస చౌదరి, చిట్యాల వెంకట్‌లను నియమించారు. జిల్లాస్థాయిలో.. జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఉప్పులూరి రామ్మోహన్, గారపాటి ప్రసాద్, యాళ్ల రామారావు, పాటంశెట్టి మల్లేశ్వరరావు, పెంటపాటి ప్రసాద్, షేక్ వజీరుద్దీన్, రావి వెంకటేశ్వరరావు, ఆరుగొల్లు వెంకటేశ్వరరావు, కరణం ప్రసాద్‌లను నియమించారు మండల స్థాయిలో.. నిడదవోలు మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడిగా ఐనీడి పల్లారావు, మునిసిపాలిటీ అధ్యక్షుడిగా మద్దిపాటి ఫణీంద్ర నియమితులయ్యారు. నిడదవోలు బీసీ సెల్ విభాగం అధ్యక్షుడిగా వెలగాన వెంకట సత్యనారాయణ, యువజన విభాగం అధ్యక్షుడిగా కొప్పుల రామ్‌దేవుడు, ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడిగా గుమ్మాపు రోహిన్‌బాబు, మహిళా విభాగం అధ్యక్షురాలిగా బోనేపల్లి ఉమాదేవి, మైనార్టీ సెల్ విభాగం అధ్యక్షుడిగా షేక్ మీరా సాహెబ్, రైతు విభాగం అధ్యక్షుడిగా కస్తూరి సాగర్, ప్రచార విభాగం అధ్యక్షుడిగా పుల్లూరి రామ్మూర్తి, సేవాదళ్ విభాగం అధ్యక్షులుగా పులిమెంతుల రామారావు, లీగల్ సెల్ విభాగం అధ్యక్షుడిగా ఇంజే శేఖర్‌లను నియమించారు. మునిసిపాలిటీ స్థాయిలో.. మునిసిపల్ యువజన విభాగం అధ్యక్షుడిగా గోపిరెడ్డి శ్రీనివాస్, బీస్ సెల్ విభాగం అధ్యక్షుడిగా ముంగంటి కృపానందం, ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడిగా గుర్రం జేమ్స్, ఎస్టీ సెల్ విభాగం అధ్యక్షుడిగా పెండ్ర సతీష్, మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉసురుమర్తి సరస్వతి, మైనార్టీ సెల్ విభాగం అధ్యక్షుడిగా షేక్ మస్తాన్ వలీ, రైతు విభాగం అధ్యక్షుడిగా కొండాటి గంగరాజు, లీగల్ సెల్ విభాగం అధ్యక్షుడిగా డేగపాటి మహేష్, ప్రచార విభాగం అధ్యక్షుడిగా కొండా విజయకృష్ణ ఫణీంద్ర, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా ప్రక్కి సత్య సూర్యనారాయణ మూర్తి, సేవాదళ్ విభాగం అధ్యక్షుడిగా దాకే అనిల్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
ఆ ఖర్చు పురపాలక సంఘమే భరించాలి
నిడదవోలు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుణ్యమా అంటూ నిడదవోలు పురపాలక సంఘానికి తీవ్ర నష్టం ఏర్పడుతోంది. నిడదవోలులో చేపట్టిన పాదయాత్ర ఖర్చును పురపాలక సంఘమే భరించాలని జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు అధికార పార్టీ పాలకవర్గంతోపాటు అధికారులు కలసి మునిసిపల్ సాధారణ నిధులు కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. నిడదవోలు నియోజకవర్గంలో ఉండ్రాజవరం, నిడదవోలు మండలాల్లో ఈ ఏడాది జనవరి 18న ముఖ్యమంత్రి పాదయాత్ర చేశారు. పాదయాత్ర మండలంలో సింగవరం నుంచి పట్టణ శివారున సుబ్బరాజుపేట వరకు, అక్కడి నుంచి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వరకు సుమారు మూడు కిలోమీటర్లు సాగింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లకు మొత్తం రూ.6.80 లక్షలు ఖర్చయిందని అధికారులు లెక్కలు కట్టారు. పాదయాత్ర ఖర్చుకు సంబంధించిన మొత్తాన్ని మంజూరు చేయాలని మునిసిపల్ అధికారులు పలుమార్లు జిల్లా కలెక్టర్ కె.భాస్కర్‌కు లేఖలు రాశారు. దీంతో పాదయాత్ర ఖర్చును కౌన్సిల్లో ర్యాటిఫికేషన్ తీసుకుని బిల్లులు చెల్లించాలని ఆదేశాలు అందాయి. మునిసిపల్ సాధారణ నిధుల నుంచి సొమ్ము చెల్లించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నెల 27న నిర్వహించనున్న మునిసిపల్ సాధారణ సమావేశపు అజెండాలో ఈ ఆంశాన్ని చేర్చారు. మరి ఆ సమావేశంలో ఏం తేలనుందో వేచి చూడాల్సిందే. పాదయాత్ర ఖర్చులు 1. పట్టణంలో అద్దె ప్రాతిపదికన నాలుగు జేసీబీలు, రెండు బ్లేడ్ ట్రాక్టర్లకు రూ.2.20 లక్షలు 2. యుద్ధ ప్రాతిపదికన ఫ్లడ్‌లైట్ల ఏర్పాటుకు రూ.1.30 లక్షలు 3. పట్టణంలో మునిసిపల్ బీటీ రోడ్ల మరమ్మతులకు రూ.75 వేలు 4. ఎన్టీఆర్ కాలనీ, ఎన్టీఆర్ విగ్రహం, ప్రభుత్వ ఆసుపత్రి, డిగ్రీ కళాశాల ప్రాంగణంలో స్టేజీ ఫ్లాట్‌పాంల ఏర్పాటుకు రూ.90 వేలు 5. పాదయాత్ర మార్గంలోనూ, బహిరంగ సభలోనూ మంచినీళ్ల ఏర్పాటుకు రూ.50 వేలు 6. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో చంద్రబాబు విశ్రాంతి తీసుకునే గది పక్కనే మరుగుదొడ్డి ఏర్పాటుకు రూ.35 వేలు 7. షామియానాలు, కుర్చీలకు రూ. 25 వేలు 8. ఎన్టీఆర్ కాలనీలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కర్టెన్ ఏర్పాటుకు రూ.25 వేలు, సెమినరీ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఫిలిఫ్స్ కంపెనీ ఎల్ఈడీ లైట్ ఏర్పాటుకు రూ.20 వేలు 9. వాహనాల ఇంధన ఖర్చు రూ.10 వేలు -
అందరికీ అమ్మలు...ఆ అక్కచెల్లెళ్లు!
ఆర్జించిన ధనానికి కవచం దానమే... పదార్థాలను త్యాగం చేయడం ద్వారా నిన్ను నీవు రక్షించుకో... దానం... త్యాగం ప్రాధాన్యాలను తెలిపే ఈ సూక్తులను ఎవరు చెప్పారు? విధుల... మృదుల అనే అక్క చెల్లెళ్లు చెప్తున్నారు... నిడదవోలులోని చర్ల సుశీల వృద్ధాశ్రమం వీరి నివాసం... తండ్రి గణపతి శాస్త్రి బోధించిన గాంధీ సూక్తులు వీరికి ఆదర్శం. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు పట్టణం. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఓ సాధారణమైన పాతకాలం నాటి భవనం. ఎటు చూసినా ఫలిత కేశాలతో, వెన్ను వంగిపోయి, పండుటాకులను తలపిస్తున్న వృద్ధులే కనిపిస్తున్నారు. వారిలో ఇద్దరు మహిళలు తెల్లటి నూలు దుస్తులు ధరించి గాంధీజీ ఆశయాలకు ప్రతీకల్లా, సరస్వతీ మాత రూపాల్లా ఉన్నారు. వారిద్దరూ ఆశ్రమం అంతా కలియ తిరుగుతూ బాధ్యతగా అందరినీ పలకరిస్తున్నారు. ప్రాంగణం దగ్గరకు వెళ్తే ‘చర్ల సుశీల వృద్ధాశ్రమం, శ్రీ కస్తూరిబాయి మహిళా సమాజం’ అనే బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు మీద గణపతి శాస్త్రి, సుశీల ఫొటో ఉంది. ఆ ఫొటోలో ఉన్న దంపతుల కూతుళ్లే విధుల, మృదుల. తల్లి సుశీల పేరుతో ఆశ్రమాన్ని స్థాపించి తండ్రి ఆశయాలకు రూపమిస్తున్నారు. అభాగ్యులకు ఆశ్రయమిస్తున్నారు. అనాథలకు జీవితాన్నిస్తున్నారు. తండ్రి బాటలో సొదరీమణులు..: చర్ల గణపతి శాస్త్రి స్వాతంత్య్ర సమరయోధుడు. కళాప్రపూర్ణ, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కూడా. జాతీయోద్యమ కాలంలో గాంధీజీ ప్రబోధాల ప్రభావంతో ఆయన ఉపాధ్యాయ వృత్తిని వదిలి, ఉద్యమంలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు గణపతి శాస్త్రిని కొవ్వూరు జైలులో పెట్టారు. జైలు నుంచి విడుదలైన తరువాత ఆయన చాగల్లులో గాంధీ ఆశయాలతో ఆశ్రమ పాఠశాల నిర్మించారు. అది బాపూ హైస్కూల్‌గా కొనసాగుతోంది. గణపతి శాస్త్రి వ్యవసాయం చేస్తూ జీవనాన్ని సాగించారు. పేద ప్రజలకు విద్య, వైద్య సేవలను అందించారు. మహిళల కోసం నిడదవోలు పట్టణంలో 1950లో కస్తూరిబా మహిళా సమాజాన్ని స్ధాపించారు. నిరక్ష్యరాస్యత నిర్మూలన, మద్యపాన నిషేధంపై ప్రచారం నిర్వహించారు. గణపతి శాస్త్రి ఏనాడూ ఎవరినీ స్తోత్రాలు వల్లించి దీవించలేదు. ‘మంచి చేయండి. మీ పిల్లలకు మంచి జరుగుతుంద’ని చెప్పేవారు. స్వాతంత్య్ర సమరయోధులకు ప్రభుత్వం ఇచ్చిన ఐదెకరాల భూమిని వినోభాబావే భూదాన ఉద్యమం నిర్వహించిన సమయంలో విరాళంగా ఇచ్చారు. ఆయన జీవితమంతా ప్రజల కోసమే పని చేసి 1996లో గుండెపోటుతో దూరమయ్యారు. గణపతి శాస్త్రి భార్య చర్ల సుశీలమ్మ అన్నదానాలు చేసేవారు. విధుల, మృదుల కుమారికి కూడా అదే సేవాగుణం అలవడింది. తండ్రి మార్గదర్శనం...: తండ్రి కోరుకున్న విధంగా మహిళా సమాజాన్ని నడిపిన ఈ అక్కాచెల్లెళ్లు ఆపన్నులకు ఆశ్రయం కూడా అక్కడే కల్పించాలనుకున్నారు. అలా 2000లో ఐదుగురితో వృద్ధాశ్రమం స్థాపించారు. వీరిలో పెద్దామె విధులకు 76 సంవత్సరాలు. ఎంఏ బిఈడీ చదివి హిందీలో డాక్టరేట్ పట్టా పొందారు. విశాఖపట్నంలోని సెయింట్ ఆన్స్ జూనియర్ కళాశాలలో హిందీ లెక్చరర్‌గా పనిచేసి రిటైరయ్యారు. గాంధేయవాది అయిన తండ్రిని గుర్తు చేసుకున్నారామె. ‘‘నా ఉద్యోగ జీవితంలో అధ్యాపకురాలుగానే కాకుండా భారత స్కాట్స్ అండ్ గైడ్స్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా పని చేశాను. దేశభక్తి, అనాథల సేవలాంటి సద్గుణాలను చిన్నతనంలో మానాన్న గారి నుంచి నేర్చుకున్నాను. ఎవరికి ఏ అవసరం వచ్చినా సహాయం చేసేవారు నాన్న. ఆయన సేవా నిరతి నాకిప్పటికీ గుర్తుంది. మా అన్నయ్య అకాల మరణం తట్టుకోలేక అమ్మ కూడా చనిపోయింది. పోయినవాళ్ళు అదృష్టవంతులు మీరు బాధపడకూడదని మా ఇద్దరికీ హితవు చెప్పారు నాన్న. అలాంటి తండ్రికి బిడ్డలుగా పుట్టడం ఎంతో అదృష్టం. ఇక మా అమ్మ...’’ అంటూ కొద్దిసేపు ఆగారామె. ‘‘అనాథలైన వృద్ధులకు సేవ చేయాలనేది అమ్మ కోరిక. ఆ ఆశయసాధన కోసమే అమ్మపేరున ఒక వృద్ధాశ్రమం నెలకొల్పాం. నాకు ప్రతి నెలా వస్తున్న పెన్షన్, దాతల సహకారంతో దీనిని నిర్వహిస్తున్నాం. కుటుంబ జీవిత చట్రంలో ఇరుక్కుపోతే వారి ఆశయాలను నిర్వహించలేమని అవివాహితులుగా ఉండిపోయాం’’ అన్నారు విధుల కుమారి. ఉన్నత విద్యావంతులు కావడంతో... ఈ సోదరీమణులిద్దరూ ఉన్నత విద్యావంతులు. విధుల చెల్లెలు మృదుల విశాఖపట్నంలోని వి.ఎం.సీ మహిళా విద్యాపీఠ్‌లో హిందీ లెక్చరర్‌గా పనిచేసి రిటైరయ్యారు. తండ్రి గణపతి శాస్త్రి ఎప్పుడూ... ‘దేశం మాకేం ఇచ్చింది అని కాకుండా దేశానికి మనం ఏం చేశాం’ అని ఆలోచించాలని ఉద్బోధించేవారని గుర్తు చేసుకున్నారామె. ‘‘సేవ, సకల జీవుల పట్ల దయతో ఉండటం, మానవసేవయే మాధవ సేవ ఇత్యాది సుగుణాలను నాన్న నేర్పించారు. భగవంతుడు దీనజనుల్లోనే ఉన్నాడు. వారికి సేవ చేస్తే దైవాన్ని సేవించినట్లేనని చెప్తుండేవారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అక్కతో కలిసి అభాగ్యుల సేవలో కొనసాగుతున్నాను. అనాథలు, వృద్ధులకు మాకు చేతనైనంత చేస్తున్నాం. అక్క, నేను ఇద్దరం చదువుకున్న వాళ్లం కావడంతో ఇక్కడ ఆశ్రయం పొందుతున్న అనాథ పిల్లలకు చదువు చెప్తున్నాం. వారు ప్రైవేట్‌గా డిగ్రీ చదువుకుంటున్నారు. అంధులు కూడా కంప్యూటర్ నేర్చుకుని ఉపయోగిస్తున్నారు. మాకు మా వ్యక్తిగత జీవితం గురించి ఆలోచన, చింతా ఏ కోశానా లేవు ’’ అన్నారు. అందరి ఆకలి తీర్చడానికి...: చర్ల సుశీల వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వాళ్లు రెండు వందల వరకు ఉంటారు. అయితే భోజన సమయానికి వచ్చి ఆకలి తీర్చుకుని వెళ్లే వాళ్లు కూడా ఎక్కువే. వీరికే కాకుండా రోడ్ల మీద బిచ్చమెత్తుకునే వారి ఆకలీ తీరుస్తున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, రోడ్డు కూడళ్లలో అడుక్కునే వారికి ఉదయం 11 గంటలకు ఆశ్రమం నుంచి భోజనం తీసుకెళ్లి పెడతారు. ఈ ఆశ్రమంలో ఏటా గాంధీ జయంతి రోజున గాంధీజీకి పుష్పాంజలి, సర్వమత ప్రార్థన నిర్వహిస్తారు. దాంతోపాటు స్వాతంత్య్ర సమరయోధులు, ఉత్తమ ఉపాధ్యాయులు, గాంధేయ వాదుల వంటి విశిష్ఠ వ్యక్తులకు గాంధీజీ స్మారక పురస్కారాలిస్తారు. విద్యార్థులకు గాంధీజీ జీవితం అనే అంశం ఆధారంగా వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులిస్తున్నారు. డెబ్భై ఏళ్లు నిండితే మందు వేసుకోవడానికి నీళ్లందించే వారి కోసం చూస్తారు ఎవరైనా. మంచం మీద నుంచి లేవాలనిపిస్తే మనవడో, మనవరాలో ఆసరాగా ఉంటే బావుణ్ణు అనిపించే వయసది. అలాంటప్పుడు ఎవరైనా పిల్లల అండలో జీవితం కడతేరాలని కోరుకోవడం సహజం. ఆ అండలేని వారికి కొండంత అండగా నిలుస్తున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. అందుకు వారికి తమ వార్ధక్యం అడ్డురావడం లేదు. వారి ఆశయమే ఆసరాగా ఉంది. - గాడి శేఖర్‌బాబు, సాక్షి, నిడదవోలు ఆత్మీయ సేవకు అందిన గుర్తింపు: 2007లో సహృదయ చారిటబుల్ సొసైటీ వారిచే ఉత్తమ సేవా అవార్డు. ఠి2010లో జిల్లా కలెక్టర్ వాణీ ప్రసాద్ చేతుల మీదగా ఉత్తమ సేవా సంస్ధ అవార్డు, ఠి 2011లో అప్పటి మంత్రి వట్టి వసంత్‌కుమార్ చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ సేవా సంస్ధ నిర్వాహక పురస్కారం. ఠి స్త్రీ శిశు సంక్షేమశాఖ నుంచి ఉత్తమ మహిళా సేవకురాలి అవార్డులు. -
యువతి ఆత్మహత్య
నిడదవోలు, న్యూస్‌లైన్ : ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించటంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నిడదవోలులో శనివారం జరిగిం ది. ఎస్సై ఎం.సూర్యభగవాన్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రాయపేట రామాల యం వీధిలో ఏనుగుల బండారిమేరీప్రసన్న రాణి(18), ఆమె తల్లి మేరీ రాధారాణి నివసిస్తున్నారు. శనివారం ఉదయం రాధారాణి టిఫిన్ తెచ్చేం దుకు హోటల్‌కు వెళ్లింది. టిఫిన్ తె చ్చిన ఆమె తలుపులు లోపల గడియపెట్టి ఉండటంతో చాలా సేపు కుమార్తెను పిలిచించి. అయినా తలుపులు తీయకపోవడంతో కంగారుగా కేకలు వేయగా ఇరుగుపొరుగు వారు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకున్న ప్రసన్నరాణి కనిపిం చింది. వెంటనే ఆమెను కిందకు దింపగా అప్పటికే మృతిచెందింది. స్థానిక గాంధీబొమ్మ సెంటర్లోని ఓ క్లాత్ షోరూంలో ప్రసన్నరాణి ఐదేళ్ల నుంచి సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తోంది. రాయపేటకు చెందిన గున్నాబత్తుల నానాజీ, ప్రసన్నరాణి ప్రేమించుకున్నారు. నానాజీ మరో యువతిని ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. ఈ విషయంపై ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంపై ఈనెల 30న నానాజీతో పాటు అతని తండ్రి, సోదరుడు ఆమె ఇంట్లోనే తల్లి రాధారాణి సమక్షంలో పంచాయితీ పెట్టారు. నానాజీ మరో యువతిని పెళ్ళి చేసుకున్నాడు కాబట్టి లక్ష రూపాయలు ఇస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో మనస్తాపం చెందిన ప్రసన్నరాణి ఆత్మహత్య చేసుకుంది. మృతురా తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహన్ని కొప్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
నిడదవోలు.. కొత్త ‘గోలు’
నిడదవోలు, న్యూస్‌లైన్ : దేశంలోని అత్యంత ప్రాచీన పట్టణాల్లో ఒకటిగా నిడదవోలుకు పేరుంది. వేంగి చాళుక్యుల కాలంలో జలదుర్గంగా భాసిల్లిన నిడదవోలును కేంద్రంగా చేసుకుని 14వ శతాబ్ధ కాలంలో అనవేమారెడ్డి అనే రాజు పరిపాలన సాగించాడు. కాకతీయ రాజులతో సంబంధం అందుకున్న ప్రాంతమిది. రాష్ట్రకూటులతో జరిగిన యుద్ధంలో రెండో చాళుక్య భీముడు విజయసారధిగా ఈ నగరంలోనే పేరొం దాడు. ఇంతటి ప్రాచీన చరిత్ర గల నిడదవోలుకు చెప్పుకోదగిన రాజకీయ చరిత్ర లేకపోవడం విశేషం. పునర్విభజన నేపథ్యంలో 2009లో నిడదవోలు నియోజకవర్గం ఏర్పడింది. అంతకుముందు నిడదవోలు పట్టణంతోపాటు నిడదవోలు మండలంలోని 16 గ్రామాలు కొవ్వూరు నియోజకవర్గంలో భాగంగా ఉండేవి. మిగిలిన 6 మెట్ట గ్రామాలు గోపాలపురం నియోజకవర్గంలో ఉండేవి. తణుకు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజవరం, పెనుగొండ నియోజకవర్గ పరిధిలోని పెరవలి మండలాలతోపాటు నిడదవోలు పట్టణం, నిడదవోలు మండలాన్ని కలిపి నిడదవోలు నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. 56 గ్రామాలతో విస్తరించిన ఈ నియోజకవర్గ పరిధిలో 196 పోలింగ్ కేంద్రాలు ఉన్నారుు. 2009లో జరిగిన తొలి ఎన్నికలలో ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామానికి చెందిన బూరుగుపల్లి శేషారావు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యూరు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జీఎస్ నాయుడు, ప్రజారాజ్యం పార్టీ తరఫున రుద్రరాజు సత్యనారాయణరాజు (జెడ్ రాజు) పోటీ చేశారు. త్రిముఖ పోరులో శేషారావుకు 51,680 ఓట్లు లభించగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీఎస్ నాయుడుకు 45,914 ఓట్లు, పీఆర్పీ అభ్యర్థి జెడ్ రాజుకు 44,511 ఓట్లు పోలయ్యూరుు. సమీప ప్రత్యర్థి జీఎస్ నాయుడుపై శేషారావు 5,766 ఓట్ల ఆధిక్యత సాధించారు. ఇదీ ప్రస్తుత పరిస్థితి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)ని నడిపించిన జీఎస్ రావు వంటి ఉద్దండులున్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అరుుపోరుుంది. నిడదవోలు పట్టణానికి చెందిన పీసీసీ కార్యదర్శి కామిశెట్టి సత్యనారాయణ మాత్రమే ఆ పార్టీకి దిక్కుగా ఉన్నా రు. ఆయనే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇక్కడినుంచి ప్రాతిని ధ్యం వహిస్తున్న బూరుగుపల్లి శేషారావు టీడీపీకి చెందిన వారే అయినప్పటికీ పార్టీని నడిపించే వ్యక్తి లేరనే అభిప్రాయం శ్రేణుల్లో నెలకొంది.నాయకులు, కార్యకర్తలు స్తబ్దుగా ఉండిపోవడం ఆ పార్టీకి మైనస్‌గా కనిపిస్తోంది. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకుపోతోంది. పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్ రావు, ఆయన తనయుడు జీఎస్ నాయుడు వైఎస్సార్ సీపీలో చేరడంతో పార్టీకి మరిం త బలం చేకూరింది. నిడదవోలుతోపాటు పెరవలి మండలాల్లో మంచి పట్టున్న జీఎస్ రావు వంటి పెద్దలు వైఎస్సార్ సీపీలో చేరడం టీడీపీ వర్గాల్లో కలవరం రేపుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిడదవోలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.రాజీవ్‌కృష్ణ తనదైన శైలిలో పట్టణంతోపాటు నిడదవోలు, ఉం డ్రాజవరం, పెరవలి మండలాల్లో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువయ్యారు. -
నిడదవోలులో జగన్ ప్రసంగం
-
ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య
నిడదవోలు, న్యూస్‌లైన్ : తల్లీకూతుళ్ల మధ్య గొడవతో మనస్తాపం చెందిన కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నిడదవోలు మండలం తాడిమళ్ళ ఎన్టీఆర్ కాలనీలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన ఏటూరి సుధారాణి(16)కి తల్లిదండ్రులు, సోదరుడు ఉన్నారు. 13 ఏళ్లక్రితం తండ్రి చనిపోగా, ఐదు నెలల క్రితం సోదరుడు కృష్ణ కామెర్ల వ్యాధితో మృతిచెందాడు. ప్రస్తుతం ఇంట్లో తల్లి మంగతాయారు, సుధారాణి మాత్రమే ఉంటున్నారు. గతేడాది పదో తరగతి పూర్తిచేసిన సుధారాణి గ్రామంలో ఉన్న జిరాక్స్ సెంటర్లో పనిచేస్తుంది. ఇదిలావుండగా తల్లీకూతుళ్లు తరచూ గొడవలు పడుతుండేవారని స్థానికులు చెబుతున్నారు. గురువారం ఉదయం కూడా గొడవ పడ్డారని చెప్పారు. అరుుతే ఎప్పటిలానే తల్లి మంగతాయూరు పక్క ఊరిలో ఉన్న పీచు పరిశ్రమలో పనికి వెళ్లిపోయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుధారాణి ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుంది. పక్కింట్లో ఉండే ఏడేళ్ల చిన్నారి జడ వేయించుకోవడానికి వచ్చి ఫ్యాన్‌కు వేలాడుతున్న సుధారాణిని చూసి కంగారుపడుతూ స్థానికులకు చెప్పింది. స్థానికుల సమాచారంతో ఇంటికి చేరుకున్న తల్లి కూతురు మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. సమిశ్రగూడెం ఎస్సై ఎస్ఎస్ఎస్ పవన్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.