విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న బైక్.. ఇద్దరి మృతి | bike borne youth rams into electric pole, died | Sakshi
Sakshi News home page

విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న బైక్.. ఇద్దరి మృతి

Published Thu, Dec 1 2016 9:55 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

bike borne youth rams into electric pole, died

పశ్చిమ గోదావరి: జిల్లాలోని నిడదవోలు మండలం గాంధీనగర్ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకులు అదుపు తప్పి విద్యుత్తు స్తంభాన్ని ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్ధానికుల సమాచారంతో ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 
ప్రమాదం జరిగిన సమయంలో ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించారని చెప్పారు. మృతులు కొయ్య శేఖర్, మేడపాటి అచ్యుత్ లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement