Updates..
ములాఖత్‌లో మిలాకత్‌లా? చంద్రబాబు-పవన్‌లపై సీఎం జగన్ విమర్శలు
- 45 ఏళ్ల నుంచి బాబు దోపిడీ నే రాజకీయంగా మార్చుకున్నారు
- ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు
- ఆడియో టేపుల్లో బ్లాక్ మనీ పంచుతూ అడ్డంగా దొరికారు
- సాక్ష్యాదారాలతో సహా దొరికినా బుకాయిస్తున్నారు
- బాబు దొంగతనాల్లో వీరంతా వాటాదారులే
- ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు
- ఎల్లో మీడియా నిజాలను చూపించరు
- ఎల్లో మీడియా చంద్రబాబు అవినీతి పై మాట్లాడదు
- నిస్సిగ్గుగా చంద్రబాబుకు వీరంతా సపోర్ట్ చేస్తున్నారు
- లేని కంపెనీని ఉన్నట్టుగా ఫేక్ అగ్రిమెంట్ సృష్టించారు
- స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే
- ఫేక్ అగ్రిమెంట్ తో ప్రభుత్వ ఖజానా దోచేశారు
- ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కారు
- సీమెన్స్ కంపెనీ మాకు సంబంధం లేదని చెప్పింది
- ఫేక్ అగ్రిమెంట్ దొంగలను ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసింది
- ఒత్తిడి తీసుకొచ్చి సంతకాలు పెట్టి నిధులు దోచేశారు
- డొల్ల సూట్ కేసు కంపెనీలకు మళ్లించినట్టు ఈడీ తేల్చింది
- ఈడీ అరెస్ట్ చేసినా, ఐటీ నోటీసులిచ్చినా ఇంకా బుకాయిస్తున్నారు
- కోర్టు రిమాండ్ కు పంపితే ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు
- ఎల్లో మీడియా ఈ నిజాలు చూపించదు , వినిపించదు
- చంద్రబాబు పీఏకు ఇన్ కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చింది
- రూ. 371 కోట్ల ప్రజాధనం ఎక్కడికి పోయింది ?
- ప్రజాధనం దోచుకున్న బాబును కాకుంటే ఎవరిని అరెస్ట్ చేయాలి ?
- వాటాలు పంచుతాడు కాబట్టే వీరెవ్వరూ ప్రశ్నించరు
- లంచాలు తీసుకుంటే తప్పేంటని చెత్తపలుకులు రాసేది ఒకడు
- ములాఖత్ లో మిలాఖత్ చేసుకుని పొత్తు పెట్టుకునేది ఇంకొకడు
- ప్రజలంతా ఆలోచన చేయాలి
- మీ బిడ్డ హయాంలో మీకు మంచి జరిగిందా లేదా చూడండి
- మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు అండగా నిలబడండి
- మీ అందరి ఆశీస్సులతో రానున్న రోజుల్లోనూ మంచి పాలన అందిస్తాం
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు లో నాలుగో విడత కాపు నేస్తం నిధులు విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగం
- మీ అందరి ఆశీస్సులతో మంచి కార్యక్రమం కొనసాగిస్తున్నాం
- మీ ప్రేమాభిమానాలకు చేతులు జోడించి కృతఙ్ఞతలు చెబుతున్నా
- కాపు నేస్తంతో ఒంటరి మహిళలకు మేలు చేస్తున్నాం
- వరుసగా ఐదేళ్ల పాటు రూ. 75 వేలు ఆర్ధిక సాయం అందిస్తున్నాం
- 3,57,844 మందికి రూ. 536.77 కోట్లు జమ చేస్తున్నాం
- లంచాలు, అవినీతికి తావులేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాం
- కాపు నేస్తం తో 4 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్ది చేకూరింది
- ఒంటరి మహిళలకు ఆర్ధిక స్వాలంబన చేకూర్చడమే లక్ష్యం
- 45 నుంచి 60 ఏళ్ల అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచాం
- నాలుగేళ్లలో రూ. 2,029 కోట్ల నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం
- గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమం అమలు చేయలేదు
- ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు
- కాపు పేద మహిళలకు అండగా ఉండాలనే ఈ పథకం
- కేబినెట్ లో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చాం
- ఇది మీ అందరి ప్రభుత్వం
- నామినేటెడ్ పోస్టుల్లోనూ కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చాం
- కులం, మతం, రాజకీయాలు చూడకుండా పథకాలు అమలు చేస్తున్నాం
- అర్హత ఉంటే చాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాం
- రూ. 2.30 లక్షల కోట్ల రూపాయలను డీబీటీ ద్వారా అందించాం
- నాన్ డీబీటీ ద్వారా కాపు వర్గానికి రూ. 16,914 కోట్ల లబ్ది చేకూరింది
- గత ప్రభుత్వం ఈ కార్యక్రమాలు ఎందుకు చేయలేదు ?
- చంద్రబాబు గతంలో 10 శాతం కూడా హామీలు నెరవేర్చలేదు
- చంద్రబాబు కాపులను అడుగడుగునా మోసం చేశారు
- రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసినా చంద్రబాబు మోసం చేశారు
- 4 ఏళ్ల పాలనలో కాపుల సంక్షేమానికి రూ. 39,247 కోట్లు ఇచ్చాం
- మేనిఫెస్టో లో చెప్పిన దాని కంటే మిన్నగా చేశాం
- గత ప్రభుత్వం మంజునాథ కమిషన్ పేరుతో మోసం చేసింది
- అవినీతి కేసులో ఆధారాలతో సహా చంద్రబాబు అరెస్ట్ అయ్యారు
- అక్రమాలు చేసిన వ్యక్తిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు
- చట్టం ఎవరికైనా ఒక్కటే : సీఎం జగన్
►నాలుగో విడతలో వైఎస్సార్ కాపునేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్.
► సీఎం జగన్ మాట్లాడుతూ.. మీ అందరి ఆశీస్సులతో మంచి కార్యక్రమం కొనసాగిస్తున్నాం. మీ ప్రేమాభిమానాలకు చేతులు జోడించి కృతజ్ఞతలు చెబుతున్నా. కాపునేస్తంతో ఒంటిరి మహిళలకు మేలు చేస్తున్నాం. వరుసగా ఐదేళ్ల పాటు రూ.75వేలు ఆర్థిక సాయం అందిస్తున్నాం. 3,57,844 మందికి రూ.536.77 కోట్లు జమ చేస్తున్నాం. లంచాలు, అవినీతికి తావులేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. కాపు నేస్తంతో 4లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్దిచేకూరింది. 45 నుంచి 60 ఏళ్ల అక్క చెలమ్మలకు అండగా నిలిచాం.
► ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ.. సీఎం జగన్ సంక్షేమ సారథి. సీఎం జగన్‌కు నిడదవోలు ప్రజల తరఫున స్వాగతం. వైఎస్సార్ కాపునేస్తంతో ఒంటరి మహిళలకు ఎంతో లబ్ధి చేకూరింది. గత ప్రభుత్వం హామీల పేరుతో ప్రజలను మోసం చేసింది.
► ముఖ్యమంత్రి జగన్ నిడదవోలు చేరుకున్నారు.
► నిడదవోలు బయలుదేరిన సీఎం జగన్.
►ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు నిడదవోలులో పర్యటించనున్నారు.
► ఈ సందర్బంగా ‘వైఎస్సార్ కాపు నేస్తం’ నాలుగో విడతలో భాగంగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.
► అర్హులైన 3,57,844 మంది అక్కచెల్లెమ్మలకు రూ.536.77 కోట్ల మేర ఆర్థిక సాయాన్ని విడుదల చేయనున్నారు. ‘వైఎస్సార్ కాపు నేస్తం’ ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15,000 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయాన్ని అందచేస్తోంది. నేడు అందచేసే సాయంతో కలిపితే ఇప్పటివరకు పథకం ద్వారా మొత్తం రూ.2,029 కోట్లు ఆర్థిక సాయాన్ని అందించినట్లవుతోంది.
► 9:40 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న సీఎం జగన్
► 10:10 నిడదవోలు టౌన్ సుబ్బరాజుపేటలోని హెలిపాడ్ ప్రాంగణానికి చేరుకోనున్నారు.
► 10:20 సభా వేదిక వరకూ రోడ్ షో
► 10:35 సెయింట్ ఆంబ్రోస్ ఉన్నత పాఠశాలలోనీ సభాస్థలి వద్దకు చేరుకుని నిధులు విడుదల చేస్తారు.
► 12:10 ఎలిఫెంట్ ప్రాంగణానికి చేరుకుని స్థానిక నాయకులతో మాట్లాడతారు.
► 12:45 హెలికాప్టర్‌లో తాడేపల్లికి బయలుదేరుతారు.
Comments
Please login to add a commentAdd a comment