
తూర్పుగోదావరి జిల్లా: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన మంచి ప్రతి కుటుంబంలోనూ ఉందని మాజీ హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. జగనన్న పేదల గడపలకే సంక్షేమాన్ని చేర్చారని..కూటమి ప్రభుత్వం వచ్చాక అరాచకం దారుణంగా ఉందని, సోషల్ మీడియా కార్యకర్తలపై దాడి, వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి వారి వాహనాల ధ్వంసం తప్పితే అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదన్నారు.
గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు.. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ హోం మంత్రి తానేటి వనిత, రాజమండ్రి పార్లమెంట్ కన్వీనర్ గూడూరు శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
జగనన్నను తలుచుకోని కుటుంబం లేదు
‘ఎన్నికలు వచ్చేవరకు ప్రతి కార్యకర్త ఫైట్ చేస్తూనే ఉండాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న ఏ విధంగా ఇబ్బందిపడి బయటకు వచ్చారో అందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 15 ఏళ్లు పూర్తయింది. కూటమి తొమ్మిది నెలల పాలనలో జగనన్నను తలుచుకోని కుటుంబం లేదు. కూటమి నాయకులు సైతం జగనన్నను తలుచుకుంటున్నారు.
అందరూ కలిసి ఐక్యతతో జగనన్న ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ. తగిలిన గాయాలు, మనపై కట్టిన కేసులు అవి.. ఎవరు మర్చిపోవద్దు మనకి కూడా ఒక రోజు వస్తుంది. అప్పుడు కూటమి నేతలకు తిరిగి ఇస్తాం. పార్టీ కోసం నిలబడిన ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకుడికి పాదాభివందనం. ప్రతి కార్యకర్తకు ఆడబిడ్డగా నేను అండగా ఉంటాను. జగనన్న చేసిన మంచి ప్రతి కుటుంబంలో ఉంది’ అని తానేటి వనిత పేర్కొన్నారు.
జగన్ అంటేనే నిజం..
వైఎస్ జగన్ అంటేనే నిజం అని అన్నారు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. జగన్ పాలనలో ఒక్క పైసా కూడా ఆశించకుండా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పని చేశారన్నారు. ఇప్పుడు వైఎస్సార్ సీపీ వాళ్లకు పథకాలు ఇవ్వద్దని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబే చెబుతున్నారని, రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి స్వార్థంగా మాట్లాడిన వాడు చంద్రబాబు తప్ప ఇంకెవరూ లేరన్నారు. రాష్ట్ర సంపద పొందాల్సింది పేదవాడు. అది ఒక వర్గానికో ఒక పార్టీకో చెందటానికి మనం రాచరికంలో లేము.
సంక్షేమ పథకాలు పొందాలంటే ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?, టీడీపీ, బీజేపీ, జనసేన, ఈనాడు, టీవీ 5, ఏబీఎన్ కలిసి ప్రజలను మోసం పోయేలా చేశారు. సూపర్ సిక్స్ అని అబద్ధపు హామీలతో గద్దెనెక్కినవాడు చంద్రబాబు.. ఎన్నికల ముందు రాష్ట్రంలో రూ. 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయన్నార చంద్రబాబు, పవన్, పురందేశ్వరీ. శ్వేతపత్రాలని కొన్ని రోజులు హడావుడి చేశారు. చివరకు మతాల మీదకు తెచ్చారు. లడ్డూలో కల్తీ అంటూ చంద్రబాబు ప్రమాదకరమైన ట్రోల్స్ చేశారు. ప్రతినెల డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు చేస్తున్నాడు. ఆరున్నర లక్షల కోట్లు అని చివరికి చెప్పక తప్పలేదు. సంపద సృష్టిస్తానంటూ అధికారం కోసం అబద్ధాలు చెప్పాడు చంద్రబాబు నాయుడు. గత సంవత్సరం అమ్మబడి ఎత్తేశాడు
అన్నదాత సుఖీభవ అన్నాడు అది ఎత్తేశాడు. కేంద్రం ఇచ్చేవి కాకుండానే ప్రతి రైతుకు 20000 ఇస్తానన్నాడు. ఉచిత బస్సు లేదు.. మూడు గ్యాస్ సిలిండర్లు అన్నాడు ఒకటి ఇచ్చాడు. చంద్రబాబు హామీలు అమలు చేయాలంటే 79 వేల కోట్లు కావాలి...?, మహిళలకు 15000 ఇస్తా అన్నాడు ఎలా మోసపోయారో వారికి చెప్పాలి .మేనిఫెస్టోలో ఇచ్చిన నవరత్నాలను అమలు చేసిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment