Updates
సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
►మన సమాజంలో పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి
►ఆ కుటుంబాల తలరాతలు మారాలి
►వారు పేదరికం నుంచి బయటకు రావాలి
►ఆ కుటుంబాలనుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లు లాంటి వారు రావాలి
►పేదరికం అనే సంకెళ్లను వారు తెంచుకోవాలి
►దానికి చదవులు ఒక్కటే మార్గం
►అందుకే నాలుగేళ్ల ప్రభుత్వ పాలనలో మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ వాడిగా అడుగులేశాం
►నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలు సామాజికంగాను, ఆర్థికంగానూ గట్టిగా నిలబడాలంటే, వారు వివక్ష సంకెళ్లను తెంచుకోవాలంటే.. దానికి చదువులు ఒక్కటే మార్గం
►ఒక అంబేద్కర్, ఒక సావిత్రీ పూలే కాని, మౌలానా అబ్దుల్ ఆజాద్ కాని… వారి నోట్లోనుంచి వచ్చిన మాట ఏంటంటే.. చదువు అనేది ఒక్క అస్త్రం అని అలాంటి చదువుల విప్లవం మన రాష్ట్రంలో నాలుగు సంవత్సరాలుగా చేపట్టాం
►చదువులు అన్నవి పేదలకు ఒక హక్కుగా అందాలి
►జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలను అమలు చేస్తోంది
►పూర్తి ఫీజులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ప్రతి త్రైమాసికంలోనూ జమచేస్తున్నాం
►జనవరి-ఫిబ్రవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి ఇప్పుడు డబ్బు జమచేస్తున్నాం
►లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమచేస్తున్నాం
►చంద్రబాబు ప్రభుత్వంలో అరకొరగా ఫీజులు ఇచ్చారు
► రూ. 1777 కోట్ల రూపాయలు బకాయిపెట్టాడు చంద్రబాబు
ఆ డబ్బును కూడా మన ప్రభుత్వమే తీర్చింది
►బోర్డింగ్ ఫీజులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది
►ప్రతి ఏటా వసతి దీవెన కింద రెండుమార్లు తల్లుల ఖాతాల్లోకి జమచేస్తున్నాం
►అక్షరాల 25 లక్షల మందికిపైగా వర్తింపుచేస్తున్నాం
► కేవలం ఒక్క ఈ పథకానికే రూ.4,275.76 ఖర్చుచేశాం
►చంద్రబాబు గారి హయాంలో ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలి
► ఫీజులు అరకొరగా ఇచ్చేవారు
►ఎప్పుడు ఇచ్చేవారో తెలిసేది కాదు
►ముష్టి వేసినట్టు ఇచ్చేవారు
►కేవలం రూ.35వేలు ఇచ్చేవారు
►మన ప్రభుత్వం ఫీజులు ఎంతైతే అంత ఇస్తోంది
►పిల్లలకు మంచి జరగాలని ఎంత ఫీజులైతే అంత చెల్లిస్తున్నాం
►ఎంత ఫీజులైనా ఫర్వాలేదు.. మీరు చదవండి… మీ జగనన్న చెల్లిస్తాడు
►పిల్లలకు మంచి మేనమామగా ఎప్పుడూ ఉంటాను
►ఇలాంటి పథకాలు ఇస్తుంటే… రాష్ట్రం దివాళా తీస్తుందని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు
►మీడియా వ్యవస్థలు కొన్ని ఇలానే మాట్లాడుతున్నాయి
►భావి తరాల పిల్లల తలరాతలు మార్చేందుకు మేం పెట్టే ఖర్చు.. మానవ వనరులమీద పెట్టుబడులు అని చెప్తున్నాను
►రాబోయే రోజుల్లో రాష్ట్రానికి దశ, దిశ ఆంధ్రప్రదేశ్ చూపిస్తోంది
►ఏ రాష్ట్రంలో లేని విధంగా నర్సరీ నుంచి, ఉన్నత విద్యవరకూ విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి
►ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయి
►అందులో చదువులు కూడా మారుతున్నాయి
►సీబీఎస్‌ఈ ఇంగ్లిషు మీడియం చదువులు వచ్చాయి
►బై లింగువల్ టెక్ట్స్‌బుక్స్ వచ్చాయి
►గొప్ప మార్పులకు నిరద్శనం ఇది
►అంగన్‌వాడీల స్వరూపం కూడా మారుతోంది
►పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాం
►ఈ విషయంలో అక్షరాల ఒక్కో పథకానికి రూ.౨వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం
►విద్యాకానుక ద్వారా స్కూళ్లు తెరిచే సమయానికి కిట్లను అందిస్తున్నాం
►ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న ప్రతి పిల్లాడికి మంచి బోధన అందించడంపై దృష్టిపెట్టాం
►సబ్జెక్టు టీచర్ల కాన్సెప్టు తీసుకు వచ్చాం
►పిల్లలకు ఇంటికి వెళ్లిన తర్వాత ట్యూటర్ ఉండాలన్న తాపత్రయంతో బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్స్ ఇచ్చాం
►ఆఫ్‌లైన్‌లో పనిచేసే ట్యాబులు ఇచ్చాం
►నాడు – నేడు పూర్తిచేసుకున్న మొదటి దఫా స్కూళ్లలో 6 నుంచి పై తరగుతులకు డిజిటల్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాం
►ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ద్వారా డిజిటల్ బోధన తీసుకున్న ప్రభుత్వం మనదే
►ప్రభుత్వ పాఠశాలలతో ప్రైవేటు స్కూల్స్ పోటీపడే పరిస్థితి వస్తుంది
►గత ప్రభుత్వం చివరి ఏడాదిలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలు 37లక్షలు ఉంటే.. ఆ సంఖ్య 40 లక్షలు దాటింది
►ప్రభుత్వ స్కూళ్లమీద నమ్మకం కలిగింది
►డ్రాప్ అవుట్స్ గణనీయంగా తగ్గాయి
►డిగ్రీల్లో చేరకుండా 2018-19లో 81,813 ఉంటే అది 2022-23 నాటికి 22,387కు తగ్గింది
►2018-19లో ఇంజినీరింగ్ చదివేవాళ్లు 80వేలు మంది అయితే ఈ ప్రభుత్వంలో 1.2 లక్షలమంది చదువుతున్నారు. దాదాపు 50శాతం వృద్ధి ఉంది:
►ఉన్నత విద్యతో పాఠ్యప్రణాళికను మార్చాం
►జాబో ఓరియంటెడ్‌గా తీర్చిదిద్దాం
►25 మార్కెట్ ఓరియెంటెడ్, 67 బిజినెస్ ఒకేషన్ కోర్సులు ప్రవేశపెట్టాం
►దేశంలో తొలిసారిగా నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీని ప్రవేశపెట్టాం
►పిల్లల నైపుణ్యం పెంచడానికి ఆన్లైన్ కోర్సులు ఇప్పిస్తున్నాం
►మైక్రోసాఫ్ట్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది
►వారిచేత కోర్సులు చెప్పించి.. సర్టిఫికెట్లు ఇప్పిస్తున్నాం
►అమెజాన్ లాంటి సంస్థలు కూడా రాష్ట్రప్రభుత్వంతో భాగస్వామ్యం అయ్యాయి
►జగనన్న విదేశీ దీవెన కింద 21 ఫ్యాకల్టీలో 350 ప్రపంచస్థాయి కాలేజీల్లో రూ. 1.25 కోట్ల వరకూ కూడా ఫీజులు కడుతున్నాం
►సత్యానాదెళ్లలా.. మన రాష్ట్రం నుంచి ప్రతి కుటుంబం నుంచి రావాలి
►ప్రతి కుటుంబం నుంచి కూడా సత్యనాదెళ్లలు రావాలి
►ప్రతిభ మీరు చూపించండి… మీ ప్రతిభకు తోడుగా నేనున్నాను
►షాదీతోఫా, కళ్యాణమస్తు లాంటి పథకాలు కూడా టెన్త్ చదివితేనే అమలు
►విమర్శించే ప్రతిపక్షాలతా ఆలోచన చేయండి
►ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగేదా?
►లంచాలు ఇవ్వకుండా, వివక్ష లేకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి వచ్చేవా?
►అమ్మ ఒడి నుంచి చూస్తే.. విద్యాదీవెన, వసతి దీవెన, ఆసరా, చేయూత లాంటి పథకాలు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఎలా వస్తున్నాయి?
►అప్పుడు బడ్జెట్.. ఇప్పుడు కూడా అదే బడ్జెట్
►అప్పులు వృద్ధి చూస్తే.. అప్పటితో చూస్తే.. ఇప్పుడే తక్కువ
►కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు
►గతంలో ఎందుకు జరగలేదు? ఇప్పుడు మాత్రమే ఎందుకు జరగుతున్నాయి?
►గతంలో పేదవాడి గురించి ఆలోచన చేయలేదు
►పేదరికం పోవాలంటే.. ఏంచేయాలన్న ఆలోచన చేయలేదు
►గతంలో పాలకులంతా గజదొంగల ముఠాగా ఏర్పడ్డారు
►చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-౫ వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు
►ప్రజల గురించి వారెప్పుడూ ఆలోచన చేయలేదు
►దోచుకోవడం ఎలా.. ఎలా పంచుకోవడం.. అన్నదే వారి ఆలోచన
►అందుకే ఏ పేపర్లోనూ రాయరు… ఏ టీవీల్లోనూ డిబేట్లు పెట్టరు
►ప్రశ్నిస్తామన్న వాళ్లు… ప్రశ్నించరు
►ఇప్పుడు తోడేళ్లంతా కలిసికట్టుగా ఏకం అవుతామంటన్నారు
►జగన్‌కు వారి మాదిరిగా మీడియా ఉండకపోవచ్చు, దత్తపుత్రుడి సపోర్టూ ఉండకపోవచ్చు
►ఇవాళ జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్‌వారు
►పేదవాడు ఒకవైపున ఉన్నాడు.. పెత్తందార్లు మరోవైపున ఉన్నాడు
►రాబోయే రోజుల్లో మరిన్ని అబద్ధాలు చెప్తారు, మోసపూరిత మాటలు చెప్తారు
►మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా తీసుకోండి
►మంచి జరిగితే.. జగనన్నకు తోడుగా నిలవండి
►నా బలం మీరే.. నా నమ్మకం మీరే
►నేను నమ్ముకున్నది దేవుడి దయను, మీ అందరి చల్లని దీవెనలను
►రాబోయే రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహాసంగ్రామంలో మీ దీవెనలు ఉండాలని కోరుతున్నాను
► హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. తండ్రి ఆశయ సాధన కోసం పాటు పడుతున్న తనయుడు సీఎం జగన్. ముఖ్యమంత్రి జగనన్న పాలనలో అన్ని కులాలకు సమన్యాయం అందుతోంది. జగనన్న పాలనలో విద్యాశాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సీఎం జగన్ తీర్చిదిద్దారు.
సీఎం జగన్ పాలనలో ప్రభుత్వ పాఠశాలల టెన్త్ విద్యార్థులకు స్టేట్ ర్యాంకులు వచ్చాయి. జగనన్న.. విద్యను పేదవాడి హక్కుగా మార్చారు. పేద విద్యార్థులు చదువుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదు. చంద్రబాబు పాలనలో ఫీజు రియింబర్స్‌మెంట్ అరకొరగా ఇచ్చారు.
జగన్ పేదల వైపు నిలబడితే.. చంద్రబాబు, పవన్ పెత్తందారుల వైపు నిలబడ్డారు. చంద్రబాబు పది మందితో కలిసి వచ్చినా సీఎం జగన్ ఒక్కరే ఎదుర్కొంటారు. సీఎం జగన్ నాయకత్వంలో నేను పనిచేస్తా.
► కొవ్వూరు చేరుకున్న సీఎం జగన్.
► సీఎం జగన్‌కు స్వాగతం పలికిన మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన, విశ్వరూప్.
►కొవ్వూరు బయలుదేరిన సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా జనవరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన నిధులను సీఎం జగన్ లబ్ధిదారులకు జమచేయనున్నారు. ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తోంది.
► జనవరి–మార్చి 2023 త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరుస్తూ రూ.703 కోట్లను సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
► అనంతరం, తూర్పో గోదావరి జిల్లా కొవ్వూరులో జరగనున్న బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు.
‘జగనన్న విద్యా దీవెన’..
► పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవాలన్న ఆశయంతో.. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చేలా, వారి తల్లుల ఖాతాల్లో జగనన్న ప్రభుత్వం నేరుగా జమచేస్తోంది.
‘జగనన్న వసతి దీవెన’..
► అలాగే, ఉన్నత చదువులు చదివే ఈ పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఉండేందుకు వీలుగా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు అయితే రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ.. వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో ప్రభుత్వం నేరుగా జమచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment