kovvur
-
తూర్పు గోదావరి జిల్లాలో చైన్ స్నాచర్ల హల్ చల్
-
కొవ్వూరులో టీడీపీ నేతల ఇసుక దందా
-
బీజేపీ నేతలు షాక్ అయ్యేలా పార్టీ రాష్ట్రాధ్యక్షురాలు వ్యాఖ్యలు
-
గోదావరిలో దూకి కుటుంభం తో సహా ఆత్మహత్య యత్నం
-
తొలి ఫలితం కొవ్వూరు, నరసాపురం
సాక్షి, అమరావతి: వచ్చే జూన్ 4న కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం ఓట్ల లెక్కింపు మొదలైన కొన్ని గంటల్లోనే తేలిపోనుండగా.. మరికొన్ని నియోజకవర్గాల తుది ఫలితం కోసం రాత్రి వరకు వేచిచూడాల్సి ఉంటుంది. పోలైన ఓట్లు, కౌంటింగ్ హాళ్లలో ఏర్పాటు చేసిన టేబుళ్ల ఆధారంగా ఎన్నికల సంఘం నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపునకు అవసరమైన రౌండ్లను నిర్ధారించింది.దీని ప్రకారం.. రాష్ట్రంలో అన్నింటికంటే ముందుగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు (ఎస్సీ), పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల తుది ఫలితాలు మధ్యాహ్నంలోపే ప్రకటించే అవకాశముందని ఎన్నికల సంఘ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కేవలం 13 రౌండ్లలోనే లెక్కింపు పూర్తికానుంది. ఇదే సమయంలో రంపచోడవరం (ఎస్టీ), చంద్రగిరి నియోజకవర్గాల్లో అత్యధికంగా 29 రౌండ్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత పాణ్యం, భీమిలి నియోజకవర్గాల్లో 25 రౌండ్ల లెక్కింపు జరుగుతుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో తుది ఫలితాల వెల్లడికి రాత్రి 7 గంటల వరకు వేచిచూడాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 111 చోట్ల 20, అంత కంటే తక్కువ రౌండ్లలోనే పూర్తి రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో అత్యధికంగా 111 నియోజకవర్గాల్లో 20కంటే తక్కువ రౌండ్లలోనే లెక్కింపు పూర్తికానుంది. ఈ నియోజకవర్గాల ఫలితాలను మధ్యాహ్నం 2 గంటల్లోగా పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దీని ప్రకారం.. కౌంటింగ్ హాళ్లల్లో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. 60 నియోజకవర్గాల్లో 21 నుంచి 25 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నియోజకవర్గాల ఫలితాలను సాయంత్రంలోగా వెల్లడిస్తారు. ఎటువంటి గందరగోళం లేకుండా అందరి అనుమతితోనే సువిధ యాప్‌లో అప్లోడ్ చేసిన తర్వాతే ఫలితాలను ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం–21సీ, 21ఈలను అదేరోజు ఫ్లైట్‌లో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంటుంది. -
కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు కన్నుమూత
సాక్షి, తూర్పుగోదావది: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత పెండ్యాల వెంకట కృష్ణ బాబు మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. నేడు తెల్లవారుజామున కృష్ణబాబు చనిపోయినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.కృష్ణబాబు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామం దొమ్మేరుకు తరలించారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా 1953లో పాలకొల్లులో జన్మించిన కృష్ణబాబు.. కొవ్వూరు నియోజకవర్గంలో అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983 నుంచి 1994 వరకు(1983,1985, 1989, 1994) నాలుగుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో ఓటమి చెందిన ఆయన తిరిగి 2004లో అయిదవసారి కొవ్వూరు ఎమ్మెల్యేగా గెలిచారు.ఇక 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో కొవ్వూరు ఎస్సీ రిజర్వ్ కావడంతో ప్రత్యక్ష రాజకీయాలకు కృష్ణబాబు దూరంగా ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుదీర్ఘకాలం రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా కృష్ణబాబు పేరొందారు. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు ప్రస్తుతం స్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు నేతలు సంతాపం తెలియజేస్తున్నారు. -
సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
కొవ్వూరు: వేగంగా వెళ్తున్న లారీ సడన్‌గా బ్రేక్ వేసి రోడ్డు పక్కకు వెళ్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ఐషర్ వ్యాన్ బలంగా ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. కాపవరం సమీపంలో నేషనల్ హైవేపై ఫ్లైఓవర్ దిగువన శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. కొవ్వూరు రూరల్ ఎస్సై కె.సుధాకర్, పట్టణ సీఐ వి.జగదీశ్వరరావు కథనం ప్రకారం.. ఏలూరు నగరానికి చెందిన మేడం వినోద్ (32) సభలకు సౌండ్ సిస్టం ఏర్పాటు చేసే పనిచేస్తుంటాడు.వినోద్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. తన వృత్తిలో భాగంగా గుంటూరులో సభకు సౌండ్ సిస్టం అమర్చిన వినోద్ తిరిగి విశాఖపట్నం సమీపంలోని చోడవరంలో కార్యక్రమానికి సౌండ్ సిస్టంను తీసుకెళ్తున్నారు. ఈ సౌండ్ బాక్స్‌లను తీసుకుని ఏలూరుకు చెందిన మరో ఏడుగురితో చోడవరానికి ఐషర్ వ్యాన్‌లో బయలు దేరారు. ఈ నేపథ్యంలో కొవ్వూరు మండలం కాపవరం సమీపానికి వచ్చేసరికి హైవేపై ఫ్లైఓవర్ దిగువన జగ్గయ్యపేట నుంచి ఒడిశా రాష్ట్రానికి సిమెంట్ లోడుతో వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో పాటు, ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా రోడ్డు మార్జిన్లోకి వెళ్లింది.అప్పటికే వెనుక ఉన్న ఐషస్ వ్యాన్ అదుపు తప్పి వెనుక నుంచి లారీని ఢీకొంది. ఈ ఘటనతో మేడం వినోద్, అతని సహచరుడు దారబోయన ప్రభాకర్ (21) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వ్యాన్‌లో ఉన్న ఏలూరు పట్టణానికి చెందిన మరో ఆరుగురు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడు ప్రభాకర్‌కు ఇంకా వివాహం కాలేదు. అదే కారణం.. ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని చెబుతున్నారు. సడన్‌గా బ్రేక్ వేయడం, ఎటువంటి సిగ్నల్ ఇవ్వకపోవడం, రోడ్డు మార్జిన్లోకి లారీని ఒక్కసారిగా తిప్పేయడంతో వెనుక వస్తున్న వ్యాన్ అదుపుతప్పి ప్రమాదం జరిగిందని అంటున్నారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో హైవేపై ట్రాఫిక్ స్తంభించింది. కొవ్వూరు రూరల్ ఎస్సై కె.సుధాకర్, పట్టణ సీఐ వి.జగదీశ్వరరావులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కొవ్వూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తీయించి ట్రాఫిక్‌ను క్రమబదీ్ధకరించారు. -
వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు
-
దారిపొడవునా జననేత సీఎం జగన్ కు జన నీరాజనం
-
చింతారెడ్డిపాలెం నుంచి కొనసాగుతున్న మేమంతా సిద్ధం బస్సుయాత్ర
-
టీడీపీకి రాజీనామా దిశగా మాజీ మంత్రి కేఎస్ జవహర్?
సాక్షి, తూర్పుగోదావరి: టికెట్ దక్కకపోవడంతో టీడీపీని వీడే యోచనలో మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఉన్నట్లు సమాచారం. టీడీపీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జవహర్.. అధిష్టానం ఫోన్లకు సైతం స్పందించలేదు. జవహర్‌ను బుజ్జగించేందుకు ముప్పినేని వెంకటేశ్వర్లు ప్రయత్నాలు మొదలు పెట్టారు. జవహర్‌ను బుజ్జగించేందుకు టీడీపీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో చంద్రబాబు కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. కొవ్వూరు టికెట్‌ను జవహర్ ఆశిస్తుండగా, నిన్న ప్రకటించిన జాబితాలో కొవ్వూరు స్థానాన్ని ముప్పిడి వెంకటేశ్వరరావుకు కేటాయించిన సంగతి తెలిసిందే. జవహర్.. కొవ్వూరులోని నివాసంలో ముఖ్య అనుచరులతో భేటీ కానున్నట్లు తెలిసింది. ఇవాళో, రేపో టీడీపీని వీడే ప్రకటన చేయనున్నట్లు సమాచారం. మాజీ మంత్రి కేఎస్ జవహర్‌కు ఘోర అవమానం ఎదురైందా? పార్టీ నుంచి పొమ్మనలేక పొగ పెట్టారా? ద్విసభ్య కమిటీలోని ఓ నేత ఒత్తిడికి తలొగ్గి నిర్ణయం తీసుకున్నారా? ఏళ్ల తరబడి పార్టీకి చేసిన సేవను లెక్క చేయకుండా పక్కన పెట్టేశారా? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల రెండో జాబితాలో ఆయనకు చోటు దక్కకపోవడమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. కొవ్వూరు నియోజకవర్గం నుంచి టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును ఖరారు చేస్తూ టీడీపీ అధిష్టానం గురువారం అధికారిక ప్రకటన చేసింది. ఈసారి జవహర్‌కు కొవ్వూరు టికెట్టు దక్కనీయకుండా పార్టీలోని ఆయన వైరివర్గాలు బలంగా పని చేశాయి. దీంతో ఒకవేళ ఇక్కడ కాకపోయినా గత ఎన్నికల్లో పోటీ చేసి, ఓడిన ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోనైనా టికెట్టు ఇస్తారని జవహర్ వర్గం భావించింది. కానీ, అక్కడ టీడీపీ అభ్యర్థిగా కొటికలపూడి శ్రీనివాసరావును అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. దీంతో గోపాలపురం నియోజకవర్గానికై నా పంపుతారని భావించగా.. మద్దిపాటి వెంకట్రాజు పేరు ఖరారు చేసింది. ఇప్పుడు కొవ్వూరులో కూడా ముప్పిడి పేరు ప్రకటించడం ద్వారా అన్నిచోట్లా జవహర్‌కు చంద్రబాబు మొండిచేయే చూపారు. ఫలితంగా పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో మాత్రమే కొనసాగే పరిస్థితి జవహర్‌కు ఏర్పడింది. ఈ పరిణామంతో ఆయన రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. భగ్గుమన్న జవహర్ వర్గీయులు పార్టీ జిల్లా అధ్యక్షుడు.. అందునా మాజీ మంత్రి అయిన జవహర్‌నే పక్కన పెట్టడం రాజకీయ వర్గాల్లో హట్ టాపిక్‌గా మారింది. జిల్లా స్థాయి నేతనే ఇలా పరాభవిస్తే.. ఇక సామాన్య నేతలకు టీడీపీలో న్యాయం ఎలా జరుగుతుందన్న ప్రశ్న ఆయా వర్గాల్లో ఉత్పన్నమవుతోంది. అధినేత నిర్ణయం జవహర్ వర్గీయులకు మింగుడు పడటం లేదు. తమ నేతకు చేసిన అవమానానికి పార్టీ తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదని, రానున్న ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని వారు సవాల్ విరుసుతున్నారు. ఈ అవమానంపై వారు భగ్గుమన్నారు. కొవ్వూరులో ఏర్పాటు చేసిన టీడీపీ ఫెక్ల్సీలను చించేశారు. అధిష్టానానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. తాజా పరిణామాల నేపథ్యంలో జవహర్ తన వర్గీయులతో సమాలోచనలు చేస్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. జవహర్‌ను బుజ్జగించేందుకు టీడీపీ అధిష్టానం సుజయకృష్ణ రంగారావును పంపింది. పార్టీ ఆదేశాల మేరకు పని చేయాలని సూచిస్తున్నా జవహర్ ససేమిరా అంటున్నారు. -
కొవ్వూరు టీడీపీలో ఇరు వర్గాల కొరకొర
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి కేఎస్ జవహర్‌పై అసమ్మతి రగులుతోంది. టీడీపీలోని ద్విసభ్య కమిటీ ఒక వర్గం గానూ, నియోజకవర్గాన్ని ప్రభావితం చేయగల మరో ముఖ్యనేత అచ్చిబాబు వర్గం మరోపక్క జవహర్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి. నియోజకవర్గంలో వారి సానుభూతిపరులను ఏకం చేస్తున్నాయి. రహస్య సమావేశాలు పెట్టి చర్చలు జరుపుతున్నాయి. జవహర్‌కు అసెంబ్లీ స్థానం కేటాయిస్తే మూకుమ్మడిగా వ్యతిరేకిస్తామని, తమ అభిప్రాయాన్ని కాదని అవకాశం కల్పిస్తే సార్వత్రిక ఎన్నికల్లో అడ్రస్ లేకుండా చిత్తుగా ఓడిస్తామని స్పష్టం చేస్తున్నాయి. ఈమేరకు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొవ్వూరులో ఈ రెండు వర్గాల నాయకులు గురువారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ‘జవహర్ వద్దు – టీడీపీ ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. అధిష్టానం కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఈ పరిణామం కొవ్వూరు నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ముప్పిడిని బరిలోకి దింపే యోచన కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును బరిలోకి దింపేందుకు ఈ రెండు వర్గాలూ పావులు కదుపుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు సైతం ముప్పిడి పోటీని అంగీకరించారన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ద్విసభ్య కమిటీ, అచ్చిబాబు భరోసాతో ముప్పిడి రంగంలోకి దిగి నియోజకవర్గంలో పర్యటనలు ముమ్మరం చేశారు. నేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. గతంలో జవహర్‌తో ద్విసభ్య కమిటీలోని ఓ సభ్యుడైన జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి సన్నిహితంగా మెలిగారు. ఆ సాన్నిహిత్యంతో ఆయన ఆర్థికంగా ఎదిగినట్లు చెబుతారు. అనంతరం వారి మధ్య తలెత్తిన ఆర్థిక వివాదాలతో చౌదరి సైతం జవహర్‌కు దూరమయ్యారు. జవహర్ మంత్రిగా ఉన్న సమయంలో అచ్చిబాబు వర్గాన్ని వ్యతిరేకించడంతో ఆయన కూడా వ్యతిరేక కూటమి కట్టారు. ఫ్లెక్సీల వివాదం తమ పంతం నెగ్గించుకోడానికి ద్విసభ్య కమిటీ, అచ్చిబాబు వర్గాలు దొరికిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఇటీవల జవహర్ పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిలో వ్యక్తుల పేర్లకు బదులు గ్రామ టీడీపీ నేతలు అని పేర్కొన్నారు. ఈ ఫ్లెక్సీల ఏర్పాటు దొమ్మేరు గ్రామంలో వివాదంగా మారింది. ఓ వర్గం నేతలు గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి మరీ జవహర్‌పై విమర్శలు గుప్పించారు. జవహర్ వద్దు.. టీడీపీ ముద్దు జవహర్‌కు వ్యతిరేకంగా తాజాగా మరో నినాదాన్ని తెర పైకి తీసుకువచ్చారు. ‘జవహర్ వద్దు.. టీడీపీ ముద్దు’ అని ప్రచారం చేస్తున్నారు. గురువారం ఓచోట ఆత్మీయ సమావేశం పెట్టి మరీ విమర్శలు చేశారు. జవహర్‌ను కొవ్వూరు అభ్యర్థిగా పరిగణనలోకి తీసుకోవద్దని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. 2014 నుంచి సీనియర్ నాయకులను, కార్యకర్తలను పక్కన పెట్టిన ఆయన వర్గ విభేదాలకు కారకుడయ్యారని ఆరోపించారు. నియోజకవర్గ నాయకులు పలుమార్లు హెచ్చరించినా ఆయన తీరు మార్చుకోవడం లేదని అంటున్నారు. జవహర్ వైపే అధినేత మొగ్గు నియోజకవర్గంలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు వాటికి చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదు. సీటు ఎవరికన్న స్పష్టత ఇవ్వకపోవడంతో ఇరు వర్గాల మధ్య రోజు రోజుకూ విభేదాలు తీవ్రమవుతున్నాయి. జవహర్ వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని ఆయన వర్గం ప్రచారం చేసుకుంటోంది. ఇదే జరిగితే జవహర్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్న రెండు వర్గాలూ టీడీపీకి దూరమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ జవహర్‌ను కాదంటే ఆయన వర్గం వ్యతిరేకమయ్యే పరిస్థితి ఎదురవుతుంది. ఈ వర్గ విభేదాలతో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. -
టీడీపీలో ఫ్లెక్సీల లొల్లి
కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ తన పుట్టిన రోజును వేదికగా చేసుకుని నియోజకవర్గవ్యాప్తంగా గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఫ్లెక్సీల్లో జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నట్లు వ్యక్తుల పేర్లు కాకుండా గ్రామ టీడీపీ అని పేర్కొనడం వివాదానికి కారణమైంది. నియోజకవర్గ టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న పెండ్యాల అచి్చబాబు స్వగ్రామమైన దొమ్మేరులో ఆయన ఫొటో లేకుండా ఈ తరహా ఫ్లెక్సీల ఏర్పాటును ఆ పార్టీ స్థానిక నాయకులు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో అచ్చిబాబు వర్గీయులు శుక్రవారం గ్రామంలో సమావేశమై మరీ జవహర్‌పై బహిరంగ విమర్శలకు దిగారు. గ్రామ కమిటీ, స్థానిక నాయకుల ప్రమేయం లేకుండా ‘దొమ్మేరు టీడీపీ’ అని పేర్కొంటూ తమ గ్రామంలో ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారని, ఇది జవహర్ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. పార్టీని రెండు గ్రూపులుగా చేసేందుకు ఆయన ప్రయతి్నస్తున్నారని సీనియర్ నాయకుడు, ఎంపీటీసీ సభ్యుడు యలమర్తి శ్రీరామచంద్రమూర్తి (రాంబాబు)మండిపడ్డారు. దొమ్మేరు గ్రామ కమిటీని సంప్రదించకుండా ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అచి్చబాబు చెప్పినట్లే నడుస్తాం తప్ప, జవహర్ చెప్పినట్లు కాదని స్పష్టం చేశారు. సీనియర్ నాయకుడు కేవీకే రంగారావు, ఉప సర్పంచ్ కలగర సుబ్బారావు, టీడీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కొక్కిరిపాటి శ్రీహరి కూడా జవహర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పారీ్టకి, ఆ ఫ్లెక్సీలకు ఎటువంటి సంబంధమూ లేదని ప్రకటించారు. గతంలో అచ్చిబాబు చెబితేనే జవహర్‌కు 13 రోజుల ముందు టికెట్ ఇచ్చినా ఎమ్మెల్యేగా గెలిపించామని అన్నారు. దొమ్మేరులో జవహర్‌కు మద్దతుదారులు లేరని ప్రకటించారు. అందువల్లే సొంతంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారన్నారని అన్నారు. కొవ్వూరులో శుక్రవారం జరిగిన జవహర్ పుట్టిన రోజు వేడుకలకు సైతం అచి్చబాబు వర్గీయులు దూరంగానే ఉన్నారు. ఇటీవల అభ్యర్థుల ఖరారులో భాగంగా అధిష్టానం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో కూడా జవహర్ పేరు ప్రస్తావించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజా వివాదానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎనిమిదేళ్లుగా..: జవహర్, అచ్చిబాబు వర్గాల మధ్య ఏడెనిమిదేళ్లుగా వివాదం నడుస్తోంది. దీంతో నియోజకవర్గంలో టీడీపీ రెండు గ్రూపులుగా పనిచేస్తోంది. గతంలో అచి్చబాబు వర్గం వ్యతిరేకించినందునే జవహర్‌ను అధిష్టానం కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గానికి పంపింది. అక్కడ ఓటమి చవిచూసిన ఆయన మళ్లీ కొవ్వూరుపై దృష్టి సారించారు. పేరుకు జిల్లా అధ్యక్షుడి పదవి కట్టబెట్టినప్పటికీ కొవ్వూరు నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని అధిష్టానం షరతు విధించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
సామాజిక జైత్రయాత్ర: ఏపీలో అంబేద్కర్ మెచ్చిన పాలన
సాక్షి, నెల్లూరు జిల్లా: గడిచిన నాలుగున్నరేళ్ల పాలనలో సీఎం జగన్.. బడుగు, బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేసి భరోసా కల్పించారు. చేసిన మేలును వివరించేందుకు మంగళవారం కోవూరు నియోజకవర్గంలోని నార్తురాజుపాళెంలో సామాజిక సాధికార బస్సు యాత్రను నిర్వహించారు. సామాజిక సాధికార యాత్ర మధ్యాహ్నం టపాతోపు వద్ద నుంచి ప్రారంభమైంది. అక్కడ నుంచి రాజుపాళెం సెంటర్‌కు చేరుకుంది. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. రీజినల్ కో-ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, ఉపముఖ్యమంత్రి పీ రాజన్నదొర, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, నెల్లూరు నగర ఎమ్మెల్యే పీ అనిల్‌కుమార్‌యాదవ్, ప్రముఖ సినీనటుడు అలీ, ఇతర నేతలు పాల్గొన్నారు. ఏపీలో అంబేద్కర్ మెచ్చిన పాలన: రాజన్న దొర ఏపీలో అంబేద్కర్ మెచ్చిన పాలన జరుగుతుందని డిప్యూటీ సీఎం రాజన్న దొర అన్నారు. గత ప్రభుత్వంలో మాదిరి లంచాలు, అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. గిరిజనులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. సామాజిక న్యాయం సీఎం జగన్ తోనే సాధ్యం. టీడీపీ హయాంలో గిరిజనులకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు.. వైసీపీ హయాంలో గిరిజనులకు సమ న్యాయం జరుగుతుంది. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో గిరిజనులకు 40 వేల ఎకరాలు ఇస్తే.. సీఎం జగన్ నాలుగన్నర ఏళ్లలో గిరిజనులకు ఇచ్చిన భూమి మూడు లక్షల ఎకరాలు. దళిత, గిరిజన పిల్లలు ఇంగ్లిష్ విద్యను అభ్యసించడం చంద్రబాబుకి ఇష్టం లేదు. టీడీపీ హయాంలో గిరిజనులకు జరిగిన అన్యాయంపై విజయవాడ, విజయనగరంలో ఎక్కడైనా సరే చర్చకు సిద్ధం. మాఫీ పేరుతో అక్క చెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేసిన విషయాన్నీ ఇంకా ఎవ్వరూ మరిచిపోలేదు. దగుల్బాజీ, దగాకోరు, మోసగాళ్లు అందరూ టీడీపీ, జనసేనలోనే ఉన్నారు. రాష్ట్ర చరిత్రలో సామాజిక సాధికార యాత్ర నిలిచిపోతుంది: మంత్రి మేరుగ నాగార్జున ఎస్టీ,ఎస్టీ,బీసీల సామాజిక స్థితిగతులు పెరగాలని సీఎం జగన్ నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా అందరికి సంక్షేమ పథకాలు అందించడమే సీఎం జగన్‌కి తెలిసిన సామాజిక సాధికారత. దళితులపై దాడులు, దౌర్జన్యాలు టీడీపీ హయాంలో ఎక్కువగా జరిగిన విషయాలను రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదు. చంద్రబాబుకి వయస్సు పైబడి.. మతిస్థిమితం కోల్పోయారు. భావితరాల భవిష్యత్తును ఇచ్చే ముఖ్యమంత్రి ఏపీకి దొరికారు. ఆయన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. రాజ్యాంగబద్ధంగా దళితులకీ వచ్చిన హక్కులను చంద్రబాబు కాలరాశారు టీడీపీ కళ్లకు కనిపించడం లేదా?: ఎమ్మెల్సీ పోతుల సునీత లక్షల ఉద్యోగాలు సీఎం జగన్ ఇస్తే.. ఉద్యోగాలు ఇవ్వలేదని యువగళం సభలో లోకేష్ మాట్లాడటం సిగ్గు చేటు. అభివృద్ధి జరగలేదని ఎల్లో మీడియతో ప్రచారం చేయిస్తున్నారు. పరిశ్రమల స్థాపన.. ఫిషింగ్ హార్భర్లు ఏర్పాటు.. టీడీపీకి కళ్లకి కనిపించడం లేదు. 2019లో వచ్చిన ఫలితాలే.. 2024లో కూడా రిపీట్ అవుతాయి. పవన్, చంద్రబాబు, లోకేష్‌లు టూరిస్ట్ రాజకీయాలు చేసే నాయకులు సీఎం జగన్ ఆలోచన గొప్పది: అలీ పేదల కష్టాలను సీఎం జగన్ దగ్గర నుంచి చూశారు. వారి కడుపు నింపేందుకు సంక్షేమ పథకాలకు రూప కల్పన చేశారు. తండ్రి వైఎస్సార్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ వంటి పథకాలను సీఎం జగన్ కొనసాగిస్తున్నారు. ప్రతి నిరుపేదకి సొంత ఇళ్లు ఉండాలనే సీఎం జగన్ చేసిన ఆలోచన గొప్పది. అదే జరిగితే సంక్షేమ పథకాలు అందవు: మాజీ మంత్రి అనిల్ ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను గుండెల్లో పెట్టుకుని పథకాలు అందిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్. వలంటీర్లను తీసేస్తామని టీడీపీ చెబుతుంది. అదే జరిగితే సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందవు. జగన్ గురించి ఎవరెన్ని చెప్పినా నమ్మొద్దు.. గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే వ్యక్తి జగన్. పవన్, చంద్రబాబు కట్ట కట్టుకుని వచ్చినా సీఎం జగన్ వెంట్రుక కూడా పీకలేరు. -
నియోజక వర్గ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించిన తానేటి వనిత
-
సీఎం జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు: తానేటి వనిత
సాక్షి, అమరావతి: తమ ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం పాటుపడే ప్రభుత్వమని, ప్రజలందరికీ సామాజిక న్యాయం చేస్తోన్న సంక్షేమాభివృద్ధి ప్రభుత్వమని రాష్ట్ర హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. శుక్రవారం అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి ఆమె ఆత్మీయ స్వాగతం పలికారు. సభా కార్యక్రమానికి ముందు సీఎం జగన్‌తో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా కొవ్వూరులో ముఖ్యమంత్రి జగన్ పర్యటన విజయవంతం కావడం, సభలో నియోజకవర్గ అభివృద్ధికి సీఎం హామీల గురించి మరోసారి చర్చించి ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కాగా, బుధవారం సీఎం పర్యటన సందర్భంగా వచ్చిన అర్జీల పట్ల అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి 24 గంటల్లోనే గురువారం రోజున బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ చేశామని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఇంత త్వరిత గతిన సమస్యలకు పరిష్కారం చూపిన ముఖ్యమంత్రి ఎవరూ లేరని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే, నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిన విజ్ఞప్తి మేరకు డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి రూ.30 కోట్లతో పాటు 3 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, కొవ్వాడ కెనాల్ వద్ద కల్వర్ట్, మూడు మండలాల్లో మూడు అంబేడ్కర్ భవనాలు, ముస్లింలకు షాదీఖానా, ఎస్సీలకు కమ్యూనిటీ హాలు, కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి హామీ ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి జగన్‌కు హోంమంత్రి వనిత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇది కూడా చదవండి: సీఎం జగన్ నాలుగేళ్ల పాలనలో ఎన్ని మార్పులు.. ఎన్ని సంస్కరణలు -
జగన్ ను ఎదుర్కోవడానికి తోడేళ్లందరూ ఏకమవుతున్నారు: సీఎం జగన్
-
పిల్లలు చదువుకుంటే భావితరాలు బాగుపడతాయి
-
‘నేను ఇంత ఆనందంగా ఉండటానికి కారణం జగనన్న’
కొవ్వూరు: జనవరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ బుధవారం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పర్యటనకు వచ్చారు. దీనిలో భాగంగా ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమంపై ప్రశంసలు కురిపించింది. ‘నేను ఇంత ఆనందంగా ఉండటానికి కారణం జగనన్న. మా నాన్న, అమ్మ ఇద్దరూ దివ్యాంగులు. మా నాన్నకు పక్షవాతం వచ్చి నడవలేని స్థితిలో ఉంటే మా అమ్మ చెవిటి-మూగ. అయితే నేను ఉన్నాను. నేను విన్నాను అంటూ జగనన్న మాకు అండగా నిలిచారు. మాకు విద్యా దీవెనతో పాటు, వసతి దీవెన కూడా జగనన్న అందించారు. మా కుటుంబానికి అండగా నిలబడిన జగనన్నకు కృతజ్ఞతలు. నా చిట్టి చెల్లెమ్మకు నేను ఉన్నాను అంటూ వసతి దీవెన అందించి నన్ను నిలబెట్టాడు మా అన్న. నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకూ తెలుగు మీడియంలోనే చదువుకున్నా.. నాకున్న ఆర్థిక పరిస్థితి సరిపోక తెలుగు మీడియంలోనే చదువుకున్నా. ఇప్పుడు కార్పోరేట్ కాలేజీలో బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నానంటే అది మీ దయే అన్నా. నేను స్కూల్ స్టడీస్‌లో ఉండగా అంతా ఇబ్బందిగా ఉండేది. వసతులు ఏవీ బాగుండేవి కావు. మీరు వచ్చిన తర్వాత స్కూళ్ల రూపురేఖలే మార్చేశారన్నా. ఇప్పటి గవర్నమెంట్ స్కూళ్లను చూస్తుంటే మళ్లీ స్కూల్‌కి వెళ్లాలనిపిస్తుందన్నా’ అని విద్యా దీవెన అందుకుంటున్న తాళ్లపూడి మండలకు చెందిన దివ్య అనే డిగ్రీ బాలిక తన ప్రసంగం ద్వారా ఆకట్టుకుంది. ప్రసంగం తర్వాత ఆ విద్యార్థిని వేదికపై ఉన్న సీఎం జగన్ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకుంది. ‘సార్, నేను దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను, మా నాన్న రైతు, అమ్మ గృహిణి, నేను జగనన్న విద్యాదీవెన లబ్ధిదారుడిని, గతంలో కేవలం రూ. 35 వేలు మాత్రమే ఇచ్చేవారు కానీ ఇప్పుడు పూర్తిగా ఫీజు మొత్తం కూడా ఫీజు రీఇంబర్స్మెంట్ ద్వారా పొందుతున్నాం. మీరు మోసపూరిత హమీలు ఇవ్వకుండా ఇచ్చిన ప్రతి హమీ నెరవేర్చిన ఏకైక నాయకుడు మీరు. మీరు ఉన్నత విద్యలో ప్రభావవంతమైన సంస్కరణలు తీసుకొచ్చారు, నూతన విద్యా విధానానికి సంబంధించిన పాలసీని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మనది. మన విద్యా విధానం అంతర్జాతీయ స్ధాయికి ఎదిగింది, మీ హయాంలో ఇంజినీరింగ్ ప్లేస్మెంట్లలో 90 శాతంపైగా సాధిస్తున్నారు, నా కాలేజ్ విద్యార్ధి అమేజాన్ లో రూ. 44 లక్షల ప్యాకేజ్ కి సెలక్ట్ అయ్యాడంటే మీరే కారణం. మీ నవరత్నాల పథకాల లబ్ధి పొందుతున్నాం, మీరు మాపై ఖర్చుపెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేసి ఏపీని ముందుకు తీసుకెళతాం, మీ పేరు ఎక్కడ రాయాలన్న చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీగా కాకుండా ద పర్మినెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీగా రాయాలనుకుంటున్నాం, అటువంటి అవకాశం మీరు కల్పించాలి, ధ్యాంక్యూ.’ -ప్రసన్నకుమార్, బీటెక్ విద్యార్ధి, తాడేపల్లిగూడెం -
రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి ఒక సత్య నాదెళ్ల రావాలి: సీఎం జగన్
Updates సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ►మన సమాజంలో పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి ►ఆ కుటుంబాల తలరాతలు మారాలి ►వారు పేదరికం నుంచి బయటకు రావాలి ►ఆ కుటుంబాలనుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లు లాంటి వారు రావాలి ►పేదరికం అనే సంకెళ్లను వారు తెంచుకోవాలి ►దానికి చదవులు ఒక్కటే మార్గం ►అందుకే నాలుగేళ్ల ప్రభుత్వ పాలనలో మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ వాడిగా అడుగులేశాం ►నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలు సామాజికంగాను, ఆర్థికంగానూ గట్టిగా నిలబడాలంటే, వారు వివక్ష సంకెళ్లను తెంచుకోవాలంటే.. దానికి చదువులు ఒక్కటే మార్గం ►ఒక అంబేద్కర్, ఒక సావిత్రీ పూలే కాని, మౌలానా అబ్దుల్ ఆజాద్ కాని… వారి నోట్లోనుంచి వచ్చిన మాట ఏంటంటే.. చదువు అనేది ఒక్క అస్త్రం అని అలాంటి చదువుల విప్లవం మన రాష్ట్రంలో నాలుగు సంవత్సరాలుగా చేపట్టాం ►చదువులు అన్నవి పేదలకు ఒక హక్కుగా అందాలి ►జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలను అమలు చేస్తోంది ►పూర్తి ఫీజులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ప్రతి త్రైమాసికంలోనూ జమచేస్తున్నాం ►జనవరి-ఫిబ్రవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి ఇప్పుడు డబ్బు జమచేస్తున్నాం ►లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమచేస్తున్నాం ►చంద్రబాబు ప్రభుత్వంలో అరకొరగా ఫీజులు ఇచ్చారు ► రూ. 1777 కోట్ల రూపాయలు బకాయిపెట్టాడు చంద్రబాబు ఆ డబ్బును కూడా మన ప్రభుత్వమే తీర్చింది ►బోర్డింగ్ ఫీజులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది ►ప్రతి ఏటా వసతి దీవెన కింద రెండుమార్లు తల్లుల ఖాతాల్లోకి జమచేస్తున్నాం ►అక్షరాల 25 లక్షల మందికిపైగా వర్తింపుచేస్తున్నాం ► కేవలం ఒక్క ఈ పథకానికే రూ.4,275.76 ఖర్చుచేశాం ►చంద్రబాబు గారి హయాంలో ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలి ► ఫీజులు అరకొరగా ఇచ్చేవారు ►ఎప్పుడు ఇచ్చేవారో తెలిసేది కాదు ►ముష్టి వేసినట్టు ఇచ్చేవారు ►కేవలం రూ.35వేలు ఇచ్చేవారు ►మన ప్రభుత్వం ఫీజులు ఎంతైతే అంత ఇస్తోంది ►పిల్లలకు మంచి జరగాలని ఎంత ఫీజులైతే అంత చెల్లిస్తున్నాం ►ఎంత ఫీజులైనా ఫర్వాలేదు.. మీరు చదవండి… మీ జగనన్న చెల్లిస్తాడు ►పిల్లలకు మంచి మేనమామగా ఎప్పుడూ ఉంటాను ►ఇలాంటి పథకాలు ఇస్తుంటే… రాష్ట్రం దివాళా తీస్తుందని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు ►మీడియా వ్యవస్థలు కొన్ని ఇలానే మాట్లాడుతున్నాయి ►భావి తరాల పిల్లల తలరాతలు మార్చేందుకు మేం పెట్టే ఖర్చు.. మానవ వనరులమీద పెట్టుబడులు అని చెప్తున్నాను ►రాబోయే రోజుల్లో రాష్ట్రానికి దశ, దిశ ఆంధ్రప్రదేశ్ చూపిస్తోంది ►ఏ రాష్ట్రంలో లేని విధంగా నర్సరీ నుంచి, ఉన్నత విద్యవరకూ విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి ►ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయి ►అందులో చదువులు కూడా మారుతున్నాయి ►సీబీఎస్ఈ ఇంగ్లిషు మీడియం చదువులు వచ్చాయి ►బై లింగువల్ టెక్ట్స్‌బుక్స్ వచ్చాయి ►గొప్ప మార్పులకు నిరద్శనం ఇది ►అంగన్వాడీల స్వరూపం కూడా మారుతోంది ►పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాం ►ఈ విషయంలో అక్షరాల ఒక్కో పథకానికి రూ.౨వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం ►విద్యాకానుక ద్వారా స్కూళ్లు తెరిచే సమయానికి కిట్లను అందిస్తున్నాం ►ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న ప్రతి పిల్లాడికి మంచి బోధన అందించడంపై దృష్టిపెట్టాం ►సబ్జెక్టు టీచర్ల కాన్సెప్టు తీసుకు వచ్చాం ►పిల్లలకు ఇంటికి వెళ్లిన తర్వాత ట్యూటర్ ఉండాలన్న తాపత్రయంతో బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్స్ ఇచ్చాం ►ఆఫ్‌లైన్‌లో పనిచేసే ట్యాబులు ఇచ్చాం ►నాడు – నేడు పూర్తిచేసుకున్న మొదటి దఫా స్కూళ్లలో 6 నుంచి పై తరగుతులకు డిజిటల్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాం ►ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ద్వారా డిజిటల్ బోధన తీసుకున్న ప్రభుత్వం మనదే ►ప్రభుత్వ పాఠశాలలతో ప్రైవేటు స్కూల్స్ పోటీపడే పరిస్థితి వస్తుంది ►గత ప్రభుత్వం చివరి ఏడాదిలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలు 37లక్షలు ఉంటే.. ఆ సంఖ్య 40 లక్షలు దాటింది ►ప్రభుత్వ స్కూళ్లమీద నమ్మకం కలిగింది ►డ్రాప్ అవుట్స్ గణనీయంగా తగ్గాయి ►డిగ్రీల్లో చేరకుండా 2018-19లో 81,813 ఉంటే అది 2022-23 నాటికి 22,387కు తగ్గింది ►2018-19లో ఇంజినీరింగ్ చదివేవాళ్లు 80వేలు మంది అయితే ఈ ప్రభుత్వంలో 1.2 లక్షలమంది చదువుతున్నారు. దాదాపు 50శాతం వృద్ధి ఉంది: ►ఉన్నత విద్యతో పాఠ్యప్రణాళికను మార్చాం ►జాబో ఓరియంటెడ్‌గా తీర్చిదిద్దాం ►25 మార్కెట్ ఓరియెంటెడ్, 67 బిజినెస్ ఒకేషన్ కోర్సులు ప్రవేశపెట్టాం ►దేశంలో తొలిసారిగా నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీని ప్రవేశపెట్టాం ►పిల్లల నైపుణ్యం పెంచడానికి ఆన్లైన్ కోర్సులు ఇప్పిస్తున్నాం ►మైక్రోసాఫ్ట్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది ►వారిచేత కోర్సులు చెప్పించి.. సర్టిఫికెట్లు ఇప్పిస్తున్నాం ►అమెజాన్ లాంటి సంస్థలు కూడా రాష్ట్రప్రభుత్వంతో భాగస్వామ్యం అయ్యాయి ►జగనన్న విదేశీ దీవెన కింద 21 ఫ్యాకల్టీలో 350 ప్రపంచస్థాయి కాలేజీల్లో రూ. 1.25 కోట్ల వరకూ కూడా ఫీజులు కడుతున్నాం ►సత్యానాదెళ్లలా.. మన రాష్ట్రం నుంచి ప్రతి కుటుంబం నుంచి రావాలి ►ప్రతి కుటుంబం నుంచి కూడా సత్యనాదెళ్లలు రావాలి ►ప్రతిభ మీరు చూపించండి… మీ ప్రతిభకు తోడుగా నేనున్నాను ►షాదీతోఫా, కళ్యాణమస్తు లాంటి పథకాలు కూడా టెన్త్ చదివితేనే అమలు ►విమర్శించే ప్రతిపక్షాలతా ఆలోచన చేయండి ►ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగేదా? ►లంచాలు ఇవ్వకుండా, వివక్ష లేకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి వచ్చేవా? ►అమ్మ ఒడి నుంచి చూస్తే.. విద్యాదీవెన, వసతి దీవెన, ఆసరా, చేయూత లాంటి పథకాలు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఎలా వస్తున్నాయి? ►అప్పుడు బడ్జెట్.. ఇప్పుడు కూడా అదే బడ్జెట్ ►అప్పులు వృద్ధి చూస్తే.. అప్పటితో చూస్తే.. ఇప్పుడే తక్కువ ►కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు ►గతంలో ఎందుకు జరగలేదు? ఇప్పుడు మాత్రమే ఎందుకు జరగుతున్నాయి? ►గతంలో పేదవాడి గురించి ఆలోచన చేయలేదు ►పేదరికం పోవాలంటే.. ఏంచేయాలన్న ఆలోచన చేయలేదు ►గతంలో పాలకులంతా గజదొంగల ముఠాగా ఏర్పడ్డారు ►చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-౫ వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు ►ప్రజల గురించి వారెప్పుడూ ఆలోచన చేయలేదు ►దోచుకోవడం ఎలా.. ఎలా పంచుకోవడం.. అన్నదే వారి ఆలోచన ►అందుకే ఏ పేపర్లోనూ రాయరు… ఏ టీవీల్లోనూ డిబేట్లు పెట్టరు ►ప్రశ్నిస్తామన్న వాళ్లు… ప్రశ్నించరు ►ఇప్పుడు తోడేళ్లంతా కలిసికట్టుగా ఏకం అవుతామంటన్నారు ►జగన్‌కు వారి మాదిరిగా మీడియా ఉండకపోవచ్చు, దత్తపుత్రుడి సపోర్టూ ఉండకపోవచ్చు ►ఇవాళ జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్వారు ►పేదవాడు ఒకవైపున ఉన్నాడు.. పెత్తందార్లు మరోవైపున ఉన్నాడు ►రాబోయే రోజుల్లో మరిన్ని అబద్ధాలు చెప్తారు, మోసపూరిత మాటలు చెప్తారు ►మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా తీసుకోండి ►మంచి జరిగితే.. జగనన్నకు తోడుగా నిలవండి ►నా బలం మీరే.. నా నమ్మకం మీరే ►నేను నమ్ముకున్నది దేవుడి దయను, మీ అందరి చల్లని దీవెనలను ►రాబోయే రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహాసంగ్రామంలో మీ దీవెనలు ఉండాలని కోరుతున్నాను ► హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. తండ్రి ఆశయ సాధన కోసం పాటు పడుతున్న తనయుడు సీఎం జగన్. ముఖ్యమంత్రి జగనన్న పాలనలో అన్ని కులాలకు సమన్యాయం అందుతోంది. జగనన్న పాలనలో విద్యాశాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సీఎం జగన్ తీర్చిదిద్దారు. సీఎం జగన్ పాలనలో ప్రభుత్వ పాఠశాలల టెన్త్ విద్యార్థులకు స్టేట్ ర్యాంకులు వచ్చాయి. జగనన్న.. విద్యను పేదవాడి హక్కుగా మార్చారు. పేద విద్యార్థులు చదువుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదు. చంద్రబాబు పాలనలో ఫీజు రియింబర్స్‌మెంట్ అరకొరగా ఇచ్చారు. జగన్ పేదల వైపు నిలబడితే.. చంద్రబాబు, పవన్ పెత్తందారుల వైపు నిలబడ్డారు. చంద్రబాబు పది మందితో కలిసి వచ్చినా సీఎం జగన్ ఒక్కరే ఎదుర్కొంటారు. సీఎం జగన్ నాయకత్వంలో నేను పనిచేస్తా. ► కొవ్వూరు చేరుకున్న సీఎం జగన్. ► సీఎం జగన్‌కు స్వాగతం పలికిన మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన, విశ్వరూప్. ►కొవ్వూరు బయలుదేరిన సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా జనవరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన నిధులను సీఎం జగన్ లబ్ధిదారులకు జమచేయనున్నారు. ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తోంది. ► జనవరి–మార్చి 2023 త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరుస్తూ రూ.703 కోట్లను సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ► అనంతరం, తూర్పో గోదావరి జిల్లా కొవ్వూరులో జరగనున్న బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. ‘జగనన్న విద్యా దీవెన’.. ► పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవాలన్న ఆశయంతో.. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చేలా, వారి తల్లుల ఖాతాల్లో జగనన్న ప్రభుత్వం నేరుగా జమచేస్తోంది. ‘జగనన్న వసతి దీవెన’.. ► అలాగే, ఉన్నత చదువులు చదివే ఈ పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఉండేందుకు వీలుగా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు అయితే రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ.. వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో ప్రభుత్వం నేరుగా జమచేస్తోంది. -
నేడు సీఎం జగన్ కొవ్వూరు పర్యటన
సాక్షి, అమరావతి/కొవ్వూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం (నేడు) తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్నారు. అక్కడ జరిగే కార్యక్రమంలో ఆయన జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేస్తారు. ఉ.8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి కొవ్వూరు చేరుకుంటారు. అక్కడ సత్యవతినగర్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదు జమచేస్తారు. అనంతరం కొవ్వూరు నుంచి బయల్దేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
ఉప సర్పంచ్ దారుణ హత్య
కొవ్వూరు: వేములూరు ఉప సర్పంచ్ శీని సత్యవరప్రసాద్ ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. వివాద రహితుడిగా పేరున్న ప్రసాద్ హత్య వార్తతో వేములూరు ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఉదయం ఆయన తన స్వగృహంలోని వరండాలో విగతజీవుడిగా పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. డీఎస్పీ వీఎస్ఎన్ వర్మ, పట్టణ సీఐ ఏఎల్ఎస్ రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీము ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నాయి. భార్య శ్రీకళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అసలు రాత్రి ఏం జరిగిందో... శనివారం రాత్రి పదిన్నర గంటల వరకు ప్రసాద్ ఇంటి దగ్గర స్థానికులతో మాట్లాడారని చెబుతున్నారు. 11 గంటలకు తన కుమార్తెతో ఫోన్ మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కేకలు, ఆరుపులు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏదైనా తగవు తీర్చు తున్నారేమో అనుకున్నామంటున్నారు. అసలు అర్ధరాత్రి ఏం జరిగింది? గోడవ పడింది ఎవరు? అన్నది మిస్టరీగా మారింది. ప్రసాద్ తలకు గాయమైంది. తలను గోడకు కొట్టినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. విగత జీవుడిగా పడి ఉన్న ప్రసాద్ ఒంటిపై నూలు పోగు కూడా లేదు. గత కొనేళ్లుగా ఒంటరిగానే... ప్రసాద్ కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉంటున్నారు. భార్య శ్రీకళ జంగారెడ్డిగూడెంలో ప్రైవేటు కళాశాలలో పనిచేస్తూ పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నారు. ఐదారేళ్ల కిత్రం తల్లి మృతి చెందడంతో ప్రసాద్ హోటల్లో భోజనం చేస్తున్నారని చెబుతున్నారు. కుమారుడు హనురామ్ ప్రస్తుతం రాజానగరం గైట్ కళాశాలలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. కుమార్తె సుప్రజ సీఆర్ రెడ్డి కళాశాలలో ఫార్మ్–డి చదువుతుంది. ప్రసాద్‌కి భార్యకు మధ్య అంతగా సఖ్యత ఉండేది కాదంటున్నారు. -
శత్రువుని కూడా దగ్గరకు తీసుకునే తత్వం
-
బైక్‌పై వెనుక కూర్చుని.. కసితీరా పొడిచేసింది
కొవ్వూరు: ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు.. ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా తాళికట్టాడు. బహిరంగ పెళ్లికి నిరాకరించాడు. పైగా అనుమానంతో ప్రేయసిపై వేధింపులకు పాల్పడ్డాడు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తప్పుడు ప్రచారం చేయడం ఆరంభించాడు. ఈ మోసాన్ని, అవమానాన్ని భరించలేక ఆ నయవంచకుడిని యువతి కత్తితో పొడిచి హతమార్చింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం రాత్రి జరిగింది. వివరాలు.. తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామానికి చెందిన గర్సికూటి పావని కొవ్వూరు ఏబీఎన్ అండ్ పీఆర్ఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. అయితే తాడేపల్లిగూడెంలో ఇంటర్ చదువుతున్న సమయంలో అంబటి కరుణ తాతాజీనాయుడు అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను వలలో వేసుకున్నాడు. కొన్నాళ్లపాటు ఇద్దరు సన్నిహితంగా మెలిగారు. కానీ పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి.. కులాలు వేరు కావడంతో అతడు పెళ్లికి నిరాకరించాడు. అయితే యువతి ఒత్తిడి చేయడంతో దొంగచాటుగా తాళి కట్టాడు. కొంతకాలం సహజీవనం కూడా చేశాడు. ఈ క్రమంలో.. అధికారికంగా అందరిముందు తనను పెళ్లి చేసుకోవాలని పావని కోరగా అందుకు ససేమిరా అన్నాడు. అంతేగాకుండా పావనిపై అనుమానం పెంచుకుని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో అతడి వేధింపులు తాళలేక యువతి తన స్వగ్రామమైన మలకపల్లి వచ్చేసింది. సోమవారం యువతికి ఫోన్ చేసి మాట్లాడే పని ఉందని ఐ.పంగిడి జంక్షన్‌కి రావాలని తాతాజీనాయుడు కోరాడు. దీంతో పావని అక్కడికి వచ్చింది. (చదవండి: ప్రేమ విఫలం.. యువకుడి బలవన్మరణం) అనంతరం ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తడంతో తనను ఇంటి దగ్గర దింపి రావాలని కోరడంతో మోటారు సైకిల్‌పై బయల్దేరారు. అయితే అప్పటికే అతడి ప్రవర్తనతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె అతడిని హతమార్చాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో గతంలోనే ఆన్లైన్లో కొనుగోలు చేసిన చాకుతో అతడిపై దాడి చేసింది. ధర్మవరం గ్రామ శివారుకు వచ్చేసరికి తాతాజీ నాయుడు మెడపై పొడిచింది. దీంతో మోటారు సైకిల్ పైనుంచి అతడు పడిపోవడంతో పలుచోట్ల కత్తితో కసిదీరా పొడిచింది. ఘటన స్థలంలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం పావని పోలీసులకు ఫోన్లో సమాచారం ఇచ్చి లొంగిపోయింది. రూరల్ ఎస్ఐ కె.రామకృష్ణ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, విచారణ చేపట్టారు. -
కొవ్వూరులో దేవుళ్ల విగ్రహాలు పునఃప్రతిష్ట
-
పశ్చిమ గోదావరి జిల్లాలో వై స్ర్కీన్ మాల్ ఫ్రారంభం
-
మంత్రికి ఎసరు!
-
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
కొవ్వూరు : పట్టణంలో రోడ్డు కం రైలు వంతెన దిగువున గోదావరి నదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కనిపించింది. సుమారు 50 నుంచి యాభై ఐదేళ్ల వయసు కలిగిన మహిళ మృతదేహాన్ని శుక్రవారం స్థానికులు గుర్తించారు. మూడు, నాలుగు రోజుల క్రితమే ఆమె మృతిచెంది ఉండవచ్చునని భావిస్తున్నారు. పసుపు రంగు చీర ధరించి ఉంది. ఏ విధమైన ఆధారాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. వీఆర్వో పోలుమాటి సూర్యారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎస్ఎస్ఎస్ పవన్‌కుమార్ తెలిపారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. వివరాల కోసం 08813–231100, 94407 96622, 80083 72359 నంబర్‌కి కాల్ చేయాలని సూచించారు. మృతదేహం పూర్తిగా పాడై ఉంది. ప్రాథమికంగా లభించిన ఆధారాలను బట్టి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. -
దోపిడీ పాలనను సాగనంపుదాం
కొవ్వూరు : టీడీపీ మంత్రులు, నాయకులు ఇసుక, మట్టి, మద్యం మాఫియాలుగా మారి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని విమర్శించారు. స్థానిక పరిమి రామారాయుడు రత్తమ్మ కల్యాణ మండపంలో గురువారం నిర్వహించిన నియోజకవర్గ ప్లీనరీలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చ జరగాలని డిమాండ్ చేశా రు. సంస్థాగతంగా పార్టీని గ్రామస్థాయి నుంచి బ లోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ సా గిస్తున్న రాక్షసపాలనకు చరమగీతం పాడాలని సూచించారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు అవి నీతికి పాల్పడుతూ ప్రజాధనం దోచుకుతింటున్నారన్నారు. అక్రమ సంపాదనను రాబోయే ఎన్నికల్లో ఖర్చుచేయాలంటూ చంద్రబాబు అవి నీతిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుకు అందించారని, చంద్రబాబు పాలనలో ఇసుక మాఫియా ముఠాలుగా మారారని ధ్వజమెత్తారు. అసమర్థ మంత్రి పాలనలో నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, నాయకులు పరిమి హరి చరణ్, బండి పట్టాభి రామారావు, ముదునూరి నాగరాజు, గురుజు బాలమురళీకృష్ణ, చెల్లింకుల దుర్గా మల్లేశ్వరరావు, లకంసాని శ్రీనివాసరావు, చీర్ల బ్రహ్మానందం తదితరులు వివిధ తీర్మానాలను సమావేశంలో ప్రవేశపెట్టి ప్రసంగించారు. జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వందనపు సాయిబాలపద్మ, నియోజకవర్గ కన్వీనర్లు పుప్పాల వాసుబాబు, ముదునూరి ప్రసాదరాజు, కవురు శ్రీనివాసరావు, దయాల నవీన్‌బాబు, మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు, నాయకులు పోతుల రామతిరుపతిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు రుత్తల భాస్కరరావు, చాగల్లు, తాళ్లపూడి మండల అధ్యక్షులు కొఠారు అశోక్‌బాబు, కుంటముక్కల కేశవ నారాయణ తదితరులు పాల్గొన్నారు. కలిసికట్టుగా పనిచేద్దాం పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ రానున్న రెండేళ్లలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం సాగించాలని నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త తానేటి వనిత పార్టీ శ్రేణులకు పి లుపునిచ్చారు. అంతా కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్రెడ్డిని సీఎం చేసేంతవరకూ సైనికుల్లా పనిచేయాలని సూచించారు. చాగల్లు షుగర్ ఫ్యాక్టరీ మూసివేయడంతో ఉద్యోగులు, రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహారిస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వాస్పత్రిలో పేదలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదన్నారు. ఇసుక అక్రమాలపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామన్నారు. ఇసుక మాఫియా హత్యలకు తెగబడుతోందని, టీడీపీ నాయకులు సొంత పార్టీ నాయకులను హత్య చేయిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో తాగునీరు దొరక్కపోయినా మద్యం ఎరులై పారుతోందని విమర్శించారు. కోట్లు ఎలా వచ్చాయి దళిత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముప్పిడి విజయరావు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయంలో రూ.25 లక్షలు అప్పు చేసిన మంత్రి ఇప్పుడు కోట్లు ఎలా సంపాందించారో చెప్పాలని ప్రశ్నించారు. అబద్దపు హామీలతో అధికారంలోకి.. అబద్దపు హామీలతో అన్ని వర్గాలకు మోసగించి టీడీపీ అధికారంలోకి వచ్చిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీకాళుళం జిల్లా పార్టీ పరిశీలకుడు కొయ్యే మోషేన్‌రాజు విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సాఆర్ సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్కూరి దొరయ్య విమర్శించారు. అన్నదాతల ఆత్మహత్యలు పట్టవా.. రుణమాఫీ అమలు కాకపోవడం, పం టలకు గిట్టుబాటు ధరల లభించక అ న్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటు న్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్సీ, నియోజకవర్గ ప్లీనరీ పరిశీలకుడు మేకా శేషుబాబు విమర్శించారు. మౌలిక సదుపాయాలు కల్పించకుండా విద్యార్థుల సం ఖ్య తక్కువ సంఖ్యలో ఉందన్న నెపంతో ప్రభుత్వం హాస్టళ్లను మూసివేస్తోం దని ఆరోపించారు. ఇది మాఫియా పాలన ఎన్టీఆర్ పాలన ఒక పద్ధతిగా ఉండేదని, చంద్రబాబు హయాం మాఫియా పాలనలా తయారైందని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు ఆరోపించారు. టీడీపీ కు టుంబ పాలనలా తయారైందని విమర్శించారు. పార్టీలో యువత భాగస్వామ్యం పెరగాలని సూచించారు. తెలు గుదేశం మహానాడు చంద్రబాబు భజ న కోసం ఏర్పాటు చేసుకున్న జాతర అని మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ విమర్శించారు. తీర్మానాలిలా.. పింఛన్లు, ఇళ్ల ఎంపికలో లబ్ధిదారులకు ప్రాధాన్యం, జన్మభూమి కమిటీల రద్దు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, టీడీపీ నాయకుల దోపిడీని అరికట్టడం, మద్యం, ఇసుక, మట్టి మాఫియాల ఆగడాలను అడ్డుకోవడం, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడాన్ని వ్యతిరేకించడం, ఆరోగ్య శ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల సక్రమ అమలు, తాగు, సాగునీటి సమస్యలు తీర్చడం, వ్యవసాయ ఉత్పత్పులకు కనీస మద్ధతు ధర కల్పించడం వంటి తీర్మానాలు ఆమెదించారు. దళిత, గిరిజన సంక్షేమానికి పూర్తిస్థాయిలో నిధుల కేటాయింపు, కొవ్వూరు గోష్పాదక్షేత్రం అభివృద్ధికి నిధుల కేటా యింపు, కొవ్వూరు–భద్రాచలం రైల్వేలై¯ŒS నిర్మాణానికి చర్యలు, చాగల్లు జైపూర్ షుగర్స్ ఫ్యాక్టరీ తెరిపిం చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్లీనరీలో తీర్మానించారు. -
దోపిడీ పాలనను సాగనంపుదాం
కొవ్వూరు : టీడీపీ మంత్రులు, నాయకులు ఇసుక, మట్టి, మద్యం మాఫియాలుగా మారి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని విమర్శించారు. స్థానిక పరిమి రామారాయుడు రత్తమ్మ కల్యాణ మండపంలో గురువారం నిర్వహించిన నియోజకవర్గ ప్లీనరీలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చ జరగాలని డిమాండ్ చేశా రు. సంస్థాగతంగా పార్టీని గ్రామస్థాయి నుంచి బ లోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ సా గిస్తున్న రాక్షసపాలనకు చరమగీతం పాడాలని సూచించారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు అవి నీతికి పాల్పడుతూ ప్రజాధనం దోచుకుతింటున్నారన్నారు. అక్రమ సంపాదనను రాబోయే ఎన్నికల్లో ఖర్చుచేయాలంటూ చంద్రబాబు అవి నీతిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుకు అందించారని, చంద్రబాబు పాలనలో ఇసుక మాఫియా ముఠాలుగా మారారని ధ్వజమెత్తారు. అసమర్థ మంత్రి పాలనలో నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, నాయకులు పరిమి హరి చరణ్, బండి పట్టాభి రామారావు, ముదునూరి నాగరాజు, గురుజు బాలమురళీకృష్ణ, చెల్లింకుల దుర్గా మల్లేశ్వరరావు, లకంసాని శ్రీనివాసరావు, చీర్ల బ్రహ్మానందం తదితరులు వివిధ తీర్మానాలను సమావేశంలో ప్రవేశపెట్టి ప్రసంగించారు. జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వందనపు సాయిబాలపద్మ, నియోజకవర్గ కన్వీనర్లు పుప్పాల వాసుబాబు, ముదునూరి ప్రసాదరాజు, కవురు శ్రీనివాసరావు, దయాల నవీ¯ŒSబాబు, మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు, నాయకులు పోతుల రామతిరుపతిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు రుత్తల భాస్కరరావు, చాగల్లు, తాళ్లపూడి మండల అధ్యక్షులు కొఠారు అశోక్‌బాబు, కుంటముక్కల కేశవ నారాయణ తదితరులు పాల్గొన్నారు. కలిసికట్టుగా పనిచేద్దాం పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ రానున్న రెండేళ్లలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం సాగించాలని నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త తానేటి వనిత పార్టీ శ్రేణులకు పి లుపునిచ్చారు. అంతా కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్రెడ్డిని సీఎం చేసేంతవరకూ సైనికుల్లా పనిచేయాలని సూచించారు. చాగల్లు షుగర్ ఫ్యాక్టరీ మూసివేయడంతో ఉద్యోగులు, రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహారిస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వాస్పత్రిలో పేదలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదన్నారు. ఇసుక అక్రమాలపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామన్నారు. ఇసుక మాఫియా హత్యలకు తెగబడుతోందని, టీడీపీ నాయకులు సొంత పార్టీ నాయకులను హత్య చేయిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో తాగునీరు దొరక్కపోయినా మద్యం ఎరులై పారుతోందని విమర్శించారు. కోట్లు ఎలా వచ్చాయి దళిత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముప్పిడి విజయరావు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయంలో రూ.25 లక్షలు అప్పు చేసిన మంత్రి ఇప్పుడు కోట్లు ఎలా సంపాందించారో చెప్పాలని ప్రశ్నించారు. అబద్దపు హామీలతో అధికారంలోకి.. అబద్దపు హామీలతో అన్ని వర్గాలకు మోసగించి టీడీపీ అధికారంలోకి వచ్చిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీకాళుళం జిల్లా పార్టీ పరిశీలకుడు కొయ్యే మోషేన్‌రాజు విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సాఆర్ సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్కూరి దొరయ్య విమర్శించారు. అన్నదాతల ఆత్మహత్యలు పట్టవా.. రుణమాఫీ అమలు కాకపోవడం, పం టలకు గిట్టుబాటు ధరల లభించక అ న్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటు న్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్సీ, నియోజకవర్గ ప్లీనరీ పరిశీలకుడు మేకా శేషుబాబు విమర్శించారు. మౌలిక సదుపాయాలు కల్పించకుండా విద్యార్థుల సం ఖ్య తక్కువ సంఖ్యలో ఉందన్న నెపంతో ప్రభుత్వం హాస్టళ్లను మూసివేస్తోం దని ఆరోపించారు. ఇది మాఫియా పాలన ఎన్టీఆర్ పాలన ఒక పద్ధతిగా ఉండేదని, చంద్రబాబు హయాం మాఫియా పాలనలా తయారైందని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు ఆరోపించారు. టీడీపీ కు టుంబ పాలనలా తయారైందని విమర్శించారు. పార్టీలో యువత భాగస్వామ్యం పెరగాలని సూచించారు. తెలు గుదేశం మహానాడు చంద్రబాబు భజ న కోసం ఏర్పాటు చేసుకున్న జాతర అని మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ విమర్శించారు. తీర్మానాలిలా.. పింఛన్లు, ఇళ్ల ఎంపికలో లబ్ధిదారులకు ప్రాధాన్యం, జన్మభూమి కమిటీల రద్దు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, టీడీపీ నాయకుల దోపిడీని అరికట్టడం, మద్యం, ఇసుక, మట్టి మాఫియాల ఆగడాలను అడ్డుకోవడం, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడాన్ని వ్యతిరేకించడం, ఆరోగ్య శ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల సక్రమ అమలు, తాగు, సాగునీటి సమస్యలు తీర్చడం, వ్యవసాయ ఉత్పత్పులకు కనీస మద్ధతు ధర కల్పించడం వంటి తీర్మానాలు ఆమెదించారు. దళిత, గిరిజన సంక్షేమానికి పూర్తిస్థాయిలో నిధుల కేటాయింపు, కొవ్వూరు గోష్పాదక్షేత్రం అభివృద్ధికి నిధుల కేటా యింపు, కొవ్వూరు–భద్రాచలం రైల్వేలైన్ నిర్మాణానికి చర్యలు, చాగల్లు జైపూర్ షుగర్స్ ఫ్యాక్టరీ తెరిపిం చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్లీనరీలో తీర్మానించారు. -
దీపం కనెక్షన్లను సద్వినియోగం చేసుకోవాలి
కొవ్వూరు: దీపం పథకం ద్వారా సబ్సిడీపై అందించే గ్యాస్ కనెక్షన్ లను పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ కోరారు. కొవ్వూరులో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ గణపతి హెచ్‌పీ గ్యాస్ రెండో ఏజెన్సీని ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన కనెక్షన్ లు తీసుకున్న వినియోగదారులకు మంత్రి చేతుల మీదుగా స్టౌవ్‌లు అందజేశారు. పొగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కొవ్వూరు, రాజమహేంద్రవరంలో పైలెట్ ప్రాజెక్టుగా ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరాకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేయాలని డీలర్లను ఆదేశించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్పర్సన్ జొన్నలగడ్డ రాధారాణి, నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, హెచ్‌పీసీఎల్ చీఫ్ రీజనల్ మేనేజర్ కె.చంద్రశేఖర్, డెప్యూటీ మేనేజర్ (సేల్స్) వీవీ రవికుమార్, చాగల్లు ఎంపీపీ కోడూరి రమామణి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వాసుపత్రిలో యువకుల విధ్వంసం
కొవ్వూరు : కొవ్వూరు ప్రభుత్వాసుపత్రిలో గురువారం అర్ధరాత్రి సమయంలో పట్టణానికి చెందిన యువకులు కర్రలతో అద్ధాలు పగలకొట్టి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనను నిరసిస్తూ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది శుక్రవారం నల్లరిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో రెండు వర్గాల యువకుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఒక వర్గం యువకులు చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. తమపై దాడి చేసి ఆసుపత్రికి వచ్చారని, పోలీసులకు ఫిర్యాదు చేశారనే ఆరోపణతో మరో వర్గానికి చెందిన యువకులు ముకుమ్మడిగా ఆసుపత్రికి చేరుకున్నారు. కర్రలు పట్టుకుని ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద ఉన్న అద్ధాలు పగలకొట్టారు. లోపలికి ప్రవేశించి హల్చల్ చేశారు. ఆసుపత్రి బయట ఉన్న మోటారు సైకిళ్లను ధ్వంసం చేసి వెళ్లిపోయారు. ఈ పరిణామాలపై వైద్యులు, సిబ్బంది ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ఎస్వీ రామకృష్ణారావు మాట్లాడుతూ ఆసుపత్రిలో విధి నిర్వహణలో ఉన్న వైద్య సిబ్బందిని, రోగులను భయబ్రాంతులకు గురిచేసిన యువకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిబ్బంది మోటారు సైకిళ్లను ధ్వంసం చేయడం అమానుషమన్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైద్య ఉద్యోగుల సంఘం నాయకురాలు హెప్సిబా మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి రక్షణ లేకుండా పోయిందన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కంఠమణి రామకృష్ణ, నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, కమిటీ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణ సీఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని నాయకులు, వైద్యులకు ఆయన హామీ ఇచ్చారు.సీసీ కెమెరా పుటేజీలను సీఐ పరిశీలించారు. -
సత్వర న్యాయానికి చర్యలు
కొవ్వూరు రూరల్ : కేసుల్లో విచారణ పత్రాలను సరైన రీతిలో కోర్టుకు అందజేస్తే బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని అదనపు జిల్లా సెషన్స్ జడ్జి వైబీఎస్జీ పార్థసారథి అన్నారు. కొవ్వూరు పురపాలక సంఘం కౌన్సిల్ హాల్లో శనివారం నిర్వహించిన ప్రాసిక్యూట్ అధి కారులు, పీపీలు, ఏపీపీలు, పోలీసు అధికారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. కేసులు ఎలా పరి ష్కరించాలి, ప్రజలకు న్యాయం అందించేందుకు అవసరమైన చర్యలు న్యాయపరంగా ఎలా చేపట్టాలి, న్యాయపరమైన అంశాలపై న్యాయమూర్తి సూచనలు, సలహాలు ఇచ్చారు. పోలీసులు కేసులు నమో దు చేసిన తరువాత కోర్టులకు అందజేయాల్సిన విచారణ పత్రాలు సరైన రీతిలో ఉంటే వెంటనే బాధితులకు న్యాయం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ చింతా రాంబాబు, పీపీ జేకే కాంతారావు, ఏపీపీలు అల్లూరి సత్యసాయిబాబా, రాజన శ్రీ నివాస్‌తో పాటు కొవ్వూరు డివిజన్ పరి ధిలోని పీపీలు, ఏపీపీలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
పాఠశాలలో ఉరేసుకున్న విద్యార్థిని
పశ్చిమగోదావరి: జిల్లాలోని కొవ్వూరు సంస్కృత పాఠశాలలో సోమవారం ఘోరం చోటు చేసుకుంది. పాఠశాలలో చదువుకుంటున్న ఇంటర్ విద్యార్థిని ప్రసన్న ఆత్మహత్యకు పాల్పడింది. ప్రసన్న సొంతవూరు జీలుగుమల్లి మండలం పాములువారిగూడెం. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
ఇద్దరు అంతర్జిల్లా నేరస్తుల అరెస్ట్
కొవ్వూరు : ఇద్దరు అంతర్జిల్లా నేరస్తులను కొవ్వూరు రూరల్ పోలీసులు మంగళ వారం అరెస్ట్ చేశారు. రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. కొవ్వూరు మండలంలోని సీతంపేటలో నవంబర్ 26న రోడ్డు పక్కన పార్క్ చేసిన లారీ అపహరణకు గురైంది. దీంతో లారీ యాజమాని మచ్చా సూర్యనారాయణ అప్పట్లో రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు విజయవాడ పోరంకికి చెందిన కడియాల శ్రీనివాసుతో పాటు అతని సోదరుడు కడియాల ఓకార్ ఈ చోరీకి పాల్పడ్డారని గుర్తించి వారిని మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి లారీతోపాటు చోరీ సమయంలో వినియోగించిన అంబాసిడర్ కారును స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాలతో గుట్టురట్టు ఈ కేసును సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఛేదించారు. లారీ చోరీకి గురైన రోజు కొవ్వూరు పట్టణంలోని టోల్‌గేట్‌తోపాటు పలుప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కెమెరాల్లో లారీ వెనుక అంబాసిడర్ కారు యర్నగూడెం వరకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఆ కారు నంబర్ సీసీ కెమెరాల్లో పూర్తిస్థాయిలో కనిపించకపోవడంతో విజయవాడకు చెందిన నిపుణుల సాయంతో కారు నంబర్‌ను గుర్తించారు. కారు ఖమ్మం జిల్లా కొత్తగూడేనికి చెందినదిగా కనుగొన్నారు. దానిని జంగారెడ్డిగూడెంకు చెందిన నిందితుడు శ్రీనివాస్‌కు అమ్మినట్టు తెలుసుకున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ విజయవాడలో ఉంటున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అతని గురించి ఆరా తీశారు. శ్రీనివాస్‌తో, అతని తమ్ముడు ఓంకార్ పాతనేరస్తులని గుర్తించారు. గతంలో లారీల రికార్డులు మార్పు చేసి లోడ్లు అమ్ముకుని వీరిద్దరూ పట్టుబడినట్టు తెలుసుకున్నారు. జంగారెడ్డిగూడెం, చాగల్లు, పెనమలూరు, కాకినాడల్లో వీరిపై కేసులు నమోదై ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిందితులపై నిఘా ఉంచిన పోలీసులు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు యర్నగూడెం సమీపంలో పోలేరమ్మ ఆలయం వద్ద లారీతో ఉండగా వారిద్దరినీ పట్టుకున్నారు. లారీకి రంగు మార్చివేసి కర్నాటక రిజిస్ట్రేషన్‌తో దొంగనంబర్ వేసినట్టు పోలీసులు గుర్తించారు. వీరిని మంగళవారం కోర్టులో హాజరుపరచనున్నట్టు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన రూరల్ సీఐ ఎం.సుబ్బారావు, ఎస్సై ఎం.శ్యాం సుందరరావు, హెచ్‌సీ ఏకే సత్యనారాయణ, కానిస్టేబుల్ ఎల్.చిరంజీవిని అభినందించారు. వీరికి రివార్డుల నిమిత్తం ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్టు డీఎస్పీ తెలిపారు. -
వంతెనపై నుంచి దూకి యువకుడి మృతి
కొవ్వూరు : వంతెనపై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం నాలుగో రోడ్డు (గామన్)వంతెనపై ఈ దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కొవ్వూరు అచ్చాయమ్మకాలనీకి చెందిన చినరావూరి నాగేంద్రకుమార్(28) శుక్రవారం ఉదయం నాలుగో రోడ్డు వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వంతెనపైనుంచి దూకడంతో అతను గోదావరి పుష్కరాల కోసం కొత్తగా నిర్మించిన పుష్కర్ నగర్ రోడ్డుపై పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మూడు రోజుల క్రితమే అయప్ప మాల ధరించాడు. రోజూ ఉదయాన్నే గోదావరి స్నానానికి వస్తున్నాడు. యథావిధిగా శుక్రవారం తెల్లవారుజామున కూడా ఇంటి దగ్గర నుంచి సైకిల్‌పై వెళ్లిన కొడుకు తిరిగి రాలేదని అతని తండ్రి సుబ్బారావు తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎస్.ఎస్.ఎస్.పవన్‌కుమార్ తెలిపారు. నాగేంద్రకుమార్ ఆత్మహత్యకు కారణాలు ఏమిటనేది తెలియరాలేదు. కుటుంబ సభ్యులు మాత్రం ఎలాంటి విభేదాల్లేవని చెబుతున్నారు. -
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
కొవ్వూరు: పట్టణానికి చెందిన సంగంరెడ్డి అర్జున్‌కుమార్ (17) అనే యువకుడు శనివారం సా యంత్రం ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందాడు. పోలీసుల వేధింపులు కారణమని బంధువులు పోలీసుస్టేషన్ వద్ద రాత్రి ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి.. పురపాలక సంఘం పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న అర్జున్ను ఓ కేసులో విచారణ నిమిత్తం పోలీసులు తీసుకెళ్లారు. శనివారం మధ్యాహ్నం 12 నుంచి 3 గం టల వరకు విచారణ చేసి విడిచిపెట్టారు. తర్వా త ఇంటికి వచ్చిన అర్జున్ ఉరివేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు. అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేకపోయినా విచారణ పేరుతో కిలా డి శ్రీనివాసరావు అనే కానిస్టేబుల్ వేధించారని బంధువులు ఆరోపిస్తున్నారు. స్టేషన్ ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని భీష్మించారు. డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. కానిస్టేబుల్ ప్రమేయంపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. తమకు న్యాయం జరిగే వరకూ మునిసిపల్ పారిశుధ్య కార్మికులెవరూ విధులకు హాజరుకాబోమని ప్రకటించారు. పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుం టున్నానని అర్జున్ సూసైడ్ నోట్ రాశాడు. -
గోదావరిలో దూకి యువకుడి గల్లంతు
కొవ్వూరు రూరల్ : కొవ్వూరు సమీపంలోని గామన్ వంతెనపై నుంచి ఓ యువకుడు గోదావరి నదిలోకి దూకి గల్లంతయ్యాడు. బంధువుల కథనం ప్రకారం.. మండలంలోని చిడిపి గ్రామానికి చెందిన 24 ఏళ్ల పామెర్ల సురేంద్ర సోమవారం రాత్రి మోటారు సైకిల్ వేసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత అతను తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో అతని కోసం కుటుంబ సభ్యులు వెతకడం మొదలెట్టారు. ఈ క్రమంలో గామన్ వంతెనపై నుంచి మంగళవారం ఉదయం అతను మోటార్‌సైకిల్ ఉంచి గోదావరిలోకి దూకేశాడు. దీనిని అటుగా సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి మోటార్‌సైకిల్ ముందు బ్యాగులో లభించిన విజిటింగ్ కార్డు ఆధారంగా బంధువులకు సమాచారం ఇచ్చాడు. దీంతో సురేంద్ర బంధువులు వంతెనపైకి చేరుకుని ఆ మోటార్‌సైకిల్ అతనిదేనని గుర్తించారు. యువకుడి కోసం గోదావరిలో గాలింపు చేపట్టారు. సురేంద్ర ఇటీవలే తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం వద్ద ఉన్న ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. యువకుడి గల్లంతుతో చిడిపి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తహసీల్దార్ కె.విజయకుమార్, అగ్నిమాపక అధికారి సూర్యనారాయణ, ఎంపీడీవో ఎ.రాములు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
‘అంత్య’ ఘట్టాన ఆనందపారవశ్యం
కొవ్వూరు : కొవ్వూరు గోష్పాదక్షేత్రం ఘాట్‌లో రెండోరోజు భక్తుల రద్దీ పెరిగింది. సుమారు 25 వేలమంది పుణ్యస్నానాలు ఆచరించినట్టు అధికారులు తెలిపారు. ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన పిండప్రదాన షెడ్లు చాలకపోవడంతో చాలామంది ఆరుబయటే పుణ్యకార్యాలు నిర్వహించారు. సుందరేశ్వరస్వామి ఆలయం వద్ద ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు. కొవ్వూరు మండలంలోని చిడిపి, కుమారదేవం, ఆరికిరేవుల, వాడపల్లి, మద్దూరు పుష్కఘాట్లలో స్థానికులు పుష్కర స్నానాలు ఆచరించారు. ఈ ప్రాంతాల్లో సుమారు రెండువేల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్టు అంచనా. తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం, తాళ్లపూడి, ప్రక్కిలంక, తాడిపూడి ఘాట్లూ భక్తులతో కిక్కిరిశాయి. ఈ మండలంలో సుమారు ఐదువేల మంది స్నానాలు ఆచరించినట్టు అధికారులు చెప్పారు. కొవ్వూరు రెవెన్యూ డివిజన్లో సోమవారం 50,725 మంది స్నానాలు ఆచరించినట్లు అధికారుల అంచనా. పెనుగొండ డివిజన్లో 10,800 మంది, నిడదవోలులో 2,225 మంది, పెరవలి మండలంలో 12,200 మంది భక్తులు స్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. -
ఆటోడ్రైవర్ బలవన్మరణం
కొవ్వూరు: పట్టణంలో బ్రిడ్జిపేటకి చెందిన ఓ వ్యక్తి భార్య కాపురానికి రాలేదని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. బ్రిడ్జిపేటలో నివాసముంటున్న పైలా శ్రీను (30) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య కువైట్‌లో ఉంటూ ఇటీవల స్వదేశం వచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 6 గంటలకు శ్రీను ఆటో తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. 8.30 గంటల సమయంలో తిరిగి వచ్చాడు. తన భార్య కువైట్ నుంచి వచ్చిందని, అమ్మగారింట్లోనే ఉంటానని చెప్పిందని తల్లి పైడమ్మకు చెప్పాడు. రాత్రి 10 గంటల సమయంలో గదిలో లైటు వెలుగుతుందని కిటికీలో నుంచి తల్లి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. స్థానికులు సాయంతో తల్లి శ్రీనును ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. భార్య కాపురానికి రావడానికి నిరాకరించడంతో మనస్తాపం చెంది శ్రీను ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లి పైడమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ పి.ప్రసాదరావు తెలిపారు. -
జోరుగా ‘బ్లాక్’ వ్యాపారం
► థియేటర్లలో టిక్కెట్టుపై అదనపు వసూళ్లు ► చోద్యం చూస్తున్న రెవెన్యూ యంత్రాంగం తణుకు: కొత్త సినిమా వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్య బ్లాక్‌లో టికెట్లు. సినిమా అంటేనే బ్లాక్ అనే ముద్ర బలంగా ప్రేక్షకుల్లో చొచ్చుకుపోయింది. అందులో మొదటివారం రోజులు నాలుగు షోలు బ్లాక్‌లో టిక్కెట్లు విక్రయిస్తున్నారు. సగటు ప్రేక్షకుడికి థియేటర్ యాజమాన్యం కనీసం గౌరవం కూడా ఇవ్వకపోగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వారికి సంబంధించిన వ్యక్తులతోనే బ్లాక్‌లో టిక్కెట్లు విక్రయిస్తూ సొమ్ములు చేసుకుంటున్నారు. మరోవైపు టిక్కెట్టుపై ఉన్న ధరకు అదనంగా వసూలు చేయడం ఇటీవలి కాలంలో షరామామూలైపోయింది. తమకు అనుమతులు ఉన్నాయంటూ బహిరంగంగానే వసూళ్లు చేస్తున్నారు. పట్టుమని రెండు నిమిషాలు కూడా బుకింగ్ కౌంటర్లో టిక్కెట్లు ఇవ్వడంలేదు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని సైతం బెదిరిస్తున్నారు. బ్లాక్‌లో ఉన్నాయి.. కావాలంటే తీసుకోండి.. లేదంటే ఇంటికి వెళ్లండని దబాయిస్తున్నారని పలువురు వాపోతున్నారు. థియేటర్‌కు వచ్చిన వారు కచ్చితంగా సినిమా చూస్తారని తెలుసు కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమా అని ఫ్యాన్స్ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టి బాణసంచా కాలుస్తారు. వీరికి కూడా మొదటిరోజు ఒకషో మాత్రమే 10 నుంచి 15 టిక్కెట్లు అభిమానులకు ఇస్తారు. అభిమాన హీరో సినిమా చూడాలన్న ఆశతో బ్లాక్‌లో టిక్కెట్లు కొనుక్కుని సినిమా చూస్తున్నామని పలువురు వాపోతున్నారు. బ్లాక్‌లో ఇంటిదొంగలే జిల్లాలో 95 సినిమా థియేటర్లు ఉన్నాయి. సినిమా థియేటర్లో ప్రతి ఆటకు బుకింగ్ కౌంటర్లో కేవలం 30 శాతం మాత్రమే టిక్కెట్లు ఇస్తున్నారు. 70 శాతం టిక్కెట్లను బ్లాక్‌లో విక్రయిస్తూ సొమ్ములు చేసుకుంటున్నారు. ప్రేక్షకుడు వినోదం కోసం హాయిగా రెండు గంటల పాటు ఎంజాయ్ చేద్దామంటే జేబులో ఉన్న రూ.500 ఖాళీ కావాల్సిందే. కొందరు థియేటర్ యాజమాన్యాలు సిబ్బంది తమ మనుషులచే టిక్కెట్లు విక్రయించేలా ప్రోత్సహిస్తున్నారు. మరికొంతమంది బయట వారు ముందుగా టిక్కెట్లు బుక్కింగ్ చేసుకుని షో సమయానికి రెండు గంటల ముందే థియేటర్ సమీపంలో బ్లాక్‌లో టిక్కెట్లు విక్రయిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఇద్దరు అగ్రహీరోల సినిమాల కోసం బ్లాక్‌లో టిక్కెట్లను సుమారు రూ.5 కోట్ల వరకు వ్యాపారం జరిగినట్టు సమాచారం. ఇది నమ్మడానికి చేదుగా ఉన్నా నిప్పులాంటి నిజం. ఇంతగా సొమ్ములు చేసుకుంటున్నా ఏ ఒక్క అధికారి కూడా తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. ఆన్లైన్లో రూ.100 పెట్టి కొనుగోలు చేసిన వారి దగ్గర నుంచి సైతం సినిమా చూస్తుండగా వచ్చి అదనంగా రూ.50 వసూలు చేస్తున్న ఘటనలు సైతం ఉన్నాయి. థియేటర్లలో ఇంత జరుగుతున్నా పోలీసులు, రెవెన్యూ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించి, టిక్కెట్లపై అదనపు వసూళ్లు ఆపాలని ప్రతి ప్రేక్షకులు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం సినిమా టిక్కెట్టుపై అదనంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇటీవలి కాలంలో టిక్కెట్టుపై అదనంగా వసూలు చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదులతో ఆయా సినిమా హాళ్ల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి హెచ్చరికలు జారీ చేశాం. ఇకపై కూడా అలా జరిగితే సీజ్ చేయడానికి కూడా వెనుకాడం. - బి.శ్రీనివాసరావు, ఆర్డీవో, కొవ్వూరు -
'ఆ హత్యకు ఇసుక మాఫియానే కారణం'
పశ్చిమ గోదావరి : కొవ్వూరులో సంచలనం రేపిన టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు, 16వ వార్డు కౌన్సిలర్ పాకా టీడీపీ నేత గోపాలకృష్ణ(52) హత్యకేసులో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. ఇసుక మాఫియాతో వివాదాలు కారణంగానే హత్యకు దారితీసినట్లు తెలుస్తుంది. గోపాలకృష్ణ హత్య కేసును జిల్లా పోలీసులు 24 గంటల్లోనే చేధించారు. హత్యకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి ఆయుధాలు, వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఇసుక మాఫియా గొడవలు కారణంగానే గోపాలకృష్ణ హత్య జరిగినట్లు శనివారం డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు తెలిపారు. పోలీసులు నిందితులను అదుపులోకి విచారిస్తున్నారు. కొవ్వూరు- నిడదవోలు రహదారిలో శుక్రవారం మధ్యాహ్నం గోపాలకృష్ణను ఇద్దరు దుండగులు అతి కిరాతకంగా నరికి చంపిన విషయం తెలిసిందే. -
ట్రాక్‌పై నిలిచిన లారీ...ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు
పశ్చిమగోదావరి జిల్లా: కొవ్వూరు రైల్వేగేటు సమీపంలో రైల్వే ట్రాక్‌పై లారీ సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో ఆదివారం సాయంత్రం పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో విజయవాడ నుండి విశాఖపట్నం వైపు వెళ్లే పలు రైళ్లను చాగల్లు రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. కొరమండల్ ఎక్స్‌ప్రెస్, కొణార్క్ ఎక్స్‌ప్రెస్, ఈస్ట్కొస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. లారీని ట్రాక్‌పై తొలగించి రైళ్లను పునరుద్ధరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
లారీ ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి
పశ్చిమ గోదావరి జల్లా: కొవ్వూరు మండలం ఐ.తంగిడి గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. గోపాలపురం ప్రాంతానికి చెందిన ప్రదీప్‌రెడ్డి బైక్‌పై వెళుతుండగా అతివేగంగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన అతడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
గోదావరిలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు
కొవ్వూరు: పశ్చిమగోదావరి జిల్లా ఆదివారం విషాదం చోటుచేసుకుంది. కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. కొవ్వూరు చైతన్య స్కూల్లో పదో తరగతి చదివే నందిగామ్ జయదేవ్, జి.సుమంత్ ఆదివారం సాయంత్రం గోదావరి నదిలో స్నానానికి దిగి గల్లంతయ్యారు. స్థానికులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థుల గల్లంతుతో స్థానికంగా విషాదం నెలకుంది. -
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ: 9 మందికి గాయాలు
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని కాపవరం వద్ద మంగళవారం రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
కొవ్వూరు రూరల్ (పశ్చిమ గోదావరి) : బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు సమీపంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. రాజమండ్రికి చెందిన పెద్దాడ శ్రీనివాస్ గౌరీపట్నంలో జరిగే మేరీమాత ఉత్సవాలకు వెళ్తున్నాడు. కుటుంబసభ్యులు ముందుగా బస్సులో వెళ్లిపోగా మేనల్లుడితో కలసి శ్రీనివాస్ బైక్‌పై బయలుదేరాడు. కాగా వారి వాహనాన్ని దొమ్మేరు గ్రామ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే చనిపోగా అతని మేనల్లుడికి స్వల్ప గాయాలయ్యాయి. -
కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో ప్రమాదం
కోవ్వూరు: పశ్చిమగోదావరి జిల్లా కోవ్వూరు గోష్పాద క్షేత్రంలో శనివారం ప్రమాదం చోటు చేసుకుంది. గోదావరిలో పుష్కర స్నానం ఆచరించేందుకు వచ్చిన భక్తులపై వాటర్ ట్యాంకర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురు భక్తులు గాయపడ్డారు. ఓ మహిళ వ్యాటర్ ట్యాంకర్ కింద ఇరుక్కుపోయింది. దాంతో పోలీసులు వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించారు. గోదావరి నదీ పుష్కరాలు నేపథ్యంలో వరుసగా సెలవులు రావడంతో గోష్పాద కేత్రానికి భక్తులు శనివారం పోటెత్తారు. -
తండ్రికి పిండప్రదానం చేసిన వైఎస్ జగన్
-
కొవ్వూరు ఫుష్కర ఘాట్‌కు పోటెత్తుతున్న భక్తులు
-
నత్తలా.. ఎన్నాళ్లిలా
కొవ్వూరు : గోదావరి పుష్కరాలకు గడువు సమీపిస్తోంది. మహాపర్వం ప్రారంభం కావడానికి 47 రోజులు మాత్రమే మిగిలివుంది. అయినప్పటికీ కొన్ని శాఖల్లో పుష్కర పనులు ప్రహసనంగా మారాయి. ఇప్పటివరకు ఏ ఒక్క శాఖలోనూ 50శాతం పనులైనా పూర్తికాలే దు. జిల్లాలో అన్ని శాఖల ఆధ్వర్యంలో 1,117 పనులు చేపట్టేందుకు రూ.478.40 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటివరకు కేవలం 262 పనుల్ని మాత్రమే పూర్తిచేశారు. మరో 262 పనులు నేటికీ ప్రారంభం కాలేదు. జాప్యానికి అసలు కారణాలేమిటనే విషయాన్ని యంత్రాంగం పట్టించుకోవడం లేదు. నీటిపారుదల, పురపాలక శాఖలు పుష్కర పనులకు ఇంజినీరింగ్ సిబ్బందిని డెప్యుటేషన్‌పై నియమించుకోవడంతో ఆ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల్లో కొంత పురోగతి కనిపిస్తోంది. దేవాదాయ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖలు అదనపు సిబ్బంది నియామకం విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో ఆ శాఖల్లో పనుల పురోగతి అంతమాత్రంగానే ఉంది. చాలా శాఖల్లో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఒకే కాంట్రాక్టర్ వివిధ పనులు చేపట్టడం.. నేటికీ కొన్ని పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోడం.. ఇప్పటికప్పుడు కొత్తగా పనులు మంజూరు చేయడం.. వేసవి ప్రభావం తదితర కారణాల వల్ల ఆశించిన ప్రగతి కనిపించడం లేదు. తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నా, ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రయోజనం కానరావడం లేదు. వర్షాలొస్తే అంతేసంగతులు జిల్లాకు మంజూరైన 1,117 పనుల్లో 1,054 పనులకు మాత్రమే టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. 747 పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. రుతుపవనాలు ఈనెలాఖరు నాటికి రాష్ట్రాన్ని చేరుకునే అవకాశం ఉందంటున్నారు. జూన్ మొదటి వారం నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే పుష్కర పనులకు ఆటంకం ఏర్పడుతుంది. 24 గంటలూ పనులు చేపట్టాలని కలెక్టర్ కె.భాస్కర్ అధికారులను ఆదేశించినా ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పంచాయతీరాజ్‌లో అంతంతే పంచాయతీరాజ్ శాఖ ద్వారా మొదటివిడతగా రూ.20.08 కోట్ల విలువైన 30 పనులు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటికి వరకు 4 మాత్రమే పూర్తిచేశారు. మిగతా 26 పనులు పురోగతిలో ఉన్నాయి. రెండోవిడతలో 248 పనులు మంజూరు కాగా, 37 పూర్తయ్యాయి. 143 పనులు పురోగతిలో ఉండగా, మరో 40 పనుల టెండర్లు ఒప్పంద స్థాయిలో, 18 పనులు టెండర్లు పూర్తయిన దశలో ఉన్నాయి. మరో 4 పనులకు తిరిగి టెండర్లు పిలిచారు. మూడుచోట్ల ప్రత్యామ్నాయ పనులకు సిఫార్సు చేయగా, మరో 3 పనులు ప్రారంభం కావాల్సి ఉంది. టెండర్ల దశలోనే.. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు 152 పనులు మంజూరయ్యాయి. వీటిలో 137 పనులు ప్రారంభించారు. 46 పూర్తికాగా, 62 పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. రెండు పనుల టెండర్లు ఈఎన్సీ పరిధిలో ఉండగా, 14 పనులు టెండర్ల దశలో ఉన్నాయి. 12 పనుల టెండర్ల స్వీకరణకు 23వ తేదీతో, రెండు పనులకు 27వ తేదీతో గడువు పూర్తయ్యింది. ఈ పనులు ప్రారంభించడానికి మరో వారం, పది రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. పురోగతిలో స్నానఘట్టాల నిర్మాణం జిల్లాకు 96 స్నానఘట్టాలు మంజూరు కాగా, 94 పనులు ప్రారంభమయ్యాయి. 45 స్నానఘట్టాలు పూర్తయ్యాయి. మరో 20 పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. మిగతా పనులను జూన్ 15నాటికి పూర్తి చేస్తామంటున్నారు. అవసరం లేని 6 పనులను రద్దు చేశారు. ఇటీవల మంజూరైన చిడిపి, ఔరంగబాద్, బ్రిడ్జిపేట స్నానఘట్టాల పనులకు ఈనెల 21న టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. గోదావరిలో గ్రోయిన్ల పనులు ప్రారంభం కావాల్సి ఉంది. మందకొడిగా దేవాదాయ శాఖ పనులు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 211 పనులకు గాను ఇప్పటివరకు 33 పూర్తిచేశారు. ఈ పనులు 3 విడతలుగా మంజూరయ్యాయి. మొదటివిడత పనుల పురోగతి బాగానే ఉంది. రెండు, మూడువిడతల్లో మంజూరైన పనుల్లో ఎక్కువ శాతం ఆలయాలకు రంగు వేయడం, ఫ్లోరింగ్, చిన్నపాటి మరమ్మతు పనులు ఉన్నాయి. తాళ్లపూడిలో మదనగోపాల స్వామి ఆలయం పునర్నిర్మాణం పూర్తికాలేదు. మునిసిపాలిటీల్లో సా..గుతున్నాయ్ కొవ్వూరు పురపాలక సంఘంలో 138 పనులకు గాను ఈనెల 24నాటికి 41 పనులు పూర్తిచేశారు. నిడదవోలులో 15 పనులకు గాను 3 పూర్తయ్యాయి. పాలకొల్లులో 38 పనులకు గాను ఒకటి మాత్రమే పూర్తయ్యింది. 22 పురోగతిలో ఉన్నాయి. నరసాపురంలో 179 పనులకు గాను 52 పూర్తి చేశారు. మరో 110 పురోగతిలో ఉన్నాయి. పాలకొల్లు, నరసాపురం పట్టణాల్లో పనులను జూన్ 15 నాటికి పూర్తి చేస్తామని, కొవ్వూరులో వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేయిస్తామని ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. -
కొవ్వూరు యువకుడికి పీహెచ్‌డీలో గోల్డ్‌మెడల్
పశ్చిమగోదావరి(కొవ్వూరు): పువ్వు పుట్టగానే పరిమళించినట్టే.. ప్రతిభ కూడా చిన్నప్పుడే తెలిసిపోతుందని ఈ ఘటన మరోమారు రుజువు చేసింది. చిన్నప్పుడు పాఠశాలలో ఏ పరరీక్ష నిర్వహించినా ముందుండే శేఖర్‌బాబు అదే ఆనవాయితీని కొనసాగిస్తూ.. పీహెచ్‌డీలోనూ బంగారుపతకం సొంతం చేసుకున్నారు. ఓ వైపు ఐఎఫ్ఎస్ శిక్షణలో ఉంటూనే మరోవైపు కష్టపడి పీహెచ్డీ పూర్తిచేశారు. కొవ్వూరుకు చెందిన గెడ్డం శేఖర్‌బాబు కందిసాగులో అధిక దిగుబడి నిచ్చే జన్యువును కనుగొని పీహెచ్‌డీలో గోల్డ్‌మెడల్ సాధించారు. ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో జరిపిన ఈ ప్రయోగానికి గాను.. న్యూఢీల్లీలో శుక్రవారం ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆర్.చిందంబరం చేతుల మీదుగా బంగారుపతకాన్ని అందుకున్నారు. వ్యవసాయశాస్త్రంలో పీజీ పూర్తిచేసిన అనంతరం భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో మూడేళ్ల పాటు పీహెచ్డీ చేశారు. చదువుకుంటున్న సమయంలోనే సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. 2013లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాడర్లో ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యారు. -
పేకాటరాయుళ్ల ఆట కట్టు
హైదరాబాద్/కొవ్వూరు: పోలీసులు పేకాటరాయుళ్ల ఆట కట్టించారు. సోమవారం పలుచోట్ల పేకాట స్థావరాలపై దాడులు జరిపి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని వనస్థలిపురం, ఎల్బీనగర్ ప్రాంతాల్లో పేకాట స్థావరాలపై దాడులు చేసి 12 మందిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 8 వేల నగదు, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ధర్మవరంలో ఆరుగురు పేకాటరాయుళ్లను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ. 1500 నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
ఇసుక ఇక్కట్లు
కొవ్వూరు:కొవ్వూరు మండలం వాడపల్లిలో డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ర్యాంపు నుంచి ఇసుక రవాణాకు బుధవారం మార్గం సుగమమైంది. ఈనెల 10న గనులు, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ఈ ర్యాం పును లాంఛనంగా ప్రారంభించారు. లారీలను సమకూర్చకపోవడంతో ఇప్పటివరకూ ఇసుక రవాణా మొదలుకాలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ‘బుకింగే.. డెలివరీ లేదు’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో అధికారులు ఐదు లారీలను పురమాయించారు. దీంతో ర్యాంపు నుంచి ఇసుక రవాణాకు అవకాశం ఏర్పడింది. అందాకా.. ఆగాల్సిందే ఇసుక రవాణాకు అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ కొనుగోలుదారులకు ఇప్పట్లో ఇసుక అందే పరిస్థితి కనిపించడం లేదు. ఆర్డ బ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల నిమిత్తం 200 యూనిట్ల ఇసుకను ఆయూ శాఖల అధికారులు కలెక్టర్ ద్వారా బుక్ చేసుకున్నారు. దీంతోపాటు వివిధ శాఖల ఆధ్వర్యంలోనూ అనేక పనులు చేపట్టనున్నారు. ఆయూ పనులకు ఇసుకను తరలించిన తరువాతే ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తామని అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా బుధవారం సాయంత్రానికి సుమారు 500 యూనిట్ల (250 లారీలు) ఇసుక కోసం ప్రైవేటు వ్యక్తులు మీ సేవా కేంద్రాల్లో సొమ్ము చెల్లించారు. గడచిన ఐదు రోజుల నుంచి ఇప్పటివరకు ర్యాంపు నుంచి కేవలం 70 యూనిట్ల ఇసుక మాత్రమే సేకరించారు. డిమాం డ్కు తగినట్టుగా తవ్వకాలు సాగడం లేదు. ఒకటే ర్యాంప్ జిల్లాలో గోదావరి తీరం వెంబడి 16 ఇసుక ర్యాంపుల్ని తెరిచేందుకు కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు రావాల్సి ఉంది. అప్పటివరకు ర్యాంపులు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో వాడపల్లి సమీపంలో గోదావరి మధ్యన గల గోంగూరతిప్పలంకలో సిల్టు తొలగింపు పేరిట ప్రభుత్వం ఇసుక తవ్వకాలు చేపట్టింది. ఇక్కడి నుం చి 1.60 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను సేకరించాలని నిర్ణయించారు. వాగుల నుంచి సేకరించిన ఇసుక నిర్మాణాలకు అనువైనది కాదు. ఈ దృష్ట్యా గోదావరి ఇసుకకు భారీగా డిమాండ్ ఉంది. ఈ కారణంగానే నిర్మాణాలు చేపట్టిన వారంతా గోదావరి ఇసుక కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, ర్యాంపులో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎంత వేగంగా సేకరించినా మీ సేవ కేంద్రాల్లో సొమ్ము చెల్లించిన వారికి ఈనెలాఖరుకైనా ఇసుక అందుతుందనే నమ్మకం కలగటం లేదు. ఆరు రోజులు.. ఆరు యూనిట్లు ప్రభుత్వం డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో వాడపల్లిలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇసుక ర్యాం పునకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈనెల 10న మంత్రి పీతల సుజాత చేతుల మీదుగా ఆరు యూనిట్ల ఇసుకను విక్రయించారు. ఆ తరువాత ఒక్క యూనిట్ కూడా బయటకు పంపించలేదు. ఇక్కడ ఇసుక తవ్వకాలు మందకొడిగా సాగుతున్నాయి. 11, 12 తేదీల్లో హుదూద్ తుపాను కారణంగా తవ్వకాలు చేపట్టలేదు. సోమవారం ఏడు పడవలతో 21 యూనిట్లు, మంగళవారం 14 పడవలతో 42 యూనిట్లు సేకరించారు. మొత్తంగా ఇప్పటివరకు 69 యూనిట్లు (34 లారీలు) ఇసుక సేకరిం చగా, ఆరు యూనిట్లు మాత్రమే విక్రయించారు. సీసీ కెమెరాలేవీ ఇసుక ర్యాంపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని జీపీఆర్ఎస్తో అనుసంధానం చేస్తామని అధికారులు ప్రకటించారు. వాడపల్లి ర్యాంపులో నేటికీ వాటిని ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వ పనుల నిమిత్తం బుధవారం నుంచి ఇసుక తరలిస్తున్నప్పటికీ అది పారదర్శకంగా సాగుతుందో లేదోననే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు ర్యాం పులో విద్యుత్ సదుపాయం లేదు. తాత్కాలికంగా సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభం నుంచి అనధికారికంగా వైరు లాగి రాత్రిపూట లైట్లు వెలిగిస్తున్నారు. స్థానికులకు ఊరట క్యూబిక్ మీటరు ఇసుక రూ.650 చొప్పున ధర నిర్ణరుుంచారు. ర్యాంపు నుంచి ట్రాక్టర్‌పై ఐదు కిలోమీటర్లలోపు, లారీపై 10 కిలోమీటర్లలోపు ఇసుక రవా ణా చేస్తే చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేకుండా మినహాయింపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్థానికుల నుంచి యూనిట్ ఇసుకకు లోడింగ్‌తో కలిపి రూ.2,055 చొప్పున తీసుకుంటున్నారు. -
కూలీలను బలిగొన్న మినీ లారీ
కొవ్వూరు రూరల్ :పొట్టకూటి కోసం కూలి పనులకు బయలుదేరిన ఇద్దరు మహిళా కూలీలను మినీ లారీ రూపంలో మృత్యు వు కబళించింది. కుటుంబం కోసం పొలాల్లో కాయకష్టం చేస్తున్న రేలంగి రత్నం(42), గేడేలి సుబ్బమ్మ(48) మరణంతో కొవ్వూరు మండలం వాడపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. వాడపల్లికి చెందిన రేలంగి రత్నం, గుడేలి సుబ్బమ్మ పక్కపక్క ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు. నిత్యం ఇద్దరూ కలసి వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. శనివారం ఉదయం 7గంటల సమయంలో భోజనం క్యారేజీలను పట్టుకుని ఏటిగట్టుపై గల ఆర్ అండ్ బీ రోడ్డుపై వారిద్దరూ నడిచి వెళుతున్నారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న మినీ లారీ వారి మీదుగా దూసుకు పోయింది. తీవ్రగాయాల పాలైన ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వారి చేతిలోని అన్నం క్యారేజీలు వ్యాన్ ముందుభాగంలో ఇరుక్కుపోయాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఆర్తనాదాలతో హోరెత్తిన ఘటనా ప్రాంతం మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో ఘటనా ప్రాంతం హోరెత్తింది. మృతురాలు రత్నంను తలచుకుని ఆమె భర్త వీర్రాజు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిం చింది. మృతురాలు రత్నంకు ముగ్గురు కుమార్తెలు ఉండగా, అందరికీ వివాహాల య్యాయి. మరో మృతురాలు సుబ్బమ్మకు భర్త శ్రీరాములు, ఐదుగురు కుమార్తెలు ఉం డగా, ఇరువురు కుమార్తెలు మృతి చెందారు. గతంలో మృతి చెందిన రెండో కుమార్తె నాగలక్ష్మి పద్నాలుగేళ్ల కూతురు దుర్గను సుబ్బమ్మ పెంచుకుంటోంది. ఆమె మృతితో మనుమరాలు దుర్గ ఆనాథగా మారిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీ సభ్యుడు, మాజీ సర్పంచ్ కాకర్ల సత్యనారాయణ (నారాయుడు) చేరుకుని బాధిత కుటుంబాలకు సహకారం అందించారు. -
నేను గెలుస్తా.. నువ్వు గెలుస్తావా
* మురళీమోహన్‌కు టీవీ రామారావు సవాల్ * స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ కొవ్వూరు: ‘నేను గెలుస్తాను.. నాకు ఆ నమ్మకం ఉంది.. నీకుందా’ అంటూ కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యే టీవీ రామారావు రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థి మురళీమోహన్ను ఉద్దేశించి సవాల్ చేశారు. శనివారం ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్యసభ సభ్యుడు గరికిపాటి రామ్మోహన్రావు, టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి మురళీమోహన్, స్థానిక నాయకులపై ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సిండికేట్ నాయకుల మాటలు నమ్మి తాను ఒక దళితుడనని కూడా చూడకుండా మురళీమోహన్ తనను అష్టకష్టాలు పెట్టారని ఆరోపించారు. ‘నీ దగ్గర ఒక్క మాట నిలకడ లేదు.. నా వల్ల నువ్వు ఓడిపోతానన్నావు కదా.. ఇపుడు నావల్లే నువ్వు నిజంగానే ఓడిపోతావు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒత్తిళ్లకు తలొగ్గి టికెట్ కేటాయింపులో తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా ఎంతో కష్టపడ్డానని, నా లాంటి కష్టజీవికి అన్యాయం చేస్తారా అంటూ ప్రశ్నించారు. పార్టీ కోసం కష్టపడుతున్న తనను విస్మరించి నాకు కేటాయించిన సీటును వేరొకరికి ఎలా ఇస్తారంటూ మండిపడ్డారు. నా దేవుడు చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ నేతకు ఆంధ్రాలో పనేంటి? ‘గరికిపాటి రామ్మోహనరావు ఎవడు.. అతనొచ్చి ఇక్కడ రాజకీయం చేస్తాడా... తెలంగాణ వాడికి ఆంధ్రాలో పనేంటి’ అని ప్రశ్నించారు. ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటున్నాడని నిలదీశారు. అతనికి నచ్చితే టికెట్ వస్తుందా లేకపోతే రాదా అని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తనకు టికెట్ ఇవ్వకపోయినా స్థానం కోల్పోతామన్న ఉద్దేశంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. ఒత్తిళ్లకు లొంగిపోయి చంద్రబాబు తప్పు చేశారని ఆరోపించారు. ఈ లాబీయింగ్‌లు చేసే వారిని పక్కన పెట్టండి చంద్రబాబుగారు అంటూ ప్రాథేయపడ్డారు. మీరు టికెట్ కేటాయించిన వ్యక్తికి అసలు పార్టీ సభ్యత్వం లేదన్నారు. సర్వేలలో 87 శాతం అనుకూలంగా వచ్చిన తననెందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందని రామారావు ప్రశ్నించారు. ఇతర పార్టీకి చెందిన వ్యక్తిని తీసుకువచ్చి ప్రజలను మోసం చేస్తారా అని ఆవేదన వ్యక్తం వెలిబుచ్చారు. -
కొవ్వూరు వైస్సార్సీపీ అభ్యర్థి ఓటు తొలగింపు!
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం గందరగోళం సృష్టించింది. టీడీపీతో కమిషనర్ కుమ్మకై వైఎస్ఆర్సీపీ ఛైర్మన్ అభ్యర్ధి హరిచరణ్ దంపతుల ఓట్లు తొలగించడం వివాదస్పదమైంది. ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా ఓట్లు తొలగించడంపై అభ్యర్థి హరిచరణ్ అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. అభ్యర్థి ఓట్ల తొలగింపు వ్యవహారంపై హైడ్రామా నాలుగు గంటలు నడించింది. హరిచరణ్ ఆందోళన చేపట్టడంతో కమిషనర్ చేసింది తప్పేనంటూ ఆర్డీవో వివరణ ఇచ్చారు. కమిషనర్ తీరుపై జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తామని ఆర్డీవో వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హరిచరణ్ దంపతులకు ఆర్టీవో అనుమతివ్వడంతో వ్యవహారం సద్దుమణిగింది. -
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
కొవ్వూరు, న్యూస్‌లైన్ :ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. కొవ్వూరు పీఎంఎంఎం హైస్కూల్లో బుధవారం నిర్వహించిన మండల, పట్టణ రచ్చబండ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మూడో విడత రచ్చబండలో 18 లక్షల మందికి రేషన్ కార్డులు, 14 లక్షల మందికి ఇళ్ల మంజూరు పత్రాలు అందించామని చెప్పారు. మొదటి విడత రచ్చబండలో 6 లక్షల మందికి, రెండో విడతలో 14 లక్షల మందికి రేషన్ కార్డులు అందించామన్నారు. మొదటి విడతలో 3 లక్షల మందికి, రెండో విడతలో 5 లక్షల మందికి, మూడో విడతలో 9 లక్షల మందికి పింఛన్లు అందించినట్టు తెలిపారు. ఇందిరమ్మ కలల్లో భాగంగా రాష్ట్రంలో 4.98 లక్షల మంది ఎస్సీలకు, 5.15లక్షల మంది ఎస్టీలకు 50 యూనిట్ల లోపు కరెంటు వినియోగించుకున్న వారి బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మందికి, జిల్లాలో 2,020 మందికి బంగారుతల్లి పథకం అమలు చేస్తున్నట్టు చెప్పారు. కొవ్వూరు, నిడదవోలు ఆర్టీసీ డిపోలను పునరుద్ధరించేందుకు కృషిచేస్తున్నామన్నారు.కొవ్వూరులోని వెంకమ్మ చెరువు వద్ద రోడ్డు మలుపులను సరిచేసే ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే టీవీ రామారావు మాట్లాడుతూ ఇక్కడకు వచ్చిన వారందరికి లబ్ధి చేకూరుతుందా లేదా అని సభకు హాజరైన జనాన్ని ఉద్దేశించి ప్రశ్నించగా పథకాలు అందడం లేదని 80 శాతం మందికిపైగా చేతులెత్తడంతో వేదికపై ఉన్న వారంతా నోళ్లెళ్లబెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముదునూరి నాగరాజు మాట్లాడుతూ అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం లబ్ధిదారులకు మంత్రి పితాని, ఎమ్మెల్యే రామారావు మంజూరు పత్రాలను అందజేశారు. టీడీపీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి సూరపనేని చిన్ని, ఏఎంసీ చైర్మన్ బూరుగుపల్లి వీర్రాఘవులు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు బర్ల శ్రీనివాస్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు ఆత్కూరి దొరయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
జిల్లాలో రాజీవ్ విద్యాదీవెన పథకంపై నీలినీడలు
బడుగుల అభ్యున్నతి కోసం అట్టహాసంగా ప్రారంభిస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, ప్రచారం లోపం, అవగాహన లేమితో కనీసం పథకం ఉందన్న సంగతి కూడా ప్రజలకు తెలియని పరిస్థితి. ఈ కోవకు చెందిందే సాంఘిక సంక్షేమ శాఖ అమలుచేస్తున్న రాజీవ్ విద్యాదీవెన పథకం. నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచడం దీని ఉద్దేశం. పథకంపై కనీసం పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కూడా పూర్తి సమాచారం తెలియకపోవడం గమనార్హం. కొవ్వూరు రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో 2013-14 విద్యాసంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు గడుస్తున్నా రాజీవ్ విద్యా దీవెన పథకానికి ఒక్క విద్యార్థి కూడా దరఖాస్తు చేసుకోలేదు. అ ర్హులకు సంబంధించిన జాబితాల ను కూడా సంబంధిత అధికారులు సిద్ధం చేయలేదు. పథకంపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడంతో పాటు నిబంధనలు కూడా అవరోధంగా మారాయి. దీంతో పథకం నీరుగారిపోతోందని పలువురు విమర్శిస్తున్నారు. నెలకు రూ. 150 ఉపకార వేతనం ప్రభుత్వ పాఠశాలల్లో 5 నుంచి 10 తరగతి వరకు చదువుతూ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉండని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పథకంలో భాగంగా ఉపకార వేతనం అందిస్తారు. విద్యార్థికి ప్రతినెలా ఉపకార వేతనం రూ.150, ఏడాదిలో పుస్తకాల కొనుగోలు నిమిత్తం రూ.750ను బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. గతేడాది 9, 10 తరగతుల ఎస్సీ విద్యార్థులకు మాత్రమే అమలు చేసిన రాజీవ్ విద్యాదీవెనను ఈ ఏడాది నుంచి 5 నుంచి 10వ తరగతి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వర్తింపజేయాలని ప్రభుత్వం జులైలో ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల అడ్డంకి పథకం కోసం విద్యార్థి స్వయంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతోపాటు శాశ్వత కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, తల్లిదండ్రులలో ఒకరితో ఉన్న జాయింట్ బ్యాంక్ అకౌంట్ జతచేయాలి. జిల్లాలో పలువురు విద్యార్థులకు ఆధార్ కార్డులు లేకపోవడం, తల్లిదండ్రులు నిర్లక్ష్యరాస్యులు కావడంతో దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పూర్తి సమాచారం తెలియకపోవడంతో పథకంపై విద్యార్థులకు అవగాహన కల్పించలేకపోతున్నారు. మండలానికి 2 వేల మంది చొప్పున.. జిల్లావ్యాప్తంగా 46 మండలాల్లో సగటున ఒక్కో మండలంలో 2 వేల మంది చొప్పున 92 వేల మంది అర్హులు ఉంటారని అంచనా. కొవ్వూరు మండలంలో 40 ప్రాథమిక, 6 ప్రాథమికోన్నత, 12 ఉన్నత పాఠశాలల్లో పథకానికి సుమారు 2,667 మంది అర్హులు ఉన్నారు. గతంలో మండల విద్యాశాఖ అధికారులు సూచనప్రాయంగా పథకం గురించి చెప్పారని, పూర్తి విధివిధానాలు తమకు తెలియవని పలువురు ప్రధానోపాధ్యాయులు అంటున్నారు. గత విద్యాసంవత్సరంలో కొవ్వూరు అసిస్టెంట్ సాంఘిక సంక్షేమశాఖ అధికారి పరిధిలోని కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు, నిడదవోలు, పోలవరం మండలాలలో వేలాది మంది అర్హులు ఉన్నా కేవలం 543 మందికి మాత్రమే ఒక్కొక్కరికీ రూ. 2,100 చొప్పున అందజేశారు. సమాచారమందించాం రాజీవ్ విద్యాదీవెన పథకంపై ఎంఈవో కార్యాలయాల ద్వారా అన్ని పాఠశాలలకు సమాచారమందించాం. రెండు నెలలుగా సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ఆలసమైంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం అందేలా చూస్తాం. - పీడీడబ్ల్యూ ప్రసాద్, అసిస్టెంట్ సాంఘిక సంక్షేమశాఖ అధికారి, కొవ్వూరు. -
ఆధార్ గుదిబండ
కొవ్వూరు రూరల్, న్యూస్‌లైన్: ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన నగదు బదిలీ పథకం వంటగ్యాస్ వినియోగదారులకు గుది బండగా మారింది. ఆధార్ అనుసంధానం చేయించుకున్న వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ రూపేణా జమయ్యే మొత్తం ఎంత అనే దానిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా పెరిగిన ధర ప్రకారం సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ రూ.1,071 కాగా, ఆధార్ అనుసంధానం చేయించుకున్న వారికి సబ్సిడీ రూపంలో రూ.612 బ్యాంక్ అకౌం ట్లో జమ అవుతోంది. అంటే సబ్సిడీ పోగా, వినియోగదారుడు రూ.459 చెల్లించాల్సి వస్తోంది. అయితే, అనుసంధానం చేయించుకోని వారికి రూ.412కే గ్యాస్ సిలిం డర్ సరఫరా చేస్తున్నారు. దీని ప్రకారం చూస్తే ఆధార్ అనుసంధానం చేయించుకున్న వారు సిలిండర్‌కు రూ.47 నష్టపోవాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా దీపం గ్యాస్ కనెక్షన్లు సుమారు 1.70 లక్షలు, ఇతర వినియోగదారులు సుమారు 5.80 లక్షల వరకూ ఉన్నారని అంచనా. ఇప్పటివరకూ సుమారు 40 శాతం మంది వినియోగదారులు ఆధార్ అనుసంధానం చేయించుకున్నారని అధికారులు చెబుతున్నారు. కొవ్వూరు గ్యాస్ ఏజెన్సీ పరిధిలో సుమారు 30 వేల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, సుమారు 17,200 మంది వినియోగదారులు మాత్రమే ఇప్పటివరకు బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయించుకున్నారు. ఇంకా సుమారు 12,800 మంది వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తి చేయూల్సి ఉంది. స్పష్టత లేని నగదు బదిలీ అక్టోబర్ 1నుంచి జిల్లాలో ఆధార్ అనుసంధానం పూర్తి చేసుకున్న గ్యాస్ విని యోగదారులందరికీ నగదు బదిలీ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే అనుసంధానం పూర్తయినా కొందరి ఖాతాల్లో సబ్సిడీ మొత్తం జమ కావడం లేదు. గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఆధార్ నంబర్‌తో బ్యాంకు ఖాతాను అనుసంధానం చేయించుకుంటేనే గ్యాస్‌పై సబ్సిడీ ఇస్తామని, ఆ మొత్తాన్ని నగదు బదిలీ రూపంలో వినియోగదారుని ఖాతాలో నేరుగా జమ చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఆధార్ అనుసంధానం చేయించుకోని వారికి సబ్సిడీ ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. మరోవైపు ప్రజా సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయడం సరికాదని సుప్రీం కోర్టు పేర్కొన్న నేపథ్యంలో అనుసంధానం ప్రక్రియపై సందిగ్ధత నెలకొంది. అయితే, ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని, ఆ ప్రక్రియ పూర్తిచేయని డీలర్లపై చర్యలు తప్పవని జిల్లా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల వల్ల అటు డీలర్లలోను ఇటు వినియోగదారులలోను అయోమయం నెలకొంది. ఇటీవల పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమెయిలీ ఆధార్ అనుసంధానం పూర్తికాని వారికి సబ్సిడీ ధరకే గ్యాస్‌ను అందిస్తామని ప్రకటించారు. దీంతో అసలు ఆధార్ అనుసంధానం చేయించాలా, వద్దా అనే మీమాంసలో వినియోగదారులు కొట్టుమి ట్టాడుతున్నారు.