
కొవ్వూరు : పట్టణంలో రోడ్డు కం రైలు వంతెన దిగువున గోదావరి నదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కనిపించింది. సుమారు 50 నుంచి యాభై ఐదేళ్ల వయసు కలిగిన మహిళ మృతదేహాన్ని శుక్రవారం స్థానికులు గుర్తించారు.
మూడు, నాలుగు రోజుల క్రితమే ఆమె మృతిచెంది ఉండవచ్చునని భావిస్తున్నారు. పసుపు రంగు చీర ధరించి ఉంది. ఏ విధమైన ఆధారాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. వీఆర్వో పోలుమాటి సూర్యారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎస్‌ఎస్‌ఎస్ పవన్‌కుమార్ తెలిపారు.
మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. వివరాల కోసం 08813–231100, 94407 96622, 80083 72359 నంబర్‌కి కాల్ చేయాలని సూచించారు. మృతదేహం పూర్తిగా పాడై ఉంది. ప్రాథమికంగా లభించిన ఆధారాలను బట్టి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment