women dead body
-
విశాఖ బీచ్‌లో వివాహిత డెడ్‌బాడీ కలకలం.. ఏం జరిగింది?
సాక్షి, విశాఖపట్నం: విశాఖ బీచ్‌లో మహిళ డెడ్‌బాడీ కలకలం సృష్టించింది. వైఎంసీఏ బీచ్‌లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, మృతురాలిని పెదగంట్యాడకు చెందిన శ్వేతగా గుర్తించారు. వివరాల ప్రకారం.. వివాహిత శ్వేత మంగళవారం మిస్ అయినట్టు న్యూపోర్టు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ క్రమంలో శ్వేత కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, బుధవారం ఉదయం విశాఖ ట్రీ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ మృతదేహాం లభ్యమైనట్టు సమాచారం వచ్చింది. అయితే, నిన్న అర్ధరాత్రి సముద్రపు అలల తాకిడి మృతదేహాం కొట్టుకువచ్చినట్టు గుర్తించారు. కానీ, మహిళ మృతదేహాంపై గాయాలు, ఒంటిపై దుస్తులు లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా హత్య చేశారా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు.. శ్వేత భర్త ఐటీ ఉద్యోగి. ఆమె 5 నెలల గర్భిణి అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తాజాగా శ్వేత మృతదేహాం లభ్యమైన ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శ్వేత ఆత్మహత్య చేసుకుందా?.. లేక ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడ్డారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
మహిళదే ఆ మృతదేహం
సాక్షి, అమరావతి/రాయవరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరం–పసలపూడి గ్రామాల మధ్య గడ్డివాములో పూర్తిగా కాలిన స్థితిలో ఉన్న వ్యక్తి మృతదేహం మహిళదని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నెల 24న మండపేట–కాకినాడ ప్రధాన రహదారిని ఆనుకుని పంట పొలం దిమ్మపై ఉన్న గడ్డివాములో మృతదేహం బయటపడింది. మంటల్లో పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న మృతదేహం మహిళదా... పురుషుడిదా... అనే విషయంలో పోలీసులు తొలుత నిర్ధారణకు రాలేదు. అయితే, దీనిపై రామచంద్రపురం డీఎస్పీ డి.బాలచంద్రారెడ్డి నేతృత్వంలో మండపేట రూరల్ సీఐ శివగణేష్ దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనాస్థలంలో క్షుణ్ణంగా పరిశీలించగా, మహిళ తలకు పెట్టుకునే క్లిప్ కాలిన స్థితిలో కనిపించింది. గడ్డివాము సమీపంలో పగిలిన గాజు ముక్కలు, కొద్దిదూరంలో చెప్పులు దొరికాయి. వీటి ఆధారంగా ఆ మృతదేహం మహిళదేనని నిర్ధారణకు వచ్చారు. ఈ ఆధారాలతోనే కేసు చిక్కుముడి వీడాల్సి ఉంది. మరోవైపు పోలీసులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో మిస్సింగ్ కేసుల వివరాలను సేకరిస్తున్నారు. మృతదేహం వివరాలతో మిస్సింగ్ కేసులను సరిపోల్చుకుని చూస్తున్నారు. అయితే, శనివారం సాయంత్రం వరకు ఎటువంటి క్లూ దొరకలేదని సమాచారం. నేరస్తులను గుర్తించి అరెస్ట్ చేయండి : జయశ్రీరెడ్డి మాచవరం–పసలపూడి గ్రామాల మధ్య గడ్డివాములో పూర్తిగా కాలిన మహిళ మృతదేహం ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సుధీర్‌బాబుతో మహిళా కమిషన్ సభ్యురాలు కర్రి జయశ్రీ రెడ్డి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మహిళ పట్ల అంత కర్కశత్వానికి పాల్పడిన నేరస్తులను గుర్తించి తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారని, ప్రత్యేక బృందాలతో విచారణను ముమ్మరం చేసినట్లు ఎస్పీ వివరించారు. నేరస్తులను త్వరగా పట్టుకుంటామన్నారు. కేసు సమగ్ర విచారణ నివేదికను మహిళా కమిషన్‌కు సమర్పిస్తామని తెలిపారు. -
ఎవరిదీ మృతదేహం?
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో లభించిన మహిళ మృతదేహం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మృతురాలు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళగా అనుమానిస్తున్నట్లు సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ కె.చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. బోరబండ సమీపంలోని సున్నం చెరువులో ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని సనత్‌నగర్ పోలీసులు గత నెల 20న స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉంది. ప్రాథమిక ఆధారాలను బట్టి హతమార్చి, ప్లాస్టిక్ కవర్లో చుట్టి చెరువులో పడేసినట్లు తేల్చారు. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఆ మహిళ కుడి చేతిపై ‘ఎస్’ అక్షరం టాటూ వేసి ఉంది. ఆచూకీ తెలిసిన వారు సనత్‌నగర్ ఇన్స్పెక్టర్కు 9490617132 లేదా ఎస్ఐ 7901113461 లేదా పోలీసుస్టేషన్‌కు 8331013246 ఫోన్ చేసి తెలపాలని కోరుతున్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. -
ప్లాస్టిక్ కవర్ చుట్టి.. చెరువులో పడేసి
సాక్షి, సనత్‌నగర్ : గుర్తు తెలియని వ్యక్తులు మహిళను హత్య చేసి ప్లాస్టిక్ కవర్లో చుట్టి చెరువులో పడేశారు. అయితే హత్యకు గురైన మహిళ మృతదేహం గుర్తు పట్టలేని విధంగా ఉండడంతో పోలీసులు ఆమె గురించి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలు ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి వివరాల ప్రకారం.. బోరబండ సమీపంలోని సున్నం చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తేలియాడుతుందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహం మహిళదిగా గుర్తించారు. అప్పటికే మృతదేహం ఉబ్బిపోయి ఉండడంతో పాటు ముఖం గుర్తుపట్టలేని విధంగా ఉంది. దీనిని బట్టి చెరువులో పడేసి చాలా రోజులు అయి ఉండవచ్చని భావిస్తున్నారు. కాళ్లు, ముఖం మినహా మిగతా శరీర భాగాలకు ప్లాస్టిక్ కవర్ చుట్టి ఉంది. అలాగే కాళ్లు చేతులు సన్నని వస్త్రంతో కట్టేసి ఉన్నాయి. తలకు బలమైన గాయమైనట్లు గుర్తించారు. దీనిని బట్టి మహిళను హత్య చేసి చెరువులో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ వయస్సు 30–40 ఏళ్ల మధ్యలో ఉంటుందని, ఆమె కుడి చేతిపై ‘ఎస్’ అక్షరంతో టాటూ ముద్రించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె వివరాలు తెలిస్తేనే హత్యకు ఒడిగట్టింది ఎవరు? హత్యకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేయనున్నట్లు ఇన్స్పెక్టర్ చెప్పారు. మృతురాలి చేతిపై ఉన్న టాటూ ఆధారంగా ఆమె సంబంధీకులు మృతదేహాన్ని గుర్తించగలరని భావిస్తున్నట్లు తెలిపారు. మహిళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే సనత్‌నగర్ పోలీసులను ఆశ్రయించాల్సిందిగా కోరారు. ఈ మేరకు హత్య కేసుగా భావించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కారులో మహిళ మృతదేహం
అన్నానగర్: పెరుమానల్లూరు సమీపంలో మంగళవారం కారులో మహిళ మృతదేహం లభ్యమైంది. వివరాలు.. పంజాబ్ రాష్ట్రానికి చెందిన గౌరవ్ అరోరా (35). ఇతనికి అదే రాష్ట్రానికి చెందిన ప్రస్‌జోత్ (29)కి నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి తేజ్ (3) అనే కుమారుడు ఉన్నాడు. గౌరవ్ అరోరా తిరుప్పూర్ జిల్లా పోయమ్‌పాళయం అయ్యప్పనగర్‌లో కుటుంబంతో నివశిస్తున్నాడు. ఇతని ఇంటి మిద్దెపై బనియన్ సంస్థ నడుపుతున్నాడు. ఇదిలాఉండగా గత కొన్ని రోజులుగా దంపతుల మధ్య తగాదాలు మొదలయ్యాయి. గౌరవ్ అరోరా స్నేహితుడైన రాయపురానికి చెందిన రవీంద్రన్ వారిద్దరికి సర్ధిచెప్తూ వచ్చాడు. ఈ స్థితిలో మంగళవారం గౌరవ్‌అరోరా, రవీంద్రన్‌కి ఫోన్ చేసి తన భార్య మృతి చెందిందని, మృతదేహం కారులో ఉందని, కారు పెరుమానల్లూరు సమీపంలో నిలిపి ఉంచినట్టుగా తెలిపి ఫోన్ స్విచ్ఆఫ్ చేశాడు. దీంతో దిగ్భ్రాంతి చెందిన రవీంద్రన్ పెరుమానల్లూరు పోలీసులకు సమాచారం అందించారు. కారు ఉన్న స్థలానికి వెళ్లి చూడగా కారులో వెనుకసీటుపై ప్రస్‌జోత్ మృతదేహం కవర్‌తో కప్పి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోవై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. బిడ్డతో సహా అజ్ఞాతంలో ఉన్న గౌరవ్‌అరోరా కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
సహజీవనం చేస్తూ శవమై తేలి..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని గోకల్‌పురిలోని ఫ్లాట్‌లో కుళ్లిన పాతికేళ్ల మహిళ మృతదేహాన్ని ఆమె అల్మారాలో పోలీసులు గుర్తించారు. పెళ్లైన వ్యక్తితో ఆమె సహజీవనం చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.భార్యకు విడాకులిచ్చి తనను పెళ్లిచేసుకోవాల్సిందిగా బాధితురాలు ఆమె ప్రియుడిపై ఒత్తిడి తెచ్చినట్టు భావిస్తున్నారు. పెళ్లైన వ్యక్తితో సహజీవనం చేయడాన్ని వ్యతిరేకించిన కుటుంబ సభ్యులకు దూరంగా బాధితురాలు అదే ఫ్లాట్‌లో విడిగా ఉంటున్నారని పోలీసులు చెప్పారు. తాను సహజీవనం చేస్తున్న మహిళ ఇంట్లోంచి పొగ వస్తోందని ప్రియుడు అందించిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకోగా అల్మారాలో మహిళ శవాన్ని గుర్తించారు. ఆమెను కొద్దిరోజుల కిందటే గొంతునులిమి హతమార్చిఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలు సహజీవనం చేస్తున్న వ్యక్తితో పాటు ఇతరులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. -
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
కొవ్వూరు : పట్టణంలో రోడ్డు కం రైలు వంతెన దిగువున గోదావరి నదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కనిపించింది. సుమారు 50 నుంచి యాభై ఐదేళ్ల వయసు కలిగిన మహిళ మృతదేహాన్ని శుక్రవారం స్థానికులు గుర్తించారు. మూడు, నాలుగు రోజుల క్రితమే ఆమె మృతిచెంది ఉండవచ్చునని భావిస్తున్నారు. పసుపు రంగు చీర ధరించి ఉంది. ఏ విధమైన ఆధారాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. వీఆర్వో పోలుమాటి సూర్యారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎస్ఎస్ఎస్ పవన్‌కుమార్ తెలిపారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. వివరాల కోసం 08813–231100, 94407 96622, 80083 72359 నంబర్‌కి కాల్ చేయాలని సూచించారు. మృతదేహం పూర్తిగా పాడై ఉంది. ప్రాథమికంగా లభించిన ఆధారాలను బట్టి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. -
కొమ్మూరు చెరువులో మృతదేహం
మహబూబ్ నగర్: మద్దూరు మండలం కొమ్మూరు చెరువులో ఆదివారం మధ్యాహ్నం గ్రామస్తులు గుర్తు తెలియని ఒక మహిళ మృత దేహాన్ని కనుగొన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని బయటకు తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహబూబ్ నగర్ లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పాద మృతిగా నమోదు చేసుకొని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.