
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో లభించిన మహిళ మృతదేహం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మృతురాలు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళగా అనుమానిస్తున్నట్లు సనత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ కె.చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. బోరబండ సమీపంలోని సున్నం చెరువులో ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని సనత్‌నగర్ పోలీసులు గత నెల 20న స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉంది. ప్రాథమిక ఆధారాలను బట్టి హతమార్చి, ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి చెరువులో పడేసినట్లు తేల్చారు. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఆ మహిళ కుడి చేతిపై ‘ఎస్’ అక్షరం టాటూ వేసి ఉంది. ఆచూకీ తెలిసిన వారు సనత్‌నగర్ ఇన్‌స్పెక్టర్‌కు 9490617132 లేదా ఎస్‌ఐ 7901113461 లేదా పోలీసుస్టేషన్‌కు 8331013246 ఫోన్ చేసి తెలపాలని కోరుతున్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment