
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని గోకల్‌పురిలోని ఫ్లాట్‌లో కుళ్లిన పాతికేళ్ల మహిళ మృతదేహాన్ని ఆమె అల్మారాలో పోలీసులు గుర్తించారు. పెళ్లైన వ్యక్తితో ఆమె సహజీవనం చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.భార్యకు విడాకులిచ్చి తనను పెళ్లిచేసుకోవాల్సిందిగా బాధితురాలు ఆమె ప్రియుడిపై ఒత్తిడి తెచ్చినట్టు భావిస్తున్నారు. పెళ్లైన వ్యక్తితో సహజీవనం చేయడాన్ని వ్యతిరేకించిన కుటుంబ సభ్యులకు దూరంగా బాధితురాలు అదే ఫ్లాట్‌లో విడిగా ఉంటున్నారని పోలీసులు చెప్పారు.
తాను సహజీవనం చేస్తున్న మహిళ ఇంట్లోంచి పొగ వస్తోందని ప్రియుడు అందించిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకోగా అల్మారాలో మహిళ శవాన్ని గుర్తించారు. ఆమెను కొద్దిరోజుల కిందటే గొంతునులిమి హతమార్చిఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలు సహజీవనం చేస్తున్న వ్యక్తితో పాటు ఇతరులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment