live in relationship
-
'పెళ్లికి ముందు సహజీవనం'.. ఉచిత సలహాపై మండిపడ్డ నటి!
దమ్ మారో దమ్.. పాటలో తన పర్ఫామెన్స్తో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది జీనత్ అమన్. స్టార్ హీరోయిన్గా ఎదుగుతన్న సమయంలోనే దర్శకుడు మజర్ ఖాన్‌ను ప్రేమించి పెళ్లాడింది. వైవాహిక జీవితంలో గొడవలు తలెత్తడంతో విడాకులు తీసుకుంది. గతంలో ప్రేమ, డేటింగ్ గురించి మాట్లాడుతూ.. కుర్రకారు ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవాలని పిలుపునిచ్చింది. మనసుకు నచ్చగానే బెడ్ ఎక్కేయడం కరెక్ట్ కాదని హెచ్చరించింది. తాజాగా మరోసారి అలాంటి సలహాలు ఇచ్చింది జీనత్ అమన్. పెళ్లికి ముందు సహజీవనం చేయాలంటూ యువతకు సలహాలు ఇచ్చింది. మీరు ప్రేమలో ఉన్నట్లైతే వెంటనే పెళ్లి చేసుకోవద్దు.. కచ్చితంగా సహజీవనం చేయండి.. ఆ తర్వాతే పెళ్లి చేసుకోండి. నా ఇద్దరు కుమారులకు కూడా ఇదే చెప్తూ ఉంటానని చెప్పుకొచ్చింది. అయితే జీనత్ సలహాలపై నెటిజన్స్ మండిపడుతున్నారు. మరికొందరు మీరు చెప్పింది బాగానే ఉంది.. కానీ, దాన్ని ఆచరణలో పెట్టేందుకు సొసైటీ అందుకు సహకరించదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా మరో సీనియర్ నటి ముంతాజ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. జీనత్ అలాంటి సలహాలు ఇవ్వడంపై విమర్శలు గుప్పించింది. స్త్రీలు ఇలాంటి సంస్కృతిని అనుసరించినట్లయితే వివాహ వ్యవస్థ నిరుపయోగం అవుతుందని ముంతాజ్ తెలిపింది. సోషల్ మీడియాలో జీనత్ ఇచ్చే సలహాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ముంతాజ్ పేర్కొంది. ఆమె కేవలం సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి చెత్త సలహాలు ఇవ్వడం మంచిది కాదని హితవు పలికింది. మా నైతిక విలువలకు విరుద్ధంగా ఇలా చేయడం కరెక్ట్ కాదని సూచించింది. ఇలాంటి సంబంధాలపై సలహాలు ఇచ్చే చివరి వ్యక్తి జీనత్ అవ్వాలని కోరుకుంటున్నట్లు ముంతాజ్ తెలిపింది. గతంలో జీనత్ అమన్... నటుడు మజార్ ఖాన్‌తో వివాహంపై ముంతాజ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. మజర్ ఖాన్‌ను పెళ్లి చేసుకోవడానికి ముందు ఆమెకు చాలా ఏళ్ల క్రితమే తెలుసని ముంతాజ్ వెల్లడించింది. ఆమె వివాహం ఒక ప్రత్యక్ష నరకమని పేర్కొంది. కాగా.. జీనత్ అమన్ మొదట సంజయ్ ఖాన్‌ను పెళ్లాడారు. ఆ తర్వాత ఏడాదికే విడిపోయారు. ఆ తర్వాత జీనత్ అమన్ 1985లో మజర్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. 1998లో అతను మరణించే వరకు అతనితోనే ఉంది. అయితే గతంలో చాలా సందర్భాల్లో అతన్ని వివాహం చేసుకుని తప్పు చేశానని..పెళ్లయిన 12 సంవత్సరాలలో ఒక్క క్షణం కూడా ఆనందంగా లేనని పేర్కొంది. -
ప్రేమలో ఉన్నారా? ముందు సహజీవనం, తర్వాతే పెళ్లి!
దమ్ మారో దమ్.. పాటలో తన పర్ఫామెన్స్తో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది జీనత్ అమన్. స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న సమయంలో నటుడు, దర్శకుడు మజర్ ఖాన్‌ను ప్రేమించి పెళ్లాడింది. వైవాహిక జీవితంలో గొడవలు తలెత్తడంతో విడాకులు తీసుకుంది. ఆ మధ్య ప్రేమ, డేటింగ్ గురించి మాట్లాడుతూ.. కుర్రకారు ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవాలని పిలుపునిచ్చింది. మనసుకు నచ్చగానే బెడ్ ఎక్కేయడం కరెక్ట్ కాదని హెచ్చరించింది. అవతలివారి కోసం మీ వ్యక్తిత్వాన్ని పక్కన పడేయొద్దని సూచించింది. నటి రిలేషన్ పాఠాలు తాజాగా మరోసారి ఆమె ప్రేమ పాఠాలు చెప్పింది. 'నేను ఇంతకుముందు ఏదో పోస్ట్ పెడితే రిలేషన్షిప్ సలహాలు ఇవ్వమని దానికింద కామెంట్లు చేశారు కదా.. ఇంతకుముందు ఎక్కడా చెప్పని ఓ విషయం ఇప్పుడు చెప్తున్నా వినండి.. మీరు ప్రేమలో ఉన్నట్లైతే వెంటనే పెళ్లి చేసుకోవద్దు. కచ్చితంగా సహజీవనం చేయండి.. ఆ తర్వాతే పెళ్లి చేసుకోండి. నా ఇద్దరు కుమారులకు కూడా ఇదే చెప్తూ ఉంటాను. సహజీవనమే బెటర్ రెండు కుటుంబాలు, రిజిస్ట్రేషన్ కోసం గవర్నమెంట్.. ఇలా అన్నింటినీ భాగం చేసే ముందు మీ ప్రేమకు టెస్ట్ పెట్టుకోండి.. అదే లివ్ ఇన్ రిలేషన్షిప్. నాకైతే ఇదే లాజిక్‌గా అనిపిస్తుంది. మీరు రోజూ కొన్ని గంటలు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే బాగానే ఉంటుంది. అదే ఇద్దరూ ఒకే రూమ్ షేర్ చేసుకోగలుగుతారా? బాధలో ఉన్నప్పుడు నిజంగానే అవతలి వ్యక్తి ఓదార్చుతారా? నీకు నచ్చింది వంట చేసేందుకు ఒప్పుకుంటారా? సలహా బాగుంది కానీ.. బెడ్రూమ్, బాత్రూమ్.. అన్నింటినీ పంచుకోగలుగుతారా? సర్దుకుపోతారా? ఇలా ఎన్నో విషయాల్లో మీకంటూ ఓ క్లారిటీ వస్తుంది. సహజీవనం సరైనదే అంటే మన సమాజం అదొక పెద్ద పాపం అన్నట్లుగా చూస్తుంది.. అయినా చాలా విషయాల్లో సమాజం ఇలాగే ప్రవర్తిస్తుందిలే!' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ఇది చూసిన కొందరు మీరు చెప్పింది బాగానే ఉంది.. కానీ, దాన్ని ఆచరణలో పెట్టేందుకు సొసైటీ అందుకు సహకరించదని కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Zeenat Aman (@thezeenataman) చదవండి: నేరుగా ఓటీటీలోకి తెలుగు డబ్బింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే? -
బిగ్‌బాస్ నటితో సహజీవనం.. ఇప్పుడేమో సింగిల్‌గా ఉంటూ!
బిగ్‌బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న భామ పవిత్రా పూనియా. ఈ ముద్దుగుమ్మ 2020లో బిగ్‌బాస్ -14వ సీజన్లో మెరిసింది. అదే సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఇజాజ్ ఖాన్‌తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత డేటింగ్లో ఉన్న భామ.. ఏడాదిలోపే పెళ్లి చేసుకుంటానని నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ.. అంతలోనే పెళ్లి విషయం పక్కనపెట్టేసి రెండేళ్లు సహజీవనం చేశారు. ఈ ఏడాదిలోనైనా పెళ్లిబంధంలోకి అడుగుపెడతారన్న జంట ఫిబ్రవరి 14న షాకింగ్ న్యూస్ చెప్పారు. తామిద్దరం విడిపోతున్నట్లు బుల్లితెర జంట ప్రకటించారు. బుల్లితెర నటులైన ఇజాజ్ ఖాన్- పవిత్ర పూనియా మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. అంతకుముందు ఇద్దరూ ఒకే అపార్ట్మెంట్లో ఉండగా.. గత నెలలో ఇజాజ్ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. పవిత్ర పూనియా మాత్రం ప్రస్తుతం అదే ఇంట్లో ఉంటోంది. నాలుగేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు తమ బంధానికి ముగింపు పలికారు. అయితే ప్రస్తుతం ఇజాజ్ ఖాన్ తన దృష్టినంతా కెరీర్‌పైనే పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను ఎవరితోనూ రిలేషన్లో లేడని సమాచారం. దీంతో ఇజాజ్ సింగిల్‌గానే ఉంటున్నారు. గతంలో పునియాను ఇజాజ్ ఖాన్ మోసం చేశాడని.. విడిపోవడానికి అదే కారణమని రూమర్స్ వచ్చాయి. కానీ వాటన్నింటినీ పూనియా తోసిపుచ్చింది. కాగా.. ఇజాజ్ ఖాన్ ప్రస్తుతం కొత్త ఇంటికి మారాడు. అంతే కాకుండా దివ్యాంక త్రిపాఠితో ఒక ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నాడు. బ్రేకప్ అయ్యాక పూర్తిగా తన కెరీర్‌పైనే ఫోకస్ పెట్టారు. కాగా.. పవిత్ర ప్రస్తుతం 'ఇష్క్ కీ దస్తాన్-నాగమణి' అనే సీరియల్లో నటిస్తోంది. -
‘చాలాకాలం సహజీవనం చేసి, పెళ్లి చేసుకోకున్నా భరణం ఇవ్వాల్సిందే’
భోపాల్: వివాహం, భరణం అంశంపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పురుషుడితో చాలాకాలంపాటు సహజీవనం చేసిన మహిళ.. విడిపోయిన సమయంలో భరణం పొందేందుకు అర్హురాలని తెలిపింది. చట్టబద్దంగా ఇరువురు వివాహం చేసుకోకపోయినా ఇది వర్తిస్తుందని పేర్కొంది. గతంలో సహజీవనం చేసిన భాగస్వామికి భరణం ఇవ్వాలంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మహిళకు నెలసరి భత్యం కింద 1,500 చెల్లించాలంటూ కింద కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. వివరాలు .. శైలేష్ బోప్చే(38), అనితా బోప్చే (48) అనే మహిళతో కొంతకాలం సహజీవనం చేశారు. వీరికి ఓ బిడ్డ కూడా జన్మించింది. బాలాఘాట్‌కి చెందిన శైలేష్ బోప్చే.. సదరు మహిళ ఆరోపణలపై ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తన భార్యగా చెప్పుకుంటున్న మహిళ, ఆలయంలో వివాహం చేసుకున్నట్లు రుజువు చేయలేకపోయిందని బోప్చే కోర్టుకు చెప్పాడు. ఈ కేసులో మహిళ చట్టబద్ధంగా అతని భార్య కాదని.. సీఆర్పీసీలోని సెక్షన్ 125 కింద మెయింటనెన్స్ మొత్తాన్ని డిమాండ్ చేయలేదని బోప్చే తరుపు న్యాయవాది వాదనల్ని వినిపించారు. జస్టిస్ జీఎస్ అహ్లువాలియాతో కూడిన బెంచ్ మహిళ కొంత కాలం సదరు వ్యక్తితో కలిసి జీవించిందనే వివరాలను గుర్తించింది. దీంతో ఆమె భరణానికి అర్హురాలే అని తీర్పు వెల్లడించింది. తనతో నివసించిన మహిళకు నెలవారీ భత్యం రూ.1,500 చెల్లించాలని ట్రయల్ కోర్టు ఆదేశించింది. అయితే ఈ ఉతర్వులను శైలేష్ బాప్చే హైకోర్టులో సవాల్ చేశాడు. దీనిపై జస్టిస్ జేఎస్ అహ్లూవాలియాతో కూడిన ధర్మాసనం శనివారం విచారణ చేపట్టి.. ఆమెకు నెలసరి భత్యం కింద రూ. 1,500 చెల్లించాలంటూ కింద కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. -
అమ్మతనానికి మాయని మచ్చ.. సహజీవనం చేస్తున్న వ్యక్తితో కూతురిపై
తిరువనంతపురం: అమ్మ ప్రేమకు ప్రత్యామ్నాయం ఉండదు. త్యాగానికి ప్రతిరూపం అమ్మ. పిల్లలపై కన్నతల్లికి ఉన్న ప్రేమ, మమకారం వర్ణించలేనిది. అలాంటి పేగు బంధానికి మాయని మచ్చ తెచ్చింది ఓ మాతృమూర్తి. తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తితో సొంత కూతురిపై అత్యాచారానికి ప్రోత్సహించింది కసాయి తల్లి. సభ్యసమాజం సిగ్గుపడే ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. కన్నతల్లి బంధానికే అర్ధాన్ని మార్చివేస్తూ మహిళ చేసిన నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోక్సో కేసులో సదరు తల్లికి 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన ఓ మహిళ తన భర్తను వదిలేసి ప్రియుడు శిశుపాలన్‌తో సహజీవనం చేస్తుంది. ఆ సమయంలో మహిళ ఏడేళ్ల కూతురు తన వద్దే ఉంటుంది. ఈ క్రమంలో బాలికనుని శిశుపాలన్ అనేకమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్నిసార్లు స్వయంగా తల్లే తన కూతురిని అతని వద్దకు తీసుకెళ్లి ఈ దారుణానికి ప్రోత్సహించింది. 2018 మార్చి నుంచి 2019 సెప్టెంబర్ మధ్య కాలంలో ఈలైంగిక దాడి జరిగింది. అయితే బాధితురాలి పదకొండేళ్ల సోదరి ఇంటికి వచ్చినప్పుడు.. తనపై జరుగుతున్న వేధింపుల విషయాన్ని ఆమెకు వివరించింది. అంతేగాక పెద్ద అమ్మాయిని కూడా శిశుపాలను వేధింపులకు గురిచేశాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో 11 ఏళ్ల అక్క చిన్నారితో కలిసి ఇంట్లో నుంచి తప్పించుకొని వాళ్ల అమ్మమ్మ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని వారితో చెప్పుకుంది. ఆమె పోలీసులను ఆశ్రయించగా.. నిందితులపై కేసు నమోదు చేసి తల్లితోపాటు సహజీవన భాగస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సమయంలో నిందితుడు శిశుపాలన్ ఆత్మహత్య చేసుకోగా.. తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తితో సొంత కూతురిపై అత్యాచారానికి ప్రోత్సహించిన తల్లికి 40 ఏళ్ల జైలు శిక్ష వేసింది కోర్టు. ఆమెకు ఆరునెలల కఠిన కారాగార శిక్ష కూడా విధించారు. తిరువనంతపురం ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి ఆర్ రేఖ ఈ మేరకు తీర్పునిచ్చారు. ఆ మహిళకు రూ. 20 వేలు జరిమానా కూడా విధించారు. ప్రస్తుతం పిల్లలు బాలల సంరక్షణ గృహంలో నివసిస్తున్నారు. చదవండి: కోటాలో 20 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాదిలో 28వ ఘటన -
సహజీవనం పేరుతో సీజన్కొక భాగస్వామి. ఇదేం పధ్ధతి?
లక్నో: సహజీవనం పేరిట పాశ్చాత్య సంస్కృతి వెర్రితలలు వేసి భారత సంస్కృతిని వివాహ వ్యవస్థను నాశనం చేస్తోందని వ్యాఖ్యానించింది అలహాబాద్ హైకోర్టు. ఈ సందర్బంగా సీజన్ల వారీగా భాగస్వాములను మార్చుకుంటూ పోవడం ఆరోగ్యకరమైన సమాజానికి మంచిది కాదని తెలిపింది కోర్టు. అన్నీ అయిపోయాక.. అలహాబాద్‌లో అద్నాన్ అనే ఓ వ్యక్తి పరస్పర అంగీకారంతో యూపీలోని సహరాన్‌పూర్‌కు చెందిన ఓ యువతితో సహజీవనం చేశాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో శారీరక సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. అయితే ఆ యువతి అనూహ్యంగా గర్భం దాల్చడంతో అద్నాన్ పెళ్ళికి నిరాకరించాడు. దీంతో ఆ యువతి అలహాబాద్ హై కోర్టును ఆశ్రయించగా విచారణ సమయంలో అలహాబాద్ కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ సహజీవనంపై కీలక వ్యాఖ్యలు చేసింది. అంత సులువు కాదు.. ఒక వ్యక్తికి వివాహ వ్యవస్థ కల్పించినంత భద్రత కానీ సామాజిక అంగీకారం కానీ సహజీవనం కల్పించలేదని తెలిపారు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిద్ధార్థ్. దీర్ఘకాలిక పరిణామాలపైఅవగాహనలేక యువత ఇలాంటి తప్పటడుగు వేస్తోంది. వివాహ వ్యవస్థ మనుగడలో లేని దేశాల్లో సహజీవనం సర్వసాధారణంగా మారిపోయింది కానీ ఇపుడు వారు ఈ సమస్య నుండి బయటపడి వివాహ వ్యవస్థను కాపాడటానికి నానా అవస్థలు పడుతున్నాయని అన్నారు. అయినా సీజన్ల వారీగా భాగస్వామిని మార్చడం సమాజపురోగతికి చేటు అని తెలిపారు. ఇది కూడా చదవండి: దీప్తిది హత్యే! కొలిక్కి వచ్చిన కోరుట్ల టెక్కీ కేసు -
ఆరేళ్లు కలిసుండి.. అత్యాచారం అంటే చెల్లదు: హైకోర్టు
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ఒక పురుషుడు, మహిళ ఇష్టపడి కలిసి ఉండి.. ఆ తర్వాత మహిళ అత్యాచారం ఆరోపణలు చేస్తే చెల్లదని కర్ణాటక హైకోర్టు ఓ తీర్పులో స్పష్టం చేసింది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన దావణగెరెకు చెందిన మహిళ, బెంగళూరుకు చెందిన ఒక పురుషుడు ఆరేళ్లుగా సన్నిహితంగా ఉన్నారు. పురుషుడు వివాహానికి నిరాకరించడంతో తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపిస్తూ మహిళ 2021లో బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీనిని సవాల్ చేస్తూ అతడు హైకోర్టును ఆశ్రయించాడు. 2013లో ఫేస్బుక్ ద్వారా తమకు పరిచయం కలిగిందని, ఇద్దరి ఆమోదంతోనే సంబంధం కొనసాగిందని పేర్కొన్నాడు. ఇరువర్గాల వాదనలను ఆలకించిన జస్టిస్ నాగప్రసన్న ధర్మాసనం.. మహిళ ఆరోపణలను తోసిపుచ్చింది. ఆరేళ్లు సుదీర్ఘ సంబంధం ఉండడం వల్ల ఆమె చేసే అత్యాచారం అభియోగాలు చెల్లవని అభిప్రాయపడింది. చదవండి: కిలాడీ లేడీ.. ఆమె ట్రాప్‌లో పడితే అంతే సంగతులు! -
కలిసి జీవిస్తే సరిపోతుందా?.. విడాకులెలా కోరతారు?
మన దేశ చట్టాల్లో భూతద్దం పెట్టి చూసిన దొరకని ‘సహజీవనం’ అనే బంధం గురించి ఆసక్తికరమైన తీర్పు ఒకటి వెలువడింది. సహజీవనంలో ఉన్న ఓ జంట విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కింది. అయితే చట్టం ప్రకారం అది పెళ్లి కానప్పుడు.. విడాకుల ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుందని ఓ జంటను ప్రశ్నించింది కేరళ హైకోర్టు. ఏ చట్టంలోనూ కలిసి ఉంటే పెళ్లి అని లేదు. ఇద్దరి మనసులు కలిసాయని సహజీవనం చేసేవాళ్లకు విడాకులు అడిగే హక్కే లేదు. కేవలం పర్సనల్, సెక్యులర్ చట్టం ప్రకారం వివాహం జరిగినప్పుడే దానికి గుర్తింపు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం కలిసి జీవించినా.. అది వివాహం కిందకు రాదని, విడాకులకు ఆస్కారం ఉండదని స్పష్టం చేసింది బెంచ్. చట్టం ప్రకారం ఒక్కటైన జంటలకు మాత్రమే విడాకులు తీసుకునే హక్కు మన చట్టాలు కల్పించాయని ఈ సందర్భంగా పిటిషనర్లకు కోర్టు గుర్తుచేసింది. 2006 నుంచి వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. పైగా తమ బంధానికి సంబంధించి ఒప్పంద పత్రం కూడా రాసుకున్నారు. ఓ బిడ్డనూ కన్నారు. ఈ క్రమంలో మనస్పర్థలతో విడిపోవాలని నిర్ణయించుకున్న ఆ జంట స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే.. చట్ట ప్రకారం వివాహం కానప్పుడు విడాకులు ఎలా ఇస్తామని ప్రశ్నిస్తూ పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు కొట్టేసింది. దీంతో ఫ్యామిలీ కోర్టు ఆదేశాల్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది ఆ జంట. చట్టం ప్రకారం సహజీవనానికి గుర్తింపు లేదు. కలిసి ఉండడానికి మీకు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. ఇప్పుడు విడిపోవడానికి చట్టం ప్రకారం ముందుకెళ్తున్నారు. ఇది వీలుకాని విషయం. చట్టంలోనూ అందుకు వెసులుబాటు లేదు అని జస్టిస్ ముహమ్మద్ ముస్తాఖ్, జస్టిస్ సోఫీ థామస్ నేతృత్వంలోని బెంచ్ తీర్పు ఇచ్చింది. ఇక ఈ కేసులో ఫ్యామిలీ కోర్టు తీరుపైనా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్టం ద్వారా గుర్తించబడిన వివాహాలకు సంబంధించిన దావాలను మాత్రమే స్వీకరించే పరిధి ఫ్యామిలీ కోర్టులకు ఉందని, పై పిటిషన్‌ను విచారణకు తీసుకుని కొట్టేసే బదులు.. పిటిషన్ నిర్వహణ సాధ్యం కాదని ముందుగానే పిటిషన్‌ను తిరస్కరించి ఉండాల్సిందని, తద్వారా కోర్టు సమయం వృథా కాకుండా ఉండేదని హైకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఇది రూ.10 మర్డర్ కేసు.. చదివేయండి! -
మూడోసారి సహజీవనం, 83 ఏళ్ల వయసులో నాలుగోసారి..
హాలీవుడ్ స్టార్, రెండుసార్లు ఆస్కార్ అందుకున్న హీరో రాబర్ట్ డి నిరో 79 ఏళ్ల వయసులో ఏడోసారి తండ్రైన విషయం తెలిసిందే కదా! తాజాగా ఇదే వయసులో ఉన్న మరో హాలీవుడ్ హీరో కూడా తండ్రి కాబోతున్నాడు. 83 ఏళ్ల వయసులో నాలుగోసారి డాడ్ అని పిలిపించుకోబోతున్నాడు. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ నోరెళ్లబెడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. అల్ పచినో 29 ఏళ్ల వయసున్న నూర్ అల్ఫల్లాతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది ఆమె గర్భం దాల్చగా ప్రస్తుతం ఆమెకు ఎనిమిది నెలలు నిండినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ సమయంలో అల్ పచినో తండ్రి కాబోతున్నాడన్న వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇకపోతే అల్ పచినో ఏప్రిల్‌లో 83వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నాడు. మూడు రిలేషన్స్- ముగ్గురు పిల్లలు పెళ్లి అంటే ముఖం చాటేసే అల్ పచినో గతంలో ఇద్దరితో ప్రేమాయణాలు నడిపాడు. మొదటగా యాక్టింగ్ కోచ్ జన్ తరంత్తో డేటింగ్ చేయగా వీరికి 1989లో జూలీ పుట్టింది. ఆ తర్వాత నటి బెవర్లీ డియాంగిలోతో సహజీవనం చేయగా వీరికి ఆంటన్, ఒలీవియా కవలలు జన్మించారు. అయితే వీరి రిలేషన్ కూడా ఎంతో కాలం సాగలేదు. 1997-2003 మధ్యకాలంలోనే కలిసి ఉన్నారు, తర్వాత బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. అనంతరం అల్.. నూర్ అల్ఫల్లాతో లవ్‌లో పడ్డాడు. అప్పటికే ఆమె మిక్ జాగర్, నికోలక్ బెరగ్రూన్లతో ప్రేమలో పడటం, బ్రేకప్ చెప్పడం కూడా అయిపోయింది. అంటే ఇద్దరికీ ఇది మూడో డేటింగే! ఎప్పుడూ ప్రేమ, సహజీవనం వరకే వచ్చి ఆగిపోయిన అల్ పచినో పెళ్లికి మాత్రం మొగ్గచూపలేదు. మరి ఈసారైనా తన గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుంటాడేమో చూడాలి! సినిమాల విషయానికి వస్తే.. అల్ పచినో ప్రస్తుతం 'డేవిడ్ మామెట్స్ అసాసినేషన్' సినిమా చేస్తున్నాడు. యూఎస్ మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్య ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. షియా లేబఫ్, రెబెకా పిడ్జియాన్, కోర్ట్నీ లవ్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. సెప్టెంబర్‌లో ఈ సినిమా ప్రారంభం కానుంది. చదవండి: కోపంతో నయనతారను రావద్దని చెప్పా: పార్థిబన్ -
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. యువతితో సహజీవనం.. చివరికి ఊహించని ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ (బంజారాహిల్స్): ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా అని యువతితో సహజీవనం చేసి..గర్భందాల్చాక నమ్మక ద్రోహానికి పాల్పడటమే కాకుండా అబార్షన్ చేయించుకోకపోతే యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరించిన యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ఎన్బీటీ నగర్లో నివసించే యువతి(22) ప్రైవేట్ జాబ్ చేస్తోంది. 2020లో వరంగల్ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ బూక్యా కల్యాణ్(25)తో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఇద్దరూ షికార్లు కొట్టారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆమె కల్యాణ్‌తో శారీరక సంబంధాలు కూడా కొనసాగించింది. ఈ నేపథ్యంలోనే ఆమె గర్భందాలి్చంది. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని అతను అబార్షన్ చేయించుకోవాలని, లేకపోతే యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత వారం రోజులుగా ఆమె ఫోన్ చేస్తే స్పందించడంలేదు. దీంతో బాధితురాలు వరంగల్‌లోని కల్యాణ్ స్వగ్రామానికి వెళ్లి ఆరా తీయగా.. అప్పటికే మరో యువతితో కల్యాణ్‌కు వివాహ నిశ్చితార్థం జరిగిందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని తెలిసింది. తనను ఎందుకు మోసం చేశావని ప్రశ్నించగా రూ.10 లక్షలు కట్నం ఇస్తే చేసుకుంటానని డిమాండ్ చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 493, 420, 417,313 506, వరకట్న నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
వివాహితతో సహజీవనం.. అసలు విషయం తెలిసి షాకయిన మహిళ
సాక్షి, హైదరాబాద్: మూడు పెళ్లిళ్లు చేసుకోవడమేగాక మరో వివాహితను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి మోసం చేసిన నిత్య పెళ్లి కొడుకును బంజారాహిల్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ హరీశ్వర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మెహిదీపట్నం సంతోష్‌నగర్‌లో నివసించే మహ్మద్ బిన్ ఇషాక్ డిజిటల్ ఎంటర్ప్రైజెస్ యూట్యూబర్‌గా పని చేస్తున్నాడు. గతంలోనే ఆయనకు మూడు పెళ్లిళ్లు జరిగాయి. గత అక్టోబర్‌లో బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని మిథిలానగర్‌లో ఉంటున్న వివాహిత(32)తో పరిచయం ఏర్పడింది. తనకు పెళ్లి కాలేదని ప్రేమిస్తున్నానని నమ్మించి పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి ఆమెతో సహజీవనం చేశాడు. రెండు వారాల క్రితం ఆమెకు ఇషాక్ అసలు రూపం తెలియడంతో ఈ విషయంపై ఆమె నిలదీయగా అతను ముఖం చాటేశాడు. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు ఈ నెల 13న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. చదవండి: Hyderabad: హనీట్రాప్.. అందమైన రూపంతో ఎర.. ఒక్క వీడియో కాల్ ఎంత పనిచేసింది!! -
వాలంటైన్స్‌డే రోజే ఢిల్లీలో దారుణం.. ప్రియురాలిని చంపి, ఫ్రిజ్‌లో దాచేసి..
న్యూఢిల్లీ: తనను ప్రేమించి మరో యువతిని ఎందుకు పెళ్లాడుతున్నావని నిలదీసినందుకు ప్రాణంతీశాడో దుర్మార్గుడు. చంపేసి ఊళ్లోని తన దాబాలో ఉన్న రిఫ్రిజరేటర్లో దాచాడు! రెండు, మూడు రోజుల క్రితం జరిగిన ఈ హత్యోదంతం ప్రేమికుల దినోత్సవం (ఫిబ్రవరి 14) రోజే వెలుగు చూడటం గమనార్హం. ఢిల్లీ పోలీసులు మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం నైరుతి ఢిల్లీలోని మిత్రోన్ గ్రామానికి చెందిన సాహిల్ గెహ్లాట్(24) గత కొన్ని సంవత్సరాలుగా హర్యానాకు చెందిన నిక్కీ యాదవ్ అనే యువతితో సహజీవనంలో ఉన్నాడు. 2018 జనవరిలో ఉత్తమ్ నగర్‌లోని ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వీరికి పరిచయం ఏర్పడి అది ప్రేమకు, తర్వాత సహజీవనానికి దారితీసింది. అప్పటి నుంచి సొంతూళ్లలో ఇంట్లో వాళ్లకు తెలీకుండా ఢిల్లీలో సహజీవనం చేస్తున్నారు. నిక్కీ సాహిల్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే ఇటీవల గెహ్లాట్ తల్లిదండ్రులు అతడికి వేరే అమ్మాయితో వివాహం నిశ్చయించారు. ఈ విషయం సాహిల్ ప్రియురాలికి చెప్పలేదు. అయితే ఎట్టకేలకు పెళ్లి విషయం తెలుసుకున్న నిక్కీ అతడిని నిలదీసింది. మరొకరిని పెళ్లాడితే వేరే కేసులో ఇరికిస్తానని బెదిరించింది. కాగా ఫిబ్రవరి 9వ తేదీన సాహిల్‌కు మరో అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. దీంతో నిక్కీ అతనికి ఫోన్ చేసి ఉత్తమ్ నగర్‌లోని తన ఫ్లాట్‌కు రమ్మని చెప్పింది. నిందితుడు తన కారులో బాధితురాలి ఇంటికి వెళ్లి అక్కడి నుంచి ఆమెను కారులో బయటకు తీసుకొచ్చాడు. అక్కడ కూడా పెళ్లి చేసుకోవద్దని ఆమె ఒత్తిడి చేసింది. అంతేగాక అదే ఫిబ్రవరి 9న ప్రియుడితో కలిసి గోవాకు వెళ్లేందుకు ముందే ప్లాన్ చేసి టిక్కెట్లు బుక్ చేసుకుంది. తనతో పాటు గోవాకు రావాలని అడగ్గా.. సాహిల్ నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య అర్ధరాత్రి గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన గెహ్లాట్ కారులో మొబైల్ ఫోన్ డేటా కేబుల్‌తో అమ్మాయిని గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని కారులో తన దాబా దగ్గరకు తీసుకెళ్లాడు. దాబాలోని ఫ్రిజ్‌లో పెట్టి దానికి తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.. అదే రోజు(ఫిబ్రవరి 10 ఉదయం) వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. నిందితుడు గెహ్లాట్‌ను ఢిల్లీ దగ్గర్లోని కయిర్ గ్రామంలో అరెస్ట్చేశామని పోలీస్ స్పెషల్ కమిషనర్ చెప్పారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. మృతదేహం రిఫ్రిజిరేటర్ లోపల చెక్కుచెదరకుండా ఉండటం గుర్తించారు. నెమ్మదిగా కుళ్ళిపోవడం ప్రారంభించిందని, ఆమె శరీరంపై గొంతు నులిమిన గుర్తులు మాత్రమే ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిందితుడు కశ్మీర్ గేట్ సమీపంలో ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హత్య జరిగిన ప్రాంతాన్ని ఇంకా ధృవీకరించబడలేదు. -
'సహజీవనం అనే మాటే వినలేదు.. అది మన సంస్కృతి కాదు..'
ముంబై: మహారాష్ట్ర ఎంపీ, మాజీ నటి నవనీత్ రానా సహజీవనం, స్వలింగ సంపర్క వివాహాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సొంత నియోజకవర్గం అమరావతిలో నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. అసలు సహజీవనం గురించి తన జీవితంలో ఎప్పుడూ వినలేదని పేర్కొన్నారు. పైచదువుల కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను వేరే నగరాలకు పంపితే వారేమో లివ్ ఇన్ రిలేషన్ అంటూ తమకిష్టమైన వారితో కలిసి జీవిస్తున్నారని అన్నారు. అలాగే స్వలింగ సంపర్క వివాహలను కూడా నవనీత్ వ్యతిరేకించారు. ఈరోజుల్లో ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని, అబ్బాయిలు అబ్బాయిలనే, అమ్మాయిలు అమ్మాయిలనే పెళ్లిచేసుకోవడం ఏంటి? అని వాపోయారు. సహజీవనం, స్వలింగ సంపర్క వివాహాలు మన సంస్కృతి, సంప్రదాయాలే కాదని నవనీత్ పేర్కొన్నారు. చదవండి: బీబీసీ కార్యాలయంపై ఐటీ దాడులు.. సిబ్బంది సెల్ఫోన్లు సీజ్! -
HYD: ప్రేమ పేరుతో సహజీవనం.. రూ. 8 లక్షలు తీసుకొని మరో యువతితో పెళ్లి
సాక్షి, హైదరాబాద్: ప్రేమ పేరుతో లైంగిక దాడికి పాల్పడి పెళ్లి చేసుకుంటానని సహజీవనం చేశాడు. అనంతరం ఉపాధి వెతుక్కుంటానని రూ. 8 లక్షలు తీసుకున్నాడు. తీరా పెళ్లి మాట ఎత్తేసరికి అప్పటికే మరో యువతిని పెళ్లి చేసుకొని మోసగించారు. ఘటనలో ఘరానా మోసగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. వివరాలివీ... హయత్‌నగర్ సమీపంలో ప్రైవేట్ హాస్టల్ నడుపుతున్న కాశీ స్నేహిత్ ప్రణయ్ రాజ్‌కు 2011లో యువతితో పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానని పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అయిదేళ్లుగా సహజీవనం చేశాడు. బోరబండలో జవహర్‌నగర్‌లో గదులు అద్దెకు తీసుకొని ఆమెతో సహజీవనం చేసిన సమయంలోనే తాను వ్యాపారం చేస్తానని ఆమె వద్ద నుంచి దశల వారిగా రూ. 8 లక్షల వరకు వసూలు చేశాడు. పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేయడమే కాకుండా గతేడాది ఆగస్టు 20న మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. తన మాటేమిటని ప్రశ్నిస్తే ఫోన్ బ్లాక్ చేశాడు. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి నాలుగు నెలలుగా తిరిగినా అది తమ పరిధి కాదంటూ పట్టించుకోకపోవడంతో షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. అక్కడి పోలీసుల సూచన మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376, 420 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: విధి ఆడిన వింత నాటకం.. కొత్త జంట అకాల మరణం -
25 ఏళ్లుగా సహజీవనం.. ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన మహిళ.. కోపంతో ఆమెపై..
ముంబై: 25 ఏళ్లుగా తనతో సహజీవనం చేసిన మహిళపై యాసిడ్ దాడి చేశాడు 62 ఏళ్ల వ్యక్తి. ఆమె ఇంట్లో నుంచి వెళ్లగొట్టిందన్న కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనలో మహిళకు 40 శాతం కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మహారాష్ట్ర ముంబైలోని గిర్గావ్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. నిందితుడి పేరు మహేశ్ పూజారి. బాధితురాలితో 25 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఆమెకు అప్పటికే పెళ్లై భర్త నుంచి విడిపోయింది. మహేశ్ కూడా ఆమె భార్య నుంచి విడిపోయాడు. దీంతో ఇద్దరు కలిసి జీవిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మహేశ్‌ను తన ఇంట్లో నుంచి వెళ్లగొట్టింది మహిళ. రెండు రోజుల తర్వాత అతడు ఇంటికి యాసిడ్ బాటిల్‌తో తిరిగివచ్చాడు. శుక్రవారం వేకువజామున 5:30 గంటల సమయంలో ఆమె నీళ్లు తోడుకునేందుకు బయటకు రాగా యాసిడ్ చల్లాడు. దీంతో ఆమె తీవ్రగాయాలపాలైంది. పోలీసులు నిందితుడ్ని గంటల్లోనే అరెస్ట్ చేశారు. చదవండి: క్రిమినల్ కేసులో ఎంపీకి 10 ఏళ్ల జైలు శిక్ష.. లోక్‌సభ సభ్యత్వం రద్దు.. -
అది అత్యాచారం కిందకు రాదు.. ఒరిస్సా హైకోర్టు కీలక తీర్పు..
భువనేశ్వర్: ఒరిస్సా హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. అత్యాచారం కేసులో నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే అది అత్యాచారం కిందకు రాదని స్పష్టం చేసింది. ఏంటీ కేసు..? నిమపారకు చెందిన ఓ మహిళ ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అతను ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. భువనేశ్వర్ తీసుకెళ్లి ఆమెతో కొన్ని రోజులు సహజీవనం చేశాడు. ఉన్నట్టుండి ఒకరోజు ఆమెను వదిలి పారిపోయాడు. దీంతో మహిళ అతడిపై కేసు పెట్టింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. దీంతో పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. నిందితుడు జిల్లా కోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేసుకుంటే న్యాయస్థానం నిరాకరించింది. అయితే అతడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చినప్పటికీ ఇద్దరు పరస్పర అంగీకారంతోనే సహజీవనం చేసిందున దీన్ని అత్యాచారంగా పరిగణించలేమని న్యాయస్థానం చెప్పింది. నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అలాగే మహిళను బెదిరించవద్దని అతన్ని ఆదేశించింది. కేసు విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. చదవండి: విమానంలో మందుబాబుల హల్చల్.. ఎయిర్‌హోస్టస్‌తో అసభ్యకరంగా.. -
వయసులో మూడేళ్లు చిన్నోడితో సహజీవనం.. పెళ్లి చేసుకోమని అడిగితే..
బెంగళూరు: ఆమె వయసు 27 ఏళ్లు.. తన కంటే మూడేళ్లు చిన్నోడికి దగ్గరైంది. ఇద్దరు కలిసి సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నారు. తనను పెళ్లి చేసుకోమని అడిగితే.. చెల్లి పెళ్లి అయ్యాక చేసుకుందామని అతను చెప్పాడు. ఇలా మూడేళ్లు గడిచింది. ఇప్పటికే ఆలస్యమవుతోంది, తనను పెళ్లి చేసుకోవాలని మహిళ యువకుడిని తరచూ అడగుతోంది. దీంతో విసిగెత్తిపోయిన అతడు ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. అనంతరం గొంతునులుమి హత్య చేశాడు. అయితే ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మహిళ మృతదేహాం మెడకు తాడు కట్టి సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడదీశాడు. మరునాడు ఆస్పత్రికి ఫోన్ చేసి ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని చెప్పాడు. ఆస్పత్రికి తీసుకెళ్లి పరిశీలించిన వైద్యులకు ఆమె మెడపై గాయాలు కన్పించాయి. దీంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 6న కర్ణాటక బెంగళూరులోని సింగసంద్రలో ఈ ఘటన జరిగింది. మృతురాలి పేరు సునీత. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి బెంగళూరులో నివసిస్తోంది. నిందుతుడి పేరు ప్రశాంత్. ఓ ఈ కామర్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే సునీతకు అప్పటికే వివాహమై విడాకులు తీసుకుందని పోలీసులు తెలిపారు. మొదట తన గుర్తింపు దాచుకుందని, చుట్టపక్కల వారికి దీపుగా పరిచయం చేసుకుందని వివరించారు. ప్రశాంత్ కూడా ఈమె ఇంటి పక్కనే నివసిస్తాడని, ఈ క్రమంలోనే ఇద్దరు దగ్గరయ్యారని వివరించారు. చదవండి: షాకింగ్..12 ఏళ్లకే గుండెపోటు..స్కూల్ బస్సులోనే కుప్పకూలిన విద్యార్థి.. -
అన్నా చెల్లెళ్ల ముసుగులో సహజీవనం.. ఫ్లాట్ అద్దెకు తీసుకుని.. చివరికి..
సాక్షి, తాడేపల్లి రూరల్: వడ్డేశ్వరంలోని ఓ వర్సిటీలో చదువుతున్న విద్యార్థినీవిద్యార్థి మధ్య చిగురించిన ప్రేమ కాస్తా సహజీవనానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో వారి మధ్య తలెత్తిన విభేదాలు తారాస్థాయికి చేరి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజమండ్రి రూరల్ మండలం రాజవోలుకు చెందిన హెల్త్ ఇన్స్పెక్టర్ రవికుమార్ రెండో కుమారుడైన మందపాటి అజయ్‌కుమార్(20) వడ్డేశ్వరంలోని వర్సిటీలో బీబీఏ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేటు టీచర్ కుమార్తె బీబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. వీరిద్దరి మధ్య ప్రేమ మొలకెత్తడంతో ఇద్దరూ కలిసి కుంచనపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని అన్నా చెల్లెళ్ల ముసుగులో సహజీవనం చేస్తున్నారు. విద్యార్థిని కాలేజీకి తరచూ రావడం లేదనే విషయమై గత నెల 25న ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థిని గత నెల 29న రాజవోలులోని తల్లి దగ్గరకు వెళ్లిపోయింది. బుధవారం సాయంత్రం అజయ్‌కుమార్ విద్యార్థినికి ఫోన్‌చేసి ఫ్లాట్‌లో పెంచుతున్న కుక్కపిల్ల (షాషా)కు ఫీడ్ ఇవ్వను, చంపేస్తానని బెదిరించడంతో విద్యార్థిని హుటాహుటిన విజయవాడ వచ్చింది. రాత్రి 1.40 గంటల సమయంలో రోడ్డుమీద ఇద్దరూ గొడవ పడ్డారు. విద్యార్థిని నా జీవితాన్ని నాశనం చేయకు అని వేడుకోవడంతో అతను నన్ను ఎందుకు ప్రేమించావంటూ దురుసుగా ప్రవర్తించాడు. చదవండి: ఆర్య సమాజ్‌లో ప్రేమ పెళ్లి.. మియాపూర్‌లో కాపురం.. చివరికి భర్త షాకింగ్ ట్విస్ట్ ఆ తర్వాత ఇద్దరూ ఒకే బైక్‌పై ఫ్లాట్‌కు వెళ్లారు. రాత్రి 2.30 గంటలకు అలికిడి కావడంతో విద్యార్థిని నిద్ర లేచి చూడగా నోట్లో గుడ్డలు కుక్కుకుని కిటికీకి హీటర్ వైర్‌తో ఉరివేసుకుని అజయ్‌కుమార్ కనిపించాడు. భయపడిన విద్యారి్థని వెంటనే మిగతా ఫ్లాట్ల వారిని లేపి విషయం వివరించింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అజయ్‌కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
'లివ్-ఇన్ రిలేషన్, పెళ్లి కాదు.. మగాళ్ల మనస్తత్వంలోనే అసలు సమస్య..'
శ్రద్ధ వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే. ఆమెను 35 ముక్కలు చేసిన అత్యంత క్రూరమైన ఈ అనాగరిక చర్య సర్వత్రా చర్చనీయాంశమైంది. లివ్-ఇన్ రిలేషన్ల కారణంగానే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కౌశల్ కిశోర్ గురువారం అన్నారు. చదువుకున్న అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని, లివ్ ఇన్ రిలేషన్ల జోలికి వెళ్లకుండా నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని సూచించారు. అయితే కేంద్రమంత్రి వ్యాఖ్యలకు వివాదాస్పద రచయిత్రి తస్లీమా నజ్రీన్ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్లో ఈ విషయంపై స్పందిస్తూ ఓ సందేశం రాసుకొచ్చారు. 'లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేస్తే.. అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలి.. లివ్ ఇన్ రిలేషన్ల వల్లే నేరాలు జరుగుతున్నాయని మీరు చెబుతున్నారు. కానీ పెళ్లైన పురుషులు తమ భార్యలను చంపినప్పుడు.. పెళ్లిళ్ల వల్లే నేరాలు జరుగుతున్నాయి, అందుకే పెళ్లి చేసుకోవద్దు.. లివ్ ఇన్ రిలేషన్లే ఎంచుకోండి అని ఎందుకు చెప్పడం లేదు. పెళ్లిళ్లు, లివ్ ఇన్ రిలేషన్లు కాదు.. అసలు సమస్య మగాళ్ల మనస్తత్వంలోనే ఉంది.' అని నజ్రీన్ రాసుకొచ్చారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు. When a man kills his girlfriend in a live-in relationship,u ask girls to get married coz live-in encourages crimes. But when men kill their wives,u don't ask girls to go for live-in relationships coz marriage encourages crimes!! Not marriage or live-in,problem is men's mentality. — taslima nasreen (@taslimanasreen) November 17, 2022 మరోవైపు కౌషల్ కిశోర్ వ్యాఖ్యలపై శివసేన నేత ప్రియాంక చతుర్వేది తీవ్రంగా స్పందించారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని కౌషల్ కిశోర్‌ను పదవి నుంచి తప్పించాలని కోరారు. ఇలాంటి హేయమైన నేరాళ్లో మహిళలనే నిందించడం క్రూరం, నిర్దాక్షిణ్యంగా అభివర్ణించారు. చదవండి: శ్రద్ధ హత్య కేసు విచారణలో షాకింగ్ నిజాలు.. గంజాయి మత్తులో క్రూరంగా -
షాకింగ్ ఘటన: ప్రియురాలిని చంపి.. ముక్కలుగా కోసి.. తలను పాలిథిన్ సంచిలో!
సెల్‌ఫోన్, సరదాలు, చెడు స్నేహాలతో కొంతమంది యువత పెడదోవ పడుతుంటే మరికొందరు వయస్సుతో సంబంధం లేకుండా ప్రేమ, సహజీవనం మోజులో పడి హద్దుమీరుతున్నారు. కొత్త అనుభూతి కోసం చెడు అలవాట్లకు బానిసలుగా మారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తొందరపాటు నిర్ణయాలతో బంగారు భవిష్యత్తును చేజేతులా పేకమేడల్లా కూల్చేసుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య చేసు ఇందుకు నిదర్శనంగా నిలిచిన విషయం తెలిసిందే. గంజాయి మత్తులో ప్రియురాలిని అత్యంత క్రూరంగా హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్.. ఆమె శరీరాన్ని 35 భాగాలుగా కోశాడు. అనతంరం ఫ్రిజ్‌లో దాచి పెట్టి ఒక్కొక్క అవయమవాన్ని మెల్లగా ఢిల్లీ అంతటా పడేశాడు. గూగుల్, యూట్యూబ్ వంటి సాంకేతికతను ఉపయోగించి చేసిన తప్పును కప్పిపుచ్చకునే ప్రయత్నం చేశాడు. హత్య జరిగిన విషయం ఎక్కడా పొక్కకుండా హంతకుడు పన్నిన పన్నాగం యావత్ దేశాన్ని విస్మయానికి గురిచేస్తోంది. 5 రోజుల పరిచయం ఈ ఘటన నుంచి తేరుకోకముందే బంగ్లాదేశ్‌లో మరో ఘోరం వెలుగు చూసింది. ప్రియుడి చేతిలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. హత్య చేయడానికి కేవలం అయిదు రోజుల క్రితమే వీరిద్దరికి పరిచయం ఏర్పడటం గమనార్హం. వివరాలు.. అబు బాకర్ అనే యువకుడు సప్నా అనే యవతితో సహజీనం చేస్తున్నాడు. వీరిద్దరూ గత నాలుగు ఏళ్లుగా గోబర్‌చాకా ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. చదవండి: అఫ్తాబ్ డ్రగ్ అడిక్ట్.. గంజాయి మత్తులోనే శ్రద్ధను హత్యచేసి.. రాత్రంతా శవం పక్కనే.. మరో యువతితో.. అబుకి కొన్ని రోజుల క్రితం కవితా రాణి అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఇది నెమ్మదిగా ప్రేమకు, వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈనెల 5న పని నిమిత్తం సప్నా వేరే ఊరికి వెళ్లిన సమయంలో కవితను అబూ బాకర్ తన ఇంటికి తీసుకొచ్చాడు. అయితే యువకుడికి ఇంతకుముందే మరో యువతితో సంబంధం ఉన్న విషయం కవితకు తెలియడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో ఆవేశానికి లోనైన అబూ.. యువతిని గొంతు కోసి చంపాడు. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు. ఆమె శరీరం నుంచి తలను వేరు చేసి, చేతులను నరికి కాలువలో పడేశాడు. తలను పాలిథిన్ సంచిలో చుట్టి ఉంచి మిగిలిన మృతదేహాన్ని బాక్సులో పడేసి ఇంటి నుంచి పారిపోయాడు. ఈనెల 6న అబూ బాకర్ పనికి రాకపోవడం. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అతను పనిచేస్తున్న రవాణా సంస్థ యజమాని బకర్ అద్దె ఇంటికి ఒక వ్యక్తిని పంపాడు. ఇంటికి తాళం వేసి ఉండటంతో అబూబకర్ అదృశ్యంపై అనుమానంతో యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు షాక్ పోలీసులు వచ్చి తలుపులు తీయగా.. ఇంట్లో చూసిన దృశ్యాలకు షాక్ అయ్యారు. ఓ పెట్టెలో తల లేని యువతి మృతదేహం కనిపించింది. పక్కనే తలను పాలిథిన్‌లో చుట్టి వేరుగా ఉండటాన్ని గుర్తించారు. చేతులు మాత్రం లభించలేదు. బాధితురాలిని కాళీపాడ్ బాచర్ల కుమార్తె కవితా రాణిగా గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలించడం ప్రారంభించారు. హత్య చేసిన రోజు రాత్రి అబూ బకర్ తన భాగస్వామి సప్నాతో కలిసి రూప్సా నది దాటి ఢాకాకు బయలుదేరినట్లు గుర్తించారు. నవంబర్ 6 రాత్రి నిందితుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. ఘాజీపూర్ జిల్లా బసాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అబు బాకర్, ప్రేయసి సప్నాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలో అబూ బకర్ నేరాన్ని అంగీకరించాడు. గోబర్‌చాకా ప్రాంతంలోని ఇరుకైన ప్రదేశంలో పాలిథిన్‌లో చుట్టిన కవిత తెగిపోయిన చేతులను స్వాధీనం చేసుకున్నారు. ఇదీ చదవండి: Shraddha Case: అమ్మాయిలే జాగ్రత్త పడాలి! -
శ్రద్ధా దారుణ హత్య.. స్పందించిన బాలీవుడ్ నటి
న్యూఢిల్లీ: ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. శ్రద్ధా శరీర భాగాలను పడేసిన ఢిల్లీలో మోహరౌలీ అడవుల్లోకి అఫ్తాబ్‌ను తీసుకెళ్లిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 13 శరీర భాగాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫొరెన్సిక్ పరీక్షలకు పంపించారు. హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తిని గుర్తించాల్సి ఉంది. మరోవైపు ప్రియురాలు శ్రద్దా వాకర్‌ను హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ పునావాలా.. ప్రియురాలు మృతదేహం అపార్ట్మెంట్లో ఉండగానే మరో యువతిని తరచూ ఇంటికి తీసుకొచ్చేడని పోలీసుల విచారణలో తేలడంతో. అతడు వాడిన డేటింగ్ యాప్ ‘బబుల్’ నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అఫ్తాబ్ డేటింగ్ హిస్టరీ ఇవ్వాలని బబుల్‌కు లేఖ రాశారు. అతడి ప్రొఫైల్, యువతుల వివరాలు ఇవ్వాలని కోరారు. అంతేగాక అఫ్తాబ్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉన్నట్లు తేలింది. అతనికి ఇన్‌స్టాలో 28 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. చదవండి: శ్రద్ధా హత్య కేసులో ట్విస్ట్.. ప్రియురాలి శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచి.. మరో యువతితో.. ఇదిలా ఉండగా ఢిల్లీ హత్య ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రియురాలిని అత్యంత క్రూరంగా చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తన కూతురిని హత్య చేసిన అఫ్తాబ్ అమీన్ పునావాలాకు మరణశిక్ష వేయాలని శ్రద్ధా తండ్రి డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనక లవ్ జిహాద్ కోణం ఉందని ఆయన ఆనుమానిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘లవ్ జిహాద్ (ప్రేమ ముసుగులో బలవంతంగా మత మార్పిడికి పాల్పడటం) పేరుతో నా కూతురిని హింసించాడని అనిపిస్తోంది. అఫ్తాబ్‌ను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నాను. కేసులో ఢిల్లీ పోలీసులపై నమ్మకం ఉంది. సరైన విధంగా విచారణ చేసి శిక్షిస్తారని ఆశిస్తున్నా. శ్రద్ధా వాళ్ల అంకుల్‌తో దగ్గరగా ఉంటుంది. నాతో ఎక్కువ మాట్లేడేది కాదు. నేను ఇప్పటి వరకు అఫ్తాబ్‌తో మాట్లాడలేదు. కూతురు కనిపించడం లేదని నవంబర్లోనే ముంబై వాసాయ్లో ముందుగా ఫిర్యాదు చేశాను’ అని తెలిపారు. అయితే శ్రద్ధ ఢిల్లీలో ఉందన్న విషయం తెలిసి కేసును ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారు. శ్రద్ధా అఫ్తాబ్ సంబంధం గురించి చెప్పడంతో కూతురు కనిపించకుండా పోవడం వెనక అతని హస్తం ఉందని అనుమానంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: ఢిల్లీ: ప్రియురాలి హత్యోదంతం.. సంచలన విషయాలు వెలుగులోకి కాగా శ్రద్ధా- అఫ్తాబ్ 2019 నుంచి రిలేషన్ షిష్‌లో ఉన్నారు. ఢిల్లీకి వచ్చే ముందు మార్చి ఏప్రిల్ నెలలో హిమాచల్ ప్రదేశ్ వంటి కొన్ని ప్రదేశాలను చుట్టి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. శ్రద్ధా కంటే ముందే అఫ్తాబ్‌కు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రద్ధాను హత్య చేసిన తరువాత 18 రోజులపాటుటు తెల్లవారుజామున 2 గంటలకు శరీర భాగాలను బయట పారేశాడు. శ్రద్ధా బతికే ఉందని నమ్మించేందుకు ఆమె సోషల్ మీడియా అకౌంట్లను ఉపయోగించేవాడు. హత్య గురించి ఎవరికి అనుమానం రాకుండా ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపేవాడు. శ్రద్ధాను చంపిన గదిలోనే తాను ఉండేవాడు. స్పందించిన స్వరా భాస్కర్ ఢిల్లీలో ప్రియురాలిని అతి కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ కేసు ఎంతో విషాదకరమైనదని.. ఈ దారుణాన్ని చెప్పడానికి మాటలు రావడం లేదని అన్నారు. ప్రేమించిన వ్యక్తిని నమ్మి వెళ్తే ఇంత ఘోరానికి పాల్పడటం తన హృదయాన్ని ద్రవింపజేస్తోందన్నారు. పోలీసులు త్వరగా విచారణను ముగిస్తారని, ఈ రాక్షసుడికి కఠిన శిక్ష పడుతుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. NO WORDS for how horrifying, gruesome & tragic this case is. My heart goes out to this poor girl-awful betrayal by someone she loved & trusted. Hope police speedily conclude their investigation & hope this monster gets the harshest punishment he thoroughly deserves. #shradhha 💔 https://t.co/W4w10JjdDf — Swara Bhasker (@ReallySwara) November 14, 2022 -
ఢిల్లీ: ప్రియురాలి హత్యోదంతం.. సంచలన విషయాలు వెలుగులోకి
న్యూఢిల్లీ: ఢిల్లీలో సహజీవనం చేస్తున్న ప్రియురాలిని యువకుడు అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన యావత్ దేశాన్ని కలవరానికి గురిచేస్తోంది. యువతితో పరిచయం, సహజీవనం, హత్య, మృతదేహాన్ని ముక్కలుగా కోయడం, ఎవరికి అనుమానం రాకుండా మృతదేహాన్ని భద్రపరిచిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. దీనికి తోడు హత్య చేసిన ఆరు నెలల తర్వాత ఈ ఉదంతం వెలుగులోకి రావడం మరింత గమనార్హం. ఈ కేసులో ఇప్పటికే హంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. కేసు వివరాలను ఢిల్లీ సౌత్ పోలీసు ఇన్ఛార్జ్ అంకిత్ చౌహాన్ తెలిపారు. 300 లీటర్ల ఫ్రిడ్జి కొని 24 ఏళ్ల యువతితో సహజీవనం చేసిన ప్రియుడు చివరికి ఆమె పాలిట మృత్యుపాశంగా మారాడు. ఉన్మాదిగా మారి ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే ప్రియురాలిని కత్తితో పొడిచి చంపినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. అయిదు నెలల క్రితమే ప్రియురాలని హత్య చేసినట్లు తేలింది. యువతిని అంతమొందించి.. ఆమె మృతదేహాన్ని 35 భాగాలుగా కోశాడు. అయితే ఆమె శరీర భాగాలను భద్రపరిచేందుకు ఓ భారీ(300 లీటర్ల) ఫ్రిడ్జిని కొనుగోలు చేశాడు. చదవండి: కాలేజ్ బిల్డింగ్ పైనుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య దుర్వాసన రాకుండా అగర్బత్తీలు హత్య చేసిన 18 రోజుల్లో వాటిని ఒక్కొక్కటిగా నగరంలోని మొహహ్రౌలీ అటవీ ప్రాంతంలో చెల్లాచెదురుగా విసిరేశాడు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో బయటకు వచ్చి ముక్కలుగానరికిన శరీర భాగాలను పారేశాడు. అపార్ట్మెంట్ ఇరుగుపొరుగు వారికి దుర్వాసన రాకుండా ఉండేందుకు ఇంట్లో అగర్బత్తిలు వెలిగించినట్లు అంగీకరించాడు. అంతేగాక అమెరికన్ క్రైం షో ‘డెక్స్టర్’ నుంచి ప్రేరణ పొంది ఇంతటి కిరాతకానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీనికితోడు చెఫ్‌గా శిక్షణ పొందిన నిందితుడు మాంసం కత్తిని ఉపయోగించడంలో ప్రవీణుడని తేలింది. హత్యకు ముందు ఏం జరిగిందంటే ముంబైలో పనిచేస్తుండగా అఫ్తాబ్ అనే 28 ఏళ్ల యువకుడు శ్రద్ధా(26) యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మతాలు వేరు కావడంతో యువతి వాళ్ల ఇంట్లో వీరి బంధాన్ని అంగీకరించలేదు. దీంతో ఇద్దరు కలిసి ఢిల్లీకి మకాం మార్చారు. ఓ మల్టినేషనల్ కంపెనీకి చెందిన కాల్ సెంటర్లో పనిచేస్తూ ఛతర్‌పూర్‌లోని అపార్ఠ్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని సహజీవనం చేశారు. మే నెలలో ఇద్దరి మధ్య పెళ్లి విషయమై గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ గొడవలు కాస్తా పెద్దగా అయ్యాయి. పెళ్లి చేసుకోవాలని శ్రద్ధా నిత్యం ఒత్తిడి తేవడంతో మే 18న ప్రియురాలిని అఫ్తాబ్ గొంతు కొసి చంపాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కూతురు సహజీవనం విషయంలో విభేదాలు రావడంతో తల్లిదండడ్రులు ఆమెతో మాట్లాడటం మానేశారు. అయితే కొంతకాలంగా శ్రద్ధా ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుందని ఆమె స్నేహితురాలు చెప్పడంతో అనుమానం వచ్చిన తండ్రి కూతురు కోసం ముంబై నుంచి ఢిల్లీకి బయల్దేరాడు. ఇంటికి తాళం వేసి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం నిందితుడిని అరెస్ట్ చేశారు. హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు హంతకుడిని ఐదు రోజుల కస్టడీకి తరలించారు. అటవీ ప్రాంతంలో కొన్ని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నామని, అయితే అవి మానవ అవశేషాలు కాదా అనేది తెలియాల్సి ఉందని తెలిపారు. నిందితుడు ఉపయోగించిన కత్తి ఇంకా లభ్యం కాలేదని పేర్కొన్నారు. -
Hyderabad: భర్తతో విడిపోయి ఒంటరిగా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
సాక్షి, హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి మోసం చేసిన వ్యక్తిపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 34 ఏళ్ల మహిళ భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలతో కలిసి బల్కంపేటలో ఉంటోంది. సనత్‌నగర్ ఎస్‌ఆర్‌టీకి చెందిన సురేష్ కచువాతో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేస్తున్నాడు. ఈ నెల 8న ఆమెతో గొడవ పడి వెళ్లగా ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో సనత్‌నగర్‌లోని అతడి ఇంటికి వెళ్లింది. సురేష్ తల్లిదండ్రుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (క్లిక్: యువతితో సన్నిహితంగా ఉన్న వీడియోతో సినీనటి బ్లాక్మెయిల్) -
Hyderabad: అజయ్‌తో పరిచయం.. సహజీవనం ముసుగులో చిన్నారుల కిడ్నాప్
సాక్షి, హైదరాబాద్: మహిళతో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి ఆమె ఇద్దరు పిల్లలను ఎత్తుకెళ్లిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై కె.మధుసూదన్ కథనం ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన లీలం యాదవ్ భర్త జితేందర్ యాదవ్ ఏడాది క్రితం మృతి చెందగా ముగ్గురు పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఏడు నెలల క్రితం బిహార్‌కే చెందిన అజయ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి సహజీవనం చేయసాగారు. రెండు నెలల క్రితం వీరు జల్పల్లి శ్రీరాం కాలనీలోకి మకాం మార్చగా.. లీలం యాదవ్ స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో పని చేస్తోంది. ఆదివారం సాయంత్రం ఆమె ఇంట్లో పని చేస్తుండగా ఆమె కుమార్తె ప్రీతి (2.5 సంవత్సరాలు), కుమారుడు రితేష్ (16 నెలలు) ఇంటి ముందు ఆడుకుంటున్నారు. ఆ సమయంలో తాగిన మైకంలో ఇంటికి వచ్చిన అజయ్ లీలంతో గొడవపడి చేయిచేసుకున్నాడు. అనంతరం ఇద్దరు పిల్లలను తీసుకొని వెళ్లిపోయాడు. కొద్ది సేపటి అనంతరం గమనించిన ఆమె స్థానికంగా వెతికినా లాభం లేకపోవడంతో సోమవారం పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చదవండి: కుల పంచాయితీలో మహిళపై దాడి.. నిండు ప్రాణం తీసిన వాట్సాప్ ప్రచారం -
పరిచయం.. కొన్నేళ్లుగా సహజీవనం.. అసలు ఏం జరిగిందో కానీ..
తాడికొండ(గుంటూరు జిల్లా): కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న ఓ జంట ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ దుర్ఘటన పేరేచర్లలో శుక్రవారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం నరసరావుపేట చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన కృష్ణవేణి (35), మేడికొండూరుకు చెందిన హసన్‌వలి (40) పేరేచర్లలో ఓ ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. కృష్ణవేణి భర్తతో గొడవపడి కొంతకాలంగా పేరేచర్లలోనే ఉంటుంది. చదవండి: కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి.. స్నేహితుడి భార్యను లొంగదీసుకుని.. దీంతో వీరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా సహజీవనానికి దారి తీసింది. శుక్రవారం మధ్యాహ్నం వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇద్దరూ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడికొండూరు పోలీసులు తెలిపారు.