
ప్రతీకాత్మక చిత్రం
తాడికొండ(గుంటూరు జిల్లా): కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న ఓ జంట ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ దుర్ఘటన పేరేచర్లలో శుక్రవారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం నరసరావుపేట చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన కృష్ణవేణి (35), మేడికొండూరుకు చెందిన హసన్‌వలి (40) పేరేచర్లలో ఓ ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. కృష్ణవేణి భర్తతో గొడవపడి కొంతకాలంగా పేరేచర్లలోనే ఉంటుంది.
చదవండి: కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి.. స్నేహితుడి భార్యను లొంగదీసుకుని..
దీంతో వీరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా సహజీవనానికి దారి తీసింది. శుక్రవారం మధ్యాహ్నం వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇద్దరూ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడికొండూరు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment