ప్రతీకాత్మక చిత్రం
మంగళగిరి(గుంటూరు జిల్లా): నగర పరిధి నవులూలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు... నవులూరుకు చెందిన బుర్ల చంద్రమ్మ(40)కు వసంతకుమార్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వసంతకుమార్‌కు గత కొద్దికాలంగా స్థానికంగా ఉన్న మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి భోజన సమయంలో వసంతకుమార్ సన్నిహితంగా ఉంటున్న మహిళ ఫోన్ నుంచి వసంతకుమార్ ఫోన్‌కు మెసేజ్ వచ్చింది.
చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు ప్రసవం.. క్యాంటమ్ కంపెనీ బాత్‌రూమ్‌లో శిశువు కలకలం
అది చూసిన చంద్రమ్మ భర్తతో వాగ్వాదానికి దిగింది. భర్త ఇంకెప్పుడు మహిళతో సన్నిహితంగా ఉండనని చెప్పడంతో వివాదం సర్దుమణిగింది. అయితే మనస్తాపానికి గురైన చంద్రమ్మ సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో బాత్రూమ్‌లోకి వెళ్లి యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదేరోజు మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment