![Wife Assassinated Her Husband Due To Extramarital Affair In Medchal - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/9/Wife-Assassinated-Her-Husba.jpg.webp?itok=gn6UdniC)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఔషపూర్ గ్రామంలో వృత్తిరీత్యా కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తున్న మౌలాన్-శాంతి కుటుంబం. భార్య శాంతి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో గత కొన్ని రోజులుగా పలుమార్లు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో శాంతి, తన భర్తను హతమార్చాలని నిర్ణయించుకుంది.
భర్త సేవించే మందులో భార్య శాంతి, ప్రియుడు బాబు విషం కలిపారు. ఈ విషయం బయటకు రాకుండా తన భర్త కడునొప్పితో చనిపోయారని పోలీస్ స్టేషన్‌లో శాంతి ఫిర్యాదు చేసింది.. రంగంలోకి దిగిన పోలీసులు, మృతి చెందిన మౌలాన్ మృతదేహాని పోస్టుమార్టం నిమ్మిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
పోస్టుమార్టం రిపోర్ట్ చూసి, హత్యగా అనుమానించిన పోలీసులు.. భార్య శాంతిని అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలు బయటకు వచ్చాయి. శాంతి, ఆమె ప్రియుడు బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసినట్లు శాంతి ఒప్పుకుంది.
చదవండి: క్షణికావేశం.. తమిళనాడులో దారుణం!
Comments
Please login to add a commentAdd a comment