ప్రతీకాత్మక చిత్రం
తాడిపత్రి అర్బన్(అనంతపురం జిల్లా): వేధింపులు తాళలేక కట్టుకున్న భర్తనే హతమార్చింది ఓ ఇల్లాలు. వివరాలను తాడిపత్రి డీఎస్పీ చైతన్య వెల్లడించారు. తాడిపత్రికి చెందిన అబ్దుల్ బాషా అలియాస్ అబ్దుల్ (34)కు ఆరేళ్ల క్రితం ఆయేషాతో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. లారీ క్లీనర్‌గా పనిచేస్తున్న అబ్దుల్.. మద్యానికి బానిసై మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
చదవండి: గాడ్‌ఫాదర్ ఈవెంట్.. ఎస్పీకి ఫిర్యాదులు.. అసలు ఏం జరిగిందంటే?
ఈ క్రమంలో రోజూ మద్యం మత్తులో ఇంటికి చేరుకుని భార్య ఆయేషాతో గొడవపడేవాడు. బుధవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న అబ్దుల్... ఆయేషాతో గొడవపడి చిత్రహింసలకు గురి చేశాడు. దీంతో విసుగెత్తిన ఆమె అర్ధరాత్రి 2 గంటలకు రోకలి బండతో నిద్రపోతున్న అబ్దుల్ తలపై మోది హతమార్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment