ghatkesar
-
HYDRA: ఘట్కేసర్లో హైడ్రా కూల్చివేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి అక్రమ నిర్మాణాలను హైడ్రా(Hydra) కూల్చివేస్తోంది. తాజాగా ఘట్కేసర్లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించిన నాలుగు కిలోమీటర్ల గోడను అధికారులు కూల్చివేశారు. అలాగే, మేడిపల్లిలోని దివ్యనగర్‌లో కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామునే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.వివరాల ప్రకారం.. ఘట్కేసర్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన నాలుగు కిలోమీటర్ల కాంపౌండ్ వాల్‌ను అధికారులు కూల్చివేశారు. అయితే, నల్లమల్లారెడ్డి విద్యా సంస్థలు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కాంపౌండ్ నిర్మించినట్లు అనేకమైన ఫిర్యాదులు అందాయి. దీంతో, రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు.. అక్కడ సర్వే చేసి అది ప్రభుత్వ స్థలం అని నిర్ధారించారు. ఈ క్రమంలోనే గోడ కూల్చివేతలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామునే అక్కడికి భారీగా పోలీసులు చేరుకున్నారు.అలాగే, రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీలో కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పలు కాలనీలకు, నివాస ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా నిర్మించిన దివ్యనగర్ లే అవుట్ చుట్టూ ఉన్న ప్రహరీ గోడను అధికారులు తొలగిస్తున్నారు. పోచారం మున్సిపాలిటీలో ఉన్న దివ్య లే అవుట్ మొత్తం విస్తీర్ణం 200 ఎకరాల వరకూ ఉంటుంది. ఇందులో మొత్తం 2218 ప్లాట్లు వేశారు. ఈ ప్లాట్లలో 30 శాతం నల్ల మల్లారెడ్డివేనంటూ ఆరోపణలు ఉన్నాయి.ఇక, దివ్యనగర్ లే అవుట్ చుట్టూ ఉన్న ప్రహరీ కూల్చివేతతో మార్గం సుగమం అయిన కాలనీలు.. ఏకశిలా లే ఔట్, వెంకటాద్రి టౌన్షిప్, సుప్రభాత్ వెంచర్ -1 , మహేశ్వరి కాలనీ, కచ్చవాణి సింగారం, ఏకశిలా - పీర్జాదిగూడ రోడ్డు, బాలాజీనగర్, సుప్రభాత్ వెంచర్ -4 , వీజీహెచ్ కాలనీ, ప్రతాప్ సింగారం రోడ్డు, సుప్రభాత్ వెంచర్ -2, 3, సాయిప్రియ, మేడిపల్లి, పర్వతపురం, చెన్నారెడ్డి కాలనీ, హిల్స్ వ్యూ కాలనీ, ముత్తెల్లిగూడగా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. హైడ్రా ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. ఈ సందర్బంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో భవిష్యత్తు తరాలకు మంచి నగరాన్ని అందించాలన్న సమున్నత లక్ష్యంతో హైడ్రా ఏర్పాటు అయ్యిందన్నారు. ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. నిర్మాణ అనుమతితో సంబంధం లేకుండా.. గతేడాది జూలైకి ముందు కట్టిన ఏ ఒక్క ఇంటిని హైడ్రా కూల్చివేయలేదని.. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, పార్కు స్థలాల్లోని వ్యాపార కేంద్రాలను, నిర్మాణంలో ఉన్న నివాస సముదాయాలను మాత్రమే నేలమట్టం చేసినట్లు తెలిపారు. వీరిలో ప్రముఖులకు సంబంధించిన నిర్మాణాలు కూడా ఉన్నాయి. -
చింటూని వదలొద్దు! నేను లిఖిత చచ్చిపోతున్నాం
ఘట్కేసర్: ప్రేమ విషయం ఇంట్లో చెబుతానని ఓ వ్యక్తి వేధించడంతో ప్రేమ జంట బలైంది. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పీఎస్ పరిధిలో సోమవారం జరిగింది. ఇన్స్పెక్టర్ పరశురాం, బంధువులు తెలిపిన వివరాలు.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామానికి చెందిన పర్వతం అంజయ్య కుమారుడు పర్వతం శ్రీరామ్ (25) బతుకుదెరువు నిమిత్తం 15 ఏళ్ల క్రితం బీబీనగర్ మండలం జమీలాపేటకు వెళ్లి స్థిరపడ్డారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నారపల్లి సమీపంలో సైకిల్ దుకాణం నడుపుతున్నాడు. చౌదరిగూడకు చెందిన ఇంటర్ చదివే ఓ మైనర్ బాలికను శ్రీరామ్ ప్రేమించాడు. బ్లాక్మెయిల్ చేసిన దగ్గరి బంధువు... శ్రీరామ్‌తో ప్రేమ విషయం తల్లిదండ్రులకు చెబుతానని బాలిక దగ్గరి బంధువు, అన్న వరుసైన చింటు (22) బ్లాక్మెయిల్ చేసి వీరివద్ద రూ. 1,35,000 తీసుకున్నాడు. ఇంకా డబ్బు ఇవ్వాలని కాలేజ్ దగ్గరికి వెళ్లి బాలికను వేధించడమే కాకుండా, బంగారు ఉంగరం ఇవ్వాలని కోరాడు. చింటు వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపం చెందిన విద్యార్థిని, చివరికి ప్రియుడికి విషయం తెలిపింది. అదే విధంగా కులాంతర వివాహానికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని, ప్రేమ ఓడిపోవద్దని వారం కిందటే వారిద్దరు మరణించాలని నిర్ణయించుకున్నారు. సోమవారం ఉదయం షాపింగ్ వెళ్లాలని శ్రీరామ్ తన స్నేహితుడి దగ్గర ఎర్టిగా కారును తీసుకున్నాడు. సోమవారం సాయంత్రం ప్రేమ వ్యవహారం, బ్లాక్మెయిల్ విషయాన్ని వివరిస్తూ బాలిక తండ్రికి ‘అంకుల్’ అని సంబోధిస్తూ సూసైడ్ నోట్ రాసి, తన అన్న కుమారుడికి వాట్సాప్ ద్వారా పంపించాడు. అనంతరం ఎర్టిగా వాహనంలో ఘట్కేసర్ మున్సిపాలిటీ ఘనాపూర్ సమీపంలో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వద్ద కారులోనే నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంటలకు తాళలేక శ్రీరామ్ కారు డోరు తెరుచుకొని సర్వీస్ రోడ్డు ఫుట్‌పాత్‌పై పడి మృతిచెందాడు. బాలిక కారు ముందు సీటులో కూర్చొని గుర్తు పట్టలేని మాంసం ముద్దలా కాలి ఆహుతి అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ ఇంజన్ సాయంతో మంటలు ఆర్పారు. మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి ఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కారులో ఇద్దరి సజీవ దహనం ఘటనలో ట్విస్ట్ !
సాక్షి,మేడ్చల్‌జిల్లా: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో సోమవారం(జనవరి6) సాయంత్రం కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనమైన కేసు కొత్త మలుపు తిరిగింది. కారులో ఉన్నది ప్రేమికులైన యువతీ యువకులని తెలుస్తోంది. కొందరు యువకుల వేధింపులు భరించలేక వారు ఆత్మహత్యాయత్నం చేస్తుండగా కారులో మంటలు చెలరేగి కాలిపోయారని సమాచారం.తొలుత ఇది ప్రమాదమే అనుకున్నప్పటికీ ఘటనపై పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో అసలు విషయం బయటపడినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ ఇంజిన్ మంటలను ఆర్పివేసింది. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ వాహనం బీభత్సం -
కళ్లలో కారం జల్లి, జేసీబీతో.. ఘట్కేసర్ కేసులో విస్తుపోయే విషయాలు
మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్లో ఈ నెల 15న అదృశ్యమైన కాంగ్రెస్ నేత, ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్(45) హత్యకు గురయ్యాడు. ప్లాటు వివాదంలో జోక్యం చేసుకుంటూ తమ ఆస్తిని కాజేయాలని ప్రయతిస్తున్నాడని నిందితులు కక్ష పెంచుకొని మహేశ్‌ను దారుణంగా హత్య చేసి డంపింగ్ యార్డులో పూడ్చిపెట్టారు. ఈ ఘటన వివరాలను సీఐ సైదులు సోమవారం వెల్లడించారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన గడ్డం మహేశ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాస్,(36), కడుపొల్ల ప్రవీణ్(27)తో ప్లాటు విషయమై వివాదం నెలకొంది. ఈ క్రమంలో శ్రీనివాస్‌పై మహేశ్ క్రిమినల్ కేసు పెట్టాడు. దీంతో అతడిని చంపాలని ప్రవీణ్‌ను శ్రీనివాస్ సంప్రదించాడు. మహేశ్ తమ బంధువుతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని ప్రవీణ్ ఆగ్రహంగా ఉన్నాడు. దీంతో ఇరువురు కలిసి మహేశ్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు. రాజీ చేసుకుందామని పిలిచి అంతమొందించారు.... ఘట్కేసర్ పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద గల మహేశ్ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో ఈ నెల 14 రాత్రి రాజీ చేసుకుందామని చెప్పి ఆఫీసుకు రావాలని కోరారు. అందుబాటులో లేనని మహేశ్ చెప్పడంతో తిరిగి 15న ఉదయం రావాలని కోరారు. మహేశ్ తన ఆఫీసుకు చేరుకోగానే కళ్లల్లో కారం పొడి చల్లి, కర్రలతో దాడి చేసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం ఆఫీస్ షెటర్ మూసి వెళ్లిపోయారు. రాత్రివేళ మహేశ్ కారులోనే అతడి శవాన్ని శ్రీరాములు, రాజు అనే వ్యక్తుల సాయంతో కొండాపూర్ డంపింగ్ యార్డుకు తరలించి జేసీబీతో పూడ్చిపెట్టారు. అందుకు జేసీబీ ఓనర్ నరేశ్, డ్రైవర్ సోహాన్ కూడా సహకరించారు. ఈ క్రమంలో నాలుగు రోజులుగా మహేశ్ కనిపించకపోవడంతో అతడి సోదరుడు విఠల్ ఈ నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులు శ్రీనివాస్, ప్రవీణ్, నరేశ్, సోహాన్‌ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. శవాన్ని పూడ్చడానికి సహకరించిన ఎన్ఎఫ్సీ నగర్‌కు చెందిన శ్రీరాములు, అంబేడ్కర్‌నగర్‌కు చెందిన రాజు పరారీలో ఉన్నారు. సోమవారం నాయబ్ తహసీల్దార్ సందీప్‌కుమార్‌రెడ్డి సమక్షంలో శవ పంచనామా, గాంధీ ఆస్పత్రి వైద్యాధికారి మహేందర్‌రెడ్డి బృందం పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంతకుముందు మృతుడి బంధువులు నిందితుడు ప్రవీణ్ ఇంటిపై రాళ్లతో దాడి చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కస్టడీకి తీసుకొని మహేశ్‌కు సంబంధించిన కారు, ఇతర వివరాలు తెలుసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. -
సొత్తుతో పాటు.. కుక్కపిల్లనూ వదలలేదు సార్..!
హైదరాబాద్: పెళ్లికి వెళ్లొచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డారు. సొత్తుతో పాటు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న శునకాన్ని సైతం ఎత్తుకెళ్లిన ఘటన ఘట్కేసర్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌ఎఫ్‌సీనగర్ బాలాజీ నగర్‌కు చెందిన ఐలయ్య గురువారం కుటుంబ సభ్యులతో కలిసి నల్లగొండ జిల్లా అంబాల గ్రామంలో జరిగిన వివాహానికి హాజరయ్యారు. శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చేసరికి మెయిన్ డోర్ తాళాలు పగులగొట్టి కనిపించాయి. లోపలికి వెళ్లి పరిశీలించగా అల్మరా తాళం పగులగొట్టి వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. అందులో దాచిన 7.5 గ్రాముల బంగారం, 11 తులాల వెండి రూ. 5 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. వీటితో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుక్కపిల్లను కూడా అపహరించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం (వేలి ముద్రల నిపుణులు)తో కలిసి వివరాలు సేకరించారు. ఐలయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇవి చదవండి: ప్రాణం తీసిన మూలమలుపు.. మట్టి లారీ బైక్‌ను ఢీకొట్టడంతో.. -
రేవంత్లాంటోళ్లను కేసీఆర్ చాలామందినే చూశారు: కేటీఆర్
సాక్షి, మేడ్చల్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మరోసారి మండిపడ్డారు. బీఆర్ఎస్ను బొందపెడతామని రేవంత్ ప్రగల్భాలు పలుకుతున్నారని.. అలాంటి వాళ్ళను చాలా మందినే చూశామని అన్నారు. ఘట్కేసర్లో శుక్రవారం నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘రేవంత్ లాంటి బుడ్డర్ ఖాన్‌లను కేసీఆర్ ఎంతోమందని చూశారు. ఎంతోమంది తీస్మార్ ఖాన్‌లను మాయం చేసి తెలంగాణా తెచ్చారు కేసీఆర్. పార్టీ కార్యకర్తలు ఎవరికి అన్యాయం జరిగిన అందరం బస్ వేసుకొని వస్తాం. మా బాస్‌లు ఢిల్లీలో లేరు. గుజరాత్‌లోనూ లేరు. లంకె బిందెల కోసం వెతికే వారు అధికారంలోకి వచ్చారు. సెక్రటేరియట్లో కంప్యూటర్లు, జీవోలు ఉంటాయి.. లంకె బిందెలు ఉండవు. లంకెబిందెల కోసం వెదికేది ఎవరో ప్రజలకు తెలుసు. ప్రతి ప్రతి హామీని నెరవేర్చే వరకు ప్రజల తరపున పోరాడుతాం.’ అని కేటీఆర్ అన్నారు. ‘2 లక్షల అప్పు తెచ్చుకోండి. నేను మాఫీ చేస్తా అన్నారు. ఇప్పుడు ఆ హామీ ఎటుపోయింది. ఆడబిడ్డలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారు. వాటికోసం కోటి 57 లక్షల మంది ఆడబిడ్డలు వేచి చూస్తున్నారు. ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్ల కడుపు కొట్టారు. కడుపు కాలిన ఆటోడ్రైవర్ ప్రజాభవన్ ముందు ఆటో కాలబెట్టాడు. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలు జుట్లు పట్టుకుంటున్నారు’ అని కేటీఆర్ మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టాలని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్రంలో బీజేపీని అడ్డుకోగలిగేది ప్రాంతీయ పార్టీలేనని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేశారని మండిపడ్డారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అంటున్నారని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, ఆరు గ్యారంటీలు అమలు చేసేది లేదని అన్నారు. కాంగ్రెస్‌కు గతంలో వచ్చిన సీట్లు కూడా రావని దుయ్యబట్టారు. మల్లారెడ్డిని ఢీ కొట్టలేరు మేడ్చల్‌లో మల్లారెడ్డితో పోటీ పడే పరిస్థితి ఎవరికీ లేదని అన్నారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు మల్లారెడ్డి అని తెలిపారు. 420 హామీలు ఇచ్చిన రేవంత్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. తెలంగాణ మాట ఢిల్లీలో వినబడాలి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయాలన్నారు. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేది బీఆర్ఎస్ ఎంపీలేనని.. అందుకే బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఉండాలన్నారు. చదవండి: బీఆర్ఎస్కు బిగ్ షాక్.. మర్రి జనార్దన్‌రెడ్డి రాజీనామా? -
HYD: ఫుల్లుగా తాగి కారు నడిపి.. చెట్టును ఢీ కొట్టి..
సాక్షి, మేడ్చల్: వాళ్లు మైనర్లు.. పైగా మద్యం మత్తులో కారు అతివేగంగా నడిపి ఘోర ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలతో ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కీసర చౌరస్తా నుండి యాధ్గార్ పల్లి వైపు వెళ్తున్న బెలీనో కార్ (TS 10 ES 7428) అదుపు తప్పి గోశాల వద్ద చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భువేష్ (17 ), తుషార (18) అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్ని అల్వాల్ బొల్లారం ప్రాంతం కు చెందిన వారుగా గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా.. అందులో ఓ యువతి కూడా ఉండడం గమనార్హం. ప్రమాదానికి గురైన కారు నుంచి మద్యం సీసాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫుల్లుగా తాగిన మత్తులో డ్రైవ్ చేసే ప్రమాదానికి వాళ్లు గురైనట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గాయపడిన పిలిప్స్, రుబిన్‌లతో పాటు వాళ్లతో ఉన్న యువతిని స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు చికిత్స అందిస్తున్నారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి.. దర్యాప్తు చేపట్టారు పోలీసులు. -
నేడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు
-
ఘట్కేసర్ శ్రీనిధి కాలేజీలో ఉద్రిక్తత.. ఫర్నిచర్, అద్ధాలు ధ్వంసం
సాక్షి, మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాలేజీ ఫర్నిచర్, అద్ధాలను విద్యార్థులు ధ్వంసం చేశారు. వర్శిటీ గుర్తింపు వస్తుందంటూ వసూలు చేసిన డబ్బు ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ స్టూడెంట్ కాలేజీ బిల్డింగ్ పైకి ఎక్కడంతో కలకలం రేగింది. తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్థులు, తల్లిదండ్రులను పోలీసులు అడ్డుకున్నారు. చదవండి: కేసీఆర్ మెదక్ పర్యటన వాయిదా.. కారణం ఇదే.. -
వివాహేతర సంబంధం.. భర్త హత్యకు ప్లాన్.. వైన్స్‌లో మందు కొని..
సాక్షి, మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడిన భార్య.. భర్తను హత్య చేసింది. వృత్తిరీత్యా కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్న కొట్టగొల్ల తుక్కప్ప(55) తన భార్యతో కలిసి సంగారెడ్డిలో జీవనం సాగిస్తున్నారు. శ్రీనివాస్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య ఈశ్వరమ్మ ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. అనారోగ్యంతో ఉన్న తుక్కప్పను మెరుగైన వైద్యం అంటూ కౌకూర్ దర్గా వద్దకు ఈశ్వరమ్మ తీసుకొచ్చింది. అనంతరం ఘట్కేసర్లో డాక్టర్ వద్దకు వెళ్దామని మాయ మాటలు చెప్పి యంనంపేట చౌరస్తాకు తీసుకొచ్చిన భార్య.. డాక్టర్ అందుబాటులో లేడని చెప్పింది. రోజు మద్యం సేవించే అలవాటు ఉన్న భర్తకు పక్కనే ఉన్న వైన్ షాప్‌లో మద్యాన్ని ఈశ్వరమ్మ కొనుగోలు చేసింది. చదవండి: మీ అమ్మాయికి ధనపిశాచి పట్టిందని.. బెడ్రూంలో గుప్తనిధులు..! ఘట్కేసర్ బస్టాండ్ సమీపంలో ఫెర్టిలైజర్ షాప్‌లో ఈశ్వరమ్మ ప్రియుడు శ్రీనివాస్ పురుగుల మందు కొనుగోలు చేసి తీసుకొచ్చాడు. రహస్యంగా మద్యంలో పురుగుల మందు కలిపిన భార్య.. భర్తకు తాగించింది. భర్త అపస్మారక స్థితిలోకి వెళ్లేసరికి ఏమీ తెలియనట్టుగా పక్కనున్న వారి సహాయంతో గాంధీ ఆసుపత్రికి తరలించిన భార్య ఈశ్వరమ్మ తరలిచింది. పోస్టుమార్టం రిపోర్ట్ అనంతరం అసలు విషయం బయటకొచ్చింది. భార్య ఈశ్వరమ్మను, ప్రియుడు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
ఘట్ కేసర్ లో కిడ్నాపైన నాలుగేళ్ల చిన్నారి సురక్షితం
-
కృష్ణవేణి దొరికింది.. చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం
సాక్షి, మేడ్చల్ జిల్లా: ఈడబ్ల్యూఎస్ కాలనీకి చెందిన రాజేశ్వరీ, భరత్ దంపతుల కుమార్తె కృష్ణవేణి (4) కిడ్నాప్ కథ సుఖాంతమైంది. బుధవారం రాత్రి చాక్లెట్ కోసం దుకాణానికి వెళ్లిన చిన్నారి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లితండ్రులు పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. స్థానిక యువకులు అదే ప్రాంతంలోని ఓ సినిమా థియేటర్లో పనిచేస్తున్న మతి స్థిమితం లేని వ్యక్తి సురేష్‌పై అనుమానం వ్యక్తం చేశారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు సురేష్, చిన్నారి కృష్ణవేణి ఫొటోలను అన్ని పీఎస్‌లు, చైల్డ్వెల్ఫేర్ సంస్థలు, రైల్వే పోలీసులకు పంపారు. మల్కాజ్గిరి డీసీపీ జానకి, ఏసీపీ నరేశ్‌రెడ్డి, స్థానిక సీఐ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా సురేష్ కృష్ణవేణిని తీసుకెళుతున్నట్లు గుర్తించారు. ఘట్కేసర్ నుంచి గూడ్స్ రైలులో ఖాజీపేట్ వెళ్లిన సురేష్ ఏమి చేయాలో తెలియక మరో రైలెక్కి తిరిగి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అప్పటికే సమాచారం అందుకున్న రైల్వే రక్షణ పోలీసులు, చైల్డ్ గైడెన్స్ సెంటర్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని చిన్నారిని తమ రక్షణలోకి తీసుకున్నారు. ఘట్కేసర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చిన్నారి ఫొటోను తల్లితండ్రులకు పంపించి సరిచూసుకున్నారు. దీంతో సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్స్ అశోక్ సికింద్రాబాద్ వెళ్లి చిన్నారిని తీసుకు వచ్చారు. అనంతరం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ స్వయంగా చిన్నారిని తల్లితండ్రులకు అప్పగించారు. ఘాట్ కేసర్ కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. కిడ్నాపర్ నుంచి చిన్నారిని పోలీసులు రక్షించారు. సీపీ ఫుటేజ్ ఆధారంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నిందితుడు సురేష్, చిన్నారిని గుర్తించారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో బుధవారం రాత్రి నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్ ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. మేడ్చల్‌లోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటూ చిన్నారి కనిపించికుండా పోయింది. బాలిక కృష్ణవేణి రాత్రి షాప్‌కు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఎంత వెతికినా కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలిక కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించి, కిడ్నాపర్ నుంచి పాపను కాపాడారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గంటల వ్యవధిలోనే పోలీసులు చిన్నారిని సురక్షితంగా కాపాడారు. చదవండి: బండ్లగూడ కారు ప్రమాదం.. సినిమాను తలపించే ట్విస్టులు.. పోలీసులే షాకయ్యారు! -
హైదరాబాద్- ఘట్కేసర్ లో కిడ్నాప్ కలకలం
-
అప్పు తిరిగి ఇవ్వాలని అడిగిన మాజీ ప్రియుడు.. కిడ్నాప్ చేసిన తాజా ప్రేమికుడు
హైదరాబాద్: తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరిన మాజీ ప్రియుడిని.. తాజా ప్రేమికుడితో కలిసి కిడ్నాప్ చేయాలని యత్నించిన ఓ యువతి సంఘటన ఘట్కేసర్ పీఎస్ పరిధిలో ఆదివారం కలకలం లేపింది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..మేడిపల్లికి చెందిన కీసర అవినాశ్‌రెడ్డి (29) పీర్జాదిగూడ బుద్దానగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమార్తె అరోషికారెడ్డి (25) అలియాస్ అన్షితారెడ్డి గతంలో ప్రేమించుకున్నారు. 2016 నుంచి 2021 వరకు వీరి మధ్య స్నేహం, ప్రేమ కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే అన్షితారెడ్డి తన అవసరాల కోసం అవినాశ్‌రెడ్డి వద్ద రూ.25 లక్షలు తీసుకుంది. అనంతరం కొద్దిరోజుల తర్వాత అన్షితారెడ్డి అతడ్ని దూరం పెట్టి మాదాపూర్‌లో ఉండే సిద్దిపేట్‌కు చెందిన చక్రధర్‌గౌడ్‌తో స్నేహం ఏర్పరుచుకుంది. ఈ విషయం తెలుసుకున్న అవినాశ్‌రెడ్డి ఆమెతో విభేదించి..తనవద్ద తీసుకున్న డబ్బులు తిరిగివ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో కోపం పెంచుకున్న అన్షితారెడ్డి ఎలాగైనా అవినాశ్‌రెడ్డిని అంతం చేయాలని భావించి చక్రధర్‌గౌడ్‌తో కలిసి కిడ్నాప్‌నకు పథకం వేశారు. ఈమేరకు ఆదివారం సాయంత్రం ఘట్కేసర్లోని వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న ఓ హోటల్ వద్దకు వస్తే తీసుకున్న డబ్బులు ఇస్తామని నమ్మబలికారు. దీంతో అవినాశ్‌రెడ్డి అక్కడకురాగానే అప్పటికే అక్కడ తన అనుచరులతో కలిసి మాటువేసి ఉన్న చక్రధర్‌గౌడ్..అవినాశ్‌రెడ్డిని కారులోకి బలవంతంగా ఎక్కించారు. ఈ క్రమంలో ఘర్షణ జరగడంతో స్థానికులు గమనించి అక్కడికి రాగా...కిడ్నాపర్లు అక్కడి నుంచి పారిపోయారు. బాధితుడు అవినాశ్‌రెడ్డి అక్కడి నుంచి తప్పించుకుని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో తక్షణమే స్పందించిన పోలీసులు చక్రధర్‌గౌడ్, కారు డ్రైవర్ మామిండ్ల గౌత్మ్ను పీర్జాదిగూడలో అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. కాగా చక్రధర్‌గౌడ్‌కు అప్పటికే పెళ్లయి..ఇద్దరు సంతానం ఉన్నట్లు, అన్షితారెడ్డిని ఆర్యసమాజ్‌లో వివాహమాడినట్లు సమాచారం. ఈ మేరకు ఘట్కేసర్ పోలీసులు విచారిస్తున్నారు. -
కట్నం సరిపోలేదని వరుడికి షాకిచ్చిన వధువు.. పెళ్లికి గంట ముందు..
సాక్షి, మేడ్చల్ జిల్లా: జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. కట్నం సరిపోలేదని ఓ వధువు ముహూర్తానికి గంట ముందు పెళ్లి రద్దు చేసుకుంది. హైదరాబాద్ శివారులోని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగింది. వివరాలు.. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన ఓ యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయించారు. అబ్బాయి తరఫు వారు అమ్మాయికి రూ.2 లక్షలు కట్నం ఇచ్చేలా కులపెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల మధ్య అంగీకారం కుదిరింది. గురువారం రాత్రి 7:21 గంటలకు పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. అబ్బాయి కుటుంబ సభ్యులు ఘట్కేసర్లోని ఓ ఫంక్షన్హాల్లో పెళ్లి జరుగుతుందని ఆహ్వాన పత్రికలు బంధుమిత్రులకు పంపిణీ చేశారు. ముహూర్తానికి ముందే అబ్బాయి, కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. ముహూర్తానికి సమయం అవుతున్నా.. అమ్మాయి, వారి కుటుంబసభ్యులు రాకపోవడంతో వరుడి తరఫు వారు ఆరాతీశారు. అబ్బాయి తరఫున ఇచ్చే కట్నం సరిపోవడం లేదని, అదనంగా కావాలని వధువు డిమాండ్ చేసింది. వివాహ సమయానికి గంట ముందు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేసింది. వరుడి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో వారు అమ్మాయి కుటుంబ సభ్యులను పోలీస్‌స్టేషన్‌కు రప్పించారు. తొలుత ఇచ్చిన రూ.2 లక్షలు సైతం అబ్బాయి కుటుంబసభ్యులు వదులుకున్నారు. తర్వాత ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. చదవండి: మహిళతో బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు!.. నీ భర్త బతికే ఉన్నాడు కదా అంటూ.. -
'అమ్మానాన్న క్షమించండి.. నేను వెళ్లిపోతున్నా..'
సాక్షి, హైదరాబాద్: ‘అమ్మానాన్న క్షమించండి.. చదువులో వెనుకబడ్డాను.. నేను వెళ్లిపోతున్నాను.. మీ ఆశయాలను నెరవేర్చలేకపోతున్నాను.. అక్కను జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ సూసైడ్ నోట్ రాసి ఓ బీ ఫార్మసీ విద్యార్థి ఉరి వేసుకొని, అదే గదిలో అతడి స్నేహితుడు గుర్తుతెలియని మందుతాగి ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. సీఐ అశోక్‌రెడ్డి వివరాల ప్రకారం.. మేడ్చల్ మండలం ఘనాపూర్‌కు చెందిన తొంపాల నివాస్(19) చౌదరిగూడ విజయపురి కాలనీ ప్రిన్స్టన్ బీ ఫార్మసీ కళాశాలలో మూడో సంవత్సరం విద్యార్థి. స్థానిక ఎంజేఆర్ మాల్లో పనిచేసే భద్రాచలం కోరుకొండకు చెందిన గురుగుల సాయిగణేశ్(21) స్నేహితులు. వీరిద్దరూ కళాశాల సమీపంలో విజయపురి కాలనీలో ఓ అద్దె గదిలో ఉంటున్నారు. మొదటి ఏడాది కళాశాల వసతి గృహంలో ఉన్న నివాస్ అనంతరం అద్దె గదిలో స్నేహితుడితో కలిసి ఉంటున్నాడు. పరీక్షలో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు తరచూ స్నేహితులతో అంటుండేవాడు. కాగా శనివారం కళాశాలకు వెళ్లకుండా ఇద్దరు స్నేహితులు గదిలోనే ఉన్నారు. నివాస్ కోసం స్నేహితులు వెళ్లిచూడగా గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించగా.. సాయి గణేశ్ వాష్‌రూంలో గుర్తు తెలియని మందు తాగి మృతి చెంది ఉన్నాడు. స్నేహితుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా నివాస్ జేబులో సూసైడ్ నోట్ లభించింది. చదువులో వెనుకబడ్డానని, తల్లిదండ్రులు క్షమించాలని అందులో రాసి ఉందని పోలీసులు తెలిపారు. సాయిగణేశ్ ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. నివాస్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని మృతుడి సోదరుడు తెలిపాడు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి నివాస్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ప్రేమ విఫలం, ఆరి్థక సమస్యలు, చదువులో వెనుకబడిపోవడం తదితర అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: స్నేహితుడిని కత్తితో పొడిచి.. తల, గుండె వేరు చేసి.. -
ఘట్ కేసర్ వద్ద పూర్తయిన రైల్వే ట్రాక్ పనులు
-
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి..
సాక్షి, మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఔషపూర్ గ్రామంలో వృత్తిరీత్యా కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తున్న మౌలాన్-శాంతి కుటుంబం. భార్య శాంతి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో గత కొన్ని రోజులుగా పలుమార్లు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో శాంతి, తన భర్తను హతమార్చాలని నిర్ణయించుకుంది. భర్త సేవించే మందులో భార్య శాంతి, ప్రియుడు బాబు విషం కలిపారు. ఈ విషయం బయటకు రాకుండా తన భర్త కడునొప్పితో చనిపోయారని పోలీస్ స్టేషన్లో శాంతి ఫిర్యాదు చేసింది.. రంగంలోకి దిగిన పోలీసులు, మృతి చెందిన మౌలాన్ మృతదేహాని పోస్టుమార్టం నిమ్మిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్ చూసి, హత్యగా అనుమానించిన పోలీసులు.. భార్య శాంతిని అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలు బయటకు వచ్చాయి. శాంతి, ఆమె ప్రియుడు బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసినట్లు శాంతి ఒప్పుకుంది. చదవండి: క్షణికావేశం.. తమిళనాడులో దారుణం! -
తమిళిసై వద్ద పెండింగ్‌లో ఫైల్.. పురసారథులకు ‘పరీక్ష’
సాక్షి, రంగారెడ్డిజిల్లా/ మేడ్చల్‌జిల్లా: నగర/పురపాలికల్లో క్యాంపు రాజకీయాలకు తెరలేస్తోంది. మూడేళ్ల పదవీకాలం ముగియనుండటంతో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టే దిశగా పావులు కదులుతున్నాయి. ఇందుకు వ్యూహరచన చేస్తుండటంతో ప్రస్తుత పాలక వర్గాలు పదవిని కాపాడుకునేందుకు.. వైరి వర్గం కుర్చీ దక్కించుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. నగర, పురపాలక సంఘాల్లో అవిశ్వాస పరీక్షలకు మూడేళ్ల కాల పరిమితిని విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పురపాలక చట్టంలో పొందుపర్చింది. దీన్ని నాలుగేళ్లకు సవరిస్తూ గత ఏడాది అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. గవర్నర్ తమిళిసై పరిశీలనకు వెళ్లిన ఈ బిల్లుకు ఇప్పటికీ మోక్షం లభించలేదు. దీంతో పాత చట్టమే మనుగడలో ఉందని భావిస్తున్న అసంతృప్తి నేతలు, అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు పావులు కదుపుతున్నారు. నగర/పురపాలక సంఘాలు పగ్గాలు చేపట్టి ఈ నెల 26 నాటికి మూడేళ్లు ముగుస్తున్నందున ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పురపాలికలపై కన్నేసిన ఆశావహులు ఎత్తులు వేస్తున్నారు. గడువు సమీపిస్తుండటంతో కొంతకాలంగా విందు, విహార యాత్రలతో బిజీగా ఉన్న ఈ నేతలు మరిన్ని వ్యూహాలు రచిస్తున్నారు. నగర శివారులోని దాదాపు మెజారిటీ మున్సిపాలిటీల్లో అవిశ్వాస పరీక్షలు పెట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలో.. ► మేడ్చల్ జిల్లాలో నిజాంపేట్, బోడుప్పల్, జవహర్‌నగర్, పీర్జాదిగూడ, మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార పార్టీ సభ్యులే వైరి వర్గాలుగా విడిపోయారు. ప్రస్తుత పాలక వర్గాలకు మూడేళ్లు పూర్తి కావడంతో పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నిజాంపేట్ కార్పొరేటర్లు ఇటీవల శ్రీశైలం వేదికగా, జవహర్‌నగర్ నగరపాలక సంస్థ పాలక సభ్యులు ఉభయ గోదావరి జిల్లాలు వేదికగా క్యాంపు రాజకీయాలు నెరిపారు. ► బోడుప్పల్ కార్పొరేషన్‌లోనూ గ్రూపు రాజకీయాలు అధికమయ్యాయి. ఇక్కడ కూడా అవిశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మేడ్చల్ మున్సిపాలిటీలో కొంత కాలంగా మున్సిపల్ చైర్పర్సన్ తీరుపై అధికార పార్టీ కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. ఇదే విషయమై మంత్రి సమక్షంలో పలుమార్లు అసంతృప్తి వెళ్లబుచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోనూ అధికార పార్టీలోని ఇరు వర్గాలు నువ్వా నేనా అన్నట్లుగా అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. నాగారం మున్సిపాలిటీలో చైర్మన్‌పై అవిశ్వాసానికి అంతర్గంగా పావులు కదుపుతున్నట్లు అధికార టీఆర్ఎస్ కౌన్సిర్లలోనే చర్చ జరుగుతోంది. దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దుండిగల్, కొంపెల్లి మున్సిపాలిటీల్లోని అధికార పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. రంగారెడ్డి జిల్లాలో.. ► ఆదిబట్ల, తుర్కయంజాల్, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్‌పేట, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల్లో అవిశ్వాస పరీక్షలు పెట్టేందుకు అసంతృప్తి నేతలు పావులు కదుపుతున్నారు. గతంలో పదవీ కాలం ఒప్పందాలు కుదుర్చుకున్న సభ్యులు కూడా పట్టు వీడకపోవడంతో కొన్ని చోట్ల విశ్వాస పరీక్షలకు దారితీస్తోంది. ఇంకొన్ని చోట్ల పదవీ నుంచి దిగేందుకు ససేమిరా అనడం కూడా ఈ పరిస్థితులకు కారణంగా మారుతోంది. ► తుర్కయంజాల్‌లో మెజార్టీ కౌన్సిలర్లను గెలుచుకున్న కాంగ్రెస్.. రెండు వర్గాలుగా విడిపోయింది. పదవుల పంపకంపై ఇరుపక్షాలు బెట్టు దిగకపోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇదే సీను ఇబ్రహీంపట్నం పురపాలికలోనూ కనిపిస్తోంది. గులాబీ శిబిరంలో కీచులాటలతో చైర్‌పర్సన్‌పై కౌన్సిలర్లు ఏకంగా కలెక్టర్‌కే ఫిర్యాదు చేశారు. అవినీతి ఆరోపణలు సంధిస్తూ ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా మూడేళ్ల కాలపరిమితి ముగియడంతో ఇదే అదనుగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై మంతనాలు సాగిస్తున్నారు. ► మరోవైపు ఆదిబట్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్లో చేరి చైర్పర్సన్ పదవిని కాంగ్రెస్ కౌన్సిలర్ దక్కించుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాలతో స్థానిక ఎమ్మెల్యేలతో చైర్‌పర్సన్‌కు పొసగడం లేదు. దీంతో ఆమెను గద్దె దింపే దిశగా ఎమ్మెల్యే వర్గీయులు చక్రం తిప్పుతున్నారు. నార్సింగి, మణికొండ మున్సిపాలిటీలు.. బండ్లగూడ నగర పాలక సంస్థలోనూ చైర్మన్‌గిరీ విషయంలో మడతపేచీ నెలకొంది. ఇక్కడ కూడా రెండున్నరేళ్ల చొప్పున పదవిని పంచుకోవాలనే ఒప్పందానికి వచ్చారు. తాజా పరిణామాలతో పోస్టు నుంచి తప్పుకొనేందుకు నో చెబుతుండడంతో రాజకీయం ఉత్కంఠగా మారింది. (క్లిక్ చేయండి: కేసీఆర్ ప్రభుత్వంపై గవర్నర్ అసంతృప్తి) -
వీబీఐటీ కేసు: వల వేసి.. సవాల్ విసిరి.. పోలీసులకు చిక్కాడు
సాక్షి, మేడ్చల్-మల్కాజిగిరి: ఘట్కేసర్ మండలం అవుషాపూర్ వీబీఐటీ(విజ్ఞానభారతి ఇంజినీరింగ్) కాలేజ్ అమ్మాయిలపై వేధింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేధింపులకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడు(?) ప్రదీప్‌ను ఎట్టకేలకు పోలీసులు ట్రేస్ చేశారు. దమ్ముంటే పట్టుకోవాలంటూ పోలీసులకు సవాల్ విసిరిన ఈ హ్యాకర్‌ను.. పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం విశేషం. ప్రదీప్‌తో పాటు ఈ వ్యవహారంలో అతనికి సహకరించిన మరో ఇద్దరిని సైతం శుక్రవారం ఘట్కేసర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏపీ విజయవాడకు చెందిన ప్రదీప్.. వీబీఐటీ కాలేజీ అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి.. న్యూడ్ ఫొటోలుగా మార్చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. ఈ క్రమంలో.. వాట్సాప్ డీపీలతో పాటు ఏకంగా ఫోన్ డాటా మొత్తాన్ని హ్యాక్ చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. సేకరించిన డాటాను డార్క్‌నెట్‌లో పెట్టి డబ్బు సంపాదించడంతో పాటు ఫేక్ ఫొటోల ద్వారా వాళ్లపై వేధింపులకు పాల్పడాలని యత్నించాడట ప్రదీప్. అయితే.. వేధింపులను భరించలేక యువతులు ఈ విషయాన్ని డిసెంబర్ 31వ తేదీకి ముందే కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ యాజమాన్యం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ దశలో ధర్నాకు దిగగా.. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు విద్యార్థినులకు మద్ధతుగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. యువతి వల్లే ఇదంతా! ఈ మొత్తం వ్యవహారం వెనుక వీబీఐటీలోనే చదివే ఒక అమ్మాయి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు దర్యాప్తు ద్వారా తేల్చారు. ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ అమ్మాయిని ట్రాప్ చేసిన ప్రదీప్.. ఆమెతో చాలాకాలం ఛాటింగ్ చేశాడు. ఇద్దరూ బాగా దగ్గరయ్యాక.. ఆమె ద్వారా యువతి ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపుల్లో చేరాడు. ఆపై మిగిలిన అమ్మాయిల నెంబర్లు సంపాదించాడు కూడా. ఇక ప్రదీప్‌కు ఘనితో పాటు మరో స్నేహితుడు తోడయ్యారు. ఈ ముగ్గురూ వాట్సాప్ గ్రూపుల్లోని తరచూ ఏదో ఒక నెంబర్లకు ఫోన్లు చేశారు. అవి అమ్మాయిల పర్సనల్ నెంబర్లే అని నిర్ధారించుకునేదాకా.. పదే పదే ఫోన్ చేశారు. ఆపై పరిచయం పెంచుకుని స్నేహం ప్రారంభించారు. వాళ్ల వాట్సాప్ డీపీలుగా ఉన్న ఫోటోలను సేకరించారు. అదే సమయంలో ‘‘ఎంటర్ ది డ్రాగన్, కింగ్ ఈజ్ బ్యాక్’’ ల పేరుతో వాట్సప్ గ్రూప్‌లను క్రియేట్ చేశారు. ఆ గ్రూప్‌లో వీబీఐటీ స్టూడెంట్స్‌ను సైతం యాడ్ చేశారు. ఇక అపరిచిత లింకులను ఆ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేసి.. అవి క్లిక్ చేసిన అమ్మాయిల ఫోన్లోని డాటాను హ్యాకింగ్ చేశారు ప్రదీప్ అండ్ కో. సుమారు 43 మంది డాటాను సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు సవాల్ మరోవైపు ఏడు నెంబర్ల నుంచి అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫొటోలుగా మార్చేసి బ్లాక్ మెయిల్ దిగాడు. ఇక ఒకవైపు పోలీసులు దర్యాప్తు చేపట్టిన సమయంలోనూ ప్రదీప్ పోలీసులకు, బాధిత యువతులకు చుక్కలు చూపించాడు. దమ్ముంటే తమను పట్టుకోవాలని పోలీసులకు సవాల్ విసిరాడు. అలాగే.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే నెట్లో ఆ ఫొటోలు పెడతానని అమ్మాయిలను బెదిరించిన సైబర్ ఛీటర్ ప్రదీప్.. అన్నంత పని చేయబోయాడట. అయితే.. సరైన సమయంలో ప్రదీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని మరికొందరి డాటా డార్క్‌నెట్‌లో అప్లోడ్ కాకుండా నిలువరించగలిగారట. ఇక ప్రదీప్‌కు నేరంలో సహకరించిన ఫస్ట్ ఇయర్ యువతిని సస్పెండ్ చేసే యోచనలో కాలేజీ యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. కాలేజీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో.. స్టూడెంట్స్‌కు సంక్రాంతి సెలవులు ముందుగానే ప్రకటించింది యాజమాన్యం!. -
ఘట్కేసర్: బీటెక్ స్టూడెంట్స్ మార్ఫింగ్ న్యూడ్ ఫోటోల కలకలం
సాక్షి, హైదరాబాద్: ఘట్కేసర్లోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థినుల మార్పింగ్ న్యూడ్ ఫొటోల కలకలం చెలరేగింది. అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి కొందరు ఆకతాయి.. వాటిని వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేశారు. అంతేకాదు వాటి ఆధారంగా వేధించడం మొదలుపెట్టారు. దీంతో విద్యార్థినిలు బుధవారం అర్ధరాత్రి కాలేజ్ ముందుకు చేరి ధర్నా చేపట్టారు. ఈ ఉదయం వీళ్లకు విద్యార్థి సంఘాలు కూడా తోడు కావడంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది. ఘట్కేసర్ వీబీఐటీ( విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కాలేజీ) దగ్గర గురువారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొందరు ఆకతాయిలు ఆ కాలేజీలో చదువుతున్న అమ్మాయిల ఫొటోలను సేకరించి.. వాటిని న్యూడ్ ఫొటోలుగా మార్ఫింగ్ చేశారు. అంతటితో ఆగకుండా వాటిని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. వాటిని చూపిస్తూ.. వాట్సాప్ గ్రూపుల్లో చేరి వీడియో కాల్స్ చేయాలని యువతులను బెదిరించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ పరిణామం వెనుక ఎవరున్నారేది తేల్చే పనిలో ఉన్నారు. అయితే.. ఈ లోపే విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు ఈ పరిణామంపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కూతుర్ల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు. ఇదిలా ఉండగా.. విద్యార్థినుల ధర్నా చేపట్టిన సమయంలో ఆగంతకుల నుంచి వార్నింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించినట్లు విద్యార్థినులు చెప్తున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు చెప్తున్నారు. -
రాచకొండ పోలీసు కమిషనరేట్ మరింత బలోపేతం!
సాక్షి,హైదరాబాద్: పట్టణీకరణ, కొత్త ప్రాంతాల ఏర్పాటుతో రాచకొండ పోలీసు కమిషనరేట్ శరవేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం 5,116 చదరపు కిలో మీటర్ల మేర విస్తరించిన రాచకొండలో 44 లక్షల మంది జనాభా నివాసం ఉంటోంది. ఏటేటా జనాభా, ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ఠాణాలు, ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు, పోలీసుల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాచకొండకు కొత్తగా 763 పోలీసు పోస్టులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం రాచకొండలో ఎల్బీనగర్, మల్కాజ్గిరి, భువనగిరి జోన్లు, ఒక్కో ట్రాఫిక్, ఎస్ఓటీ జోన్లతో కార్యాకలాపాలు సాగిస్తుంది. తాజా నిర్ణయంతో అదనంగా ఒక శాంతి భద్రతల జోన్, రెండు ట్రాఫిక్ జోన్లు, రెండు స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) జోన్లను ఏర్పాటు చేయనున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. కొత్తగా మహేశ్వరం జోన్: ఎల్బీనగర్ జోన్ నుంచి ఇబ్రహీంపట్నం డివిజన్‌ను వేరు చేసి కొత్తగా రానున్న మహేశ్వరం డివిజన్‌తో కలిపి కొత్తగా మహేశ్వరం జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. పోస్టులు: డీసీపీ–1; అదనపు డీసీపీ–1, పీసీ–2, జేఏ–1 ► ఇబ్రహీంపట్నం డివిజన్ నుంచి మహేశ్వరం, కందుకూరు పోలీసు స్టేషన్లు, వనస్థలిపురం డివిజన్ నుంచి పహాడీషరీఫ్, బాలాపూర్ ఠాణాలను వేరు చేసి కొత్తగా మహేశ్వరం డివిజన్‌ను ఏర్పాటు చేయనున్నారు. పోస్టులు: ఏసీపీ–1; పీసీ–2 ► ఇప్పటికే ఉన్న ఎల్బీనగర్, మల్కాజ్గిరి, భువనగిరి జోన్లతో పాటు కొత్తగా రానున్న మహేశ్వరం జోన్‌కు ఒక్కో అదనపు డీసీపీలను నియమించనున్నారు. ఐదు కొత్త ఠాణాలు.. ప్రస్తుతం 43 శాంతి భద్రతలు, రెండు మహిళా పోలీసు స్టేషన్లు ఉండగా.. కొత్తగా మరో ఠాణాలను ఏర్పాటు చేయనున్నారు. చర్లపల్లి, నాగోల్, హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ, పోచారం ఐటీ కారిడార్ స్టేషన్లుతో పాటు ఉప్పల్‌లో మహిళా ఠాణా రానుంది. అలాగే ప్రస్తుతం ఉన్న కీసర, అబ్దుల్లాపూర్‌మెట్, బాలాపూర్ ఠాణాలను నవీకరించనున్నారు. యాదాద్రిలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కేవలం గట్టు కోసమే ప్రత్యేకంగా ఏసీపీ ర్యాంకు అధికారిని మంజూరు చేశారు. యాదాద్రి టెంపుల్ పీఎస్, రాయగిరి పీఎస్‌లు ఆయన పరిధిలో ఉంటాయి. రెండు ఎస్ఓటీ జోన్లు.. ప్రస్తుతం రాచకొండలో ఒకటే ఎస్ఓటీ జోన్ ఉంది. కొత్తగా ఎల్బీనగర్–మహేశ్వరం, మల్కాజ్గిరి–భువనగిరి ఎస్ఓటీ జోన్లు రానున్నాయి. పోస్టులు: డీసీపీ–2, అదనపు డీసీపీ–1, ఏసీపీ–1, ఇన్స్పెక్టర్లు–2 ► స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) విభాగాన్ని కూడా బలోపేతం చేయనున్నారు. ఎస్బీకి కొత్తగా డీసీపీ ర్యాంకు అధికారి రానున్నారు. అదనంగా ఒక డీసీపీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, 3 ఎస్ఐలు, ఐదుగురు ఏఎస్ఐలు, 5 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 16 మంది కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. నాలుగు కంట్రోల్ రూమ్‌లు.. రాచకొండలో కొత్తగా నాలుగు జోనల్ కంట్రోల్ రూమ్‌లు రానున్నాయి. ఒక్కో కంట్రోల్ రూమ్‌కు ఒక ఏఎస్ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లుంటారు. వీటితో పాటు ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్)లో 70 మంది, ఐటీ, క్లూస్, సీసీఎస్ వంటి ఇతరత్రా విభాగాలలో 75 మంది, ఐడీ స్టాఫ్‌లో 13 అదనపు పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రాఫిక్‌లో రెండు జోన్లు, జాయింట్ సీపీ.. ఏటేటా వాహనాల సంఖ్య, రద్దీ పెరగడంతో ట్రాఫిక్ నియంత్రణ ఇబ్బందిగా మారింది. దీంతో ఈ విభాగాన్ని కూడా విస్తరించనున్నారు. కొత్తగా రాచకొండ ట్రాఫిక్‌కు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు (సీపీ)ను పోస్టును భర్తీ చేయనున్నారు. కొత్తగా రానున్న రెండు ట్రాఫిక్ జోన్ల మధ్య సమన్వయం, విధుల కేటాయింపు, ట్రాఫిక్ నియంత్రణ అంశాలను జాయింట్ సీపీ పర్యవేక్షిస్తారు. ఆయనతో పాటు రెండు పీసీలు, ఒక జేఏ పోస్టులు కూడా మంజూరయ్యాయి. కొత్తగా రెండు ట్రాఫిక్ జోన్లు: ► ప్రస్తుతం రాచకొండ మొత్తానికీ ఒకటే ట్రాఫిక్ జోన్ ఉంది. కొత్తగా ఎల్బీనగర్–మహేశ్వరం, మల్కాజ్గిరి–భువనగిరి రెండు జోన్లను ఏర్పాటు చేయనున్నారు. పోస్టులు: డీసీపీ–1, అదరపు డీసీపీ–1, పీసీలు–2 ► కొత్తగా మహేశ్వరం ట్రాఫిక్ డివిజన్‌ను కూడా రానుంది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ట్రాఫిక్ ఠాణాలను కలిపి ఈ డివిజన్ ఉంటుంది. పోస్టులు: ఏసీపీ–1, పీసీ–1 ► ప్రస్తుతం ఎనిమిది ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు ఉండగా.. అదనంగా మరో నాలుగు ఠాణాలు రానున్నాయి. కొత్తగా ఘట్కేసర్, జవహర్‌నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ స్టేషన్లను ఏర్పాటు, యాదాద్రి ట్రాఫిక్ పీఎస్‌లను నవీకరించనున్నారు. (క్లిక్: సంచలనాల సమాహారం.. ‘ఫామ్‌హౌస్–ఈడీ’ కేసుల వరకు ఎన్నెన్నో..) -
ఇదేం చోద్యం.. ఏకంగా చెరువు భూమినే తనఖా పెట్టేశారు!
పట్టాదారులమంటూ.. కోర్టు ఆదేశం ఉందంటూ పోలీసులు బందోబస్తుతో నాడెం చెరువు తూమును ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకోవడంతో ధ్వంసం చేయించిన వారు తోక ముడిచారు. ఆ తర్వాత బుల్డోజర్ను సీజ్ చేసి కారకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా మూడు నెలల క్రితం జరిగిన సంఘటన. తాజాగా హైదరాబాద్ చిక్కడపల్లిలోని ఓ బ్యాంకులో చెరువు భూమిని తనఖా పెట్టి రూ.12కోట్ల రుణం తీసుకోవడంతో నాడెం చెరువు పేరు తిరిగి తెరపైకి వచ్చింది. ఘట్కేసర్: చెరువులు, కుంటలు, జల వనరుల సంక్షరణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. కాని క్షేత్రస్థాయిలో పరిస్థితి వారి మాటలకు భిన్నంగా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా చెరువులు కబ్జా చేస్తున్న వారిపై చర్యలు లేకపోవడంతో చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నాయి. తాజాగా వెంకటాపూర్ నాడెం (నల్ల) చెరువులోని భూమిని తనఖా పెట్టి కొందరు రూ.12 కోట్ల రుణం తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. నాడెం చెరువుపై ఆధారపడి వెంకటాపూర్‌కు చెందిన 105 మంది ముదిరాజ్ మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. నీటిని తొలగించే అధికారం లేకున్నా... రెవెన్యూ రికార్డులో ఉన్న చెరువును అందులో ఉన్న నీటిని తొలగించే అధికారం నీటి పారుదల శాఖ అధికారులకే ఉంది. నాడెం చెరువులో నీరు లేదంటూనే చెరువులో చేపలు పట్టొందంటూ కొందరు కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. కోర్డు ఆర్డర్ ఉందని ఆగస్టు 3, 2022న పోలీస్‌బందో బస్తుతో చెరువు కల్వర్టును ధ్వంసం చేశారు. మత్స్యకారులు చెరువులోకి దిగితే కేసులు పెడతామని పోలీసులు బెదిరించారని మత్స్యకారులు గతంలో ఆరోపించారు. తక్షణమే రంగంలోకి దిగిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కోర్టు ఆదేశం చూపించాలని కోరడంతో తోక ముడుచుకున్నారు. పోలీసుల అండతోనే ధ్వంసం.. చెరువులో చేపలు పడితే కేసు పెడతామని గతంలో పోలీసులు బెదిరించారని మత్స్యకారులు పేర్కొన్నారు. పోలీసుల అండతోనే అక్రమార్కులు కల్వర్టు ధ్వంసం చేశారని అప్పట్లో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. మత్స్యకారుల నుంచి విషయం తెలుసుకున్న అధికారులు తూము ధ్వంసాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత అక్రమార్కులపై రెవెన్యూ, ఇరిగేషన్, రోడ్డు భవనాల శాఖాధికారులు ఘట్కేసర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఎన్ఓసీ ఇవ్వలేదు ఈ విషయమై తహసీల్దార్ విజయలక్ష్మి, ఇరిగేషన్ ఏఈ పరమేశ్‌ను వివరణ కోరగా బ్యాంకు రుణం కోసం మేము ఎటువంటి ఎన్ఓసీ ఇవ్వలేదని తెలిపారు. బ్యాంకు డాక్యూమెంట్లు చూస్తే కాని ఏమి చెప్పలేమని పేర్కొన్నారు. చెరువు విస్తీర్ణం 62 ఎకరాలు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ సర్వేనంబర్ 814, 816లో 62 ఎకరాల విస్తీర్ణంలో నాడెం చెరువును నీటి పారుదల శాఖ అధికారులు గుర్తించారు. ఘట్కేసర్ పరిసరాల్లో భూమి విలువ పెరగడంతో అక్రమార్కుల కన్ను చెరువుపై పడింది. రాజకీయ నాయకుల అండతో నీటిని తొలగించి చెరువు లేకుండా చేయాలని యత్నిస్తున్నారు. చెరువులోని భూమికి రుణం ఎలా ఇచ్చారు.? భూమి పరిశీలించకుండానే చెరువులో నీట మునిగిన భూమికి బ్యాంకు ఎలా రుణం ఇచ్చిందని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. లక్ష రుణం కోసం చెప్పులరిగేలా తిప్పుకునే బ్యాంకు అధికారులు నీటిలో ఉన్న భూమికి రుణం ఇవ్వడమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్ చేయండి: స్వామి వారి పేరు మార్చి... రికార్డులు ఏమార్చి!) -
టీఆర్ఎస్కు షాక్.. మంత్రి మల్లారెడ్డి ప్రధాన అనుచరుడు బీజేపీలోకి
సాక్షి, ఘట్కేసర్: మేడ్చల్ జిల్లాలో టీఆర్ఎస్కు షాక్ తగిలింది. కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రధాన అనుచరుడు ఘట్కేసర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు, మాజీ ప్రజా ప్రతినిధులు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఏనుగు సుదర్శన్‌రెడ్డి బీజేపీలో చేరనున్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ శనివారం అవుషాపూర్‌లోని ఎంపీపీ నివాసంలో చర్చలు జరిపారు. వారం రోజుల్లో మండలంలో సమావేశం నిర్వహించి అవుషాపూర్ సర్పంచ్ కావేరి మశ్చేందర్‌రెడ్డితో పాటు పలువురితో కలిసి బీజేపీలో చేరనున్నట్లు ఎంపీపీ ప్రకటించారు. స్థానిక సంస్థల అభివృద్ధికి నిధుల విడుదల చేయాలని అధికార పార్టీ ఎంపీపీగా ఉండి గత కొంత కాలంగా ఆయన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. టీఆర్ఎస్ పాలనపై పలుమార్లు ఆసంతృప్తిని వ్యక్తం చేసిన, నిధులు కోసం మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, కలెక్టర్లను కోరినా నిధులు ఇవ్వకపోవడం వల్లనే పార్టీని వీడుతున్నట్లు ఎంపీపీ ప్రకటించారు. సీఎం కేసీఆర్ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం: హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల సీఎం కేసీఆర్ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయని, కష్టపడి గెలిచిన ఎంపీపీ, జెడ్పీ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని వారు కూడా ప్రజల ఓట్లతోనే గెలిచారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఘట్‌కేస్‌ర్ మండలం అవుషాపూర్‌లోని ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి నివాసంలో ఆయన విలేరుల సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ఎమ్మెల్యేలకు తప్ప ఎవరికి అధికారాలు లేవన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రతినిధులు బానిసత్వంలో ఇంకా మగ్గకుండ గౌరవం కోసం ముందుకు రావలసిన సమయం ఆసన్నమైందన్నారు. కాంగ్రెస్ కరిగిపోతున్న పార్టీ అని యూపీలోనే రాహుల్ గాంధీ ఓడిపోయారన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి గెలిపించాలన్నారు. ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈటల వెంట నడుస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా రూరల్ అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మోహన్‌రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు హనుమాన్, మండల అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, నియోజకవర్గ ఇన్చార్జి మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఎంపీపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు.. గ్రామానికి రూ. కోటి చొప్పున నిధులిస్తే రాజీనామా చేస్తానన్నది వాస్తవమేనైనా, నిధులు ఇవ్వనందున ప్రస్తుతం ఎంపీపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఘట్కేసర్ మండల పరిషత్ అధ్యక్షుడు ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం అవుషాపూర్‌లో ఎంపీపీ మాట్లాడుతూ నిధుల కోసం మూడేళ్లుగా పోరాటం చేసిన మంత్రులు, అధికారులు స్పందించలేదన్నారు. పాత ప్రొసీడింగ్స్‌తో పనులు చేయిస్తే రాజీనామా చేస్తానన్నది నిజమేనన్నారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరించాలని కోరినా ఎవరూ స్పందించలేదన్నారు. అందువల్లే ఎంపీపీ పదవికి రాజీనామా చేసేది లేదన్నారు. -
రెండు రోజుల్లో గ్రామానికి రూ.కోటి నిధులు ఇవ్వాలి.. లేకుంటే..
సాక్షి, ఘట్కేసర్: హామీల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. స్థానిక సంస్థల అభివృద్ధికి మూడేళ్లుగా మంత్రిని నిధులు అడిగితే ఎంపీపీనని చూడకుండా మంత్రి మల్లారెడ్డి వ్యక్తిగతంగా తనను దూషిస్తున్నారని ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు నెలల కిందట ఇచ్చిన ప్రొసిడింగ్స్ పనులకు దిక్కులేదని.. నిధులు లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. నిధుల కోసం అధికారులకు వినతులు ఇచ్చి , గాంధీ విగ్రహం వద్ద నిరసనలు చేపట్టినా నిధులు ఇవ్వడం లేదన్నారు. నిధులడిగితే పార్టీ మారుతున్నాడని.. నిధులడిగితే పార్టీ మారుతున్నాడని అంటున్నారని.. తనను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మండలోని ప్రతి గ్రామానికి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండలంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మండలంలోని పేదలకు మొదట ఇవ్వాలన్నారు. మండలంలోని దళితులందరికీ దళితబంధు ఇవ్వాలని... గతంలో ఇచ్చిన ప్రొసిడెంగ్స్ పనులు చేయించాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో మండలంలో అందించిన సేవలు ప్రజలకు తెలుసనని ఈ సందర్భంగా ఎంపీపీ అన్నారు. రెండు రోజుల్లో నిధులివ్వని పక్షంలో ఎంపీపీ పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం ప్రజల మధ్యకు వెళ్లి వారి అభీష్టం మేరకు నడుచుకుంటానని అన్నారు. -
చాయ్‌కీ డబ్బులు లేవు.. సీఎం స్థానిక సంస్థల సమావేశాన్ని బహిష్కరిస్తున్నా
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తే దేశం మొత్తం చర్చ జరుగుతుందని సమావేశాన్ని బహిష్కరించిన సీఎం కేసీఆర్‌లాగే సోమవారం ఆయన ఆధ్వర్యంలో నిర్వహించనున్న స్థానిక సంస్థల సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ఘట్కేసర్ ఎంపీపీ, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఏనుగు సుదర్శన్‌రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా అవుషాపూర్‌లో ఆదివారం ఆయన ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల అభివద్ధికి నిధులు విడుదల చేయాలని మూడేళ్లుగా సర్పంచులు, ఎంపీటీసీలు, పాలకవర్గాల తరఫున మంత్రులు, అధికారుల చుట్టూ తిరిగినా నిధులు విడుదల చేయనందున మండల పరిషత్ కార్యలయం ఆవరణలోని గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశానన్నారు. నిధుల విడుదలపై చర్చ జరగాలనే సీఎం నేతృత్వంలోని సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఎందుకంటే సీఎం సమావేశంలో చర్చించే అవకాశం తమకు రాదన్నారు. సమావేశాన్ని బహిష్కరిస్తే చర్చ జరిగి నిధులు వస్తాయన్న నమ్మకం ఉందని, మూడేళ్లుగా మండల పరిషత్ సమావేశాల్లో చాయ్ డబ్బులు చెల్లిద్దామన్న నిధులు లేని దుస్థితి ఉందన్నారు. నిధులు విడుదలపై అధికారులు, మంత్రులు కూడా స్పందించడం లేదని సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. చదవండి: ట్రాఫిక్ రద్దీకి చెల్లు.. సైబరాబాద్ పోలీసుల కీలక నిర్ణయం -
Hyderabad: యువతి ఫోన్‌కు స్పందించి రహస్యంగా కలిసేందుకు వెళ్లడంతో..
సాక్షి, హైదరాబాద్: మగువ ఫోన్‌కు స్పందించి రహస్యంగా కలువడానికి వెళ్లిన ఓ బాధితుడు మోసపోయిన సంఘటన ఘట్కేసర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ చంద్రబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తు తెలియని మహిళ పాత పాల్వంచ, కొత్తగూడెం–భద్రాద్రి జిల్లాకు చెందిన ఏ2 పల్లపు రోజ, అలియాస్ మానస(24), జనప్రియ వెస్ట్‌సిటీ, మియాపూర్‌కు చెందిన ఎడ్ల శ్రీపాల్‌రెడ్డికి ఫోన్ చేసింది. ఫోన్‌కు స్పందించి ఆమెను కలువడానికి జూన్ 27న పోచారం మున్సిపాలిటీ శివాలయం దగ్గరికి వచ్చాడు. అదే సమయంలో అక్కడే కాపుకాసిన హమాలి కాలనీ పాల్వంచ, కొత్తగూడెంకు చెందిన ఏ1 కందుల వంశీ అలియాస్ కుమార్(35), ఏ3 శ్రీరాంపురం, భీమవరం, పశ్చిమగోదావరికి చెందిన సాగి వర్మ (26), ఏ4 పోచారం శివాలయంలో సమీపంలో నివసించే సీతానగర్, పాల్వంచ, పశ్చిమ గోదావరికి చెందిన పల్లపు దేవి(25) అతడిని నిర్బంధించారు. అతడిని బెదిరించి హెచ్డీఎఫ్ డెబిట్ కార్డు ద్వారా రూ.లక్ష, ఏటీఎం ద్వారా పలు దఫాలుగా రూ.2,02,254లు లాక్కున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పీఎస్‌లో కేసు నమోదైంది. జూన్ 30న రాత్రి కుషాయిగూడలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకొని విచారించగా పై కేసులో నిందితులని తేలింది. వారి దగ్గరి నుంచి రూ.1,60,254లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించామన్నారు. కాగ ఏ1, ఏ2లు ఒక జంటగా, ఏ3, ఏ4లు భార్యభర్తలు. తక్కువ సమయంలో కేసు చేధించిన సీఐ చంద్రబాబు, డీఐ జంగయ్య, క్రైం ఎస్సై సుధాకర్ సహచర బృందాన్ని రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ అభినందించారు. చదవండి: హైదరాబాద్‌లో భారీగా తగ్గిన క్యాబ్‌లు, ఆటోలు! -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
ఘట్కేసర్: బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురిని గుర్తు తెలియ ని వాహనం ఢీకొనడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అవుషాపూర్ వద్ద గురువారం ఉదయం జరిగింది. సీఐ చంద్రబాబు తెలిపిన మేరకు.. జనగామ జిల్లా దేవరుప్పల మండలం సింగరాజుపల్లికి చెందిన పాలడుగు నవీన్ (25) ఊబర్‌లో బైక్ నడుపుతుండగా, జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండలం కొత్తపల్లికి చెందిన దాసరి నవీన్ (23), జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్లచిత్తాపూర్ గ్రామానికి చెందిన నానాడం వినిత (21) పంజగుట్టలో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరు స్నేహితు లు ఒకే గదిలో ఉంటుండగా వినీత ఆబిడ్స్‌లోని ఓ వసతి గృహంలో ఉంటోంది. ఈ క్రమంలో ముగ్గురు స్నేహితులయ్యారు. బుధవారం కరీంనగర్ నుంచి కోచింగ్ కోసం సోదరుడు విశాల్, సోదరి విశాలి రాగ వారిని దిల్సుఖ్నగర్ వదిలిపెట్టి తిరిగి వసతి గృహానికి చేరుకుంది. గురువారం ఉదయం నవీన్, దాసరి నవీన్, వినిత బైక్‌పై బీబీనగర్ వైపు నుంచి ఉప్పల్ వైపు వెళుతూ అవుషాపూర్ వద్ద పెట్రోల్ పోయించుకొని సర్వీస్ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డు ఎక్కుతున్నారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. 100 డయాల్ కాల్‌తో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి కారణమైన వాహనం, ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్లారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. (చదవండి: నలుగురిని కిడ్నాప్ చేసిన బంగారం స్మగ్లింగ్ గ్యాంగ్) -
అంతిమ యాత్రకు బయలుదేరిన రేవంత్ రెడ్డికి షాకిచ్చిన పోలీసులు
-
రుణం ఇప్పిస్తామని రూ.8కోట్లకు టోకరా
ఘట్కేసర్: గొర్రెల పంపిణీ సబ్సిడీ రుణం ఇప్పిస్తామని చెప్పి అమా యకుల దగ్గర్నుంచి రూ.8 కోట్లు వసూలు చేసిన ముగ్గురిని ఘట్కేసర్ పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గానికి చెందిన వారికి ప్రభుత్వమిచ్చే సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని చెప్పి కొర్రెముల్ సహాయ పశువైద్యాధికారి సజ్జ శ్రీనివాస్‌రావు, సజ్జ లక్ష్మి, కొల్లి అరవింద్‌కుమార్ గొల్ల, కురుమల దగ్గర రూ.8 కోట్లు వసూలు చేశారు. ఎంతకూవీరు రుణాల ఊసెత్తకపోవడంతో డబ్బులిచ్చిన వారు గట్టిగా నిలదీశారు. దీంతో అప్పట్నుంచి ఈ ముగ్గురూ ఎవరికీ కన్పించకుండా ముఖం చాటేశారు. ఎనిమిది నెలల క్రితం కూకట్ పల్లికి చెందిన బాధితులు ప్రమీలా, జ్యోతి తాము మోసపోయామన్న విషయాన్ని గ్రహించి వీరిపై కూకట్పల్లి పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. శ్రీనివాస్, లక్ష్మి దంపతులు మేడ్చల్‌లో, అరవింద్ కుమార్ రామాంతపూర్‌లో ఉంటున్నట్లు తెలుసుకున్న పోలీసులు వల పన్ని శుక్రవారం అరెస్టు చేశారు. వీరిని ఎల్బీనగర్ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరు పరచగా కోర్టు వీరికి రిమాండ్ విధించింది. కాగా, ఈ కేసులో మరో నిందితుడు సజ్జ శ్రీనివాస్ బావమరిది అనిల్ కుమార్ పరారీలోనే ఉన్నాడు. వీరందరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని, ఎవరైనా బాధితులుంటే ఫిర్యా దు చేయాలని సూచించారు. కేసును ఛేదించిన ఘట్కేçసర్ పీఎస్ సిబ్బందిని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అభినందించారు. -
మంత్రి మల్లారెడ్డిపై దాడి ఘటనపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డిపై దాడి ఘటనపై కేసు నమోదైంది. ఆరు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లారెడ్డిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో ఇద్దరు కాంగ్రెస్ నేతల పేర్లు నమోదు చేశారు. సోమశేఖర్‌రెడ్డి, హరివర్ధన్‌రెడ్డి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. మొత్తం 16 మందిపై 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది. సెక్షన్ 173, 147, 149, 341, 352, 506 కింద కేసు నమోదు చేశారు. రేవంత్‌రెడ్డి అనుచరులే దాడి చేశారంటూ టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు చేశారు. చదవండి: నన్ను చంపేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు -
మంత్రి మల్లారెడ్డిపై దాడి
ఘట్కేసర్: ‘రెడ్ల సింహ గర్జన’ సభకు హాజరైన మంత్రి మల్లారెడ్డిపై దాడి జరిగింది. సభకు సంబంధించిన అంశాలను వదిలిపెట్టి పదేపదే టీఆర్ఎస్ పథకాలను, సీఎం కేసీఆర్‌ను ప్రస్తావించడంపై సభికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మల్లారెడ్డి డౌన్ డౌన్.. మల్లారెడ్డి గో బ్యాక్..’అంటూ కుర్చీలు, రాళ్లు, చెప్పులను స్టేజీపైకి విసిరారు. ప్రసంగం మధ్యలోనే ఆపి వెళ్లిపోతున్న మల్లారెడ్డి కాన్వాయ్ వెంటపడి మరీ రాళ్లు, చెప్పులు, నీళ్ల బాటిళ్లు విసురుతూ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు కష్టమ్మీద వారిని అడ్డుతప్పించి మల్లారెడ్డిని బయటికి తరలించారు. తీపి కబురు చెప్తారనుకుంటే.. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీలో ఆదివారం ‘రెడ్ల సింహగర్జన’ సభ జరిగింది. మంత్రి మల్లారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2018 ఎన్నికల సమయంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో.. మంత్రి మల్లారెడ్డి దానికి సంబంధించి తీపి కబురు చెప్తారని సభకు హాజరైనవారు ఆశించారు. అయితే ప్రసంగం ప్రారంభించిన మల్లారెడ్డి.. ఈ విషయాన్ని పక్కనపెట్టి టీఆర్ఎస్ పథకాలను పదేపదే ప్రస్తావించడం ప్రారంభించారు. తెలంగాణలో 75 ఏళ్లలో జరగని అభివృద్ధి గత ఏడున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో జరిగిందన్నారు. దీంతో ఆగ్రహించిన కొందరు నాయకులు, సభికులు మల్లారెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. కుర్చీలు పైకెత్తి నిరసన తెలిపారు. రెడ్డి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాంరెడ్డి తదితరులు సముదాయించడంతో శాంతించారు. అందరూ ప్రశాంతంగా కూర్చుంటే మల్లారెడ్డి మంచి కబురు చెప్తారంటూ.. ఆయనకు మరోసారి మాట్లాడే అవకాశం ఇచ్చారు. తీరు మార్చుకోకపోవడంతో.. సభికులు నిరసన వ్యక్తం చేసినా మంత్రి మల్లారెడ్డి తీరు మార్చుకోలేదు. రైతుబంధు, ఇతర సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ.. టీఆర్ఎస్, కేసీఆర్‌లను పొగుడుతూ ప్రసంగం కొనసాగించారు. ఈ క్రమంలో ఆయన దళిత బంధు, ఇతర పథకాలను వివరిస్తూ.. మళ్లీ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందంటూ వ్యాఖ్యానించే సరికి.. సభికుల నుంచి నిరసన తీవ్రమైంది. వేదికపై ఉన్న మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ హరివర్ధన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి సహా మరికొందరు మంత్రితో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో సభికులు ‘మల్లారెడ్డి డౌన్ డౌన్.. మల్లారెడ్డి గో బ్యాక్’ అంటూ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసన తెలుపుతున్నవారు కుర్చీలు, రాళ్లు, చెప్పులు, వాటర్ బాటిళ్లను స్టేజ్‌పై మల్లారెడ్డి వైపు విసిరారు. పోలీసులు వెంటనే సభా వేదిక పైకి వచ్చి మంత్రికి రక్షణగా నిలిచారు. అతికష్టమ్మీద మల్లారెడ్డిని కాన్వాయ్ వద్దకు తీసుకువెళ్లి వాహనంలో కూర్చోబెట్టారు. కాన్వాయ్ వెళ్తున్న సమయంలోనూ సభాస్థలి నుంచి జాతీయ రహదారి వరకు వెంటపడిన సభికులు.. రాళ్లు, చెప్పులు, నీళ్ల బాటిళ్లను విసిరారు. మంత్రి వెళ్లడంతోనే సభ ముగిసింది. సభికులంతా ఆగ్రహంతో వెనుదిగారు. ‘రెడ్ల సింహ గర్జన’ ఏర్పాటు కోసం నెల రోజులకు పైగా కష్టించామని, మంత్రి వేదికపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సభను విఫలం చేశారని నిర్వాహకులు అసహనం వ్యక్తం చేశారు. వెంటనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: ‘రెడ్డి సింహగర్జన’ మహాసభ డిమాండ్ సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు చట్టబద్ధమైన రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ‘రెడ్డి సింహగర్జన మహాసభ’ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నేరుగా సీఎంలు ఇచ్చిన హామీలు కూడా అమలు కాకపోవడం గతంలో ఎన్నడూ చూడలేదని మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి వర్గం సహనాన్ని పరీక్షించడం మానుకుని.. ఓసీల్లోని పేదల సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో రెడ్ల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని హెచ్చరించింది. ఘట్కేసర్ సభలో రెడ్డి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పమ్మగారి రాంరెడ్డి, రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టంగారి మాధవరెడ్డి, ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు తదితరులు మాట్లాడారు. 2018 ఎన్నికల సమయంలో, హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా పేద రెడ్ల సంక్షేమం కోసం ప్రత్యేక రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని వారు గుర్తు చేశారు. ఓసీ సామాజిక వర్గాల సమస్యలను పరిష్కరిస్తామన్న హామీలు కలగానే మిగిలాయని విమర్శించారు. రూ.5 వేల కోట్లతో చట్టబద్ధమైన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని.. విదేశాల్లో ఉన్నత విద్యకోసం పేద రెడ్లకు రూ.25 లక్షల ఆర్ధిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వు 244ను అమలు చేయాలని, వయసుతో సంబంధం లేకుండా రైతులందరికీ రూ.5 లక్షల ఉచిత బీమా, 50 ఏళ్లు నిండిన రైతులకు రూ.5వేల పెన్షన్, ఉపాధి హామీతో వ్యవసాయ రంగం అనుసంధానం, రైతుల పంటలకు గిట్టుబాటు ధరతో ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయడం వంటి చర్యలు చేపట్టాలని కోరారు. -
విషాదం: నాలుగు రోజుల్లో పెళ్లి .. చికిత్స పొందుతూ..
సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజుల్లో పెళ్లి అనగా ఓ యువకుడు బైక్‌పై వెళుతుండగా కారు ఢీకొంది. ఈ సంఘటనలో చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. ఎదులాబాద్‌కు చెందిన వట్టిపల్లి రాజు (28) ఘట్కేసర్ ఈశ్వర గ్యాస్ ఏజన్సీలో పనిచేస్తున్నాడు. ఏప్రిల్ 14న అతడి వివాహం కావాల్సి ఉంది. ఏప్రిల్ 10న ఎంనంపేట్ చౌరస్తా నుంచి సోదరితోపాటు బైక్‌పై వస్తున్నాడు. మైసమ్మగుట్ట బీపీసీఎల్ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే ఎన్‌ఎఫ్‌సీనగర్‌కు చెందిన వినయ్ కారును నడుపుతూ రాజు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టాడు. రాజు, అతడి సోదరికి గాయాలు కాగా గాంధీ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. రాజు చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. దీంతో ఎదులాబాద్ గ్రామస్తులు వందలాది మంది కారు యజమాని ఇంటి ఎదుట శవం ఉంచి నిరసన తెలిపారు. పోలీసులు నచ్చచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. చదవండి: సిద్ధిపేట జిల్లాలో కేఏ పాల్‌పై టీఆర్ఎస్ నేతల దాడి -
2018 నాటికే ప్రారంభం అన్నారు.. నాలుగేళ్లవుతున్నా ఊసే లేదు!
సాక్షి, ఘట్కేసర్: ఎంఎంటీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్) సేవల విస్తరణలో భాగంగా 2వ దశలో సికింద్రాబాద్ నుంచి ఘట్కేసర్ వరకు పొడగించాలని 2012లో ప్రతిపాదన చేశారు. 2013లో పనులు ప్రారంభించి మౌలాలి–ఘట్కేసర్ మధ్య ఉన్న 12.20 కిలోమీటర్ల దూరంలో ట్రాక్ నిర్మాణం, విద్యుద్దీకరణ పనులు చేపట్టారు. ఒప్పందం ప్రకారం కేంద్రం 1/3, రాష్ట్ర ప్రభుత్వం 2/3 నిధులతో పనులు చేపట్టాలి. గతంలో ఘట్కేసర్లో ఎంఎంటీఎస్ పనులు పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ 2018 డిసెంబర్ నాటికి ఎంఎంటీఎస్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. కాని మూడేళ్లయినా ఎంఎంటీఎస్ రైళ్లు నడిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు కేటాయించకపోవడంతోనే ఎంఎంటీఎస్ రైళ్లు ఆలస్యం అవుతున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, మంత్రి కిషన్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు. ఘట్కేసర్లో ఎంఎంటీఎస్ ప్లాట్‌ఫాం నిరాశలో స్థానికులు.. ఎంఎంటీఎస్ రైళ్ల రాకతో తక్కువ సమయం.. తక్కువ వ్యయంతో నగరానికి చేరుకోవచ్చని భావించిన విద్యార్థు«లు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు నిరాశ చెంతుతున్నారు. రైళ్లు పెరిగితే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని.. ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపుతారని భావించారు. ప్రజలు సికింద్రాబాద్‌కు వెళ్లాలంటే 25 కిలోమీటర్లు దూరం ట్రాఫిక్ బాధను భరించలేక రైలు ప్రయాణాన్ని కోరుకుంటున్నారు. బస్సులోనైతే గంటన్నర సమయం పడుతుండగా రైలులో కేవలం 35 నిమిషాల్లోనే సికింద్రాబాద్‌కు చేరుకోవచ్చు. చదవండి: కూతురి మరణం జీర్ణించుకోలేకే.. నిందితుడిని కాల్చి చంపారా? ఎంఎంటీఎస్ రాకతో మరింత అభివృద్ధి.. స్థానికంగా ఇన్ఫోసిస్, రహేజా తదితర అంతర్జాతీయ వ్యాపార సంస్థలు, కొత్త కాలనీలు వెలుస్తున్నందున ఎంఎంటీఎస్ రాకతో మరింత అభివృద్ధి చెందడమే కాకుండా ఎంఎంటీఎస్ రైళ్ల రాకతో యంనంపేట్, ఇస్మాయిల్‌ఖాన్‌గూడ పరిధిలో రైల్వే స్టేషన్లు ఏర్పడి రవాణ సౌకర్యం మెరుగు పడుతుంది. సంబంధిత అధికారులు స్పందించి ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకులకు ఏమైనా పెండింగ్ పనులు ఉంటే యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటలోకి తేవాలని కోరుతున్నారు. ఎంఎంటీఎస్ బండి.. ఎంతకాలం ఆగాలండి.! మేడ్చల్‌రూరల్: సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పనులు చేపట్టింది. ఈ పనులు చేపట్టి ఏళ్లు గడిచినా మేడ్చల్ ప్రజలకు నేటికి ఎంఎంటీఎస్ కల నెరవేరలేదు. మేడ్చల్ రైల్వే స్టేషన్లో ఎంఎంటీఎస్ కోసం ఏర్పాటు చేసిన కొత్త ట్రాక్ సికింద్రాబాద్ – బొల్లారం – మేడ్చల్ సికింద్రాబాద్ నుంచి బొల్లారం మీదుగా మేడ్చల్‌కు ఎంఎంటీఎస్ రైళ్లు నడపాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల నిధులు కేటాయించి పనులను ప్రారంభించింది. దీంతో మేడ్చల్ వరకు ప్రత్యేక రైల్యే ట్రాక్, విద్యుత్ లైన్, నూతన ప్లాట్ఫార్మ్ నిర్మాణ పనులను చేపట్టారు. ప్రారంభం కాని రెండోదశ పనులు.. ఏళ్ల పాటు సాగిన పనులకు కరోనా అడ్డంకిగా మారింది. అదేవిధంగా అధికారుల అలసత్వం వల్ల నేటికి పనులు పూర్తి కాక మరింత ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితులు తొలగినా ఎంఎంటీఎస్ రెండో దశ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. వీటికి తోడు నిధుల లేమి కూడా కారణంగా మారడంతో ఎక్కడి పనులను అక్కడే నిలిచిపోయాయి. ఢిల్లీకి వెళ్లి అనుమతి తెచ్చి.. మేడ్లల్ పట్టణంలోని మేడ్చల్ – గిర్మాపూర్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయ – గుండ్లపోచంపల్లి రోడ్డులో రైల్వే గేట్లు ఉండటంతో నిత్యం వాహనదారులకు ఇబ్బందిగా మారింది. దీంతో స్థాని క నేతలు అండర్‌పాస్‌ల ఏర్పాటు చేయాలని ఢిల్లీకి వె ళ్లి రైల్వేశాఖ మంత్రికి పరిస్థితిని వివరించారు. ఆయన ఆదేశాలతో అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టారు. -
ఘట్కేసర్లో మరో డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ కేసు?
-
ఘట్కేసర్లో మరో డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ కేసు
సాక్షి, ఘట్కేసర్: బైక్‌పై వెళ్తున్న దంపతులను కారు ఢీకొట్టడంతో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఘట్కేసర్ పీఎస్ పరిధిలోని ఎదులాబాద్‌లో శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎదులాబాద్‌కు చెందిన బత్తుల హనుమాన్‌దాస్, భార్య నీరజ(45)తో ఘట్కేసర్ నుంచి ఇంటికి వెళుతున్నారు. ఎదులాబాద్ చౌరస్తా సౌత్ ఇండియన్ బ్యాంకు ఎదుట వ్యతిరేక దిశలో వస్తున్న ఓ కారు వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. గాయాలైన ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా నీరజ మార్గమధ్యలో మృతి చెందింది. హనుమాన్‌దాసును చికిత్స నిమిత్తం ఉప్పల్ శ్రీకార ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కార్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. అయితే మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
జైల్లో హత్య చేయించాలని చూశారు: తీన్మార్ మల్లన్న
ఘట్కేసర్: జైల్లోనే తనను హత్య చేయించాలని పెద్దకుట్ర జరిగిందని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. ఆదివారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రెముల జేకే కన్వెన్షన్‌లో తీన్మార్ మల్లన్న టీం జిల్లా కన్వీనర్లు, కో కన్వీనర్లతో భవిష్యత్ కార్యాచరణసభను ఆదివారం నిర్వహించారు. అధికార పార్టీ అకారణంగా తనను అరెస్టు చేసి 74 రోజులపాటు జైలుకు పంపి ఇబ్బందులకు గురిచేసిందని మల్లన్న పేర్కొన్నారు. గత అక్టోబర్ 2న పాత నేరస్తులతో జైల్లోనే అతి క్రూరంగా చంపాలని చూశారని, అయితే తాను చాక చక్యంగా తప్పించుకున్నానని చెప్పారు. తర్వాతిరోజు చీకటిగదిలో బంధించి మానసిక దివ్యాంగులకు ఇచ్చే మత్తుమందు, మాత్రలతో పిచ్చివాడిని చేయాలని యత్నించారని ఆరోపించారు. జైలు నుంచి బయటకు తీసుకురావడానికి శక్తిమంతమైన కొందరు నాయకులతో ప్రయత్నించడం నిజమేనన్నారు. -
‘జీవితంపై విరక్తి.. అందుకే ఈ నిర్ణయం’
ఘట్కేసర్: ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాంకు చెందిన టింకు శర్మ(24) ఘనాపూర్‌లోని పవర్‌గ్రిడ్‌లో వాటర్ బాయ్‌గా ఆరేళ్ల నుంచి పని చేస్తూ స్నేహితులతో కలిసి గ్రామంలో ఉంటున్నాడు. ఆర్థిక సమస్యలు వెంటాడటంతో జీవితంపై విరక్తి చెంది తానుండే గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం గదికి వచ్చిన స్నేహితులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఘట్కేసర్ ORR వద్ద బాలిక అనుమానాస్పద మృతి
-
ఘట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద బాలిక అనుమానాస్పద మృతి
ఘట్కేసర్: ఫోన్లో మాట్లాడొద్దని తల్లి మందలించడంతో వేదనకు గురైన ఓ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. ఘట్కేసర్ సీఐ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా ఒంద్యాల్ గ్రామానికి చెందిన జమ్మికుంట విష్ణు, పద్మ దంపతుల కుమార్తె (16), కుమారుడితో కలసి అన్నోజీగూడ రాజీవ్ గృహకల్పలో నివసిస్తున్నారు. కొంతకాలంగా కూతురు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుండటాన్ని గమనించి మందలించారు. బాలికలో మార్పు రాకపోగా శుక్రవారం తిరిగి అపరిచితునితో మాట్లాడుతుండటంతో గట్టిగా హెచ్చరించారు. దీంతో వేదనకు గురైన బాలిక శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో వారు నిద్రించాక కిరోసిన్ సీసా తీసుకొని, కుటుంబ సభ్యులు బయటకు రాకుండా గడియపెట్టి సమీపంలోని ఖాళీ ప్రదేశంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. కాలిన గాయాలతో అక్కడికక్కడే మరణించింది. ఉదయం వాకింగ్‌కు వచ్చిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి డాగ్, క్లూస్ టీంలు చేరుకొని ఆధారాలు సేకరించాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఖాళీ ప్రదేశంలో బాలిక మృతదేహం కనిపించడంతో దుండగులు బాలికను సజీవదహనం చేసి ఉండొచ్చనే వదంతులు వచ్చాయి. దీంతో స్థానికులు భారీగా ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సమీపంలోని సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించగా బాలిక కిరోసిన్ సీసాతో ఒంటరిగా వెళ్లడం కనిపించింది. దీంతో పోలీసులు ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. చదవండి: అడ్డగూడూరు ఠాణాలో మహిళ లాకప్‌డెత్? -
బంతిని పట్టుకోబోయాడు.. తిరిగి లేవలేదు
సాక్షి, ఘట్కేసర్ : క్రికెట్ ఆడుతూ మైదానంలో కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఘట్కేసర్ పీఎస్ పరిధిలో ఆదివారం జరిగింది. సీఐ తెలిపిన మేరకు.. చెంగిచెర్ల, బోడుప్పల్ వెంకటసాయినగర్‌లో నివాసముండే హర్యానాకు చెందిన లలిత్‌కుమార్(27) యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగి. అవుషాపూర్ ఏఎన్ క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుండగా బంతిని పట్టుకునే క్రమంలో కింద పడిపోయి తిరిగి లేవలేదు. ఇతర క్రీడాకారులు ఘట్కేసర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అక్కడి వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఘట్కేసర్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో ట్విస్ట్
సాక్షి, రంగారెడ్డి: కొద్ది రోజుల క్రితం కిడ్నాప్ డ్రామాతో నగరంలో కలకలం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో ట్విస్ట్ వెలుగు చూసింది. సదరు యువతి మంగళవారం మధ్యాహ్నం షుగర్ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిందని సమాచారం. దాంతో యువతి కుటుంబ సభ్యులు మొదట ఆమెని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం యువతిని ఇంటికి పంపించారు వైద్యులు. మంగళవారం రాత్రి అందరూ నిద్రపోయాక యువతి మరోసారి షుగర్ మాత్రలు మింగినట్లు తెలిసింది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున యువతి ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆమెని ఘట్కేసర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స కొనసాగుతుండగా.. యువతి మరణించింది. చదవండి: ఘట్కేసర్ కిడ్నాప్ డ్రామా: యువతి ఆత్మహత్య -
ఘట్కేసర్ యువతి ఆత్మహత్య
-
ఘట్కేసర్ కిడ్నాప్ డ్రామా: యువతి ఆత్మహత్య
సాక్షి, మేడ్చల్: నగరంలో పది రోజుల క్రితం ఫార్మాసీ విద్యార్థిని కిడ్నాప్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. చివరకు ఇదంతా డ్రామా అని తేల్చారు పోలీసులు. సదరు యువతిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో మనస్తాపానికి గురైన యువతి బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత యువతి తన అమ్మమ్మ ఇంట్లో ఉంటుంది. ఈ క్రమంలో మంగళవారం యువతి షుగర్ ట్యాబ్లెట్స్ మింగి ఆత్మహత్యా యత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెని ఘట్కేసర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అర్థరాత్రి వరకు బాగానే ఉన్న యువతి బుధవారం ఉదయం 10 గంలకు చికిత్స పొందతూ మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటన తర్వాత విద్యార్థిని డిప్రెషన్‌కు గురైనట్లు వెల్లడించారు. అసలేం జరిగిందంటే... మేడ్చల్ కండ్లకోయలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్న ఆ విద్యార్థిని ప్రతిరోజూ లాగానే కాలేజీ రాంపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద బస్సు దిగి ఆర్ఎల్ నగర్‌కు వెళ్లేందుకు సెవెన్ సీటర్ ఆటో ఎక్కింది. అప్పటికే ఆమె తండ్రి ఫోన్‌కాల్ చేస్తే మరికొద్ది నిమిషాల్లోనే ఇంటికి చేరుకుంటానని చెప్పింది. ఆ తర్వాత ఆమె తల్లి ఫోన్‌కాల్ చేస్తే ఆ బస్టాప్ వద్ద ఆగకుండా ఆటోడ్రైవర్ వేగంతో ముందుకు తీసుకెళుతున్నాడంటూ అరుస్తూ చెప్పింది. ఆ తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా ఆమె ఫోన్ కనెక్ట్ కాలేదు. దీంతో ఈ విషయాన్ని డయల్ 100కు కాల్ చెప్పారు. దీంతో అప్రమత్తమైన కీసర, ఘట్కేసర్, మల్కాజ్గిరి, ఉప్పల్, మేడిపల్లి పోలీసులతో పాటు ఎస్వోటీ పోలీసులు బృందాలుగా ఏర్పడి మరీ గాలించారు. చివరకు అన్నోజిగూడ చెట్ల పొదల్లో ఆమె పంపిన లైవ్ లోకేషన్‌తో ఆచూకీ లభించడంతో జోడిమెట్లలోని క్యూర్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని చెప్పిన వివరాలతో మొదట కిడ్నాప్, ఆ తర్వాత నిర్భయ చట్టం కింద వివిధ సెక్షన్ల కింద కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత విద్యార్థిని చెప్పిన వివరాల ఆధారంగా కేసులు నమోదు చేసిన పోలీసులు నలుగురు ఆటోడ్రైవర్లతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం వెళితే బాధితురాలు చెప్పిన వివరాలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన కుదరకపోవడంతో మరోసారి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అలాగే 10న సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్యలో యువతి యామ్నాంపేట, ఘట్కేసర్, అన్నోజిగూడ ప్రాంతాల్లో ఒంటరిగానే సంచరించినట్లుగా సీసీటీవీలకు చిక్కిన దృశ్యాలతో తేల్చారు. అలాగే పోలీసుల అదుపులోకి తీసుకున్న అనుమానితుల సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆయా ప్రాంతాల్లో లేనట్లుగా తేలింది. ఈ కేసులో విద్యార్థిని చెప్పినట్లుగా ముఖ్య అనుమానితుడిగా భావించిన ఆటోడ్రైవర్ ఘట్కేసర్ రాకుండానే యామ్నాంపేట నుంచి తిరిగి ఈసీఐఎల్, అక్కడి నుంచి మల్టీప్లెక్స్ థియేటర్, ఆ తర్వాత వైన్‌షాప్‌కు వెళ్లినట్లుగా సీసీటీవీ కెమెరాల ద్వారా తేలింది. దీంతో విద్యార్థినిని మరోసారి ప్రశ్నించగా ‘తల్లి పదేపదే ఫోన్‌కాల్ చేస్తుండటంతోనే ఈ డ్రామా ఆడానని, ఇంటి నుంచి వెళ్లిపోయేందుకే ఇలా చేశాన’ని చెప్పింది. గతంలో కరోనా సమయంలో ఆటో చార్జీల విషయంలో ఓ ఆటోడ్రైవర్‌తో గొడవపడటంతో మనసులో పెట్టుకొని అతని పేరు చెప్పినట్లుగా బాధితురాలు చెప్పిందని సీపీ తెలిపారు. 6 నెలల క్రితం తన స్నేహితునితోనూ తనను కిడ్నాప్ చేశారంటూ కట్టుకథ అల్లిందని, 10 తేదీన కూడా ఆటోలో వచ్చేరోజూ తన సీనియర్ విద్యార్థితోనూ కిడ్నాప్ గురించి విషయాలు మాట్లాడిందని తేలిందన్నారు. కుటుంబ సమస్యలతోనే ఇంటి నుంచి వెళ్లిపోవాలనుకుందని, అయితే సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసు ఛేదించామన్నారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన కీసర సీఐ జే.నరేందర్‌గౌడ్‌తో పాటు ఇతర సిబ్బందిని రివార్డులతో మహేశ్ భగవత్ సత్కరించారు. చదవండి: ఘట్కేసర్ కేసు; రాడ్లతో విచక్షణ రహితంగా.. ఘట్కేసర్ అత్యాచారం కేసు: కొత్త ట్విస్టు -
విద్యార్థిని కిడ్నాప్ చేయలేదు..అత్యాచారం జరగలేదు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్, అత్యాచారం అంతా ఆమె కల్పితమాటలేనని రాచకొండ పోలీసులకు దొరికిన శాస్త్రీయ ఆధారా లతో రుజువైంది. ఈ కేసులో ఆమే సూత్రధారి.. ఆమే పాత్రధారిగా పోలీసులు తేల్చారు. తొలుత భావించినట్లుగా ఆటోడ్రైవర్లు కిడ్నాప్ చేయలేదని, అత్యాచారం కూడా జరగలేదని సీసీటీవీ ఫుటేజీకి చిక్కిన దృశ్యాలు తేల్చేశాయి. ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు డ్రామా ఆడిన విద్యార్థిని కేసు వివరాలను అడిషనల్ సీపీ సుధీర్‌బాబు, మల్కాజ్గిరి డీసీపీ రక్షితామూర్తితో కలసి నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మహేశ్‌భగవత్ శనివారం మీడియాకు తెలిపారు. అసలేం జరిగిందంటే... మేడ్చల్ కండ్లకోయలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్న ఆ విద్యార్థిని ప్రతిరోజూ లాగానే కాలేజీ రాంపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద బస్సు దిగి ఆర్ఎల్ నగర్‌కు వెళ్లేందుకు సెవెన్ సీటర్ ఆటో ఎక్కింది. అప్పటికే ఆమె తండ్రి ఫోన్‌కాల్ చేస్తే మరికొద్ది నిమిషాల్లోనే ఇంటికి చేరుకుంటానని చెప్పింది. ఆ తర్వాత ఆమె తల్లి ఫోన్‌కాల్ చేస్తే ఆ బస్టాప్ వద్ద ఆగకుండా ఆటోడ్రైవర్ వేగంతో ముందుకు తీసుకెళుతున్నాడంటూ అరుస్తూ చెప్పింది. ఆ తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా ఆమె ఫోన్ కనెక్ట్ కాలేదు. దీంతో ఈ విషయాన్ని డయల్ 100కు కాల్ చెప్పారు. దీంతో అప్రమత్తమైన కీసర, ఘట్కేసర్, మల్కాజ్గిరి, ఉప్పల్, మేడిపల్లి పోలీసులతో పాటు ఎస్వోటీ పోలీసులు బృందాలుగా ఏర్పడి మరీ గాలించారు. చివరకు అన్నోజిగూడ చెట్ల పొదల్లో ఆమె పంపిన లైవ్ లోకేషన్‌తో ఆచూకీ లభించడంతో జోడిమెట్లలోని క్యూర్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని చెప్పిన వివరాలతో మొదట కిడ్నాప్, ఆ తర్వాత నిర్భయ చట్టం కింద వివిధ సెక్షన్ల కింద కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. వంద మంది పోలీసులు... తొలుత విద్యార్థిని చెప్పిన వివరాల ఆధారంగా కేసులు నమోదు చేసిన పోలీసులు నలుగురు ఆటోడ్రైవర్లతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం వెళితే బాధితురాలు చెప్పిన వివరాలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన కుదరకపోవడంతో మరోసారి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అలాగే 10న సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్యలో యువతి యామ్నాంపేట, ఘట్కేసర్, అన్నోజిగూడ ప్రాంతాల్లో ఒంటరిగానే సంచరించినట్లుగా సీసీటీవీలకు చిక్కిన దృశ్యాలతో తేల్చారు. అలాగే పోలీసుల అదుపులోకి తీసుకున్న అనుమానితుల సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆయా ప్రాంతాల్లో లేనట్లుగా తేలింది. ఈ కేసులో విద్యార్థిని చెప్పినట్లుగా ముఖ్య అనుమానితుడిగా భావించిన ఆటోడ్రైవర్ ఘట్కేసర్ రాకుండానే యామ్నాంపేట నుంచి తిరిగి ఈసీఐఎల్, అక్కడి నుంచి మల్టీప్లెక్స్ థియేటర్, ఆ తర్వాత వైన్‌షాప్‌కు వెళ్లినట్లుగా సీసీటీవీ కెమెరాల ద్వారా తేలింది. చదవండి: (బీఫార్మసీ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం) దీంతో విద్యార్థినిని మరోసారి ప్రశ్నించగా ‘తల్లి పదేపదే ఫోన్‌కాల్ చేస్తుండటంతోనే ఈ డ్రామా ఆడానని, ఇంటి నుంచి వెళ్లిపోయేందుకే ఇలా చేశాన’ని చెప్పింది. గతంలో కరోనా సమయంలో ఆటో చార్జీల విషయంలో ఓ ఆటోడ్రైవర్‌తో గొడవపడటంతో మనసులో పెట్టుకొని అతని పేరు చెప్పినట్లుగా బాధితురాలు చెప్పిందని సీపీ తెలిపారు. 6 నెలల క్రితం తన స్నేహితునితోనూ తనను కిడ్నాప్ చేశారంటూ కట్టుకథ అల్లిందని, 10 తేదీన కూడా ఆటోలో వచ్చేరోజూ తన సీనియర్ విద్యార్థితోనూ కిడ్నాప్ గురించి విషయాలు మాట్లాడిందని తేలిందన్నారు. కుటుంబ సమస్యలతోనే ఇంటి నుంచి వెళ్లిపోవాలనుకుందని, అయితే సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసు ఛేదించామన్నారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన కీసర సీఐ జే.నరేందర్‌గౌడ్‌తో పాటు ఇతర సిబ్బందిని రివార్డులతో మహేశ్ భగవత్ సత్కరించారు. 10వ తేదీన ఏఏ సమయాల్లో ఎక్కడుందంటే... ♦సాయంత్రం 5.30: రాంపల్లి ఎక్స్ రోడ్డు నుంచి ఆటోలో ప్రయాణం ♦సాయంత్రం 5.57: యామ్నాంపేట టీస్టాల్ ముందు ఆటో దిగింది ♦సాయంత్రం 6.03: ఒంటరిగా నడుచుకుంటూ తల్లికి ఫోన్‌కాల్ చేసింది. ♦సాయంత్రం 6.15: శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీవైపు వెళ్లింది. ♦సాయంత్రం 6.44: కొండాపూర్ రైల్వే గేట్ ♦సాయంత్రం 6.48: ఘట్కేసర్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రోడ్డు ♦సాయంత్రం 6.58: సాయి లేడీస్ హాస్టల్ ♦సాయంత్రం 6.59: ఘట్కేసర్ ఓల్డ్ విలేజ్ ♦రాత్రి 7.05: కల్కి ఆసుపత్రి ముందు ఆటో ఎక్కింది ♦రాత్రి 7.23: ఎన్టీపీసీ ఎక్స్‌రోడ్డు, అన్నోజిగూడలో దిగింది. అక్కడి నుంచి 150 మీటర్ల దూరంలోనే ఆమె ఆచూకీ పోలీసులకు దొరికింది. -
విద్యార్థినిపై అత్యాచారం జరగలేదు : సీపీ
-
ఘట్కేసర్ ఘటన: అంతా కట్టుకథ
సాక్షి, హైదరాబాద్ : ఘట్కేసర్ భీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్, అత్యాచారం కేసులో సంచలన విషయాలను పోలీసులు వెల్లడించారు. యువతి కిడ్నాప్‌ను ఓ కట్టుకథగా తేల్చిచెప్పారు. బీఫార్మసీ విద్యార్ధినిపై అత్యాచారం జరగలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై రాచకొండ సీపీ మహేష్ భగవత్ శనివారం మీడియా సమావేశం నిర్వహించి ఘటనకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. యువతి కావాలనే కట్టుకథలు అల్లిందని, పోలీసులను, తల్లిదండ్రులను తప్పుదోవపట్టిందని పేర్కొన్నారు. తొలుత యువతిని కిడ్నాప్ చేశారన్న సమాచారంతో అలర్ట్ అయ్యామని, యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కిడ్నాపు కేసు నమోదు చేశామని తెలిపారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రేస్ చేశామని, విచారణలో యువతి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అసలు వాస్తవాలు బయటపడ్డయన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణలో వాస్తవాలను గుర్తించామన్నారు. యువతి చెప్పినట్టు కేసులో ఆటో డ్రైవర్ పాత్ర లేదని సీపీ స్పష్టం చేశారు. తనపై అత్యాచారం జరిగినట్లు పోలీసులను నమ్మించడానికి తన దుస్తులను తానే చింపుకుందని తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థిని తనకు తానే ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. కిడ్పాప్ లేదు, రేప్ లేదన్నారు. యువతి అందరినీ తప్పుదోవ పట్టిందని చెప్పారు. యువతి డ్రామాతో మూడు రోజులుగా పోలీసులు నిద్రలేకుండా గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో ఆటో డ్రైవర్లు తమకు బాగా సహకరించారన్నారు. యువతి కిడ్నాప్, అత్యాచారం కేసును తప్పుడు కేసుగా సీపీ మహేష్ భగవత్ తేల్చిచెప్పారు. కాగా కండ్లకోయలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీఫార్మసీ చదువుతున్న రాంపల్లిలోని ఆర్‌ఎల్‌నగర్ వాసి బుధవారం కాలేజీకి వెళ్లి తిరిగి వస్తూ.. నాగారంలో బస్సు దిగి రాంపల్లిలోని ఆర్‌ఎల్‌నగర్ బస్టాప్ వెళ్లేందుకు ఆటోలో ఎక్కింది. ఆటో అక్కడ ఆపకుండా ముందుకు తీసుకెళ్లి ఆటోడ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు కిడ్నాప్ చేసేందుకు యత్నించారని చెప్పడంతో తొలుత పోలీసులు కిడ్నాప్‌గా కేసు నమోదు చేశారు. గురువారం బాధితురాలిని లోతుగా విచారించిన పోలీసులు నిర్భయ చట్టం కింద వివిధ కేసులు నమోదు చేశారు. అనంతరం పోలీసులు విచారించిన ఇదంతా కట్టుకథగా తేలింది. ఘట్కేసర్ అత్యాచారం కేసు: కొత్త ట్విస్టు -
ఘట్కేసర్ అత్యాచారం కేసు: కొత్త ట్విస్టు
సాక్షి, హైదరాబాద్: బీఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం కేసులో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతోంది. అయితే ఆమె పోలీసులకు చెబుతున్న వివరాలకు పొంతన కుదరడం లేదు. దీంతో ఈ కేసులో ఏం జరిగిందన్న దానిపై స్పష్టత రావడం లేదు. అయితే ఘటన జరిగిన రోజు నాగారం నుంచి రాంపల్లిలోని ఆర్‌ఎల్‌నగర్ బస్టాప్ వరకు ఆమె ఆటోలో వచి్చంది. ఆ తర్వాత ఓఆర్ఆర్ ఘట్కేసర్ వరకు మార్గమధ్యలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తే ఒంటరిగానే రోడ్డుపై ఆమె నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా దృశ్యాలు కనిపించాయి. దీంతో ఆటోడ్రైవర్ల పాత్రపై పక్కా ఆధారాలు లేకపోవడం, వేరేవాళ్ల మీద అనుమానాలు లేకపోవడంతో అసలు ఏం జరిగిందనేది తెలియక రాచకొండ పోలీసులు తికమకపడుతున్నారు. మరోవైపు ఈ కేసులో తమ ఆటోడ్రైవర్లను అనవసరంగా బద్నాం చేస్తున్నారంటూ ఆటోడ్రైవర్ల సంఘాలు ఆందోళనకు దిగడం కూడా ఖాకీలకు తలనొప్పిగా మారింది. కేవలం అనుమానంతోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారని, అయితే ఆ నేరం తమవారే చేసినట్టుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చక్కర్లు కొట్టాయని సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకే సవాల్.. కండ్లకోయలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్న రాంపల్లిలోని ఆర్‌ఎల్‌నగర్ వాసి బుధవారం కాలేజీకి వెళ్లి తిరిగి వస్తూ.. నాగారంలో బస్సు దిగి రాంపల్లిలోని ఆర్‌ఎల్‌నగర్ బస్టాప్ వెళ్లేందుకు ఆటోలో ఎక్కింది. ఆటో అక్కడ ఆపకుండా ముందుకు తీసుకెళ్లి ఆటోడ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు కిడ్నాప్ చేసేందుకు యత్నించారని చెప్పడంతో తొలుత పోలీసులు కిడ్నాప్‌గా కేసు నమోదు చేశారు. గురువారం బాధితురాలిని లోతుగా విచారించిన పోలీసులు నిర్భయ చట్టం కింద వివిధ కేసులు నమోదు చేశారు. అలాగే శుక్రవారం బాధితురాలు పోలీసుల విచారణలో తెలిసిన వ్యక్తులే నమ్మించి తీసుకెళ్లారని చెప్పారనే వివరాలతో కూడిన వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అయితే ఈ కేసులో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తుండటంతో పోలీసుల విచారణకు అడ్డంకిగా మారుతోంది. దీంతో రాచకొండ పోలీసులు ఇటు సాంకేతిక అంశా లను ఆధారంగా చేసుకొని విచారణ వేగిరం చేశారు. మరోవైపు వైద్యులు ఇచ్చే నివేదిక కూడా పోలీసులకు కీలకంగా మారనుంది. చదవండి: ఘట్కేసర్ అత్యాచార కేసు: విస్తుపోయే నిజాలు బీఫార్మసీ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం -
ఘట్కేసర్ ఘటన: దర్యాప్తు ముమ్మరం
హైదరాబాద్/ఘట్కేసర్: బీఫార్మసీ విద్యార్థినిని కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడిన కేసులో ఆరుగురు నిందితుల్ని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని భువనగిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్వోటీ) కార్యాలయంలో విచారిస్తున్నారు. బాధితురాలిని గురువారం గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన తర్వాత మెరుగైన చికిత్సకోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. రాంపల్లి ఆర్ఎల్ నగర్‌కు చెందిన బీఫార్మసీ విద్యార్థినిపై బుధవారం అఘాయిత్యం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న రాచకొండ పోలీసులు నిందితుల్ని పట్టుకోవడానికి 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ నేపథ్యంలోనే నాగారం సర్కిల్లోని ఓ సీసీ కెమెరాలో కనిపించిన దృశ్యాల ఆధారంగా ఆ విద్యార్థిని ఎక్కిన సెవెన్ సీటర్ ఆటోను గుర్తించారు. దాని డ్రైవర్‌తో పాటు ఈసీఐఎల్, రాంపల్లి, యంనంపేట్, ఘట్కేసర్ మార్గాల్లో నడిచే ఆటోల డ్రైవర్లలో అనేక మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో పాటు ఆయా ప్రాంతాల్లోని సెల్‌ఫోన్ టవర్ల నుంచి సేకరించిన సాంకేతిక అంశాలు, నిర్దేశిత లొకేషన్లలో ఉన్న సెల్‌ఫోన్ నెంబర్ల ఆధారంగా కొందరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు యంనంపేట్ ప్రాంతానికి చెందిన వారని తెలిసింది. వీరిలో కొందరిపై గతంలోనూ కేసులు ఉన్నట్లు సమాచారం. తొలుత కిడ్నాప్ కేసు నమోదు చేసిన కీసర పోలీసులు, గురువారం బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించడంతో పాటు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా కిడ్నాప్, దాడి, నిర్భయ చట్టంలోని సెక్షన్ల కింద ఆరోపణలు చేర్చారు. మొత్తం ఆరుగురు నిందితులని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వీరిని ఘటనాస్థలికి తీసుకెళ్లి ప్రాథమిక క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. ఈ కేసులో నిందితుల్ని శుక్రవారం అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది. కాగా, బాధితురాలు తమ ఆసుపత్రికి వచ్చిన సమయంలో ఆమె స్పృహలో లేదని క్యూర్ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. బాధితురాలికి అంతర్గతంగా గాయాలు ఉన్నాయని, తల, కాలిపై గాయాలు ఉన్నాయని, కర్రలు లేదా రాడ్లతో దాడి జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని డీసీపీ రక్షితామూర్తి తెలిపారు. సూత్రధారి శివ? బీ ఫార్మసీ విద్యార్థినిపై అఘాయిత్యం కేసులో యంనంపేట్‌కు చెందిన ఆటోడ్రైవర్ శివ సూత్రధారిగా తేలింది. ఇతడిచ్చిన సమాచారంతోనే మిగిలిన ఐదుగురు నిందితులు వచ్చి నేరంలో పాలుపంచుకున్నట్లు తేల్చారు. రాచకొండ పోలీసులు గురువారం రాత్రి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు నాగారం చౌరస్తాలో శివకు చెందిన సెవెన్ సీటర్ ఆటో ఎక్కింది. విద్యార్థిని ఒంటరిగా ఉండటంతో దుర్బుద్ధి పుట్టిన శివ ఈ విషయాన్ని ఫోన్ ద్వారా తన స్నేహితులకు చెప్పి నిర్దేశిత ప్రాంతానికి రమ్మని చెప్పాడు. కీడు శంకించిన బాధితురాలు ఫోన్ ద్వారా కుటుంబీకులకు సమాచారం ఇచ్చింది. మార్గమధ్యలో ప్రయాణికుల మాదిరిగా వాహనం ఎక్కిన ఇద్దరు స్నేహితులు బాధితురాలి నోరునొక్కి, కదలకుండా పట్టుకుని ఘట్కేసర్ వైపునకు తీసుకుపోయారు. యంనంపేట్ దాటిన తర్వాత ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ సమయానికి మరో ముగ్గురు స్నేహితులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ లోపు బాధితురాలి తల్లిదండ్రుల నుంచి అందిన సమాచారం మేరకు కీసర పోలీసులు రంగంలోకి దిగి బాధితురాలి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. హడావుడిని గమనించిన నిందితులు బాధితురాలిని అన్నోజిగూడ సమీపానికి తీసుకువచ్చి వదిలి పారిపోయారు. -
ఘట్కేసర్ కేసు; రాడ్లతో విచక్షణ రహితంగా..
సాక్షి, హైదరాబాద్ : ఘట్కేసర్ అత్యాచారం కేసు విచారణను కీసర పోలీసులు వేగవంతం చేశారు. విచారణ అధికారిగా కీసర ఇన్స్పెక్టర్ నరేందర్ గౌడ్‌ను నియమించారు. ఘట్కేసర్ సీఐ చంద్రబాబునాయుడు సెలవులో వెళ్లడంతో విచారణ అధికారిగా నరేందర్ గౌడ్‌ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నియమించారు. మరోవైపు బాధితురాలిని నారపల్లి క్యూర్ ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం తిరిగి క్యూర్ ఆస్పత్రికి పోలీసులు తరలించనున్నారు. మత్తు మందు ఇచ్చి అమ్మాయిపై అత్యాచారం చేసే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలు స్పృహలోకి వచ్చిన తరువాత నిందితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నిందితులపై 365 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుగుతున్నారు. గురువారం క్యూర్ హాస్పిటల్ డాక్టర్ రణధీర్ రెడ్డి, మేడ్చల్ చైల్డ్ వెల్ఫేర్ అధికారి జ్యోతి పద్మ మీడియాతో మాట్లాడారు. ఫార్మసీ విద్యార్థిని బుధవారం రాత్రి 8.20 గంటలకు పోలీసులు తమ ఆస్పత్రిలో చేర్చినట్లు రణధీర్ రెడ్డి తెలిపారు. అప్పటికే బాధితురాలు అపపస్మారక స్థితిలో ఉందని, ఒంటిపై కొన్ని చోట్ల గాయాలు అయ్యాయన్నారు. రాడ్లతో విచక్షణ రహితంగా విద్యార్థినిపై దాడి చేయడంతో కాలి గాయం అయ్యిందన్నారు. సీనియర్ గైనకాలజిస్ట్ అన్ని వైద్య పరీక్షలు చేశారనన్నారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి బాగానే ఉందన్నారు. వైద్య పరీక్షల కోసం పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినిపై లైంగికదాడి యత్నం జరిగిందని బాధితురాలికి చికిత్స అందించిన క్యూర్ హాస్పిటల్ డాక్టర్ సౌజన్యా రెడ్డి తెలిపారు. ఒక్కరు కాదు ముగ్గురు దుండగులు ఉన్నారని బాధితులు చెప్పినట్లు పేర్కొన్నారు. ఆస్పత్రికి వచ్చినప్పుడు సృహ లేకుండా ఉందని, పోలీసులే ఆమెను తీసుకొచ్చారన్నారు. ఫార్మసీ విద్యార్థిని విషయం తెలియగానే హాస్పిటల్‌కు చేరుకున్నామని మేడ్చల్ చైల్డ్ వెల్ఫేర్ అధికారి జ్యోతి పద్మ తెలిపారు. మంత్రి ఆదేశాలతో మెరుగైన చికిత్స కోసం తరలించారని, ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం బాగానే ఉందన్నారు. మహిళలపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫార్మసీ విద్యార్థిని పైన అత్యాచారం జరిగిందా లేదా అనేది రిపోర్టులు వచ్చాక వెల్లడిస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వ్యక్తుల్లో, వ్యక్తిత్వాల్లో మార్పు రావాలని అన్నారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో విద్యార్థిని క్షేమంగా ఉందన్నారు. ఘట్కేసర్ ఘటన పైన స్త్రీ శిశు సంక్షేమ శాఖ కు రిపోర్ట్ అందిస్తామని వెల్లడించారు. చదవండి బీఫార్మసీ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం -
బీఫార్మసీ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం
సాక్షి, ఘట్కేసర్: కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ బీఫార్మసీ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు అత్యాచారయత్నం చేశారు. ఈ ఘటన ఘట్కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. రాంపల్లిలోని ఆర్‌ఎల్‌నగర్ ఓయూ కాలనీకి చెందిన యువతి కండ్లకోయలోని ఓ కాలేజీలో బీఫార్మసీ చదువుతోంది. బుధవారం కాలేజీకి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో నాగారంలో బస్సు దిగి రాంపల్లిలోని ఆర్ఎల్ నగర్ బస్టాప్ వెళ్లేందుకు సెవన్ సీటర్ ఆటో ఎక్కింది. ఆమెతో పాటు తన సీనియర్, ఇద్దరు ప్యాసింజర్లు కూడా ఉన్నారు. అయితే కొద్ది దూరం వెళ్లాక ఆ ముగ్గురూ దిగిపోయారు. అప్పుడు బాధితురాలు మాత్రమే ఆటోలో ఉండటంతో ఇదే అదనుగా భావించిన డ్రైవర్.. ఆమె దిగాల్సిన చోట ఆపకుండా వేగంగా డ్రైవర్ ముందుకు తీసుకెళ్లాడు. యామన్నపేట వద్ద ఇంకో వ్యాన్ ఉండగా, ఆటోలో నుంచి ఆమెను బలవంతంగా అందులోకి ఎక్కించారు. అక్కడి నుంచి వ్యాన్‌లో ఘట్కేసర్ రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లి ఆటో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసుల సైరన్ విన్పించడంతో ఘట్కేసర్ ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్ సర్వీసు రోడ్డుకు సమీపంలోని ఓ భవనం వద్దకు ఆమెను తీసుకెళ్లారు. అప్పటికీ పోలీసులు తమను వెంటాడుతున్నారని భావించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. డయల్ 100కు ఫోన్ చేయడంతో.. తను దిగాల్సిన చోట ఆపకుండా ఆటోను తీసుకెళ్తున్న సమయంలోనే బాధితురాలు తన తల్లికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పింది. దీంతో బాధితురాలి తల్లి తమ సమీప బంధువైన ఓ అబ్బాయికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. ఆ వెంటనే అతడు డయల్ 100కు కాల్చేసి ఫిర్యాదు చేశాడు. అప్పటికప్పుడు కీసర, ఘట్కేసర్ పోలీసులు బృందాలుగా ఏర్పడి ఆయా ప్రాంతాల్లో జల్లెడ పట్టారు. బాధితురాలి ఫోన్ నంబర్ లొకేషన్‌ను ట్రేస్ చేయడంతో చివరికి ఘట్కేసర్ ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్ సర్వీసు రోడ్డుకు సమీపంలో నిర్మాణం ఆగిపోయిన ఓ భవనం వద్ద చూపింది. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. అప్పటికే నిందితులు పారిపోయారు. బాధితురాలి కుడి కాలికి గాయం.. ఆటో డ్రైవర్‌తో జరిగిన పెనుగులాటలో బాధితురాలి కుడికాలికి గాయమైంది. అలాగే కొంతమేర ఆమె దుస్తులు కూడా చిరిగిపోయాయి. ఎట్టకేలకు రాత్రి 7.50 ప్రాంతంలో బాధితురాలి వద్దకు చేరుకున్న పోలీసులు వారి వాహనంలోనే జోడిమెట్లలోని క్యూర్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, కుడికాలికి మాత్రం గాయమైందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి, ఏసీపీ శ్యాం ప్రసాద్‌కుమార్ ఆస్పత్రికి వచ్చి బాధితురాలితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. అయితే ఆటోడ్రైవర్‌ను గుర్తించేందుకు ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
అప్పుడే అర్థమైంది.. అసలు పరీక్ష ప్రారంభమైందని!
సాక్షి, ఘట్కేసర్ : వారంతా అర్ధాకలితో నిరుద్యోగ బాధను దిగమింగుకున్నారు. రాత్రింబవళ్లూ శ్రమించి చదువుకున్నారు. పేదరికం విలువ తెలుసుకొని పోటీ పరీక్షలకు సమయత్తమై విజేతలుగా నిలిచి పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగం సాధించారు. కటిక పేదరికాన్ని అనుభవించి ఉద్యోగం రావడంతో ఉప్పొంగిపోయారు. ఇన్నాళ్లు కష్టపడి చదివించిన తల్లితండ్రుల జీవితాల్లో వెలుగులు నింపుదామని అనుకున్నారు. ఏడాది పాటు ఉత్సాహంగా విధులు నిర్వహించారు. ఆ తర్వాతే తెలుసుకున్నారు జీవితంలో అసలు పరీక్ష ప్రారంభమైందని. పంచాయతీ కార్యదర్శులుగా ఉద్యోగమిచ్చినా.. సర్కారు శిక్షణ ఇవ్వకుండానే ఉద్యోగ బాధ్యతలు అప్పగించడంతో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. పని భారం పెరగడం, ప్రజా ప్రతినిధులు, అధికారుల ఒత్తిడిని భరించలేకపోయారు. అప్పటి వరకు పేదరికాన్ని చవిచూసిన ఆ ఉద్యోగులు కుటుంబానికి అన్నం పెట్టే ఉద్యోగానికే రాజీనామ చేశారు. 2019 సంవత్సరంలో జిల్లాలో 20 మంది జూనియర్ కార్యదర్శలుగా ఉద్యోగంలో చేరగా 9 మంది రాజీనామా చేశారు. చదవండి: కూకట్‌పల్లిలో బయటపడ్డ ఫేక్ డాక్టర్ మోసం! కనుబొమ్మలు తీసివేసి.. కోట్లలో మోసాలు ఒత్తిడి భరించలేక... నియామక సమయంలో పార్లమెంట్ ఎన్నికలు రావడంతో శిక్షణ లేకుండానే ఉద్యోగంలో చేరారు. అనంతరం పల్లెప్రగతి కార్యక్రమం వారికి దిమ్మదిరిగేలా చేసింది. ఇంటి అనుమతులు, పన్నుల వసూళ్లతో పాటు ఉపాధి హామీ పనులు, హరితహారం, పల్లె ప్రగతి, వైకుంఠ ధామం, డంపింగ్ యార్డు షెడ్ల పనులు వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. కార్పొరేట్ స్కూల్లో చదవడంతో గ్రామ కంఠం భూమి అంటేనే వారికి తెలియదు. అలాంటిది సర్పంచ్, ఉప సర్పంచులకు మధ్యన పొసగక పోవడం, ఓడిన, గెలిచిన వారు రెండు వర్గాలుగా చీలి అభివృద్ధి పనులు ఆపడం, కొత్తగా వచ్చిన జూనియర్ కార్యదర్శులకు మేజర్ పంచాయతీలు అప్పగించడం, డీపీఓ ఆఫీస్ నుంచి ఉదయం 8 గంటలకే వీడియో కాల్ రావడం తల నొప్పిగా మారింది. ఉదయం ఇంటి నుంచి బయలు దేరిన వాళ్లు తిరిగి ఇంటికి ఎప్పుడు చేరుతారో తెలియని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ప్రజాప్రతినిధుల ఒత్తిడి పెరగడం, నిధులు లేకున్నా పనులు చేయాలని మెడమీద కత్తిపెట్టడం, లేదంటే షోకాజ్ నోటీసులివ్వడం వారిని మరింత కుంగదీసింది. ఎగ్జిక్యూటివ్ పదవి కార్యదర్శి ఉద్యోగం వదిలి చిన్న స్థాయి ఉద్యోగంలో చేరిపోయారు. ప్రభుత్వం ఇలాంటి అంశాలపై దృష్టిసారించి ప్రస్తుతం అమలు చేస్తున్న అవుట్ సోర్సింగ్ విధానాన్ని రదు చేసి నోటిఫికేషన్ ద్వారా జూనియర్ కార్యదర్శుల నియామకాలను నిర్వహించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. సవాలక్ష ఆంక్షలతో ఎలా... ప్రభుత్వం సవాలక్ష ఆంక్షలు విధిస్తూ నిరుద్యోగులను మోసం చేస్తోంది. జూనియర్ కార్యదర్శులుగా అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి నోటిఫికేషన్ ద్వారా నియామకాలను చేపట్టాలి. – బద్దం మిత్రారెడ్డి, నిరుద్యోగి, ఘనాపూర్ -
వివాహేతర సంబంంధం: పెళ్లికి నిరాకరించిందని హత్య
సాక్షి, ఘట్కేసర్(హైదరాబాద్): పెళ్లికి నిరాకరించి మరొకరితో చనువుగా ఉంటున్న వివాహితను ఓ వ్యక్తి హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ చంద్రబాబు గురువారం తెలిపిన మేరకు..శ్రీకాకుళం చెందిన లిమ్మ సంతోష(28) భర్తతో గొడవపడి సొంతూరికి వెళ్లిపోయింది. తల్లితండ్రులు, సోదరుడు, ముగ్గురు పిల్లలతో కలిసి ఏదులాబాద్‌లో ఉంటోంది. అదే ప్రాంతంలో ఉంటున్న మహారాష్ట్రకు చెందిన వినోద్ పర్స్‌రాం(28)తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. పెళ్లి చేసుకోవాలని వినోద్ కోరగా ఆమె నిరాకరించింది. ఇతరులతో సన్నిహితంగా ఉండటాన్ని వినోద్ భరించలేకపోయాడు. దీంతో డిసెంబర్న 3న తాడుతో ఉరి వేసి సంతోషను హత్యచేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు వినోద్‌ను శామీర్‌పేట్ మండలం తూముకుంటలో అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. -
ఓఆర్ఆర్పై హోండాసిటీ కారు బోల్తా
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగు రోడ్డుపై ఘట్కేసర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. క్షతగాత్రుల్లో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వారిని ఆస్పత్రికి తరలించారు. వారంతా దమ్మాయిగూడకు చెందిన కమలాకర్ శర్మ కుటుంబం సభ్యులుగా తెలిసింది. తీర్థయాత్రలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో కమలాకర్ శర్మ హోండా సిటీ కారు ప్రమాదానికి గురైంది. (చదవండి: సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై హైకోర్టులో పిటిషన్) -
తెలంగాణ నుంచి బయలుదేరిన రెండో రైలు
సాక్షి హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణ నుంచి వలస కార్మికులతో రెండో ప్రత్యేక రైలు బయలు దేరింది. 1250 మంది కార్మికులతో ఘట్కేసర్ నుంచి పట్నాకు మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల 20 నిమిషాలకు శ్రామిక్ ప్రత్యేక రైలు బయలుదేరినట్టు అధికారులు వెల్లడించారు. మేడ్చల్ కలెక్టర్‌తో పాటు రాచకొండ సీపీ, నోడల్ అధికారి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని బిహార్ కార్మికులను గుర్తించి ప్రత్యేక రైలులో వారిని పంపించారు. గత రెండు రోజుల నుంచి వివిధ పోలీసు స్టేషన్లలో పేర్లు నమోదు చేసుకున్న వారిని పంపించినట్టు అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం లింగంపల్లి నుంచి జార్ఖండ్‌లోని హతియాకు ప్రత్యేక రైలులో 1225 వలస కూలీలను తరలించిన సంగతి తెలిసిందే. కాగా, తెలంగాణ నోడల్ అధికారి సందీప్ సుల్తానీయతో రైల్వే జీఎం గజానన్ మాల్యా ఈ ఉదయం భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు శ్రామిక్ ప్రత్యేక రైళ్లు నడపడంపై చర్చలు జరపనున్నారు. ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ షెల్టర్స్, పోలీసు స్టేషన్లలో, ప్రభుత్వ సమాచార కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న వలస కార్మికుల వివరాల ఆధారంగా కార్యాచరణ చేపట్టనున్నారు. రేపటి నుంచి పూర్తిస్థాయిలో వలస కార్మికులను తరలించే అవకాశముందని సమాచారం. (బోయిన్పల్లి టు కాకినాడ.. ఓ తండ్రి పయనం) -
కూలర్ల కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, మేడ్చల్ : మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పీఎస్ పరిధిలోని కొండాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ కూలర్ కంపెనీలో మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. -
ఘట్కేసర్–మౌలాలి మధ్య ఫోర్‌లేన్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రధాన రవాణా మార్గాల్లో ఒకటిగా ఉన్న ఎంఎంటీఎస్ ప్రాజెక్టు రెండో దశలో కీలక మార్గంలో కొంత భాగం అందుబాటులోకి వచ్చింది. సనత్‌నగర్–ఘట్కేసర్ మధ్య ఎంఎంటీఎస్ రైళ్లు నడిపే లక్ష్యంతో ఆ ప్రాజెక్టు రెండో దశలో పనులను చేర్చారు. ఘట్కేసర్ నుంచి మౌలాలి మీదుగా మౌలాలి హౌసింగ్‌బోర్డు కాలనీ, ఫిరోజ్‌గూడ, సుచిత్ర కూడలి, నేరెడ్మెట్ మీదుగా 35 కిలోమీటర్ల మేర ఈ మార్గం కొనసాగుతుంది.కీలకమైన ఘట్కేసర్–మౌలాలి మధ్య తాజా గా డబుల్ లేన్ నిర్మించారు. ఇప్పటికే ఆ మార్గంలో డబుల్ లేన్ ఉండగా, దానికి అదనంగా కొత్తగా రెండు వరసల మార్గం అందుబాటులోకి వచ్చింది. దానికి ఎలిక్ట్రిఫికేషన్, ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ అనుసంధానం పూర్తి కావటంతో సాధారణ రైళ్లు నడిపేందుకు రైల్వే సేఫ్టీ కమిషనర్ పచ్చజెండా ఊపటంతో బుధవారం నుంచి రైళ్లను నడుపుతున్నారు. మౌలాలి నుంచి సనత్‌నగర్ వరకు ఎంఎంటీఎస్ మార్గం పూర్తి కావాల్సి ఉన్నందున వాటిని నడిపేందుకు ఇంకా సమయం పట్టనుంది. ఎంఎంటీఎస్ రైళ్ల కోసం నిర్మించిన ఈ కొత్త డబుల్‌లేన్ మీదుగా రైళ్లు దూసుకెళ్లేందుకు కొంతకాలం నిరీక్షించక తప్పని దుస్థితి నెలకొంది. ఘట్కేసర్ నుంచి మౌలాలి వరకు రూపుదిద్దుకున్న కొత్త డబుల్‌లేన్, అక్కడి నుంచి సనత్‌నగర్‌కు మళ్లాల్సి ఉంది. ఆ డైవర్షన్ మౌలాలి హౌసింగ్‌బోర్డు కాలనీ మీదుగా అమ్ముగూడ మార్గంలో ప్రస్తుతం ఉన్న సింగిల్ లేన్‌తో అనుసంధానం కావాల్సి ఉంది. సనత్‌నగర్ మీదుగా సుచిత్ర, రామకృష్ణాపురం, నేరెడ్మెట్ మీదుగా ప్రస్తుతం సాగుతున్న ఆ సింగిల్లేన్ను కేవలం గూడ్సు రైళ్లు నడిపేందుకే పరిమితం చేశారు. దానిని అనుసంధానిస్తూ కొత్తగా డబుల్‌లేన్ రూపొందించాల్సి ఉంది. కానీ మధ్యలో కొంత భాగం రక్షణ శాఖ స్థలాలున్నాయి. వాటిని స్వాధీనం చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఎంతో ఊరట సికింద్రాబాద్–కాజీపేట ప్రధాన మార్గంలో ఉన్న ఘట్కేసర్–మౌలాలి స్టేషన్ల మధ్య అందుబాటులోకి వచ్చిన కొత్త డబుల్ లేన్ ఇప్పుడు రైళ్ల రద్దీతో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ఎంతో ఊరటనివ్వబోతోంది. సికింద్రాబాద్, కాజీపేట, నడికుడి (గుంటూరు), సనత్‌నగర్ (బైపాస్)లను అనుసంధానిస్తుంది. ఈ 12.2 కి.మీ. మేర రెండు వరసలతో ట్రాక్ నిర్మాణానికి రూ.200 కోట్లు ఖర్చయింది. -
మాజీమంత్రి సురేందర్‌రెడ్డి మృతి
ఘట్కేసర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, కొమురెడ్డి సురేందర్‌రెడ్డి ఆదివారం మరణించారు. ఆయన టీడీపీ నుంచి 1985లో ఎమ్మెల్యేగా, 1989లో ఎన్టీఆర్ మంత్రి వర్గంలో అటవీశాఖ, పశు సంవర్థక శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలందించారు. బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా, 2001లో టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా కేసీఆర్‌తో కలిసి పని చేశారు. గ్రామం, నియోజకవర్గంతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన స్వగ్రామం కొర్రెముల్లో సర్పంచ్ ఓరుగంటి వెంకటేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
లెజెండ్ సంగం లక్ష్మీబాయి
సాయుధ పోరాటంతో పాటు స్వాతంత్య్ర సంగ్రామంలో మహిళలను ముందుండి నడిపించిన ధీర వనిత సంగం లక్ష్మీబాయి. సామాజిక సేవకు పూర్తి సమయం వెచ్చించిన మానవతా మూర్తిగా.. బాలికలు, స్త్రీ సంరక్షణకు అలుపెరగక కృషి చేసి ఆత్మబంధువుగా ఆమె గుర్తింపు పొందారు. ఖద్దరు చీర ధరించి వీసమెత్తు బంగారం కూడా సంపాదించకుండా రాజకీయ విలువలను పెంచిన యోధురాలు. సాదాసీదా జీవితాన్ని గడిపి అందరికీ ఆదర్శంగా నిలిచిన ఎస్ఎల్ లక్ష్మీబాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్‌సభకు ఎన్నికైన తొలి మహిళ కావడం విశేషం. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో లక్ష్మీబాయి జన్మించారు. తల్లిదండ్రులు సీతమ్మ, దొంతుల రామయ్య. మొదట్లో పెట్టిన పేరు సత్తెమ్మ. పెళ్లయిన తర్వాత అత్తింటి వారు లక్ష్మీబాయిగా మార్చారు. స్కూల్ రికార్డులో మేనమామ సంగె సీతారామయ్యయాదవ్ ఆమె ఇంటి పేరును సంగం అని రాయించడంతో సంగం లక్ష్మీబాయిగా మారింది. చురుకైన అమ్మాయి కావడంతో మాడపాటి హనుమంతరావు దృష్టిలో పడింది. గుంటూరులోని శారదానికేతన్‌లో చదివించాలన్న ఆయన సలహాతో 1926లో లక్ష్మీబాయిని అక్కడ చేర్పించారు. 1927లో విద్వాన్ పాస్ అయిన ఆమె ఎనిమిదేళ్లు అక్కడే ఉండి హిందీలో సాహితీ, విదూషీ డిగ్రీలు తీసుకున్నారు. ఆ సమయంలోనే స్వాతంత్య్ర సమరం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. మాతృభూమి విముక్తి కోసం తాను సైతం అంటూ ముందుకొచ్చారు. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా ఉద్యమించారు. 1930లో గాంధీ పిలుపునందుకుని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఊరూరా తిరుగుతూ ప్రజల్లో చైతన్యం తెచ్చారు. కల్లు, సారా, విదేశీ వçస్త్ర దుకాణాల ఎదుట సత్యాగ్రహ దీక్షలు చేసి ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యారు. జైలులో ఉండి కూడా ఉద్యమ పంథాను కొనసాగించారు. మహిళల కోసం జైలులో ప్రత్యేక గదులు కట్టాలని పోరాడారు. 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని ఏడాది జైలుశిక్ష అనుభవించారు. 1933లో మద్రాసు వెళ్లన లక్ష్మీబాయి చిత్రకళలో డిప్లొమా పొందారు. ఐదేళ్లు అక్కడే ఉన్న ఆమె 1938లో హైదరాబాద్‌కు వచ్చి గుల్బర్గా బాలికల స్కూల్లో డ్రాయింగ్ టీచర్‌గా చేరారు. ఆ సమయంలోనే నారాయణగూడలోని రాజ్‌బహుదూర్ వెంకట్రాంరెడ్డి ఉమెన్స్ కాలేజీ హాస్టల్‌కు గౌరవ వార్డెన్‌గా వ్యవహరించారు. ఆ తరువాత ఉద్యోగాన్ని వదిలి సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. తెగువ.. సేవ ఆమె సొంతం షహీద్ షోయబుల్లాఖాన్‌ను రజాకార్లు చంపినప్పుడు ఆయన కుటుంబసభ్యులను పలకరించడానికి ప్రజలు భయపడ్డారు. అయినా.. లక్ష్మీబాయి జంకలేదు. షోయబుల్లాఖాన్ ఇంటికెళ్లి అతడి కుటుంబాన్ని ఓదార్చడంతోపాటు ఆదుకున్నారు. దేశంలో హైదరాబాద్ విలీనమైన తర్వాత లక్ష్మీబాయి తన సేవా కార్యక్రమాలను విస్తరించారు. 1950లో భూదానోద్యమ యాత్ర కోసం తెలంగాణకు వచ్చిన ఆచార్య వినోబా బావే ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించారు. ఆయన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు 16 గ్రామాలు తిరిగి 314 ఎకరాల భూమిని సేకరించారు. 1952లో సంతోష్‌నగర్ చౌరస్తాలో రెండెకరాల్లో ఉన్న సొంత ఇంటిలో స్త్రీ సేవాసదన్ను ప్రారంభించారు. ఇప్పుడు దాన్ని ఐఎస్ సదన్ అని పిలుస్తున్నారు. 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బూర్గుల రామకృష్ణారావు కేబినెట్లో డిప్యూటీ విద్యాశాఖ మంత్రిగా 1954 నుంచి 1956 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె హయాంలోనే తెలంగాణ జిల్లాల్లో బాలికల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు ప్రారంభమయ్యాయి. మంత్రిగా సంపాదించిన ప్రతి పైసాను స్త్రీ సేవాసదన్కు ఉపయోగించారు. 1955లో దాన్ని తన సహచరులైన కేవీ రంగారెడ్డి, ఎ.శ్యామలాదేవి, పి.లలితాదేవి, పాశం పాపయ్య, ఎం.భోజ్‌రెడ్డితో కలిసి ఇందిరా సేవాసదన్‌గా రిజిస్టర్ చేయించారు. అనాథ మహిళలు, శిశువులకు ఉచిత విద్యనందించారు. ‘సదన్’లోనే శాశ్వత విశ్రాంతి.. ఆంధ్రప్రదేశ్ సామాజిక, సంక్షేమ సలహా బోర్డు కోశాధికారిగా, హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ మహిళా విభాగం కన్వీనర్‌గా, ఆంధ్ర మహిళా సభ సభ్యురాలిగా, ఏపీ కాంగ్రెస్ కమిటీ అధికారిగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధికారిగా లక్ష్మీబాయి సమర్థవంతంగా పనిచేశారు. మహిళాభ్యుదయం, సమస్యలపై రేడియో, వివిధ వేదికలపై చేసిన ప్రసంగాలు ‘నా అనుభవాలు ’ పేరుతో పుస్తకం వెలువరించారు. స్వాతంత్య్ర సమరయోధురాలిగా గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెకు తామ్రపత్రం ఇచ్చి గౌరవించింది. అయితే ఐఎస్ సదనం సరైన నిర్వహణ లేక మూతపడింది. జీవితం మొత్తం సదనంతో ముడిపడి ఉన్నందున తనను అక్కడే సమాధి చేయాలన్న లక్ష్మీభాయి చివరి కోరిక నెరవేరింది. నెహ్రూ, ఇందిర చేయూతతో.. లక్ష్మీబాయి సేవల గురించి తెలుసుకున్న నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ స్వయంగా వచ్చి సాయం చేశారు. నాటి డిప్యూటీ సీఎం కొండా వెంకటరంగారెడ్డితో పాటు ఇందిరాగాంధీ కూడా సేవా సదనం నిర్వహణకు తోడ్పడ్డారు. రాధికా మెటర్నిటీ హోం, వాసు శిశువిహార్, మాశెట్టి హనుమంతు గుప్త గర్ల్స్ హైస్కూల్ స్థాపనలో లక్ష్మీబాయిదే కీలకపాత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక 1957లో మెదక్ లోక్‌సభ నుంచి పోటీ చేసిన లక్ష్మీబాయి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆపై 1962, 67లోనూ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 14 ఏళ్లు పార్లమెంట్ సభ్యురాలిగా వ్యవహరించారు. 1972లో ఇందిరా సేవాసదనంలో ఈవెనింగ్ కాలేజీగా ఇందిరా ఓరియెంటల్ కాలేజీ నడిపి ఎందరో విద్యార్థులకు బంగారు బాట చూపించారు. 1979లో కేన్సర్‌తో చనిపోయే వరకు బాలికలు, స్త్రీ సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేశారు. -కిషోర్ పెరుమాండ్ల, మెదక్ -
భార్య, శిశువును హత్య : దళిత సంఘాల ఆందోళన
-
అనుమానంతోనే అంతం చేశారు!
ఘట్కేసర్: సుశ్రుత, రమేష్‌ల వివాహం రమేష్ తల్లిదండ్రులకు ఇష్టం లేదని, భార్య గర్భిణి అయిందన్న అనుమానంతోనే హత్య చేశాడని మల్కాజ్గిరి ఇన్చార్జి డీసీపీ దివ్యచరణ్ రావు, ఇన్చార్జి ఏసీపీ శివకుమార్ సోమవారం స్పష్టం చేశారు. సుశ్రుత, నాలుగు నెలల కుమారుడి హత్య వివరాలను ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు. సుశ్రుత గూడూరులో రమేష్ ఇంటి సమీపంలో అద్దెకున్నప్పటి నుంచి ప్రేమలో పడ్డారు. సుశ్రుత దళితురాలుకాగా, రమేష్ పద్మశాలి కులానికి చెందినవాడు. కులాంతర వివాహానికి వీరి పెద్దలు ఒప్పుకోకపోవడంతో పలుమార్లు తగాదాలు జరిగాయి. 2015 నవంబర్‌లో ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా తల్లి దగ్గర ఉంటున్న సుశ్రుతపై రమేష్‌కు గర్భిణి అయిందన్న అనుమానం వచ్చింది. దీంతో కలిసుందామని చెప్పి ఆమె సోదరుడి సాయంతో ఘట్కేసర్కు రప్పించాడు. ఘట్కేసర్ ఓఆర్ఆర్ సమీపంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం నిద్రమాత్రలు మింగే అలవాటున్న సుశ్రుత తనో మాత్ర మింగి కుమారుడికో మాత్రను పాలల్లో కలిపి తాగించింది. వాళ్లు నిద్రమత్తులోకి వెళ్లగానే ద్విచక్ర వాహనంపై కొండాపూర్ ప్రభాకర్ ఎన్‌క్లేవ్‌కు తరలించాడు. రోడ్డుపైనున్న బంక్‌లో పెట్రోల్ కొని సుశ్రుత, కుమారుడిని దహనం చేశాడు. హత్య తర్వాత పాలకుర్తి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన రమేష్‌ను ఘట్కేసర్ పోలీసులు అదుపులోకి తీసుకొని సోమవారం రిమాండ్‌కు తరలించారు. జంట హత్యలపై రమేష్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పాత్ర... పరువు హత్యా? అనేది పూర్తి విచారణలో తేలుతుందని వివరించారు. ఘట్కేసర్ సీసీ రఘువీర్‌రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
నిందితుడి ఇంటి ఎదుటే ఖననం
పాలకుర్తి: ఘట్కేసర్లో అత్యంత పాశవికంగా భార్య, శిశువును హత్య చేసిన నిందితుడు మాచర్ల రమేష్‌ను కఠినంగా శిక్షించాలని కోరుతూ జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని గూడూరులో మృతురాలి బంధువులు, దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. నిందితుడి ఇంటి ఎదుట గొయ్యి తీసి ఘట్కేసర్లోని ఘటనా స్థలం నుంచి తీసుకొచ్చిన చితాభస్మాన్ని ఖననం చేశారు. దహన సంస్కారాలు నిర్వహించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధితులకు మద్దతుగా దళిత సంఘాలు, సుమారు 500 మంది రాస్తారోకో చేపట్టారు. నిందితుడి ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు. కుల వివక్షతోనే కర్కశంగా కాల్చి చంపారని, నిందితుడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. -
ఘట్కేసర్లో డీసీఎం వ్యాన్ మంటలు
-
ట్యాంకర్ బోల్తా...వేల లీటర్ల పాలు వృథా
మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ మండలం ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) వద్ద ఓ పాల ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పాల ట్యాంకర్ డ్రైవర్ వెంకటేశ్వర రావు(40) గాయాలు కావడంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. బోల్తా పడ్డ ట్యాంకర్లో పాలు నిండుగా ఉండటంతో పాలన్నీ వృధాగా పోయాయి. సుమారు పదిహేను వేల లీటర్ల పాలు వృధాగా పోయి ఉంటాయని అంచనా. బోల్తా పడిన ట్యాంకర్ గుంటూరుకు చెందిన శ్రీలక్ష్మి ట్రేడర్స్‌కు చెందిన పాల ట్యాంకర్‌గా గుర్తించారు. మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి నుంచి హైదరాబాద్‌లోని హెరిటేజ్ సంస్థకు పాలను తెస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. -
సంక్రాంతి సంబరాలు @ ఘట్కేసర్
-
బీరులో బల్లి..!
ఘట్కేసర్: బంధువులతో కలసి చల్లగా బీరు తాగుదా మనుకున్న ఓ వ్యక్తికి వింత ఘటన ఎదురైంది. కొను గోలు చేసిన బీరు సీసాలో మృతి చెందిన బల్లి కనిపించ డంతో అవాక్కయ్యాడు . ఈ ఘటన మందు బాబుల్లో కలకలం రేపుతోంది. ఎల్బీ నగర్‌కు చెందిన విక్రమ్‌రెడ్డి గురువారం ఘట్కేసర్లోని బంధువుల ఇంటికి వచ్చా డు. స్థానికంగా ఉన్న ఎన్ఎఫ్సీ నగర్‌లోని టీఎస్‌బీసీఎల్ లిక్కర్ షాపులో ఐదు బీర్లను కొనుగోలు చేశాడు. తాపీగా తాగుదా మని బీర్లను ఒపెన్ చేస్తుండగా అందులోని ఒక సీసాలో మృతి చెందిన బల్లి కని పించింది. ఆందో ళనకు గురైన అతడు వాటిని పక్కన పడేశాడు. ఈ ఘటనపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. -
జీవితంపై విరక్తితో ఆత్మహత్య
ఘట్కేసర్: జీవితంపై విరక్తితో ఓ యువకుడు పెట్రోలు పోసుకొని ఆత్మహత్యచేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన కోటరీ నాగరాజు (32) ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 6న భువనగిరి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరాడు. ఘట్కేసర్ సమీపంలోనికి రాగనే తన సోదరుడు మల్లికార్జున్‌కు ఫోన్‌చేసి తాను పెట్రోలు పోసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సమాచారం అందచేశాడు. అతను సంఘటన స్థలం వచ్చేసరికి నిప్పుపెట్టుకొన్నాడు. వెంటనే 108 అంబులెన్సుకు సమాచారం అందచేశారు. నాగరాజును చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం నాగరాజు మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సెల్ఫీ సరదాతో ఇద్దరు మృతి
ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని అన్నోజిగూడలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ సరదాతో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. తార్నాకలోని నారాయణ జూనియర్ కాలేజ్‌కు చెందిన అవినాష్(16), పీడీఎస్ చరణ్(16)లు స్థానికంగా ఉండే ఓ నీటి గుంత వద్ద సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అదుపుతప్పి ప్రమాదవశాత్తూ నీటిగుంతలో పడిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఘట్కేసర్లో పొంగి పొర్లుతున్న వాగులు
-
‘అనురాగ్’లో జాబ్‌మేళా
ఘట్కేసర్: విద్యతోపాటు ఉద్యోగావకాశాలు కల్పించడానికి ఎంతగానో కృషి చేస్తున్నామని మండలంలోని వెంకటాపూర్ అనురాగ్ విద్యా సంస్థల ప్రిన్సిపాల్ ముత్తారెడ్డి అన్నారు. కళాశాలలో గురువారం నిర్వహించిన జాబ్‌మేళా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులపై ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. పరిశ్రమలకు అవసరయ్యే సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొదించుకోవాలన్నారు. ఆస్మోమిసిస్ సాఫ్ట్వేర్ సంస్థ వారు జాబ్‌మేళాకు హాజరయ్యారు. 430 మంది విద్యార్థులు దీనిలో పాల్గొన్నారు. గ్రూప్ డిస్కషన్, ఆన్లైన్, టెట్నికల్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూల్లో ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేసుకున్నారు. కళాశాల ప్లేస్మెంట్ అధికారి మమత, సాఫ్ట్వేర్ కంపెనీ హెచ్ఆర్ ప్రతినిధులు శ్రీనివాస్, సుబావుద్దీన్, అనురాగ్ విద్యాసంస్థల ఏఓ ప్రదీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జాతీయభావం నింపేందుకే తిరంగాయాత్ర
యాత్రను ప్రారంభించిన కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఘట్కేసర్ టౌన్: యువతలో జాతీయ భావాన్ని నింపడానికే తిరంగాయాత్రను చేపడుతున్నట్లు కేంద్ర ఆహారశుద్ధి, పరిశ్రమల శాఖామంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. బీజేవైఎం మండల అధ్యక్షుడు పసులాది చంద్రశేఖర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాత్రను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డు చౌరస్తాలో తిరంగా జెండాను ఊపి శనివారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన వీరుల గురించి యువతకు తెలియజెప్పడానికి దేశవ్యాప్తంగా తిరంగాయాత్రను చేపడుతున్నామన్నారు. నిజాం నిరంకుశపాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచనదినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గుండ్ల బాల్‌రాజ్ ముదిరాజ్, గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎంపీటీసీ సభ్యుడు బిక్కునాయక్, బీజేపీ జిల్లా కార్యదర్శి రామోజీ, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కంభం లక్ష్మారెడ్డి, ఎదుగని శ్రీరాములు, అచ్చిని రమేష్, ఎంపీటీసీ సభ్యుడు కరుణాకర్, దళిత మోర్చా జిల్లా కార్యదర్శి సగ్గు మోహన్‌రావు, జితేందర్‌రెడ్డి, బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు పాండు, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు అచ్చిని నర్సింహ, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి రాంరతన్ శర్మ, రఘువర్ధన్‌రెడ్డి, స్థానిక శాఖ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి, ఓబీసీ సెల్ అధ్యక్షుడు బాల్‌రాజ్, దళిత మోర్చా మండల అధ్యక్షుడు బుచ్చయ్య, మైనారిటీ సెల్ అధ్యక్షుడు షానూర్ పాషా, విజయ్ ముదిరాజ్, కృష్ణయాదవ్, పిట్టల విజయ్, శివ, అశోక్, అరవింద్, నరేష్ ముదిరాజ్, శ్రవణ్, రమేష్ పాల్గొన్నారు. -
పౌష్టికాహారం.. ఆరోగ్యప్రదాయం
రేపటినుంచి జాతీయ పౌష్టికాహార వారోత్సవాలు మాతా శిశు మరణాలను తగ్గించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1-7వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో జాతీయ పౌష్టికాహార వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం...-ఘట్కేసర్ టౌన్ సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో అవసరం. సమతుల ఆహారాన్ని భుజించిన పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. మన దేశంలో 50 శాతం మంది పిల్లలు పౌష్టికాçహార లోపంతో బాధపడుతున్నారు. పోషకాహార లోపంతో వ్యా«ధి నిరోధక శక్తి తగ్గి శారీరక పెరుగుదల, చురుకుదనం మందగించే పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గర్భిణులు, బాలింతలు, శిశువులకు పౌష్టికాహారం అందకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోందని వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచంలో 40 లక్షల మంది శిశువులు పుట్టిన 28 రోజుల్లో, 30 లక్షల మంది వారం రోజుల్లో మృత్యువాత పడుతున్నారు. దేశంలో వెయ్యికి 39 మంది చనిపోతుండగా రాష్ట్రంలో 40 నవజాత శిశు మరణాలు జరుగుతున్నాయి. ఒక సంవత్సరం లోపు పిల్లలు 54 మంది చనిపోతుంటే అందులో నెల రోజులు నిండక ముందే 40 మంది పిల్లలు ప్రాణాలు విడుస్తున్నారు. 60-80 శాతం నవజాత శిశు మరణాలు తక్కువ బరువుతో జన్మించడం సంభవిస్తున్నాయని ఐసీడీఎస్ సర్వేలు చెబుతున్నాయి. ఆహార ప్రాముఖ్యత... పిల్లలు బలిష్టంగా, ఎత్తు, చురుగ్గా ఉండి పెరగడానికి పోషక విలువలున్న ఆçహారం ఎంతో ముఖ్యం. పోషకాహార లోపం ఉంటే అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. పోషకాహారంలో సమపాళ్లలలో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, విటమిన్స్, మినరల్స్ ఉండడం వల్ల చిన్నారుల పెరుగుదలకు, అభివృద్ధికి తోడ్పడుతాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.. చిన్నారుల్లో పౌష్టికాహార లోపం తలెత్తకుండా ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతోంది. - కంటిచూపు మందగించకుండా అంగన్వాడీ కేంద్రాల ద్వారా శిశువులకు విటమిన్ ఏ మాత్రలను ప్రతి ఆరు నెలలకు ఒకసారి వైద్యసిబ్బంది ద్వారా పంపిణీ చేస్తున్నారు. - బాలింతలు, గర్భిణులు, పిల్లలకు ఐరన్, ఫోలిక్ఆసిడ్ మాత్రలను అందిస్తున్నారు. - 3-6 సంవత్సరాలలోపు చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. - విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు.. - శిశువుకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ముర్రుపాలతో పిల్లల్లో పోషకాహార లోపం, శ్వాసకోశ వ్యాధులు, విరోచనాలు నివారించబడి శిశు మరణాలు తగ్గుతాయి. - 6-12 నెలల వయస్సు పిల్లలకు తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారాన్ని రోజుకు కనీసం మూడుసార్లు అందించాలి. - 12 నెలల నుంచి 2 సంవత్సరాల వయస్సు పిల్లలకు కుటుంబం కోసం తయారు చేసే అన్ని ఆహార పదార్థాలను రోజుకు 5 సార్లు ఇవ్వాలి. - పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్న అవగాహన సదస్సులకు తల్లులు హాజరయ్యేలా చూడాలి. - గర్భిణిలు, బాలింతల ఆహారంలో నిత్యం ఆకుకూరలు, పండ్లు, తృణ ధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలు, పాలు, మాంసకృతులు ఉండే విధంగా చూడాలి. -
అగాధమే.. ఆత్మహత్యకు కారణమా?
* ఒకే కుటుంబంలో నలుగురి బలవన్మరణం ఘటన * సత్యనారాయణ కుటుంబం చాలాకాలంగా బంధువులకు దూరం * మృతదేహాన్ని ఎటు తీసుకెళ్లాలో తెలియక అయోమయం * ఆ సంఘర్షణతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానం ఘట్కేసర్: కుటుంబ పెద్ద మృతదేహన్ని సొంతూరుకు తీసుకెళ్తే ఎదురయ్యే వ్యతిరేకతకు భయపడే నలుగురు ఆత్మహత్య చేసుకొని ఉంటారని మృతుల సమీప బంధువులు తెలిపారు. వరంగల్ జిల్లా మద్దూరు మండలం లద్నూరు గ్రామానికి చెందిన పారుపల్లి సత్యనారాయణ (55) అనారోగ్యంతో మృతి చెందగా.. భార్య మీరా, కూతుళ్లు స్వాతి, నీలిమ, కుమారుడు శివరామకృష్ణ శుక్రవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సత్యనారాయణ ఆదిలాబాద్ జిల్లాలో హౌసింగ్ డీఈగా పనిచేస్తున్నారు. భార్యాపిల్లలు వరంగల్ జిల్లా హన్మకొండలోని టీచర్స్ కాలనీలో ఉంటున్నారు. తల్లిదండ్రులు లద్నూరులోనే నివాసం ఉంటున్నారు. ఆరోగ్యం దెబ్బతినడంతో సత్యనారాయణను చికిత్స నిమిత్తం తరలిస్తుండగా భువనగిరిలో మృతిచెందాడు. అరుుతే మృతదేహాన్ని ఎక్కడికి తీసుకెళ్లి కర్మకాండలు నిర్వహించాలనే సమస్య కుటుంబసభ్యులకు ఎదురైంది. హన్మకొండలో అద్దె ఇంట్లో కర్మకాండలకు ఇంటివారు అనుమతించరు. మీరాకు తల్లిగారింటితోనూ సత్సంబంధాలు లేవు. చాలాకాలంగా సత్యనారాయణ తల్లిదండ్రులకు రాకపోకలు లేవు. ఇన్నేళ్ల తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్తే ఇప్పుడు గుర్తొచ్చామా అంటారు. ఈ వ్యతిరేకతకు భయపడే ఆత్మహత్య చేసుకుని ఉంటారని బంధువులు భావిస్తున్నారు. పరిస్థితుల గురించి తమకు సమాచారం ఇచ్చి ఉంటే తాము ధైర్యం చెప్పే వారమని వారు అంటున్నారు. కుమిలిపోరుు, మానసిక సంఘర్షణతో చావే పరిష్కారమని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు పెళ్లీడుకొచ్చిన పిల్లలకు వివాహాలు కాకపోవడం కూడా ఆందోళనకు కారణమై ఉంటుందన్నారు. కొత్త కారు సంబరం నాలుగు రోజులే.. కొత్త కారు తీసుకొని గత నెల 26న రిజిస్టర్ చేరుుంచారు. నాలుగు రోజులే అందులో తిరిగారు. మృతుని కుమారుడు శివరామకృష్ణ డ్రైవింగ్ చేసేవాడు. గత నెల 29న తండ్రి మృతితో వారు సైతం ఆత్మహత్య చేసుకున్నారు. చివరిసారి నల్లగొండ జిల్లాలో భువనగిరిలోని హోటల్లో భోజనం చేస్తే , ఘట్కేసర్ మండలం అంకుశాపూర్‌లో తుదిశ్వాస వదిలారు. డీఈగా రెండు సంవత్సరాలే.. సత్యనారాయణ హౌసింగ్ బోర్డులో ఏఈగా వరంగల్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాలో పనిచేసి సస్పెండ్‌కు గురయ్యారు. చాలాకాలం విరామం తరువాత డీఈగా ప్రమోషన్ పై ఆసిఫాబాద్‌కు బదిలీపై వెళ్లారు. మద్యానికి బానిసై ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోలేదు. అక్కడ రెండేళ్లే పనిచేసి మృతిచెందారు. ఆరు సెల్ఫోన్లు స్వాధీనం సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యుల మృతదేహాల నుంచి రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ పోలీసులు ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయూ ఫోన్లలోని కాల్ డేటా వెలుగుచూస్తే.. సత్యనారాయణను హైదరాబాద్ తీసుకొచ్చే క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు ఎవరితోనైనా ఫోన్లలో మాట్లాడారా అనేది తెలుస్తుంది. తద్వారా ఆయన కుటుంబం ఆత్మహత్మకు కారణాలు తెలియవ చ్చని భావిస్తున్నారు. -
ఇంటి పెద్ద మరణాన్ని తట్టుకోలేక..
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య - రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ శివార్లలో విషాదం - అనారోగ్యంతో మృతిచెందిన తండ్రి సత్యనారాయణ - మనస్తాపంతో రైలు కింద పడిన భార్య, ముగ్గురు పిల్లలు ఘట్కేసర్ : ఆప్యాయత, అనురాగం, ప్రేమాభిమానాలకు నిలయం ఆ కుటుంబం.. ఒకరి ని విడిచి మరొకరు ఉండలేనంత ప్రేమ వారిది.. అనూహ్యంగా ఆ కుటుంబ పెద్ద మరణించాడు.దాంతో ఆయన భార్యాపిల్లలు తీవ్ర ఆవేదనలో కూరుకుపోయారు. ఆయన లేకుండా తాము జీవించలేమంటూ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం అంకుశాపూర్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. వరంగల్ జిల్లా మద్దూరు మండలం లద్నూరు గ్రామానికి చెందిన పారుపల్లి సత్యనారాయణ (55) ఆ ఇంటి పెద్ద. ఆత్మహత్య చేసుకున్నది ఆయన భార్య మీరా, కుమార్తెలు స్వాతి(33), నీలిమ(28), కుమారుడు శివరామకృష్ణ(22). అనారోగ్యంతో... ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ సమీపంలోని కెరిమెరి మండలంలో హౌసింగ్ డీఈగా సత్యనారాయణ పనిచేస్తున్నారు. భార్యాపిల్లలు హన్మకొండలోని టీచర్స్ కాలనీలో ఉంటున్నా రు. ఆయన పెద్ద కుమార్తె, కుమారుడు బీటెక్ చదవగా.. చిన్న కుమార్తె ఎంటెక్ పూర్తిచేసిం ది.సత్యనారాయణ రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు రోజుల కిందట ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆసిఫాబాద్‌కు వెళ్లిన భార్యాపిల్లలు..మెరుగైన చికిత్స కోసం శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు బయలుదేరారు.మార్గమధ్యంలో రాత్రి 9 గంటల సమయంలో నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలో ఉన్న ఓ హోటల్లో భోజనం చేశారు.ఆ తర్వాత సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. భువనగిరిలోని ఆస్పత్రికి వెళ్లారు. అప్పటికే సత్యనారాయణ మరణించి నట్లు వైద్యులు చెప్పడంతో వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని కారులోనే డ్రైవర్ పక్కసీటులో ఉంచి, సీటు బెల్టు పెట్టి హైదరాబాద్ వైపు బయలుదేరారు. ఘట్కేసర్ మండలం అంకుశాపూర్ వద్ద హెచ్‌పీసీఎల్ డిపో సమీపంలో హైవే నుంచి పక్కగా వెళ్లి కారును ఆపారు. సత్యనారాయణను వదిలి ఉండలేమనే ఆవేదనతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పట్టాలపై భార్యాపిల్లలు... శనివారం వేకువజామున రైల్వే ట్రాక్‌పై మృతదేహాలున్నాయన్న సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నలుగురు ఆత్మహత్యకు పాల్పడడంతో రైల్వే ట్రాక్‌పై శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి భయానక వాతావరణం నెలకొంది. ట్రాక్ సమీపంలోనే పార్క్ చేసివున్న కారులో సత్యనారాయణ మృతదేహాన్ని, ఆస్పత్రి కేస్ షీట్‌ను పోలీసులు గుర్తించారు. కారులో ఫోన్లోని నంబర్ల ఆధారంగా మృతుడి సోదరుడు రవీందర్‌కు సమాచారమిచ్చారు. ఆయన వచ్చి మృతి చెందినవారిని సత్యనారాయణ, మీరా, స్వాతి, నీలిమ, శివరామకృష్ణగా గుర్తించారు. తమ సోదరుడు సత్యనారాయణ కుటుంబం ఎంతో అన్యోన్యంగా ఉండేదని.. ఎక్కడికెళ్లినా కుటుంబ సభ్యులంతా కలిసే వెళ్లేవారని రవీందర్ చెప్పారు. కుమార్తెల పెళ్లి చేసేందుకు పలుసార్లు సంబంధాలు తెచ్చినా సాకులు చెప్పి వద్దనే వారని తెలిపారు. అర్ధరాత్రి దాటిన తరువాత.. సత్యనారాయణ కుటుంబ సభ్యులు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ పెద్ద సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందడంతో తట్టుకోలేక అందరూ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని మల్కాజిగిరి ఏసీపీ రవిచందర్‌రెడ్డి తెలిపారు. అయినా అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. సత్యనారాయణతో పాటు ఆయన భార్య మీరా, కుమార్తెలు స్వాతి, నీలిమ, కుమారుడు శివరామకృష్ణల మృతదేహాలకు శనివారం సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. సత్యనారాయణ తండ్రి ప్రకాశం వారందరికీ తలకొరివి పెట్టడం అందరినీ కలచివేసింది. చాలా కాలంగా దూరమే.. సత్యనారాయణకు ఇద్దరు సోదరులు ఉండగా.. ఆయన భార్య మీరాకు ఓ సోదరుడు, ఇద్దరు సోదరిలు ఉన్నారు. అయినా వారి కుటుంబం ఎవరితోనూ కలిసేది కాదని బంధువులు చెబుతున్నారు. వారికి ఆర్థికంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని.. సత్యనారాయణ మరణించి ఉన్న కారును కూడా ఇటీవలే కొన్నారని పేర్కొన్నారు. కొన్నాళ్ళుగా సత్యనారాయణ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నారని... ఆయనకు నయమైతేనే పిల్లలకు పెళ్లిళ్లు అవుతాయనే భావనలో ఉండేవారని తెలిపారు. -
మట్టి కొట్టుకుపోతున్న ఔటర్
పట్టించుకోని అధికారులు ఆందోళనలో ప్రయాణికులు ఘట్కేసర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఔటర్ రింగ్ రోడ్డు పనులపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. ఫలితంగా పనులు అస్తవ్యస్తంగా కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు వీటిని పరిశీలించాల్సిన వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో నాసిరకంగా జరుగుతున్నాయి. ‘ఔటర్’ పనులు పూర్తి స్థాయిలో అయిపోనేలేదు.. అన్ని రూట్లలో వాహనాలకు అనుమతి ఇవ్వనేలేదు.. కానీ రోడ్డుకు పోసిన మట్టి మాత్రం.. ఇటీవల కురిసిన కొద్ది పాటి వర్షానికే కొట్టుకుపోతోంది. మండలంలోని అన్నోజీగూడ నుంచి ఘనపూర్ వెళ్లే వీయూపీకి ఎడమ పక్కన అవుటర్ రోడ్డుకు పోసిన మట్టి ఇటీవల కురిసిన చిన్న పాటి వర్షానికే కొట్టుకు పోయింది. ఇలాగే వదిలేస్తే.. పెద్ద వర్షాలకు రహదారి పూర్తిగా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ప్రయాణికులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఘట్కేసర్ నుంచి విజయవాడ, శంషాబాద్ వైపు వెళ్లే వాహనాలకు అనుమతి ఇస్తున్నారు. తిరిగి మట్టిని పోసి మరమ్మతులు చేయకపోతే రోడ్డు కుంగిపోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వర్షాకాలం రాకముందే అవసరమైన చోట్లలో మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. ట్రాఫిక్ సమస్య నివారణకు... భారీ వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా నిరోధించి ట్రాఫిక్ సమస్యను నివారించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తోంది. దీంతో ముంబై, రాజీవ్ రహదారి నుంచి వచ్చే వాహనాలు శంషాబాద్, విజయవాడ వెళ్లేందుకు.. వరంగల్ , నల్గొండ నుంచి ముంబై వెళ్లే వాహనాలు కూడా నగరంలోకి ప్రవేశించకుండానే నేరుగా ఆయా జాతీయ రహదారులను చేరుకునే వీలు కలిగింది. పనుల్లో భాగంగా మండల పరిధిలోని కండ్లకోయ, శామీర్‌పేట్, ఘట్కేసర్లో అవుటర్ రింగురోడ్డు సమీపంలో పెద్ద జంక్షన్లు నిర్మిస్తున్నారు. రింగురోడ్డు నుంచి అవతల ఉన్న గ్రామాల ప్రజలు చేరుకోవడానికి.. అవరసరమైన చోట వెహికిల్ అండర్ పాస్ (వీయూపీ)లు నిర్మిస్తున్నారు. మరమ్మతులు చేపట్టాలి చిన్న పాటి వర్షానికే రోడ్డుకు పోసిన మట్టి కొట్టుకుపోతోంది. వెంటనే మరమ్మతులు చేయకపోతే రోడ్డు పూర్తిగా కుంగిపోయే అవకాశం ఉంది. రోడ్డు, వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కోతకుగురైన ప్రదేశంలో మట్టి పోయాలి. - సత్తయ్యగౌడ్, మాజీ ఉప సర్పంచ్, ఘనపూర్ -
బీజేపీ సారధి మనోడే..
రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మణ్ ఎంపికపై మిత్రుల హర్షం ఘట్కేసర్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన నాయకుడే ఎంపికయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కే.లక్ష్మణ్‌ను ఎంపిక చేస్తున్నట్టు ఆ పార్టీ అధిష్టానం శుక్రవారం ప్రకటించింది. ఆయనది స్వస్థలం ఘట్కేసర్. ఇంతకు ముందు వరకు ఉన్న జి.కిషన్‌రెడ్డిది జిల్లాలోని కందుకూరు మండలం తిమ్మాయిపల్లి. ఎమ్మెల్యే కే.లక్ష్మణ్ ఆ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా ప్రస్తుతం కొనసాగుతున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. మొదటిసారి ఎన్నికైనప్పుడు ఆ పార్టీ డిప్యూటీ ప్లోర్‌లీడర్‌గా పనిచేశారు. ఘట్‌కేసర్‌లోనే ప్రాథమిక విద్య ప్రారంభించారు. తర్వాత ఆయన కుటుం బం నగరానికి వెళ్లింది. నగరంలోని సెయింట్ ప్యాన్సిస్ స్కూల్లో హైస్కూల్ విద్య, టాగూర్స్హోమ్ జూనియర్ కళాశాల, న్యూ సైన్స్ కళాశాలలో చదివారు. పీజీ, పీహెచ్డీ ఓయూలో పూర్తి చేశారు. పార్టీ ప్రారంభం నుంచి బీజేపీలోనే కొనసాగుతున్నారు. తల్లిదండ్రులు కోవ రాములు, మంగమ్మకు ఉన్న నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లలో లక్ష్మణ్ రెండో కుమారుడు. లక్ష్మణ్ సోదరుడు దయానంద్ ఘట్కేసర్ ఉపసర్పంచ్‌గా పనిచేశారు. అప్పుడప్పుడు స్థాని కంగా ఉన్న ఇంటికి వచ్చి తన మిత్రులను కలుసుకుంటుంటారు. ఘట్కేసర్కు చెందిన కే.లక్ష్మణ్ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపిక కావడంపై ఆ పార్టీనాయకులు కాలేరు రామోజీ, గుండ్లబాల్రాజు, లక్ష్మారెడ్డి, పలువురు మిత్రులు హర్షం వ్యక్తం చేశారు. -
ఘట్కేసర్లో అగ్నిప్రమాదం
రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం చెంగిచర్ల గ్రామ శివారులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులో ఆదివారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. నగరంలోని ఓ కంపెనీకి చెందిన స్క్రాప్‌కు మంటలు అంటుకోవడంతో.. అగ్ని ప్రమాదం సంభవించింది. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. -
ఆంధ్రా బ్యాంకు ఉన్నతాధికారులపై కేసులు
రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ ఆంధ్రా బ్యాంకు శాఖలో దొంగలు పడి లాకర్లలో సొత్తును కొల్లగొట్టిన కేసులో... బ్యాంకు ఉన్నతాధికారులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆదివారం రాత్రి దొంగలు బ్యాంకు వెనుక నుంచి లోపలికి ప్రవేశించి గ్యాస్ కట్టర్ల సాయంతో లాకర్లు తెరిచి అందులోని బంగారం, ఇతర సొత్తును ఎత్తుకుపోయిన విషయం తెలిసిందే. కాగా, బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం వల్లే చోరీ జరిగినట్టు మండలంలోని బుక్కానిగూడెం గ్రామానికి చెందిన ఆంధ్రా బ్యాంకు ఖాతాదారుడు నరసింహారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నరసింహారెడ్డికి చెందిన లాకర్ నుంచి కూడా దొంగలు 25 తులాల బంగారు ఆభరణాలు పట్టుకుపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆంధ్రా బ్యాంకు చైర్మన్, డీజీఎం, ఏజీఎం, జీఎం, బ్రాంచ్ మేనేజర్ తదితరులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 82 మంది ఖాతాదారులకు చెందిన సుమారు 4 కిలోల 620 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు బ్యాంకు అధికారులు తేల్చారు. ఈ మేరకు ఖాతాదారులకు నోటీసులు ఇవ్వనున్నారు. -
భారీగానే దోచేశారు..
ఘట్కేసర్ ఆంధ్రాబ్యాంకులో చోరీ బంగారం 4.6 కిలోలు ఘట్కేసర్ : బ్యాంకులో దుండగులు భారీగానే చోరీ చేశారు. ఘట్కేసర్ ఆంధ్రాబ్యాంకులో సోమవారం వెలుగుచూసిన ఘటనలో దొంగలు మొత్తం 4.6 కిలోల బంగారం అపహరించుకుపోయారని అధికారులు తేల్చారు. దుండగుల కోసం ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు పోలీసులు తెలిపారు. దుండగులు లాకర్లు కోయడానికి ఉపయోగించిన కట్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రొఫెషనల్స్ చోరీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. బ్యాంకులోని మూడో లాకర్లో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని అధికారులు దాచి ఉంచారు. మొత్తం 82 మంది ఖాతాదారులు రుణాలు తీసుకున్నారని అధికారులు తెలిపారు. సంబంధిత ఖాతాదారులకు నోటీసులను అందజేస్తున్నట్లు తెలిపారు. చోరీ జరిగిన బంగారానికి ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం ఖాతాదారులకు చెల్లిస్తామని బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. తీసుకున్న రుణం.. వడ్డీని మినహాయించి మిగిలిన మొత్తం అందజేస్తామని వివరించారు. అయితే, ఇలాంటి చోరీలు గతంలో వరంగల్, విజయవాడ ప్రాంతాల్లో జరగడంతో ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లాయి. చోరీ జరిగిన విషయం తెలియడంతో కస్టమర్లు మంగళవారం చాలామంది బ్యాంకుకు వచ్చి తమ లాకర్లు క్షేమంగా ఉండడం తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. తాకట్టు పెట్టిన బంగారం మాత్రమే చోరీకి గురైందని అధికారులు వారికి తెలియజేశారు. -
ఘట్కేసర్లో కత్తిపోట్లు.. ఒకరి పరిస్థితి విషమం
ఘట్కేసర్: రంగారెడ్డి జిల్లాలో ఆస్తి తగాదాలు తీవ్ర ఘర్షణకు దారితీశాయి. ఘట్కేసర్లోని మైసమ్మగుట్ట వద్ద ఆదివారం రాత్రి జరిగిన గొడవల్లో పలువురు గాయపడ్డారు. రెండు కుటుంబాల మధ్య తలెత్తిన ఆస్తి తగాదాలు ఒక్క కుటుంబంపై మరో కుటుంబం కత్తులతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో నలుగురికి కత్తిపోట్లు తగిలాయి. ఈ ఘటనలో గాయపడిన సంజీవ్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లిఫ్ట్ పేరుతో దోచేస్తున్నాడు..
లిఫ్టు ఇస్తానంటూ మహిళలను మోసగించి... దోపిడీకి పాల్పడుతున్న ఘరానా మోసగాడిని నార్త్‌జోన్ పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. నార్త్‌జోన్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి గురువారం వెల్లడించిన వివరాలివీ.. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం నారపల్లికి చెందిన నిందితుడు హుస్సేన్ ఖాన్(40) బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హాస్పిటళ్ల వద్ద నిలుచుని ఉండే ఒంటరి మహిళలతో మాటలు కలిపి, లిఫ్ట్ ఇస్తానని చెప్పి తన వాహనంపై నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళతాడు. అక్కడ వారిని భయపెట్టి బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్తాడు. ఇలా ఏడాది కాలంలోనే హుస్సేన్ ఆరు దోపీడీలకు పాల్పడ్డాడు. ఇతడిపై కన్నేసిన పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి పది తులాల బంగారం, 6 తులాల వెండి, ఆల్టో కారు, హోండా యాక్టివా బైకు సహా మొత్తం రూ.7లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. -
ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య
ఘట్కేసర్ (రంగారెడ్డి) : అన్నదమ్ముల మధ్య చెలరేగిన ఆస్తి తగాదాలతో మనస్తాపానికి గురైన వ్యక్తి తన పిల్లలకు విషం ఇచ్చి తను కూడా తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం అవుశాపూర్ గ్రామంలో సోమవారం వెలుగు చూసింది. స్థానికంగా హోటల్ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్న కృష్ణా రెడ్డి(45).. సోదరులతో గత కొన్ని రోజులుగా ఆస్తి విషయంలో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురై పదేళ్ల లోపు ఉన్న ఇద్దరు పిల్లలకు పురుగుల మందు ఇచ్చి, తను కూడా తాగి మృతిచెందాడు. సమాచారం అందుకున్న బీబీ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డుప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి
ఘట్కేసర్ (రంగారెడ్డి) : వేగంగా వస్తున్న డీసీఎం.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో బైక్ పై ఉన్న ఒక విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం జోడిమెట్ల వద్ద సోమవారం చోటుచేసుకుంది. స్థానిక వీబీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న కె. సందీప్(22) స్నేహితుడు సాయి కిరణ్‌తో కలిసి హోండా యాక్టీవాపై కళాశాలకు వెళ్లి వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనం ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న సందీప్ అక్కడికక్కడే మృతిచెందగా.. సాయి కిరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ: వ్యక్తి మృతి
ఘట్కేసర్: రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం అన్నోజీగూడ బ్రిడ్జి వద్ద బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న మహబూబ్ బాషా(30) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. బస్సు యాదగిరిగుట్ట డిపోకు చెందినదిగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
200 లీటర్ల కల్లు స్వాధీనం
ఘట్కేసర్ (రంగారెడ్డి జిల్లా) : పెద్ద మొత్తంలో కల్లును రవాణా చేస్తుండగా రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. నాగరాజు అనే వ్యక్తి 200 లీటర్ల కల్లును ఆటోలో తరలిస్తుండగా సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. నాగరాజును అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా కల్లును రవాణా చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
బస్సు బోల్తా : 10 మందికి గాయాలు
రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం ఓఆర్ఆర్ వద్ద శనివారం బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘పాల’కూట విషం
పసిపిల్లలకు పాలు దివ్య ఔషధం అంటారు.. చిన్నారులు ఇష్టంగా తాగే పాలను అమృతంతో సమానంగా భావిస్తారు. అలాంటి వాటిని అక్రమార్కులు ‘పాల’కూట విషంగా మార్చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో పా‘పాల’ భైరవులు పెరిగిపోతున్నారు. రసాయనాలు, నూనె, పాల పౌడర్, యూరియాతో కృత్రిమపాలను సృష్టిస్తూ విషతుల్యంగా మార్చేస్తున్నారు. నిర్భయంగా వాటిని ప్రజలకు అంటగడుతూ ఆస్పత్రుల ‘పాలు’ చేస్తున్నారు. తమస్వార్థ ప్రయోజనాలకోసం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. పాలలో నురగ, చిక్కదనం పెరిగేందుకు యూరియా నీళ్లను కలుపుతున్నట్లు బయటపడడం కలకలం సృష్టిస్తోంది. - ఘట్కేసర్ టౌన్/ ఘట్కేసర్ గతంలో పాడి సంపద విస్తారంగా ఉండేది. ఇంటిల్లిపాది పెరుగు, పాలను తీసుకునేవారు. అకాల వర్షాలు, కరువు కాటకాలు రావడంతో పశువులను సాకలేక కబేళాలకు తరలిస్తున్నారు. డిమాండ్‌కు తగిన పాలు లభించకపోవడం అక్రమార్కులకు కలిసివచ్చింది. కల్తీపాల దం దాకు తెరలేపారు. గుట్టుగా తమ వ్యాపారం సాగించడానికి ఊరికి దూరంగా ఉన్న భవనాలు, అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు, వ్యవసాయ బావులను ఎంచుకుంటున్నారు. ఆటోల్లో తరలింపు.. ఇలా తయారు చేసిన పాలను స్థానికంగా విక్రయిస్తే అనుమానిస్తారని గుట్టుచప్పుడుగా ఆటోల్లో నగరానికి తరలిస్తారు. పెద్దపెద్ద హోటళ్లు, బేకరీలు, మిఠాయి షాపులకు విక్రయిస్తుంటారు. అసలు పాలు లీటర్‌కు రూ. 50 నుంచి రూ.70 ఉండగా వీటిని రూ.40కే విక్రయిస్తుంటారు. ఇలా ఆవులు, గేదెలు లేకుండానే పాలను సృష్టిస్తూ తక్కువ పెట్టుబడితో, ఎక్కువ లాభాలు గడిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఆరోగ్య సమస్యలు... వీటిని తాగినవారు తీవ్రమైన జీర్ణకోశవ్యాధుల బారినపడుతున్నారు. కడుపునొప్పి, డయేరియా వ్యాధులతో బాధపడుతున్నారు. ఇలాంటి పాలు తాగిన చిన్నారుల మెదడుపై దుష్ర్పభావం పడుతుంది. బాల్యంలోనే స్థూలకాయం, మందబుద్ధి ఏర్పడతాయి. యూరియా ఆనవాళ్లున్న పాలను తాగినవారికి కంటిచూపు దెబ్బతినే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గర్భిణుల్లో మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. ఊపిరితిత్తులు, పేగులు, కిడ్నీ, క్యాన్సర్, కాలేయ సమస్యలు వస్తాయి. కరువైన నిఘా.. అడపాదడపా అధికారులు కల్తీ పాల తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి కేసులు బనాయించినా బెయిల్ తెచ్చుకొని యథేచ్ఛగా తిరిగి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. చట్టాల్లోని లొసుగులను ఆసరా చేసుకొని ధనార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. మండలంలోని అంకుశాపూర్, ఏదులబాద్ గ్రామాల్లో రెండు సార్లు కల్తీపాల తయారీ కేంద్రాల గుట్టురట్టయింది. ఆ రెం డు సంఘటనల్లో నిందితుడు ఒకడే కావడం గమనార్హం. తయారీ ఇలా... 10 లీటర్ల పాలు తయారు చేయడానికి కిలో పాల పౌడర్, లీటరు నూనె, 40 శాతం యూరియా, 10శాతం సర్ఫ్ వాడతారు. అందులో అవసరమైన నీళ్లను పోస్తారు. ఆ తర్వాత వాటిని కర్ర సాయంతో బాగా కలుపుతారు. అవసరమైతే మిక్సీని వాడతారు. బాగా కలిసిన తర్వాత వాటికి స్వచ్ఛమైన కొన్ని పాలు కలుపుతారు. పాలలో వెన్న శాతాన్ని సరిచూస్తారు. దానిని బట్టి నూనె కలపాల్సిన పరిమాణాన్ని పెంచుతూ, తగ్గిస్తూ ఉంటారు. తెల్లదనం నురగ, పొంగు రావడానికి యూరియా, సర్ఫ్ కలుపుతారు. సాధారణ పాలు, కల్తీపాలకు ఏ మాత్రం తేడా కనిపించకుండా చూస్తారు. ఇలా సొమ్ము చేసుకుంటూ.. కిలో పాల పౌడరుకు రూ.150, నూనె ప్యాకెటుకు రూ.80, యూరియాకు రూ.12, సర్ఫ్‌కు రూ.4 ఖర్చు చేస్తారు. 10 లీటర్లపాల తయారీకి దాదాపు రూ.250 ఖర్చవుతుంది. లీటరు పాలను రూ.45 నుంచి రూ.50 వరకు విక్రయిస్తారు. 10 లీటర్ల పాలు విక్రయిస్తే రూ.450 నుంచి రూ.500 వరకు వస్తాయి. ఖర్చులు పోను 10లీటర్లకు రూ.200 నుంచి రూ.250 వరకు సంపాదిస్తారు. ఇలా రోజుకు 400 నుంచి 500 లీటర్ల పాలను సరఫరా చేస్తారు. ఈ చొప్పున రోజుకు రూ.8వేల నుంచి రూ.10వేల వరకు అక్రమార్జన చేస్తున్నారు. కల్తీ పాలతో తీవ్ర అనారోగ్యం .. కల్తీ పాలతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపై సత్వర ప్రభావం కనిపిస్తుంది. జీర్ణసంబంధ వ్యాధులు, కాలేయం, హెపటైటిస్ బీ వంటి వ్యాధుల సోకే అవకాశం ఉంది. ఇతర అవయవాలు దెబ్బతీనే ప్రమాదం ఉంది. పాలను తీసుకునే ముందు ఎక్కడి నుంచి తెస్తున్నారనేది గమనించాలి. -డాక్టర్ సతీష్, ప్రాథమిక వైద్య కేంద్రం, ఘట్కేసర్ -
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
ఘట్కేసర్ (రంగారెడ్డి) : అనారోగ్యంతో ఓ విద్యార్థి బలవన్మరణం చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జిల్లాలోని ఘట్కేసర్ మండల కేంద్రంలోని బాలాజీ నగర్లో నివాసముండే కందుకూరి ఉపేంద్ర సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. అయితే శుక్రవారం అనారోగ్యంగా ఉందంటూ కాలేజీకి వెళ్లలేదు. రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిది ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంగా పోలీసులు నిర్ధారించారు. -
ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా
ఘట్కేసర్ టౌన్ (హైదరాబాద్) : ఔటర్ రింగ్‌రోడ్డుపై ఫార్చ్యూనర్ కారు బోల్తా పడడంతో ఓ టీడీపీ నాయకుడు మృతి చెందగా, మరో ఇద్దరు టీడీపీ నాయకులు గాయాలతో చికిత్స పొందుతున్నారు. మేడ్చల్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ తోటకూర జంగయ్య యాదవ్, ఘట్కేసర్ మాజీ ఎంపీపీ యాతకుమార్, ఘట్కేసర్ మండల టీడీపీ కార్యదర్శి మీసాల కృష్ణలు కారులో హైదరాబాద్ నుంచి ఘట్కేసర్ వైపు వెళుతుండగా మంగళవారం సాయంత్రం కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురికీ గాయాలు కాగా కామినేని ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ యాతకుమార్ మృతి చెందారు. -
ఆసుపత్రిలో బంగారు గొలుసు చోరీ
ఘట్కేసర్ (రంగారెడ్డి) : గుర్తుతెలియని దుండగులు మహిళ నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును చోరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం పిలాయిపల్లి గ్రామానికి చెందిన రాజమణి(65) కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది రెండు రోజుల క్రితం గుర్తుతెలియని విషం తాగింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఘటకేసర్లోని కమ్యూనిటీ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటుంది. కాగా మండలంలోని ఘణాపూర్కు చెందిన ఆమె కూతురు మాధవీ ఆదివారం రాత్రి అటెండర్‌గా తల్లి మంచం పక్కన పడుకుంది. మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసును పర్సులో దాచింది. అయితే ఉదయం లేచి చూసి సరికే పర్సు కనిపించలేదు. దీంతో పాటు పక్కన మంచం మీద చికిత్స పొందుతున్న యువకుడు కనిపించకుండాపోయాడు. ఆ యువకుడే చోరీ చేసి ఉండివచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఘట్కేసర్ ఆర్వోబీకి మోక్షం!
- బ్రిడ్జి నిర్మాణానికి రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ - యుద్ధప్రాతిపదికన స్టీల్ గర్డర్స్ ఏర్పాటు - రైల్వే, ఓఆర్ఆర్ అధికారుల పర్యవేక్షణలో పనులు సాక్షి, హైదరాబాద్ : ఔటర్ రింగ్‌రోడ్డులోని ఘట్కేసర్ వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)కి ఎట్టకేలకు మోక్షం లభించింది. రైల్వే శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఓఆర్ఆర్ ప్రాజెక్టు అధికారులు బుధవారం నుంచి యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించారు. ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణంలో భాగంగా ఘట్కేసర్ వద్ద రైల్వే ట్రాక్ పైనుంచి సుమారు 45 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పుతో ఆర్వోబీ నిర్మించాల్సి ఉంది. రూ.25కోట్ల వ్యయంతో తలపెట్టిన ఆర్వోబీ నిర్మాణంలో భాగంగా స్టీల్ గర్డర్స్ ఏర్పాటుకు వారానికి 3రోజులు చొప్పున రోజుకు 2గంటలు అంటే... సాయంత్రం 2గంటల నుంచి 4గంటల మధ్యలోనే రైల్వే ట్రాక్‌పై పనులు నిర్వహించుకునేందుకు ైరె ల్వే శాఖ అనుమతిచ్చింది. ప్రత్యేకించి సోమ, బుధ, శుక్రవారాల్లో మాత్రమే ఆర్వోబీ పనులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇందుకు అనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేసుకున్న ఓఆర్ఆర్ ప్రాజెక్టు అధికారులు బుధవారం నుంచి పనులు ప్రారంభించారు. 3 భారీ క్రెయిన్లు, 35 మంది వర్కర్స్‌తో ఆగమేఘాలపై గ ర్డర్స్ను ఏర్పాటు చేస్తున్నారు. 42మీటర్ల పొడవు, 50 టన్నుల బరువుండే భారీ గర్డర్స్‌ను రోజుకు 2-4వరకు ఏర్పాట్లు చేయాలన్న లక్ష్యంతో ఓఆర్ఆర్ సీజీఎం ఆనంద్‌మోహన్ ప్రత్యక్షంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. అయితే... రైళ్ల రాకపోకల ఫ్రీక్వెన్సీ అధికంగా ఉండే ఈ మార్గంలో ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రోజుకు 2-3 గర్డర్స్ చొప్పున ఏర్పాటు చేసే విధంగా పనులు చేపట్టారు. మొత్తం 16 గర్డర్స్‌ను 2వారాల్లోగా ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పనులకు కౌంట్ డౌన్ మొదలైంది. తొలిరోజున క్రేన్లు, వర్కర్స్ సహకారంతో నిర్దేశిత 2 గంటల వ్యవధిలో 2 గర్డర్స్‌ను ఏర్పాటు చేసి రికార్డును సృష్టించారు. ఓఆర్ఆర్ సీజీఎం ప్రత్యక్ష పర్యవేక్షణలో లక్ష్యాల మేరకు గర్డర్స్‌ను పైకి ఎక్కించగలిగినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. వడివడిగా పనులు రైల్వే పోర్షన్లో కాంపోజిట్ స్ట్రక్చర్ (స్టీల్ గర్డర్స్-కాంక్రీట్ స్లాబ్)ను డిజైన్ చేసిన అధికారులు మెయిన్ క్యారేజ్‌లో ఒక్కో వైపు 8 చొప్పున మొత్తం 16 బీమ్‌లను ప్లాన్ చేశారు. రైల్వే శాఖ ఇచ్చిన 2గంటల వ్యవధిలోనే పనులు వేగంగా నిర్వహించేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్మాణాన్ని నిర్దేశిత సమయం ఎలా పూర్తిచేస్తాం..? ఇందుకు వినియోగించే టెక్నాలజీ, పట్టే సమయం వంటి వివరాలన్నింటినీ ఇప్పటికే రైల్వే ఇంజనీరింగ్ విభాగానికి అందజేశారు. అయితే... రైళ్ల రాకపోకలు అధికంగా ఉండే ఈ మార్గంలో ఎలాంటి అవాంతరాలు ఎదురవకుండా రైల్వే ఇంజనీరింగ్ అధికారులు సైతం సైట్లో మోహరించి పనుల తీరును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. స్టీల్ గర్డర్స్ ఏర్పాటు పూర్తయ్యాక వాటి మధ్యలో కంపోజిట్ స్ట్రక్చర్(స్లాబ్) నిర్మించాల్సి ఉంటుంది. ఈ పనులన్నింటినీ వచ్చే 3 నెలల్లో పూర్తిచేయాలన్న లక్ష్యంతో వడివడిగా పనులు నిర్వహిస్తున్నారు. అయితే... ఆర్వోబీ నిర్మాణం విషయంలో పక్కాగా ప్రమాణాలను పాటిస్తూ నాణ్యతపై రాజీ పడకుండా అటు రైల్వే, ఇటు ఓఆర్ఆర్ అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఆర్వోబీ నిర్మాణంలో రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలుగకుండా పనులు నిర్వహించేందుకు పకడ్బందీ ప్రణాళికను రూపొందించినట్లు ఓఆర్ఆర్ సీజీఎం ఆనంద్‌మోహన్ ‘సాక్షి’కి తెలిపారు. కీలకమైన గర్డర్స్ ఏర్పాటు పూర్తయితే కాంక్రీట్ స్లాబ్ పనులను వెంటనే చేపట్టేందుకు పక్కాగా ఏర్పాటు చేశామన్నారు. కీలకమైన ఈ ఆర్వోబీ నిర్మాణం పూర్తయితే ముంబయ్ నుంచి వచ్చే వాహనాలు నేరుగా వరంగల్, విజయవాడ హైవేలకు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది. -
రెండు లారీలు ఢీ: ఒకరి మృతి
ఘట్కేసర్: ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కీసర నుంచి ఘట్కేసర్ వెళ్తున్న ఇటుక లారీ ఘట్కేసర్ నుంచి కీసర వస్తున్న మరో లారీని కొండాపూర్ గ్రామ సమీపంలో ఢీకొట్టింది. దీంతో ఇటుక లారీ డ్రైవర్ వెంకటయ్య(34) మృతిచెందాడు. కాగా మరోలారీ డ్రైవర్, క్లీనర్లకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సర్పంచ్ సస్పెన్షన్‌తో ఉపసర్పంచ్‌కు బాధ్యతలు
రంగారెడ్డి: అవినీతి ఆరోపణల నేపథ్యంలో సర్పంచ్‌గా ఎన్నికైన వ్యక్తి పదవీని కోల్పవడంతో ఉప సర్పంచ్...సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఘట్ కేసర్ సర్పంచ్‌గా ఎన్నికైన లక్ష్మయ్య అవినీతి ఆరోపణలతో పదవిని కోల్పోయారు. దీంతో ఉప సర్పంచ్ బండారు శైలజ, సర్పంచ్‌గా గురువారం బాధ్యతలు చేపట్టారు. -
డీసీఎం కిందపడి వ్యక్తి మృతి
ఘట్కేసర్: రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ వద్ద బైక్ పై వెళ్తున్న రాములు అలియాస్ అబ్రహం(45) అనే వ్యక్తి అదుపు తప్పి డీసీఎం కిందపడటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శనివారం ఘట్కేసర్ రైల్వే గేట్ సమీపంలోజరిగింది. కొండాపూర్‌కు చెందిన అబ్రహం ప్లంబర్ వర్క్స్ చేస్తుంటాడు. అదే పనుల నిమిత్తం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
పోకిరీల వేధింపులతో మహిళ ఆత్మహత్య
-
పోకిరీల వేధింపులతో మహిళ ఆత్మహత్య
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో దారుణం చోటు చేసుకుంది. ఆకతాయిల వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఉపాధి కోసం రాజస్థాన్ రాష్ట్రం నుంచి నగరానికి సదరు మహిళ కుటుంబం తరలి వచ్చింది. ఆ క్రమంలో ఆ కుటుంబం ఘట్కేసర్ లో స్థిరపడింది. అయితే ఆ మహిళను గత కొంతకాలంగా ఆకతాయిలు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. దాంతో ఆమె తీవ్ర కలత చెంది... శుక్రవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
నకిలీని కనిపెట్టండిలా..!
ఘట్కేసర్: ఇటీవల నకిలీ నోట్ల చెలామణి విస్తృతమైంది. ముఖ్యంగా వెయ్యి రూపాయల నోట్లను చూస్తేనే జనాలు వణికిపోతున్నారు. ఆ నోటు అసలుదా లేక నకిలీదా అన్న విషయం తేల్చలేక ఆందోళన చెందుతున్నారు. అయితే మన చేతిలో ఉంది.. నకిలీ నోటా లేక అసలుదా అని కనిపెట్టడానికి ఉపయోగపడే కొన్ని గుర్తులపై కథనం.. ఎడమ వైపున మధ్యలో 1000 సంఖ్యలో ప్రతి అక్షరం సగం కనిపించి సగం కనిపించకుండా ఉంటుంది. వెలుతురులో చూస్తే పూర్తిగా కనిపిస్తుంది. దాని పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో గాంధీజీ బొమ్మ వాటర్మార్కుతో పూర్తిగా కనిపిస్తుంది. వాటర్ మార్కుకు పక్కన 1000 సంఖ్య నిలువుగా కనిపిస్తుంది. దీన్ని కూడ వెలుతురుకు పెట్టి చూడాలి. నోటును పైకి కిందికి అంటుంటే మధ్యలో ఉన్న 1000 సంఖ్య రంగు మారుతూ కనిపిస్తుంది. గ్రీన్, బ్లూ రంగుల్లో 1000 సంఖ్య కనిపిస్తుంది. కుడివైపున పైన ఉన్న, ఎడమ వైపున కింద ఉన్న సిరీస్ నంబర్ వెలుతురులో చూస్తే ప్రత్యేకంగా కనిపిస్తుంది. మధ్యలో ఉన్న (థ్రెడ్) దారంపై భారత్, ఆర్బీఐ, 1000 అక్షరాలు కనిపిస్తాయి.నోటును పైకి కిందికి అంటుంటే మధ్యలో దారం బ్లూ,గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. దానికింద ఉన్న ఇంగ్లీషు అక్షరాలు, అలాగే నోటుకు పైన, మధ్యలో ఉన్న హిందీ, ఇంగ్లీషు అక్షరాలు ముట్టకుంటే చేతికి తగిలిన భావన కలుగుతుంది. నోటుకు కుడివైపున చివరన 1000 సంఖ్యకు, రిజర్వు బ్యాంకు ముద్రకు మధ్యలో లేటెంట్ ఇమేజ్ ఉంటుంది. దీన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే కనిపిస్తుంది. నోటును దగ్గరగా పెట్టుకొని చూస్తేనే కనిపిస్తుంది. ఇమేజ్ ఎడమవైపున, గాంధీజీ ఫొటోకు మధ్యలో ఉన్నఖాళీలో సూక్ష్మపరిశీలన చేస్తే ఆర్బీఐ, 1000 అక్షరాలు కనిపిస్తాయి. ఎడమ వైపు చివర మధ్యలో డైమండ్ ఆకారంలో గుర్తు ఉంటుంది. దీన్ని చేతితో తడిమితే తగిలిన భావన కలుగుతుంది. నోటు వెనుక వైపు మధ్యలో సంవత్సరం ముద్రించి ఉంటుంది. రూ. 10 నోటుకు ఏడు అంశాలు పరిశీలించాలి. పైన పేర్కొన్న వాటిలో స్పెషల్ ఐడెంటిఫికేషన్ మార్కు, లెటెంట్ ఇమేజ్ ఉండదు. అక్షరాలు చేతితో తడిమితే ఎలాంటి భావన కలుగదు. మిగిలిన అంశాలన్ని పైన చెప్పిన విధంగానే ఉంటాయి. {పతి నోటుకు ఎడమవైపు చివరన గుర్తులు మారుతుంటాయి. రూ.1000 డైమండ్, రూ.500లకు రౌండ్ చుక్క, రూ.100కు త్రిభుజం, రూ.50కి బ్లాక్ గుర్తు, రూ.20 రెక్టాంగిల్ గుర్తు, రూ.10కి ఎలాంటి గుర్తు ఉండదు. -
ప్రపంచం చూపంతా భారత్ వైపే
ఘట్కేసర్ టౌన్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచమంతా భారతదేశం వైపే చూస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక బస్ టెర్మినల్ ఆవరణలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం హయాంలో జరగని ఆర్థిక అభివృద్ధి నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయిన తర్వాతే జరుగుతోందన్నారు. నేను భారతీయుడనని ప్రతి ఒక్కరూ ప్రపంచంలో తలెత్తుకునే స్థాయికి నేడు దేశం చేరుకుందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన ఘనత నరేంద్రమోదీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్రం నిధులను నేరుగా కేటాయిస్తోందన్నారు. సభ్యత్వ నమోదులోఅన్ని మతాల ప్రజలకు భాగస్వాములను చేయాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని, పార్టీ సభ్యత్వ నమోదులో యువతకు పెద్దఎత్తున భాగస్వామ్యం కల్పించాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో నవంబర్ 30న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు బిక్కునాయక్, కరుణాకర్, రైతు సేవా సహకార సంఘం వైస్ చైర్మన్ ఎలిమినేటి శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ సభ్యత్వ నమోదు మండల ప్రముఖ్ గుండ్ల బాల్‌రాజ్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రామోజీ, జిల్లా కార్యవర్గ సభ్యుడు కంభం లక్ష్మారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మహిపాల్‌రెడ్డి, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు రజని, సభ్యురాలు సుధారాణి పాల్గొన్నారు. -
ఘట్కేసర్లో దోపిడీ దొంగలు బీభత్సం
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఎన్ఎస్సీ నగర్ వద్ద దారికాచిన దుండగలు అటుగా వస్తున్న దంపతులను చితకబాది వారి వద్ద నుంచి అందినకాడికి దోచుకున్నారు. దంపతుల వద్ద నుంచి 7 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.15వేల నగదు, బైక్ అపహరించుకు వెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
104 వైద్య సిబ్బందికి వేతనాలేవీ..?
ఘట్కేసర్ టౌన్: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందించడానికి ప్రవేశపెట్టిన ‘104’ పథకం నీరుగారుతోంది. ఈ పథకానికి నిధుల సమస్య ఎదురవడంతో గ్రామీణులకు తగిన వైద్య సేవ లు అందడం లేదు. కనీసం ‘104’ వాహనాల్లో పనిచేసే సిబ్బం దికి వేతనాలు కూడా రావడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందించే ‘104’ వాహనంలో ఓ డ్రైవర్, ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నిషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిన నియమించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాలకు వెళ్లి నిర్ణీత సమయంలో పేదలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేయడం వీరి విధి. జిల్లాలో 17 క్లస్టర్లు ద్వారా గ్రామీణా ప్రజలకు ‘104’ వాహనాలు నిత్యం సేవలందిస్తున్నాయి. నిలిచిన వేతనాలు... వైఎస్ఆర్ మరణాంతరం ఈ పథకం నిర్లక్ష్యానికి గురైంది.ప్రభుత్వం ఈ పథకానికి తగిన నిధులు సమకూర్చకపోవడంతో గ్రామీణులకు వైద్య సేవలు అందడం లేదు. అంతేకాకుండా ఈ పథకంలో పనిచేసే సిబ్బందికి నాలుగు నెలలుగా వేతనాలు కూడా అందడం లేదు. మే, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల వేతనాలు ఇప్పటికీ అందకపోవడంతో ‘104’ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని సిబ్బంది పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. వేతనాలకు తోడు రోజు వారీగా చెల్లించే అలవెన్సులు కూడా నిలిచిపోయాయి. వేతనం చెల్లించే సమయంలోనే ప్రతి నెలా డీఏను కూడ చెల్లించేవారు. అయితే డీఏ చెల్లింపులకూ ప్రభుత్వం మొండిచేయి చూపడంతో ఆరు నెలలుగా అవి వారికి అంద డం లేదు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి వేతనాలను అందజేయాలని కోరుతున్నారు. ఈ విషయమై సీనియర్ ప్రజా ఆరోగ్య అధికారి నారాయాణరావ్ మాట్లాడుతూ.. ‘104’ సిబ్బంది వేతనాలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేదని చెప్పారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలకాగానే సిబ్బందికి వేతనాలు అందిస్తామని తెలిపారు. -
సమగ్ర కుటుంబ సర్వే పత్రాలు గల్లంతు
ఘట్కేసర్: మండలంలో సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్) పత్రాలు గల్లంతయ్యాయి. మండలవ్యాప్తంగా 12 వేల మంది పింఛన్ కోసం దరఖాస్తుచేసుకోగా వాటిలో అధిక భాగం పరిశీలన పూర్తయింది. వీటిలో 1,158 సర్వే పత్రాలు మిస్సయినట్లు అధికారులు కనుగొన్నారు. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నవారి పత్రాలను కంప్యూటర్లో ఫీడ్ చేయాలనే నిబంధన విధించడంతో పత్రాలు గల్లంతైన విషయం వెలుగుచూసింది. ఇప్పటివకూ మండలంలో అవుశాపూర్‌లో 187 మందికి, కొండాపూర్‌లో 132 మందికి మాత్రమే పింఛన్లు అందజేశారు. మిగితా గ్రామాల్లో పింఛన్ల కోసం లబ్ధిదారులు ప్రతి రోజు పంచాయతీ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. లబ్ధిదారుల పేర్లు కంప్యూటర్లో ఫీడ్ కాలేదని, అందుకే ఆలస్యమవుతోందని అధికారుల నుంచి సమాధానం వస్తోంది. సమగ్ర కుటుంబ సర్వే ఒకేరోజు నిర్వహించడం, సర్వే పూర్తి కాగానే వాటిని కంప్యూటర్లో ఫీడ్ చేయించే పని వేగంగా చేయడం, అందుకు విద్యార్థులను ఉపయోగించడం, వారికి సరైన అవగాహన కల్పించడంలో అధికారులు శ్రద్ధ చూపకపోవడం వల్లే పత్రాలు గల్లంతై ఉండవచ్చని భావిస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే పత్రాలు లేని కుటుంబాల నుంచి పింఛను కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మొదటి విడతలో పింఛన్ ఇవ్వలేమని అధికారులు చెబుతున్నారు. వారిని రెండో విడతలో ఎంపిక చేసి అందజేస్తామంటున్నారు. దీంతో ఒక నెల పింఛన్ అందకుండా పోతుందని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. తమకు మొదటి విడతలో పింఛన్ అందేలా చూడాలని కోరుతున్నారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా జాప్యం జరుగుతోందని, రెండు మూడు రోజుల్లో పింఛన్లు పంపిణీ చేసే తేదీ ప్రకటిస్తామని అధికారులు అంటున్నారు. -
‘ఫాస్ట్’ను పక్కన పెట్టేశారు..!
ఘట్కేసర్ టౌన్: ‘ఫాస్ట్’ పథకంలో భాగంగా విద్యార్థులు చేసుకున్న దరఖాస్తుల పరిశీలన నేటికీ ప్రారంభం కాలేదు. ఫైనాన్స్ అసిస్టెన్స్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ (ఫాస్ట్) కార్యక్రమంలో భా గంగా విద్యార్థులకు అవసరమైన కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దార్ కార్యలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు సూచించింది. మం డలంలోని అన్ని గ్రామాల విద్యార్థులు పెద్ద ఎత్తున దరఖాస్తులను తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. ఫాస్ట్ పత్రాల కోసం మండలంలోని విద్యార్థు ల నుంచి 15,479 దరఖాస్తులందాయి. పింఛన్ల పంపిణీలో అధికారులు బిజీ తెలంగాణ రాష్ట్రంలో పింఛన్లు, రేషన్‌కార్డులు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అక్టోబర్ 5 నుంచి 30వరకు గడువునిచ్చింది. దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో లక్షల సంఖ్యలో దరఖాస్తులందాయి. మొదటగా పింఛన్ల అర్హులను తేల్చలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది ఆ పనిమొదలుపెట్టారు. పింఛన్లకు మండలంలో 11,894 దరఖాస్తులందగా అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి విచారణ జరిపి అర్హుల జాబితా సిద్ధం చేశారు. వారికి పింఛన్లు అందజేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అనంతరం ఆహార భద్రతా కార్డులకు సంబంధించి అధికారులు విచారణ జరపాల్సి ఉంది. ఆహార భద్రతా కార్డుల కోసం మండలంలో 45,402 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హులను తేల్చిన తర్వాతే అధికారయంత్రాంగం ‘ఫాస్ట్’ దరఖాస్తులను విచారించే అవకాశం కనబడుతోంది. ఆందోళనలో విద్యార్థులు ఫాస్ట్ దరఖాస్తులు ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయంలో మూలుగుతున్నాయి. ప్రస్తుతం పలు కోర్సులకు సంబంధించి విద్యార్థులకు కౌన్సిలింగ్ కొనసాగుతోంది. దీనికోసం విద్యార్థులకు నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. తమ దరఖాస్తులను పరిశీలించి సర్టిఫికెట్లు జారీ చేయాలని అధికారులను విద్యార్థులు సంప్రదిస్తే ఆహార భద్రత కార్డులు, పింఛన్ల లబ్ధిదారుల ఎంపికలో తాము బిజీగా ఉన్నామని, ఇప్పట్లో ‘ఫాస్ట్’ దరఖాస్తుల పరిశీలన సాధ్యం కాదని అధికారులు తేల్చిచెబుతున్నారు. కౌన్సిలింగ్‌కు అవసరమైన పత్రాలు లేకపోతే తము సీటు దక్కుతుందో లేదో, ఉపకార వేతనాలను కోల్పోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళనలో విద్యార్థులున్నారు. ఫాస్ట్ పథకంలో భాగంగా ఆదాయ, నివాస, కుల ధ్రువీకరణ పత్రాల జారీకి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని, ఆదేశాలు అందిన అనంతరం పత్రాలను జారీచేస్తామని తహసీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. -
‘నేను మోసపోయాను’
ఘట్కేసర్: రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడిన తల్లిదండ్రులతో పాటు చిన్నారి వివరాలు లభ్యమయ్యాయి. మండల పరిధిలోని మాధవరెడ్డి ఫ్లైఓవర్బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్‌పై భార్యాభర్తలతో పాటు ఓ చిన్నారి మృతదేహం గురువారం లభ్యమైన విషయం తెలిసిందే. మృతులు రాజస్థాన్‌వాసులు. ‘నేను మోసపోయాను.. తప్పుచేశాను. మాలాగా మరెవరూ మోసపోవద్దు’ అని మృతుడు సజ్జారాం(35) సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రం పాలీ జిల్లా సిరియాళీ ఠాణా పరిధిలోని నెమ్లీమండ్ గ్రామానికి చెందిన సజ్జారాం(35), చెంప(30), దంపతులకు కూతురు భావన(4) ఉంది. వీరు కొన్నేళ్ల క్రితం నగరంలోని నాచారానికి వలస వచ్చారు. సజ్జారం బంధువైన భవర్లాల్ కిరాణ దుకాణంలో పనిచేస్తుండేవాడు. భవర్లాల్ సాయంతో ఆయన నాలుగేళ్ల క్రితం మండలంలోని కొండాపూర్‌లో కిరాణ దుకాణం ప్రారంభించాడు. దుకాణం వెనుక గదిలో భార్యాపిల్లలతో ఉండేవాడు. స్థానికంగా హోటల్ నడిపే శ్రీరాములుతో సజ్జారాంకు పరిచయం ఏర్పడింది. శ్రీరాములు కొండాపూర్‌కు వలస వచ్చిన రవి అనే వ్యక్తిని సజ్జారాంకు పరిచయం చేశాడు. రవి హుందాగా ఉండేవాడు. సజ్జారాంకు అతడితో స్నేహం ఏర్పడింది. ఇదే అదనుగా భావించిన రవి తనకు శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులతో మంచి సం బంధాలున్నాయని అతడిని నమ్మించాడు. తక్కువ డబ్బులకు స్టాంపు డ్యూటీ, ఇతరపన్నులు లేకుండా బంగారం దొరుకుతుందని రవి సజ్జారాంకు చెప్పాడు. దీంతో సజ్జారాం అతడికి కొంత సొమ్ము ఇవ్వడంతో బంగారం తెచ్చి ఇచ్చాడు. దీంతో సజ్జారాంకు రవిని పూర్తిగా విశ్వసించాడు. ఇదే అదనుగా భావించిన రవి, సజ్జారాం నుంచి పెద్ద మొత్తంలో డబ్బు గుంజేందుకు పథకం పన్నాడు. బంగారం ఇంకా తీసుకొస్తానని చెప్పి అతడు రెండు నెలల కాలంలో సజ్జారాం నుంచి రూ.15 లక్షలు తీసుకున్నాడు. బంగారం కోసం సజ్జారాం రవిని అడిగితే రేపుమాపు అని తిప్పుతున్నాడు. ఇదిలా ఉండగా షిర్డీలోని తనకు పరిచయం ఉన్న ఓ వ్యక్తి బంగారం ఇస్తాడని చెప్పడంతో సజ్జారాం ఈనెల 7న కుటుంబీకులతో పాటు తన మిత్రుడు శ్రీరాములును తీసుకొని అక్కడికి వెళ్లాడు. రవి చెప్పిన వ్యక్తి గురించి షిర్డీలో వాకబు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈలోగా రవి సెల్ స్విచాఫ్ చేశాడు. దీంతో నిరాశ చెందిన వారు 10 తేదిన కొండాపూర్ చేరుకున్నారు. అంతకు ముందేరవి తన అద్దెగదిని ఖాళీ చేసి వెళ్లాడు. దీంతో మోసపోయానని గుర్తించిన సజ్జారాం తీవ్ర మనస్తాపం చెందాడు. గురువారం ఆయన దుకాణం తీయలేదు. ఉదయం భార్య చెంప, కూతురు భావనను తీసుకొని బైక్‌పై వెళ్లాడు. అదే రోజు మధ్యాహ్నం ఘట్కేసర్ సమీపంలోని మాధవరెడ్డి ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద రైల్వేట్రాక్‌పై రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి మృతదేహాలను గుర్తించడానికి వీలులేకుండా పోయింది. మృతుల వివరాలు తెలిశాయి ఇలా.. సజ్జారాం ఫోన్ మూడు రోజులుగా స్విఛాఫ్ వస్తుం దని అతడి తల్లిదండ్రులు రాజస్థాన్ నుంచి భవర్‌లాల్‌కు ఫోన్ చేసి చెప్పారు. దీంతో భవర్లాల్ శుక్రవారం ఉదయం కొండాపూర్ చేరుకున్నాడు. సజ్జారాం అద్దె ఇంటికి, దుకాణానికి తాళం వేసి ఉందని గుర్తించి శ్రీరాములు వద్దకు వెళ్లాడు. సజ్జారాం విషయం తనకు తెలియదని అతడు చెప్పాడు. దీంతో భవర్లాల్ పీఎస్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అనుమానించిన పోలీసులు రైల్వే ట్రాక్‌పై దొరికిన మృతదేహాలను ఓసారి పరిశీలించాలని కోరుతూ భవర్‌లాల్‌ను గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మార్చురీలోని మృతదేహాలను చూసి భవర్లాల్.. మృతులు సజ్జారాం, చెంప, భావనగా గుర్తించాడు. ‘నాలాగా మరెవరూ మోసపోవద్దు..’ రైల్వే పోలీసులు శుక్రవారం సాయంత్రం కొండాపూర్‌కు వచ్చి స్థానిక పోలీసుల సాయంతో సజ్జారాం ఇంటి తాళాలు విరగ్గొట్టి పరిశీలించారు. రవి రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘నేను మోసపోయాను.. తప్పుచేశాను. నాలాగా మరెవరూ మోసపోవద్దు, అత్యాశకు పోయి రవికి బంగారం కోసం రూ.15 లక్షలు ఇచ్చాను’ అని హిందీభాషలో సజ్జారాం రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుకాణంలో మిగిలి ఉన్న సామగ్రిని తన సోదరుడికి అప్పగించాలని సజ్జారాం తన సూసైడ్ నోట్లో కోరాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
ఓఆర్ఆర్కు గ్రహణం
ఘట్కేసర్-పెద్ద అంబర్పేట్ * మధ్య ప్రారంభం కాని ఔటర్ రింగ్ రోడ్డు పనులు * పూర్తయి నెలన్నర దాటిన వైనం * రోడ్డు ప్రారంభించాలని వాహనదారుల వేడుకోలు * మీనమేషాలు లెక్కిస్తున్న అధికారులు ఘట్కేసర్: ఔటర్ రింగ్ రోడ్డు ప్రారంభానికి నోచుకోవడం లేదు. పెద్ద అంబర్పేట్-ఘట్కేసర్ మధ్య ‘ఔటర్’ పనులు పూర్తయి నెలన్నర కావస్తున్నా రోడ్డు ప్రారంభానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్ద అంబర్పేట్- ఘట్కేసర్ మధ్య ఉన్న 20 కిలోమీటర్ల దూరం రహదారికి ఆగస్టులోనే తుదిమెరుగులు కూడా దిద్దారు. జంతువులు ప్రవేశించకుండా కంచె, సిగ్నల్స్, సూచికలు ఏర్పాటు చేశారు. గత ఆగస్టు చివరి వారంలోనే ఈ రోడ్డును ప్రారంభించనున్నట్లు హెచ్‌ఎండీఎం అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత రోడ్డు ప్రారంభాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి వాహనదారులకు షాకినిచ్చారు. వాహనదారుల పాట్లు.. పెద్ద అంబర్పేట్-ఘట్కేసర్ల మధ్య ఔటర్ రింగ్ రోడ్డును ప్రారంభిస్తే వాహనదారులకు తీవ్ర వ్యయప్రయాసాలు తప్పనున్నాయి. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారికి, వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారికి మధ్య దూరంతోపాటు సుమారు 45 నిమిషాల ప్రయాణ సమయం తగ్గుతుంది. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్డు వెంట ఉన్న లింగాపూర్, కొర్రెముల, బాచారం, హయాత్‌నగర్ గ్రామాలకు నేరుగా వెళ్లే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం వాహనదారులు ఘట్కేసర్ నుంచి పెద్ద అంబర్‌పేటకు వెళ్లాలంటే ప్రయాణికులు మొదటగా ఉప్పల్‌కు చేరుకొని అక్కడినుంచి ఎల్బీనగర్ మీదుగా గమ్యస్థానానికి చేరుకుంటున్నారు. దీంతో ఇక్కడ దూర భారంతోపాటు ట్రాఫిక్ రద్దీతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదే ఘట్కేసర్-పెద్ద అంబర్పేట్ రోడ్డు అందుబాటులోకి వస్తే ఈ వ్యయప్రయాసాలు లేకుండా నేరుగా చేరుకోవచ్చు. ఔటర్ రింగు రోడ్డు వెంట ఉన్న గ్రామాలకు వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్నిసార్లు తెలియక వాహనదారులు ఔటర్ దారి ఎక్కి ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇటీవల ఒక బైకిస్టు ఔటర్ రోడ్డుకు అడ్డంగా ఉన్న మట్టిదిబ్బను బైక్ ఎక్కించబోయి ప్రమాదానికి గురై మృతిచెందాడు. గతంలో రాష్ట్ర సీఎం చేతుల మీదుగా రోడ్డు ప్రారంభానికి అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్ నీరబ్‌కుమార్ ప్రయత్నాలు చేశారు. చివర్లో ఇక్కడి నుంచి ఆయన బదలీపై వెళ్లారు. దీంతో ఆయన స్థానంలో ఇన్చార్జిగా రమేష్ చంద్ర బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో కూడా రోడ్డును ప్రారంభించకుంటే నేరుగా వెళ్లి రమేష్ చంద్రను కలుసుకోవాలని స్థానికులు యోచిస్తున్నారు. -
కబళించిన అప్పు!
ఓ చిన్న కుటుంబాన్ని అప్పు కబళించింది. పనిచేస్తేనే ఇల్లు గడిచే ఆ కుటుంబం చేసిన రూ.50 వేల అప్పు.. ముగ్గురి బలవన్మరణానికి దారితీసింది. ఘట్కేసర్లోని కొండాపూర్ లెవెల్ క్రాసింగ్ వద్ద రైలు పట్టాలపై మంగళవారం ఉదయం భార్యాభర్తలతోపాటు ఓ చిన్నారి మృతదేహం లభించడం కలకలం రేపింది. వీరు ఘట్కేసర్ సమీపంలోని మైసమ్మగుట్ట కాలనీకి చెందిన వారని గుర్తించారు. కాలనీకి చెందిన కొమ్మరి కుమార్(24), సుగుణ(21) దంపతులకు రెండేళ్ల కూతురు మహేశ్వరి ఉంది. పెళ్లి సమయంలో కుమార్ చేసిన అప్పు తీర్చే మార్గం కన్పించక మదన పడిన ఆ కుటుంబం చివరకు ప్రాణాలు తీసుకుంది. -
రైలు కిందపడి తల్లీకూతుళ్ల ఆత్మహత్య
ముషీరాబాద్: అదృశ్యమైన తల్లీ కూతూళ్ల కోసం ఓ వైపు ముషీరాబాద్ పోలీసులు గాలింపు చేస్తుండగానే మరో వైపు వారి మృతదేహాలు ఘట్కేసర్ వద్ద రైల్వే ట్రాక్‌పై లభ్యమయ్యాయి. అత్తింటివారి వేధింపులు తాళలేక ఆమె కూతురుతో కలసి బలవర్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన సోమవారం జరిగింది. పెళ్లయిన మూడేళ్లకే తమ కుమార్తెను అత్తింటివారు పొట్టన పెట్టుకున్నారని మృతురాలి కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గాంధీనగర్‌లో మ్యారీగోల్డ్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న శ్యాంప్రసాద్, స్వప్న (24) దంపతులు. మూడేళ్ల కిందట వీరికి వివాహమైంది. వీరికి శాన్వి (20 నెలలు)అనే కూతురు, అక్షద్ (10 నెలలు)కుమారుడు సంతానం. శ్యాంప్రసాద్ తల్లి ప్రమీల, ఆడబిడ్డలు కళ్యాణి, ప్రవీణ కూడా వీరితోనే ఉంటున్నారు. శ్యాంప్రసాద్ రిలయన్స్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. స్వప్న సోమవారం ఉదయం అక్షద్ను అత్తకు అప్పగించి శాన్విని తీసుకుని పక్కనే ఉన్న మోర్ సూపర్ మార్కెట్ అని చెప్పి ఇంట్లోంచి వెళ్లింది. శ్యాం యధావిధిగా డ్యూటీకి వెళ్లాడు. ఉదయం 11.30 గంటలకు వెళ్లిన స్వప్న సాయంత్రం నాలుగు గంటలైనా తిరిగి రాలేదు. విషయం తెలుసుకున్న భర్త ముషీరాబాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం ఇన్స్పెక్టర్ బిట్టు మోహన్‌కుమార్ అన్ని పోలీసు స్టేషన్లకు సమాచా రం అందించారు. ఒకపక్క తల్లికూతుర్ల కోసం పోలీసులు గాలిస్తుండగానే తల్లీకూతుళ్లు మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో చర్లపల్లి - ఘట్కేసర్ మధ్యలోని యానంపేట రైల్వే ట్రాక్‌పై శవమై తేలారు. వీరి మృతదేహాలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ముషీరాబాద్ పోలీసులు మార్చురీలో ఉన్న మృతదేహాలను శ్యాంప్రసాద్‌కు చూపించారు. అవి తన భార్య, కూతురుగా గుర్తించారు. చర్లపల్లి - ఘట్కేసర్ మధ్యలో యానంపేట రైల్వే ట్రాక్‌పై ఘట్కేసర్ నుంచి వేగంగా వస్తున్న రైలుకు అడ్డంగా ముందు తన పాపను నిలబెట్టి, రైలు దగ్గరకు వచ్చిన సమయంలో తాను కూడా రైలు పట్టాలపై దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు రైల్వే ఎస్ఐ రామారావుకు తెలిపారు. అత్త, ఆడబిడ్డల వేధింపులే..... అత్త, ఆడబిడ్డల వేధింపులే తన బిడ్డ, మనవరాలిని బలితీసుకున్నాయని మృతురాలి తల్లి మేఘమాల సాక్షితో చెప్పి రోదించింది. ఇటీవల దసరా పండుగకు వరంగల్ జిల్లా బచ్చనపేటలోని తమ ఇంటికి వచ్చి వెళ్లిందని ఆమె తెలిపింది. బీటెక్ చదువుకున్న తన కూతురును అన్యాయంగా అత్తింటివారు పొట్టనపెట్టుకున్నారని ఆమె ఆరోపించింది. మోన్న గురుప్రసాద్ నేడు స్వప్న..... భార్య మీది కోపంతో ప్రొఫెసర్ గురుప్రసాద్ ఇటీవలే తన ఇద్దరు పిల్లలను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన నగర ప్రజలు మరవకముందే అదే తరహాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఈ సారి అత్త, ఆడబిడ్డలపై కోపంతో స్వప్న తన 20 నెలల కూతురితో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ రెండు సంఘటలు వరుసగా చోటుచేసుకోవడంతో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు ఘటనల్లో కూడా పిల్లల్ని హత మార్చింది విద్యావంతులైన ఉండడం గమనార్హం. ఒకరిపై ఉన్న కోపం తమ కన్న బిడ్డలను బలి తీసుకోవడం ఎంత వరకు సబబు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
ఏతల్లి.. కన్నబిడ్డో!
ఘట్కేసర్: రైలులో ఓ మగశిశువు లభ్యమైంది. ఈ సంఘటన సోమవారం ఘట్కేసర్లో వెలుగుచూసింది. ప్రయాణికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి కాచిగూడ నుంచి తెనాలి-కాచిగూడ ప్యాసింజర్ తెనాలికి బయలుదేరింది. 11 గంటల సమయంలో ఓ బోగీలోని బాత్రూమ్ సమీపంలో సంచిలోంచి శిశువు రోదనలు వినిపించాయి. రైలు చర్లపల్లి దాటిన తర్వాత ప్రయాణికులు గమనించారు. సంచిలో చూడగా దుస్తువులో చుట్టి ఓ మగశిశువు ఉన్నాడు. అప్పటికే రైలు ఘట్కేసర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ప్రయాణికులు రైలు చైన్ లాగి స్టేషన్ మాస్టర్‌కు విషయం తెలిపారు. స్టేషన్‌మాస్టర్ సమాచారంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. శిశువును వెంటనే మండల కేంద్రంలోని ప్రభుత్వ అస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. పసికందు ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. శిశువు జన్మించి దాదాపు 15 రోజులు అవుతుండొచ్చని డాక్టర్లు పేర్కొన్నారు. అనంతరం 108 సిబ్బంది ఈఎమ్‌టీ నాగరాజ్, పెలైట్ బద్రూలు పసికందును తీసుకెళ్లి యూసుఫ్‌గూలోని శిశువిహార్‌లో పసికందును అప్పగించారు. ఏతల్లి కన్న బిడ్డో.. ఇలా కర్కషంగా పడేసి వెళ్లారని ప్రయాణికులు శాపనార్థాలు పెట్టారు. ఎవరో ఉద్దేశపూర్వకంగా శిశువును రైలులో వదిలేసి వెళ్లిపోయారని స్థానికులు చెప్పారు. -
ఈ ఆపరేషన్ మాకొద్దు
ఘట్కేసర్: కుటుంబ నియంత్రణ గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించే ప్రభుత్వం ఆ ఆపరేషన్లు చేయించుకోవడానికి వచ్చే మహిళలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. దీంతో ఆపరేషన్లు చేయించుకోవడానికి ఆస్పత్రికి వచ్చిన మహిళలు అక్కడి పరిస్థితులు చూసి ఆందోళన చెందుతున్నారు. మళ్లీ వస్తామంటూ ఆపరేషన్లు చేయించుకోకుండానే వెనుదిరుగుతున్నారు. మండలంలోని నారపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం మండల వ్యాప్తంగా మహిళలకు కుటుంబ నియంత్రణ (ట్యూబెక్టమి) ఆపరేషన్లు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయా గ్రామాలకు చెందిన 12 మంది మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికి తమ పేర్లను నమోదు చేయించారు. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు సదరు 12 మంది మహిళలు ఆస్పత్రికి చేరుకున్నారు. మొదట ఆరుమంది మహిళలకు ఆపరేషన్లు చేసి అందుబాటులో ఉన్న 6 మంచాలపై పడుకోబెట్టారు. అనంతరం వచ్చిన ఇద్దరు మహిళలను ఆపరేషన్ తర్వాత బెంచీలు, టేబుళ్లపై పడుకోబెట్టారు. ఈ పరిస్థితి గమనించిన మిగితా నలుగురు మహిళలు నివ్వెరపోయారు. ఆస్పత్రిలో ఇక బెంచీలు, టేబుళ్లు కూడా లేకపోవడంతో ఆపరేషన్ తర్వాత తమ పరిస్థితి ఏంటని వారు ఆందోళనకు గురయ్యారు. మళ్లీ వచ్చి ఆపరేషన్ చేయించుకుంటామని చెప్పి అక్కడినుంచి వెనుదిరిగారు. కు.ని ఆపరేషన్లకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతోనే తాము భయపడి వెనుదిరిగినట్లు వారు విలేకరులతో గోడు వెళ్లబోసుకున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కల్పించుకొని కు.ని ఆపరేషన్లకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. వైద్యులు నారాయణ రావు, సతీష్ చందర్ల నేతృత్వంలో కు.ని ఆపరేషన్లు కొనసాగాయి. -
మళ్లీ ‘ఆధార్’ లొల్లి
ఘట్కేసర్ టౌన్: మళ్లీ ఆధార్ లొల్లి మొదలైంది. ఆధార్ నంబర్లు ఇవ్వని వారికి ప్రభుత్వం సెప్టెంబర్ నెల రేషన్ సరుకులను నిలిపివేసింది. రేషన్ కావాలంటే కుటుంబంలోని సభ్యులందరి ఆధార్ వివరాలను అందజేయాలని షరతు విధించింది. నిజమైన లబ్ధిదారులైతే వివరాలను అందజేస్తారని ఇవ్వని పక్షంలో బోగస్ కింద పరిగణించవచ్చని సర్కారు ఆలోచన. దీని ద్వారా ఏటా ప్రభుత్వంపై పడుతున్న రూ.కోట్ల భారాన్ని తప్పించుకోవచ్చని భావిస్తోంది. కార్డులున్న వారిలో చాల మంది అనర్హులున్నారని, ఇతర ప్రాంతాల్లో కుటుంబ సభ్యుల పేరుతో అక్రమంగా కార్డులు పొందారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనర్హులను తొలగించేందుకే కుటుంబంలోని సభ్యులందరి ఆధార్ నంబర్లను ఇవ్వాలని, అనుసంధానం అయితేనే సరుకులు అందుకుంటారని ప్రభుత్వం చెబుతోంది. జిల్లాలో 10.07 లక్షల కార్డులుండగా అందులో మరణించిన వారు, ఇచ్చిన చిరునామాలో శాశ్వతంగా నివాసం లేని 1,55,000 మంది లబ్ధిదారులను గుర్తించి సెప్టెంబర్ నెల రేషన్ సరుకులను నిలిపివేశారు. ఇంకా ఆధార్ వివరాలను అందజేయని వారు 2,55,000 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలలో మండలంలో 6,250 మందికి రేషన్ సరుకులు నిలిచిపోయాయి. అనుసంధానం కానివారికి ఇబ్బందులు బోగస్ రేషన్ కార్డులు ఉన్నవారికి సరుకులను నిలిపివేశామని పౌర సరఫరా శాఖ అధికారులు చెబుతున్నా ఆధార్ అనుసంధానం కానివారు, ఆధార్ లేనివారు వేలాది మంది లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. రెండుసార్లు ఆధార్ కేంద్రానికి వెళ్లి నమోదుచేసుకున్నా ఇప్పటికీ కార్డులందని వారు కోకొల్లలు. అనుసంధానం కోసం చాలాసార్లు ఆధార్ ఇచ్చినా సరుకులు నిలిపివేశారని పలువురు వాపోయారు. రేషన్ ఆగిన లబ్ధిదారులు కుటుంబంలోని సభ్యులందరి ఆధార్ వివరాలను అందజేయాలని, అనుసంధానం తర్వాతే సరుకులను అందజేస్తామని డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు. -
సబ్‌ప్లాన్‌కు మంగళం..
ఘట్కేసర్ టౌన్: మండలంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల అభివృద్ధికి సబ్‌ప్లాన్ నిధులు మంజూరు కావడం లేదు. వారికి కేటాయించిన నిధులు వారికే వెచ్చించాలని 2013లో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించింది. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ జనాభాకు అనుగుణంగా ప్రత్యేక నిధులను ప్రభుత్వం విడుదల చేయడానికి ఆర్థిక శాఖలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసింది. దీన్ని పటిష్టంగా అమలు చేయడానికి సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నోడల్ ఏజన్సీని నియమిం చింది. ఆయా కాలనీల అభివృద్ధికి నివేదికలు తయారుచేసి ఏడాది క్రితం ప్రభుత్వానికి పంపారు. ఇప్పటికీ సర్కా రు నిధులను విడుదల చేయకపోవడంతో కాలనీల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. చట్టబద్ధత కల్పించి ఏడాది గడిచినా.. గతంలో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను దారి మళ్లించి ఇతర పనులకు వినియోగించారు. విడుదలైన నిధులు దారి మళ్లకుండా సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించి ఏడాది గడిచినా ఎస్సీ, ఎస్టీల కాలనీలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. మండలంలో గుంటిగూడెం, కొండాపూర్, మాదాపూర్, కాచివానిసింగారం, అంకుషాపూర్, యంనంపేట్ తదితర గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీల కాలనీల అభివృద్థికి అవసరమైన పనులకు నిధులను విడుదల చేయాలని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. సబ్‌ప్లాన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీల గృహనిర్మాణం, తాగునీరు, ఇందిర జలప్రభ, గ్రామీణ రోడ్లు, మురుగుకాల్వలు, పింఛన్లు, పొదుపు సంఘాల నిర్వహణ తదితర అంశాలకు సంబంధించి నిధులు కేటాయించాలని ప్రణాళికలు వేశారు. ఆయా కాలనీలు డ్రైయినేజీ వ్యవస్థ సరిగా లేక దుర్గంధం వెదజల్లుతున్నాయి. దీంతో చిన్నపాటి చినుకుకే మట్టిరోడ్లు చిత్తడిగా మారి ప్రజలు నడవడానికి ఇబ్బంది పడుతున్నారు. మండలంలో 2013లో ఇంది రమ్మ కలలు పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఊరూరా సమావేశాలు నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్ర ణాళికలను వేసి నిధులను విడుదల చే యాలని పంపిన నివేదికలక ు మోక్షం లభించడం లేదు. అధికారులు స్పందించి నిధులను విడుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
రెండు నెలలుగా అందని పౌష్టికాహారం
ఘట్కేసర్ టౌన్: ఐసీడీఎస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రెండు నెలలుగా అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం సరఫరా కావడం లేదు. దీంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. మాతా, శిశు మరణాలను నివారించేందుకు ఆరేళ్లలోపు చిన్నారులకు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందజేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన పౌష్టికాహార భోజన పథకం మండలంలో సక్రమంగా అమలుకు నోచుకోవడంలేదు. నీరుగారుతున్న పథకం అంగన్వాడీ కేంద్రాల ద్వారా నిత్యం చిన్నారులతోపాటు గర్భిణులు, బాలింతలకు ఆరు నెలల వరకు పౌష్టికాహారాన్ని అందించాలి. రోజూ మధ్యాహ్నం వారికి అన్నం, పప్పు, ఆకు కూరలతో పాటు గుడ్డు, పాలు అందజేయాలి. కాగా.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రెండు నెలలుగా పౌష్టికాహారం అందడం లేదు. గర్భిణులకు రోజు 40 గ్రాముల పప్పు, 18.2 గ్రాముల మంచి నూనె, చిన్నారులకు రోజు 15 గ్రాముల పప్పు, 5 గ్రాముల మంచి నూనె, వారానికి ఒక్కసారి20 గ్రాముల కుర్కురేలు రెండు నెలలుగా సరఫరా కావడం లేదు. పౌష్టికాహారంలో ముఖ్యమైనటువంటి నూనె, పప్పు తదితర పదార్థాల పంపిణీ లేకపోవడంతో బాలింతలు, గర్భిణులు బియ్యం తీసుకోవడానికి విముఖత చూపుతున్నారు, నిత్యం అందే పౌష్టికాహారం అందకపోవడంతో చాల మంది చిన్నారులు ఇంటికే పరిమితం కావడంతో మాతా, శిశు మరణాలను తగ్గించి రేపటి పిల్లలను శారీకంగా, మానసికంగా దృడంగా ఉండాలన్న ప్రభుత్వం ఆశయానికి గండి పడుతోంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం సరఫరా చేయాలని కోరుతున్నారు. కాగా.. స్టాకు లేకపోవడం, సరఫరా చేసేందుకు నియమించిన కాంట్రాక్టర్ కొత్త కావడంతో సరఫరాలో ఆలస్యం జరిగిందని తక్షణమే సరఫరా చేస్తామని ఐసీడీఎస్ హయత్‌నగర్ ప్రాజెక్టు ఇన్చార్జి లలితకుమారి తెలిపారు. -
భాగ్యనగరంలో మరో గ్యాంగ్ రేప్
హైదరాబాద్: భాగ్యనగరంలో మహిళలపై అత్యాచారాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పహాడీ షరీఫ్ లో 'స్నేక్ గ్యాంగ్' దారుణోదంతం మరవకముందే మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలోమరో గ్యాంగ్ రేప్ వెలుగులోకి వచ్చింది. ఓ యువతిపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం గురించి తెలిసింది. ఎల్బీనగర్ నుంచి ఘట్కేసర్ వెళ్తున్న తనపై ఆటో డ్రైవర్‌తోపాటు ఐదుగురు అత్యాచారం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
ఘట్కేసర్: ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరగడంతో రూ. 5 లక్షల ఆస్తినష్టం సంభవించింది. ఈ సంఘటన మండలంలోని ఏదులాబాద్ అనుబంధ మర్పల్లిగూడలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. సకాలంలో ఫైర్ ఇంజిన్ రాకపోవడంతో స్థానికులు బకెట్లతో నీళ్లుపోసి మంటలు ఆర్పారు. వివరాలు.. మర్పల్లిగూడలోని కేకే పాలిమర్స్ పరిశ్రమను నగరానికి చెందిన ఖాజా ఖలీముద్దీన్ లీజుకు తీసుకొని నాలుగేళ్లుగా నడిపిస్తున్నాడు. నగరంలోని పలు ప్రింటింగ్ ప్రెస్‌లలోని వేస్టేజీ, సీడ్స్ కంపెనీల్లోని ప్యాకేజీలకు సంబంధించిన నిరుపయోగమైన ప్లాస్టిక్ బ్యాగులను, ఇతర వస్తువులను తీసుకువచ్చి రీసైక్లింగ్ చేసి ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ తయారు చేస్తుంటారు. వీటి ద్వారా పైపులు, షీట్లు తయారు చేసి విక్రయిస్తుంటారు. పరిశ్రమలో సుమారు 12 మంది కార్మికులు పనిచేస్తున్నారు. సోమవారం కంపెనీ ఆవరణలో ప్లాస్టిక్ వేస్టేజీ కుప్పలుగా ఉంది. దానికి సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద షార్ట్ సర్క్యూట్ ఏర్పడడంతో నిప్పురవ్వలు ఏర్పడి ప్లాస్టిక్ వేస్టేజీ పైన పడ్డాయి. దీంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. గమనించిన సిబ్బంది పరిశ్రమలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ సిలిండర్లను ఉపయోగించినా ఫలితం లేకుండా పోయింది. కొంత ప్లాస్టిక్ ముడిసరుకును దూరంగా వేశారు. ఫైరింజన్‌కు సమాచారం ఇచ్చినా సకాలంలో రాలేకపోయింది. దీంతో మర్పల్లిగూడ యువకులు, పరిశ్రమ సిబ్బంది కలిసి బకెట్లతో నీటిని పోసి గంటసేపు శ్రమించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం తాపీగా అగ్నిమాపక వాహనం వచ్చి పూర్తిగా మంటలను పూర్తిగా ఆర్పేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రాణనష్టం సంభవించకపోవడంతో కంపెనీ యాజమాన్యం, స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
‘సర్వే’త్రా ఫిర్యాదుల వెల్లువ
ఘట్కేసర్ టౌన్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ సమగ్ర సర్వే కొన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో జరగలేదని తెలుస్తోంది. సర్వేరోజు రాత్రి 9 గంటలకు వరకు కూడా తమ ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాలేదని ప్రజలు క్లస్టర్ అధికారుల ముందు నిరసనలు తెలిపారు. సర్వే సజావుగా సాగిందనుకున్న అధికారులు ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో తప్పు ఎక్కడ జరిగిందనే విషయమై పరిశీలిస్తున్నారు. మండలంలో 72,961 ఇళ్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటికి నంబర్లు కేటాయించి ఎన్యూమరేటర్లకు అప్పగించారు. 68,593 కుటుంబాల సర్వే పూర్తితో 104.31 శాతం నమోదు అయిందని, 4,368 ఇళ్లకు తాళాలు వేసి ఉన్నట్లు తహసీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి ప్రకటించారు. నివేదికలు ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో మరోలా కనిపిస్తోంది. సర్వే రోజు రాత్రి వేలాది మంది తమ ఇళ్లకు నంబర్లు వేయలేదని తమ వివరాలను కూడా సర్వేలో నమోదు చేయాలని అధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. నమోదు కాని ఇళ్లు తేలిందిలా..! ఇంటింటి సర్వే 104.31 శాతం పూర్తయిందని అధికారులు ప్రకటిస్తున్నా ఇంకా మిగిలిన ఇళ్లు ఎక్కడివన్న అనుమానం తలెత్తుతోంది. ఇంటి నంబర్లను కేటాయించే సమయంలో ఇంట్లో ఉన్న అన్ని కుటుంబాలకు విడిగా నంబర్లు ఇవ్వకపోవడం, అద్దెకున్న వారి వివరాలను ఇంటి యజమానులు తెలపకపోవడం, ఎన్యూమరేటర్ల దగ్గర నమోదు పత్రాలు లేకపోవడంతోనే గందరగోళం జరిగినట్లు తెలుస్తోంది. పంచాయతీ సిబ్బంది నంబర్లు కేటాయించే సమయంలో ఇంటికి ఒక నంబర్‌ను ఇవ్వగా సర్వే రోజు మాత్రం అదే ఇంట్లో పెళ్లి అయిన ప్రతి జంట విడిగా నమోదు చేయించుకున్నారు. దీంతో ఇళ్ల సంఖ్య పెరగడమే కాకుండా ఎన్యూమరేటర్ల దగ్గర ఉన్న నమోదు పత్రాలు కూడా అయిపోయాయి. ఎన్యూమరేటర్లు తిరుగు ముఖం పట్టడంతో చాలా ఇళ్లు మిగిలిపోవడానికి కారణమైనట్లు భావిస్తున్నారు. అదే రోజు రాత్రి నమోదు కాని ఇళ్లు సుమారు 2 వేల వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోసారి సర్వే చేపట్టి అందరినీ పరిగణలోకి తీసుకుని కుటుంబ వివరాలను నమోదుచేయాలని ప్రజలు కోరుతున్నారు. పంచాయతీల్లో ఫిర్యాదు చేయండి... సర్వేలో పేర్లు నమోదు కాని వారు తమతమ పంచాయతీ కారాలయాల్లో ఫిర్యాదు చేయాలని తహసీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. ఒక్క బోడుప్పల్ పంచాయతీ పరిధిలోనే సుమారు 800లకు పైగా ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు. మండల వ్యాప్తంగా సుమారు 4వేల కుటుంబాలు సర్వే కాకుండా మిగిలిపోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. -
‘అమ్మహస్తం’.. అస్తవ్యస్తం!
ఘట్కేసర్ టౌన్: అమ్మహస్తం పథకం ప్రజలకు మొండిచెర్య చూపుతోంది. తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులకు రూ. 185కే ఉప్పు, కారం, చింతపండు, గోధుమలు, గోధుమపిండి, పామాయిల్, పంచదార, కందిపప్పు, పసుపు సరుకులను అందించాలని గత ప్రభుత్వం అమ్మహస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. గత ఉగాది పండుగకు ప్రారంభమైన ఈ పథకం ఏడాదిలోపే నీరుగారిపోరుుంది. తొమ్మిది సరుకులు అందించాల్సి ఉన్నా కేవలం పంచదార మాత్రమే పంపిణీ చేస్తున్నారు. పామాయిల్, కందిపప్పు, గోధుమలు అందడం లేదు. ఆరు నెలలుగా పామాయిల్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. నాణ్యత లేని సరుకులు.. అవ్ము హస్తం పథకం కింద ప్రభుత్వం సరఫరా చేస్తున్న సరుకుల్లో నాణ్యత కరువైంది. దీంతో లబ్ధిదారులు ఈ సరుకులను తీసుకెళ్లడం లేదు. కాలం చెల్లిన చింతపండు, పురుగులు తిరుగుతున్న గోధుమపిండి, వినియోగించలేని విధంగా ఉన్న కారం పొడి, పసుపు, ఉప్పు సరుకులు సరఫరా అవుతుండటంతో వినియోగదారులు రేషన్ దుకాణాలకు బదులు బయుట సరుకులు కొనుగోలు చేయుడంతో పేదలకు ఆర్థికభారం తప్పడం లేదు. రేషన్ దుకాణాల్లో కిలో గోధుమలు రూ.7కు లభిస్తుండగా మార్కెట్లో రూ. 15, పామాయిల్ రూ.40కిగాను రూ. 65-70లు, కందిపప్పురేషన్ దుకాణంలో రూ. 50లు ఉండగా మార్కెట్లో రూ. 70- 75లకు లభిస్తోంది. వూర్కెట్లో సరుకులు కొనుగోలు చేస్తుండటంతో జిల్లా లో ఉన్న 10.8 లక్షల తెల్ల రేషన్ కార్డు వినియోగదారులపై రూ. కోట్లాడి భా రం పడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నాణ్యమైన సరుకులను సరఫరా చేయాలని పేదలు కోరుతున్నారు. -
రెడ్ కార్పెట్ పరుస్తున్నారు..!
ఘట్కేసర్: గత రెండు మూడేళ్లుగా జిల్లాలో నెలకొన్న అతివృష్టి, అనావృష్టి పరిస్థితులతో రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టిపెడుతున్నారు. వరి పంట వేసి ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకున్నా.. కరెంటు, వర్షాలు అనుకూలించకపోవడంతో వీరు ప్రత్యామ్నాయ పంటలే మేలనే నిర్ణయానికి వచ్చారు. అతివృష్టి, అనావృష్టిలతోపాటు క్రిమికీట కాలను తట్టుకొని నిలిచే కార్పెట్ గడ్డి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. మండలంలోని అవుశాపూర్, అంకుశాపూర్, అన్నోజిగూడెం, ఏదులాబాద్ గ్రామాల్లో 300 ఎకరాల్లో కార్పెట్ గడ్డిని సాగు చేస్తున్నారు. ఒక ఏదులాబాద్ గ్రామంలోనే సుమారు వంద ఎకరాల్లో కార్పెట్ సాగవుతోదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కార్పెట్ గడ్డిని భవనాల చుట్టూ, పచ్చిక మైదానాల్లో, ఇళ్లు, కార్యాలయాలు తదితర చోట్ల విరివిగా వాడుతున్నారు. ఈ గడ్డితో పచ్చదనంతోపాటు అందం కూడా చేకూరడంతో ఇటీవల కాలంలో కార్పెట్‌కు డిమాండ్ బాగా పెరిగింది. ఎకరా విస్తీర్ణంలో కార్పెట్ గడ్డిని సాగు చేయడానికి రూ. 80 వేల వరకు ఖర్చు వస్తుంది. కార్పెట్ గడ్డిని ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు పెంచి కట్ చేస్తారు. రెండు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పుతో బిల్లల మాదిరిగా చేస్తారు. ఒక్కో బిల్ల నాణ్యతను బట్టి రూ.9 నుంచి రూ. 12 వరకు పలుకుతుంది. ఎకరానికి సుమా రు 17,500 బిల్లలు వస్తే, వాటిని విక్రయించగా రూ. 1.50 లక్షల ఆదా యం వస్తుంది. ఖర్చులు పోనూ రైతుకు ఎకరాపై రూ. 60 వే ల నుంచి రూ. 70 వేల వరకు లాభాలు రావచ్చు. అయితే ఈ పంటలో కలుపుతీత కూడా ముఖ్యమైనదే. కలుపు తీయడానికి రైతుకు రోజుకు రూ. 150 చెల్లించాల్సి ఉంటుంది. మార్కెటింగ్‌లో ప్రావిణ్యత సా ధిస్తే కార్పెట్ సాగులో మంచి లాభాలు గడించవచ్చని రైతులు చెబుతున్నారు. -
గుబులు రేపుతున్న సర్వే..!
ఘట్కేసర్ టౌన్: సమగ్ర కుటుంబ సర్వే బడా బాబుల్లో గుండెల్లో గుబులు రేపుతోంది. అక్రమాలకు పాల్పడిన అధికారులు, నాయకులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఇప్పటి వరకు దొడ్దిదారిన సంక్షేమ పథకాలను కాజేసిన వారు సర్వే పేరు వింటేనే వణికిపోతున్నారు. అక్రమంగా పొందిన సేవలన్ని సర్వే ద్వారా బహిర్గతమయ్యే అవకాశముండటం వారిలో ఆందోళనకు కారణమవుతోంది. వ్యతిరేకిస్తున్న ఉన్నత వర్గం, ఆహ్వానిస్తున్న పేద వర్గం... కోట్ల కొలది ఆస్తులున్న తెల్ల తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ తదితర రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు తదితర సౌకర్యాలు పొందుతున్న ఉన్నత వర్గాలు సామాజిక సర్వేను వ్యతిరేకిస్తున్నాయి. అదే సమయంలో సంక్షేమ పథకాలు పొందడానికి అన్ని అర్హతలున్నా ప్రభుత్వ రాయితీలను అందుకోలేకపోతున్న పేద వర్గం సర్వేను స్వాగతిస్తోంది. సర్వేలో ఉద్యోగ స్థితి, ఆధార్, స్థిరాస్తి, చరాస్థి, గ్యాస్, ఇంటి, కుటుంబ పరిస్థితి, పశు సంపద, పెన్షన్స్, భూములు, పాన్ కార్డు తదితర వివరాలను సర్వే సిబ్బందికి అందజేయాల్సి ఉంటుంది. పాలకుల స్వార్థపూరిత పాలనలో సర్కారు ఉద్యోగమున్న వారు, భూస్వాములు వారి తల్లితండ్రులు నేడు తెలుపు కార్డులు పొంది పెన్షన్స్, అన్నపూర్ణ, అంత్యోదయ కార్డుల ద్వారా రాయితీలు పొందుతున్నారు. వైకల్యం లేకున్న పెన్షన్ పొందడం, ఇల్లు ఉండగానే స్థలాలు, ఇందిరమ్మ పథకాలను తిరిగి వినియోగించుకున్న వారికి ఇప్పుడు సర్వే అంటేనే దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. భూములు, ప్లాట్ల విక్రయాలన్ని నేడు ఆన్లైన్లో జరుగుతున్నందున ఎక్కడ తమ అక్రమ ఆస్తుల వివరాలు సర్కారుకు తెలిసిపోతాయోనని బడాబాబులు దడుసుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులకు తప్పని తిప్పలు... నూతనంగా ఎన్నికలైన ప్రజా ప్రతినిధులను సర్వే తిప్పలు వదలడం లేదు. ఎన్నో హామీలిచ్చి గద్దెనెక్కినా సర్వే ద్వారా ప్రజల నమ్మకాన్ని కోల్పోయే అవకాశముందని నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఓటేసి గెలిపిస్తే ఉన్న సౌకర్యాల్లో కోతల విధిస్తున్నారని, ఇందుకోసమేనే మిమ్మల్ని గెలిపించామా అంటూ గ్రామాల్లో అందుబాటులో ఉన్న ప్రజా ప్రతినిధులను నిలదీస్తున్నారు. మరి ఈనెల 19న జరిగే సర్వేలో అందరూ అనుకుంటున్నంటు అక్రమాలు బయటపడతాయా లేక ఇది ఓ సాధారణ సర్వేగా మిగిలిపోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. -
ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలి
ఘట్కేసర్ టౌన్: ఎస్సీ వర్గీకరణ బిల్లును తక్షణమే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా బాధ్యుడు వనం నర్సింహ్మమాదిగ డిమాండ్ చేశారు. ఘట్కేసర్ పట్టణంలోని శివారెడ్డిగూడ శ్రీ దండ్లగడ్డ వీరాంజనేయస్వామి ఆలయ ఆవరణలో ఆ సంస్థ మండల అధ్యక్షుడు గంగి జగన్‌మాదిగ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టించడం కేవలం మంద కృష్ణమాదిగతోనే సాధ్యమన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఎమ్మార్పీఎస్, వృద్ధులు, వితంతువులు, వికలాంగుల కమిటీలు వేసి పటిష్టం చేయాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే అఖిలపక్షాన్ని ఢిల్లీకి పంపి ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదింపజేయాలన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్ పెంపుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. పెన్షన్‌పై హామీ తప్పితే పెద్దఎత్తున ఉద్యమం లేవనెత్తుతామన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు రామేశ్వరం నరేందర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఏనూతుల నాగేష్, వేముల యాదగిరి, నర్సింహ్మ, చినంగి కుమార్, కూరం మల్లేష్, మోతుకుపల్లి శ్రీనివాస్, పంగ నర్సింహ్మ, నక్క మల్లేష్, గార గిరి, వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షుడు గ్యార బలరాం, జిల్లా నాయకుడు కొల్తూర్ జంగయ్య, సుధాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
కంప్యూటర్ విద్యకు ‘వైరస్’
ఘట్కేసర్ టౌన్: గ్రామీణ ప్రాంతాల్లోని సర్కారు స్కూళ్లల్లో చదువుకునే విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన కంప్యూటర్ విద్యకు వైరస్ సోకింది. చదువుతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ప్రవేశపెట్టిన కంప్యూటర్ విద్య నీరుగారుతోంది. దీంతో కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన కంప్యూటర్లు, ఫర్నిచర్ ఎందుకూ పనికి రాకుం డా పోతున్నాయి. 2014లోనైనా కంప్యూటర్ విద్యకు మోక్షం కలుగుతుందనుకున్న విద్యార్థుల ఆశలు అడియాశలవుతున్నాయి. సర్కారు అనాలోచిత నిర్ణయాలవల్ల జిల్లాలో సుమారు 190 ఉన్నత పాఠశాలల్లో వేలాది విద్యార్థులు సాంకేతిక విద్యకు దూరమవుతున్నారు. అందని ద్రాక్షలా కంప్యూటర్ విద్య.. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా సర్కారు బడుల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించాలనే సంకల్పంతో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సక్సెస్ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టారు. ఐదేళ్లపాటు కంప్యూటర్ విద్యను బోధించడానికి ప్రైవేటు ఏజన్సీలతో రాజీవ్ విద్యామిషన్ ఒప్పందం కుదుర్చుకుంది. పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లను నియమించిన రెండు, మూడు సంవత్సరాల అనంతరం నిర్వాహణను గాలికొదిలేయడంతో కంప్యూటర్ విద్య అందని ద్రాక్షలా తయారయింది. ఏజన్సీల గడువు గతేడాది సెప్టెంబర్‌తో ముగియడంతో కంప్యూటర్ విద్య అటకెక్కింది. ఫాకల్టీని నియమించకపోవడం, పనిచేసిన వారికి సక్రమంగా వేతనాలను చెల్లించకపోవడంతో పూర్తిస్థాయి లో వారు పనిచేయకపోవడంతో విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందుకోలేకపోయారు. దుమ్ము ధూళితో మూలనపడ్డ కంప్యూటర్లు.. వేతనాలను సక్రమంగా చెల్లించపోవడంతో ఇన్స్ట్రక్టర్లు విధులకు రావడం మానేశారు. దీంతో కోట్లాది రూపాయలను వెచ్చించి కొనుగోలుచేసిన కంప్యూటర్లు పాడయిపోయి మూలనపడ్డాయి. దీంతో నిర్వాహణ లేక కంప్యూటర్ గదులన్నీ దుమ్ము, ధూళితో నిండిపోయాయి. సర్కారు బడుల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు కంప్యూటర్ పరి జ్ఞానం అందించాలన్న ఆశయం మంచి దైనా.. నిర్వహణ, పర్యవేక్షణ కొరవడి కోట్లాది రూపాయలు బూడిదలో పోసిన పన్నీరవుతోంది. మొదట ఇచ్చిన ఏజన్సీల కాలపరిమితి ముగిసిందని, పాఠశాలల్లో సాంకేతిక విద్యపై అవగాహన ఉన్న ఇతర ఉపాధ్యాయులతో బోధిం చాలని జిల్లాలోని ప్రధానోపాధ్యయులందరికీ తెలిపినట్లు జిల్లా డిప్యూటీ విద్యాధికారిని ఉషారాణి తెలిపారు. ఇప్పటికైనా స్పందించి ఉన్న కంప్యూటర్లతో సర్కారే స్వయంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. -
హైదరాబాద్‌లో మరిన్ని ఎయిర్‌పోర్టులు సాధ్యమేనా?
హైదరాబాద్: వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరిన్ని విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయంపై తీవ్ర చర్చ మొదలైంది. ప్రస్తుత శంషాబాద్ విమానాశ్రయం తరహాలో నగరంలోని మరో రెండుదిక్కుల్లో కూడా అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌పోర్టులు అవసరమని సీఎం ఇటీవలి సమావేశంలో అధికారులతో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే శంషాబాద్ విమానాశ్రయాన్ని నిర్మించిన జీఎంఆర్‌తో కుదుర్చుకున్న ‘రాయితీల ఒప్పందం’ మేరకైతే నగరంలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోం ది. రాష్ట్ర ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), జీఎంఆర్ మధ్య త్రిపక్ష ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి చుట్టూ 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలంటే జీఎంఆర్ నుంచి ఎన్వోసీ పొందాల్సి ఉంటుంది. లేనిపక్షంలో కొత్త వాటి నిర్మాణం కుదరదు. శామీర్‌పేట, ఘట్కేసర్ వద్ద రెండు విమానాశ్రయాలను ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. అయితే, ఈ రెండు విమానాశ్రయాల ఏర్పాటుకు జీఎంఆర్ నిరభ్యంతర పత్రం జారీ చేయడం కష్టమే. -
వైఎస్సార్ సీపీకి ఈసీ గుర్తింపుపై హర్షం
ఘట్కేసర్, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు రావడంతో మండలంలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రాజన్న జిందాబాద్, జైజై జగన్ అంటూ నినాదాలు చేస్తూ మిఠాయిలు తినిపించుకుంటూ మంగళవారం సాయంత్రం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గృహకల్ప కాలనీ వైఎస్సార్ సీపీ కన్వీనర్ కొండయ్య మాట్లాడుతూ పార్టీకి గుర్తింపు లభించడంతో మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు సక్రమంగా కొనసాగాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ అందించి సంక్షేమానికి తోడ్పడిన ఘనత వైఎస్‌దేనన్నారు. ఆయన హఠాన్మరణంతో పదవి చేపట్టిన వారు ఆ పథకాలన్నీ నీరుగార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే తమ కష్టాలు తొలగిపోతాయని అనుకుంటున్నారని చెప్పారు. వైఎస్సార్ సీపీకి ప్రజాదరణ ఓర్వలేని కొన్ని రాజకీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డిని ఎదగనీయకుండా కుట్రలు పన్నుతున్నాయని, ప్రజలు వాటిని గమనిస్తున్నారని... వాటికి తప్పక గుణపాఠం చెబుతారని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు సుందర్‌కుమార్, రమేషగుప్త, ఈశ్వరమ్మ, కొండల్, మురళి, కేఎస్ రావు, రంగయ్య, బీనాఠాగూర్, బయ్యన్న, దుర్గాప్రసాద్, రాజు, మహేష్, కిరణ్‌రెడ్డి, అశోక్, శ్రీనివాస్, అద్దాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యభిచార గృహంపై పోలీసులు దాడి
రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో వ్యభిచార గృహాంపై పోలీసులు గురువారం ఆకస్మిక దాడి చేశారు. ఆరుగురు యువతులతోపాటు ఓ విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఓ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విటుడిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురు యువతలను నగరంలోని పునరావాస కేంద్రానికి తరలించారు. ఘట్కేసర్లోని ఓ గృహంలో వ్యభిచారం జరుగుతుందని పోలీసులు సమాచారం అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ గృహంపై పోలీసులు దాడి చేశారు. -
బలహీనవర్గాల అభివృద్ధి టీడీపీకే సాధ్యం
మేడ్చల్ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి తోటకూర జంగయ్య యాదవ్ ఘట్కేసర్ టౌన్, న్యూస్‌లైన్: బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని టీడీపీ మేడ్చల్ అసెంబ్లీ అభ్యర్థి తోటకూర జంగయ్యయాదవ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో శనివారం ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బస్‌టెర్మినల్ ఆవరణలో మాట్లాడుతూ టీడీపీ హయూంలోనే మండలం అభివృద్ధి చెందిందన్నారు. మండల ప్రజాపరిషత్, తహసీల్దార్ కార్యాలయాలు, సంసృ్కతి టౌన్షిప్ తదితర నిర్మాణాలు చేపట్టారన్నారు. స్థానికేతరుడిగా ఓటు అడిగే హక్కు ఎమ్మెల్యే కేఎల్లార్‌కు లేదన్నారు. బలహీనవర్గాలకు చెందిన వ్యక్తిగా ఇతర అభ్యర్థులతో బేరీజు వేసుకొని ఓటేసి తనను గెలిపించాలన్నారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని టీడీపీ ప్రకటించిందని, ఇతర పార్టీలకు దమ్ముంటే సీఎం అభ్యర్థులను ప్రకటించాలని సవాల్ విసిరారు. మేడ్చల్ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అన్నారు. టీడీపీ అభ్యర్థుల విజయానికి సైకిల్ గుర్తుకు ఓటేయాలని కోరారు. పిలిస్తే పలికే.. మండలానికి చెందిన వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాంరెడ్డి, స్థానిక పంచాయతీ సభ్యులు రాంపల్లి జగదీష్‌గౌడ్, మీసాల సుధాకర్, నాయకులు బండారి శ్రీనివాస్‌గౌడ్, రాజబోయిన యాదగిరియాదవ్, బీజేపీ నాయకులు ఆ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి కంభం లక్ష్మారెడ్డి, గుండ్ల బాల్‌రాజ్, పసులాది చంద్రశేఖర్, బిక్కునాథ్‌నాయక్, కృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా మండలంలోని యంనంపేట్‌లో శనివా రం సాయంత్రం టీడీపీ నాయకుడు పొలగోని శ్రవణ్‌కుమార్ ఆధ్వర్యంలో యుువకులు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా జంగయ్య యాదవ్ మాట్లాడుతూ యంనంపేట్ ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామన్నారు. రోడ్డు వెడల్పు కార్యక్రమం, బ్రిడ్జి నిర్మాణంలో స్థలాలు కోల్పోయిన వారికి స్థలాలు అందచేస్తామన్నారు. తోటకూర జంగయ్య యాదవ్‌ను గొంగడితో సన్మానించి, గొర్రెపిల్లను టీడీపీ నాయకుడు శ్రవణ్‌కుమార్ బహుకరించారు. పొలగోని శంకర్, ప్రభాకర్‌గౌడ్, పొలగోని నర్సింహ, వెంకటేష్, చంద్రశేఖర్‌గౌడ్, మెట్టు కుమార్, బాషగళ్ల సుదర్శన్, సురేష్, చంద్రయ్యతో పలువురు టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోని ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పత్తెపు రాములు, శ్రీహరి, శంకర్, పోశెట్టి పాల్గొన్నారు. అలాగే మండలంలోని ఏదులాబాద్, అవుశాపూర్, అంకుశాపూర్, ఎన్ఎఫ్సీ నగర్ గ్రామాల్లో శనివారం నిర్వహించిన రోడ్‌షోలలో జంగయ్య యాదవ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాలేరు రామోజీ, బిక్కునాథ్ నాయక్, టీడీపీ నాయకులు రఘుపతి, పన్నాల ప్రభాకర్‌రెడ్డి, వెంకటేష్, డీవీ.రావు, రమాదేవి, మహిపాల్, భిక్షపతి, మహేష్, రాజు, రామలింగం, నడిమింటి వెంకటేష్, సాయిలు, రమేష్, సత్తయ్య తదితరులున్నారు. -
కాంగ్రెస్‌లో బానిసగా బతకలేను
జవహర్‌నగర్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు, నాయకులకు బానిస బతుకులు తప్పడం లేదని, దాంట్లో బానిసగా బతుకలేనని, అందుకే టీఆర్ఎస్ పార్టీలో చేరానని జవహర్‌నగర్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్ వెల్లడించారు. మల్కాజిగిరి టీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు, మేడ్చల్ టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి మలిపెద్ది సుధీర్‌రెడ్డి సమక్షంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణను నిర్మించేందుకు కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడాలని ఆకాంక్షిం చారు. కేసీఆర్ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రంగారెడ్డి జిల్లాలోని టీఆర్ఎస్ నాయకులను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని దీమా వ్యక్తం చేశారు. కుతాడి శ్రీనివాస్‌తోపాటు మరో వెయ్యిమంది కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఆలూరి రాజశేఖర్, నక్క ప్రభాకర్‌గౌడ్, విష్ణుగౌడ్లతోపాటు జవహర్‌నగర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
మహనీయుల బాటలో నడవాలి
ఘట్కేసర్, న్యూస్‌లైన్: జాతి నిర్మాణంలో మహనీయులు చూపిన బాటలో నడవాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. బాబు జగ్జీవన్‌రాం 107వ జయంతిని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం కోదండరాం మాట్లాడారు. పేద, బడు గు, బలహీన, దళితవర్గాల ఉన్నతికి జగ్జీవన్‌రామ్, అంబేద్కర్‌లాంటి నేతలెంతో కృషి చేశారని, వారిని నేటితరం నాయకులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నా రు. పాలకులు కార్పొరేట్, అవినీతిపరులకు వత్తాసు పలుకుతూ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ను మేం అభివృద్ధి చేశామంటే మేమని గొప్పలు చెప్పుకోవడం కాదని.. పల్లెలు అభివృద్థి చెందినప్పుడే నిజమైన అభివృద్ధి అని అన్నారు. అభివృద్ధి ఫలాలు సామాన్యుడికి అందినప్పుడే సార్ధకత లభిస్తుందన్నారు. తెలంగాణ నిర్మాణంలో అందరికీ లబ్ధి చేకూరాలన్నారు. చిన్నతరహా, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలని, చేతి వృత్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.బంగారు తెలంగాణ నిర్మాణంలో జేఏసీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకుడు చెల్మారెడ్డి, బీజేపీ జెడ్పీటీసీ అభ్యర్థి కంభం లక్ష్మారెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి రేసు లక్ష్మారెడ్డి పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
సీఐపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు
ఘట్కేసర్, న్యూస్‌లైన్: ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్న సీఐ జగన్‌పై తగిన చర్యలు తీసుకోవాలని మండలంలోని చౌదరిగూడ మాజీ సర్పంచ్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బైరు రాములు శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మండలంలోని కొర్రెముల గ్రామానికి చెందిన గ్యార జగన్ నగరంలో సీఐగా విధులుగా నిర్వహిస్తున్నారు. ఆయన తండ్రి లక్ష్మయ్య ప్రస్తుతం ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తన తండ్రిని ఎంపీటీసీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిపించుకోవాలని రాత్రి 11 గంటలకు ప్రభుత్వ వాహనంలో వచ్చి కొర్రెముల గ్రామ పరిథిలోని పలు కాలనీలో తిరుగుతూ సమావేశాలు నిర్వహిస్తూ విచ్చలవిడిగా డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. తమకు అనుకూలంగా లేని వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో సైతం ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న సీఐ జగన్‌పై విచారణ జరిపించి చర్య తీసుకోవాలని బైరు రాములు కోరారు. -
వెంటాడి.. వేటాడి
ఘట్కేసర్, న్యూస్‌లైన్: పాతకక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిని ప్రత్యర్థులు వెంటాడి.. వేటాడి .. కళ్లలో కారంపొడి చల్లి కత్తి, ఇనుపరాడ్డుతో దాడి చేశారు. ఈ సంఘటన మండలంలోని కొర్రెముల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొర్రెములకు చెందిన భవానీఆనంద్, కళమ్మ దంపతులు. భవానీఆనంద్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా భార్య వీబీకేగా విధులు నిర్వర్తిస్తోంది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో భవానీఆనంద్ ఉద్యోగం నుంచి బైకుపై ఇంటికి వచ్చాడు. భార్య తలుపు తీయకపోవడంతో బైకు హారన్ మోగించాడు. ఇంటికి సమీపంలో నివాసముంటున్న ప్రత్యర్థులు గ్యార యాదయ్య, అతని కుమారులు గోవర్ధన్, శివకుమార్‌లు అక్కడి వచ్చారు. తమకు నిద్రాభంగం చేశావని భవానీఆనంద్తో గొడవపడ్డారు. దీంతో స్థానికులు ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపించారు. శనివారం ఉదయం కూడా ఇరువర్గాల వారు ఘర్షణకు దిగారు. పాత కక్షలు ఉండడంతో గ్యార యాదయ్య తన కుమారులతో కలిసి భవానీఆనంద్‌ను వెంబడించారు. కళ్లలో కారం పొడి పోసి కత్తి, ఇనుపరాడ్డు, క్రికెట్ వికెట్‌తో బాదారు. భయపడిన భవానీఆనంద్ గ్రామంలోని మాజీ సర్పంచ్ గుడ్డు కృష్ణ ఇంటికి పరుగెత్తాడు. యాదయ్య తన కుమారులతో అక్కడికి చేరుకొని భవానీఆనంద్‌పై తిరిగి దాడి చేసి కళ్లలో కారంపొడి పోశారు. దీంతో భవానీఆనంద్ కుప్పకూలిపోయాడు. మాజీ సర్పంచ్ వచ్చి యాదయ్యతో పాటు ఆయన కుమారులను అడ్డుకున్నాడు. తీవ్ర రక్తస్రావం అవుతున్న భవానీఆనంద్‌ను ఆస్పత్రికి తరలించాడు. స్థానికుల సాయంతో ఆయన యాదయ్య, ఆయన కుమారుడు శివకుమార్‌ను పోలీసులకు అప్పగించాడు. గోవర్ధన్ పరారీలో ఉన్నాడు. నిందితులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యర్థుల దాడితో తీవ్ర భయాందోళనకు గురైన భవానీఆనంద్ కుటుంబం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. ప్రస్తుతం భవానీఆనంద్కు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. రూ. 50 కోసం కక్షలు.. ఏడాది క్రితం భవానీ ఆనంద్ కొర్రెముల గ్రామంలో కొన్నాళ్లపాటు టైప్‌రైటింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించాడు. నెలకు ఫీజు రూ.150గా నిర్ణయించాడు. ఇన్స్టిట్యూట్లో గ్యార యాదయ్య కుమారుడు గోవర్ధన్ చేరాడు. ఆయన ఫీజు రూ.150కు బదులు రూ.100 చెల్లించాడు. మిగతా రూ.50 కోసం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇది చినికిచినికి గాలివానలా మారింది. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య కక్షలు పెరిగాయి. తరచు గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో రెండు నెలల క్రితం గోవర్ధన్‌పై ఆనంద్ దాడి చేశాడు. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా శనివారం భవానీఆనంద్‌పై యాదయ్య కొడుకులతో కలిసి దాడి చేశాడు. -
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి
ఘట్కేసర్, న్యూస్‌లైన్: బైకును ఆటో ఢీకొనడంతో ఓ బీటెక్ విద్యార్థి దుర్మణం చెందాడు. ప్రమాదంలో మరో విద్యార్థికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని జోడిమెట్ల సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కొత్తపేట ప్రాంతంలోని టెలిఫోన్ కాలనీకి చెందిన తాళ్లపాక రాంమోహన్‌రావు కుమారుడు సందీప్ ఘట్కేసర్ మండల పరిధిలోని అనురాగ్ కాలేజీలో ఇంజినీరింగ్ నాలుగో ఏడాది చదువుతున్నాడు. నగరంలోని తార్నాకలో నివాసం ఉండే కరుణకాంత్ సందీప్ క్లాస్మేట్. ఇద్దరూ మంచి స్నేహితులు. శుక్రవారం సందీప్ బైకుపై కళాశాలకు బయలుదేరాడు. మండల పరిధిలోని జోడిమెట్ల వద్ద కరుణకాంత్కు స్నేహితుడు లిఫ్ట్ ఇచ్చాడు. కొద్దిదూరం వెళ్లాక మరో 5 నిమిషాల్లో కళాశాలకు చేరుకోవాలి ఉండగా ఎదురుగా వచ్చిన ఆటో వీరి బైకును ఢీకొంది. ప్రమాదంలో సందీప్‌కు తీవ్రగాయాలై రక్తస్రావం జరిగి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బైకు వెనుకాల కూర్చున్న కరుణకాంత్ ఎడమ చేయి విరిగింది. చికిత్స నిమిత్తం అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సందీప్ మృతదే హానికి నగరంలోని గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. ఎదిగి వచ్చిన కుమారుడు మృత్యువాత పడ్డాడని సందీప్ తల్లిదండ్రులు రోదించిన తీరు హృదయ విదారకం. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కారు బోల్తా: మహిళ దుర్మరణం
ఘట్కేసర్, న్యూస్‌లైన్: లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందింది. ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని జాతీయ రహదారిపై అంకుశాపూర్ హెచ్‌పీసీఎల్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌లోని చార్‌బౌలీ ప్రాంతంలో నివాసం ఉండే ఎండీ వాజిద్‌అలీ వ్యాపారి. ఆయన తన కుటుంబీకులు, వదిన, అల్లుడితో కలిసి శుక్రవారం హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి కారులో బయలుదేరాడు. మార్గంమధ్యలో మండల పరిధిలోని అంకుశాపూర్ హెచ్‌పీసీఎల్ వద్ద వీరి కారు లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. దీంతో వాహనం బోల్తాపడింది. తీవ్ర గాయాలైన వాజీద్ అలీ వదిన అయేషా సిద్దిఖీ(40) అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ఉన్న వాజిద్ అలీ, ఆయన కుటుంబీకులు సయ్యద్ సల్మాన్, నజియా, ముంతాసీన్, డ్రైవర్ లక్ష్మణ్‌లకు గాయాలయ్యాయి. అయేషాసిద్దిఖీ మృతదేహానికి నగరంలోని గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. క్షతగాత్రులను నగరంలోని ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
కట్న దాహానికి గర్భిణి బలి
ఘట్కేసర్, న్యూస్‌లైన్: కట్న దాహం ఓ గర్భిణిని బలితీసుకుంది. భర్త అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ వివాహిత ఉరివేసుకొని తనువు చాలించింది. ఈ విషాదకర సంఘటన మండల పరిధిలోని పోచారం అన్నానగర్ కాలనీలో బుధవారం వెలుగుచూసింది. పోలీసు లు, కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా ములుగు మండలం పందికొండ గ్రామానికి చెందిన పసుల వెంకన్న అదే జిల్లా నల్లవెళ్లి మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన స్వప్న(21)ను గతేడాది ఏప్రిల్ 17న వివాహం చేసుకున్నాడు. ఐదు తులాల బంగారం, రూ. మూడున్నర లక్షలు, రూ.50 వేలు విలువ చేసే సామగ్రి, ప్యాషన్ బైకును స్వప్న తల్లిదండ్రులు కట్నంగా ఇచ్చారు. ఆరునెలల క్రితం ఉపాధి కోసం దంపతులు మండలంలోని పోచారం అన్నానగర్ కాలనీకి వచ్చారు. వెంకన్న సమీపంలో ఉన్న ఐటీసీలో హమాలీ పనులు చేస్తున్నాడు. పుట్టింటి నుంచి రూ. రూ.50 వేలు అదనపు కట్నం తీసుకురావాలని వెంకన్న కొంతకాలంగా భార్యను వేధించసాగాడు. ఇదే విషయమై మం గళవారం భార్యాభర్తలు ఇంట్లో గొడవపడ్డారు. సాయంత్రం వెంకన్న పనికి వెళ్లిపోయాడు. రాత్రి 10 గంటల సమయంలో ఆయన భార్యకు ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన వెంకన్న ఇంటికి వచ్చి చూడగా స్వప్న ఫ్యాన్‌కు వేలాడుతోంది. వెంటనే కిందికి దించి కాలనీ వాసుల సాయంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించాడు. వైద్యులు పరిశీలించి అప్పటికే స్వప్న మృతి చెం దినట్లు నిర్ధారించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పోలీ సుల సమాచారంతో బుధవారం ఉద యం స్వప్న తల్లిదండ్రులు, బంధువులు అన్నానగర్‌కు వచ్చారు. వెంకన్న అదనపు కట్నం కోసం వేధించడంతోనే స్వప్న ఆత్మహత్యకు పాల్పడింద ని కన్నీటిపర్యంతమయ్యారు. భర్త వేధింపులను తమకు ఎప్పటికప్పుడు స్వప్న ఫోన్ చేసి తెలిపేదని మృతురాలి తల్లిదండ్రులు గుండెలుబాదుకున్నారు. బుధవారం మల్కాజిగిరి ఏసీపీ చిన్నయ్య ఘటనా స్థలానికి చేరుకొని బంధువులతో మాట్లాడారు. స్వప్న ఐదు నెలల గర్భవతి అని బంధువులు, కాలనీవాసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుం బీకులకు అప్పగించా రు. మృతురాలి తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బిల్డింగ్‌పై నుంచి పడి ఇన్పోసిస్ ఉద్యోగి మృతి
హైదరాబాద్ నగర శివారు ఘట్కేసర్లోని అన్నోజిగూడలో సింగపూర్ టౌన్షిప్లో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ దీపక్ ఫకీర్ హబీబ్ ఈ రోజు ఉదయం పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్‌లో దీపక్ పని చేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. ఇటీవల అతడు బెంగళూరు నుంచి బదిలీపై హైదరాబాద్ వచ్చాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
డివైడర్‌ను ఢీకొన్న ఆటో: ఇద్దరు మృతి
రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం ఉదయం ఆటో డివైడర్‌ను ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో అదే రహదారిపై వెళ్తున్న స్థానికులు వెంటనే స్పందించి 108కు సమాచారం అందించారు.దాంతో 108 వాహనం సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హైదరాబాద్ నగరంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహలను పోస్ట్ మార్టం నిమిత్తం హైదరాబాద్ తరలించారు. అతి వేగమే ఆ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘గురుకులం’పై గద్దలు!
ఘట్కేసర్, న్యూస్‌లైన్: నిరుపేదలకు ఉచితంగా విద్యనందించాలనే సదుద్దేశంతో ఘట్కేసర్లో నిర్మించిన గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల మనుగడకు ముప్పు వాటిల్లింది. దశాబ్ధాల క్రితం దాతలు అందజేసిన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో ప్రముఖ విద్యాసంస్థగా పేరుగాంచిన ఇక్కడి విద్యాసంస్థ నేడు దయనీయ స్థితికి చేరింది. ప్రముఖ ఆర్యసమాజ నాయకుడు, సంఘ సేవకుడు బన్సీలాల్ వ్యాస్జీ 1938 సంవత్సరంలో నగరంలోని రాంబాగ్‌లో నిరుపేదలకు తెలుగు, సంస్కృతం మాధ్యమంలో విద్యను అంద జేయాలని పాఠశాలను ప్రారంభించారు. అనంతరం కొన్ని కారణాల వల్ల 1942లో ఆ పాఠశాలను ఘట్కేసర్కు తరలించారు. ఇక్కడ సుమారు 24ఎకరాల స్థలంలో గురుకుల జూనియర్ కళాశాల, పాఠశాలను ఏర్పాటు చేశారు. తన అల్లుడు చేస్తున్న సమాజసేవకు ముగ్దుడైన బన్సీలాల్ వ్యాస్జీ మామ వైద్యనాథ్.. శేరిలింగంపల్లి సమీపంలోని మాదారం, వెంకటాపూర్‌లో ఉన్న 627ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. దానిని వ్యాస్జీ తన పేరుమీద కాకుండా గురుకులం పేరు మీదకు మార్చారు. దాని ద్వారా లభించే ఆదాయాన్ని పూర్తిగా గురుకులాల నిర్వహణకే ఖర్చుచేశారు. వ్యాస్జీ చేస్తున్న కృషిని చూసిన పలువురు ప్రముఖులు సైతం విరాళాలు అందజేశారు. అయితే నిర్వహణ సరిగా లేక ఆదాయం క్షీణించి గురుకులాల మనుగడ కష్టంగా మారినట్టు తెలుస్తోంది. ఘట్కేసర్ స్థలంలో అనేక నిర్మాణాలు ఘట్కేసర్లో కేటాయించిన స్థలంలో కొన్ని కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పించారు. నిరుపేద, సామాజికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం వసతి గృహాన్ని సైతం ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందించారు. యజ్ఞయాగాలు నిర్వహించటానికి పెద్దయజ్ఞశాలను నిర్మించారు. పిల్లలకు ధ్యానంపై శిక్షణ ఇప్పించటానికి ధ్యాన మందిరం నిర్మించారు. కబ్జాదారుల కన్ను.. గురుకులం భుములపై ఇప్పుడు కబ్జాదారుల కన్ను పడింది. సుమారు ఐదెకరాలు ఇప్పుడు అన్యాక్రాంతమైంది. దీని విలువ రూ.ఐదు కోట్ల వరకు ఉంటుందని అంచనా. ట్రస్టు నుంచి ప్రశ్నించేవారు లేకపోవడం, నిర్వహణను గాలికొదలడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. తాజాగా ఇటీవల ఒకటిన్నర ఎరకం కబ్జాకు గురికావడంతో స్థానికులు స్పందించి అడ్డుకున్నారు. మిగిలిన భూమికూడా అక్రమార్కుల పరం కాకముందే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉండగా బన్సీలాల్ వ్యాస్జీ 1956లో జడ్చర్ల వద్ద జరిగిన రైలు ప్రమాదంలో చనిపోయారు. ఆయన స్మృతి చిహ్నంగా ప్రతి ఏడాది సెప్టెంబర్ 2న గురుకులంలో 24గంటలు అఖండ గాయత్రీ మంత్రం పఠించి అన్నదానం చేస్తారు. బన్సీలాల్ వ్యాస్జీ చనిపోయిన కొన్నాళ్లకు గురుకుల విద్యాసంస్థ నిర్వహణ ట్రస్టు మారింది. దానికి చైర్మన్‌గా కొంతకాలం వందేమాతరం రామచంద్రరావు కొనసాగారు. ట్రస్టు సభ్యుల మ ద్య విభేదాలు తలెత్తడంతో ఆలనాపాలన చూ సుకునేవారు లేకపోయారు. ఆ తర్వాత మారి న ట్రస్టు సభ్యులు గురుకుల అభివృద్ధిని విస్మరించారు. ప్రస్తుతం గురుకుల భూములు కబ్జా కు గురవుతున్నా సంస్థ తరఫున ప్రశ్నించేవా రు లేరు. ఇటీవల ఓ వ్యాపారవేత్త ఒకటిన్నర ఎకరం భూమి చుట్టూ కడీలు పాతి కబ్జాకు పాల్పడగా దానిని స్థానికులు అడ్డుకున్నారు. దయనీయం.. నేటి పరిస్థితి దేవాదాయశాఖసహకారంతో ప్రస్తుతం గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల పనిచేస్తున్నాయి. ఉపాధ్యాయుల నియామకాలు లేవు. దాంతో తక్కువ మంది ఉపాధ్యాయులు, ప్రైవేట్ టీచర్ల సహాయంతో విద్యా సంవత్సరాన్ని నెట్టుకొస్తున్నారు. ఉపాధ్యాయులు తక్కువ గా ఉండటంతో విద్యార్థుల సంఖ్య ప్రతి సంవత్సరం తగ్గుతోంది. కొన్ని గదులు శిథిలావస్థకు చేరుకోగా మిగిలిన గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. దాతలు, పూర్వ విద్యార్థులు కొన్ని తరగతి గదులను నిర్మించారు. కబ్జాదారులపై కేసులు పెడతాం: ఎమ్మెల్యే గురుకుల స్థలాలను కబ్జాచేస్తే కేసులు పెడతామని స్థానిక ఎమ్మెల్యే కేఎల్లార్ ఇటీవల జరిగిన వ్యాస్జీ వర్ధంతి సభలో హెచ్చరించారు. కబ్జా చేసినవారితోపాటు అందుకు సహకరించిన వారిపై కేసులు నమోదు చేయిస్తామన్నారు. కబ్జాలకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు. -
సంపులో పడి చిన్నారి మృతి
ఘట్కేసర్,న్యూస్‌లైన్: రెండు రోజుల్లో గృహ ప్రవేశానికి ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అంతలోని వారి కూతురు సంపులో పడి దుర్మరణం చెందింది. ఈ విషాదకర సంఘటన శనివారం రాత్రి మండల పరిధిలోని అన్నోజిగూడ లక్ష్మీనరసింహ కాలనీలో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీలోనిగువ్వల మురళీ, లత దంపతులు ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. వీరికి కూతురు రమ్య (4) ఉంది. దంపతులు ఇటీవలే అదే కాలనీలో ఓ ఇల్లు కొనుగోలు చేశారు. రెండు రోజుల్లో గృహ ప్రవేశం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం సాయంత్రం ఇంటికి రంగులు వేసే పనుల్లో కుటుంబీకులు నిమగ్నమయ్యారు. అనంతరం చిన్నారి రమ్య కోసం గాలించినా ఆమె జాడ కనిపించలేదు. చివరగా ఇంటి ఆవరణలో ఉన్న సంపులో చూడగా రమ్య మృతదేహం తేలియాడుతూ కనిపించింది. బాలిక మృతితో తల్లిదండ్రులు గుండెలుబాదుకుంటూ రోదించసాగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీయించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతం
ఘట్కేసర్/ ఘట్కేసర్ టౌన్, న్యూస్‌లైన్: ఘట్కేసర్, ఎన్ఎఫ్సీ నగర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. ఘట్కేసర్ లో 71.84 శాతం, ఎన్ఎఫ్సీ నగర్లో 75 శాతం పోలింగ్ నమోదైనట్టు జిల్లా సహాయ ఎన్నికల అధికారి, ఎంపీడీఓ దేవసహాయం తెలిపారు. ఘట్కేసర్లోని 18 వార్డుల్లో కలిపి మొత్తం 16,116 ఓట్లుండగా 11,578 ఓట్లు పోలయ్యాయి. మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన 41 పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎన్‌ఎఫ్‌సీనగర్ గ్రామ పంచాయతీలో మొత్తం 3,111 ఓట్లు ఉండగా 2,330 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఓటరు జాబితాలో తప్పులు దొర్లడంతో కొందరు ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. జాబి తాలో పేరు రెండు సార్లు ఉండటంతో ఒకరిద్దరు రెండో సారి ఓటు వేయడానికి వచ్చి పోలీసులకు చిక్కారు. ఘట్కేసర్ సర్పంచ్‌గా అబ్బసాని యాదగిరి ఘట్కేసర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా అబ్బసాని యాదగిరి యాదవ్ 1,002 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అబ్బసాని యాదగిరి యాదవ్‌కు 6,171 ఓట్లు, బండారి శ్రీనివాస్‌కు 5,169 ఓట్లు, సాయినోజు మనోహరకు 39 ఓట్లు వచ్చాయి. మరో 199 ఓట్లు చెల్లలేదు. ఎన్ఎఫ్సీ నగర్ సర్పంచ్‌గా స్టీవెన్ ఎన్ఎఫ్సీ నగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా స్టీవెన్ 370 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. స్టీవెన్‌కు 1,239 ఓట్లు, కనపాల రాజేష్‌కు 869 ఓట్లు, డీవీరావుకు 196 ఓట్లు వచ్చాయి. 26 ఓట్లు చెల్లలేదని అధికారులు తెలిపారు. ఎన్ఎఫ్సీ పరిశ్రమకు చెందిన విశ్రాంత ఉద్యోగైన స్టీవెన్‌కు కాంగ్రెస్ పార్టీలోని కట్ట జనార్దన్‌రెడ్డి వర్గం, బీజేపీ నాయకుడు మైపాల్‌రెడ్డి, టీడీపీ నాయకుడు వెంకటేష్ ముదిరాజ్, టీఆర్ఎస్ నాయకుడు బొక్కా ప్రభాకర్‌రెడ్డిలు మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం చేశారు. 4 అటు వర్షం.. ఇటు విద్యుత్ కోత.. తాండూరు టౌన్ /మేడ్చల్, న్యూస్‌లైన్: ఓ వైపు జడివాన.. మరో వైపు విద్యుత్ కోత.. వెరసి బుధవారం జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. నాలుగైదు రోజులుగా కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రాత్రి వేళల్లో సైతం విద్యుత్ కోత విధిస్తున్నారు. ఇదిలా ఉండగా తాండూరు, మేడ్చల్, వికారాబాద్, మోమిన్‌పేట, హయత్‌నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన వర్షం.. రెండు గంటలపాటు ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో తాండూరు, మేడ్చల్ పట్టణాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మేడ్చల్ పట్టణంలోని వినాయక్‌నగర్, ఆర్టీసీ కాలనీ, బాలాజీనగర్, హౌసింగ్ బోర్డు కాలనీల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. స్థానిక అయ్యప్ప గుడి సమీపంలోని గ్రేస్వెల్ అనాథాశ్రమంలోకి నీళ్లు చేరడంతో పిల్లల దుస్తులు, దుప్పట్లు నీట మునిగాయి. చిన్నపాటి వర్షం కురిసినా భవనంలోకి నీరు చేరుతోందని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ఆశ్రమ నిర్వాహకుడు జాకబ్ చెప్పారు. విద్యుత్ కోత కారణంగా తాండూరులోని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఘట్కేసర్లో పంచాయతీ ఎన్నికలు
ఘట్కేసర్, న్యూస్‌లైన్: పార్టీల మద్దతు, కుల, యువజన, మహిళా సంఘాల అండ... అభ్యర్థుల పోటాపోటీ ప్రచారం... ‘స్థానిక’ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. బుధవారం మండలంలోని ఘట్కేసర్, ఎన్ఎఫ్సీ నగర్ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు అధికారులు పూర్తిచేయగా, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక శాసన సభ్యుడు కె.లక్ష్మారెడ్డి ఘట్కేసర్ ఎన్నికలను సవాలుగా తీసుకొని గల్లీ గల్లీకి తిరిగి ప్రచారం చేశారు. అయితే ఆయన టీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేయడం విశేషం. కాగా, ఇక్కడే టీడీపీ మద్దతుదారు సర్పంచ్ అభ్యర్థికి కాంగ్రెస్ నాయకుడు మద్దతు తెలపడం మరో విశేషం. ఘట్కేసర్లో పోటాపోటీ... ఘట్కేసర్ పంచాయతీ సర్పంచ్ పదవికి బండారి శ్రీనివాస్, అబ్బసాని యాదగిరి యాదవ్‌లు పోటీలో ఉన్నారు. ఇరువురూ పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. బండారి శ్రీనివాస్‌కు టీడీపీ పూర్తి మద్దతు ఇస్తోంది. కాగా, కుల, యువజన సంఘాల మద్దతు తనకే ఉందని ఆయన చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి రాంరెడ్డి పార్టీ ఆదేశాలను పక్కనపెట్టి బండారి శ్రీనివాస్‌కు మద్దతు ఇస్తున్నారు. సస్పెండ్ చేస్తామని బెదిరించినా వెనక్కి తగ్గకుండా రాంరెడ్డి తన సతీమణిని సైతం ప్రచారానికి పంపారు. ఇక మరో అభ్యర్థి అబ్బసాని యాదగిరి టీఆర్ఎస్ మద్దతుతో రంగంలో ఉన్నారు. ఈయనకు బీజేపీ, సీపీఎంలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. అయితే కాంగ్రెస్ స్థానిక ఎమ్మెల్యే కె.లకాష్మరెడ్డి స్వయంగా అబ్బసాని యాదగిరిని సర్పంచ్‌గా గెలిపించాలని ప్రచారం చేయడం విశేషం. ఎలాగో కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం అవుతుంది కాబట్టి అబ్బసాని యాదగిరికి మద్దతు ఇస్తున్నట్టు ఎమ్మెల్యే వివరించారు. ఆయనే రోజూ ఎన్నికల ప్రచార తీరును పరిశీలించడంతో పాటు ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసే సామాజిక వర్గాలను స్వయంగా కలిసి అబ్బసాని యాదగిరికి ఓట్లు వేయాల్సిందిగా అభ్యర్థించారు. ఘట్కేసర్ పంచాయతీలో 18 వార్డు స్థానాలకు గాను 71మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఎన్ఎఫ్సీ నగర్లో త్రిముఖ పోటీ...ఎన్ఎఫ్సీ నగర్ పంచాయతీలో 12 వార్డులు ఉండగా 43 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అలాగే సర్పంచ్ పదవి కోసం ముగ్గురు రంగంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కనపాల రాజేష్, అలాగే కాంగ్రెస్‌లోని ఒక వర్గం నాయకులు, టీడీపీ, బీజేపీల మద్దతుతో స్టీవెన్, పలు మహిళా సంఘాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా డీవీ రావు పోటీలో ఉన్నారు. కనపాల రాజేష్ గతంలో సర్పంచ్‌గా, ఆ తర్వాత ఆయన తల్లి పెర్సీబాయి సర్పంచ్‌గా పనిచేశారు. దాదాపు దశాబ్దకాలంగా వారి కుటుంబ సభ్యులే సర్పంచ్‌లుగా ఉన్నారు. చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని రాజేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక స్టీవెన్ ఎన్ఎఫ్సీ పరిశ్రమ విశ్రాంత ఉద్యోగి. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, టీడీపీ, బీజేపీ అభిమానుల ఓట్లతో గెలుపొందుతానని స్టీవెన్ వి శ్వా„సంగా ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉన్న డి.వి.రావు ఇంతకుముందు వార్డు సభ్యుడిగా పనిచేశారు. వృత్తిరీత్యా మేస్త్రీ కావడంతో గ్రామంలో తనకు ఉన్న పరిచయాలు ఓట్లుగా మారతయనే ధీమాతో ఉన్నారు. -
మరో రెండు పంచాయతీలకు ఎన్నికలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తాజాగా మరో రెండు పంచాయతీల్లో ఎన్నికల నగారా మోగింది. ఘట్కేసర్, ఎన్ఎఫ్సీ నగర్ పంచాయతీలకు అక్టోబర్ 9న ఎన్నికల తేదీని ఖరారు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు పంచాయతీల పాలకవర్గ పదవీకాలం వచ్చే నెల 16వ తే దీన ముగియనుంది. ఈ నెల 25వ తేదీన మొదలయ్యే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ 29న ముగియనుంది. 30న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 1న నామినేషన్లపై అభ్యంతరాల నమోదు, 2న అభ్యంతరాల పరిష్కారం, 3న నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రచురిస్తామ ని కలెక్టర్ బి.శ్రీధర్ తెలిపారు. 9న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్, 2 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.