ఘట్‌కేసర్ టౌన్: మండలంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల అభివృద్ధికి సబ్‌ప్లాన్ నిధులు మంజూరు కావడం లేదు. వారికి కేటాయించిన నిధులు వారికే వెచ్చించాలని 2013లో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించింది. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ జనాభాకు అనుగుణంగా ప్రత్యేక నిధులను ప్రభుత్వం విడుదల చేయడానికి ఆర్థిక శాఖలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసింది. దీన్ని పటిష్టంగా అమలు చేయడానికి సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నోడల్ ఏజన్సీని నియమిం చింది.
ఆయా కాలనీల అభివృద్ధికి నివేదికలు తయారుచేసి ఏడాది క్రితం ప్రభుత్వానికి పంపారు. ఇప్పటికీ సర్కా రు నిధులను విడుదల చేయకపోవడంతో కాలనీల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.
చట్టబద్ధత కల్పించి ఏడాది గడిచినా..
గతంలో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను దారి మళ్లించి ఇతర పనులకు వినియోగించారు. విడుదలైన నిధులు దారి మళ్లకుండా సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించి ఏడాది గడిచినా ఎస్సీ, ఎస్టీల కాలనీలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. మండలంలో గుంటిగూడెం, కొండాపూర్, మాదాపూర్, కాచివానిసింగారం, అంకుషాపూర్, యంనంపేట్ తదితర గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీల కాలనీల అభివృద్థికి అవసరమైన పనులకు నిధులను విడుదల చేయాలని ప్రభుత్వానికి నివేదికలు పంపారు.
సబ్‌ప్లాన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీల గృహనిర్మాణం, తాగునీరు, ఇందిర జలప్రభ, గ్రామీణ రోడ్లు, మురుగుకాల్వలు, పింఛన్లు, పొదుపు సంఘాల నిర్వహణ తదితర అంశాలకు సంబంధించి నిధులు కేటాయించాలని ప్రణాళికలు వేశారు. ఆయా కాలనీలు డ్రైయినేజీ వ్యవస్థ సరిగా లేక దుర్గంధం వెదజల్లుతున్నాయి. దీంతో చిన్నపాటి చినుకుకే మట్టిరోడ్లు చిత్తడిగా మారి ప్రజలు నడవడానికి ఇబ్బంది పడుతున్నారు. మండలంలో 2013లో ఇంది రమ్మ కలలు పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఊరూరా సమావేశాలు నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్ర ణాళికలను వేసి నిధులను విడుదల చే యాలని పంపిన నివేదికలక ు మోక్షం లభించడం లేదు. అధికారులు స్పందించి నిధులను విడుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు.
సబ్‌ప్లాన్‌కు మంగళం..
Published Wed, Sep 10 2014 11:18 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
Advertisement