Sub plan funds
-
గిరిజనుల అభివృద్ధికి రూ.4,988 కోట్లు
సాక్షి, అమరావతి: గత ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన సబ్‌ప్లాన్ నిధుల అవినీతిపై నోడల్ ఏజెన్సీతో విచారణ జరిపిస్తామని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో గిరిజన సబ్‌ప్లాన్ నిధులను దారిమళ్లించి.. దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో పారదర్శక పాలన జరుగుతుందన్నారు. సబ్‌ప్లాన్ నిధులు దుర్వినియోగం కాకుండా ప్రతి పైసా గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గిరిజనుల అభివృద్ధికి రూ.4,988 కోట్లతో ఉప ప్రణాళికను అమలు చేస్తున్నామని పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. -
పక్కదారి పట్టిన సంక్షేమం
‘చట్టం ఎంత గొప్పదైనా అమలు చేసేవాడు చెడ్డవాడయితే చెడ్డ ఫలితాలు వస్తాయి. చట్టం ఎంత చెడ్డదయినా అమలు చేసేవాడు మంచివాడయితే మంచి ఫలితాలు వస్తాయి’ అని బాబాసాహెబ్ అంబేడ్కర్ ఎప్పుడో చెప్పారు. దీనిలో మొదటి వాక్యానికి సరిపోయేలా చంద్రబాబు ఐదేళ్లపాటు ఈ రాష్ట్రాన్ని పాలించాడని ప్రజలు అంటున్నారు. దళిత గిరిజన సంక్షేమంను కనీసం పట్టించుకోకపోవడం వల్ల వారి అభివృద్ధి నిలిచిపోయింది. సాక్షి, ఉలవపాడు (ప్రకాశం): ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దళిత, గిరిజనుల అభివృద్ధికి ఖర్చు చేయకుండా ఇతర పనులకు పాలకులు పక్కదారి పట్టించారన్న విమర్శలు ఆ వర్గాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా శాఖలవారీగా నిధులు వినియోగం గురించి సమాచారం కూడా అందుబాటులో లేకుండా ప్రభుత్వం చేసిందని ఆరోపణలున్నాయి. ఎస్సీ, ఎస్టీ కాలనీల పర్యవేక్షణ కోసం రూ. 300 కోట్లు ఖర్చు పెట్టాలని ఆదేశాలున్నా వాటిని ఖర్చు పెట్టకుండా ఖర్చు చేశామని లెక్కలు చెప్పిన దుస్థితి ఉందని విమర్శిస్తున్నారు. సబ్‌ప్లాన్ ఉద్దేశ్యమిదీ... అందరికీ సమాన అభివృద్ధి జరగాలనే ఉద్దేశ్యంతో 1974–75 సంవత్సరంలో పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఎస్టీల కోసం గిరిజన ఉప ప్రణాళికను ఏర్పాటు చేశారు. 1979–80లో ఆరో పంచవర్ష ప్రణాళికలో ఎస్సీల కోసం స్పెషల్ కంపోనెంట్ ప్లాన్ ఏర్పాటు చేశారు. జనాభా ప్రాతిపదికన 16.2 శాతం ఉన్న ఎస్సీలు, 8.2 శాతం ఉన్న ఎస్టీలు మొత్తంగా కలసి బడ్జెట్లో కూడా 24.4 శాతం బడ్జెట్ కేటాయించాలని నిర్ణయించారు. నిధులు దారి మళ్లకుండా 2013 జనవరి 24వ తేదీన షెడ్యూల్డ్ కాస్టు సబ్‌ప్లాన్ అండ్ ట్రైబల్ సబ్‌ప్లాన్ ప్లానింగ్ ఆలోకేషన్, అండ్ యుటిలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ యాక్టును ప్రవేశపెట్టారు. ఈ నిధులు పక్కదారి పట్టకుండా ఖర్చు చేయాలని, నిధులు ఖర్చు కాకపోతే తరువాత ఆర్థిక సంవత్సరానికి వాడుకునే సౌలభ్యాన్ని తీసుకువచ్చారు. శాసన సభ సాక్షిగా చేసిన ఈ చట్టానికి చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడిచింది. నిధులన్నీ పక్కదారే... ఈ ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం దళిత గిరిజనులను చిన్నచూపు చూసింది. సబ్‌ప్లాన్ నిధులను సంబంధం లేని పథకాలకు కేటాయించారు. రాజధాని నిర్మాణం కోసం, స్టేడియంల నిర్మాణాలు అంటూ ఆయా శాఖలకు మళ్లించారు. ఇక ప్రకృతి విపత్తులకు కూడా ఈ నిధులను కేటాయించారు. ఈ నిధులతో ప్యాసింజరు ఆటోలు ఇవ్వాల్సి ఉన్నా చెత్త తొలగించే ఆటోలు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. భూములకు సంబంధించిన కొనుగోలు–పంపిణీ జరగలేదు. ప్రభుత్వం చేశామని చెప్తున్నా వాటికి సంబం«ధించిన వివరాల సమాచారం మాత్రం లేని పరిస్థితి. ఇక కృష్ణా, గోదావరి పుష్కరాలకు కూడా ఇవే నిధులు వాడారని, ప్రస్తుతం పసుపు–కుంకుమ పథకానికి కూడా ఈ నిధులనే ఉపయోగిస్తున్న పరిస్థితులు ఈ ప్రభుత్వంలో నెలకొన్నాయి. ప్రభుత్వంపై మండి పడుతున్న దళిత, గిరిజనులు తమకు కేటాయించిన నిధులను తమకు ఖర్చు చేయకుండా.. పక్కదారి పట్టించడం పట్ల దళిత గిరిజనులు మండిపడుతున్నారు. కనీసం 30 శాతం నిధులు కూడా ఖర్చు పెట్టని పరిస్థితి ఈ ఐదేళ్ల కాలంలో జరిగిందన్నారు. దళిత గిరిజన సంక్షేమం అంటే చంద్రబాబుకి చిన్నచూపు అని అందుకే తమ నిధులు తమకు ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శిస్తున్నారు. దళిత గిరిజన సంక్షేమం అనేది లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో దళిత గిరిజనులు దగ్గాపడ్డారని వాపోతున్నారు. ► ఎస్టీలకు సంబంధించి జనాభా 27,40,133 ఉన్నారు. కేటాయింపులు ఇలా... సంవత్సరం నిధుల కేటాయింపులు 2014–15 1500.26 కోట్లు 2015–16 1904.48కోట్లు 2016–17 3099.96 కోట్లు 2017–18 3528.75 కోట్లు 2018–19 4176.60 కోట్లు మొత్తం 14,210.05 కోట్లు ఎస్సీలకు సంబంధించిన వివరాలు ఇవీ... ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 13 జిల్లాలు, 676 మండలాలున్నాయి. ఇందులో 84,45,399 మంది ఎస్సీలు ఉన్నారు. వీరికి సంబంధించి నిధులు కేటాయింపు ఇలా జరిగింది. సంవత్సరం నిధుల కేటాయింపులు 2014–15 4574.47 కోట్లు 2015–16 5880.62 కోట్లు 2016–17 8724.25 కోట్లు 2017–18 9847.13 కోట్లు 2018–19 11,228.10 కోట్లు మొత్తం 40,254.57 కోట్లు నిధుల పక్కదారి ఇలా సంవత్సరం ఎస్సీ, ఎస్టీ ప్లాన్ నిధులు ఖర్చుపెట్టిన నిధులు శాతం పక్కదారి 2014–15 రూ. 6074 కోట్లు రూ. 1518 కోట్లు సుమారు 25 శాతం రూ. 4556 కోట్లు 2015 – 16 రూ. 7784 కోట్లు రూ. 1556 కోట్లు 20 శాతం రూ. 6228 కోట్లు 2016–17 రూ.11823 కోట్లు రూ. 2354 కోట్లు 20 శాతం రూ. 9429 కోట్లు 2017–18 రూ. 13375 కోట్లు రూ. 3343 కోట్లు 25 శాతం రూ. 10032 కోట్లు 2017–19 రూ. 15404 కోట్లు రూ. 3080 కోట్లు 20 శాతం రూ. 12324 కోట్లు దళిత సంక్షేమంపై చిన్నచూపు ఈ ప్రభుత్వం దళిత సంక్షేమంపై చిన్న చూపు చూసింది. నిధులను పక్కదారి పట్టించింది. కనీసం 25 నుంచి 30 శాతం నిధులను మాత్రమే వినియోగించడం భాదాకరం. ఈ ప్రభుత్వం పైచర్యలు తీసుకోవాలి. - రామస్వామి, రీసెర్చ్ స్కాలర్ చట్టబద్ధత చేసినా పక్కదారి నిధుల వినియోగంపై చట్టబద్ధత కల్పించినా ప్రభుత్వాలు నిధులు పక్కదారి పట్టించడం దారుణం. ఈ ప్రభుత్వ హయాంలో గిరిజన దళిత సంక్షేమం మరుగున పడింది. - శ్రీమన్నారాయణ, న్యాయశాఖ స్కాలర్ -
సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించారు
మంద కృష్ణ ధ్వజం... సాక్షి, న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్ రెండున్నరేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ.17,500 కోట్లను దారి మళ్లించారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరో పించారు. సోమవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడు తూ.. నిధుల దారి మళ్లింపుపై సమాధానం ఇవ్వకుండా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పేరును ప్రగతినిధిగా మార్చి నాటకాలు ఆడు తున్నారన్నారు. పేరు మార్చడం ఒక ఘనకార్యంగా ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్ చెప్పుకుంటున్నారన్నారు. 22 ఏళ్లలో ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చెందిన రూ.67వేల కోట్ల నిధులు దారి మళ్లించారన్నారు. వీటన్నిం టినీ రికవరీ చేస్తే దళితులు, గిరిజనుల్లో పేదరికాన్ని నిర్మూలించవచ్చన్నారు. -
అమ్మదొంగా.. రింగ రింగా!
కాంట్రాక్టర్లకు ఎస్సీ సబ్-ప్లాన్ పనులు పంచేసిన టీడీపీ ముఖ్యనేత ఆనం సోదరుల ఎత్తుకు పైఎత్తు కార్పొరేషన్ మీద అదనంగా రూ.2కోట్లు భారం సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఇసుక దందా, టెండర్ల వ్యవహారంలో టీడీపీ ప్రజా ప్రతినిధులు తల దూర్చవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించి వారం రోజులు కూడా గడవక ముందే ఆ పార్టీ ముఖ్య నాయకులు కార్పొరేషన్ పరిధిలో జరగబోయే రూ. 42కోట్లు ఎస్సీ సబ్‌ప్లాన్ పనులను దగ్గరుండి రింగ్ చేశారు. నిర్ణయించిన అంచనా వ్యయం కంటే రూ.2కోట్లు రూపాయిలను అదనంగా కొల్లగొట్టడానికి రంగం సిద్దం చేశారు. టీడీపి ముఖ్య నాయకుడి నేతృత్వంలో శనివారం సాయంత్రం పనుల సెటిల్మెంట్ పూర్తిచేశారు. కార్పొరేషన్ పరిధిలోని దళితవాడల్లో అభివృద్ది పనుల కోసం ఈ ఏడాది మార్చిలో రూ.42కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులతో 8 ప్యాకేజిల కింద పనులు చేపట్టడానికి అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. అయితే టీడీపీ ముఖ్య నాయకుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు వల్ల పనుల పంపకంలో అభిప్రాయం కుదరలేదు. దీంతో ఆరు నెలల పాటు ఈ పనుల ప్రక్రియ అటకెక్కింది. అభివృద్ది పనుల విషయంలో అధికార పార్టీ చేస్తున్న రాజకీయాలను నిరసిస్తూ ఎస్సీ సబ్-ప్లాన్లకు వెంటనే టెండర్లు పిలవాలని ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్‌లు ఇటీవల కార్పొరేషన్‌ను ముట్టడించారు. దీంతో 8 ప్యాకేజీలకు ఎట్టకేలకు టెండర్లు పిలిచారు. ఈ నెల 13వ తేదీతో టెండర్లు ప్రక్రియ పూర్తి కావాల్సిన నేపథ్యంలో ఆనం సోదరులు అనూహ్యంగా రంగంలోకి దూకారు. నెల్లూరు నగర, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో తమ పట్టు పెంచుకునేందుకు తమ మద్దతుదారు కాంట్రాక్టర్లను రంగంలోకి దింపి ఎస్సీ సబ్-ప్లాన్ పనులను చేజిక్కించుకునే ఎత్తుగడ వేశారు. పనుల కోసం పోటీ పడుతున్న కాంట్రాక్టర్లతో నేరుగా చర్చలు జరిపారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో నగర మేయర్ అబ్దుల్ అజీజ్, రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఆదాల ప్రభాకరరెడ్డిలు టెండర్ల చివరి తేదీని ఈ నెల 24వ తేదీ వరకు పొడిగింపజేశారు. సమయం తీసుకుని కాంట్రాక్టులందరిని సమావేశ పరిచి తాము చెప్పిన వారికే పనులు దక్కేలా చేసే వ్యూహం రచించారు. ఈ రకంగా ఆనం సోదరులను దెబ్బకు దెబ్బ తీసే ఎత్తుగడ వేశారు. ఇందులో భాగంగా అధికార పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు శనివారం సాయంత్రం కాంట్రాక్టర్లను సమావేశ పరిచారు. టీడీపీ సిటీ నియోజకవర్గ ముఖ్యనేత కుటుంబ సభ్యుడికి 3 ప్యాకేజీలు, మిగిలిన పనులను తమ మద్దతుదారులకు పంచేసేలా సెటిల్మెంట్ చేశారు. ఎవరికైతే పనులు అప్పగించారో వారు 4.5 శాతం నుంచి 4.9 శాతం వరకు అధిక మొత్తంలో టెండర్లు దాఖలు చేసేలా తీర్మానించారు. వీరికి డమ్మీగా టెండరు షెడ్యూలు దాఖలు చేసే మరో వ్యక్తి 5శాతం కంటే ఎక్కువతో కోట్ చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ పనుల పందేరంతో కార్పొరేషన్ మీద అదనంగా రూ.2కోట్లు రూపాయిల భారం పడబోతోంది. సోమవారం సాయంత్రానికి ఈ టెండర్ల ప్రక్రియ ముగుస్తుంది. -
'ఉపప్రణాళిక నిధులను పక్కదోవ పట్టిస్తున్నారు'
-
త్వరలో ఎస్సీ కమిషన్ : హరీశ్‌రావు
సంగారెడ్డి/గజ్వేల్/సిద్దిపేట: త్వరలో ఎస్సీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. విభజన సమస్యల వల్ల కొంత జాప్యం జరిగిందన్నారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డితోపాటు గజ్వేల్, సిద్దిపేటలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి సభల్లో ఆయన మాట్లాడారు. సబ్‌ప్లాన్ నిధులు దారిమళ్లే అవకాశం లేకుండా తమ ప్రభుత్వం ఎస్సీ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ మండలి ద్వారానే సబ్‌ప్లాన్ నిధులను ఖర్చు చేస్తామని చెప్పారు. భూపంపిణీ కోసం రాష్ట్రంలో రూ.25 వేల కోట్లతో 587 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని తెలిపారు. -
సబ్‌ప్లాన్‌కు మంగళం..
ఘట్కేసర్ టౌన్: మండలంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల అభివృద్ధికి సబ్‌ప్లాన్ నిధులు మంజూరు కావడం లేదు. వారికి కేటాయించిన నిధులు వారికే వెచ్చించాలని 2013లో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించింది. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ జనాభాకు అనుగుణంగా ప్రత్యేక నిధులను ప్రభుత్వం విడుదల చేయడానికి ఆర్థిక శాఖలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసింది. దీన్ని పటిష్టంగా అమలు చేయడానికి సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నోడల్ ఏజన్సీని నియమిం చింది. ఆయా కాలనీల అభివృద్ధికి నివేదికలు తయారుచేసి ఏడాది క్రితం ప్రభుత్వానికి పంపారు. ఇప్పటికీ సర్కా రు నిధులను విడుదల చేయకపోవడంతో కాలనీల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. చట్టబద్ధత కల్పించి ఏడాది గడిచినా.. గతంలో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను దారి మళ్లించి ఇతర పనులకు వినియోగించారు. విడుదలైన నిధులు దారి మళ్లకుండా సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించి ఏడాది గడిచినా ఎస్సీ, ఎస్టీల కాలనీలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. మండలంలో గుంటిగూడెం, కొండాపూర్, మాదాపూర్, కాచివానిసింగారం, అంకుషాపూర్, యంనంపేట్ తదితర గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీల కాలనీల అభివృద్థికి అవసరమైన పనులకు నిధులను విడుదల చేయాలని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. సబ్‌ప్లాన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీల గృహనిర్మాణం, తాగునీరు, ఇందిర జలప్రభ, గ్రామీణ రోడ్లు, మురుగుకాల్వలు, పింఛన్లు, పొదుపు సంఘాల నిర్వహణ తదితర అంశాలకు సంబంధించి నిధులు కేటాయించాలని ప్రణాళికలు వేశారు. ఆయా కాలనీలు డ్రైయినేజీ వ్యవస్థ సరిగా లేక దుర్గంధం వెదజల్లుతున్నాయి. దీంతో చిన్నపాటి చినుకుకే మట్టిరోడ్లు చిత్తడిగా మారి ప్రజలు నడవడానికి ఇబ్బంది పడుతున్నారు. మండలంలో 2013లో ఇంది రమ్మ కలలు పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఊరూరా సమావేశాలు నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్ర ణాళికలను వేసి నిధులను విడుదల చే యాలని పంపిన నివేదికలక ు మోక్షం లభించడం లేదు. అధికారులు స్పందించి నిధులను విడుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
సబ్‌ప్లాన్ నిధులపై నిర్లక్ష్యం తగదు
కర్నూలు (అర్బన్): దళితులు, గిరిజనులకు కేటాయించిన సబ్‌ప్లాన్ నిధుల పట్ల ప్రభుత్వం వివక్ష వహిస్తే ప్రతిఘటిస్తామని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ ఆనంద్‌బాబు హెచ్చరించారు. స్థానిక కొత్తబస్టాండ్ సమీపంలోని కేకే భవన్లో ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు అనే అంశంపై కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు ఎం.రాజశేఖర్ అధ్యక్షతన గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి సీఐటీయూ, ఉపాధి, డీకేఎస్, పీఎన్ఎం, వ్యవసాయ, చేనేత, దళిత సంఘాల ప్రతినిధులు పీఎస్ రాధాక్రిష్ణ, టీపీ శీలన్న, జేఎన్ శేషయ్య, ఆర్ఏ వాసు, కేవీ నారాయణ, కె.సూర్యచంద్రన్న హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూలుకు వచ్చిన సందర్భంగా తీపి కబురు చెబుతారని ఆశించిన వారందరికీ నిరాశే ఎదురైందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా చేపట్టిన పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేద ని వాపోయారు. దీంతో దళిత, గిరిజన కాలనీల్లో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేశాయని వాపోయారు. పదేళ్లపాటు పోరాడి సాధించుకున్న సబ్‌ప్లాన్‌కు బడ్జెట్లో కేటాయింపులు జరిగాయే తప్ప ఆచరణకు నోచుకోలేదన్నారు. ఉప ప్రణాళిక అమలుకు రూ. 4,900 కోట్లు కేటాయిస్తామన్న మంత్రి రావెల కిశోర్‌బాబు గొంతు మూగబోయిందన్నారు. కేవీపీఎస్ నగర కార్యదర్శి ఎం.విజయ్, వీవైఎఫ్‌ఐ నగర అధ్యక్షుడు శంకర్ పాల్గొన్నారు. -
సబ్‌ప్లాన్ నిధుల వినియోగంపై నిర్లక్ష్యం
ఇంద్రవెల్లి, న్యూస్‌లైన్ : ఎస్సీ, ఎస్టీ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా విడుదల చేసిన సబ్‌ప్లాన్ నిధుల వినియోగంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇతర కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారని కపాడ్స్ డెరైక్టర్ ఎం.అమృత్ విమర్శించారు. శనివా రం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కమిటీలు ఏర్పాటు చేసి నిధుల ఖర్చుపై ఉద్యమిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ గ్రామాల్లో, గూడేల్లో రోడ్లు, తాగునీటి సౌకర్యం, విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, ఇళ్ల నిర్మా ణం చేపట్టాల్సి ఉండగా.. అధికారులు నిధులు ఖర్చు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని అన్నారు. సబ్‌ప్లాన్ చట్టం చేసి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీలకే నిధులు దక్కే విధంగా ఉద్యమిస్తామని తెలిపారు. ఈ నెల ఆరున మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో మండల కమిటీని ఎన్నుకుంటామని ప్ర కటించారు. పార్టీలు, సంస్థలకు అతీతంగా నా యకులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ఉట్నూర్ అధ్యక్షుడు కాటం రమేశ్, నాయకులు సింగరే భారత్, పేందోర్ జైవంత్‌రావు, ఆర్.శ్యామ్‌నాయక్, సోమోరే నాగోరావు, గంగన్న, కాంతరావు, ఉత్తమ్ పాల్గొన్నారు. ఆదిలాబాద్‌లో రౌండ్ టేబుల్ సమావేశం ఎదులాపురం : సెంటర్ ఫర్ అకాడమీ ఎండ్ పీపుల్స్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఆదిలాబాద్‌లోని అంబేద్కర్ భవనంలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ డెరైక్టర్ ఎం.అమృత్‌రావు, ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇస్లామొద్దీన్ మాట్లాడారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పరిరక్షణ ఆదిలాబాద్ డివిజన్ కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ కన్వీనర్‌గా మోతె బారిక్రావు, కో కన్వీనర్లుగా ఉయిక సంజీవ్, గౌతం మునీశ్వర్, సభ్యులుగా మెస్రం రాజేశ్వర్, వసంత్పవార్, మర్సుకోల బాపురావు, రాథోడ్ సాగర్, మెస్రం జలేంధర్ ఎన్నికయ్యారు. అన్ని మండలాల్లో కమిటీని విస్తరించాలని తీర్మానించారు.